సాక్షి, అమరావతి: ఏపీలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిని చూసి తట్టుకోలేని ఎల్లో మీడియాలో ప్రతీరోజు ఏదో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూనే ఉంది. ఇక, తాజాగా డ్వాక్రా మహిళల గురించి కూడా ‘ఈనాడు’ చెత్త కథనాలను ప్రచురించింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదుకున్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా దుష్ప్రచారం చేస్తోంది.
వాస్తవాలు: డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నట్టేట ముంచితే సీఎం జగన్ ఆదుకున్నాడు
1) డ్వాక్రా పొదుపు సంఘాల అప్పు..
►2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు బేషరతుగా మాఫీ చేస్తానన్న పొదుపు సంఘాల అప్పు రూ. 14వేల కోట్లు. ఆ తర్వాత ఐదేళ్లలో వడ్డీలపై వడ్డీలు పెరిగి 2019 ఎన్నికల నాటికి ఆ ఆప్పుల మొత్తం రూ. 25,571 కోట్లు అయ్యాయి. కానీ, ఒక రూపాయి కూడా ఇవ్వలేదు.
►ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా నాలుగు విడతల్లో నేరుగా ఆ మహిళలకు చెల్లిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పుల మొత్తం రూ. 25,571 కోట్లకు గాను ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,178 కోట్లు చెల్లించింది. నాలుగో విడత ఈ నెలలో ఇవ్వనున్నారు.
2) పొదుపు సంఘాల సున్నా వడ్డీ రుణాలు
►ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అమలులో ఉన్న పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తిగా మంగళం పాడేశారు. 2016 ఆగస్టు తర్వాత సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళలెవరికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ డబ్బు చెల్లించలేదు.
►ఇక, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించారు. గత నాలుగేళ్లుగా సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళల వడ్డీని ఏ ఏడాదికి ఆ ఏడాదే వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. రాష్ట్రంలో 1.05 కోట్ల మంది పేరిట ఉన్న 9.76 లక్షల పొదుపు సంఘాల రుణాలకు రూ.4,969 కోట్లు వడ్డీ భారం ఆ పేద మహిళల నెత్తిన పడకుండా ప్రభుత్వమే పూర్తిగా చెల్లించింది.
►వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం క్రమం తప్పకుండా సున్నా వడ్డీ సొమ్ము చెల్లిస్తుండటంతో గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారాయి. మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తులు 18.36 శాతం నుంచి 0.33 శాతానికి తగ్గిపోయాయి. గత ప్రభుత్వంలో సీ,డీ గ్రేడ్‌లోకి దిగజారిన సంఘాలు జగనన్న ప్రభుత్వ సహకారంతో తిరిగి ఏ,బీ గ్రేడ్‌లోకి చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment