వాషింగ్టన్: ఫేస్‌బుక్‌లో ‘న్యూస్ ట్యాబ్’తో కూడిన కొత్త అప్‌డేట్ శుక్రవారం నుంచి వినయోగదారులకు అందుబాటులో ఉంచారు. ఈ మేరకు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ శుక్రవారం తెలిపారు. ఇందులో వినియోగదారులు తమ ఇష్టాలకు అనుగుణమైన వార్తలను పొందే అల్గారిథమ్‌ను ఉపయోగించనున్నారు. ఫేస్‌బుక్‌లో వస్తున్న అసత్య వార్తల రీత్యా పలు చోట్ల నిరసనలు, ప్రభుత్వాల నుంచి హెచ్చరికలు వెళ్లాయి.
ఈ నేపథ్యంలో అసత్య వార్తలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. పాత్రికేయ వృత్తికి మార్క్ జుకర్‌బర్గ్ ఇస్తున్న గౌరవం గొప్పదని ఇప్పటికే పలు వార్తా పత్రికల అధినేతలు ఆయన్ను పొగిడారు. అమెరికావ్యాప్తంగా ఉన్న సుమారు 200 వార్తా సంస్థలతో వార్తలు అందించేందుకు ఫేస్‌బుక్ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment