గేల్‌ సునామీ జాగ్రత్త.. సన్‌రైజర్స్‌ | Sunrisers Hyderabad Beware Of The Gaylestorm | Sakshi
Sakshi News home page

Apr 16 2018 3:20 PM | Updated on Apr 16 2018 3:21 PM

Sunrisers Hyderabad Beware Of The Gaylestorm - Sakshi

క్రిస్‌గేల్‌

మొహాలీ : రాక రాక వచ్చిన అవకాశం అనుకున్నాడో ఏమో కానీ తన విశ్వరూపాన్నీ చూపించాడు.. వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జి‘గేల్‌’మన్నాడు. ప్రతి బంతిని బౌండరికి తరలించడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు పరుగుల సునామీ సృష్టించాడు. దీంతో పంజాబ్‌ బలమైన చెన్నై జట్టుపై 4 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లాడిన పంజాబ్‌ బెంగళూరు చేతిలో ఓడి ఢిల్లీ, చెన్నైలపై గెలిచింది. అయితే తదుపరి మ్యాచ్‌ లీగ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఏప్రిల్‌19న (గురువారం)  తలపడనుంది. సొంతమైదానంలో మ్యాచ్‌ జరగడం పంజాబ్‌ కలిసొచ్చె అంశం కాగా.. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్ ఫామ్‌లోకి రావడం ఆజట్టుకు మరింత బలాన్నిచ్చింది. ఈనేపథ్యంలో సన్‌రైజర్స్‌ జట్టుకు పంజాబ్‌ తమ అధికార ట్విటర్‌ వేదికగా సవాల్‌ విసిరింది.

‘సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గేల్‌సునామీ జాగ్రత్త..’ అంటూ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌పై హైదరాబాద్‌ అభిమానులు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘సన్‌రైజర్స్‌లో వరల్డ్‌క్లాస్‌ బౌలర్స్‌ రషీద్‌ఖాన్‌, భువనేశ్వర్లున్నారు.. వారితో జాగ్రత్త..’ పంజాబ్‌ అంటూ ఒకరు బుదులివ్వగా.. హాహాహా.. పెద్ద జోక్‌ అంటూ తేలికగా మరొకరు కొట్టిపారేశారు. గేల్‌కు సన్‌రైజర్స్‌తో అంత సీన్‌లేదని, డకౌట్‌ పక్కా అని ఇంకొకరు కామెంట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement