![Chris Gayle Says Put Some Respect On The Name On My Bat - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/16/Gayle.gif.webp?itok=Cd0auHLI)
క్రిస్ గేల్(కర్టసీ : ఐపీఎల్/బీసీసీఐ)
షార్జా : విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్.. యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఐపీఎల్ 13వ సీజన్‌లో తన ఆటను ఆరంభించాడు. గురువారం ఆర్‌సీబీతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఆఖరి బంతికి విజయం సాధించి లీగ్‌లో కీలక విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో బరిలోకి దిగిన గేల్ 54 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన గేల్ ఈ సీజన్‌ను ఘనంగా ఆరంభించాడు. గేల్ మ్యాచ్ ఆడుతున్నాడంటే అక్కడ ఉండే సరదా వేరుగా ఉంటుంది. తాను చేసే అల్లరితో గ్రౌండ్ కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లోకి మారిపోతుంది. (చదవండి : ఉత్కంఠ పోరు.. చివరి బంతికి గెలిచారు)
తాజాగా కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌లో గేల్ తన అర్థసెంచరీ పూర్తి చేశాక ఒక సన్నివేశం చోటుచేసుకుంది. ఫిప్టీ పూర్తయిన తర్వాత బ్యాట్ పైకెత్తిన గేల్ బ్యాట్‌పై ఉన్న స్టిక్కర్‌ను చూపించాడు. ఆ స్టిక్కర్‌పై ది బాస్ అని రాసి ఉంది. బ్యాట్‌పై ఉన్న స్టిక్కర్ ద్వారా గేల్ ఒక మెసేజ్‌ను పాస్ చేశాడు. ' అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. నేను చూపించే ఈ పేరుకు కొంచెం గౌరవం ఇవ్వండి' అంటూ పేర్కొన్నాడు. కాగా గేల్ చేసిన పనిపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఎన్డీటీవికి ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రస్తావించాడు.(చదవండి : కెప్టెన్సీకి దినేశ్ కార్తీక్ గుడ్ బై)
When he is on the mic, expect nothing less than entertainment and laughs 😅😅#Dream11IPL | @henrygayle pic.twitter.com/I62YPN1pES
— IndianPremierLeague (@IPL) October 15, 2020
గేల్ ఒక మంచి గుణం కలిగిన ఆటగాడని.. క్రికెట్‌లో గొప్పగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే ఆటగాళ్లలో అతను ముందు వరుసలో ఉంటాడని కొనియాడాడు. అతను ఉన్న చోట ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదువ ఉండదు.. అందుకే గేల్ మంచి మనసున్న ఆటగాడయ్యాడని తెలిపాడు.అనంతరం మ్యాచ్ గురించి ప్రస్తావించగా.. కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేశాడని.. అతనికి మంచి భవిష్యత్తు ఉందన్నాడు. కింగ్స్ పంజాబ్ అసలైతే ఐదు మ్యాచ్‌లు గెలవాల్సి ఉండేది.. కానీ వారికి అదృష్టం కలిసిరావడం లేదు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్ కూడా ఈజీగా గెలవాల్సినా.. చివరివరకు ఆడి క్లిష్టతరం చేసుకున్నారని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. అంతేగాక క్రీడల్లో గొప్ప అథ్లెట్‌గా కోహ్లితో పాటు ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోలను మొదటి చాయిస్‌గా తీసుకుంటానని రవిశాస్త్రి ఇంటర్య్వూలో సమాధానమిచ్చాడు. కాగా కింగ్స్ పంజాబ్ 8 మ్యచ్‌లాడి కేవలం రెండు విజయాలతో అట్టడుగు స్థానంలో నిలిచింది. లీగ్‌లో ఇకపై జరిగే అన్ని మ్యాచ్‌లను పంజాబ్ గెలవడంతో పాటు రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంటేనే ఫ్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment