సందీప్‌ శర్మపై జరిమానా | Kings XI Punjab pacer Sandeep Sharma fined | Sakshi
Sakshi News home page

సందీప్‌ శర్మపై జరిమానా

Published Mon, May 8 2017 10:45 PM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

సందీప్‌ శర్మపై జరిమానా

సందీప్‌ శర్మపై జరిమానా

మొహాలీ: అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకుగాను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత పడింది. ఆదివారం గుజరాత్‌ లయన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఇన్నింగ్స్‌ ఐదోఓవర్‌లో సందీప్‌ శర్మ వేరే ఎండ్‌ నుంచి అంటే  రౌండ్‌ ది వికెట్‌ నుంచి బౌలింగ్‌ చేశాడు.

ఈ మార్పును తనకు తెలియపర్చలేదని భావించిన అంపైర్‌ దాన్ని నో బాల్‌గా ప్రకటించాడు. దీనిపై సందీప్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అనంతరం జట్టు కెప్టెన్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ కూడా సందీప్‌కు మద్దతు పలికాడు. దీంతో ఐపీఎల్‌ ప్రవర్తన నియమావళిని సందీప్‌ అతిక్రమించాడని నిర్ధారించిన మ్యాచ్‌రిఫరీ ఈ మేరకు జరిమానా విధించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement