Heath Streak: హీత్‌ స్ట్రీక్‌ బతికే ఉన్నాడు.. నీకసలు బుద్ధుందా? ఫ్యాన్స్‌ ఫైర్‌ | Third Umpire Called Him Back Olonga Confirms Heath Streak Alive, Fans Brutally Trolled Him - Sakshi
Sakshi News home page

Heath Streak Is Still Alive: హీత్‌ స్ట్రీక్‌ బతికే ఉన్నాడు.. నీకసలు బుద్ధుందా? ఫ్యాన్స్‌ ఫైర్‌

Published Wed, Aug 23 2023 11:34 AM | Last Updated on Wed, Aug 23 2023 1:17 PM

Third Umpire Called Him Back Olonga Confirms Heath Streak  Alive Fans Fires - Sakshi

Henry Olonga confirms Heath Streak is well: హీత్‌ స్ట్రీక్‌ అభిమానులకు శుభవార్త! ఈ దిగ్గజ ఆల్‌రౌండర్‌ బతికే ఉన్నట్లు సహచర క్రికెటర్‌ హెన్రీ ఒలంగ ప్రకటించాడు. థర్డ్‌ అంపైర్‌ అతడిని వెనక్కి పిలిచాడంటూ మరో ట్వీట్‌ చేశాడు. జింబాబ్వే లెజెండరీ క్రికెటర్‌ హీత్‌ స్ట్రీక్‌ మరణించాడన్న వార్తను తొలుత సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది ఒలంగానే కావడం గమనార్హం. 

పిచ్చి పిచ్చి ట్వీట్లు ఎందుకు?
అయితే, అవన్నీ వదంతులేనంటూ తాజాగా మరో ట్వీట్‌ చేశాడు. దీంతో అభిమానులు అతడిపై తీవ్ర స్థాయిలో ఫైర్‌ అవుతున్నారు. ఇలాంటి విషాదకర వార్తలను ధ్రువీకరించకుండా పిచ్చి పిచ్చి ట్వీట్లు చేయడం ఎందుకని మండిపడుతున్నారు. కాగా క్యాన్సర్‌తో పోరాడుతూ హీత్‌ స్ట్రీక్‌ చనిపోయాడని ఒలంగ బుధవారం ట్విటర్‌లో తెలిపాడు. 

నీకసలు బుద్ధుందా?
జింబాబ్వే ప్రస్తుత కెప్టెన్‌ సీన్‌ విలియమ్స్‌ సైతం నివాళులు అర్పిస్తూ ట్వీట్‌ చేశాడు. దీంతో హీత్‌ స్ట్రీక్‌ అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అయితే, అతడు బతికే ఉన్నాడంటూ ఒలంగ ట్వీట్‌ చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతటి గందరగోళానికి కారణమైన ఒలంగను నీకసలు బుద్ధుందా అంటూ ఏకిపారేస్తున్నారు. 

13 ఏళ్ల కెరీర్‌
కాగా 13 ఏళ్ల పాటు జింబాబ్వే క్రికెటర్‌గా పలు అరుదైన ఘనతలు సాధించిన హీత్‌ స్ట్రీక్‌ 2005లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆ తర్వాత కోచ్‌గా మారాడు. జింబాబ్వేతో పాటు పలు క్రికెట​ జట్లకు కోచ్‌గా వ్యవహరించిన 49 ఏళ్ల హీత్‌ స్ట్రీక్‌ ప్రస్తుతం క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. ‍ కాగా జింబాబ్వే ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ ఆల్‌రౌండర్‌గా హీత్‌ స్ట్రీక్‌ చరిత్రకెక్కాడు.

చదవండి: ఆసియా కప్‌ జట్టులో చోటు దక్కకున్నా.. వరల్డ్‌కప్‌ టోర్నీలో ఎంట్రీ ఖాయం!
హీత్‌ స్ట్రీక్‌ అరుదైన రికార్డులు.. తొలి మ్యాచ్‌లో నో వికెట్‌! నాడు టీమిండియాను ఓడించి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement