Kings XI Punjab
-
షారూక్ ఖాన్ని కొనేసిన ప్రీతి జింటా..
షారూక్ ఖాన్, ప్రీతి జింటా కలిసి ‘వీర్ జారా’లో నటించారు. కాని వారు ఆ సినిమాలో కలవలేకపోతారు. కాని ఇప్పుడు కలిశారు. ప్రీతి జింటాకు షారూక్ ఖాన్ దక్కాడు. అవును. అయితే నిజం షారూక్ ఖాన్ కాదు. క్రికెటర్ షారూక్ ఖాన్. ప్రీతి జింటా యజమాని గా వ్యవహరించే పంజాబ్ కింగ్స్ ఐపిఎల్ టీమ్ ఈ రైట్ ఆర్మ్ స్పిన్నర్‌ని 5.25 కోట్లకు వేలం ద్వారా సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు నెటిజన్స్ అందరూ ఎవరీ షారూక్ ఖాన్ అని గూగుల్ చేస్తున్నారు. షారూక్ ఖాన్ తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల క్రికెటర్. 2012లో జూనియర్ ఐపిఎల్ జరిగినప్పుడు తొలిసారి వెలుగులోకి వచ్చాడు. బంతిని చావబాదడంలో కూడా దిట్ట. క్విక్ సింగిల్స్ తీస్తాడని పేరు. స్విమ్మింగ్ చాంపియన్ అట కూడా. షారూక్ ఖాన్ క్రేజ్ దేశంలో ఉన్నప్పుడు పుట్టడం వల్ల షారూక్ దాంతో ఐపిఎల్ వేలంలో ఇతని మీద అందరి దృష్టి పడింది. 2021 ఐపిఎల్‌లో సత్తా చూపిస్తాడని అందరూ అనుకుంటున్నారు. మరోవైపు నటుడు షారూక్ ఖాన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలోనే షారూక్‌కు షారూక్ గురించి తెలుసు. తన పేరుతో ఒక క్రికెటర్ ఉన్నాడని తన పేరే పెట్టుకున్నాడని సంతోషించాడు. ‘అతడు నాకు ఎదురు పడితే నేనేం మాట్లాడను. అతడు నాతో ‘నా పేరు షారూక్ ఖాన్’ అని అనేదాకా ఉంటాను. ఆ తర్వాత నేను ‘నా పేరు కూడా’ అంటాను’ అన్నాడు. ఏమైనా ఎవరు ఎప్పుడు మెరుస్తారో ఎవరికి దశ తిరుగుతుందో చెప్పలేం. ఇప్పుడు షారూక్ ఖాన్ వంతు. -
ఐపీఎల్ 2021: కింగ్స్ పంజాబ్‌కు ‘వేలం’ కష్టాలు
ముంబై: ఫిబ్రవరి 18న ఐపీఎల్-2021 వేలం పురస్కరించుకొని బీసీసీఐ తెచ్చిన కొత్త నిబంధన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు తలనొప్పిలా మారనుంది. ప్రతి జట్టు ఆటగాళ్ల కొనుగోలుకు సంబంధించి మొత్తం కేటాయించిన దాంట్లో (ప్రతీ జట్టుకు రూ.85కోట్లు) 75 శాతం ఖర్చు చేయాలని.. అలా లేని పక్షంలో ఆ డబ్బులు బీసీసీఐ ఖాతాలోకి జమకానున్నాయి. ఈసారి ఐపీఎల్ వేలంలో పాల్గొననున్న ఫ్రాంచైజీల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ వద్ద అత్యధికంగా రూ. 53.2 కోట్లు ఉన్నాయి. పంజాబ్ జట్టు 16 మందిని రిటైన్ చేసుకొని మిగిలిన వారిని రిలీజ్ చేసింది. వీరిలో గత ఐపీఎల్లో తీవ్రంగా నిరాశపరిచిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ సహా షెల్డన్ కాట్రెల్, కె. గౌతమ్, ముజీబ్ ఉర్ రెహమాన్, జిమ్మి నీషమ్, హార్డస్ విల్‌జెన్‌లోపాటు కరుణ్ నాయర్, సుచిత్, తేజిందర్ సింగ్ దిల్లాన్ తదితరులు ఉన్నారు. బీసీసీఐ వెల్లడించిన కొత్త నిబంధనల ప్రకారం రిటైన్ చేసుకున్న 16 మంది ఆటగాళ్లకు పంజాబ్ రూ. 31.8 కోట్లు చెల్లించగా.. ఇప్పుడు వారి వద్ద 53.2 కోట్లు ఉన్నాయి. ఆటగాళ్ల వేలానికి మిగిలిఉన్న మొత్తంలో 75 శాతం ఖర్చు చేయాలని బీసీసీఐ తెలిపిన నేపథ్యంలో 53.2 కోట్లలో 75 శాతం అంటే 31.7 కోట్లు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ డబ్బుతోనే ఆటగాళ్లను వేలంలో పొందే అవకాశం కింగ్స్ పంజాబ్‌కు ఉండనుంది. ఆ లెక్కన చూసుకుంటే పంజాబ్ దగ్గరుండే దాదాపు రూ. 21.5 కోట్లు బీసీసీఐ ఖాతాలోకి వెళ్లిపోనున్నాయి. ఇది కింగ్స్ పంజాబ్‌కు నష్టం కలిగించే అంశం అని చెప్పవచ్చు. పంజాబ్ తర్వాత రూ. 37.85 కోట్లతో రాజస్తాన్ ఉండగా, ఆర్సీబీ రూ. 35.40 కోట్లు, సీఎస్కే రూ. 19.9 కోట్లు, ముంబై ఇండియన్స్ రూ. 15.35 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 13.4 కోట్లు, సన్‌రైజర్స్, కేకేఆర్ ఫ్రాంచైజీలు రూ. 10.75 కోట్లతో ఉన్నాయి. ఐపీఎల్ 2021 వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న చెన్నైలో జరిగే వేలంలో మొత్తం 292 క్రికెటర్లు అందుబాటులోకి రానున్నారు. ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు 1114 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకోగా... ఫ్రాంచైజీ యాజమాన్యాల సూచనల ప్రకారం 292 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. వేలంలో గరిష్టంగా 61 స్థానాలు ఖాళీలు ఉండగా, ఇందులో 22 మంది వరకు విదేశీ ఆటగాళ్లను ఎనిమిది జట్లు ఎంచుకోవచ్చు. అత్యధికంగా బెంగళూరు జట్టులో 13 స్థానాలు ఖాళీ, సన్‌రైజర్స్ జట్టులో 3 స్థానాలు ఖాళీ ఉన్నట్టు తెలిసింది. కనీస రూ.2 కోట్ల జాబితాలో భారత్ నుంచి హర్భజన్, కేదార్ జాదవ్, విదేశాల నుంచి.. స్మిత్, మ్యాక్స్‌వెల్ ఉన్నారు. కాగా గతేడాది కేఎల్ రాహుల్ సారథ్యంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అంతగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. రాహుల్ 14 మ్యాచ్‌ల్లో 670 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నా జట్టుగా విఫలమయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న మ్యాక్స్‌వెల్ గత సీజన్లో దారుణంగా నిరాశపరిచాడు. చదవండి: 15 నెలల తర్వాత.. అన్ని స్వదేశంలోనే 'కమాన్ రోహిత్.. యూ కెన్ డూ ఇట్' -
అలా సెహ్వాగ్ వార్తల్లో ఉంటాడు: మాక్స్వెల్
మెల్బోర్న్: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనపై చేసిన విమర్శలపై ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ స్పందించాడు. తనపై ఉన్న అయిష్టాన్ని వెళ్లగక్కడం వీరూకు ఇష్టమని, తను ఏదైనా మాట్లాడగలడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 సీజన్లో మ్యాక్స్‌వెల్ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున బరిలోకి దిగిన అతడు 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క సిక్సర్ కూడా కొట్టలేక చతికిలబడ్డాడు. దీంతో అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ‘‘10 కోట్ల చీర్లీడర్’’ అంటూ సెహ్వాగ్ మాక్స్‌వెల్‌ను ఎద్దేవా చేశాడు. కోట్లు పెట్టి కొన్న జట్టుకు న్యాయం చేయలేదనే ఉద్దేశంతో, యూఏఈలో అత్యంత ఖరీదైన వెకేషన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేశాడంటూ విమర్శించాడు. (చదవండి: ‘రాహుల్ కెప్టెన్సీ అద్భుతమని చెప్పలేను’) ఇక వీరూ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన మాక్స్వెల్.. ది వెస్ట్రన్ ఆస్ట్రేలియన్‌తో మాట్లాడుతూ.. ‘‘మరేం పర్లేదు. వీరూ నా మీద ఉన్న అయిష్టాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. తనకు నచ్చింది మాట్లాడే హక్కు అతడికి ఉంది. ఇలాంటి వ్యాఖ్యలతో తను తరచుగా మీడియాలో కనిపిస్తూ ఉంటాడు. బాగుంది. దీని గురించి నేను పట్టించుకోను’’ అని పేర్కొన్నాడు. కాగా మ్యాక్స్‌వెల్, వెస్టిండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ల ప్రదర్శనపై తీవ్ర అసహనంతో ఉన్న పంజాబ్ జట్టు యాజమాన్యం వారిపై వేటు వేసేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌కు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో... భారీ మార్పులు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సీజన్లో తొలి అర్ధభాగంలో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన పంజాబ్.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచింది. అయితే చివరి రెండు మ్యాచుల్లో ఓడటంతో లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. -
‘రాహుల్ కెప్టెన్సీ అద్భుతమని చెప్పలేను’
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా తొలిసారిగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కేఎల్ రాహుల్ తన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చాడు. తొలుత వరుస వైఫల్యాలతో డీలా పడిన జట్టును.. ప్లే ఆఫ్స్ దిశగా దూసుకుపోయేలా ముందుండి నడిపించాడు. అయితే చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలు కావడంతో పంజాబ్ లీగ్ దశలోనే వెనుదిరిగినప్పటికీ అభిమానుల మనసు గెలుచుకుంది. సీజన్ మొదటి అర్ధభాగంలో కేవలం ఒకే ఒక్క విజయం సాధించిన పంజాబ్ జట్టు.. ఊహించలేని విధంగా వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరిచిన కేఎల్ రాహుల్ .. సారథిగానూ మంచి మార్కులే కొట్టేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. (చదవండి: కోట్లు పెట్టి కొన్నాం, వదిలించుకోక తప్పదు!) అదే విధంగా ఈ సీజన్లో 14 మ్యాచుల్లో 55.83 సగటుతో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను గెల్చుకున్న ఈ కర్ణాటక బ్యాటర్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాత్రం కేఎల్ రాహుల్ పూర్తిస్థాయిలో తన సామర్థ్యాన్ని వినియోగించుకోలేదని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా అతడికి పదికి ఏడున్నర మార్కులు వేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కెప్టెన్ కేఎల్ రాహుల్ నాయకత్వ లక్షణాలపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందిస్తూ.. ‘‘రాహుల్ కెప్టెన్సీ అద్భుతమని చెప్పలేను. అలాగని మరీ అంత బాగాలేదని చెప్పలేను. 50-50గా ఉంది. జట్టు వైఫల్యాలకు కెప్టెన్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మెరుగైన ప్రదర్శన కనబరిచే జట్టు(పదకొండు మందిని)ను ఎంచుకోవడంలో అతడు తడబడ్డాడు. ఎంపికలో యాజమాన్య నిర్ణయం కూడా ఉంటుందని తెలుసు. అయితే రాహుల్ కూడా తన మార్కు చూపాల్సింది. ఏదేమైనా ఈ సీజన్లో రాహుల్ బాగానే ఆకట్టుకున్నాడు. అయితే సారథిగా తను ఇంకొంత మెరుగవ్వాల్సి ఉందనేది నా అభిప్రాయం. ఈ విషయంలో అతడికి నేను 10కి 7.5 మార్కులు ఇస్తున్నా’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.(కోహ్లిపై ట్రోలింగ్.. ఆర్సీబీ వివరణ) -
పంజాబ్ ఆశలు గల్లంతు
ఐపీఎల్ ప్లేఆఫ్స్ స్థానం ఊరిస్తున్న వేళ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఉసూరుమనిపించింది... గెలిస్తే మెరుగైన స్థితికి చేరి ముందంజ వేసే అవకాశం ఉన్నా, పేలవ ప్రదర్శనతో చేజేతులా ఓటమి తెచ్చి పెట్టుకుంది. ఐదు వరుస విజయాలతో ఒక్కసారిగా జూలు విదిల్చినట్లు కనిపించిన ఆ జట్టు, బ్యాటింగ్ వైఫల్యంతో వరుసగా రెండో మ్యాచ్ ఓడి నిష్క్రమించింది. లీగ్‌లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్ల జాబితాలో ఉన్న ఈ టీమ్, మళ్లీ అదే నిరాశతో సీజన్‌ను ముగించింది. మరో వైపు ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన తర్వాత గత రెండు మ్యాచ్‌లలో బెంగళూరు, కోల్‌కతా జట్ల లెక్కలు మార్చిన చెన్నై సూపర్ కింగ్స్ మరో జట్టును దెబ్బ కొట్టి తమతో పాటు తీసుకెళ్లింది. ‘హ్యాట్రిక్’ విజయాలు సాధించి కొంత సంతృప్తితో ధోని సేన తమ ఆటను ముగించింది. అబుబాది: ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మరో భారీ విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 9 వికెట్లతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు సాధించింది. దీపక్ హుడా (30 బంతుల్లో 62 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కేఎల్ రాహుల్ (27 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ అగర్వాల్ (15 బంతుల్లో 26; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. లుంగి ఇన్‌గిడి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 154 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (49 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) హ్యాట్రిక్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. డుప్లెసిస్ (34 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రాయుడు (30; 2 ఫోర్లు) ఆకట్టుకున్నారు. హుడా మినహా... తొలి ఓవర్లోనే రెండు బౌండరీలతో మయాంక్ జోరు కనబరచగా, ఆ తర్వాత సిక్సర్‌తో రాహుల్ అలరించాడు. మరో మూడు బౌండరీలు బాదిన మయాంక్‌ను అద్భుత బంతితో ఇన్‌గిడి పెవిలియన్ చేర్చాడు. దీంతో పవర్‌ప్లేలో పంజాబ్ 53/1తో నిలిచింది. కాసేపటికే రాహుల్ కూడా ఇన్గిడికే దొరికిపోయాడు. భారీ హిట్టర్లు గేల్ (12), పూరన్ (2)ను చెన్నై బౌలర్లు సమర్థంగా నిలువరించారు. నాలుగు పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరినీ అవుట్ చేసి చెన్నై బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించారు. అయితే మరో ఎండ్‌నుంచి దీపక్ హుడా ఎదురుదాడికి దిగాడు. మన్దీప్ (14)తో ఐదో వికెట్‌కు 36 పరుగులు జోడించి జట్టు స్కోరు 100 పరుగులు దాటించాడు. ఇన్‌గిడి ఓవర్లో రెండు సిక్సర్లతో 18 పరుగులు పిండుకున్నాడు. తర్వాత మరో ఫోర్ బాదిన అతను 26 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్నాడు. అదే జోరులో 4, 6తో చివరి ఓవర్లో 14 పరుగులు రాబట్టాడు. అతని ధాటికి పంజాబ్ చివరి 30 బంతుల్లో 58 పరుగులు చేసింది. ఆడుతూ పాడుతూ... సాధారణ లక్ష్యఛేదనను చెన్నై దూకుడుగా ప్రారంభించింది. డుప్లెసిస్, గైక్వాడ్ అంచనాలకు తగినట్లు ఆడటంతో పవర్‌ప్లేలో 57 పరుగులు సాధించింది. తర్వాత కూడా నింపాదిగా ఆడుతోన్న ఈ జోడీని డుప్లెసిస్‌ను అవుట్ చేయడం ద్వారా జోర్డాన్ విడదీశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 59 బంతుల్లో 82 పరుగుల్ని జోడించారు. తర్వాత రాయుడు సహకారంతో రుతురాజ్ తన ఫామ్‌ను కొనసాగించాడు. ఈ క్రమంలో బౌండరీతో 38 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్నాడు. అతనికిది వరుసగా మూడో అర్ధ సెంచరీ కావడం విశేషం. అదే జోరులో వీరిద్దరూ మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) ఇన్‌గిడి 29; మయాంక్ (బి) ఇన్‌గిడి 26; గేల్ (ఎల్బీ) (బి) తాహిర్ 12; పూరన్ (సి) ధోని (బి) శార్దుల్ 2; మన్దీప్ (బి) జడేజా 14; హుడా (నాటౌట్) 62; నీషమ్ (సి) రుతురాజ్ (బి) ఇన్‌గిడి 2; జోర్డాన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–48, 2–62, 3–68, 4–72, 5–108, 6–113. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–30–0, స్యామ్ కరన్ 2–0–15–0, శార్దుల్ ఠాకూర్ 4–0–27–1, ఇన్‌గిడి 4–0–39–3, తాహిర్ 4–0–24–1, జడేజా 3–0–17–1 చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (నాటౌట్) 62; డుప్లెసిస్ (సి) రాహుల్ (బి) జోర్డాన్ 48; రాయుడు (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 154. వికెట్ల పతనం: 1–82. బౌలింగ్: నీషమ్ 3–0–26–0, షమీ 4–0–29–0, జోర్డాన్ 3–0–31–1, రవి బిష్ణోయ్ 4–0–39–0, మురుగన్ అశ్విన్ 4–0–17–0, గేల్ 0.5–0–5–0. -
రాయల్స్ రేసులోనే...
రాజస్తాన్ రాయల్స్ ఊపిరి పీల్చుకుంది. ‘యూనివర్సల్ బాస్’ గేల్ విధ్వంసాన్ని తట్టుకొని నిలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో అద్భుత విజయాన్ని అందుకుంది. ముందుగా ధనాధన్ ఇన్నింగ్స్‌తో స్టోక్స్ గెలుపునకు పునాది వేయగా... సంజూ సామ్సన్, స్మిత్, బట్లర్ జట్టును గమ్యానికి చేర్చారు. దీంతో రాజస్తాన్ ప్లే ఆఫ్స్ రేసులో మరో అడుగు ముందుకేసింది. కీలక సమయంలో బౌలర్లు చేతులెత్తేయడంతో పంజాబ్ ఓటమి పాలై తమ అవకాశాలను కాస్త సంక్లిష్టం చేసుకుంది. అబుదాబి: అసలైన సమయంలో రాజస్తాన్ రాయల్స్ సత్తా చాటింది. సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిని ముంచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బెన్ స్టోక్స్ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజూ సామ్సన్ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించడంతో... శుక్రవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై రాజస్తాన్ రాయల్స్ జట్టు ఏడు వికెట్లతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (63 బంతుల్లో 99; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పూరన్ (10 బంతుల్లో 22; 3 సిక్సర్లు) రాణించారు. ఆర్చర్, స్టోక్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 186 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ రాయల్స్ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (20 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు), బట్లర్ (11 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు) నాలుగో వికెట్‌కు అజేయంగా 19 బంతుల్లో 41 పరుగుల్ని జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు. తొలి ఓవర్లోనే వికెట్... ఆరంభంలోనే పంజాబ్‌కు షాక్ తగిలింది. ఆర్చర్ బౌలింగ్‌లో స్టోక్స్ చక్కటి క్యాచ్‌కు ఓపెనర్ మన్దీప్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత రాహుల్‌కు గేల్ జతకూడటంతో రాయల్స్ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పరాగ్, ఉతప్ప సమన్వయలేమితో ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న గేల్... కార్తీక్ త్యాగి ఓవర్లో వరుసగా 4, 6, 4 రెచ్చిపోయాడు. ఆరోన్ బౌలింగ్‌లో రాహుల్ కూడా 6, 4 బాదడంతో పవర్ ప్లేలో పంజాబ్ 53/1తో నిలిచింది. పటిష్ట భాగస్వామ్యం... తర్వాత కూడా వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడారు. ప్రతీ బంతిపై ఎదురుదాడి చేయకుండా ఆచితూచి బౌండరీలు బాదారు. మిడిల్ ఓవర్లలో రన్‌రేట్ 8కి తగ్గకుండా పరుగులు సాధించారు. రాహుల్ తేవటియా బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన గేల్ 33 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో అతనికిది మూడో ఫిఫ్టీ. ఈ దశలో గేల్ మరోసారి బతికిపోయాడు. మరోవైపు అర్ధసెంచరీకి చేరువవుతోన్న రాహుల్‌ను స్టోక్స్ పెవిలియన్ పంపాడు. దీంతో రెండో వికెట్‌కు 82 బంతుల్లో 120 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. సిక్సర్ల హోరు... చివరి ఐదు ఓవర్లలో పూరన్, గేల్ ఆరు సిక్సర్లతో అలరించారు. ఆరోన్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు, త్యాగి బౌలింగ్‌లో మరొకటి కొట్టి పూరన్ ప్రమాదకరంగా కనిపించాడు. బౌండరీ వద్ద తేవటియా క్యాచ్‌కు అతను ఔటైనా... గేల్ 4, 6తో 14 పరుగులు రాబట్టాడు. తర్వాత మరో రెండు సిక్సర్లు కొట్టి సెంచరీకి సమీపించిన గేల్‌ను ఆర్చర్ అద్భుత యార్కర్‌తో నిలువరించాడు. చివరి 30 బంతుల్లో పంజాబ్ 62 పరుగులు రాబట్టింది. స్టోక్స్ విధ్వంసం... ఉతప్పతో కలిసి ఛేదనకు దిగిన స్టోక్స్ కసిగా ఆడాడు. తొలి 3 ఓవర్లలో నాలుగు ఫోర్లు బాదాడు. నాలుగో ఓవర్లో వరుసగా 4, 6, 6తో 16 పరుగులు పిండుకున్నాడు. తర్వాత 4, 6 బాదిన స్టోక్స్ 24 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకున్నాడు. ప్రమాదకరంగా మారుతోన్న స్టోక్స్‌ను జోర్డాన్ పెవిలియన్ పంపాడు. అనంతరం సామ్సన్ బ్యాట్ ఝళిపించడంతో 10 ఓవర్లకు రాజస్తాన్ 103/1తో నిలిచింది. తర్వాతి ఓవర్లోనే ఉతప్ప (30; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఔటైనా... స్మిత్‌తో కలిసి సామ్సన్ ఇన్నింగ్స్ నడిపించాడు. వీరిద్దరూ 21 బంతుల్లో 34 పరుగులు జోడించాక సామ్సన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అప్పటికే జట్టు ç146/3తో పటిష్ట స్థితిలో నిలిచింది. బట్లర్, స్మిత్ జోరు భారీ విజయంపై కన్నేసిన స్మిత్, బట్లర్ చివర్లో చెలరేగారు. 30 బంతుల్లో 40 పరుగులు చేయాల్సి ఉండగా సిక్సర్‌తో బట్లర్ జోరు పెంచాడు. షమీ వేసిన 17వ ఓవర్లో స్మిత్ 3 ఫోర్లు, బట్లర్ మరో బౌండరీతో 19 పరుగులు రాబట్టారు. జోర్డాన్ ఓవర్లో మరో సిక్సర్ బాదిన బట్లర్ 15 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్నందించాడు. వీరిద్దరూ చివరి 10 బంతుల్లో 30 పరుగులు చేశారు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) రాహుల్ తేవటియా (బి) స్టోక్స్ 46; మన్దీప్ సింగ్ (సి) స్టోక్స్ (బి) ఆర్చర్ 0; క్రిస్ గేల్ (బి) ఆర్చర్ 99; నికోలస్ పూరన్ (సి) రాహుల్ తేవటియా (బి) స్టోక్స్ 22; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 6; దీపక్ హుడా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1–1, 2–121, 3–162, 4–184. బౌలింగ్: ఆర్చర్ 4–0–26–2; వరుణ్ ఆరోన్ 4–0–47–0; కార్తీక్ త్యాగి 4–0–47–0; శ్రేయస్ గోపాల్ 1–0–10–0; స్టోక్స్ 4–0–32–2; రాహుల్ తేవటియా 3–0–22–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రాబిన్ ఉతప్ప (సి) పూరన్ (బి) మురుగన్ అశ్విన్ 30; స్టోక్స్ (సి) దీపక్ హుడా (బి) జోర్డాన్ 50; సామ్సన్ (రనౌట్) 48; స్మిత్ (నాటౌట్) 31; బట్లర్ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.3 ఓవర్లలో మూడు వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–60, 2–111, 3–145. బౌలింగ్: అర్ష్‌దీప్ సింగ్ 3–0–34–0, షమీ 3–0–36–0, మురుగన్ అశ్విన్ 4–0–43–1, క్రిస్ జోర్డాన్ 3.3–0–44–1, రవి బిష్ణోయ్ 4–0–27–0. -
ఏంటీ.. జింటా టీం గెలిచిందా..? అవును!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్ ఆరంభంలో ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.. ఆ తర్వాత వరుస విజయాలు సాధించింది. తొలుత మ్యాచ్‌లన్నీ ఓడినా... ఆ తర్వాత గెలుపు బాటపట్టి సత్తా చాటింది. ఇక సోమవారం నాటి మ్యాచ్‌తో ఆరో విజయం ఖాతాలో వేసుకున్న కేఎల్ సారథ్యంలోని కింగ్స్ జట్టు ‘ప్లే ఆఫ్స్’ దారిలో పడింది. 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తుగా ఓడించి జయకేతనం ఎగురవేసింది. టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు తీసి కేకేఆర్‌ను 149 పరుగులకు కట్టడి చేసింది. (చదవండి: ధోని ఫ్యాన్స్‌కు సీఎస్కే సీఈవో గుడ్‌న్యూస్! ) ఆ తర్వాత ఫోర్‌తో ఛేజింగ్ ప్రారంభించిన కింగ్స్.. హిట్టర్ క్రిస్‌గేల్, ఓపెనర్ మన్దీప్ సింగ్‌ల అద్భుత ప్రదర్శనతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆరంభంలో ఒక్క మ్యాచ్ గెలవడానికే ఆపసోపాలు పడ్డ ఈ టీం.. ఇప్పుడు ఏకంగా ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. దీంతో పంజాబ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మీమ్స్‌తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, 2014లో చేసిన ట్వీట్‌ను మరోసారి తెరమీదకు తెచ్చారు. ‘‘జింటా టీం గెలిచిందా?’’అన్న సల్మాన్ వ్యాఖ్యకు బదులుగా.. ‘‘హా అవును. అదే జరిగింది. మీరు చూడలేదా’’ అంటూ వివిధ రకాల మీమ్స్ క్రియేట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పంజాబ్ జట్టు బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ తొలుత షేర్ చేసిన మీమ్‌కు అభిమానుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. కాగా బాలీవుడ్ నటి ప్రీతి జింటా, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు సహయజమాని అన్న సంగతి తెలిసిందే. ఇక వీలుచిక్కినప్పుడల్లా ఆమె జట్టుతో ఉంటూ, ఆటగాళ్లను ఉత్సాహపరచడం సహా, ఓడిపోయిన సందర్భాల్లో విమర్శలకు ధీటుగా బదులిస్తూ కౌంటర్ వేస్తారన్న విషయం తెలిసిందే.(చదవండి: సంజూ గ్రేట్.. పంత్ నువ్వు హల్వా, పూరీ తిను’) చదవండి: కేకేఆర్‌పై పంజాబ్ ప్రతాపం #KKRvKXIP https://t.co/QbQNUedxiN pic.twitter.com/KUQWWW4mSD — Wasim Jaffer (@WasimJaffer14) October 26, 2020 -
కేకేఆర్‌పై పంజాబ్ ప్రతాపం
పంజాబ్ తెలుసుగా... 220 పైచిలుకు పరుగులు చేసినా కూడా ఓడింది. సూపర్ ఓవర్లో రెండంటే రెండు పరుగులు చేసిన జట్టు. ఒక్కమాటలో చెప్పాలంటే ఐపీఎల్ తొలి సగం మ్యాచ్‌ల్లో వరుసబెట్టి నిరాశపరిచింది. కానీ ఈ కింగ్స్... చెన్నై కింగ్స్‌లా కాదు! మొదటన్నీ ఓడినా... తర్వాతన్నీ గెలుచుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఆరో విజయంతో ‘ప్లే ఆఫ్స్’ దారిలో పడింది. షార్జా: ఈ సీజన్లో పంజాబ్‌ను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం, అనుమానం కలుగకమానదు. ఒకదశలో ఏడింట ‘ఆరు’ ఓడిపోయిన జట్టు... వరుసగా విజయబావుటా ఎగరేస్తున్న జట్టు ఇదేనా అని కచ్చితంగా అనిపిస్తుంది. కానీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన ప్రత్యర్థి జట్టపై పంజా విసురుతోంది. ఇది నిజం. అది కూడా వరుసగా! సోమవారం పంజాబ్ 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచింది. మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ మోర్గాన్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. షమీ 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత పంజాబ్ 18.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ గేల్ (29 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరిపించగా... మన్దీప్ (56 బంతుల్లో 66 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) గెలిపించాడు. షమీ తడఖా... పంజాబ్ కెప్టెన్ రాహుల్ టాస్ నెగ్గగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా ఇన్నింగ్స్ మొదలైన రెండో బంతికే మ్యాక్స్‌వెల్... నితీశ్ రాణా (0)ను డకౌట్ చేశాడు. రెండో ఓవర్ వేసిన షమీ తన తడాఖా చూపాడు. నాలుగో బంతికి రాహుల్ త్రిపాటి (7)ని, ఆఖరి బంతికి దినేశ్ కార్తీక్ (0)ను డకౌట్ చేశాడు. ఒక్కసారిగా 10/3 స్కోరుతో కోల్‌కతా కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ గిల్, కెప్టెన్ మోర్గాన్ నిలకడగా ఆడి వికెట్ల పతనాన్ని కాసేపు నిలువరించారు. శుబ్‌మన్ ఫిఫ్టీ... ఆత్మరక్షణలో పడిపోయిన నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్, మోర్గాన్లే నడిపించారు. ఈ జోడీ ఆడినంతవరకు పరుగులకు ఢోకా లేకుండా పోయింది. అయితే ఈ భాగస్వామ్యం ముగిశాక మళ్లీ తర్వాత వచ్చిన వారు కూడా ముందరి బ్యాట్స్‌మెన్‌నే అనుసరించారు. గేల్... మెరుపుల్! కింగ్స్ లక్ష్యఛేదన ఫోర్‌తో మొదలైంది. కమిన్స్ తొలి బంతిని రాహుల్ బౌండరీకి తరలించాడు. జట్టు స్కోరు 47 పరుగుల వద్ద రాహుల్ (25 బంతుల్లో 28; 4 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో గేల్ క్రీజ్‌లోకి వచ్చాడు. వరుణ్ చక్రవర్తి, నరైన్ బౌలింగ్ల్లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు ఓపెనర్ మన్దీప్ చూడచక్కని బౌండరీలతో నిలకడగా పరుగులు చేశాడు. 49 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. జట్టు 13.4 ఓవర్లలో 100 పరుగులను అధిగమించింది. కాసేపటికే గేల్ ఫిఫ్టీ 25 బంతుల్లోనే పూర్తయ్యింది. వీళ్లిద్దరు రెండో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జత చేశాక గేల్ ఔటైనా... మిగతా లాంఛనాన్ని పూరన్ (2 నాటౌట్)తో కలిసి మన్దీప్ పూర్తి చేశాడు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: శుబ్‌మన్ గిల్ (సి) పూరన్ (బి) షమీ 57; నితీశ్ రాణా (సి) గేల్ (బి) మ్యాక్స్‌వెల్ 0; రాహుల్ త్రిపాఠి (సి) కేఎల్ రాహుల్ (బి) షమీ 7; దినేశ్ కార్తీక్ (సి) రాహుల్ (బి) షమీ 0; మోర్గాన్ (సి) అశ్విన్ (బి) రవి బిష్ణోయ్ 40; నరైన్ (బి) జోర్డాన్ 6; నాగర్కోటి (బి) అశ్విన్ 6; కమిన్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 1; ఫెర్గూసన్ (నాటౌట్) 24; వరుణ్ చక్రవర్తి (బి) జోర్డాన్ 2; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–10, 4–91, 5–101, 6–113, 7–114, 8–136, 9–149. బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 2–0–21–1, షమీ 4–0–35–3, అర్‡్షదీప్ సింగ్ 2–0– 18–0, మురుగన్ అశ్విన్ 4–0–27–1, జోర్డాన్ 4–0–25–2, రవి బిష్ణోయ్ 4–1–20–2. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 28; మన్దీప్ సింగ్ (నాటౌట్) 66; క్రిస్ గేల్ (సి) ప్రసిధ్ కృష్ణ (బి) ఫెర్గూసన్ 51; పూరన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.5 ఓవర్లలో 2 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–47, 2–147. బౌలింగ్: కమిన్స్ 4–0–31–0, ప్రసి«ధ్ కృష్ణ 3–0–24–0, వరుణ్ చక్రవర్తి 4–0–34–1, నరైన్ 4–0–27–0, ఫెర్గూసన్ 3.5–0–32–1. -
పండగ పంజాబ్‌దే...
విజయలక్ష్యం 127 పరుగులు... స్కోరు 100/3... మరో 24 బంతుల్లో 27 పరుగులు చేస్తే చాలు... కానీ ఇలాంటి స్థితి నుంచి కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాన్ని వెతుక్కుంటూ వెళ్లింది. 23 బంతుల్లో మిగిలిన 7 వికెట్లు చేజార్చుకొని కుప్పకూలింది. కట్టుదిట్టమైన బౌలింగ్, చక్కటి ఫీల్డింగ్‌కు తోడు ఓటమిని అంగీకరించని తత్వం, పట్టుదలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనూహ్య విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో అనేక మ్యాచ్‌లలో చివరి క్షణం వరకు తీవ్ర ఉత్కంఠను అనుభవించిన రాహుల్ సేన కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకొని సగర్వంగా నిలబడింది. ఓటమి ఖాయమైన మ్యాచ్‌ను గెలుచుకొని సత్తా చాటింది. తాజా ఫలితం సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను బాగా దెబ్బ తీసింది. దుబాయ్: ఐపీఎల్–2020లో మరో అనూహ్య ఫలితం... గెలవాల్సిన స్థితిలో ఉండి కూడా హైదరాబాద్ జట్టు చేజేతులా ఓటమిని ఆహ్వానించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 12 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులే చేయగలిగింది. నికోలస్ పూరన్ (28 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రషీద్ ఖాన్ (2/14) కింగ్స్ ఎలెవన్ బ్యాట్స్‌మెన్ పని పట్టగా... హోల్డర్, సందీప్ కూడా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.5 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ వార్నర్ (20 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే దూకుడుగా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ జోర్డాన్ (3/17), అర్‡్షదీప్ సింగ్ (3/23) పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అందరూ అందరే... తొలి బంతి నుంచి చివరి బంతి వరకు పంజాబ్ ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. సన్‌రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు జట్టు బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (27 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్), మన్దీప్ సింగ్ (17) దూకుడుగా ఆడటంలో విఫలమయ్యారు. ఫలితంగా ఈ జోడి తొలి వికెట్‌కు 30 బంతుల్లో 37 పరుగులే జోడించగలిగింది. సందీప్ బౌలింగ్‌లో మన్దీప్ వెనుదిరగ్గా, పవర్‌ప్లేలో స్కోరు 47 పరుగులకు చేరింది. అయితే 66 పరుగుల వద్ద పంజాబ్‌కు అసలు దెబ్బ పడింది. వరుస బంతుల్లో గేల్ (20 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ అవుట్ కావడంతో జట్టు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పటిలాగే మ్యాక్స్‌వెల్ (12) విఫలం కాగా, దీపక్ హుడా (0) నిలబడలేకపోయాడు. మరో ఎండ్‌లో ఉన్న పూరన్ మాత్రం కాస్త పోరాడే ప్రయత్నం చేసినా అతని బ్యాటింగ్‌లో కూడా ధాటి లోపించింది. తొలి పది ఓవర్లలో 66 పరుగులు చేసిన పంజాబ్, తర్వాతి పది ఓవర్లలో 60 పరుగులే చేయగలిగింది. జట్టు ఇన్నింగ్స్‌లో మొత్తం 7 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే ఉన్నాయి. 75 బంతులు... బౌండరీనే లేదు! పంజాబ్ పస లేని బ్యాటింగ్‌కు ఇదో ఉదాహరణ. 120 బంతుల ఇన్నింగ్స్‌లో ఒకదశలో వరుసగా 75 బంతుల పాటు (12.3 ఓవర్లు) బ్యాట్స్‌మెన్ ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయారు. హోల్డర్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతికి గేల్ ఫోర్ కొట్టగా... ఖలీల్ వేసిన 19వ ఓవర్ మూడో బంతికి పూరన్ ఫోర్ కొట్టాడు. జట్టు ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు చేయని డాట్ బంతులు మొత్తం 48 ఉన్నాయి! నాన్న చనిపోయినా... పంజాబ్ ఓపెనర్ మన్దీప్ భారమైన హృదయంతో మ్యాచ్ ఆడాడు. అతని తండ్రి శుక్రవారమే చనిపోయారు. అయితే స్వస్థలం కూడా వెళ్లలేని స్థితిలో మన్దీప్ కొనసాగాడు. ఈ నేపథ్యంలో పంజాబ్ ఆటగాళ్లు నల్లరంగు రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. గత మ్యాచ్‌లో గాయపడిన మయాంక్ స్థానంలో మన్దీప్ జట్టులోకి వచ్చాడు. వార్నర్ జోరు... స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వార్నర్, బెయిర్‌స్టో (20 బంతుల్లో 19; 4 ఫోర్లు) జట్టుకు శుభారంభం అందించారు. పంజాబ్‌తో ఆడిన గత 9 మ్యాచ్‌లలో వరుసగా ప్రతీసారి అర్ధ సెంచరీ చేసిన అద్భుత రికార్డు ఉన్న వార్నర్ ఇప్పుడు కూడా అదే జోరును ప్రదర్శించాడు. తొలి రెండు ఓవర్లలో ఒక్కో సిక్స్ కొట్టిన అతను, షమీ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. అయితే బిష్ణోయ్ బౌలింగ్‌లో రివర్స్‌స్వీప్‌కు ప్రయత్నించి కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో అతను పదో హాఫ్ సెంచరీ అవకాశం కోల్పోయాడు. మరో రెండు పరుగులకే బెయిర్‌స్టో కూడా అవుట్ కాగా, సమద్ (7) విఫలమయ్యాడు. ఈ దశలో మనీశ్ పాండే (29 బంతుల్లో 15), విజయ్ శంకర్ (27 బంతుల్లో 26; 4 ఫోర్లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. మరీ నెమ్మదిగా ఆడి 33 పరుగులు జోడించేందుకు 44 బంతు లు తీసుకున్నారు. గత మ్యాచ్‌లో చెలరేగిన పాండే అయితే ఒక్కో పరుగు కోసం తంటాలు పడ్డాడు. చివరకు భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) రషీద్ 27; మన్దీప్ (సి) రషీద్ (బి) సందీప్ 17; గేల్ (సి) వార్నర్ (బి) హోల్డర్ 20; పూరన్ (నాటౌట్) 32; మ్యాక్స్‌వెల్ (సి) వార్నర్ (బి) సందీప్ 12; దీపక్ హుడా (స్టంప్డ్) బెయిర్‌స్టో (బి) రషీద్ 0; జోర్డాన్ (సి) ఖలీల్ (బి) హోల్డర్ 7; మురుగన్ అశ్విన్ (రనౌట్) 4; రవి బిష్ణోయ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–37; 2–66; 3–66; 4–85; 5–88; 6–105; 7–110. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–29–2; ఖలీల్ 4–0–31–0; హోల్డర్ 4–0–27–2; రషీద్ ఖాన్ 4–0–14–2; నటరాజన్ 4–0–23–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) రాహుల్ (బి) బిష్ణోయ్ 35; బెయిర్‌స్టో (బి) అశ్విన్ 19; పాండే (సి) (సబ్) సుచిత్ (బి) జోర్డాన్ 15; సమద్ (సి) జోర్డాన్ (బి) షమీ 7; శంకర్ (సి) రాహుల్ (బి) అర్‡్షదీప్ 26; హోల్డర్ (సి) మన్దీప్ (బి) జోర్డాన్ 5; గార్గ్ (సి) జోర్డాన్ (బి) అర్‡్షదీప్ 3; రషీద్ (సి) పూరన్ (బి) జోర్డాన్ 0; సందీప్ (సి) అశ్విన్ (బి) అర్‡్షదీప్ 0; నటరాజన్ (నాటౌట్) 0; ఖలీల్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 114. వికెట్ల పతనం: 1–56; 2–58; 3–67; 4–100; 5–110; 6–112; 7–112; 8–114; 9–114; 10–114. బౌలింగ్: షమీ 4–0–34–1; అర్‡్షదీప్ 3.5–0–23–3; అశ్విన్ 4–0–27–1; బిష్ణోయ్ 4–0–13–1; జోర్డాన్ 4–0–17–3. టర్నింగ్ పాయింట్... 17వ ఓవర్ తొలి బంతికి జోర్డాన్ బౌలింగ్‌లో పాండే అవుట్ కావడంతో రైజర్స్ పతనం మొదలైంది. సబ్‌స్టిట్యూట్ సుచిత్ బౌండరీ లైన్ వద్ద గాల్లో లేచి అద్భుతంగా క్యాచ్ పట్టాడు. తర్వాతి ఓవర్లో శంకర్ వెనుదిరగ్గా, 19వ ఓవర్లో రెండు, 20వ ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయిన జట్టు ఓటమిని ఖాయం చేసుకుంది. జోర్డాన్, బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి పాండే క్యాచ్ పట్టిన సుచిత్ -
హ్యాట్రిక్ 'పంజా'...
ఐపీఎల్లో ‘బ్యాక్ టు బ్యాక్’ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా శిఖర్ ధావన్ గుర్తింపు పొందాడు. ఈ ఐపీఎల్ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొదట ఏడు మ్యాచ్‌లాడి ఆరింట ఓడింది. ఇక ప్లేఆఫ్స్‌కు కష్టమే అనుకున్న దశలో పంజా విసురుతోంది. దీంతో తర్వాత మూడు మ్యాచ్‌ల్ని వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసింది. పంజాబ్ గెలిచిన వరుస మూడు మ్యాచ్‌లు పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్న జట్లపై రావడం విశేషం. ఈ గెలుపుతో అట్టడుగున ఉన్న కింగ్స్ మొత్తం నాలుగు విజయాలతో ఇప్పుడు ఐదో స్థానానికి ఎగబాకింది. దుబాయ్: ఢిల్లీ ఆటకు పరుగుల బాట చూపించిన శిఖర్ ధావన్ అజేయ శతకం... సుడి‘గేల్’, పూరన్ మెరుపుల ముందు చిన్నబోయింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై నెగ్గింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (61 బంతుల్లో 106 నాటౌట్) ఒక్కడే చెలరేగాడు. వీరోచిత శతకంతో ఆఖరి దాకా స్కోరుబోర్డును నడిపించాడు. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి గెలిచింది. పూరన్ (28 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), గేల్ (23 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. ఆడింది ఒక్కడే... ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఆరంభం నుంచి పరుగెత్తించింది... మెరిపించింది... నడిపించింది... ధావన్ ఒక్కడే! పృథ్వీ షాతో ఆట ఆరంభించిన ఈ ఓపెనరే క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌కు ఆది, అంతాలయ్యాడు. ఇన్నింగ్స్ రెండో బంతి నుంచి ధావన్ దంచుడు ఫోర్‌తో మొదలైంది. ఆఖరి ఓవర్ నాలుగో బంతికి ఓ పరుగు దాకా సాగింది. ఈ మధ్యలో 61 బంతులు అంటే సగం ఓవర్లు ధావన్ ఆడాడు. 12 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఇక మిగతావారి గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ఓపెనింగ్ సహచరుడు పృథ్వీ షా (7), కెప్టెన్ అయ్యర్ (14), పంత్ (14), స్టొయినిస్ (9), హెట్‌మైర్ (10) అందరూ ప్రత్యర్థి బౌలింగ్‌కు తలవంచారు. మ్యాక్స్‌వెల్ వేసిన తొలి ఓవర్ రెండో బంతిని ఎదుర్కొన్న∙ధావన్ బౌండరీతో ఆట మొదలుపెట్టాడు. ఐదో బంతికి భారీ సిక్సర్ బాదాడు. దీంతో ఓవర్లో 13 పరుగులు రాగా... డజను పరుగులు ధావన్‌వే! ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసేదాకా అతని జోరులో, జట్టు స్కోరులో ఇదే కనబడింది. 28 బంతుల్లో ఫిఫ్టీ (8 ఫోర్లు, 1 సిక్స్) పూర్తి చేసుకున్న ధావన్... 57 బంతుల్లోనే ‘శత’క్కొట్టేశాడు. 5.3 ఓవర్లో అతని పరుగుతోనే జట్టు స్కోరు 50కి చేరింది. కాసేపయ్యాక 13వ ఓవర్లో ధావన్ సిక్సర్‌తో ఢిల్లీ 100 పరుగులను అధిగమించింది. చివరకు 19వ ఓవర్లో అతను తీసిన 2 పరుగులతో అతని శతకం, జట్టు స్కోరు 150 పరుగులు పూర్తయ్యాయి. ఇలా క్యాపిటల్స్ జట్టు ప్రతి 50 పరుగుల మజిలీని ధావన్ బ్యాట్‌తోనే చేరింది. గేల్, పూరన్ ధనాధన్... కింగ్స్ లక్ష్య ఛేదనలో ఓపెనర్, కెపె్టన్ రాహుల్ (15) వికెట్‌ను ఆరంభంలోనే కోల్పోయింది. ఈ దశలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన గేల్ సుడిగాలి ఆట ఆడేశాడు. అతని హోరుతో 4 ఓవర్లలో 24/1 స్కోరు కాస్తా ఒక్క ఓవర్ పూర్తయ్యేసరికే గిర్రున తిరిగింది. తుషార్ వేసిన ఈ ఐదో ఓవర్‌ను అసాంతం ఆడిన గేల్ 4, 4, 6, 4, 6, వైడ్, 1లతో హోరెత్తించాడు. 26 పరుగులు ధనాధన్‌గా వచ్చేశాయంతే! కింగ్స్ స్కోరు 50 పరుగులకు చేరింది. కానీ తర్వాతి ఓవర్లో అశి్వన్... గేల్ మెరుపులకు ఫుల్స్టాప్ పెట్టాడు. అదే ఓవర్లో మయాంక్ (5) రనౌటయ్యాడు. 7 ఓవర్లలో పంజాబ్ స్కోరు 57/3. ఢిల్లీ శిబిరంలో ఎక్కడలేని ఉత్సాహం. కానీ పూరన్ ఈ ఉత్సాహంపై నీళ్లు చల్లాడు. కాస్త కుదురుకున్నాక బ్యాట్ ఝళిపించడంతో పరుగులు చకచకా వచ్చాయి. 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో పూరన్ అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. తర్వాత కాసేపటికే రబడ అతన్ని ఔట్ చేశాడు. ఢిల్లీకి ఆశలు రేపినా... మ్యాక్స్‌వెల్ (24 బంతుల్లో 32; 3 ఫోర్లు), హుడా (22 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్), నీషమ్ (8 బంతుల్లో 10 నాటౌట్; సిక్స్) జాగ్రత్త గా ఆడటంతో ఓవర్ మిగిలుండగానే పంజాబ్ నెగ్గింది. టి20 క్రికెట్లో ‘బ్యాక్ టు బ్యాక్’ సెంచరీలు చేసిన తొమ్మిదో క్రికెటర్ శిఖర్ ధావన్. గతంలో వార్నర్ (2011), ఉన్ముక్త్ చంద్ (2013), ల్యూక్ రైట్ (2014), మైకేల్ క్లింగర్ (2015), పీటర్సన్ (2015), మార్కో మరైస్ (2018), రీజా హెండ్రిక్స్ (2018), ఇషాన్ కిషన్ (2019) కూడా ఈ ఘనత సాధించారు. ఐపీఎల్ ఒకే సీజన్లో రెండు అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఐదో క్రికెటర్ శిఖర్ ధావన్. గతంలో 2016లో కోహ్లి (బెంగళూరు) ఏకంగా 4 సెంచరీలు చేయగా... గేల్ (2011–బెంగళూరు), ఆమ్లా (2017–పంజాబ్), వాట్సన్ (2018–చెన్నై) రెండు సెంచరీల చొప్పున చేశారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) మ్యాక్స్‌వెల్ (బి) నీషమ్ 7; ధావన్ (నాటౌట్) 106, అయ్యర్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 14, పంత్ (సి) మయాంక్ (బి) మ్యాక్స్‌వెల్ 14, స్టొయినిస్ (సి) మయాంక్ (బి) షమీ 9; హెట్‌మైర్ (బి) షమీ 10; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–25, 2–73, 3–106, 4–141, 5–164. బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 4–0–31–1, షమీ 4–0–28–2, అర్‡్షదీప్ 3–0–30–0, నీషమ్ 2–0–17–1, మురుగన్ అశ్విన్ 4–0–33–1, రవి బిష్ణోయ్ 3–0–24–0. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) సామ్స్ (బి) అక్షర్ 15; మయాంక్ (రనౌట్) 5; గేల్ (బి) అశ్విన్ 29; పూరన్ (సి) పంత్ (బి) రబడ 53; మ్యాక్స్‌వెల్ (సి) పంత్ (బి) రబడ 32; దీపక్ హుడా (నాటౌట్) 15; నీషమ్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–17, 2–52, 3–56, 4–125, 5–147. బౌలింగ్: సామ్స్ 4–0–30–0, రబడ 4–0–27–2, అక్షర్ 4–0–27–1, తుషార్ 2–0–41–0, అశి్వన్ 4–0–27–1, స్టొయినిస్ 1–0–14–0. -
ముంబైతో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ రికార్డ్
దుబాయ్: ఐపీఎల్లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబైపై పంజాబ్ జట్టు విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు ఆరో స్థానానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 77 పరుగులు చేయడంతో ఈ సీజన్లో అత్యధిక పరుగులు (525) సాధించిన బ్యాట్స్‌మెన్‌గా అగ్రస్థానానికి చేరుకున్నాడు. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలోనే ముంబై జట్టుపై అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గానూ గుర్తింపు పొందాడు. నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబైపై ఇప్పటిదాకా రాహుల్ 580 పరుగులు చేశాడు. (‘6 పరుగులు సేవ్ చేయడం మామూలు కాదు’) ఇదే మ్యాచ్ ద్వారా రాహుల్ మరో అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో వరుసగా మూడు సీజన్లలోనూ 500 పరుగులు పూర్తిచేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా అరుదైన రికార్డు సాధించాడు. తన టీమ్ సహచరుడైన క్రిస్ గేల్ కూడా వరుసగా మూడు సీజన్లలో 500పై చిలుకు పరుగులు సాధించాడు. ఇక భారత క్రికెటర్లలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా ఐదు సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించాడు. మరో బ్యాట్స్‌మన్ సురేష్ రైనా కూడా మూడు సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించాడు. -
ఉత్కం‘టై’లో... పంజాబ్ సూపర్ గెలుపు
దుబాయ్: సూపర్+సూపర్ ఆటకు తెరలేపిన ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిచింది. తొలి సూపర్ ‘ఆరు’ బంతులాటలో సింగిల్ డిజిటే నమోదైంది. పంజాబ్ ముందుగా పూరన్ (0), రాహుల్ (4) వికెట్లను కోల్పోయి 5 పరుగులే చేస్తే... ముంబై కూడా డికాక్ (3) వికెట్ కోల్పోయి ఐదు పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ కూడా ‘టై’ అయ్యింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు సమాలోచనలు జరిపి మరో సూపర్ ఓవర్‌ను ఆడించారు. ఈసారి తొలుత ముంబై హర్దిక్ పాండ్యా (1) వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. తర్వాత పంజాబ్... గేల్ (7) సిక్స్, మయాంక్ (8) 2 ఫోర్లతో ఇంకో రెండు బంతులుండగానే 15 పరుగులు చేసి గెలిచింది. అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. డికాక్ (43 బంతుల్లో 53; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా... పొలార్డ్ (12 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) చెలరేగాడు. పంజాబ్ బౌలర్లలో షమీ, అర్‡్షదీప్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సరిగ్గా 176 పరుగులే చేయడంతో మ్యాచ్ ‘టై’ అయింది. రాహుల్ (51 బంతుల్లో 77; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) విరోచిత పోరాటం చేశాడు. బుమ్రా 3 వికెట్లు తీశాడు. ముంబై తడబాటు... ముంబై ఇన్నింగ్స్ ఆరంభంలోనే టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (9), సూర్యకుమార్ యాదవ్ (0), ఇషాన్ కిషన్ (7) పంజాబ్ పేస్‌కు తలవంచారు. ఈ దశలో డికాక్, కృనాల్ పాండ్యా (30 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు శ్రమించారు. అడపాదడపా డికాక్ సిక్సర్లతో, కృనాల్ ఫోర్లతో మురిపించారు. అయితే రన్‌రేట్ మాత్రం ఆశించినంతగా పెరగలేదు. దీంతో జట్టు ఎనిమిదో ఓవర్లో 50, 14వ ఓవర్లో 100 పరుగులు చేసింది. డికాక్ 39 బంతుల్లో (3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. స్వల్ప వ్యవధిలో కృనాల్, హార్దిక్ (8), డికాక్ అవుటయ్యారు. పొలార్డ్ మెరుపు ఇన్నింగ్స్... చప్పగా సాగే ఇన్నింగ్స్‌కు పొలార్డ్ మెరుపులద్దాడు. అర్శ్‌దీప్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో తొలి రెండు బంతుల్ని భారీ సిక్సర్లుగా మలిచాడు. కూల్టర్ నీల్ వరుసగా రెండు బౌండరీలు బాదడంతో ఈ ఓవర్లోనే 22 పరుగులు వచ్చాయి. షమీ తర్వాతి ఓవర్లో కూల్టర్ నీల్ మరో రెండు ఫోర్లు కొట్టాడు. ఇక జోర్డాన్ ఆఖరి ఓవర్లోనూ పొలార్డ్ 2 సిక్స్‌లు, ఓ ఫోర్ బాదడంతో 20 పరుగులు స్కోరుబోర్డుకు జతయ్యాయి. ఈ చివరి 3 ఓవర్లలోనే 54 పరుగులు రావడంతో స్కోరు అమాంతం పెరిగిపోయింది. కూల్టర్‌నీల్, పొలార్డ్ జోడీ అబేధ్యమైన ఏడో వికెట్‌కు కేవలం 21 బంతుల్లోనే 57 పరుగులు జోడించింది. రాహుల్ జిగేల్... పంజాబ్ ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడే ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌లో ఈసారి ఆ దూకుడేమి కనిపించలేదు. మరో ఓపెనర్, కెప్టెన్ లోకేశ్ రాహుల్ మాత్రం మెరిపించినా... ధనాదంచేసినా... బాధ్యతగా ఆడాడు. బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో అతను చెలరేగాడు. ఐదు బంతులాడిన రాహుల్ 4, 4, 0, 6, వైడ్, 4లతో 20 పరుగులు పిండుకున్నాడు. కానీ తర్వాతి ఓవర్లోనే మయాంక్ (11)ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు. గేల్, రాహుల్ కలిసి కాసేపు వేగంగా నడిపించారు. గేల్ (24) అవుట్ కావడంతో ఈ జోడికి పదో ఓవర్లో చుక్కెదురైంది. రాహుల్ 35 బంతుల్లో (4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. పూరన్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ షాట్లతో అలరించినా ఎంతోసేపు నిలువలేదు. మ్యాక్స్‌వెల్ (0) డకౌటయ్యాడు. దీంతో భారమంతా మోసిన రాహుల్ లక్ష్యానికి 23 పరుగుల దూరంలో బౌల్డయ్యాడు. హుడా (23 నాటౌట్), జోర్డాన్ (13) పోరాడటంతో గెలుపుదారిన పడ్డట్లే కనిపించింది. అయితే ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సివుండగా... మొదటి ఐదు బంతులకు వరుసగా 1, 4, 1, 0, 1తో 7 పరుగులొచ్చాయి. ఇక చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా.. జోర్డాన్ పరుగు చేసి రెండో పరుగు కోసం రనౌటయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ కూడా ‘టై’ అయ్యింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) అర్‡్షదీప్ సింగ్ 9; డికాక్ (సి) మయాంక్ (బి) జోర్డాన్ 53; సూర్యకుమార్ యాదవ్ (సి) మురుగన్ అశ్విన్ (బి) షమీ 0; ఇషాన్ కిషన్ (సి) మురుగన్ అశ్విన్ (బి) అర్‡్షదీప్ సింగ్ 7; కృనాల్ (సి) హుడా (బి) రవి బిష్ణోయ్ 34; హార్దిక్ (సి) పూరన్ (బి) షమీ 8; పొలార్డ్ (నాటౌట్) 34; కూల్టర్‌నీల్ (నాటౌట్) 24; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–23, 2–24, 3–38, 4–96, 5–116, 6–119. బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 4–0–24–0, షమీ 4–0–30–2, అర్‡్షదీప్ సింగ్ 3–0–35–2, జోర్డాన్ 3–0–32–1, మురుగన్ అశ్విన్ 3–0–28–0, దీపక్ హుడా 1–0–9–0, రవి బిష్ణోయ్ 2–0–12–1. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) బుమ్రా 77; మయాంక్ (బి) బుమ్రా 11; గేల్ (సి) బౌల్ట్ (బి) రాహుల్ చహర్ 24; పూరన్ (సి) కూల్టర్‌నీల్ (బి) బుమ్రా 24; మ్యాక్స్‌వెల్ (సి) రోహిత్ శర్మ (బి) రాహుల్ చహర్ 0; దీపక్ హుడా (నాటౌట్) 23; జోర్డాన్ (రనౌట్) 13; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–33, 2–75, 3–108, 4–115, 5–153, 6–176. బౌలింగ్: బౌల్ట్ 4–0–48–0, కృనాల్ 2–0–12–0, బుమ్రా 4–0–24–3, కూల్టర్‌నీల్ 4–0–33–0, పొలార్డ్ 2–0–26–0, రాహుల్ చహర్ 4–0–33–2. మయాంక్, గేల్ విజయానందం -
పంజాబ్ మళ్లీ గెలిచిందోచ్!
ఐపీఎల్లో అట్టడుగున నిలిచిన జట్టు పంజాబ్. గెలిచే మ్యాచ్‌ల్ని ఓడిన జట్టు కూడా పంజాబే! రెండొందల పైచిలుకు స్కోరు చేసినా పరాజయాన్ని పలకరించిన జట్టు కింగ్స్ ఎలెవనే. ఇలాంటి జట్టు ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఏడింట ఒకే ఒక మ్యాచ్ గెలిచింది. అది బెంగళూరుపైనే! ఇప్పుడు కూడా ఐదు వరుస పరాజయాల తర్వాత మళ్లీ బెంగళూరుపైనే గెలిచి హమ్మయ్య గెలిచామనిపించింది. కింగ్స్ ఎలెవన్ అభిమానుల్ని ఊరటనిచ్చింది. లీగ్‌లో ముందడుగు వేసే అవకాశాల్ని సజీవంగా నిలుపుకుంది. షార్జా: ఎట్టకేలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మళ్లీ గెలిచింది. మరుగున పడిన ఆశలకు ఊపిరి పోసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. కోహ్లి (39 బంతుల్లో 48; 3 ఫోర్లు) రాణించగా... మోరిస్ (8 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిపించాడు. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రాహుల్ (49 బంతుల్లో 61 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు), గేల్ (45 బంతుల్లో 53; 1 ఫోర్ 5 సిక్స్‌లు), మయాంక్ అగర్వాల్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. దూకుడుగా మొదలై... మ్యాక్స్‌వెల్ తొలి ఓవర్లో లాంగ్ లెగ్‌లో భారీ సిక్సర్ బాదిన ఫించ్, షమీ రెండో ఓవర్లో ఫోర్ కొట్టాడు. కాస్త ఆలస్యంగా బ్యాట్‌కు పనిచెప్పిన దేవ్‌దత్ పడిక్కల్ త్వరగానే పెవిలియన్ చేరాడు. షమీ వేసిన నాలుగో ఓవర్లో డీప్ స్క్వేర్ లెగ్‌లో అతను సిక్స్ బాదాడు. 4 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 38/0 స్కోరు చేసింది. కానీ ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే దేవ్‌దత్ చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. కోహ్లి వస్తూనే రెండు వరుస బౌండరీలు కొట్టాడు. 5.2 ఓవర్లలో బెంగళూరు 50 పరుగులకు చేరింది. జట్టు కుదుటపడే సమయంలో ఫించ్‌కు (18 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) మురుగన్ అశ్విన్ చెక్ పెట్టాడు. ఏబీని కాదని... ఈ దశలో లెగ్ స్పిన్‌ను ఏబీ డివిలియర్స్ సరిగా ఆడలేడనే ఆలోచనతో ఆర్సీబీ టీమ్ వాషింగ్టన్ సుందర్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపింది. ఈ ఎత్తుగడ ఏ మాత్రం జట్టుకు లాభించలేదు. కోహ్లితో సుందర్ జోడీ కుదర్లేదు. 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 2 వికెట్లకు 83 పరుగులు చేసింది. మరుసటి ఓవర్లో సుందర్ (13)ను మురుగన్ అశ్విన్ పెవిలియన్ పంపాడు. మళ్లీ బెంగళూరు చేసిన తప్పే మళ్లీ చేసింది. ఈ సారీ కూడా ఏబీని కాదని శివమ్ దూబేను పంపింది. 11 నుంచి 14 ఓవర్లదాకా స్కోరు వేగం పూర్తిగా తగ్గింది. నాలుగు ఓవర్లలో బెంగళూరు 19 పరుగులే చేసింది. బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్లో 2 భారీ సిక్సర్లు బాదిన దూబే (19 బంతుల్లో 23; 2 సిక్స్‌లు)ను తర్వాతి ఓవర్లోనే జోర్డాన్ అవుట్ చేశాడు. 17వ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన డివిలియర్స్ (2)ను షమీ 18వ ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. రెండు బంతుల వ్యవధిలో కోహ్లి కూడా అవుటవడంతో డివిలియర్స్‌ను ఆపి ఆఖర్లో దించిన ఆర్సీబీ అంచనా తలకిందులైంది. షమీ వేసిన ఆఖరి ఓవర్లో మోరిస్ భారీషాట్లతో విరుచుకుపడటంతో ఆర్సీబీ ఇన్నింగ్స్‌లోనే అత్యధికంగా 24 పరుగులు వచ్చాయి. ఓపెనర్ల శుభారంభం మోరిస్ వేసిన తొలి ఓవర్లో ఒకే పరుగు చేయడంతో పంజాబ్ ఇన్నింగ్స్ మొదలైంది. తర్వాత బౌండరీలతో పుంజుకుంది. ఆ వెంటే సిక్సర్లతో హోరెత్తింది. రాహుల్ రెండో ఓవర్లో ఫోర్ కొట్టాడు. ఈ రెండు ఓవర్లు ముగిసినా... మయాంక్ అగర్వాల్ ఖాతానే తెరవలేదు. మూడో ఓవర్లో మళ్లీ రాహులే సిక్సర్‌తో మెరిపించాడు. 3 ఓవర్లలో పంజాబ్ స్కోరు 18/0. ఇక నాలుగో ఓవర్‌ను స్పిన్నర్ చహల్ బౌలింగ్ చేయగా... మయాంక్ బ్యాట్ ఝులిపించాడు. సిక్స్‌తో పాటు రెండు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్లో 15 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత కూడా సిక్స్ లేదంటే ఫోర్‌తో ఓవర్లు సాగిపోయాయి. కింగ్స్ ఎలెవన్ జట్టు ఆరో ఓవర్లో 50 పరుగులకు చేరింది. రాహుల్ ఫిఫ్టీ పంజాబ్ ఓపెనర్లు కుదురుకోవడంతో పరుగుల వేగం పెరిగింది. రాహుల్ కంటే ధాటిగా ఆడుతున్న మయాంక్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు)కు ఎట్టకేలకు చహల్ చెక్ పెట్టాడు. 8వ ఓవర్లో బౌలర్ తలమీదుగా సిక్స్‌కొట్టిన అగర్వాల్ ఆ తర్వాతి బంతికే బౌల్డయ్యాడు. దీంతో 78 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సిరాజ్ వేసిన 12వ ఓవర్లో రాహుల్ వరుసగా 2 సిక్సర్లు బాదడంతో పంజాబ్ వంద పరుగులను అధిగమించింది. రాహుల్ 37 బంతుల్లో (1 ఫోర్, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. గేల్ ధనాధన్ తొలి మ్యాచ్ ఆడుతున్న గేల్ తొలి 14 బంతుల్లో 6 పరుగులే చేసినా, సుందర్ ఓవర్లో భారీ సిక్సర్లతో టచ్‌లోకి వచ్చాడు. తర్వాత సిరాజ్ బౌలింగ్‌లో గేల్ 4, 6 కొడితే రాహుల్ మరో సిక్స్ బాదాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 20 పరుగులొచ్చాయి. 17వ ఓవర్లో గేల్ తనదైన శైలిలో లాంగాన్‌లో 2 సిక్సర్లను బాదేశాడు. దీంతోనే అతని అర్ధశతకం 36 బంతుల్లో పూర్తయ్యింది. 18 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి వుండగా... మోరిస్ (18వ), ఉదాన (19వ) రెండు ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేవలం 9 పరుగులే వచ్చాయి. ఆఖరి ఓవర్లో విజయానికి 2 పరుగులు అవసరం కాగా చహల్ కూడా పేసర్లలాగే వైవిధ్యమైన బంతులేశాడు. 4 బంతుల్లో పరుగు మాత్రమే ఇచ్చాడు. స్కోరు సమమైంది. ఐదో బంతికి గేల్ రనౌటయ్యాడు. ఆఖరి బంతికి పరుగు చేయాల్సిన సమయంలో ఉత్కంఠ రేగింది. కానీ పూరన్ భారీ సిక్సర్‌తో ఈ ఉత్కంఠను, లక్ష్యాన్ని ఛేదించాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: ఫించ్ (బి) మరుగున్ అశ్విన్ 20; పడిక్కల్ (సి) పూరన్ (బి) అర్‡్షదీప్ 18; కోహ్లి (సి) రాహుల్ (బి) షమీ 48; సుందర్ (సి) జోర్డాన్ (బి) అశ్విన్ 13; దూబే (సి) రాహుల్ (బి) జోర్డాన్ 23; డివిలియర్స్ (సి) హుడా (బి) షమీ 2; మోరిస్ (నాటౌట్) 25; ఉదాన (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–38, 2–62, 3–86, 4–127, 5–134, 6–136. బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 4–0–28–0, షమీ 4–0–45–2, అర్‡్షదీప్ 2–0–20–1, రవి బిష్ణోయ్ 3–0–29–0, మురుగన్ అశ్విన్ 4–0–23–2, జోర్డాన్ 3–0–20–1. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (నాటౌట్) 61; మయాంక్ (బి) చహల్ 45; గేల్ (రనౌట్) 53; పూరన్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–78, 2–171. బౌలింగ్: మోరిస్ 4–0–22–0, సైనీ 4–0–21–0, చహల్ 3–0–35–1, ఉదాన 2–0–14–0, సిరాజ్ 3–0–44–0, సుందర్ 4–0–38–0. కోహ్లి @ 200 మ్యాచ్‌ల్లో సెంచరీలు కొట్టే విరాట్... మ్యాచ్‌ల పరంగా డబుల్ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ పుట్టినప్పటినుంచి ఆర్సీబీని వీడని కెప్టెన్ కోహ్లి ఈ జట్టు తరఫున గురువారం 200వ మ్యాచ్ ఆడాడు. ఇందులో 185 ఐపీఎల్‌లోనే ఆడగా... మిగతా 15 మ్యాచ్‌లు చాంపియన్స్ లీగ్ (రద్దయింది)లో ఆడాడు. -
హై హై హైదరాబాద్...
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ఒక పెద్ద విజయంతో ఐపీఎల్లో తమ విలువను ప్రదర్శించింది. అభిమానులు మెచ్చేలా ఒక అద్భుత ప్రదర్శనతో సంతోషం పంచింది. ఓపెనర్లు బెయిర్‌స్టో, వార్నర్‌ల మెరుపు సెంచరీ భాగస్వామ్యంతో భారీ స్కోరు నమోదు చేసిన జట్టు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తొక్కేసింది. ముందుగా పేలవ బౌలింగ్, ఆ తర్వాత చేవ లేని బ్యాటింగ్‌తో కుప్పకూలిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లీగ్‌లో తాము ముందంజ వేసే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో మూడో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 69 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బెయిర్‌స్టో (55 బంతుల్లో 97; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... వార్నర్ (40 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధసెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 91 బంతుల్లో 160 పరుగులు జోడించారు. అనంతరం పంజాబ్ 16.5 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. నికోలస్ పూరన్ (37 బంతుల్లో 77; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. 12 పరుగులకే 3 వికెట్లు తీసి రషీద్ ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ముగియడం పంజాబ్ వైఫల్యాన్ని సూచిస్తోంది. శతక భాగస్వామ్యం... సీజన్లో తొలిసారి ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాట్రెల్ వేసిన మొదటి ఓవర్లోనే 13 పరుగులు రాబట్టడంతో వీరి జోరు మొదలైంది. పవర్‌ప్లేలో హైదరాబాద్ స్కోరు 58 పరుగులకు చేరింది. రవి బిష్ణోయ్ ఓవర్లో వరుసగా 6, 4, 6 బాది బెయిర్‌స్టో దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలో 28 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. అంతకుముందు 19 పరుగుల వద్ద మిడాఫ్‌లో రాహుల్ కష్టసాధ్యమైన క్యాచ్ వదిలేయడం కూడా బెయిర్‌స్టోకి కలిసొచ్చింది. హైదరాబాద్ 10 ఓవర్లలో 10 రన్‌రేట్‌తో సరిగ్గా 100 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టిన బెయిర్‌స్టో... ముజీబ్ ఓవర్లో వరుసగా మరో రెండు సిక్సర్లు సాధించడం విశేషం. మరోవైపు 37 బంతుల్లో వార్నర్ అర్ధసెంచరీ పూర్తయింది. 5 ఓవర్లలో 6 వికెట్లు... 15 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు వికెట్ కోల్పోకుండా 160 పరుగులు. కానీ జట్టు బ్యాటింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. పంజాబ్ చక్కటి బౌలింగ్‌కు తర్వాతి మూడు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే వచ్చాయి. బిష్ణోయ్ ఓవర్లో వరుస బంతుల్లో వార్నర్, బెయిర్‌స్టో అవుట్ కాగా, భారీ షాట్లు ఆడే క్రమంలో పాండే (1), సమద్ (8) వెనుదిరిగారు. అయితే చివరి రెండు ఓవర్లలో విలియమ్సన్ (20 నాటౌట్) చకచకా రన్స్ చేయడంతో స్కోరు 200 పరుగులు దాటింది. ఆఖరి 5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ 41 పరుగులు చేసింది. 202 పరుగుల భారీ ఛేదనలో పంజాబ్ ఏ దశలోనూ లక్ష్యం చేరేలా కనిపించలేదు. కొద్దిసేపు పూరన్ జోరు మినహా మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. పూరన్ మెరుపులు.. పంజాబ్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచిన అంశం పూరన్ బ్యాటింగ్ ఒక్కటే. తొలి బంతినే కవర్‌డ్రైవ్ బౌండరీగా మలచి ఖాతా తెరిచిన అతను, అభిషేక్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో ధాటిని పెంచాడు. సమద్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లోనైతే పూరన్ భీకరంగా చెలరేగిపోయాడు. ఈ ఓవర్ తొలి ఐదు బంతుల్లో 6, 4, 6, 6, 6 బాది 28 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 17 బంతుల్లోనే అతను అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రివ్యూ నిర్ణయంపై రివ్యూ... పంజాబ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఖలీల్ వేసిన ఐదో బంతి ముజీబ్ బ్యాట్‌కు తాకుతూ కీపర్ చేతుల్లో పడటంతో అప్పీల్ చేయగా, అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఆపై రైజర్స్ రివ్యూ కూడా కోరలేదు. అయితే ఇద్దరూ అంపైర్లు చర్చించి మూడో అంపైర్‌ను సంప్రదించారు. బంతిని నేలను తాకిందా లేదా అనేదానిని మాత్రమే సమీక్షించిన థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో ముజీబ్ మైదానం వీడబోయాడు. అంతలోనే వెనక్కి వచ్చి అవుట్‌పై సందేహం వ్యక్తం చేస్తూ రివ్యూ కోరాడు. దాంతో అల్ట్రా ఎడ్జ్ రీప్లే చూసిన అనంతరం బంతి బ్యాట్‌కు తగిలిందంటూ మూడో అంపైర్ అవుట్ ఇచ్చాడు. ప్రధాన బ్యాట్స్‌మన్ కాకపోయినా రివ్యూపై మళ్లీ రివ్యూ కోరడంతో మైదానంలో కొద్దిసేపు డ్రామా కనిపించింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) రవి బిష్ణోయ్ 52; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 97; సమద్ (సి) అర్‡్షదీప్ (బి) బిష్ణోయ్ 8; పాండే (సి అండ్ బి) అర్‡్షదీప్ 1; విలియమ్సన్ (నాటౌట్) 20; ప్రియమ్ గార్గ్ (సి) పూరన్ (బి) అర్‡్షదీప్ 0; అభిషేక్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) షమీ 12; రషీద్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–160; 2–160; 3–161; 4–173; 5–175; 6–199. బౌలింగ్: కాట్రెల్ 3–0–33–0; ముజీబ్ 4–0–39–0; షమీ 4–0–40–1; మ్యాక్స్‌వెల్ 2–0–26–0; బిష్ణోయ్ 3–0–29–3; అర్‡్షదీప్ 3–0–33–2. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) విలియమ్సన్ (బి) అభిషేక్ 11; మయాంక్ (రనౌట్) 9; సిమ్రన్ సింగ్ (సి) గార్గ్ (బి) ఖలీల్ 11; పూరన్ (సి) నటరాజన్ (బి) రషీద్ 77; మ్యాక్స్‌వెల్ (రనౌట్) 7; మన్దీప్ (బి) రషీద్ 6; ముజీబ్ (సి) బెయిర్‌స్టో (బి) ఖలీల్ 1; రవి బిష్ణోయ్ (నాటౌట్) 6; షమీ (ఎల్బీ)(బి) రషీద్ 0; కాట్రెల్ (బి) నటరాజన్ 0; అర్‡్షదీప్ (సి)వార్నర్ (బి)నటరాజన్ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (16.5 ఓవర్లలో ఆలౌట్) 132. వికెట్ల పతనం: 1–11; 2–31; 3–58; 4–105; 5–115; 6–126; 7–126; 8–126; 9–132; 10–132. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–27–0; ఖలీల్ అహ్మద్ 3–0–24–2; నటరాజన్ 3.5–0–24–2; అభిషేక్ 1–0–15–1; రషీద్ ఖాన్ 4–1–12–3; సమద్ 1–0–28–0. -
చెన్నై చిందేసింది
చెన్నై సూపర్‌గా ఆడి కింగ్స్ ఎలెవన్‌ను ఓడించింది. పంజాబ్ లక్ష్యం ఓపెనర్ల పంజాకే కరిగిపోయింది. ఓవర్లు గడిచేకొద్దీ పరుగులు పెరిగిపోతున్నాయి. కానీ ఒక్క వికెట్ కూడా పడకపోవడం కింగ్స్ ఎలెవన్ బౌలింగ్ వైఫల్యాన్ని వేలెత్తి చూపించింది. లీగ్‌లో ఇప్పటిదాకా 5 మ్యాచ్‌లాడిన పంజాబ్‌కు ఇది నాలుగో ఓటమి కాగా... సూపర్‌కింగ్స్ తమ ‘హ్యాట్రిక్’ పరాజయాలకు ఫుల్స్టాప్ పెట్టింది. టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్: చెన్నై దర్జాగా చిందేసింది. ప్రత్యర్థి తమ ముందు గట్టి లక్ష్యాన్నే నిర్దేశించినా... ఓపెనర్లు వాట్సన్ (53 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), డుప్లెసిస్ (53 బంతుల్లో 87 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) వేసిన పరుగుల బాటతో సూపర్‌కింగ్స్ విజయబావుటా ఎగరేసింది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ధోని బృందం 10 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ లోకేశ్ రాహుల్ (52 బంతుల్లో 63; 7 ఫోర్లు, 1 సిక్స్) స్కోరుబోర్డును నడిపించగా... పూరన్ (17 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిపించాడు. శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండానే 181 పరుగులు చేసి గెలిచింది. వాట్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. కింగ్స్ తుది జట్టులో కరుణ్, గౌతమ్, నీషమ్‌లను పక్కనబెట్టి మన్దీప్, హర్‌ప్రీత్ బ్రార్, జోర్డాన్‌లను తీసుకోగా... చెన్నై మార్పులేకుండా గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. రాహుల్ ఫిఫ్టీ... రాహుల్, మయాంక్ జోరు లేని శుభారంభమైతే ఇచ్చారు. అయితే వేగం పెరిగే దశలో మయాంక్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు) ఔటయ్యాడు. మన్దీప్ సింగ్... చావ్లా ఓవర్లో మిడ్‌వికెట్, డీప్ మికెట్ల మీదుగా రెండు భారీ సిక్సర్లు బాదాడు. కానీ మరుసటి ఓవర్లోనే జడేజా అతని స్పీడ్‌కు కళ్లెం వేశాడు. దీంతో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ భారీ షాట్లే లక్ష్యమని బౌలర్లపై విరుచుకుపడ్డాడు. జడేజా ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదా డు. ఓపెనర్ రాహుల్ ఆలస్యంగా 15వ ఓవర్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. శార్దుల్ వేసిన ఈ ఓవర్లో సిక్స్ సహా వరుసగా రెండు బౌండరీలు కూడా కొట్టాడు. మరోవైపు పూరన్ సిక్సర్లతో అలరించాడు. 9 పరుగుల రన్‌రేట్‌కు చేరిన ఈ దశలో 18వ ఓవర్ వేసిన శార్దుల్ వరుస బంతుల్లో పూరన్, రాహుల్‌లను ఔట్ చేయడంతో డెత్ ఓవర్లలో రావల్సినన్ని పరుగులు రాలేదు. ఇద్దరే పూర్తి చేశారు... చెన్నై తరఫున పరుగుల వేట ప్రారంభించింది ఇద్దరే. పరుగులన్నీ చకచకా చేసింది ఇద్దరే! లక్ష్యం చేరేదాకా నిలబడింది కూడా ఆ ఇద్దరే! ఆ ఇద్దరు ఇంకెవరో కాదు... ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లెసిస్. మొత్తం 18 ఓవర్లు వేయగా... ఇందులో రెండే రెండు ఓవర్లు (1, 13వ) బౌండరీకి దూరమయ్యాయి. కానీ 16 ఓవర్లు బౌండరీని చేరేందుకే ఇష్టపడినట్లుగా ఇద్దరి ఆట రమ్యంగా సాగిపోయింది. జట్టు 6వ ఓవర్లో 50, 10వ ఓవర్లో వంద పరుగుల్ని దాటింది. వాట్సన్ 31 బంతుల్లో (9 ఫోర్లు, 1 సిక్స్)... డుప్లెసిస్ 33 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధశతకాలను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా ఏదో భారీ షాట్‌కో లేదంటే లూజ్ షాట్‌కో పెవిలియన్ చేరతారనుకుంటే పొరపాటే! జట్టు గెలిచేదాకా ఒట్టు పెట్టుకుని ఆడినట్లే ఆడారు. ఓవర్‌కు 10 పరుగుల రన్‌రేట్‌తో చెన్నై దూసుకెళ్లింది. పది వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. 2 ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 10 వికెట్ల విజయాన్ని అందుకోవడం ఇది రెండోసారి. 2013లోనూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పైనే చెన్నై జట్టు తొలి 10 వికెట్ల విజయాన్ని సాధించడం విశేషం. ఓవరాల్‌గా ఐపీఎల్లో 12 సార్లు 10 వికెట్ల తేడాతో విజయాలు నమోదయ్యాయి. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: లోకేశ్ రాహుల్ (సి) ధోని (బి) శార్దుల్ 63; మయాంక్ (సి) కరన్ (బి) పీయూశ్ 26; మన్దీప్ (సి) రాయుడు (బి) జడేజా 27; పూరన్ (సి) జడేజా (బి) శార్దుల్ 33; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 11; సర్ఫరాజ్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–61, 2–94, 3–152, 4–152. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–17–0, స్యామ్ కరన్ 3–0–31–0, శార్దుల్ 4–0–39–2, బ్రేవో 4–0–38–0, జడేజా 4–0–30–1, పీయూశ్ 2–0–22–1. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: వాట్సన్ (నాటౌట్) 83; డుప్లెసిస్ (నాటౌట్) 87; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (17.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 181. బౌలింగ్: కాట్రెల్ 3–0–30–0, షమీ 3.4–0–35–0, హర్‌ప్రీత్ 4–0–41–0, జోర్డాన్ 3–0–42–0, రవి బిష్ణోయ్ 4–0–33–0. -
ముంబై మెరుపులు
ముంబై ఇండియన్స్ గర్జించింది. మెరుపులు ఆలస్యమైనా... ఆఖర్లో అనూహ్య విధ్వంసంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిన్నాభిన్నం చేసింది. సింహభాగం ఓవర్ల దాకా ఆధిపత్యం చలాయించిన కింగ్స్ బౌలింగ్ చివరకొచ్చేసరికి చేతులెత్తేసింది. రోహిత్, పొలార్డ్, పాండ్యా చూపించిన చుక్కలకు, కొట్టిన బౌండరీలకు స్కోరు బోర్డు వాయు వేగంతో దూసుకెళ్లింది. అనంతరం అద్భుతమైన బౌలింగ్‌తో కింగ్స్‌పై పంజా విసరడంతో విజయం సులువుగానే దక్కింది. అబుదాబి: ముంబై ఆల్‌రౌండ్ సత్తాకు పంజాబ్ దాసోహమైంది. డెత్ ఓవర్లో అయితే బ్యాటింగ్ విశ్వరూపానికి ప్రత్యక్ష సాక్ష్యమైంది. తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు చేతులెత్తేసింది. దీంతో గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 48 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (45 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడగా... పొలార్డ్ (20 బంతుల్లో 47 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (11 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) విరుచుకుపడ్డారు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓడింది. నికోలస్ పూరన్ (27 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. డికాక్ డకౌట్ ముంబై ఇండియన్స్ పరుగు ప్రారంభించక ముందే డికాక్ డకౌటైతే... రెండో ఓవర్లో రోహిత్ ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. షమీ తొలి బంతిని బౌండరీకి తరలించడంతో హిట్‌మ్యాన్ ఈ మార్క్ చేరాడు. కానీ ముంబై స్కోరు మాత్రం జోరుగా సాగలేదు. పది ఓవర్లు గడిచినా... రోహిత్ శర్మ క్రీజులో ఉన్నా ఒక్క సిక్సరైనా లేదు. అడపాదడపా ఫోర్ల రూపంలో పరుగులొచ్చినా మ్యాచ్ చప్పగా సాగింది. ఈ దశలో ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్) భారీ సిక్సర్‌తో మురిపించాడు. కానీ పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు అతని ఆటలు ఎంతోసేపు సాగలేదు. 14 ఓవర్లు ముగిసేసరికి ముంబై 3 వికెట్లకు 87 పరుగులే చేయగలిగింది. పూరన్ ఒక్కడే... పంజాబ్ ఆరంభం అదిరింది. తొలి ఓవర్లోనే మయాంక్, రాహుల్ చెరో బౌండరీ బాదారు. రెండో ఓవర్లో 12, మూడో ఓవర్లో 9 పరుగుల రావడంతో కింగ్స్ 3 ఓవర్లలో 33 పరుగులు చేసింది. అయితే మయాంక్ (18 బంతుల్లో 25; 3 ఫోర్లు) జోరుకు బుమ్రా కళ్లెం వేశాడు. కాసేపటికే కరుణ్ నాయర్ (0), రాహుల్ (17) అవుట్ కావడంతో పంజాబ్ గెలుపు దారి మూసుకుపోయింది. ఈ దశలో నికోలస్ పూరన్ ధాటిగా ఆడాడు. సిక్స్‌లు, ఫోర్లతో జోరందుకున్నాడు. కానీ చేయాల్సిన రన్‌రేట్‌కు అతనొక్కడి ధనాధన్ ఏమాత్రం సరిపోలేదు. 14వ ఓవర్లో జట్టు స్కోరు 100 పరుగులు చేరింది. అయితే ఆ మరుసటి బంతికే పూరన్ ఔట్ కావడం, హిట్టర్ మ్యాక్స్‌వెల్ (11) చేతులెత్తేయడంతో పంజాబ్ ఓటమి 15వ ఓవర్లోనే ఖాయమైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కృష్ణప్ప గౌతమ్ (13 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆట 20 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు పనికొచ్చింది. సచిన్ మాట! ముంబై 18వ ఓవర్లో 18 పరుగులు చేసింది. 19వ ఓవర్లో 19 పరుగులు చేసింది. హిట్టర్లు పొలార్డ్, హార్దిక్ పాండ్యా క్రీజులో విధ్వంసరచన చేస్తుంటే పంజాబ్ కెప్టెన్ రాహుల్ 20వ ఓవర్ వేసేందుకు ఆఫ్ స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్‌కు బంతినిచ్చాడు. ఈ పరిణామం బ్యాటింగ్ లెజెండ్ సచిన్‌ను సైతం విస్మయపరిచింది. అందుకేనేమో ట్విట్టర్లో ఆ దిగ్గజం తలబాదుకునే ఇమోజీతో వ్యాఖ్య జోడించి పోస్ట్ చేశాడు. ‘పొలార్డ్, పాండ్యా క్రీజ్‌లో ఉన్నప్పుడు 20వ ఓవర్ ఒక ఆఫ్ స్పిన్నర్ బౌల్ చేయడమా’ అని అతను ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దీన్ని బట్టే రాహుల్ వ్యూహం ఎంత తప్పో అర్థమవుతుంది. ఆరు... ఫోరు... ఆఖర్లో ముంబై జోరు.. ముంబై 14 ఓవర్లు ఆడింది. ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ క్రీజులో ఉన్నాడు. అయినా జట్టు స్కోరు వంద పరుగులైనా చేయలేదు. మిగిలినవి 6 ఓవర్లు. పిచ్ స్వభావం, మ్యాచ్ జరిగిన విధానం బట్టి... కాస్త ధాటిగా ఆడినా ఈ 36 బంతుల్లో 60, 70 పరుగులు చేస్తుందిలే అనుకున్నారంతా! కానీ ఈ ఆరు ఓవర్లే ముంబై దశను మార్చాయి. ఈ సమయంలో ఫోర్లు, సిక్సర్లు పోటీపడ్డాయి. బౌండరీ లైనును అదే పనిగా దాటాయి. బిష్ణోయ్ 15వ ఓవర్లో రోహిత్ రెండు సిక్సర్లతో స్కోరు వంద దాటింది. నీషమ్ 16 ఓవర్లో అతను వరుసగా 4, 4, 6, 6 బాదడంతో అర్ధసెంచరీ దాటి ఏకంగా 70 పరుగులకు చేరింది. అదే స్కోరుపై రోహిత్‌ను మరుసటి ఓవర్ తొలి బంతికే షమీ ఔట్ చేయగా... 17వ ఓవర్లో ఐదే పరుగులొచ్చాయి. 18, 19, 20 ఓవర్లలలో హార్దిక్ పాండ్యా, పొలార్డ్‌ల ధనాధన్‌తో దద్దరిల్లింది. ఈ 18 బంతుల్లో బంతి ఏకంగా 11 సార్లు బౌండరీని దాటింది. ఆఖరి 6 ఓవర్లలో ముంబై 104 పరుగులు చేయడంతో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కేవలం 23 బంతుల్లోనే పొలార్డ్, పాండ్యా అబేధ్యమైన ఐదో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. 3 ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని దాటిన మూడో బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (5430), సురేశ్ రైనా (5368)లు రోహిత్ శర్మ (5068)కంటే ముందున్నారు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) కాట్రెల్ 0; రోహిత్ (సి) నీషమ్ (బి) షమీ 70; సూర్య కుమార్ (రనౌట్) 10; ఇషాన్ కిషన్ (సి) కరుణ్ నాయర్ (బి) గౌతమ్ 28; పొలార్డ్ (నాటౌట్) 47; హార్దిక్ (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 191 వికెట్ల పతనం: 1–0, 2–21, 3–83, 4–124. బౌలింగ్: కాట్రెల్ 4–1–20–1, షమీ 4–0–36–1, రవి 4–0–37–0, గౌతమ్ 4–0–45–1, నీషమ్ 4–0–52–0. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) చహర్ 17; మయాంక్ (బి) బుమ్రా 25; కరుణ్ నాయర్ (బి) కృనాల్ 0; పూరన్ (సి) డికాక్ (బి) ప్యాటిన్సన్ 44; మ్యాక్స్‌వెల్ (సి) బౌల్ట్ (బి) చహర్ 11; నీషమ్ (సి) సూర్య కుమార్ (బి) బుమ్రా 7; సర్ఫరాజ్ (ఎల్బీ) (బి) ప్యాటిన్సన్ 7; గౌతమ్ (నాటౌట్) 22; రవి (సి) సూర్య కుమార్ (బి) బౌల్ట్ 1; షమీ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–38, 2–39, 3–60, 4–101, 5–107, 6–112, 7–121, 8–124. బౌలింగ్: బౌల్ట్ 4–0–42–1, ప్యాటిన్సన్ 4–0–28–2, కృనాల్ 4–0–27–1, బుమ్రా 4–0–18–2, చహర్ 4–0–26–2. -
'మ్యాక్స్‌వెల్‌ను ఇష్టపడింది నేను.. మీరు కాదు'
సిడ్నీ : ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత సంతతికి చెందిన ఫార్మాసిస్ట్ వినీ రామన్‌తో ఎంగేజ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా రెండోసారి గత మార్చిలో భారతీయ సంప్రదాయం ప్రకారం ఇరువురి కుటుంబాల సమక్షంలో మరోసారి ఎంగేజ్మెంట్ జరిపారు. తాజాగా ఐపీఎల్ 13వ సీజన్లో ఆడేందుకు దుబాయ్ వెళ్లిన మ్యాక్స్‌వెల్‌ను తాను మిస్సవుతున్నట్లు పేర్కొంటూ వినీ రామన్ వారిద్దరు కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే రామన్ షేర్ చేసిన ఫోటోలపై ఒక వ్యక్తి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : 'మా బౌలర్ల ప్రదర్శన నిజంగా అద్భుతం') 'వినీ రామన్.. మానసికంగా దెబ్బతిన్న ఒక తెల్ల వ్యక్తిని మీరు ఇష్టపడి తప్పు చేశారు. ఈ విషయంలో మీరు ఒకసారి ఆలోచించి ఉంటే బాగుండు. అయినా మీకు ప్రేమించడానికి భారత సంతతి వ్యక్తులు దొరకలేదా' అంటూ కామెంట్స్ చేశాడు. దీనిపై వినీ రామన్ ఘాటుగానే స్పందించింది. 'వాళ్లకు వాళ్లు సెలబ్రిటీలు అయిపోవాలని కొందరు పనిగట్టుకొని ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు. అటువంటి వారి గురించి నేను సాధారణంగా పట్టించుకోను. కానీ తాజాగా వచ్చిన కామెంట్ చూసి నాకు చాలా కోపం వచ్చింది. ప్రపంచమంతా అభివృద్ధితో ముందుకు సాగుతుంటే ఒక వ్యక్తి ఇలా వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం దారుణం. ఈ వ్యాఖ్యలు చేసినందుకు కాస్తయినా సిగ్గుపడాలి. ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందనేది చెప్పలేం. నాకు నేనుగా ఒక వ్యక్తి దగ్గరయ్యానంటే అది రంగు, దేశం చూసి కాదు.. మంచి మనసు చూసి అన్న విషయం అర్థం చేసుకుంటే మంచింది. అది నాకు మ్యాక్స్‌వెల్‌లో కనిపించింది.. అందుకే అతన్ని ఇష్టపడ్డా.. అయినా నేనెవరిని ఇష్టపడాలి అనేది నా ఇష్టం. ఒక తెల్లవ్యక్తిని ప్రేమించినంత మాత్రానా నా భారతీయ సంప్రదాయానికి వచ్చిన నష్టం ఏంలేదు. మీ అభిప్రాయం చెప్పడం సరైనదే.. కానీ అది ఎదుటివారిని బాధిస్తుందా లేదా అన్నది చూసుకొని చెప్పడం మంచిదంటూ ' ఘాటు వ్యాఖ్యలు చేశారు. వినీ రామన్ కామెంట్స్‌ను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మ్యాక్సీ..' వినీ నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. కొందరు పనిగట్టుకొని ఇలాంటి విమర్శలు చేస్తారు.. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అంటూ తెలిపాడు.(చదవండి : వాటే స్పెల్ రషీద్..) కాగా గతేడాది అక్టోబర్‌లో తాను మానసిక సమస్యలతో సతమతమవుతున్నాని అందుకే క్రికెట్‌కు కాస్త విరామం తీసుకోవాలనుకుంటున్నట్లు మ్యాక్స్‌వెల్ సంచలన ప్రకటన చేశాడు.అడిలైడ్ వేదికగా శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 29 బంతుల్లోనే 64 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మ్యాక్స్ కాసేపటికే ఈ ప్రకటన చేయడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే మ్యాక్స్‌వెల్ మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు వినీ రామన్ అతనికి ఎంతగానో సహకరించింది. ఈ క్రమంలోనే వారిద్దరు ప్రేమలో పడ్డారు. ఇరువురి కుటుంబాల అంగీకారంతో గత ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ జరిగింది. వినీ రామన్ సలహాలతో మ్యాక్స్ తన ఒత్తిడిని అధిగమించి 2019-20 బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ తరపున బరిలోకి దిగాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్లో ఆడుతున్న మ్యాక్స్‌వెల్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపునఆడుతున్నాడు. కాగా గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను కింగ్స్ పంజాబ్ రూ. 10.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
పాంటింగ్ కామెంట్‌తో కసి పెరిగింది
గత ఏడాది ఐపీఎల్... ఆ ఘటనను రాహుల్ తేవటియా ఎప్పటికీ మరచిపోలేడు. అప్పుడతను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సభ్యుడిగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌పై వాంఖడే స్టేడియంలో అద్భుత విజయం సాధించిన తర్వాత కోచ్ రికీ పాంటింగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రసంగించాడు. మ్యాచ్‌లో విజయానికి కారణమైన పంత్, ఇంగ్రామ్, ధావన్, ఇషాంత్, బౌల్ట్, రబడ... ఇలా అందరినీ పేరుపేరునా ప్రస్తావిస్తూ వారిని అభినందించాడు. అది ముగిసిన తర్వాత పాంటింగ్ వెళ్లిపోతుండగా... తేవటియా అడ్డుగా వచ్చాడు. ‘నేనూ నాలుగు క్యాచ్‌లు పట్టాను. కాస్త నా గురించి కూడా చెప్పవచ్చుగా’ అని అడిగాడు. దాంతో ‘ఇతను కూడా నాలుగు క్యాచ్‌లు పట్టాడుగా, ఇతడినీ అంతా అభినందించండి’... అంటూ పాంటింగ్ అలా గట్టిగా చెబుతూ వెళ్లిపోయాడు. ఇందులో ఒక యువ ఆటగాడిని ప్రోత్సహించడంకంటే ఒక రకమైన వ్యంగ్యమే ఎక్కువగా కనిపించింది. సహచరులు కూడా అలాగే భావిస్తూ నవ్వారు. అక్షర్ పటేల్ అయితే ‘ఎవరైనా ఇలా అడిగి మరీ అభినందనలు చెప్పించుకుంటారా’ అని అనేశాడు. అయితే రాహుల్ తేవటియా మాత్రం తడబడలేదు. ‘మనకు దక్కాల్సిన గుర్తింపును హక్కుగా భావించి దాని కోసం పోరాడాల్సిందే’ అని జవాబిచ్చాడు. ఇది మాత్రం తేవటియా సరదాగా చెప్పలేదు. తననూ గుర్తించాలన్న కసి కనిపించింది. ఇప్పుడు కాలం గిర్రున తిరిగింది. ఏడాది తర్వాత రాహుల్ తేవటియాకు తన గురించి తాను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచం అతని గురించే మాట్లాడుకుంటోంది. ఇది అతను సాధించిన పెద్ద విజయం. టి20 వ్యూహాలు, ఫలితాల గురించి ఆలోచించకుండా అతని ఇన్నింగ్స్‌ను చూస్తే ఎంతటి కఠిన పరిస్థితుల్లోనూ పోరాటం ఆపరాదని, ఓటమిని అంగీకరించకుండా తనపై తాను నమ్మకం ఉంచాలనే లక్షణం 27 ఏళ్ల తేవటియాలో పుష్కలంగా ఉందని అర్థమవుతోంది. అటూ ఇటూ... రాహుల్ తేవటియా 2014 నుంచి ఐపీఎల్లో ఉన్నాడు. అప్పుడూ అతను రాజస్తాన్ రాయల్స్ జట్టులోకి ఎంపికయ్యాడు. కానీ లీగ్ మధ్యలో అతడిని పంజాబ్ తీసుకుంది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ 2017లో ఐపీఎల్ ఆడే అవకాశం లభించింది. తర్వాతి సంవత్సరం మళ్లీ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు వచ్చాడు. రెండు సీజన్ల తర్వాత ఇప్పుడు మళ్లీ రాయల్స్‌తోనే అవకాశం. ఇంత కాలం ఎక్కడా ఆడినా అతడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. 2019 ఐపీఎల్‌లోనైతే కేవలం 6.2 ఓవర్లు మాత్రమే వేసిన తేవటియా బ్యాటింగ్‌లో 22 బంతులు మాత్రమే ఆడగలిగాడు. ఏ రకంగా చూసినా ఇది అతను ఆశించింది కాదు. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టి.. తేవటియాకు తన బలం, బలహీనతపై ఒక అంచనా వచ్చేసింది. తాను లెగ్స్పి న్నర్నే అయినా ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చే చహల్ లేదా అమిత్ మిశ్రా స్థాయి తనది కాదు. కేవలం బౌలర్‌గానే జట్టులో ఉండేంత గొప్ప బౌలింగ్ కాదు. అందువల్లే అతని రాష్ట్ర జట్టు హరియాణాలో కూడా రెగ్యులర్‌గా తేవటియాకు అవకాశాలు రాలేదు. అందుకే తన బ్యాటింగ్‌పై అతను బాగా దృష్టి పెట్టాడు. భారీ షాట్లు ఆడటంపై తీవ్రంగా సాధన చేశాడు. రాయల్స్‌కు కూడా ఇలాంటి ఆటగాడి అవసరం కనిపించడంతో అతనికి అవకాశం లభించింది. రాజస్తాన్ టీమ్‌లో ఉన్న భారత ఆటగాళ్లలో బంతిని బలంగా బాదగల ఏకైక లెఫ్ట్ హ్యాండర్ తేవటియా మాత్రమే. అదే అతనికి అర్హతగా పని చేసింది. సూపర్ బ్యాటింగ్... లీగ్ ఆరంభానికి ముందు రాజస్తాన్ ఆడిన అంతర్గత ప్రాక్టీస్ మ్యాచ్‌లలో తేవటియా బ్యాటింగ్ పవర్‌ను కోచింగ్ సిబ్బంది పరిశీలించారు. అతను ఆదివారం మ్యాచ్ తరహాలో భారీ షాట్లు కొట్టగలడని ఆ బృందానికి తప్ప ఎవరికీ కనీస అంచనా కూడా లేదు. అందుకే నాలుగో స్థానంలో అతడిని పంపిన వ్యూహంపై అంతా విరుచుకుపడ్డారు. ఇక పరుగులు తీయకుండా అతను తీవ్రంగా ఇబ్బంది పడటం చూసి కొందరు జాలి కూడా పడ్డారు. కానీ తేవటియా తనపై తాను విశ్వాసం కోల్పోలేదు. సిక్సర్లతో విరుచుకుపడి తనేమిటో నిరూపించాడు. చివరకు యువరాజ్ సైతం ‘ఆ ఒక్క బంతిని వదిలి పెట్టినందుకు సంతోషం’ అంటూ తన రికార్డు గురించి ప్రస్తావించాడంటే వాటి విలువేమిటో తెలుస్తుంది. ‘తేవటియా దూకుడు, బంతిని బలంగా బాదే శైలి గురించి నాకు బాగా తెలుసు. కెరీర్ తొలి మ్యాచ్‌లోనే అతను 90కి పైగా పరుగులు చేయడం నాకు గుర్తుంది. ఐపీఎల్‌తో అతడికి మంచి అవకాశం లభించింది. ఇకపై కూడా మరింత బాగా ఆడాలి’ అని తేవటియా తొలి కోచ్, భారత మాజీ వికెట్ కీపర్ విజయ్ యాదవ్ వ్యాఖ్యానించాడు. (ఆ ఒక్క బంతి మిస్ చేసినందుకు థాంక్స్: యువీ) జోరు కొనసాగించగలడా.. ఒక్క ఇన్నింగ్స్ తేవటియా స్థాయిని పెంచింది. ఇక అతనిపై కచ్చితంగా అంచనాలు పెరిగిపోతాయి. అదే తరహాలో ప్రతీ మ్యాచ్‌లో రాజస్తాన్ అతడి నుంచి ఇలాంటి ఆటను ఆశిస్తుంది. జట్టు ట్విట్టర్ అకౌంట్లో బయోలో కూడా ‘2020 రాహుల్ తేవటియాలాగా సాగాలని కోరుకుందాం’ అని మార్చింది. అంటే ఆరంభం ఎలా ఉన్నా ముగింపు బాగుండాలనే ఉద్దేశం కావచ్చు కానీ ఇది కూడా తేవటియాపై ఒత్తిడి పెంచుతుంది. అయితే అతను రెగ్యులర్ బ్యాట్స్‌మన్ కాకపోవడం కొంత మేలు చేసే అంశం. అద్భుత బౌలర్ కాకపోయినా చెన్నైతో మ్యాచ్ లో కూడా 3 కీలక వికెట్లతో అతను ఆకట్టుకు న్నాడు. ఐపీఎల్‌కు కావాల్సింది ఇలాంటి ఆట గాళ్లే. టి20ల్లో 155 స్ట్రయిక్ రేట్ ఉండగా... దేశవాళీ వన్డేల్లో కూడా 113 స్ట్రయిక్ రేట్ అంటే అతని దూకుడు ఈ ఒక్క ఇన్నింగ్స్‌కే పరిమితం కాదని అర్థం చేసుకోవచ్చు. – సాక్షి క్రీడా విభాగం -
ఆఖరి ఓవర్లలో... ఆరేశారు
ఈల... గోల... లేని మ్యాచ్‌లో బంతి డీలా పడింది. ఇరు జట్ల బ్యాటింగ్ విధ్వంసం ముందు బౌలింగే మోకరిల్లింది. బంతి తీరాన్ని తాకిన అలల్లా పదే పదే బౌండరీ లైన్‌ను తాకింది. నోరులేకపోయినా... బంతి మాత్రం మైదానం మొత్తం గగ్గోలు పెట్టింది. కింగ్స్ ఓపెనర్లు మయాంక్, రాహుల్ వీరవిహారానికి తెరలేపితే... రాజస్తాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ స్మిత్, సామ్సన్, రాహుల్ తేవటియా విజృంభణతో తెర వేశారు. 224 పరుగుల లక్ష్యం కూడా సిక్సర్ల జాతరలో చిన్నబోయింది. విజయం అసాధ్యమనుకుంటే ఇంకో 3 బంతులు మిగిలుండగానే రాజస్తాన్‌కు సుసాధ్యమైంది. షార్జా: బ్యాట్‌ను బ్యాటే గెలిచింది. విధ్వంసాన్ని విధ్వంసమే జయించింది. కొండంత లక్ష్యం సిక్సర్ల పిడుగులతో కరిగిపోయింది. ఐపీఎల్ టి20 టోర్నీలో రాజస్తాన్ రాయల్స్ అసాధారణ విజయం సాధించింది. ఓపెనర్ స్టీవ్ స్మిత్ (27 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ లక్ష్యానికి పునాది వేయగా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సంజూ సామ్సన్ (42 బంతుల్లో 85; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) గెలుపుదారిన మళ్లించాడు. వీరిద్దరి శ్రమకు రాహుల్ తేవటియా (31 బంతుల్లో 53; 7 సిక్సర్లు) సంచలనాన్ని జతచేశాడు. 224 పరుగుల అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 పరుగుల భారీస్కోరు చేసింది. మయాంక్ అగర్వాల్ (50 బంతుల్లో 106; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు సెంచరీ బాదగా, కెప్టెన్ రాహుల్ (54 బంతుల్లో 69; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేశాడు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. రాజస్తాన్ జట్టులో మిల్లర్, యశస్వి జైస్వాల్ స్థానాల్లో బట్లర్, అంకిత్ రాజ్‌పుత్‌లను తుది జట్టులోకి తీసుకుంది. కింగ్స్ ధనాధన్ 100... రాజస్తాన్ బౌలర్ల పాలిట మయాంక్, లోకేశ్ రాహుల్ బ్యాటింగ్ ‘కింగ్స్’ అయ్యారు. బంతి పడితే... మేం బాదితే... ఇక అంతే! అన్నట్లుగా ఓపెనర్ల విధ్వంసరచన సాగింది. జట్టు స్కోరు 50 పరుగులు చేరేందుకు 27 బంతులే (4.3 ఓవర్లు) అవసరమయ్యాయి. ఇవి వందగా మారేందుకు 53 బంతులే (8.4) సరిపోయాయి. మరో 60 బంతులు (18.5) పడేసరికి ఆ వంద కాస్తా 200 పరుగుల ప్రవాహమైంది. ఈ 20 ఓవర్లలో కేవలం 4 ఓవర్లు మాత్రమే బౌండరీలైను బతికిపోయింది. 16 ఓవర్ల పాటు 31 సార్లు బంతి సిక్స్ లేదంటే ఫోర్‌గా రేఖ దాటింది. రాయల్స్ చేజింగ్... యమ స్పీడ్‌గా ఆడిన స్మిత్ ఔటయ్యాడు. స్పీడ్‌ను కొనసాగించిన సామ్సన్ నిష్క్రమించాడు. క్రీజులో ఉన్న తేవటియా అగచాట్లు పడుతున్నాడు. 17 ఓవర్ల వద్ద రాజస్తాన్ స్కోరు 173/3. మిగిలినవి 18 బంతులే. చేయాల్సినవి 51 పరుగులు. అంటే ఆఖరి 3 ఓవర్లలో 17 పరుగుల చొప్పున చేయాలి. అప్పుడు సాగింది కాట్రెల్ బౌలింగ్... తేవటియా బ్యాటింగ్... 6, 6, 6, 6, 0, 6 లాంగ్‌లెగ్, బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్, లాంగాఫ్, మిడ్ వికెట్, బంతి గ్యాప్ తర్వాత మళ్లీ మిడ్ వికెట్ల మీదుగా మొత్తం 5 సిక్స్‌లు. అంతే సమీకరణం మారింది. రాజస్తాన్ రాయల్స్ విజయం ఫటాఫట్‌గా మారిపోయింది. స్మిత్ మెరుపులతో... ఏ రకంగా చూసినా... 224 పరుగులు అసాధ్యమైన లక్ష్యమే. ఓవర్‌కు 11 పరుగుల పైగా బాదితేనే రాజస్తాన్ గెలుస్తుంది. ఇలాంటి పరిస్థితిలో బట్లర్ (4) చేతులెత్తేయగా... స్మిత్, సామ్సన్తో కలిసి మెరుపు షాట్లతో ఆశలు రేపాడు. అతని జోరుతో రాయల్స్ అచ్చూ కింగ్స్లాగే దూకుడుగా సాగిపోయింది. మయాంక్లాగే స్మిత్ 26 బంతుల్లోనే (7ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేశాడు. కానీ జట్టు స్కోరు 100 పరుగుల వద్ద అతని మెరుపులకు నిషమ్ అడ్డుకట్ట వేయడంతో జోరు తగ్గింది. తేవటియా బంతులు వృథా చేశాడు. మరోవైపు సామ్సన్ చెలరేగడం మొదలు పెట్టడంతో మళ్లీ ఆశలు చిగిరించాయి. కానీ ఇతన్ని షమీ ఔట్ చేయడంతో రాజస్తాన్‌కు లక్ష్యం భారంగా మారి విజయానికి దూరమైంది. ఈ దశలో తేవటియా తన ఆటతో మ్యాచ్తీరే మార్చేశాడు. దాంతో మూడు బంతులు మిగిలి ఉండగానే రాయల్స్ నెగ్గింది. మయాంక్ సూపర్ సెంచరీ అంతకుముందు రాహుల్‌తో పరుగులు మొదలుపెట్టిన మయాంక్ తానెదుర్కొన్న నాలుగో బంతి (1.3 ఓవర్)తో విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. మిడాఫ్‌లో భారీ సిక్సర్ బాదిన ఈ ఓపెనర్ ఇక అక్కడినుంచి వెనుతిరిగి చూసుకోనేలేదు. ఏ బౌలర్ వచ్చిన విడిచి పెట్టలేదు. కుదిరితే ఫోర్, బాగా కుదిరితే సిక్సర్ ఇలా అతని బ్యాటింగ్ కొనసాగింది. మరోవైపు కెప్టెన్ రాహుల్ కూడా ధాటిగా ఆడటంతో ఈ మ్యాచ్ లైవ్ మ్యాచ్‌గా కాకుండా హైలైట్స్‌ను తలపించింది. 26 బంతుల్లో (4 ఫోర్లు, 5 సిక్సర్లు) మయాంక్ ఫిఫ్టీ పూర్తయింది. కొంచెం ఆలస్యమైనా రాహుల్ 35 బంతుల్లో (5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ అధిగమించాడు. అరుపులు లేని చోట వీరిద్దరి మెరుపులు వాటిని భర్తీ చేశారు. ప్రేక్షకులెవరూ ఓవర్ బ్రేక్‌లోనూ చానల్ మార్చే సాహసం చేయలేనంతగా ఈ ఓపెనింగ్ జోడీ ప్రతాపం చూపింది. 45 బంతుల్లోనే (9 ఫోర్లు, 7 సిక్సర్లు) మయాంక్ శతక్కొట్టాడు. ఆ తర్వాతే టామ్ కరన్ అతన్ని ఔట్చేయగలిగాడు. దీంతో 183 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే రాహుల్ ఆట ముగియగా... పూరన్ (8 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లతో) జట్టు స్కోరును 200 పైచిలుకు తీసుకెళ్లాడు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: లోకేశ్ రాహుల్ (సి) గోపాల్ (బి) అంకిత్ రాజ్‌పుత్ 69; మయాంక్ అగర్వాల్ (సి) సంజూ సామ్సన్ (బి) టామ్ కరన్ 106; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 13; పూరన్ (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 223. వికెట్ల పతనం: 1–183, 2–194. బౌలింగ్: జైదేవ్ ఉనాద్కట్ 3–0–30–0, అంకిత్ రాజ్‌పుత్ 4–0–39–1, ఆర్చర్ 4–0–46–0, శ్రేయస్ గోపాల్ 4–0–44–0, రాహుల్ తేవటియా 1–0–19–0, టామ్ కరన్ 4–0–44–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జోస్ బట్లర్ (సి) సర్ఫరాజ్ (బి) కాట్రెల్ 4; స్టీవ్ స్మిత్ (సి) షమీ (బి) నీషమ్ 50; సంజూ సామ్సన్ (సి) రాహుల్ (బి) షమీ 85; రాహుల్ తేవటియా (సి) మయాంక్ అగర్వాల్ (బి) షమీ 53; ఉతప్ప (సి) పూరన్ (బి) షమీ 9; ఆర్చర్ (నాటౌట్) 13; రియాన్ పరాగ్ (బి) మురుగన్ అశ్విన్ 0; టామ్ కరన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 226. వికెట్ల పతనం: 1–19, 2–100, 3–161, 4–203, 5–222, 6–222. బౌలింగ్: కాట్రెల్ 3–0–52–1, షమీ 4–0–53–3, రవి బిష్ణోయ్ 4–0–34–0, నీషమ్ 4–0–40–1, మురుగన్ అశ్విన్ 1.3–0–16–1, మ్యాక్స్‌వెల్ 3–0–29–0. -
రాహుల్ మైండ్‌బ్లాక్ ఇన్నింగ్స్
పంజాబ్ కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ లోకేశ్ రాహుల్ మైండ్‌బ్లాక్ ఇన్నింగ్స్ ఆడాడు. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ భారత ఆటగాడికి సాధ్యం కానీ అత్యధిక స్కోరును ఆవిష్కరించాడు. అతని జోరుకు సిక్స్‌లు, ఫోర్లు బౌండరీ లైను తాకేందుకు పదేపదే పోటీపడ్డాయి. అతని దెబ్బకు బెంగళూరు బౌలింగ్ విలవిల్లాడింది. తర్వాత కొండంత లక్ష్యఛేదనలో గోరంత స్కోరుకే ఆర్సీబీ టాప్ లేచింది. చివరకు కనీసం రాహుల్ స్కోరుకు చేరువగా కూడా రాలేక చేతులెత్తేసింది. దుబాయ్: తొలి మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెండో మ్యాచ్‌లో భారీ విజయంతో సత్తా చాటింది. గురువారం జరిగిన పోరులో పంజాబ్ 97 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయం సాధించింది. ముందుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లోకేశ్ రాహుల్ (69 బంతుల్లో 132 నాటౌట్; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 17 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. ప్రవాహంలా సాగి... ఇన్నింగ్స్‌లో సగానికి పైగా బంతులు (69) ఎదుర్కొన్న రాహుల్ చివరి వరకు నిలబడి పరుగుల వరద పారించాడు. తొలి ఓవర్లో ఫైన్ లెగ్‌లో మొదలైన బౌండరీల ప్రవాహం అదే రీతిలో కొనసాగింది. ఉమేశ్ వేసిన పదో ఓవర్లో రాహుల్ డీప్ ఎక్స్ట్రా కవర్లో సిక్స్, ఫైన్‌లెగ్‌లో ఫోర్ కొట్టాడు. 12వ ఓవర్లో అతని అర్ధసెంచరీ (36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) పూర్తికాగా, జట్టు 100 పరుగులకు చేరింది. ఇక సిక్సర్లయితే అన్ని ‘తార’తీరం చేరినవే! పవర్ ప్లేలో కింగ్స్ ఎలెవన్ సరిగ్గా 50 పరుగులు చేసింది. ఓవర్‌కు సగటున 8 పరుగుల రన్‌రేట్‌తో పంజాబ్ దూసుకెళ్లింది. పేసర్లను పక్కనబెట్టిన బెంగళూరు సారథి కోహ్లి బంతిని స్పిన్నర్ చహల్‌కు అప్పగించగా... చహల్ గూగ్లీకి మయాంక్ (20 బంతుల్లో 26; 4 ఫోర్లు) క్లీన్‌బౌల్డయ్యాడు. 57 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది. శివమ్ దూబే వరుస ఓవర్లలో పూరన్ (17), మ్యాక్స్‌వెల్ (5)ను అవుట్ చేసినా...ఏ ఒక్కరు రాహుల్ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయారు. వెటరన్ పేసర్ స్టెయిన్, సీనియర్ పేసర్లను లెక్క చేయకుండా రాహుల్ విధ్వంసం అజేయంగా సాగింది. 62 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కవర్, డీప్ మిడ్ వికెట్, లాంగాన్, లాంగాఫ్ ఇలా మైదానమంతా అతను విరుచుకుపడ్డాడు. స్టెయిన్ 19వ ఓవర్లో 6, 4, 0, 6, 6, 4లతో ఐదుసార్లు బంతిని ఫీల్డర్లకు అందకుండా బాదేసి 26 పరుగులు పిండుకున్నాడు. దూబే వేసిన ఆఖరి ఓవర్లోనూ రాహుల్ వరుసగా ఫోర్, రెండు సిక్స్‌లు (4, 6, 6) కొట్టాడు. దీంతో ఆఖరి 9 బంతుల్లోనే అతని విధ్వంసం 42 పరుగుల్ని తెచ్చిపెట్టాయి. 16 బంతులకే... భారీ లక్ష్యం ముందుంటే బెంగళూరు బాధ్యతే మరిచింది. మొదటి 16 బంతులకే పరాజయానికి బాటలు వేసుకుంది. తొలి ఓవర్లో పడిక్కల్ (1), రెండో ఓవర్లోనే ఫిలిప్ (0), మూడో ఓవర్లో స్టార్ బ్యాట్స్‌మన్ కోహ్లి (1) ఔటయ్యారు. కాట్రెల్ దెబ్బకు 4 పరుగులకే 3 టాప్ వికెట్లను కోల్పోవడంతో ఆర్సీబీ పరాజయం వైపు మళ్లింది. రవి బిష్ణోయ్ అద్భుతమైన డెలివరీకి ఫించ్ (21 బంతుల్లో 20; 3 ఫోర్లు) బౌల్డ్ కాగా, ఆపై డివిలియర్స్ (18 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) వల్లా కాలేదు. ఆ తర్వాత సుందర్ మినహా... అంతా విఫలం కావడంతో బౌలర్లకు 20 ఓవర్లు వేసే శ్రమ తప్పింది. అవతలివైపు రాహు ల్ ఒక్కడే 14 ఫోర్లు కొడితే ఇక్కడ మాత్రం అంతాకలిసి కొట్టిన ఫోర్లు (10), సిక్స్‌లు (3) కూడా ఆ సంఖ్యను చేరలేకపోయాయి. 1 ఐపీఎల్లో భారత ఆటగాడు నమోదు చేసిన అత్యధిక స్కోరు (132 నాటౌట్) ఇదే. గతంలో రిషభ్ పంత్ (128 నాటౌట్) పేరిట ఈ ఘనత ఉంది. లీగ్‌లో కెప్టెన్‌గా అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా కూడా రాహుల్ నిలిచాడు. ఇంతకు ముందు వార్నర్ 126 పరుగులు చేశాడు. కోహ్లి మిస్సింగ్స్ మైదానంలో పాదరసంలా కదిలే ఆర్సీబీ కెప్టెన్ కోహ్లి మిస్ ఫీల్డింగ్ విస్మయపరిచింది. ఈ చురుకైన ఫీల్డర్ ... వరుస ఓవర్లలో రాహుల్ ఇచ్చిన రెండు సులువైన క్యాచ్‌లను నేలపాలు చేశాడు. స్టెయిన్ బౌలింగ్‌లో 83 పరుగుల వద్ద రాహుల్ డీప్ మిడ్వికెట్లో కొట్టిన షాట్‌ను ఓ సారి, సైని బౌలింగ్‌లో 89 పరుగుల వద్ద లాంగాఫ్‌లో మరోసారి క్యాచ్‌ల్ని చేజార్చాడు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (నాటౌట్) 132; మయాంక్ (బి) చహల్ 26; పూరన్ (సి) డివిలియర్స్ (బి) దూబే 17; మ్యాక్స్‌వెల్ (సి) ఫించ్ (బి) దూబే 5; కరుణ్ నాయర్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–57, 2–114, 3–128. బౌలింగ్: ఉమేశ్ 3–0–35–0, స్టెయిన్ 4–0–57–0, సైనీ 4–0–37–0, చహల్ 4–0–25–1, సుందర్ 2–0–13–0, దూబే 3–0–33–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: పడిక్కల్ (సి) రవి (బి) కాట్రెల్ 1; ఫించ్ (బి) రవి 20; ఫిలిప్ (ఎల్బీ) (బి) షమీ 0; కోహ్లి (సి) రవి (బి) కాట్రెల్ 1; డివిలియర్స్ (సి) సర్ఫరాజ్ (బి) మురుగన్ అశ్విన్ 28; సుందర్ (సి) మయాంక్ (బి) రవి 30; దూబే (బి) మ్యాక్స్‌వెల్ 12; ఉమేశ్ (బి) రవి 0; సైనీ (బి) మురుగన్ అశ్విన్ 6; స్టెయిన్ (నాటౌట్) 1; చహల్ (ఎల్బీ) (బి) మురుగన్ అశ్విన్ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (17 ఓవర్లలో ఆలౌట్) 109. వికెట్ల పతనం: 1–2, 2–3, 3–4, 4–53, 5–57, 6–83, 7–88, 8–101, 9–106, 10–109. బౌలింగ్: కాట్రెల్ 3–0–17–2, షమీ 3–0–14–1, బిష్ణోయ్ 4–0–32–3, మురుగన్ అశ్విన్ 3–0–21–3, నీషమ్ 2–0–13–0, మ్యాక్స్‌వెల్ 2–0–10–1. -
‘ఒక్క పరుగు’ విలువెంత...
దుబాయ్: ఐపీఎల్–2020లో రెండో రోజే వివాదానికి తెర లేచింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైరింగ్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంపైర్ ప్రకటించిన ‘షార్ట్ రన్’ను నిరసిస్తూ రిఫరీ జవగల్ శ్రీనాథ్‌కు తాము అధికారికంగా ఫిర్యాదు చేశామని పంజాబ్ జట్టు సీఈఓ సతీశ్ మీనన్ వెల్లడించారు. ఈ పొరపాటు ప్రభావం తమ ప్లే ఆఫ్ అవకాశాలపై కూడా పడవచ్చని కూడా ఇందులో పేర్కొంది. ఏం జరిగింది... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్‌లో రబడ వేసిన 19వ ఓవర్ మూడో బంతిని మయాంక్ లాంగాన్ దిశగా ఆడగా ఇద్దరు బ్యాట్స్‌మెన్ రెండు పరుగులు తీశారు. అయితే తొలి పరుగును జోర్డాన్ సరిగా పూర్తి చేయకుండా, క్రీజ్‌లో బ్యాట్ ఉంచకుండానే వెనుదిరిగాడంటూ స్క్వేర్ లెగ్ అంపైర్ నితిన్ మీనన్ ఒకటే పరుగు ఇచ్చాడు. మ్యాచ్ చివరకు సూపర్ ఓవర్ వరకు వెళ్లడంతో ఈ ఒక్క పరుగు విషయంలో వివాదం రాజుకుంది. టీవీ రీప్లే చూడగా అంపైర్‌దే తప్పని తేలింది. జోర్డాన్ సరైన రీతిలోనే తన బ్యాట్‌ను పూర్తిగా క్రీజ్‌లో ఉంచడం స్పష్టంగా కనిపించింది. దాంతో కింగ్స్ ఎలెవన్ తీవ్ర అసహనానికి గురైంది. ఈ పరుగు ఇచ్చి ఉంటే తాము ముందే గెలిచేవారమని పంజాబ్ భావించింది. నిజంగానే నితిన్‌కు సందేహం ఉంటే థర్డ్ అంపైర్‌కు నివేదించాల్సిందని ఆ జట్టు అభిప్రాయ పడింది. ‘కరోనా సమయంలో ఎంతో ఉత్సాహంగా ఇక్కడకు వచ్చాను. ఆరు రోజులు క్వారంటైన్లో ఉండి 5 కరోనా టెస్టులు చేయించుకున్నా. కానీ షార్ట్ రన్ నన్ను తీవ్రంగా బాధించింది. సాంకేతికత అందుబాటులో ఉండి కూడా ఉపయోగించుకోవడంలో అర్థమేముంది. బీసీసీఐ నిబంధనలు మార్చాలి’ అంటూ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా వ్యాఖ్యానించింది. నిబంధనలు ఏం చెబుతున్నాయి... టీవీ రీప్లే చూడగా జోర్డాన్ పరుగు పూర్తి చేసినట్లు కనిపించింది. దాంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మూడో అంపైర్ సహాయం తీసుకోవాల్సిందని మాజీ క్రికెటర్లంతా వ్యాఖ్యానించారు. అయితే ఐసీసీ, ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఆటగాడు అవుటైన సమయంలో లేదా బౌండరీ గురించి ఏదైనా సందేహం ఉంటే తప్ప ఇతర అంశాల్లో మూడో అంపైర్‌ను ఫీల్డ్ అంపైర్ సంప్రదించాల్సిన అవసరం లేదు. పైగా ఫీల్డ్ అంపైర్ అడగకుండా థర్డ్ అంపైర్ జోక్యం చేసుకోరాదు. ఇలా చూస్తే మూడో అంపైర్ ద్వారా షార్ట్ రన్ తేల్చాలన్న మాటే ఉదయించదు. అంపైర్‌ను తప్పు పట్టవచ్చా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ స్టొయినిస్‌కు కాదు అంపైర్ నితిన్ మీనన్‌కు ఇవ్వాల్సింది’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ వ్యంగ్య వ్యాఖ్యతో అంపైర్‌పై విరుచుకు పడ్డాడు. నితిన్ తన అంపైరింగ్ విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నానని అనిపించుకునే విధంగా కొంత అత్యుత్సాహం చూపిన మాట వాస్తవమే కానీ... అంపైర్లు తప్పులు చేయడం ఇదే మొదటిసారి కాదు. మానవమాత్రులు కాబట్టి పొరపాట్లు చేయడం సహజం. ఎంత బాగా పని చేసినా వారు చాలా సందర్భాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మ్యాచ్ తర్వాత పంజాబ్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ కూడా అంపైర్‌తో వాదించడం కనిపించింది. గత కొన్నేళ్లుగా నితిన్ మీనన్ రికార్డు చాలా బాగుంది. అందుకే 36 ఏళ్ల వయసులోనే ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో కూడా అవకాశం దక్కింది. నిజానికి మీనన్ నిలబడిన కోణం నుంచి చూస్తే అది షార్ట్ రన్‌గా కనిపించింది. సాధారణంగా స్క్వేర్ లెగ్ అంపైర్లు లైన్ నుంచి నేరుగా నిలబడతారు. కానీ నోబాల్స్‌ను కూడా థర్డ్ అంపైర్లే చూస్తున్న నేపథ్యంలో టీవీ కెమెరాలకు అడ్డు రాకుండా ప్రసారకర్తలే అంపైర్‌ను కాస్త పక్కగా నిలబడమని చెప్పినట్లు సమాచారం. చివరగా... మ్యాచ్‌లో ఫలితం సూపర్ ఓవర్‌కు వరకు వెళ్లకుండా గెలుపు తేడా ఏ 30 పరుగులో, 5 వికెట్లో ఉంటే ఇంత రచ్చ జరగకపోయేదనేది వాస్తవం. ఈ ఘటనపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏ ప్రమాణాల ప్రకారం చూసుకున్నా 3 బంతుల్లో 1 పరుగు చేయడం ఎంతో సులభమని, అది చేయకుండా పంజాబ్ అనవసర విమర్శలకు దిగిందని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. -
అది నన్ను తీవ్రంగా దెబ్బతీసింది: ప్రీతి జింటా
దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ అసలైన ఐపీఎల్ మజా ఏంటో రుచి చూపించింది. సూపర్ ఓవర్‌దాకా వెళ్లిన మ్యాచ్‌లో రబాడా అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మయాంక్ అగర్వాల్(89) అసాధారణ ఇన్నింగ్స్‌తో 20 ఓవర్లలో 8 వికెట్లకు 157రన్స్ చేయడంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు రబాడ వేసిన మొదటి బంతికి రెండు పరుగులు రాబట్టింది. రెండో బంతికి కేఎల్ రాహుల్, మూడో బంతికి పూరన్ ఔట్ కావడంతో పంజాబ్ కథ ముగిసింది. 3 పరుగుల లక్ష్యంతో సూపర్ ఓవర్ బరిలోకి దిగిన ఢిల్లీ సునాయాసంగా ఛేదించి సూపర్ విక్టరీ అందుకుంది. (ఢిల్లీని బోణీ కొట్టించిన రబడ) అయితే పంజాబ్ చేజింగ్ చేస్తున్న సమయంలో 19వ ఓవర్లో ఫీల్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పడు సోషల్ మీడియాలో వివాదాస్పదమైంది. రబాడా వేసిన 19వ ఓవర్లో మూడవ బంతిని ఎక్స్ట్రా కవర్‌వైపు ఆడి రెండు పరుగులు తీశారు. అయితే ఆన్ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వాటిలో మొదటి పరుగు షార్ట్ రన్‌గా నిర్ణయించాడు. టీవీ రీప్లేలో మాత్రం పరుగును పూర్తి చేసినట్టే కనిపించింది. దీంతో మీనన్ నిర్ణయంపై పంజాబ్ యజమాని ప్రీతిజింటా అది సరైన నిర్ణయం కాదంటూ ఫైర్ అయ్యింది. (రైజింగ్‌కు వేళాయె...) ఈ మేరకు ఆమె తన ట్విటర్ ఖాతాలో.. 'నేను కరోనా మహమ్మారిని సంతోషంగా జయించాను. 6 రోజుల హోం క్వారంటైన్, 5 కోవిడ్ పరీక్షలు చిరునవ్వుతో పూర్తి చేసుకున్నాను. కానీ ఒక షార్ట్ రన్ నన్ను తీవ్రంగా దెబ్బతీసింది. టెక్నాలజీని ఉపయోగించుకోకపోతే దాని ప్రయోజనం ఏమిటి..?. బీసీసీఐ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాల్సిన సమయం ఇది. ఇలా ప్రతి సంవత్సరం జరగదు' అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో.. 'నేను ఎప్పుడూ ఆటలో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తాను. అయితే ఆటలో మరిన్ని మార్పులు, నిబంధనలు కూడా చాలా ముఖ్యం. జరిగిపోయిన విషయాలను వదిలేసి భవిష్యత్‌లో అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతూ సానుకూల థృక్పథంతో ముందుకు సాగాలి' అంటూ ట్వీట్ చేసింది. -
'ఐపీఎల్ నా దూకుడును మరింత పెంచనుంది'
దుబాయ్ : షెల్డాన్ కాట్రెల్... ఈ వెస్టిండీస్ పేసర్ గురించి మాట్లాడితే ముందుగా అతని చేసే సెల్యూటే గుర్తుకు వస్తుంది. వికెట్ తీసిన ఎక్కువ సందర్భాల్లో కాట్రెల్ సెల్యూట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటాడు. 2019 ప్రపంచకప్ సందర్భంగా విండీస్ తరపున 12 వికెట్లు పడగొట్టిన కాట్రెల్ .. ఆ జట్టులోనే ఉన్న కీమర్ రోచ్, జేసన్ హోల్డర్, ఓషోన్ థామస్‌లను మించి యువ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు.ముఖ్యంగా భారత్‌లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో కాట్రెల్ టీమిండియా ఆటగాడి వికెట్ తీసిన ప్రతీసారి సెల్యూట్ చేస్తూ భారత అభిమానుల ఆకట్టుకున్నాడు. అందుకేనేమో గతేడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ. 8.50 కోట్లకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కొనుగోలు చేసి కాట్రెల్‌కు ఘనంగా సెల్యూట్ చేసింది. సాధారణంగానే విండీస్ బౌలర్లు ఏ చిన్న ఆనందాన్నైనా తమ హావభావాలతో అభిమానులను కొల్లగొడుతుంటారు. డ్వేన్ బ్రోవో, డారెన్ సామి ఈ కోవకు చెందినవారే. గతంలో ఐపీఎల్లో వీరు చేసిన హంగామా మూములుగా ఉండేది కాదు. ఇక ఇప్పుడు కాట్రెల్ వంతు వచ్చింది.. ఇప్పటివరకు కరీబియన్ ప్రీమియర్ లీగ్‌కు మాత్రమే ఆడిన కాట్రెల్ కింగ్స్ తరపున ఐపీఎల్లో ఎంత ఎంజాయ్మెంట్ ఇవ్వనున్నాడో చూడాలి. తాజాగా నిర్వహించిన ఇంటర్య్వూలో 31 ఏళ్ల షెల్డన్ కాట్రెల్ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. (చదవండి : ఆర్సీబీలో కోహ్లి, డివిలియర్స్ ఫేవరెట్ కాదు') ఇదే మీకు మొదటి ఐపీఎల్.. మరి దీన్ని ఎలా ఆస్వాధిస్తారు ? ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న.. క్రికెట్ చరిత్రలోనే అత్యధిక ప్రజాధరణ పొందిన ఐపీఎల్లో పాల్గొనబోతున్నందుకు సంతోషంగా ఉన్నా. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ ఆధ్వర్యంలో మహ్మద్ షమీ, క్రిస్ జోర్డాన్‌తో కలిసి బౌలింగ్ పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నా. కరీబియన్ లీగ్‌కు.. ఐపీఎల్‌కు చాలా తేడా ఉంటుంది. దీనికి అభిమానులు ఎక్కువగా ఉంటారు.. మనమేంటనేది నిరూపించుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంది. అని తెలిపాడు. కింగ్స్ జట్టులోనే ఉన్న గేల్, నికోలస్‌తో మీ అనుబంధం ఎలా ఉంటుంది.. వారి నుంచి ఏమైనా సలహాలు పొందారా? నా సహచరులైన క్రిస్ గేల్, నికోలస్ పూరన్‌లు కింగ్స్‌లో ఉండడం కొంచెం ధైర్యమే అని చెప్పొచ్చు. అయితే గేల్‌తో ఎక్కువగా మాట్లాడే అవకాశం రాలేదుగానీ.. అతను చాలా కూల్‌గా ఉంటాడు. వీలైనప్పుడు గేల్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తా. నికోలస్ పూరన్‌తో మాత్రం పలు క్రికెట్ అంశాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడుకుంటాం. ఈసారి ఐపీఎల్లో లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్లు ఎక్కువగా లేకపోవడం మీకు కలిసి వస్తుందనుకుంటున్నారా? ఆ విషయం గురించి నేను చెప్పలేను.. ఎందుకంటే క్రికెట్లో అలాంటి మాటలకు తావు ఉండదు. ఆటలో వివిధ రకాల బౌలర్లు ఉంటారు. ఆరోజు ఎవరు రాణించారు అనే దానిపైనే మ్యాచ్ ఆధారపడి ఉంటుంది. ఒక బ్యాట్స్ మాన్ సాధారణంగా తన కెరీర్లో 80-85 శాతం కుడిచేతి వాటం బౌలర్‌నే ఎదుర్కొంటాడు. ఎడమచేతి వాటం కారణంగా బ్యాట్స్‌మెన్‌కు నా బౌలింగ్ ఇబ్బందిగానే ఉంటుందని అనుకుంటున్నా. టీ20లో విజయవంతమైన బౌలర్‌గా పేరున్న క్రిస్ జోర్డాన్ వల్ల మీకు అవకాశాలు వస్తాయనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. క్రిస్ జోర్డాన్ అద్భుతమైన బౌలర్.. అలాగే మహ్మద్ షమీ కూడా గొప్ప ఆటగాడే.. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించే ఆలోచిస్తున్నా. ఇక జట్టులో అవకాశం వస్తుందా అనేది నా చేతుల్లో ఉండదు.ఒకవేళ అవకాశం వస్తే మాత్రం 120 శాతం కష్టపడతా. ఐపీఎల్లో మీ సెల్యూట్స్ చూసే అవకాశం ఉంటుందా? నేను ఫేమస్ అయ్యందే సెల్యూట్ ద్వారా.. ఈ ఐపీఎల్లో కూడా నా సెల్యూట్స్ ఉంటాయి. అభిమానులను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. అయితే సెల్యూట్ అనేది మాకు వంశపారపర్యంగా వస్తుంది. దీనిని వదులుకోనూ. అంతేగాక క్రికెట్ అంటే సీరియస్‌నెస్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. మీకు తప్పనిసరిగా నా సెల్యూట్ చూసే అవకాశం ఉంటుంది. -
'చిట్టితల్లి నిన్ను చాలా మిస్సవుతున్నా'
దుబాయ్ : టీమిండియా ఆటగాడు మహ్మద్ షమీ తన గారాల పట్టి ఐరాను చాలా మిస్సవుతన్నా అంటూ ఎమోషనల్‌గా పేర్కొన్నాడు. ఐపీఎల్ 13వ సీజన్లో ఆడేందుకు ప్రస్తుతం షమీ దుబాయ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మహ్మద్ షమీ ప్రస్తుతం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. శనివారం ప్రాక్టీస్ అనంతరం పీటీఐతో జరిగిన ఇంటర్వ్యూలో షమీ తన కూతురు ఐరాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. (చదవండి : వచ్చీ రాగానే.. 'క్లీన్ బౌల్ట్') షమీ మాట్లాడుతూ.. ' చిట్టితల్లి చాలా మిస్సవుతున్నా.. లాక్డౌన్ సమయం నుంచే నా కూతురును ఒక్కసారి కూడా చూడలేకపోయా.. నా కళ్ల ముందే ఎదుగుతున్న ఐరాను ఒకసారి చూడాలనిపిస్తుంది. ఐపీఎల్ ఆడేందుకు దుబాయ్‌కు రావడంతో మరో రెండునెలల పాటు ఐరాను చూసే అవకాశం లేదు. నా భార్య హసీన్ జహాన్ కూతురుతో వేరుగా ఉంటుంది. లాక్డౌన్ సమయంలో ఎక్కువగా ఇంట్లోనే గడిపాను.. రోజు ప్రాక్టీస్ చేసిన తర్వాత వీలైనప్పుడల్లా ఐరాతో ఫోన్లో మాట్లాడేవాడిని. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే నాలుగు నెలల విరామం తర్వాత గ్రౌండ్లోకి అడుగుపెట్టి ప్రాక్టీస్ చేయడం కొంచెం కొత్తగా అనిపిస్తుంది.జట్టులో ఇప్పుడిప్పుడే ఆటగాళ్లంతా మ్యాచ్‌లు ఆడేందుకు ప్రాక్టీస్‌లో నిమగ్నమవుతున్నారు. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు పెద్ద కొత్తగా ఏం అనిపించలేదు. ఎందుకంటే లాక్డౌన్ సమయంలో ఇంట్లోనేమూడు గంటలపాటు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఈసారి ఐపీఎల్లో మా జట్టు కచ్చితంగా కప్ కొడుతుంది. అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్నాయి. తమ చప్పట్లతో మమ్మల్ని ఎంకరేజ్ చేసే అభిమానుల్ని మిస్ అవుతున్నాం. కానీ ఈసారి టీవీల ద్వారా వీక్షించే అభిమానులకు మా ఆటతో ఉత్సాహపరుస్తాం' అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి : ‘ఐపీఎల్ 2020 విజేత ఎవరో చెప్పేశాడు’) ఇక ఐపీఎల్ కెరీర్లో 51 మ్యాచ్‌లాడి 40 వికెట్లు తీశాడు. కాగా షమీ భార్య హసీన్ జహాన్ అతడిపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అక్రమ సంబంధాలు కలిగి ఉండటంతో పాటు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం తన కూతురితో కలిసి వేరుగా జీవిస్తోంది. -
కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై నమ్మకం ఉంది
దుబాయ్ : ఐపీఎల్ 2020లో కేఎల్ రాహుల్‌కు కెప్టెన్‌గా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను సమర్థంగా నడిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆ జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. 2019లో పంజాబ్ జట్టును నడిపించిన రవిచంద్రన్ అశ్విన్ గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. దీంతో కింగ్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. సెస్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్‌కు ఇప్పటికే కింగ్స్ ఎలెవెన్ తన ప్రాక్టీస్‌ను కూడా ఆరంభించింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై తనకు అపారమైన నమ్మకముందని..టీమిండియాకు ఆడిన అనుభవం అతన్ని కెప్టెన్ అయ్యేలా చేసిందని అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. కుంబ్లే వీడియోను కింగ్స్ పంజాబ్ తన ట్విటర్లో షేర్ చేసింది. 'కేఎల్ రాహుల్ ప్రశాంతంగా ఉంటాడు.. ఆటలో ఎంతో నేర్పును ప్రదర్శిస్తాడు. చాలా రోజుల నుంచే రాహుల్ అతి దగ్గరినుంచి గమనిస్తూ వచ్చాను. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవంతో పాటు కొన్ని సంవత్సరాలుగా అతను కింగ్స్ జట్టుతో పాటే కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గా అతనికి ఇది ఎంతో లాభదాయకం. కింగ్స్ జట్టుకు సంబంధించి బలాలు, బలహీనతలు రాహుల్‌కు ఈ పాటికే అర్థమయిఉంటాయి. అందుకే కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా తన వంతు పాత్రను సమర్థంగా పోషించగలడు. ఈసారి లీగ్ దుబాయ్‌లో జరుగుతుండడం కొంత ఇబ్బందే అయినా.. జట్టుగా మాత్రం బ్యాలెన్సింగ్‌తో ఉంది. సీనియర్లు, జూనియర్లతో కలిసి జట్టు సమతూకంగా ఉంది. ఈసారి మా జట్టుపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఒక కోచ్‌గా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాననే నమ్మకం నాకు ఉంది.' అంటూ కుంబ్లే చెప్పుకొచ్చాడు. కాగా కుంబ్లే గతేడాది అక్టోబర్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ప్రధాన కోచ్‌గా ఎంపిక అయ్యాడు. చదవండి : మంజ్రేకర్‌కు బీసీసీఐ షాక్ చిన్నప్పుడు ఏమైనా స్ప్రింగులు మింగాడా