fake news alert
-
నిజాలతో నిమిత్తం లేని.. 'అదొక అబద్ధాల అట్టహాసం'!
నిజాలతో నిమిత్తం లేకుండా అబద్ధాలను అడ్డగోలుగా వండి వడ్డించడానికి వార్తాపత్రికలు, టీవీ చానళ్లు అలవాటుపడిపోయాయి. వీటికి తోడుగా సోషల్ మీడియా కూడా తయారైంది. సంచలనం రేకెత్తించే అంశం ఏదైనా ఉంటే చాలు, అబద్ధాలు వేడి వేడి పకోడీల కన్నా వేగంగా అమ్ముడుపోతాయి. వస్తువులైనా, సేవలైనా విపణిలో అమ్ముడుపోతేనే విక్రేతలకు సొమ్ములొస్తాయి. వార్తలు కూడా విపణి వస్తువులే! పోటీదారుల కన్నా త్వరగా, ఎక్కువగా వార్తలను అమ్ముకోవడానికి మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు నిస్సిగ్గుగా విలువలను విడిచిపెట్టి, అబద్ధాలను అట్టహాసంగా ప్రచారంలో పెడుతున్నాయి.అలాగని తప్పుడు వార్తల తాషా మార్పా ఇప్పటి పరిణామమేమీ కాదు. వార్తాపత్రికలు ప్రాచుర్యాన్ని సంతరించుకోవడం మొదలుపెట్టిన తొలిరోజుల నుంచే తప్పుడు వార్తల ప్రచారం కూడా మొదలైంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తప్పుడు కథనాల ప్రచారం తారస్థాయికి చేరుకుంది.పత్రికలు సర్క్యులేషన్ పెంచుకోవడానికి, టీవీ చానళ్లు టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి, సోషల్ మీడియా వేదికలు వీక్షకుల సంఖ్యను పెంచుకోవడానికి ఎంతటి అబద్ధాలనైనా అలవోకగా ప్రచారం చేస్తున్నాయి. వదంతులను సృష్టించడం, ప్రత్యర్థులపై బురద చల్లడం నిత్యకృత్యంగా సాగిస్తున్నాయి. మూకుమ్మడిగా ఇవి సాగిస్తున్న అబద్ధాల అట్టహాసానికి వాస్తవాలు అట్టడుగున మరుగునపడిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి.‘సత్యమేవ జయతే’ అనే మాటను జాతీయ ఆదర్శంగా చెప్పుకున్న మన దేశం అబద్ధపు వార్తలు, తప్పుడు కథనాల ప్రచారంలో ప్రపంచ దేశాలన్నింటినీ తలదన్ని అగ్రస్థానంలో నిలవడమే వర్తమాన విషాదం. అబద్ధపు వార్తలు, తప్పుడు కథనాల సృష్టిని, వ్యాప్తిని అరికట్టడం ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక తప్పుడు వార్తల ప్రచారం మరింత ఉద్ధృతంగా మారింది. అనామకమైన వెబ్సైట్లు తప్పుడు వార్తలను పుంఖాను పుంఖాలుగా గుప్పిస్తున్నాయి. వీటి మూలాలను గుర్తించడం కూడా ప్రభుత్వ, చట్టపరిరక్షణ వ్యవస్థలకు సవాలుగా మారుతోంది.అబద్ధాల అట్టహాసాన్ని అరికట్టడానికి పలు దేశాలు చట్టాలను రూపొందించినా, అనామకమైన వెబ్సైట్లలో తప్పుడు కథనాల సృష్టికర్తలు ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో నిందితులపై చర్యలు తీసుకునే అవకాశాలు దాదాపు గగనంగా ఉంటున్నాయి. అబద్ధాలు నిండిన తప్పుడు కథనాల వల్ల జనాల్లో గందరగోళం, విద్వేషపూరిత వాతావరణం ఏర్పడటమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ కూడా కుదుపులకు లోనవుతోంది.కొన్ని తప్పుడు కథనాల కథా కమామిషు..► గత ఏడాది రంజాన్ మాసానికి కొద్దిరోజుల ముందు మన జాతీయ పత్రికలు, టీవీ చానళ్లు, వార్తా సంస్థలు ఒక వార్తను ప్రచారంలోకి తెచ్చాయి. రంజాన్ మాసంలో సౌదీ అరేబియా ప్రభుత్వం మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించిందంటూ ఊదరగొట్టాయి. నిజానికి జరిగిందేమిటంటే, సౌదీ ప్రభుత్వం మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై పరిమితి విధించింది. ప్రతి మసీదులోనూ లౌడ్‌స్పీకర్ల సంఖ్య నాలుగుకు మించరాదని ఆదేశాలు జారీచేసింది. దీనిని వక్రీకరించిన మన జాతీయ మీడియా సంస్థలు సౌదీని చూసి భారత్‌లోని ముస్లింలు నేర్చుకోవాలంటూ నీతిచంద్రికలు కూడా బోధించాయి.► ఇటీవలి కాలంలో పలు తప్పుడు కథనాలు దేశవ్యాప్తంగా జనాల్లో గందరగోళం సృష్టించాయి. వాటికి ఉదాహరణగా కొన్నింటిని చెప్పుకుందాం. ‘కోవిడ్–19’ మహమ్మారి ప్రపంచమంతటా వ్యాపించిన రోజుల్లో పలు పత్రికలు, టీవీ చానళ్లు తప్పుడు కథనాలతో హోరెత్తించాయి. ‘కోవిడ్–19’కు కారణమైన కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తిపై అనేక కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. పలు వార్తాపత్రికలు, టీవీ చానళ్లు ఈ కుట్ర సిద్ధాంతాలనే నిజమనిపించేలా పుంఖాను పుంఖాలుగా కథనాలను వండి వార్చాయి.‘కోవిడ్’ రోజుల్లో ఒక మరాఠీ పత్రిక ఈ అంశంపై ప్రచారంలో ఉన్న కుట్రసిద్ధాంతాన్నే వార్తాకథనంగా ప్రచురించింది. చైనా రూపొందించిన జైవ ఆయుధమే కరోనా వైరస్ అని, చైనా ఇంటెలిజెన్స్ అధికారి దీనిని లీక్ చేశాడనేది ఆ కథనం సారాంశం. కరోనా వైరస్‌పై మన పత్రికలు ఇంతకంటే దారుణమైన కథనాలను కూడా ప్రచురించాయి. విశ్వసనీయతకు మారుపేరుగా పేరుగాంచిన ఒక ఇంగ్లిష్ పత్రిక 2019లో ఫిలోవైరస్పై జరిగిన అధ్యయనాన్ని కరోనా వైరస్‌కు ముడిపెడుతూ కథనాన్ని ప్రచురించింది.ఒక టీవీ చానల్ అయితే, టమాటాల్లో తెగులుకు కారణమైన ఒక గుర్తుతెలియని వైరస్‌ను కరోనా వైరస్‌కు ముడిపెడుతూ కథనాన్ని ప్రసారం చేసింది. కరోనా రోగులను తప్పనిసరిగా క్వారంటైన్లో ఉంచే రోజుల్లో దేశవ్యాప్తంగా అత్యంత జనాదరణ గల ఇంగ్లిష్ దినపత్రిక బెంగళూరుకు చెందిన గూగుల్ ఉద్యోగి భార్యకు ‘కోవిడ్’ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని, ఆమె చికిత్సకు నిరాకరించడమే కాకుండా, క్వారంటైన్ నుంచి తప్పించుకుని ఆగ్రాకు పారిపోయిందని ఒక నిరాధారమైన కథనాన్ని ప్రచురించింది. ‘కోవిడ్’ రోజుల్లో ఇలాంటి కథనాలు జనాల్లో భయభ్రాంతులను సృష్టించాయి.► కేరళలోని మలప్పురం జిల్లా అటవీ ప్రాంతంలో నాలుగేళ్ల కిందట ఒక ఏనుగు టపాసులు నింపిన అనాసపండు తినడం వల్ల మరణించింది. మరణించిన నాటికి ఆ ఏనుగు గర్భం దాల్చి ఉంది. ఈ సంఘటన జరిగిన వెంటనే పలు జాతీయ చానళ్లు, పత్రికలు సైతం నిజా నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇష్టానుసారం కథనాలను ప్రచారంలోకి తెచ్చాయి. కొందరు స్థానికులు ఉద్దేశపూర్వకంగా టపాసులు నింపిన అనాసపండును తినిపించడం వల్లనే ఆ ఏనుగు మరణించిందంటూ చిలవలు పలవలుగా అల్లిన కథనాలతో ఊదరగొట్టాయి.ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే మలప్పురం జిల్లాలో ఈ కథనాల కారణంగా ముస్లింలపై విద్వేషపూరిత దాడులు జరిగాయి. నిజానికి ఈ ప్రాంతంలో అడవి పందుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల వాటికి ఎరగా అటవీశాఖ అధికారులు అనాసపండులో టపాసులు నింపి ఉంచారు. ఆకలితో ఉన్న ఏనుగు దానిని తినడం వల్ల మృత్యువాత పడింది. ఈ సంగతిని అటవీశాఖ అధికారులు స్వయంగా వెల్లడించారు. అయితే, ఈ సంఘటనపై కథనాలను ప్రచురించే ముందు లేదా ప్రసారం చేసే ముందు వాటిని ప్రచారంలోకి తెచ్చిన వార్తాసంస్థల ప్రతినిధులెవరూ అటవీశాఖ అధికారులను సంప్రదించిన పాపాన పోలేదు.► ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారని, ‘నోబెల్’ పరిశీలనలో ఉన్న అభ్యర్థుల్లో మోదీనే అత్యంత బలమైన అభ్యర్థి అని గత ఏడాది నోబెల్ బహుమతుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు మన దేశంలోని పలు జాతీయ టీవీ చానళ్లు, వార్తా పత్రికలు తప్పుడు కథనాలను ప్రచారం చేశాయి. నోబెల్ శాంతి బహుమతి కోసం మోదీ పేరు పరిశీలనలో ఉందని నార్వేజియన్ నోబెల్ కమిటీ డిప్యూటీ డైరెక్టర్ ఆస్లే తోజే చెప్పినట్లు అవి తమ కథనాల్లో నమ్మబలికాయి.నిజానికి ఆస్లే తోజే ఒక సందర్భంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ నాలుగు మాటలు చెప్పారు. అంతే! దీన్నే మన మీడియా సంస్థలు చిలవలు పలవలుగా కథనాలను అల్లి ప్రచారం చేశాయి. చివరకు నోబెల్ కమిటీ డైరెక్టర్ ఓలావ్ ఎన్జోస్తాద్ ఈ కథనాలను ఖండించారు.► పాకిస్తాన్లో కొందరు దుండగులు మహిళల శవాలను కూడా వదలకుండా వాటిపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారని, అందుకే అక్కడి తల్లిదండ్రులు తమ కుమార్తెల సమాధులకు ఇనుప తలుపులు ఏర్పాటు చేసుకుని, తాళాలు బిగిస్తున్నారని గత ఏడాది మన జాతీయ పత్రికలు, టీవీ చానళ్లు ఒక దారుణమైన తప్పుడు కథనాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. ఈ కథనాన్ని నమ్మించేందుకు తాళాలు బిగించి ఉన్న ఒక సమాధి ఫొటోను కూడా వాడుకున్నాయి. ఫొటోతో పాటు ఈ కథనాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.నిజానికి ఈ తాళాలు బిగించిన సమాధి ఫొటోకు గాని, పాకిస్తాన్‌కు గాని ఎలాంటి సంబంధం లేదు. ఈ ఫొటో మన హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ దరాబ్‌జంగ్ కాలనీ మస్జిద్ ఏ సలార్ ముల్క్కు అనుబంధంగా ఉన్న శ్మశాన వాటికలోనిది. ఒకరు సమాధి నిర్మించిన చోట శవాన్ని పూడ్చిపెట్టడానికి మరొకరు తవ్వకుండా ఉండేందుకు ఇలా సమాధులకు తాళాలు వేసుకోవడం ఇక్కడ మామూలే! శవాలపై అఘాయిత్యాలకు, సమాధుల తాళాలకు ఎలాంటి సంబంధం లేదు.► నాలుగేళ్ల కిందట చైనా సరిహద్దుల్లో భారత్ బలగాలకు, చైనా బలగాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఉభయ పక్షాల్లోనూ కొందరు సైనికులు మరణించారు. ఉభయ పక్షాలూ పరస్పరం ప్రత్యర్థి సైనికులను బందీలుగా పట్టుకుని, కొద్ది రోజుల తర్వాత విడిచిపెట్టినట్లు కథనాలు వచ్చాయి. ఇటు భారత్, అటు చైనా ఈ కథనాలను కొట్టిపారేశాయి. ఈ సంఘటన సందర్భంగా మన దేశంలోని కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి.ఒక హిందీ చానల్, ఒక ఇంగ్లిష్ చానల్ 1962 నాటి భారత్–చైనా యుద్ధంలో మరణించిన సైనికుల సమాధులు ఉన్న వీడియోను ప్రసారం చేసి, అవి ‘గాల్వన్’ ఘర్షణలో మన సైనికుల చేతిలో మరణించిన చైనా సైనికులవేనంటూ కథనాన్ని వడ్డించాయి. ఈ కథనాలను నిజమేనని నమ్మిన కొందరు ఇదంతా ప్రధాని మోదీ హయాంలో మన సైనికులు సాధించిన ఘనత అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు.ఇది జరిగిన మూడు నెలల్లోనే ఒక హిందీ చానల్, రెండు ఇంగ్లిష్ చానళ్లు తైవాన్ సైన్యం చైనా విమానాన్ని కూల్చేసినట్లు మరో నిరాధాక కథనాన్ని ప్రసారం చేశాయి. తైవాన్ ప్రభుత్వం ఈ కథనాన్ని వెంటనే ఖండించింది. ఇలాంటి కథనాలు మన మీడియా పరువును అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చినా, పలు మీడియా సంస్థలు తమ ధోరణిని ఏమాత్రం మార్చుకోకుండా ఎప్పటికప్పుడు తప్పుడు కథనాలను తాజాగా వండి వడ్డిస్తూనే ఉన్నాయి.► పాకిస్తాన్ పార్లమెంటు 2020 అక్టోబర్ 26న సమావేశమైంది. విపక్ష నేత ఖ్వాజా ఆసిఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ఓటింగు జరిపించాలని కోరుతూ సభలోని విపక్ష సభ్యులందరూ ముక్తకంఠంతో ‘ఓటింగ్.. ఓటింగ్’ అని నినాదాలు చేశారు. దేశభక్తి కిక్కిరిసిన మన టీవీ చానెళ్లు కొన్ని ఆ దృశ్యాలను ప్రసారం చేస్తూ, పాక్ విపక్ష సభ్యులు ‘మోడీ.. మోడీ’ అంటూ నినాదాలు చేసినట్లు వార్తల్లో హోరెత్తించాయి.అంతేకాదు, అధికారపక్ష సభ్యులు ‘ఓటింగ్ సబ్ కుఛ్ హోగా, సబ్ కుఛ్ హోగా, సబర్ రఖియే ఆప్’ (ఓటింగ్ అంతా జరుగుతుంది. అంతా జరుగుతుంది. మీరు ఓపిక పట్టండి) అంటూ విపక్షాన్ని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీనికి మన చానళ్లు చెప్పిన డబ్బింగ్ ఏమిటంటే ‘మోదీ కా జో యార్ హై, గద్దార్ హై, గద్దార్ హై’ (మోదీకి మిత్రులైన వారెవరైనా వారు ద్రోహులు). పాక్ సభలో ఆనాడు నిజానికి మోదీకి అనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని ఎవరూ ఎలాంటి నినాదాలు చేయలేదు. కనీసం ఆయన పేరును ప్రస్తావించలేదు. అయినా మన అత్యుత్సాహ దేశభక్త చానళ్లు ఈ వార్తను వండి వార్చాయి.పత్రికల ‘పచ్చ’కామెర్లు► నిజా నిజాలతో నిమిత్తంలేని విషయాలను సంచలనాత్మకంగా మలచి కథనాలను వండి వడ్డించే ప్రక్రియ పంతొమ్మిదో శతాబ్ది ద్వితీయార్ధంలోనే మొదలైంది. అప్పటి నుంచే ‘ఫేక్ న్యూస్’, ‘యెల్లో జర్నలిజం’ అనే మాటలు వాడుకలోకి వచ్చాయి. ఇటీవలి కాలంలో కొందరు మర్యాదస్తులు ‘ఫేక్ న్యూస్’– తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు అనే మాటను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.అబద్ధాలతో నిండిన కథనాలను తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు అనకుండా ‘ఇన్ఫర్మేషన్ డిజార్డర్’– సమాచార జాడ్యం, ‘మాల్ ఇన్ఫర్మేషన్’– లోపభూయిష్ట సమాచారం అనడం కొంతవరకు తటస్థంగా ఉంటుందని వారి సూచన. సంచలనం రేకెత్తించే శీర్షికలతో నిజమని నమ్మించేలాంటి అభూత కల్పనలతో కూడిన కథనాలను ప్రచురించే ధోరణి అమెరికా, యూరోప్ దేశాలలో పంతొమ్మిదో శతాబ్ది చివరినాటికి విపరీతంగా ఉండేది. ఈ ధోరణినే ‘యెల్లో జర్నలిజం’ అనేవారు.అప్పట్లో అమెరికాలో విలియమ్ రాండాల్ఫ్ హర్ట్స్ నడిపే ‘న్యూయార్క్ జర్నల్’లో రిచర్డ్ ఔట్‌కాల్ట్ ‘యెల్లో కిడ్’ కార్టూన్ స్ట్రిప్ వేసేవాడు. ‘న్యూయార్క్ జర్నల్’లో వచ్చేవన్నీ దాదాపుగా సత్యంతో సంబంధంలేని సంచలనాత్మక కథనాలే! ఈ కథనాలపై వ్యాఖ్యలతో మొదటి పేజీలో ‘యెల్లో కిడ్’ కార్టూన్ స్ట్రిప్ ప్రచురించడంతో అవాస్తవాలతో కూడిన సంచలన కథనాలను రాసే ధోరణికి ‘యెల్లో జర్నలిజం’ అనే పేరు వచ్చింది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా విజృంభించిన ఈ రోజుల్లో అసత్య కథనాలకు ఆకాశమే హద్దుగా ఉంటోంది. సత్యం వెలుగులోకి వచ్చేలోగానే అసత్య కథనాలు సమస్త ప్రపంచాన్నీ చుట్టుముట్టి కలకలం రేపుతున్నాయి.ఎన్నికల సమయంలో మరింత ఉద్ధృతి► గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి మన దేశంలో ఇదివరకు ఎన్నడూ లేనంత స్థాయిలో తప్పుడు వార్తలు, అబద్ధపు కథనాల ఉద్ధృతి విపరీతంగా పెరిగింది. ఈ కథనాలను నిశితంగా పరిశీలిస్తే, ఏ ప్రయోజనాలను ఆశించి వీటిని ప్రచారంలోకి తెస్తున్నారో, వీటి వెనుక ఉన్న శక్తులేమిటో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే!ఎన్నికల కమిషన్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయక ముందే కొన్ని పత్రికలు, చానళ్లు ఎన్నికల షెడ్యూల్ ఇదేనంటూ కొన్ని తేదీలను వెల్లడిస్తూ ఒక కథనాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు సాగించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గత సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నుంచి పత్రికలు, చానళ్లలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తప్పుడు కథనాలు విపరీతంగా ప్రచారమయ్యాయి.గత ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ‘వాట్సాప్’ను ప్రధాన ప్రచార ఆయుధంగా యథాశక్తి ఉపయోగించుకున్నాయి. ఈ పరిస్థితి వల్లనే గత ఎన్నికలు భారత్‌లోని ‘తొలి వాట్సాప్ ఎన్నికలు’గా పేరుమోశాయి. ‘వాట్సాప్’ మాత్రమే కాకుండా ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సాధనాలను కూడా రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి వాడుకుంటున్నాయి. తమకు అనుకూలంగా, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పుంఖాను పుంఖాలుగా తప్పుడు కథనాలను గుప్పిస్తున్నాయి.వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో తప్పుడు కథనాలను తొలగించడానికి సోషల్ మీడియా సంస్థలు నానా తంటాలు పడుతున్నాయి. ఎన్నికలకు ముందు తప్పుడు కథనాలను ప్రచారం చేసే యూజర్లను గుర్తించి, వారి అకౌంట్లను ఫేస్బుక్ తొలగిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రోజుకు దాదాపు పదిలక్షల వరకు అకౌంట్లను తొలగించింది.ఎన్నికల సమయంలో తప్పుడు కథనాల ప్రచారానికి సోషల్ మీడియాను సాధనంగా చేసుకోవడం అమెరికాలో మొదలైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2016లో జరిగినప్పుడు ‘ఫేస్బుక్’లో విపరీతంగా తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. వీటిని పెద్దసంఖ్యలో జనాలు చూశారు. ‘ప్యూ ఇంటర్నేషనల్’ సర్వే ప్రకారం అమెరికాలో 60 శాతం మంది ప్రధాన స్రవంతి మీడియా కంటే సోషల్ మీడియా కథనాలనే ఎక్కువగా అనుసరిస్తున్నట్లు తేలింది.ఇవి చదవండి: ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!! -
AP: డ్వాక్రా రుణాలపై ఎల్లో మీడియా చెత్త రాతలు.. వాస్తవాలివే..
సాక్షి, అమరావతి: ఏపీలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిని చూసి తట్టుకోలేని ఎల్లో మీడియాలో ప్రతీరోజు ఏదో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూనే ఉంది. ఇక, తాజాగా డ్వాక్రా మహిళల గురించి కూడా ‘ఈనాడు’ చెత్త కథనాలను ప్రచురించింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదుకున్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా దుష్ప్రచారం చేస్తోంది. వాస్తవాలు: డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నట్టేట ముంచితే సీఎం జగన్ ఆదుకున్నాడు 1) డ్వాక్రా పొదుపు సంఘాల అప్పు.. ►2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు బేషరతుగా మాఫీ చేస్తానన్న పొదుపు సంఘాల అప్పు రూ. 14వేల కోట్లు. ఆ తర్వాత ఐదేళ్లలో వడ్డీలపై వడ్డీలు పెరిగి 2019 ఎన్నికల నాటికి ఆ ఆప్పుల మొత్తం రూ. 25,571 కోట్లు అయ్యాయి. కానీ, ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ►ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా నాలుగు విడతల్లో నేరుగా ఆ మహిళలకు చెల్లిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పుల మొత్తం రూ. 25,571 కోట్లకు గాను ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,178 కోట్లు చెల్లించింది. నాలుగో విడత ఈ నెలలో ఇవ్వనున్నారు. 2) పొదుపు సంఘాల సున్నా వడ్డీ రుణాలు ►ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అమలులో ఉన్న పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తిగా మంగళం పాడేశారు. 2016 ఆగస్టు తర్వాత సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళలెవరికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ డబ్బు చెల్లించలేదు. ►ఇక, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించారు. గత నాలుగేళ్లుగా సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళల వడ్డీని ఏ ఏడాదికి ఆ ఏడాదే వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. రాష్ట్రంలో 1.05 కోట్ల మంది పేరిట ఉన్న 9.76 లక్షల పొదుపు సంఘాల రుణాలకు రూ.4,969 కోట్లు వడ్డీ భారం ఆ పేద మహిళల నెత్తిన పడకుండా ప్రభుత్వమే పూర్తిగా చెల్లించింది. ►వైఎస్సార్సీపీ ప్రభుత్వం క్రమం తప్పకుండా సున్నా వడ్డీ సొమ్ము చెల్లిస్తుండటంతో గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారాయి. మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తులు 18.36 శాతం నుంచి 0.33 శాతానికి తగ్గిపోయాయి. గత ప్రభుత్వంలో సీ,డీ గ్రేడ్‌లోకి దిగజారిన సంఘాలు జగనన్న ప్రభుత్వ సహకారంతో తిరిగి ఏ,బీ గ్రేడ్‌లోకి చేరాయి. -
ఏఐ టెక్నాలజీతో పుట్టుకొస్తున్న ఫేక్‌న్యూస్, ఇలా గుర్తించండి
నిజం నిలబడి ఉండగానే అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందంటారు.. ఈ సామెత సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పుట్టుకువచ్చే ఫేక్‌న్యూస్ విషయంలో సరిగ్గా సరితూలుతుంది. ఈ ఫేక్ న్యూస్ వల్ల నిజమేదో తెలుసుకోవడం కష్టంగా మారింది. అబద్దాన్ని నిజం అనుకునే ప్రమాదమూ ఉంటోంది. అలాగే.. ఫొటోలు, వీడియోలు కూడా ఫేక్‌వి పుట్టుకొస్తున్నాయి. లైవ్ వీడియోలోనూ ఇటీవల ఏఐ టెక్నాలజీ ద్వారా అబద్ధం కొత్తగా సోషల్‌మీడియాను ఏలుతోంది. నిజమేంటో తెలుసుకోవడానికి మనం చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటోంది. ఎందుకంటే, అబద్దాల వల్ల కలిగే మోసాలు ఎన్నో. వాటి బారిన పడకుండా జాగ్రత్త పడాలంటే ముందుగా నిజాలేమిటో తెలుసుకుందాం... వార్తలకు సంబంధించిన సమాచారం, డేటా, నివేదికలు పూర్తిగా నిజమైనవి కానివి ప్రజల ముందుకు వస్తున్నాయి. అందుకని, మూలాధారాలు లేకుండా వచ్చిన సమాచారం అవాస్తవం అని గ్రహించాలి. అబద్ధపు వార్తలు విస్తృతంగా షేర్ అవుతుంటాయి. వీటికి ఎలాంటి సెన్సార్షిప్ ఉండదు. నకిలీ వార్తల పుట్టుకకు.. తమకు తెలిసిన విషయాన్ని నలుగురికి తెలియజేయాలనే ఆత్రుత. స్వీయ లాభం, రాజకీయ ప్రభావం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. కేవలం తమకు తెలిసినవి మరికొందరికి తెలియజేద్దామని నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు అదేపనిగా షేర్ చేస్తుంటారు. సమాచారం అబద్ధమే కావచ్చు కానీ, దానిని షేర్ చేసే వ్యక్తి అది నిజమని నమ్ముతారు. తప్పుడు సమాచారం అని తెలిసీ ఉద్దేశపూర్వకంగానే షేర్ చేస్తారు. ఏదైనా సమస్యకు లేదా వ్యక్తికి సంబంధించిన కంటెంట్ అబద్ధమైతే మనల్ని ఆ వార్త తప్పుదారి పట్టించవచ్చు. ముఖ్యాంశాలు, విజువల్స్, క్యాప్షన్లు కంటెంట్‌కు సరిపోని విధంగా ఉంటాయి. మోసగించడానికి ఫొటోలు, కంటెంట్‌ను తారుమారు చేస్తుంటారు. తనిఖీ చేసే విధానం.. ►వీడియో మూలం ఎక్కడ ఉందో చెక్ చేయాలి. అది విశ్వసనీయమైనదే అని నిర్ధారించుకోవడానికి ప్రయత్నించాలి. ►సమాచారం నిజమైనదైనా ప్రత్యామ్నాయంగా ఇతర మూలాధారాల కోసం వెతకాలి. ► వీడియోలో అసహజమైన కదలికలు ఉన్నాయేమో గమనించాలి. ► డీప్ ఫేక్స్ గుర్తించడానికి ‘డీప్ ఫేక్ డిటెక్షన్ మోడల్’ వంటి స్పెషల్ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. ► వీడియోలోని సంఘటనలు నమ్మదగినవేనా? ఆ వీడియో ఏ సందర్భాన్ని బట్టి తీశారో ఆ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. ► వీడియోలో ఉన్న వ్యక్తిని మెయిల్, ఫోన్ ద్వారా సంప్రదించి, ప్రామాణికతను ధృవీకరించుకోవడానికి ప్రయత్నించవచ్చు. వాస్తవం తెలుసుకోవాలంటే.. గూగుల్ రివర్స్ ఇమేజ్ చెక్ చేయాలి. లేదా ఫొటో వెరిఫికేషన్ కోసం www.tineye.comని ఉపయోగించాలి. ఫొటో లేదా వీడియో (https://www.invid-project.eu/tools-and-services/invid-verification-plugin/) కోసం ఇన్విడ్ టూల్‌కిట్ ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేయాలి. ఫార్వర్డ్ చేసే ముందు ఏదైనా ఒక అంతర్జాతీయ ఫాక్ట్–చెకింగ్ నెట్వర్క్ ఆర్గనైజేషన్‌తో www.factly.in ని వాస్తవాన్ని చెక్ చేయాలి. ఇలా గుర్తించాలి... ►డీప్ ఫేక్ వీడియో లేదా అడియోలో ఏవైనా లోపాలు ఉన్నాయేమో జాగ్రత్తగా పరిశీలించడం, వినడం చేయాలి. ► డీప్ ఫేక్ వీడియో లేదా ఫొటోలలో లైటింగ్ నీడలను చెక్ చేయాలి. కొన్నింటిలో నీడలు కచ్చితంగా కనిపించకపోవచ్చు. ► ఇవే కాకుండా ఇంకేమైనా లోపాలు ఉన్నాయేమో చెక్ చేయాలి. వీడియోలలోని బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయాలి. ► సబ్జెక్ట్‌కు వీడియోలోని వ్యక్తుల కదలికల సరిపోలకపోవచ్చు. అంటే, ఎఐ టెక్నాలజీ ద్వారా నకిలీ వ్యక్తుల సృష్టి అయి ఉండవచ్చు. ► వీడియోలో వ్యక్తి కనురెప్పలు ఆర్పుతున్నారో లేదో పరిశీలించాలి. ► లైవ్ వీడియోలో మాట్లాడుతున్నప్పుడు ముఖాన్ని ఎడమ లేదా కుడికి కదిలించమని సదరు వ్యక్తిని ఉద్దేశించి అడగాలి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
Heath Streak: హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడు.. నీకసలు బుద్ధుందా? ఫ్యాన్స్ ఫైర్
Henry Olonga confirms Heath Streak is well: హీత్ స్ట్రీక్ అభిమానులకు శుభవార్త! ఈ దిగ్గజ ఆల్‌రౌండర్ బతికే ఉన్నట్లు సహచర క్రికెటర్ హెన్రీ ఒలంగ ప్రకటించాడు. థర్డ్ అంపైర్ అతడిని వెనక్కి పిలిచాడంటూ మరో ట్వీట్ చేశాడు. జింబాబ్వే లెజెండరీ క్రికెటర్ హీత్ స్ట్రీక్ మరణించాడన్న వార్తను తొలుత సోషల్ మీడియాలో షేర్ చేసింది ఒలంగానే కావడం గమనార్హం. పిచ్చి పిచ్చి ట్వీట్లు ఎందుకు? అయితే, అవన్నీ వదంతులేనంటూ తాజాగా మరో ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు అతడిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇలాంటి విషాదకర వార్తలను ధ్రువీకరించకుండా పిచ్చి పిచ్చి ట్వీట్లు చేయడం ఎందుకని మండిపడుతున్నారు. కాగా క్యాన్సర్‌తో పోరాడుతూ హీత్ స్ట్రీక్ చనిపోయాడని ఒలంగ బుధవారం ట్విటర్లో తెలిపాడు. నీకసలు బుద్ధుందా? జింబాబ్వే ప్రస్తుత కెప్టెన్ సీన్ విలియమ్స్ సైతం నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశాడు. దీంతో హీత్ స్ట్రీక్ అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అయితే, అతడు బతికే ఉన్నాడంటూ ఒలంగ ట్వీట్ చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతటి గందరగోళానికి కారణమైన ఒలంగను నీకసలు బుద్ధుందా అంటూ ఏకిపారేస్తున్నారు. 13 ఏళ్ల కెరీర్ కాగా 13 ఏళ్ల పాటు జింబాబ్వే క్రికెటర్‌గా పలు అరుదైన ఘనతలు సాధించిన హీత్ స్ట్రీక్ 2005లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత కోచ్‌గా మారాడు. జింబాబ్వేతో పాటు పలు క్రికెట జట్లకు కోచ్‌గా వ్యవహరించిన 49 ఏళ్ల హీత్ స్ట్రీక్ ప్రస్తుతం క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. కాగా జింబాబ్వే ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్‌గా హీత్ స్ట్రీక్ చరిత్రకెక్కాడు. చదవండి: ఆసియా కప్ జట్టులో చోటు దక్కకున్నా.. వరల్డ్‌కప్ టోర్నీలో ఎంట్రీ ఖాయం! హీత్ స్ట్రీక్ అరుదైన రికార్డులు.. తొలి మ్యాచ్‌లో నో వికెట్! నాడు టీమిండియాను ఓడించి.. I can confirm that rumours of the demise of Heath Streak have been greatly exaggerated. I just heard from him. The third umpire has called him back. He is very much alive folks. pic.twitter.com/LQs6bcjWSB — Henry Olonga (@henryolonga) August 23, 2023 #Heathstreak fake news failane walo ke sath pic.twitter.com/jPTkLzsOwd — Raja Babu (@GaurangBhardwa1) August 23, 2023 Zimbabwean legend Heath Streak confirms he's alive.#HeathStreak pic.twitter.com/eAS2VKsker — Manjeet Singh Ghoshi (@ghoshi_manjeet) August 23, 2023 Heath Streak at 6:00 AM : Dead Heath Streak at 10:00 AM : Alive Review successful, Yamraj's decision overturned.#HeathStreak pic.twitter.com/RqbcXphfBG — Roshan Rai (@RoshanKrRaii) August 23, 2023 -
పోలవరంపై ఏదీ దాచాల్సిన అవసరం మాకు లేదు: మంత్రి అంబటి
సాక్షి, ఏలూరు: మంత్రి అంబటి రాంబాబు పోలవరం పర్యటనకు వెళ్లారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్-2 శాండ్ ఫిల్లింగ్ను మంత్రి అంబటి పరిశీలించారు. ఇదే సమయంలో స్పిల్‌వే వద్ద కుంగిన గైడ్‌బండ్‌ను పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి అంబటి మాట్లాడుతూ.. గైడ్‌బండ్ కుంగిన ఘటనపై ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. గైడ్‌బండ్‌పై తప్పుడు ప్రచారం చేయవద్దు. కుంగిన గైడ్‌బండ్‌ను ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పరిశీలించింది. పోలవరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే ప్రత్యేక వైవిధ్యం కలిగిన ప్రాజెక్ట్. పోలవరాన్ని పరిశీలిస్తామని కొందరు హడావుడి చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ను పరిశీలించాలంటే ముందు అప్లై చేసుకోవాలి. పోలవరం పనులపై ఏదీ దాచాల్సిన అవసరం మాకు లేదు. రాజకీయ లబ్ది కోసం విపక్షాలు ప్రయత్నించడం దారుణం. పోలవరం నిర్మాణంలో చిత్తశుద్ధితో ఉన్నాం అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: విశాఖ పోలీసులు అలర్ట్‌గా ఉన్నారు కాబట్టే కిడ్నాపర్లను పట్టుకోగలిగాం: డీజీపీ రాజేంద్రనాథ్ -
పంటల బీమాపై పచ్చ రాతలు
-
ట్రాన్స్ఫార్మర్లపై పచ్చ మీడియా తప్పుడు లెక్కలు
సాక్షి, అమరావతి: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు, నిల్వలపై ‘కేరాఫ్ కడప.. విచ్చలవిడిగా ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్లు’ శీర్షికతో అర్ధం లేని రాతలు, పొంతనలేని లెక్కలతో పచ్చి అబద్ధాలను ప్రచురించి పచ్చ పత్రిక అడ్డంగా దొరికిపోయింది. డిస్కమ్‌లపై బురద చల్లేందుకు ప్రయత్నించి అభాసుపాలైంది. తప్పుడు రాతల వెనుక వాస్తవాలను ‘ఏపీసీపీడీసీఎల్’ వెల్లడించింది. ఆరోపణ: 2021 ఏప్రిల్ 1 నాటికి రూ.145.86 కోట్ల విలువైన 88,88,203 ట్రాన్స్ఫార్మర్లు డిస్కమ్ పరిధిలోని వివిధ స్టోర్లలో ఉన్నాయి. వాస్తవం: 2021 ఏప్రిల్ 1 నాటికి రూ.10.77 కోట్లు విలువైన 633 ట్రాన్స్ ఫార్మర్లు మాత్రమే ఉన్నాయి. ఆరోపణ: 2021 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ 31 మధ్య రూ.956.69 కోట్లతో 4,44,09,492 ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేశారు. వాస్తవం: 2021 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ 31 మధ్య రూ.358.97 కోట్లతో 32,728 ట్రాన్స్ఫార్మర్లను మాత్రమే కొనుగోలు చేశారు. ఆరోపణ: 2022 డిసెంబర్ 31 నాటికి విజయవాడ, గుంటూరు, సీఆర్డీఏ, ఒంగోలు స్టోర్స్‌లో రూ.385.38 కోట్ల విలువైన 1,22,61,706 ట్రాన్స్ ఫార్మర్లు నిల్వ ఉంచారు. వాస్తవం: గత డిసెంబర్ 31 నాటికి అన్ని స్టోర్స్‌లో కలిపి రూ.149.86 కోట్ల విలువైన 16,634 ట్రాన్స్ ఫార్మర్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఆరోపణ: ఏడాదిన్నరలోనే ఏపీసీపీడీసీఎల్ పరిధిలో రూ.కోట్ల విలువైన ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోలు చేయడం వెనుక భారీ వ్యూహం ఉంది. వాస్తవం: ప్రస్తుతం స్టోర్లలో నిల్వ ఉన్న 16,634 ట్రాన్స్ఫార్మర్ల నుంచి 13,361 ట్రాన్స్ఫార్మర్లను కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం, చోరీకి గురైన చోట్ల కొత్తవి ఏర్పాటు, రోలింగ్ స్టాక్ కోసం వినియోగించనున్నారు. వర్షాలతో పొలాల్లో నీరు చేరడం, కోతల సమయం కావడంతో ట్రాన్స్ఫార్మర్లు బిగించడానికి అవకాశం లేక కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. వేసవి చివరి కల్లా పెండింగ్‌లో ఉన్న అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు నిల్వ చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వినియోగిస్తారు. ఆరోపణ: ఏబీవీ, బీహెచ్ఈఎల్, ఎల్ అండ్ టీ లాంటి ప్రముఖ కంపెనీలు తక్కువకే ఇస్తుంటే ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. వాస్తవం: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన కొనుగోళ్లు పూర్తిగా టెండర్ల ద్వారా మాత్రమే జరుగుతాయి. ఓ పత్రికలో పేర్కొన్న సంస్థలు టెండర్ల ప్రక్రియలో ఇప్పటి వరకూ పాల్గొనలేదు. 11 కేవీ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను రూ.5 లక్షలకు, 33 కేవీ ట్రాన్స్ ఫార్మర్లను రూ.8.5 లక్షలకు కొనుగోలు చేయడం లేదు. -
XBB వేరియంట్ వెరీ డేంజర్.. కేంద్రం స్పందన ఇదే..
కరోనా వైరస్ వేరియంట్లు ప్రపంచ దేశాలను మరోసారి భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కొత్త వేరియంట్ల కారణంగా ఇప్పటికే చైనాతో పాటుగా మరికొన్ని దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో, అక్కడ ప్రభుత్వాలు వైరస్ కట్టడికి పూర్తి స్థాయిలో ప్రణాళికలు చేస్తున్నాయి. కాగా, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇటు భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇదిలా ఉండగా.. కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్‌పై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్తు కొడుతోంది. కోవిడ్ ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ వ్యాప్తి ప్రారంభమయిందని.. అలాగే ఈ వేరియంట్ ప్రాణాంతకమైనదంటూ వాట్సాప్ గ్రూప్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. దీంతో, పాటుగా ఎక్స్‌బీబీ వేరియంట్‌ను గుర్తించడం చాలా కష్టమని అందులో ఉంది. దీని వల్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని.. ఇది గతంలో వచ్చిన డెల్టా వేరియంట్ కన్నా ఐదు రెట్లు ప్రమాదకరమైనదని.. కాబట్టి మరింత జాగ్రత్త అవసరం అంటూ వార్తలో రాసి ఉంది. కాగా, వార్తపై నెటిజన్లు భయాందోళనలకు గురవుతున్నారు. ఇక, ఈ వార్తపై కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ ఇచ్చింది. ఇది ఫేక్ వార్త అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ కొట్టిపారేసింది. ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందించింది. ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్‌పై సోషల్ మీడియాలో ఫేక్ వార్త ప్రచారంలో ఉంది. ఈ వార్తలను ప్రజలు నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని సీరియస్ కామెంట్స్ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం అప్రమత్తంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. మరోవైపు.. ఎక్స్‌బీబీ వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. ఎక్స్‌బీబీ వేరియంట్ వల్ల సోకే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. #FakeNews This message is circulating in some Whatsapp groups regarding XBB variant of #COVID19. The message is #FAKE and #MISLEADING. pic.twitter.com/LAgnaZjCCi — Ministry of Health (@MoHFW_INDIA) December 22, 2022 -
ఆ రెండింటిపై హోం శాఖ అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: గిల్గిట్ బాల్టిస్తాన్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలపై వస్తున్న తప్పడు సమాచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం సూచించింది. గిల్గిట్ బాల్టిస్తాన్, లడక్లపై సోషల్ మీడియాలో ఇటీవల షేర్ చేసిన సమాచారం ప్రామాణికమైనది కాదని హోంమంత్రిత్వ శాఖ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది. దీనిపై హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందిస్తూ.. గిల్గిట్-బాల్లిస్తాన్పై ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ట్విటర్ ఖాతా ధ్రువీకరించబడినది కాదు. 31,000 మంది ఫాలోవర్స్ ఉన్న ఈ ఖాతా గిల్గిట్-బాల్టిస్తాన్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల అధికారిక ట్విటర్ ఖాతా కాదు’ అని ట్వీట్ చేసింది. కేంద్ర భూభాగానికి చేందిన లడఖ్ అధికారిక ట్విటర్ ఖాతాలు రెండు మాత్రమే ఉన్నాయని తెలిపింది. అవి @DIPR_Leh, @InformationDep4లు అధికారికమైనవని వెల్లడించారు. (భారత్‌పై పాకిస్తాన్ తీవ్ర విమర్శలు) The Union Territory of Ladakh has two official Twitter handles ie.“DIPR Leh Ladakh, @DIPR_Leh” & “Information Department Kargil, @InformationDep4” & only these two Twitter handles are used by the administration of Ladakh to disseminate data & to make all important announcements. pic.twitter.com/ESxRlTpP6Z — DIPR Leh Ladakh (@DIPR_Leh) May 12, 2020 ఇక 31వేల మంది ఫాలోవర్స్ ఉన్న ఖాతా నకిలీదని.. అది షేర్ చేసిన సమాచారం ప్రామాణికమైనదిగా పరిగణించలేమని చెప్పింది. కాగా లడక్ కేంద్రపాలిత ప్రాంతాలపై అధికారిక సమాచారం కోసం దయచేసి @DIPR_Leh & @ InformationDep4 ఖాతాలను మాత్రమే అనుసరించాలని విజ్ఞప్తి చేసింది. వీటికి సంబంధించిన ప్రభుత్వ అధికారిక ఖాతాలు ఇవి రెండు మాత్రమే ఉన్నాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గిల్గిట్ బాల్టిస్తాన్, లడక్, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని గాని, ముఖ్యమైన ప్రకటనలను వీటి ద్వారానే అధికారులు ప్రకటించడం లేదా విడుదల చేయడం జరుగుతుందని వెల్లడిచింది. కాబట్టి లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలపై, వాటికి సంబంధించి వస్తున్న సమాచారాలు, ప్రకటనలపై దేశ ప్రజలంతా జాగ్రత్త వహించాలని ట్వీట్లో పేర్కొంది. చదవండి: 20 ఏళ్లలో 5 వైరస్లు అక్కడినుంచే..! అదే పాత సింహాలు ఇప్పుడు కొత్త పేరుతో -
ఫేక్ న్యూస్ : ఈపీఎఫ్ఓ రూ. 80వేలు ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగులకు తాజాగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ)ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సంస్థ రూ.80,000లు బహుమతి ఇస్తుందంటూ సోషల్ మీడియాలో ఒక సందేశం విపరీతంగా షేర్ అవుతోందని.. ఇది ఫేక్ అని తేల్చి చెప్పింది. ఇలాంటి సత్యదూరమైన మెసేజ్‌ల పట్ల అప్రతమత్తంగా ఉండాలని సూచించింది. తామెలాంటి ఆఫర్లను అందించడం లేదని స్పష్టం చేసింది. ఈపీఎఫ్ఓ చందాదారులకు బంపర్ అఫర్‌అంటూ ఒక ఫేక్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కేవలం 1990 నుంచి 2019 మధ్య కాలంలో పని చేసిన వారికే వర్తిస్తుందని..ఇక దాన్ని పొందాలంటే కింద ఇచ్చిన వెబ్ సైట్ లింక్‌లో వివరాలు తెలియజేయాలంటూ ఓ వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. దీంతో ఖాతాదారులు ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సంస్థ ఇది ఫేస్ న్యూస్ అని, ఇలాంటి పుకార్లను నమ్మవద్దవని స్పష్టం చేసింది. అలాగే ఈపీఎఫ్ఓ పేరుతో వచ్చే నకిలీ కాల్స్, మెసేజ్స్ వచ్చినా కూడా స్పందించరాదని ఖాతాదారులను హెచ్చరించింది. ఈ మేరకు అధికారిక ట్విటర్ ద్వారా ఇటువంటి వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది. Beware of FAKE OFFERS by Websites/Telecalls/SMS/email/Social Media, ASKING TO DEPOSIT MONEY into any Bank Account towards Claim Settlement/Advance/Higher Pension/ or any other service provided by #EPFO.#Fraud #FakeCalls #Lottery pic.twitter.com/ekuvhcyJsq — EPFO (@socialepfo) October 29, 2019 -
ఫేస్బుక్లో కొత్త అప్డేట్ ‘న్యూస్ ట్యాబ్’
వాషింగ్టన్: ఫేస్బుక్లో ‘న్యూస్ ట్యాబ్’తో కూడిన కొత్త అప్డేట్ శుక్రవారం నుంచి వినయోగదారులకు అందుబాటులో ఉంచారు. ఈ మేరకు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ శుక్రవారం తెలిపారు. ఇందులో వినియోగదారులు తమ ఇష్టాలకు అనుగుణమైన వార్తలను పొందే అల్గారిథమ్‌ను ఉపయోగించనున్నారు. ఫేస్బుక్లో వస్తున్న అసత్య వార్తల రీత్యా పలు చోట్ల నిరసనలు, ప్రభుత్వాల నుంచి హెచ్చరికలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో అసత్య వార్తలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఫేస్బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. పాత్రికేయ వృత్తికి మార్క్ జుకర్‌బర్గ్ ఇస్తున్న గౌరవం గొప్పదని ఇప్పటికే పలు వార్తా పత్రికల అధినేతలు ఆయన్ను పొగిడారు. అమెరికావ్యాప్తంగా ఉన్న సుమారు 200 వార్తా సంస్థలతో వార్తలు అందించేందుకు ఫేస్బుక్ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
ఇకపై ఫేస్బుక్లో వార్తలు
శాన్ఫ్రాన్సిస్కో: ఇకపై ఫేస్బుక్లో మిత్రులు, బంధువుల పోస్టులతో పాటు వార్తలు సైతం కనిపిస్తాయి. ఫేస్బుక్ అధికారికంగా తెస్తున్న ఈ వార్తలను ప్రత్యేక ఫీడ్ (ట్యాబ్)లో ఉంచనుంది. వార్తలను వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెందిన పబ్లిషర్ న్యూస్ కార్ప్ నుంచి వచ్చేలా చర్యలు తీసుకోనుంది. రానున్న కొద్ది వారాల్లో దీనికి సంబంధించిన అప్డేట్ రానుంది. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ కో ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. జర్నలిజం విలువను గుర్తించినందుకు ఫేస్‌బుక్‌కు క్రెడిట్ దక్కుతుందని న్యూస్ కార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ థామ్సన్ అన్నారు. ఈ వార్తాసంస్థతో ఉన్న ఒప్పంద విలువ మాత్రం బయటకు రాలేదు. ఫీడ్‌లో ఏ వార్తలు టాప్‌లో ఉండాలో ఒక బృందం నిర్ణయిస్తుంది. ఇటీవలి కాలంలో ఫేస్బుక్లో ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతూ పలువురి ప్రాణాలు బలిగొంటున్న సంగతి తెలిసిందే. ఇటువంటి ఫేక్ న్యూస్‌ను అధికారిక వార్తా సంస్థల ద్వారా వచ్చే వార్తలతో అడ్డుకట్ట వేయవచ్చని పలువురు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాల ధాటికి వార్తా సంస్థలకు వినియోగదారులు రోజురోజుకూ కొంత తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సమస్యలకు ఇది పరిష్కారమార్గమని కూడా నిపుణులు చెబుతున్నారు. ఫేస్బుక్లో యూజర్ ఇంటరెస్ట్ ఆధారంగానే పలు పోస్టులు వచ్చినట్లు.. యూజర్ ఇంటరెస్ట్ ఆధారంగానే వార్తలు కూడా ప్రత్యేక ఫీడ్(ట్యాబ్)లో కనిపించనున్నాయి. -
ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం రేపిన వ్యక్తికి రిమాండ్
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నై బయలుదేరుతున్న విమానాల్లో బాంబులున్నాయంటూ తప్పుడు సమాచారం అందించి కలకలం సృష్టించిన కేవీ విశ్వనాథన్‌ను ఆదివారం ఆర్జీఐఏ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. చెన్నైకి చెందిన విశ్వనాథన్ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై మానసికస్థితి సరిగా లేకపోవడంతో శనివారం ఉదయం చెన్నై వెళ్లే విమానాల్లో బాంబులున్నాయంటూ అధికారులకు సమాచారం అందించిన సంగతి తెలిసిందే. విమానాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు చెన్నై వెళ్లడానికి అక్కడే వేచి ఉన్న కేవీ విశ్వనాథన్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అంతా ఉత్తిదేనని తేలింది. మానసికస్థితి సరిగ్గా లేకపోవడంతో పాటు సంచలనం సృష్టించాలనే ఆలోచనతో అతడు తప్పుడు సమాచారం అందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. భద్రతకు భగ్నం కలిగించే ప్రయత్నంతో పాటు ఉద్యోగుల విధులకు ఆటంకం, ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసినందుకు అతడిపై పౌర విమానయాన చట్టం ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆర్జీఐఏ సీఐ రామకష్ణ తెలిపారు. -
‘షేర్’ ఖాన్లు జాగ్రత్త!
ఒడిశా, బిహార్, జార్ఖండ్ నుంచి 500 మంది బిచ్చగాళ్ల వేషంలో బయల్దేరారు. వీరు చిన్నారులను చంపి వారి అవయవాలను మెడికల్ కాలేజీలకు విక్రయిస్తున్నారు అంటూ కొన్ని పోస్టులు, ఫొటోలు కొంతకాలంగా వాట్సాప్ గ్రూపుల్లో కలకలం రేపుతున్నాయి. మీ ప్రాంతంలో నరమాంస భక్షకులు యాచకుల రూపంలో సంచరిస్తున్నారంటూ, మనిషి మాంసం కాల్చి తింటున్నారంటూ మరోపోస్టు కూడా వైరల్‌గా మారుతోంది. సాక్షి, హైదరాబాద్: వాస్తవానికి ఈ పోస్టుల్లోని ఫొటోలేవీ మనదేశానికి సంబంధించినవి కావు. కేవలం ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికి కొందరు ఆకతాయిలు వాటికి స్థానికత రంగు పులిమి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. వీటిపై అవగాహన లేక చాలామంది ఎడాపెడా వాటిని వైరల్ చేస్తున్నారు. ఫలితంగా ప్రజల్లో అభద్రతాభావం పెరిగిపోతోంది. ముఖ్యంగా గ్రామాల్లో ఎవరు కొత్తవారు కనబడినా.. ఈ పోస్టుల పుణ్యమాని వారిని అనుమానించాల్సిన పరిస్థితి. అదీ చీకటి పడ్డాక ఎవరు చిన్నారులను పలకరించినా.. వారిని కిడ్నాపర్లుగా భ్రమించి ఎడాపెడా చితకబాదే ప్రమా దాలు పుష్కలంగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఇలాగే మూకహత్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఎక్కడి ఫొటోలతోనో.. ఇక్కడ దుష్ప్రచారం వాస్తవానికి ఆ పోస్టులకు మనదేశానికి ఎలాంటి సంబంధం లేదు. బిచ్చగాళ్ల ఫొటో కర్ణాటకలో కొందరు దొంగలను ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఫొటోలు. మరికొన్ని 2017లో బ్రెజిల్ జైల్లో జరిగిన అల్లర్లకు సంబంధించినవి. ఇంకొన్ని థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ లాంటి ఆగ్నేయాసియా దేశాల్లో జరిగిన సామూహిక హత్యలకు సంబంధించిన పాత చిత్రాలు. ఇలాంటి పోస్టుల ఫలితంగా బిచ్చగాళ్లకు భద్రత లేకుండా పోతోంది. ఊరూరా తిరిగి వస్తువులు అమ్ముకుని బతికే చిల్లర వ్యాపారులను కిడ్నాపర్లుగా భావించి జనాలు కొట్టి చంపే ప్రమాదముంది. మరోవైపు మనదేశానికి ఐరోపా, అమెరికా తదితర దేశాల నుంచి వచ్చే యాత్రికుల ప్రాణాలకూ ముప్పు పొంచి ఉంది. ఎక్కడో ఎవరో మహిళ గాయపడితే.. పాతబస్తీలో ఫలానా వర్గంపై దాడి చేశారంటూ కూడా ఫొటోలు వైరల్ చేస్తూ కొన్ని వర్గాల మధ్య చిచ్చుపెట్టి, శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను పోలీసులు ఎప్పటికప్పుడు గుర్తిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అలాంటి పోస్టులే తెలంగాణ లో కనిపించే సరికి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇలాంటి పోస్టులు వైరల్ చేస్తున్నవారిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పోస్టులు పెట్టే గ్రూప్ అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ కార్యాలయం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ జాగ్రత్తలు పాటించండి.. 1 గ్రూపులో ఇలాంటి పోస్టులు పెట్టవద్దని హెచ్చరించండి. అయినా పోస్టులు పెడితే.. వారిపై మీరే పోలీసులకు సమాచారం ఇవ్వండి. 2 ఫేక్‌న్యూస్‌ను గుర్తించేందుకు గూగుల్‌లో ఆప్షన్ ఉంది. మనకు వచ్చిన పోస్టు లేదా ఫొటోను గూగుల్‌లో అప్లోడ్ చేసి సెర్చ్‌చేస్తే.. దాన్ని తొలుత ఎవరు.. ఎక్కడ నుంచి పోస్టు చేశారు? తదితర విషయాలన్నీ ఇట్టే తెలిసిపోతాయి. 3 ఓ మతాన్ని లేదా వర్గాన్ని కించపరిచేలా, అగౌరవ పరిచేలా వచ్చే పోస్టులను చూసిన వెంటనే షేర్ చేయవద్దు. అది పోలీసులు నేరంగా పరిగణిస్తారు. 4 వచ్చిన పోస్టు, ఫొటో కొత్తదా పాతదా అన్నది కచ్చితంగా నిర్ధారించుకోవాలి. ఎందుకంటే 24 గంటల న్యూస్‌చానళ్లు, వెబ్‌చానళ్లు, న్యూస్‌యాప్స్ వచ్చిన ఈ రోజుల్లో అందులో కాకుండా పోస్టుల రూపంలో ఎలాంటి కొత్త వార్తలూ రావని తెలుసుకోవాలి. 5 పోస్టుల్లో ఉండే విదేశీయుల్ని కూడా సులభంగా గుర్తు పట్టవచ్చు. ఆగ్నేయాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ప్రజలు మనదేశంలోకి రావడం, హత్యలకు పాల్పడటం అంత సులువు కాదు. కాబట్టి వారిని గుర్తించగానే ఇలాంటి పోస్టులను షేర్ చేయకుండా వదిలేయడమే మంచిది. -
వాట్సాప్ తాజా ప్రకటన చూశారా?
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తెలుగు ప్రజలకు తాజా హెచ్చరికలను జారీ చేసింది. ఇటీవలి కాలంలో తప్పుడు సందేశాలు, పుకార్లు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా షేర్ కావడం, అనంతరం జరుగుతున్న అమానుష దాడుల నేపథ్యంలో వాట్సాప్ ఈ ప్రకటనను విడుదల చేసింది. యూజర్లు అందుకున్న సమాచారం నిజమైనదా, నకిలీదా నిర్ధారించుకోవడానికి సంబంధించి 10 చిట్కాలను ఈ ప్రకటనలో సూచించింది. వార్తాపత్రికల్లో ఒక ప్రకటన జారీ చేసింది. తప్పుడు సమాచారం, అసత్య వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. పుకార్ల వ్యాప్తిని నిరోధించడంలో తమతో సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఉభయ తెలుగు రాష్టాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలపై దాడులు, మరణాలు చోటుచేసుకోవడంతో వాట్సాప్ ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నకిలీ వార్తలను అరికట్టడానికి వాట్సాప్ చేస్తున్న ప్రయత్నంపై తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి స్వాగతించారు. మరోవైపు కేవలం ప్రకటనలను మాత్రమే విడుదల చేస్తే పరిస్థితిలో పెద్దగా మార్పేమీ ఉండదని అల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలను ఇప్పటికే చేపట్టి ఉండాల్సిందని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా తగిన చర్యలు చేపట్టాలన్నారు. -
అర్ధరాత్రి అలర్ట్.. సిటీ వణికిపోయింది
అర్ధరాత్రి నగరం మొత్తం గాఢ నిద్రలో ఉన్న వేళ.. ఒక్క మెసేజ్ నగరం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. జాంబీల భయంతో నిద్రలేని రాత్రి గడిపారు. అయితే ఉదయం అయ్యాక అదంతా ఉత్త పుకారే అని తేలటంతో అధికారులపై ప్రజలు మండిపడ్డారు. ఫ్లోరిడా: విషయంలోకి వెళ్తే మే 20వ తేదీన ఫ్లోరిడాలోని లేక్వర్త్ నగరంలో ప్రజలంతా నిద్రిస్తున్న వేళ.. అర్ధరాత్రి ఓ సందేశం వచ్చింది. ‘విద్యుత్ అంతరాయం.. జాంబీ అలర్ట్.. సగం జనాభా ప్రమాదంలో ఉంది. పరిస్థితి మాములు స్థితికి వచ్చేందుకు ఎంత టైం పడుతుందో ఖచ్ఛితంగా చెప్పలేం’ అంటూ అర్ధరాత్రి 1గం.45ని. సమయంలో సందేశం వచ్చింది. ఆ అలర్ట్ చూసిన ప్రజలంతా వణికిపోయి రాత్రంతా చీకట్లోనే జాగారం చేశారు. ఉదయానికల్లా వార్త దావానంలా పాకటంతో అధికారులు రంగంలోకి దిగారు. పబ్లిక్ ఇన్ఫర్మెన్ కార్యాలయం నుంచే ఆ సందేశం ప్రచారం కావటంతో నగరవాసులకు క్షమాపణలు తెలియజేశారు. తాము కేవలం పవర్‌కట్‌కు సంబంధించి సందేశం మాత్రమే పంపామని.. జాంబీ అలర్ట్‌ను ఎవరో జత చేసి ఉంటారని ప్రకటించారు. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి ఓ మాజీ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇలాంటి పుకార్లు గతంలోనూ ప్రజలకు దడ పుట్టించాయి. ఈ ఏడాది జనవరిలో హవాలి వాసులకు బాలిస్టిక్ మిసైల్ దాడి అంటూ ఓ సందేశం పాకిపోయి పెనుకలకలమే రేగింది. -
సాక్షి వెబ్సైట్ పాఠకులకు మనవి
సాక్షి, హైదరాబాద్: పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటూ, ఎప్పటికప్పుడు జాతీయ, అంతర్జాతీయ సహా పలు విభాగాల్లో తాజా సమాచారం అందించడంతోపాటు కదిలించే కథనాలతో ముందుకెళుతున్న 'సాక్షి వెబ్సైట్'ను అబాసుపాలు చేసేందుకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కుట్రలు చేస్తున్నారు. చేయకూడని తప్పులు సాక్షి వెబ్సైట్ చేసినట్లుగా, రాయని వార్తలు రాసినట్లుగా సాక్షి వెబ్ సైట్ హోంపేజీతో సహా మార్ఫింగ్ చేసి సాక్షి వెబ్ సైట్ పేరిట తప్పుడు కథనాలు వెలువరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పాఠకులను తప్పుదోవపట్టిస్తున్నారు. ఉదాహరణకు.. ఇటీవల 'వెంకయ్యనాయుడును ఉప-రాష్ట్రపతిగా ప్రతిపాదించింది నేనే: జగన్' అనే శీర్షికతో సాక్షి వెబ్సైట్లో కథనం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో ఓ వార్త దుష్ప్రచారం జరిగింది. అయితే, ఇది గుర్తు తెలియని కొందరు వ్యక్తులు మార్ఫింగ్, ఎడిటింగ్ చేసి వెలువరించిన కథనమే తప్ప సాక్షి వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాము. సాక్షి వెబ్సైట్, అధికారిక సోషల్ మీడియా ఖాతాలో తప్ప మరే ఇతర సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వార్తలు కనిపించినా అవి ఫేక్ అని గుర్తించాలని, అలాంటి వార్తలకు సాక్షి వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాము. దయచేసి అలాంటి కథనాలను నమ్మవద్దని తెలుగు పాఠకులకు ముఖ్యంగా సాక్షి పాఠకులకు విజ్ఞప్తి చేస్తున్నాము.