కోల్‌కతా: క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్, ఎవిన్ లూయిస్.. ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంచైజీలకు ఆడుతున్న వెస్టిండీస్ ఆటగాళ్ల జాబితా పెద్దదే. ఒక్క ఐపీఎల్ కాదు ప్రపంచంలోని ఏ టీ20 లీగ్ చూసినా ఈ విండీస్ క్రికెటర్ల సందడి కనిపిస్తుంది. ఇలా టీ20ల కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడానికి కారణం టెస్ట్ క్రికెట్‌పై వాళ్లకు బోర్ కొట్టడమేనట. ఈ విషయాన్ని ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ కోచ్‌గా చేస్తున్న జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ చెప్పాడు.
‘వాళ్లు తొలుత ఎంజాయ్‌మెంట్ కోసం టీ20లను ఎంచుకున్నారు. తర్వాత తర్వాత ఆ ఆటగాళ్లకు టెస్ట్ క్రికెట్ బోర్ కొట్టింది. అందుకే ప్రపంచంలోని వివిధ టీ20 లీగ్‌ల్లో ఆడుతున్నారు’ అని అతడు తెలిపాడు. కేవలం ఆడడమేకాదు.. తమ మెరుపులతో వారు ప్రేక్షకులను అలరిస్తున్నారన్నాడు. ఈ క్రమంలోనే చాలా మంది అభిమానులు.. గేల్ వంటి స్టార్ ఆటగాళ్లను ఎలా నియంత్రిస్తారని తనలాంటి బౌలింగ్ కోచ్‌లను పదే పదే అడుగుతుంటారని, ఇది చెప్పడం చాలా కష్టమని స్ట్రీక్ అన్నాడు. గేల్ వంటి స్టార్ క్రికెటర్‌ను ఆపాలంటే వైవిధ్యమైన బౌలింగ్‌తో అతన్ని ఇబ్బంది పెట్టాల్సి ఉందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment