కోహ్లి జట్టుపై విమర్శల వెల్లువ | Netizens Troll RCB After Chris Gayle Century | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 20 2018 7:06 PM | Last Updated on Fri, Apr 20 2018 7:09 PM

Netizens Troll RCB After Chris Gayle Century - Sakshi

విరాట్‌ కోహ్లి, డివిలియర్స్‌ (ఫైల్‌ ఫొటో)

హైదరాబాద్‌ : ‘పుండు మీద కారం చల్లినట్లుంది’ ఐపీఎల్‌-11 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పరిస్థితి. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న ఈ జట్టుకు క్రిస్‌గేల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ తలనొప్పిగా మారింది. గత సీజన్‌కు వరకు బెంగళూరుకే ఆడిన గేల్‌ను ఈ సీజన్‌లో సదరు ఫ్రాంచైజీ వదులుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడిదే ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారింది. ఈ సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్‌ ఆడిన రెండు మ్యాచుల్లో ఒంటి చెత్తో ఆ జట్టును గెలిపించాడు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ అభిమానులు ఆర్సీబీని దెప్పిపొడుస్తున్నారు.

ఇక గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో యూనివర్సల్‌ బాస్‌ సెంచరీతో రెచ్చిపోవడం.. అభిమానులు ఆగ్రహం కట్టలు తెంచుకునెలా చేసింది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా ఆర్సీబీ యాజమాన్యాన్ని, జట్టును నిలదీస్తున్నారు. క్రిస్‌గేల్‌ను కాదని, సర్ఫరాజ్‌ ఖాన్‌, మెక్‌కల్లమ్‌లను తీసుకున్నారు.. వారేమో ఆడడటం లేదని ఒకరంటే.. ‘మీరు ఏడుస్తునే ఉండండి..నేను నవ్వుతూనే ఉంటా’ అని గేల్‌ అన్నట్లు మరోకరు ఫొటో షాప్‌ నైపుణ్యంతో ట్రోల్‌ చేస్తున్నారు. ఆర్సీబీ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఆటగాడు..గేల్‌, రాహుల్‌, వాట్సన్‌లు రాణిస్తున్నారని ఇంకొకరు ఎద్దేవా చేశారు. ఇక ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒక మ్యాచ్‌ గెలిచి మూడు ఓడిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement