Update: హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడని హెన్రీ ఒలంగ తాజాగా ట్వీట్ చేశాడు.
Legend Heath Streak: జింబాబ్వే క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ ఆల్‌రౌండర్ హీత్ స్ట్రీక్ మరణించాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ 49 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. ఈ విషయాన్ని జింబాబ్వే మాజీ పేసర్ ఒలంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. జింబాబ్వే లెజెండ్ ఇకలేరంటూ విషాదకర వార్తను అభిమానులతో పంచుకున్నాడు.
గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్
‘‘అత్యంత బాధాకర వార్త. హీత్ స్ట్రీక్ ఇక మనకులేరు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి లెజెండ్. జింబాబ్వేకు దొరికిన గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్. నీ కలిసి ఆడడం నాకు దొరికిన గొప్ప అనుభూతి. నా ఆట ముగిసిన తర్వాత నిన్ను కలుస్తాను’’ అంటూ హెన్రీ ఒలంగా భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు.
మా హృదయాలు ముక్కలు చేశావు
ఇక జింబాబ్వే కెప్టెన్ సీన్ విలియమ్స్ సైతం ట్విటర్ వేదికగా హీత్ స్ట్రీక్‌కు నివాళి అర్పించాడు. ‘‘స్ట్రీకీ.. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. నీ కుటుంబంతో పాటు మా అందరి హృదయాలు ముక్కలు చేశావు. అందమైన నీ కుటుంబాన్ని వదిలేసి వెళ్లావు. నీ లెగసీని మేము కొనసాగిస్తాం. నిన్ను చాలా చాలా మిస్ అవుతున్నాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి స్ట్రీకీ’’ అని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
చదవండి: వరల్డ్‌కప్ జట్టులో రోహిత్ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు! వెంటనే కోచ్..
అఫ్గనిస్తాన్‌పై ఘన విజయం.. పాత రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్
Comments
Please login to add a commentAdd a comment