క్రిస్‌ గేల్‌కు అరుదైన గౌరవం | Universe Boss rings the iconic Bell At The Eden Gardens | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 21 2018 4:45 PM | Last Updated on Sat, Apr 21 2018 4:54 PM

Universe Boss rings the iconic Bell At The Eden Gardens - Sakshi

గంటను మోగిస్తున్న గేల్‌

కోల్‌కతా: ఐపీఎల్‌-11 సీజన్‌లో దూకుడుమీద ఉన్న కింగ్స్‌పంజాబ్‌ ఓపెనర్‌, వెస్టిండియన్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌కు అరుదైన గౌరవం దక్కింది. శనివారం కోల్‌కతాతో ఈడేన్‌ గార్డెన్స్‌ వేదికగా మ్యాచ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రతి మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఈ మైదానంలో ఉన్న గంటను మోగించడం ఆనవాయితీగా వస్తోంది. నేడు ఈ అరుదైన అవకాశం ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌కు వచ్చింది. మ్యాచ్‌కు ముందు గేల్‌ గంట మోగించాడు.

ఇప్పటి వరకు ప్రముఖ మాజీ క్రికెటర్లు, అసాధారణ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు మాత్రమే ఈ అవకాశం లభించింది. గతంలో కపిల్ దేవ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, మహిళా క్రికెటర్ జులాన్ గోస్వామికి ఈ అద్భుత అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక గేల్‌ ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచుల్లో తమ జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా విశ్వరూపం కనబర్చి104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement