Heath Streak
-
మేటి బ్యాటర్లను సైతం వణికించాడు.. కానీ ఇలా: టీమిండియా మాజీ ఓపెనర్
Aakash Chopra pays tribute to Heath Streak: జింబాబ్వే క్రికెట్ దిగ్గజం, దివంగత హీత్ స్ట్రీక్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. స్ట్రీక్ బౌలింగ్ చేస్తుంటే మేటి బ్యాటర్లు సైతం వణికిపోయేవారని గుర్తుచేసుకున్నాడు. జింబాబ్వేకు దొరికిన క్రికెట్ ఆణిముత్యం ఇక లేడనే నిజాన్ని జీర్ణించుకోక తప్పదంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఆల్‌రౌండర్ హీత్ స్ట్రీక్ మరణించాడంటూ కొన్ని రోజుల క్రితం నకిలీ వార్త చక్కర్లు కొట్టిన విషయం విదితమే. స్ట్రీక్ సహచర క్రికెటర్ ఒలంగో చేసిన ట్వీట్ గందరగోళానికి దారితీయడంతో.. తాను బతికే ఉన్నానంటూ స్వయంగా అతడు మీడియాకు వెల్లడించాడు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 49 ఏళ్ల వయసులోనే లోకాన్ని వీడాడు కానీ.. రోజుల వ్యవధిలోనే హీత్ స్ట్రీక్ తుదిశ్వాస విడిచిన విషయాన్ని అతడి భార్య బయటపెట్టడంతో మళ్లీ కన్నీటిసంద్రంలో మునిగిపోయారు. తన బౌలింగ్ నైపుణ్యాలతో దిగ్గజ బ్యాటర్లను హడలెత్తించిన ఈ రైట్ ఆర్మ్ పేసర్ క్యాన్సర్‌తో పోరాడి ఓడి.. 49 ఏళ్ల వయసులోనే కన్నుమూయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగానే లెజెండ్ ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా.. హీత్ స్ట్రీక్‌కు నివాళి అర్పిస్తూ.. ‘‘హీత్ స్ట్రీక్ ఇకలేడు. గతంలో ఓసారి ఇలాంటి వార్త నకిలీదని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఈసారి నిజంగానే తను లేడు. గొప్ప ఆటగాడు. ఏమాత్రం సందేహం లేకుండా.. అతడిని మనం జింబాబ్వే లెజెండ్ అని పిలవవచ్చు. ఈ మాట నేను అంటున్నది కాదు.. అతడు నిజంగానే ఓ దిగ్గజం. జింబాబ్వే క్రికెట్‌కు దొరికిన అత్యంత గొప్ప క్రికెటర్లతో ఒకడు. మేటి బ్యాటర్లను సైతం హడలెత్తించాడు బౌలింగ్‌లో తనకు తానే సాటి. హరారేలో అతడు బౌలింగ్ చేస్తున్నాడంటే హడలెత్తిపోని బ్యాటర్ ఉండరంటే అతిశయోక్తి కాదు. మేము జింబాబ్వే పర్యటనకు వెళ్లినపుడు ఇలాంటి పరిస్థితే ఉండేది. కేవలం బౌలింగ్ మాత్రమే కాదు.. హీత్ స్ట్రీక్ బ్యాటింగ్ కూడా గొప్పగా ఉండేది. అందుకే అభిమానులతో పాటు అతడి సమకాలీన క్రికెటర్లు కూడా ఆరాధ్యభావంతో చూసేవారు. కానీ ఇలా చిన్న వయసులోనే స్ట్రీక్ వెళ్లిపోవడం బాధాకరం. ఓడిపోయాడు.. మై ఫ్రెండ్ రెస్ట్ ఇన్ పీస్ క్యాన్సర్‌తో పోరులో అతడు ఓడిపోవడం నిజంగా దురదృష్టకరం. మై ఫ్రెండ్.. నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలి హీత్. నీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ అని విచారం వ్యక్తం చేశాడు. పదమూడేళ్లపాటు దిగ్విజయంగా కాగా అంతర్జాతీయ క్రికెట్లో 1993- 2005 మధ్య పదమూడేళ్ల పాటు జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్లో మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 254 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్.. 89 మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించాడు. టీమిండియాను ఓడించి టెస్టుల్లో, వన్డేల్లో కలిపి 455 వికెట్లు కూల్చి ఈనాటికీ జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. పలు మ్యాచ్‌లలో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన హీత్ స్ట్రీక్ 4 వేల పరుగులు చేయడం విశేషం. ఇక 2001లో స్ట్రీక్ కెప్టెన్సీలో జింబాబ్వే.. టీమిండియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించడం అప్పట్లో సంచలనంగా మారింది. కాగా సెప్టెంబరు 3న హీత్ స్ట్రీక్ కన్నుమూసిన విషయం విదితమే. చదవండి: సచిన్ కంటే ఇంజమామ్ గొప్ప.. కోహ్లి కంటే బాబర్ బెటర్.. ఏంటిది? చెత్తగా.. -
లెజండరీ క్రికెటర్ కన్నుమూత.. భార్య తీవ్ర భావోద్వేగం
జింబాబ్వే క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్ను మూశాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ 49 ఏళ్ల వయసులో హీత్ స్ట్రీక్ తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని అతడి భార్య నడైన్ స్ట్రీక్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. "ఈ రోజు ఉదయం నా జీవితంలో సగం, నా అందమైన పిల్లల తండ్రి మమ్మల్ని విడిచి అందరాని లోకాలకు వెళ్లిపోయారు. అతను తన చివరి రోజులను ఫ్యామిలీ, అత్యంత సన్నిహితులతో గడపాలని కోరుకున్నారు. స్ట్రీక్ మాతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనవి. స్ట్రీకీ మరో జన్మలో కూడా నీ భార్యగానే పుట్టాలని కోరుకుంటున్నా అంటూ" ఆమె భావోద్వేగానికి లోనైంది. కాగా 10 రోజుల క్రితం హీత్ స్ట్రీక్ మరణించాడంటూ సహచర ఆటగాడు హెన్రీ ఒలంగ అభిమానులను గందరగోళానికి గురిచేశాడు. ఆ తర్వాత మళ్లీ కొద్దిసేపటికే బతికే ఉన్నాడంటూ ట్విట్ చేసి తన తప్పును సరిదిద్దుకున్నాడు. కానీ ఇప్పుడు నిజంగానే స్ట్రీక్ అందరిని విడిచి పెట్టి అందరాని లోకాలకు వెళ్లిపోయారు. కాగా జింబాబ్వే క్రికెట్ చరిత్రలోనే హీత్ స్ట్రీక్ గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్. క్ 1993లో ఆ దేశం తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించి 65 టెస్ట్‌లు (216 వికెట్లు, సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు), 189 వన్డేలు (239 వికెట్లు, 13 హాఫ్ సెంచరీలు) ఆడాడు. అతను తన చివరి మ్యాచ్‌ను 2005లో ఆడాడు. స్ట్రీక్ 21 టెస్ట్‌ల్లో, 68 వన్డేల్లో జింబాబ్వే కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 2021లో స్ట్రీక్ అవినీతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొని, ఎనిమిదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధానికి గురయ్యాడు. చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. సంజూ, తిలక్ వర్మకు నో ఛాన్స్! -
వాళ్లు నిర్ణయాలు మార్చుకున్నారు.. హీత్ స్ట్రీక్ మళ్లీ బతికొచ్చాడు!
ఒక విషయాన్ని ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించుకున్న తర్వాతే బాహ్య ప్రపంచానికి తెలియజేయాలి. లేదంటే.. తీవ్ర గందరగోళం తప్పదు. సోషల్ మీడియా విస్త్రృతి పెరిగిన తర్వాత నకిలీ వార్తలు లెక్కకు మిక్కిలి ప్రచారమవుతున్నాయి. దీంతో.. ఒక్కోసారి వదంతులే నిజమనే భ్రమలో చాలా మంది తాము సైతం తెలియకుండానే రూమర్ల వ్యాప్తికి కారణమవుతున్నారు. అయితే, జింబాబ్వే మాజీ పేసర్ హెన్రీ ఒలంగ మాత్రం తాను తప్పులో కాలేయడమే గాక.. క్రికెట్ అభిమానులను కూడా తప్పుదోవపట్టించాడు. ఫలితంగా నెట్టింట భారీ స్థాయిలో ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. జింబాబ్వే దిగ్గజ ఆల్‌రౌండర్ హీత్ స్ట్రీక్ గత రెండేళ్లుగా క్యాన్యర్‌తో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం అతడు మరణించాడంటూ ఒలంగ బుధవారం ట్వీట్ చేశాడు. స్ట్రీక్ చనిపోయాడనే వార్తను ధ్రువీకరిస్తూ నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో జింబాబ్వే కెప్టెన్ సీన్ విలియమ్స్ సైతం.. హీత్ స్ట్రీక్‌కు నివాళి అర్పిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. దీంతో అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. 49 ఏళ్లకే స్ట్రీక్ లోకాన్ని వీడిపోయాడంటూ సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు. అయితే, తాను బతికే ఉన్నానని హీత్ స్ట్రీక్ తెలిపినట్లు ఒలంగ తాజాగా ట్వీట్ చేశాడు. ఇందుకు సంబంధించిన తనతో జరిపిన చాట్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశాడు. ఈ క్రమంలో హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడన్న శుభవార్త అభిమానులకు ఆనందం కలిగించినప్పటికీ.. ఒలంగ చేసిన తప్పిదం వారి ఆగ్రహానికి కారణమైంది. ఈ క్రమంలో నెట్టింట హీత్ స్ట్రీక్‌తో పాటు హెన్రీ ఒలంగ పేర్లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. మీమ్స్‌తో క్రికెట్ ఫ్యాన్స్ ఒలంగను ఓ ఆటాడేసుకుంటున్నారు. ఇక మరికొంత మంది.. ‘‘2023లో క్రికెట్లో పునరాగమనాలు ఇవే.. బెన్ స్టోక్స్, తమీమ్ ఇక్బాల్ తమ రిటైర్మెంట్లు వెనక్కి తీసుకున్నారు. బుమ్రా గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చాడు. ఇక హీత్ స్ట్రీక్ అయితే ఏకంగా చావునే జయించాడు’’ అని తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడన్న వార్తను జింబాబ్వే క్రికెట్ కూడా ధ్రువీకరిస్తూ మరో ట్వీట్ చేయడం విశేషం. Zimbabwean legend Heath Streak confirms he's alive. pic.twitter.com/KF8OtFmGx6 — Mufaddal Vohra (@mufaddal_vohra) August 23, 2023 I apologise for tweeting wrong information about Heath Streak.. Thank God he is Hale and healthy 🙏 — James Hubert (@ImJames6_) August 23, 2023 2023 is a year of cricket comebacks: -Ben Stokes and Tamim Iqbal come back from retirement. -Jasprit Bumrah comes back from injury. -Heath Streaks comes back from death. #HeathStreak#CricketTwitter pic.twitter.com/joUpu3x5RJ — Himanshu Pareek (@Sports_Himanshu) August 23, 2023 -
Heath Streak: హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడు.. నీకసలు బుద్ధుందా? ఫ్యాన్స్ ఫైర్
Henry Olonga confirms Heath Streak is well: హీత్ స్ట్రీక్ అభిమానులకు శుభవార్త! ఈ దిగ్గజ ఆల్‌రౌండర్ బతికే ఉన్నట్లు సహచర క్రికెటర్ హెన్రీ ఒలంగ ప్రకటించాడు. థర్డ్ అంపైర్ అతడిని వెనక్కి పిలిచాడంటూ మరో ట్వీట్ చేశాడు. జింబాబ్వే లెజెండరీ క్రికెటర్ హీత్ స్ట్రీక్ మరణించాడన్న వార్తను తొలుత సోషల్ మీడియాలో షేర్ చేసింది ఒలంగానే కావడం గమనార్హం. పిచ్చి పిచ్చి ట్వీట్లు ఎందుకు? అయితే, అవన్నీ వదంతులేనంటూ తాజాగా మరో ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు అతడిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇలాంటి విషాదకర వార్తలను ధ్రువీకరించకుండా పిచ్చి పిచ్చి ట్వీట్లు చేయడం ఎందుకని మండిపడుతున్నారు. కాగా క్యాన్సర్‌తో పోరాడుతూ హీత్ స్ట్రీక్ చనిపోయాడని ఒలంగ బుధవారం ట్విటర్లో తెలిపాడు. నీకసలు బుద్ధుందా? జింబాబ్వే ప్రస్తుత కెప్టెన్ సీన్ విలియమ్స్ సైతం నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశాడు. దీంతో హీత్ స్ట్రీక్ అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అయితే, అతడు బతికే ఉన్నాడంటూ ఒలంగ ట్వీట్ చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతటి గందరగోళానికి కారణమైన ఒలంగను నీకసలు బుద్ధుందా అంటూ ఏకిపారేస్తున్నారు. 13 ఏళ్ల కెరీర్ కాగా 13 ఏళ్ల పాటు జింబాబ్వే క్రికెటర్‌గా పలు అరుదైన ఘనతలు సాధించిన హీత్ స్ట్రీక్ 2005లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత కోచ్‌గా మారాడు. జింబాబ్వేతో పాటు పలు క్రికెట జట్లకు కోచ్‌గా వ్యవహరించిన 49 ఏళ్ల హీత్ స్ట్రీక్ ప్రస్తుతం క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. కాగా జింబాబ్వే ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్‌గా హీత్ స్ట్రీక్ చరిత్రకెక్కాడు. చదవండి: ఆసియా కప్ జట్టులో చోటు దక్కకున్నా.. వరల్డ్‌కప్ టోర్నీలో ఎంట్రీ ఖాయం! హీత్ స్ట్రీక్ అరుదైన రికార్డులు.. తొలి మ్యాచ్‌లో నో వికెట్! నాడు టీమిండియాను ఓడించి.. I can confirm that rumours of the demise of Heath Streak have been greatly exaggerated. I just heard from him. The third umpire has called him back. He is very much alive folks. pic.twitter.com/LQs6bcjWSB — Henry Olonga (@henryolonga) August 23, 2023 #Heathstreak fake news failane walo ke sath pic.twitter.com/jPTkLzsOwd — Raja Babu (@GaurangBhardwa1) August 23, 2023 Zimbabwean legend Heath Streak confirms he's alive.#HeathStreak pic.twitter.com/eAS2VKsker — Manjeet Singh Ghoshi (@ghoshi_manjeet) August 23, 2023 Heath Streak at 6:00 AM : Dead Heath Streak at 10:00 AM : Alive Review successful, Yamraj's decision overturned.#HeathStreak pic.twitter.com/RqbcXphfBG — Roshan Rai (@RoshanKrRaii) August 23, 2023 -
హీత్ స్ట్రీక్ అరుదైన రికార్డులు.. తొలి మ్యాచ్‌లో నో వికెట్! నాడు టీమిండియాను ఓడించి..
Heath Streak: జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ మరణించాడంటూ సహచర ఆటగాడు హెన్రీ ఒలంగ చేసిన ట్వీట్ గందరగోళానికి కారణమైంది. క్యాన్సర్‌తో పోరాడుతూ స్ట్రీక్ చనిపోయాడని ఒలంగ సంతాపం ప్రకటించాడు. అయితే, తాజాగా అతడు బతికే ఉన్నాడంటూ మరో ట్వీట్‌తో ముందుకు వచ్చాడు. తప్పుడు వార్త ప్రచారానికి కారణమై అభిమానుల చేత చివాట్లు తింటున్నాడు. ఇదిలా ఉంటే.. కాన్సర్‌తో పోరాడుతున్న హెన్రీ స్ట్రీక్ రికార్డుల గురించి తెలుసుకుందామా?! 13 ఏళ్ల ప్రయాణం 1993- 2005 మధ్య పదమూడేళ్ల పాటు జింబాబ్వే తరఫున హీత్ స్ట్రీక్ అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. తన కెరీర్లో మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 254 మ్యాచ్‌లు ఆడిన ఈ పేస్ ఆల్‌రౌండర్.. వీటిలో 89 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. టెస్టుల్లో, వన్డేల్లో కలిపి 455 వికెట్లు కూల్చి నేటికీ జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌గా తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. లెజెండరీ ఆల్‌రౌండర్ అంతేకాదు.. 100 వికెట్ల క్లబ్లో చేరిన ఏకైక జింబాబ్వేయన్ కూడా హీత్ స్ట్రీక్. బౌలర్‌గానే గాకుండా బ్యాటర్‌గానూ అదరగొట్టాడు ఈ పేస్ ఆల్‌రౌండర్. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసి 4000 పరుగులు సాధించాడు. PC: Twitter అరంగేట్రంలో నో వికెట్.. మరుసటి మ్యాచ్‌లో మాత్రం 1993లో పాకిస్తాన్‌తో టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన హీత్ స్ట్రీక్.. తొలి మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, రావల్పిండిలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్లు కూల్చి సత్తా చాటాడు. మొత్తంగా.. టెస్టుల్లో 1990.. వన్డేల్లో 2943 రన్స్ సాధించాడు. హరారే వేదికగా వెస్టిండీస్ మీద టెస్టు మ్యాచ్‌లో ఓ సెంచరీ(127- నాటౌట్) కూడా సాధించాడు. టీమిండియాను ఓడించి.. హీత్ స్ట్రీక్ సారథ్యంలోని జింబాబ్వే జట్టు 2001లో టీమిండియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. ఇక వరల్డ్‌కప్-2003లోనూ జట్టును ముందుండి నడిపించాడు. స్ట్రీక్ కెప్టెన్సీలో నాడు జింబాబ్వే సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది. PC: Twitter కోచ్‌గా ఐపీఎల్‌లోనూ.. 2005లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హీత్ స్ట్రీక్.. కోచ్‌గా కొత్త అవతారమెత్తాడు. జింబాబ్వేతో పాటు స్కాట్లాండ్, బంగ్లాదేశ్ జట్లకు మార్గదర్శనం చేశాడు. ఐపీఎల్లో గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కూడా కోచ్‌గా పనిచేశాడు హీత్ స్ట్రీక్. అంతకుముందు.. వార్విక్షైర్ కెప్టెన్‌గా 2006లో రెండేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్న స్ట్రీక్.. వ్యక్తిగత కారణాల వల్ల పూర్తికాలం పాటు సారథిగా సేవలు అందించలేకపోయాడు. దురదృష్టవశాత్తూ క్యాన్సర్ బారిన పడ్డాడు హీత్ స్ట్రీక్. చదవండి: వరల్డ్‌కప్ జట్టులో రోహిత్ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు! వెంటనే కోచ్.. -
అతడి ట్వీట్‌తో గందరగోళం.. స్ట్రీక్ బతికే ఉన్నాడు..
Update: హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడని హెన్రీ ఒలంగ తాజాగా ట్వీట్ చేశాడు. Legend Heath Streak: జింబాబ్వే క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ ఆల్‌రౌండర్ హీత్ స్ట్రీక్ మరణించాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ 49 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. ఈ విషయాన్ని జింబాబ్వే మాజీ పేసర్ ఒలంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. జింబాబ్వే లెజెండ్ ఇకలేరంటూ విషాదకర వార్తను అభిమానులతో పంచుకున్నాడు. గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్ ‘‘అత్యంత బాధాకర వార్త. హీత్ స్ట్రీక్ ఇక మనకులేరు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి లెజెండ్. జింబాబ్వేకు దొరికిన గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్. నీ కలిసి ఆడడం నాకు దొరికిన గొప్ప అనుభూతి. నా ఆట ముగిసిన తర్వాత నిన్ను కలుస్తాను’’ అంటూ హెన్రీ ఒలంగా భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. మా హృదయాలు ముక్కలు చేశావు ఇక జింబాబ్వే కెప్టెన్ సీన్ విలియమ్స్ సైతం ట్విటర్ వేదికగా హీత్ స్ట్రీక్‌కు నివాళి అర్పించాడు. ‘‘స్ట్రీకీ.. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. నీ కుటుంబంతో పాటు మా అందరి హృదయాలు ముక్కలు చేశావు. అందమైన నీ కుటుంబాన్ని వదిలేసి వెళ్లావు. నీ లెగసీని మేము కొనసాగిస్తాం. నిన్ను చాలా చాలా మిస్ అవుతున్నాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి స్ట్రీకీ’’ అని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: వరల్డ్‌కప్ జట్టులో రోహిత్ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు! వెంటనే కోచ్.. అఫ్గనిస్తాన్‌పై ఘన విజయం.. పాత రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్ -
జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ పరిస్థితి విషమం
జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ మాజీ క్రీడల మంత్రి డేవిడ్ కోల్టార్ట్ సైతం ట్విట్టర్లో షేర్ చేశారు. స్ట్రీక్ కోలుకుని, తిరిగి మామూలు మనిషి అయ్యేందుకు ప్రార్థించాలని ఆయన తన దేశ ప్రజలకు, దేశం వెలుపల ఉన్న ప్రార్ధన యోధులకు పిలుపునిచ్చారు. జింబాబ్వేకు పాత్రినిధ్యం వహించిన గొప్ప క్రికెటర్లలో ఒకరైన హీత్ స్ట్రీక్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, అతనికి మనందరి ప్రార్ధనలు చాలా అవసరమని డేవిడ్ కోల్టార్ట్ తన ట్వీట్లో పేర్కొన్నారు. స్ట్రీక్ కోసం, అతని కుటుంబం కోసం ప్రార్ధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం స్ట్రీక్ సౌతాఫ్రికాలో ఉన్నట్లు సమాచారం. కాగా, జింబాబ్వే ఆల్‌టైమ్ గ్రేట్ ఆల్రౌండర్లలో ఒకరైన స్ట్రీక్ 1993లో ఆ దేశం తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించి 65 టెస్ట్‌లు (216 వికెట్లు, సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు), 189 వన్డేలు (239 వికెట్లు, 13 హాఫ్ సెంచరీలు) ఆడాడు. అతను తన చివరి మ్యాచ్‌ను 2005లో ఆడాడు. స్ట్రీక్ 21 టెస్ట్‌ల్లో, 68 వన్డేల్లో జింబాబ్వే కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 2021లో స్ట్రీక్ అవినీతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొని, ఎనిమిదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధానికి గురయ్యాడు. చదవండి: టీమిండియా హెడ్ కోచ్‌గా ముజుందార్! -
జింబాబ్వే కోచ్‌కు ఐసీసీ భారీ షాక్.. 8 ఏళ్ల నిషేధం
దుబాయ్: జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కోచ్ హీత్ స్ట్రీక్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. అవినీతి నిరోధక నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు స్ట్రీక్‌పై ఈ నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ ప్రకటించారు. ఈ నిషేధ సమయంలో స్ట్రీక్ ఏ రకమైన క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. 47 ఏళ్ల హీత్ స్ట్రీక్ జింబాబ్వే తరఫున 65 టెస్టుల్లో, 189 వన్డేల్లో బరిలోకి దిగాడు. టెస్టుల్లో 216 వికెట్లు తీసిన అతను 1,990 పరుగులు చేశాడు. వన్డేల్లో 239 వికెట్లు పడగొట్టిన స్ట్రీక్ 2,943 పరుగులు సాధించాడు. ‘హీత్ స్ట్రీక్ ఎంతో అనుభవమున్న అంతర్జాతీయ మాజీ క్రికెటర్, జాతీయ జట్టు కోచ్. క్రికెట్లో అవినీతిని నిరోధించడం కోసం నిర్వహించిన ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో అతను పాల్గొన్నాడు. ఈ నిబంధనల ప్రకారం ఎంత బాధ్యతగా మెలగాలో కూడా అతనికి అవగాహన ఉంది. కానీ అతను ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించాడు. 2016– 2018 మధ్యకాలంలో స్ట్రీక్ జింబాబ్వే జాతీయ జట్టుకు, వివిధ టి20 లీగ్‌లలో పలు జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. 2018లో జింబాబ్వే, బంగ్లాదేశ్, శ్రీలంక పాల్గొన్న ముక్కోణపు సిరీస్‌లో... 2018లో జింబాబ్వే–అఫ్గానిస్తాన్ సిరీస్‌లో... 2018 ఐపీఎల్లో... 2018 అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్‌లకు సంబంధించి అంతర్గత సమాచారాన్ని బుకీలకు చేరవేశాడు. ఆటగాళ్లను బుకీలకు పరిచయం చేసేందుకు ప్రయత్నించాడు. స్ట్రీక్ అంతర్గత సమాచారంతో ఆయా మ్యాచ్‌ల తుది ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపలేదు’ అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. 2018 ఐపీఎల్లో స్ట్రీక్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. 2029 మార్చి 28వ తేదీతో స్ట్రీక్‌పై ఎనిమిదేళ్ల నిషేధం ముగుస్తుంది. -
అవినీతి ఆరోపణలు.. మాజీ కెప్టెన్‌పై నిషేధం
దుబాయ్: జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్‌పై ఐసీసీ 8 ఏళ్ల పాటు నిషేధం విధించింది ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌ను ఐదుసార్లు ఉల్లంఘించినట్లు స్ట్రీక్‌పై ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో ఈ ఆరోపణలను ఖండించిన స్ట్రీక్.. తాజాగా వాటిని అంగీకరించాడు. జింబాబ్వే తరపున హీత్ స్ట్రీక్ 189 వన్డేల్లో 239 వికెట్లు, 65 టెస్టుల్లో 216 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత కోచ్‌గా వ్యవహరించిన హీత్ స్ట్రీక్ ఆ సమయంలోనే అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలింది. 2017, 2018లలో వివిధ మ్యాచ్‌ల సందర్భంగా అతడు తన టీమ్‌లోని ప్లేయర్స్ దగ్గరికి బుకీలను అనుమతించడాన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఉండగా.. ఐపీఎల్, బీపీఎల్, ఆఫ్ఘనిస్థాన్ ప్రిమియర్ లీగ్‌లలోని మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌ల ఫలితాలపై అవి ఎలాంటి ప్రభావం చూపలేదని ఐసీసీ అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసింది. ఓ మాజీ కెప్టెన్, కోచ్‌గా ఎన్నో అవినీతి నిరోధక కౌన్సిలింగ్ సెషన్లకు హాజరైన స్ట్రీక్ ఇలా చేయడం బాధాకరమని ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ అన్నారు. చదవండి: మ్యాచ్ ఓడినందుకు షారుఖ్ క్షమాపణ.. స్పందించిన రసెల్ సుదీర్ఘ కాలంగా టాప్‌లో కోహ్లి; ఇప్పుడు అగ్రస్థానంలో పాక్ కెప్టెన్ -
‘వాళ్లకి టెస్టులంటే బోర్ కొట్టేసింది’
కోల్‌కతా: క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్, ఎవిన్ లూయిస్.. ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీలకు ఆడుతున్న వెస్టిండీస్ ఆటగాళ్ల జాబితా పెద్దదే. ఒక్క ఐపీఎల్ కాదు ప్రపంచంలోని ఏ టీ20 లీగ్ చూసినా ఈ విండీస్ క్రికెటర్ల సందడి కనిపిస్తుంది. ఇలా టీ20ల కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడానికి కారణం టెస్ట్ క్రికెట్‌పై వాళ్లకు బోర్ కొట్టడమేనట. ఈ విషయాన్ని ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ కోచ్‌గా చేస్తున్న జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ చెప్పాడు. ‘వాళ్లు తొలుత ఎంజాయ్మెంట్ కోసం టీ20లను ఎంచుకున్నారు. తర్వాత తర్వాత ఆ ఆటగాళ్లకు టెస్ట్ క్రికెట్ బోర్ కొట్టింది. అందుకే ప్రపంచంలోని వివిధ టీ20 లీగ్‌ల్లో ఆడుతున్నారు’ అని అతడు తెలిపాడు. కేవలం ఆడడమేకాదు.. తమ మెరుపులతో వారు ప్రేక్షకులను అలరిస్తున్నారన్నాడు. ఈ క్రమంలోనే చాలా మంది అభిమానులు.. గేల్ వంటి స్టార్ ఆటగాళ్లను ఎలా నియంత్రిస్తారని తనలాంటి బౌలింగ్ కోచ్‌లను పదే పదే అడుగుతుంటారని, ఇది చెప్పడం చాలా కష్టమని స్ట్రీక్ అన్నాడు. గేల్ వంటి స్టార్ క్రికెటర్‌ను ఆపాలంటే వైవిధ్యమైన బౌలింగ్‌తో అతన్ని ఇబ్బంది పెట్టాల్సి ఉందన్నాడు.