news access
-
ఫేస్బుక్ మరో ఆవిష్కారం
న్యూయార్క్ : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోకొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఫేస్బుక్ యాప్‌లో ప్రత్యేక వార్తా విభాగాన్ని ప్రవేశపెట్టింది. 'న్యూస్ ట్యాబ్' పేరుతో సరికొత్త ఫీచరును అందుబాటులోకి తెచ్చింది. తద్వారా తన ప్లాట్‌ఫాంలో ఫేక్‌న్యూస్‌కు చెక్ పెట్టాలని భావిస్తోంది. కొంతకాలంగా ప్రయోగదశలో పరిశీలించిన ఈ ఫీచర్‌ను శుక్రవారం అమెరికాలో మాత్రమే అందుబాటుకి తెచ్చింది. భారత్ సహా ఇతర దేశాల్లో ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తేనుంది. న్యూయార్క్‌లో పాలే సెంటర్ ఫర్ మీడియాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మాట్టాడుతూ, తొలిసారిగా తమ యాప్‌లో ప్రదర్శించే వార్తలకుగాను పబ్లిషింగ్ కంపెనీలకు కొంత సొమ్మును చెల్లించనున్నామని తెలిపారు. అయిత ఫేస్బుక్లో తమ వార్తలకోసం ఆయా పబ్లిషర్లు యాప్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుందని పేర్కొన్నారు. ఈ విభాగంలో జాతీయ, అంతర్జాతీయ, జనరల్ న్యూస్‌తోపాటు వివిధ విభాగాలకు చెందిన వార్తలు ఫేస్బుక్ యూజర్లకు అందుబాటులో వుంటాయి. ప్రధానంగా వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, ఎన్బీసీ న్యూస్ , ఏబీసీ న్యూస్ తోపాటు, చికాగో ట్రిబ్యూన్ డల్లాస్ మార్నింగ్ న్యూస్ స్థానిక అవుట్లెట్లతో సహా సుమారు 200 మంది ప్రచురణకర్తల వార్తలు, విశేషాలు ఫేస్బుక్లో చదువు కోవచ్చు. ఈ ఫీచర్‌ను తీసుకురావడానికి, అసలైన రిపోర్టింగ్ ప్రాముఖ్యతను గుర్తించడానికి చాలా కష్టపడ్డామని ఫేస్బుక్ వార్తా భాగస్వామ్యాన్ని పర్యవేక్షించే కాంప్‌బెల్ బ్రౌన్ చెప్పారు. ఫేస్బుక్ వినియోగదారుడు ఎవరైనా సరే సంబంధిత వార్తను చదవాలంటే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఫేస్బుక్ నుంచి లింక్ నేరుగా పబ్లికేషన్ కు రీ-డైరెక్ట్ అవుతుంది. పాత్రికేయ వృత్తికి మార్క్ జుకర్‌బర్గ్ ఇస్తున్న గౌరవం గొప్పదని ఇప్పటికే పలు వార్తా పత్రికల అధినేతలు జుకర్‌బర్గ్‌పై ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. -
ఫేస్బుక్లో కొత్త అప్డేట్ ‘న్యూస్ ట్యాబ్’
వాషింగ్టన్: ఫేస్బుక్లో ‘న్యూస్ ట్యాబ్’తో కూడిన కొత్త అప్డేట్ శుక్రవారం నుంచి వినయోగదారులకు అందుబాటులో ఉంచారు. ఈ మేరకు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ శుక్రవారం తెలిపారు. ఇందులో వినియోగదారులు తమ ఇష్టాలకు అనుగుణమైన వార్తలను పొందే అల్గారిథమ్‌ను ఉపయోగించనున్నారు. ఫేస్బుక్లో వస్తున్న అసత్య వార్తల రీత్యా పలు చోట్ల నిరసనలు, ప్రభుత్వాల నుంచి హెచ్చరికలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో అసత్య వార్తలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఫేస్బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. పాత్రికేయ వృత్తికి మార్క్ జుకర్‌బర్గ్ ఇస్తున్న గౌరవం గొప్పదని ఇప్పటికే పలు వార్తా పత్రికల అధినేతలు ఆయన్ను పొగిడారు. అమెరికావ్యాప్తంగా ఉన్న సుమారు 200 వార్తా సంస్థలతో వార్తలు అందించేందుకు ఫేస్బుక్ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
సోషల్ మీడియాపై క్రేజ్ పెరిగింది..!
సోషల్ మీడియా స్థాయి మరింత పెరిగిందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. యూకేకు చెందిన ఓ జర్నలిస్ట్ సంస్థ యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా లోని 26 దేశాలలోని ఆన్ లైన్ యూజర్లపై చేసిన అధ్యయనంలో కొన్ని వాస్తవాలను గ్రహించారు. సోషల్ మీడియా వెబ్ సైట్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ తో పాటు వాట్సాప్, స్నాప్ చాట్ లాంటి వాడకం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. వార్తలు, తాజా విశేషాల కోసం సోషల్ మీడియా సైట్ల వాడకం విపరీతంగా ఉందని రీసెర్చర్స్ పేర్కొన్నారు. అయితే గతంలో కేవలం ఫొటోలు పోస్ట్ చేయడం, తమ బంధువులు, మిత్రులతో చాటింగ్ చేయడానికి మాత్రమే వినియోగించేవారు. ప్రస్తుతం ఆన్ లైన్ యూజర్లలో సగానికంటే ఎక్కువ మంది రోజువారీ వార్తలు, అప్ డేట్స్ కేవలం సోషల్ మీడియా నుంచి తెలుసుకుంటున్నారు. న్యూస్ చానల్స్ చూడటం, దినపత్రికలు చదవడం తగ్గిపోయినట్లు అధ్యయనంలో వెల్లడైంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న వారు పనిలో పనిగా న్యూస్ అప్ డేట్స్ తెలుసుకుంటున్నారని, దీంతో వార్త మాధ్యమాలకు దూరంగా ఉంటున్నారు. స్వీడన్ లో 69 శాతం యూజర్స్, కొరియాలో 66శాతం మంది, స్విట్జర్లాండ్ లో 61 శాతం యూజర్స్ వార్తల కోసం సోషల్ మీడియాను వినియోగిస్తు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఫేస్ బుక్ ద్వారా 44 శాతం యూజర్స్, యూట్యూబ్ ద్వారా 19 శాతం, ట్విట్టర్ ద్వారా 10 శాతం యూజర్స్ రోజువారి కార్యక్రమాలు, జరుగుతున్న సంఘటనలను తెలుసుకుంటున్నారు. ఆసియా, ఆఫ్రికాలోని దేశాలలో స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వాళ్లలో ఎక్కువ మంది వార్తల కోసం సోషల్ మీడియాపై ఆధార పడుతున్నారని యూకే సంస్థ వివరించింది.