క్రిస్‌గేల్ (ఫైల్ ఫొటో)
బెంగళూరు : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇక తొలి మ్యాచ్‌లో ఓడిన బెంగళూరు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి విజయాల ఖాతా తెరవాలని భావిస్తుండగా.. తొలి మ్యాచ్‌లో అద్బుత విజయం సొంతం చేసుకున్న కింగ్స్ పంజాబ్ అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లురుతోంది.
ఇక కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్, కరుణ్‌నాయర్ సొంత గడ్డపై విజృంభిస్తారని అటు పంజాబ్ అభిమానులు ఇటు బెంగళూరు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ యువ ఆటగాళ్లు తొలి మ్యాచ్‌లో అర్థశతకంతో మెరిసిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌కు ఎలాంటి మార్పుల్లేకుండా బెంగళూరు బరిలోకి దిగుతుండగా.. పంజాబ్ మాత్రం మిల్లర్ స్థానంలో ఆరోన్ ఫించ్‌ను తీసుకుంది. ఇక విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యాడు.
తుది జట్లు
ఆర్సీబీ : క్వింటన్ డికాక్, బ్రెండన్ మెక్‌కల్లమ్, విరాట్ కోహ్లి (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, సర్ఫరాజ్ ఖాన్, మన్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుంధర్, క్రిస్ వోక్స్, కుల్వంత్, ఉమేశ్ యాదవ్, చాహల్
పంజాబ్ : కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, యువరాజ్ సింగ్, మార్కస్ స్టోయినీస్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), ఆండ్రూ టై, మోహిత్ శర్మ, రెహ్మాన్, ఆరోన్ ఫించ్
Comments
Please login to add a commentAdd a comment