Dwakra Groups
-
2 రోజులే గడువుందంటూ.. టీడీపీ నేతల బరితెగింపు
సాక్షి, తిరుపతి: టీడీపీ నేతలు అడ్డూ అదుపులేకుండా పోతోంది. తిరుపతి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదుకు డ్వాక్రా మహిళలకు టీడీపీ నేతలు వాయిస్ మెసేజ్‌లు చేస్తూ బరితెగించేశారు. రూ.100తో టీడీపీ సభ్యత్వ నమోదు, సీఎంఆర్ఎఫ్, రూ.5 లక్షల ఉచిత ప్రమాద బీమా వర్తిస్తుందంటూ ప్రచారం మొదలుపెట్టారు. స్వయం ఉపాధి డ్వాక్రా మహిళలను టీడీపీ నేతల ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు.టీడీపీ నేతల సభ్యత్వ నమోదు వైరల్‌గా మారింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇదే వైఖరి టీడీపీ అవలంభిస్తోంది. 2 రోజులే గడువు ఉందంటూ డ్వాక్రా గ్రూప్‌లో ప్రచారం చేస్తున్నారు. టీడీపీ సభ్యత్వం తీసుకుంటేనే సంక్షేమ పథకాలంటూ డ్వాక్రా సంఘాలను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు.అధికారుల సాక్షిగా.. తమ్ముళ్ల దాష్టీకం!భాకరాపేట: అధికారం ఉంది కదా అని ప్రభుత్వ అధికారులు.. పోలీసుల సాక్షిగా తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రైతులతోపాటు పంట పొలాలపై దాడికి తెగబడ్డారు. అన్నదాతలపై ప్రతాపం చూపారు. పట్టా భూమిలో కాలువ, కాలినడక బాట ఉందంటూ అర్ధరాత్రి పచ్చని చెట్లను నరికివేశారు. పంట పొలాల చుట్టూ ఏర్పాటు ఏర్పాటుచేసిన కంచెను జేసీబీలతో పెకలించేశారు. పట్టా భూమిలో దౌర్జన్యం చేస్తున్న వారికి కోర్టు ఉత్తర్వులు చూపించేందుకు వచ్చిన రైతులపై దాడిచేశారు. సాక్షాత్తు ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఓ రైతుకు చెందిన పట్టా భూమిలో టీడీపీ నేతలు దౌర్జన్యంగా రోడ్డు ఏర్పాటు చేశారు.కళ్లముందు రైతులపై టీడీపీ నేతలు దాడి చేస్తున్నా పోలీసులు చూస్తుండిపోయారు. ఇదంతా ఎక్కడో కాదు ముఖ్యమంత్రి స్వగ్రామం ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. చిన్నగొట్టిగల్లు మండలం దిగవూరు రెవెన్యూ గ్రామం మట్లువారిపల్లెలో శుక్రవారం రాత్రి జరిగింది. బాధితులు, స్థానికుల వివరాల మేరకు.. దిగవూరు రెవెన్యూ లెక్క దాఖలు 182, 183 సర్వే నంబర్లులో విశ్రాంత అధ్యాపకుడు దొడ్డిపల్లి రాజారెడ్డికి దాదాపు 12.5 ఎకరాల వారసత్వ ఆస్తి ఉంది. ఈ భూమికి ఆనుకుని ఉన్న కాలినడక వదలివేసి కంచె వేసుకున్నానని రాజారెడ్డి చెబుతున్నారు.తమకు చెందిన భూమిలో ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి లేదని, పొలంలో వర్షపు నీరు వెళ్లడానికి చిన్న కాలువ తీసుకుంటే అదే కాలువను బండిబాటగా వేయాలని టీడీపీ నాయకులు వచ్చి తనను, తన సోదరుడు సుధాకర్‌రెడ్డిని చితకబాదినట్లు రాజారెడ్డి తెలిపారు. సుధాకర్‌రెడ్డి సెల్‌ఫోన్ ధ్వంసం చేశారని తెలిపారు. ఇదంతా భాకరాపేట ఎస్ఐ, పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా.. వారు ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన పొలానికి వేసుకున్న రెండు గేట్లు తొలగించి, వారికి ఇష్టం వచ్చినట్లు ఎక్కడబడితే అక్కడ కంచెను తొలగించి దారి ఏర్పాటు చేసుకున్నారన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు మొరపెట్టుకున్నా తమ గోడు కూడా వినలేదని దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తన పొలం తనకు అప్పగించి న్యాయం చేయాలని విన్నవించారు. -
‘పొదుపు డబ్బుల’కు ఎసరు పెట్టారని....
తూప్రాన్/రుద్రూర్: దాచుకున్న పొదుపు సొమ్మును పక్కదారి పట్టించి, సొంతానికి వాడుకోవడంతో సభ్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓ ఘటనలో గ్రూప్ లీడర్ భర్తను చెట్టుకు కట్టేయగా, మరో ఘటనలో ఏకంగా ఆ మహిళ ఇంటిని వేలం వేశారు. వివరాలు.. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని పడాల్‌పల్లి ఎస్పీ కాలనీకి చెందిన పదిమంది అంబేడ్కర్ సంఘం పేరుతో డ్వాక్రా గ్రూపు కొనసాగిస్తున్నారు. ఎస్బీఐ బ్యాంకులో రూ.10 లక్షలను సభ్యులు రుణంగా తీసుకున్నారు. గ్రూపు సభ్యులు సంఘం లీడర్ మున్నీకి రూ. 40 వేలు చెల్లిస్తున్నారు. ఆ డబ్బులు గ్రూపు పేరుమీద బ్యాంకుకు జమ చేయాల్సి ఉంది. కానీ 11 నెలలుగా మున్నీని భర్త భిక్షపతి బెదిరించి తన సొంతానికి ఆ డబ్బులు వాడుకుంటున్నాడు. దీంతో బ్యాంకు అధికారులు సభ్యుల రూ. 67 వేలు పొదుపు డబ్బులను రుణం కింద జమ చేసుకున్నారు.లోన్ చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు రూ. 1.55 లక్షలను సభ్యులపై భారం మోపారు. దీంతో లీడర్ మున్నీ, భర్త భిక్షపతి మొత్తం రూ.7 లక్షలకు పైగా కాజేసినట్లు సభ్యులకు తెలిసింది. ఈ విషయమై మున్నీని ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పింది. పెద్దల సమక్షంలో ఈనెల 1న పంచాయితీ నిర్వహించారు. అయితే భార్యను చంపివేస్తే డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదని అందరి సమక్షంలోనే మద్యం మత్తులో ఉన్న భిక్షపతి భార్యను చంపేందుకు వెంటపడ్డాడు. అక్కడే ఉన్న గ్రూపు సభ్యులు భర్తను చెట్టుకు కట్టేసి భార్యను పక్కింట్లో దాచిపెట్టారు. కాగా, ఈ ఘటనలో నిందితులు, బాధితులు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడం గమనార్హం. ∙నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కల్లూర్ గ్రామంలోని ఒక బ్యాంకుకు చెందిన కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకురాలి ఇంటిని బుధవారం వేలం వేశారు. సీఎస్పీ సెంటర్ నిర్వహించే సంధ్య.. పొదుపు సంఘాల ద్వారా మహిళలు సేకరించిన డబ్బులను బ్యాంకులో జమ చేయకుండా సుమారు రూ.40 లక్షలు సొంతానికి వాడుకుంది. ఇటీవల ఈ విషయాన్ని గుర్తించిన బాధిత మహిళలు నిర్వాహకురాలిని నిలదీయడంతో కొంత గడువు కావాలని కోరింది. అయితే గడువు ముగిసినా డబ్బులు చెల్లించకపోవడంతో సీఎస్పీ ఇంటిని బుధవారం స్థానికుల సహకారంతో మహిళా సంఘాల సభ్యులు వేలం వేశారు. వేలంలో గ్రామానికి చెందిన ఒకరు రూ.14 లక్షల 80 వేలకు ఇంటిని సొంతం చేసుకున్నట్టు ఐకేపీ సిబ్బంది వెల్లడించారు. ఇంతకు ముందు సంధ్య రూ.6 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు వారు తెలిపారు. -
వరదల పేరుతో సర్కారు చందాల వేట
‘‘అందరికీ నమస్తే.. అమ్మా పక్కన పెట్టిన తీర్మానాన్ని ప్రతి గ్రూపులోని వారి పొదుపు ఖాతాల నుంచి సమాఖ్యలకు రూ.500 తగ్గకుండా ట్రాన్స్ఫర్ చేయించాలి. ఈ మొత్తం అమౌంట్‌ను టీఎల్ఎఫ్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయించాలి’’. .. ఇది డ్వాక్రా సంఘాలకు వీఓఏలు, ఆర్పీల నుంచి వస్తున్న మెసేజ్‌లు. ఈ తంతు అంతా ఏదో వారికి మేలు చేసేందుకో లేక ఆదుకునేందుకో కాదు. చంద్రబాబు ప్రభుత్వంలో వరద బాధితులకు సాయమందించేందుకు చేస్తున్న నయా దందా ఇది. – సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి ప్రతినిధి, బాపట్ల/తాడికొండనిజానికి.. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ప్రజలు నష్టపోతే ఎక్కడైనా ప్రభుత్వాలు తక్షణం స్పందిస్తాయి. బాధితులను అన్ని విధాలా ఆదుకునే ప్రయత్నం చేస్తాయి. పెద్దస్థాయిలో నష్టం జరిగితే ఆరి్థకంగా లేదా ఇతరత్రా పూర్తిస్థాయిలో సహాయం అందించి ఆదుకోలేకపోయినా.. తక్షణ సాయంతో ఉపశమనం కలిగించి తామున్నామన్న భరోసా ఇవ్వాలి.. చేయగలిగినంత చేయాలి. ఇది ప్రభుత్వం బాధ్యత. కానీ, సీఎం చంద్రబాబు ప్రభుత్వం బాధితులను ఆదుకోవడం సంగతి పక్కనబెట్టి దాని పేరున చందాలు వసూలుకు తెరలేపింది. దీనికి విరాళాలు అని ముద్దుపేరు పెట్టి చంద్రబాబు అండ్ కో వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టారు. గతంలో అమరావతి నిర్మాణానికి చందాలు, ఇటుకలు అంటూ చేస్తే ఇటీవల అన్న క్యాంటీన్లను ప్రారంభించి వాటికీ విరాళాలు వసూలుచేస్తున్నారు. ఇప్పుడు వరదల నేపథ్యంలో.. చందాలు వసూలు చేసే బాధ్యతను ప్రభుత్వం ఏకంగా కలెక్టర్ల నెత్తిన పెట్టడంతోపాటు డ్వాక్రా సంఘాలనూ వసూలుచేసి ఇమ్మంటూ బెదిరింపులకు దిగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇదిలా ఉంటే.. బాపట్ల జిల్లాలోని వేమూరు, రేపల్లెతోపాటు పలు ప్రాంతాల్లో వరదలొచ్చి వారం గడిచినా ప్రభుత్వ అధికారులు వచ్చి చూసిన పాపాన పోలేదు. పరిహారం కింద దేనికి ఎంతిస్తారో చంద్రబాబు నోరు విప్పడంలేదు. అసలిస్తారో లేదో తెలీడంలేదు. ఒక్కో ‘సంఘం’ రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు.. మరోవైపు.. రాష్ట్రంలో దాదాపు 9 లక్షలకు పైగా పొదుపు సంఘాలు ఉండగా.. పది మంది సభ్యులుండే ఒక్కో సంఘం రూ.500 నుంచి రూ.1,000 వరకు వెంటనే ఫోన్‌పే ద్వారా లేదంటే నగదు రూపంలో గ్రామ సమాఖ్యలకు లేదా పొదుపు ఖాతాల్లో నుంచి ఎస్ఎఫ్ఎల్ ఖాతాల్లోకి తప్పనిసరిగా అందజేయాలని అధికారులు ఫోన్లలో స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. పొదుపు సంఘాల మహిళలు గ్రూపుల వారీగా వాళ్ల గ్రామ సమాఖ్యకు.. గ్రామ సమాఖ్యల నుంచి జిల్లాల వారీగా జిల్లా సమాఖ్యలు, వారి నుంచి రాష్ట్ర సమాఖ్య ఒకే మొత్తంగా నిధులు పోగుచేసి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా సీఎం సహాయ నిధికి చెక్ రూపంలో సీఎంకు అందజేయాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి నుంచి అందిన సూచనల ప్రకారం.. సీఎం సహాయక నిధికి ఏయే పొదుపు సంఘాల్లో ఎవరెవరు ఇవ్వలేదో, వారి పేర్లను నమోదు చేసుకుంటామని, ఇవ్వనివారికి రిమార్కు రాస్తామంటూ అధికారులు ఫోన్లలోనే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. రిమార్కులు రాస్తే భవిష్యత్‌లో పొదుపు సంఘాల మహిళలు ఇబ్బందిపడతారని కూడా హెచ్చరిస్తున్నట్లు మంగళగిరి మండలం నూతక్కి పొదుపు మహిళలు వాపోతున్నారు. ఇదిలా ఉంటే.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని 1,259 డ్వాక్రా గ్రూపుల నుంచి మొత్తం రూ.6,29,600 వసూలుచేసి ఇచ్చినట్లు ఏపీఎం నాగేశ్వరరావు తెలిపారు. ఇక గత జులైలోనూ రాజధాని అమరావతి నిర్మాణం కోసమంటూ పొదుపు సంఘాల మహిళల నుంచి బలవంతపు వసూళ్ల కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.కలెక్టర్లకు చందాల బాధ్యతలు.. వరద పేరుచెప్పి ప్రజల నుంచి చందాలు వసూలుచేయమని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లను పురమాయించింది. దీంతో.. బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి ‘జిల్లా కలెక్టర్ రిలీఫ్ ఫండ్, బాపట్ల’ పేరుతో ఒక యూనియన్ బ్యాంకు ఖాతా (నంబర్ 003712010002548) తెరిచారు. ఈ నెంబర్‌కు లేదా క్యూఆర్ కోడ్ ద్వారా చందాలు పంపాలని కోరారు. వ్యక్తిగతంగా లేదా స్వచ్ఛంద సంస్థలు చందాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిధులిస్తే ప్రజలకు సాయమందించాల్సిన కలెక్టర్‌కు జనం నుంచి చందాలు వసూళ్లు చేసే కార్యక్రమం కట్టబెట్టడంపై అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదేం ఖర్మరా బాబూ.. అంటూ తలలు పట్టుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవహారం చూస్తే జిల్లాలో వచ్చే చందా వసూళ్లను బట్టి వరద బాధిత ప్రజలకు పరిహారం ఉంటుందేమోనన్న అనుమానాలు బాధితులు వ్యక్తంచేస్తున్నారు.గతంలో ఎప్పుడూ ఇలాలేదు..గతంలో రాష్ట్రంలో పలుమార్లు వరదలు వచ్చినా ఏనాడూ ప్రభుత్వం డ్వాక్రా మహిళలను చందాలు అడిగిన దాఖలాల్లేవని.. ప్రభుత్వమే అన్ని రకాలుగా ఆదుకునేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొత్త రకం దందాకు తెరలేపడంపట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కూలీ నాలీ చేసుకుని కాలం వెళ్లదీస్తున్న పేద మహిళల దగ్గర బలవంతంగా వసూళ్లు చేయడమేమిటని మండిపడుతున్నారు. అయినా, ఫోన్‌పే నంబర్లకు నగదు వేయాలంటూ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని మహిళలు ప్రశి్నస్తున్నారు. -
డ్వాక్రా మహిళలపై ‘అమరావతి ట్యాక్స్’
సాక్షి, అమరావతి: ‘రాజధాని అమరావతి కడతాం.. సంపద సృష్టిస్తాం’ అంటూ గొప్పలు చెప్పుకొంటున్న బాబు కూటమి ప్రభుత్వం.. కేంద్రం నుంచి నిధులు రాబట్టలేకపోయింది. గతంలో ఇటుకలమ్మి సేకరించిన విరాళాలు మరుగున పడ్డాయి. ఇప్పుడు రాజధాని భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేస్తోంది. వివిధ వర్గాల ప్రజల నుంచి బలవంతపు వసూళ్లకు తెగబడుతోంది. చివరికి రూపాయి రూపాయి పొదుపు చేసుకొని, కుటుంబానికి అండగా నిలుస్తున్న స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) అక్కచెల్లెమ్మలనూ వదలడంలేదు. ప్రతి మహిళా వందేసి రూపాయలు అమరావతి కోసం ఇవ్వాల్సిందేనంటూ కొందరు అధికారుల ద్వారా హుకుం జారీ చేయిస్తోంది.ఇదే విధంగా ఓ మధ్యస్థాయి అధికారి డ్వాక్రా మహిళలను ఆదేశిస్తున్న వీడియో టేప్ ఒకటి బయటపడింది. ఈ టేపు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘అమరావతి రాజధాని కోసం ఒక్కొక్క సభ్యురాలు రూ. వంద చొప్పున కలెక్షన్ చేయాలి. ప్రతి ఒక్కరూ.. గ్రూపు లీడర్ కూడా సంఘ సభ్యురాలు దగ్గర... సంఘంలో ఎంత మంది ఉన్నారో, అంతమంది మనిషికి వంద రూపాయల చొప్పున కలెక్టన్ చేయండి. నేను చాలా వరకు గ్రూపు లీడర్లకు ఫోన్లు చేశాను. ప్రతి గ్రూపు లీడరు ఫాలోఅప్ చేయండి.రేపు సాయంత్రంకల్లా కలెక్షన్ చేసి మాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ని సంఘాలు ఇచ్చారన్నది మేం సీవో (మెప్మా విభాగంలో పట్టణ ప్రాంతాల్లో పనిచేసే కమ్యూనిటీ ఆర్గనైజర్)కు అప్పజెప్పాలి. ప్రతి సభ్యురాలు ఎందుకు.. ఏమిటి అని అడగొద్దు. ప్రతి సంఘ సభ్యురాలు వంద రూపాయలు ఇవ్వాలి’ అంటూ ఓ పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాల కార్యకలాపాలను పర్యవేక్షించే ఓ మధ్య స్థాయి అధికారి ఆయన పరిధిలోని సంఘాల సభ్యులకు జారీ చేసిన ఆదేశాలు ఆ ఆడియో టేపులో ఉన్నాయి. ఈ ఆడియో టేపులో మాట్లాడిన మాటల ప్రకారం.. ఇప్పటికే తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పొదుపు సంఘాల సభ్యుల నుంచి రూ. వంద చొప్పున వసూళ్లు పూర్తయ్యాయి. సెర్ప్, మెప్మా ఉద్యోగుల చర్చల్లోనూ ఈ విషయం బయటపడింది.బహిరంగంగానే చెప్పిన చిత్తూరు ‘మెప్మా’ ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం చంద్రబాబు తొలిసారిగా సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లినప్పుడు చిత్తూరు జిల్లాలో మెప్మా అధికారులు ఆ ప్రాంత పొదుపు సంఘాల తరపున అమరావతి నిర్మాణానికి రూ.4.50 కోట్ల విరాళం ప్రకటించారు. ఆ డబ్బు సేకరణ కోసమే అధికారులు, సంఘాల లీడర్లు డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తెచ్చి ఒక్కొక్కరి నుంచి రూ.100 చొప్పున ఇప్పటికే వసూళ్లు చేసినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇది చిత్తూరు, తిరుపతి జిల్లాలకే పరిమితమవలేదని, మిగతా జిల్లాల్లోనూ వసూళ్లు జరుగుతున్నాయని సమాచారం. -
సిగ్గు ఎగ్గూ అన్నీ ఒగ్గేసీ...
హ.. హవ్వ! చదివిన వాళ్లు నవ్వుకుంటారే అని సిగ్గు ఎగ్గూ అన్నింటినీ ‘ఈనాడు’ వదిలేసింది. అధికారంలోకి వస్తే డ్వాక్రా (పొదుపు సంఘాల) రుణాలన్నీ (రూ.14,203.58 కోట్లు) భేషరత్తుగా మాఫీ చేస్తానని 2014 ఎన్నికల ముందు మాటిచ్చి ఆ తరువాత ఒక్క రూపాయీ మాఫీ చేయని చంద్రబాబు పాలనలో పొదుపు సంఘాల మహిళలందరూ ఓ వెలుగు వెలిగారట. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పటికి (2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి) పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న మొత్తం రూ.25,570.80 కోట్ల అప్పును వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగు విడతలో అందజేస్తే.. పొదుపు సంఘాలను, మహిళలు నిలువునా మోసం చేయడమట. ఇలాంటి పచ్చి అబద్ధాలను రామోజీరావు తన ‘ఈనాడు’ పత్రికలో ‘నాడు దర్జా– నేడు గజగజ, డ్వాక్రా సంఘాలకు తీరని ద్రోహం’ అంటూ రోత రాతలు అచ్చేశారు. తమ ప్రభుత్వం డ్వాక్రా రుణ మాఫీ అమలు చేయని అంశాన్ని అప్పటి మంత్రి పరిటాల సునీత అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా వెల్లడించినా.. ఆ అంశాన్ని రామోజీ తన రాతల్లో ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. – సాక్షి, అమరావతి ఈనాడు అబద్ధం: 2014 –19 మధ్య టీడీపీ ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలకు ఉన్నతి పథకంలో రూ. 800 కోట్లు వడ్డీ లేకుండా రుణాలుగా ఇచ్చింది. అప్పును నెలవారీగా వాయిదాల్లో తిరిగి కట్టించుకునేది. మహిళా సాధికారితకు పెద్దపీట వేయడంలో తనను మించిన వారే లేరన్నట్టు గొప్పులు చెప్పుకునే జగన్.. ఈ ఐదేళ్లలో ఉన్నతికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. వాస్తవం: ఉన్నతి పథకం ద్వారా ఎస్టీ, ఎస్సీ సామాజికవర్గాలకు చెందిన పొదుపు సంఘాల మహిళలకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో 2.40 లక్షల మందికి రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల మంది వడ్డీ లేని రుణాలను అందజేసింది. అదే చంద్రబాబు ప్రభుత్వంలో ఈ పథకం ద్వారా ఒక్కొక్కరి గరిష్టంగా కేవలం రూ. 30 వేల వరకు మాత్రమే రుణాలు ఇచ్చింది. గత తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లు, అంతకు ముందు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో నాలుగేళ్లు కలిపి మొత్తం తొమ్మిదేళ్లలో 1.67 లక్షల మందికి రూ. 800 కోట్లు ఈ పథకం ద్వారా రుణాలు ఇస్తే, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలోనే 2.40 లక్షల మందికి రూ. 900 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు అందజేసింది. ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరం(ఒక్క ఏడాది)లోనే దాదాపు రూ.200 కోట్లు ఇచ్చింది. ఈనాడు అబద్ధం: జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సున్నా వడ్డీ రాయితీలోనూ కోత పెట్టింది. వాస్తవం: బ్యాంకులో రుణం తీసుకొని సకాలంలో కిస్తీల వారీగా చెల్లించే పొదుపు సంఘాల మహిళలకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల్లో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా వారి రుణాలపై వడ్డీ రూ.4969.05 కోట్లు చెల్లించింది. ఆర్థిక ఏడాది ముగిసిన వెంటనే ఠంచన్‌గా సున్నా వడ్డీ పథకాన్ని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. దీని ద్వారా ఏటా 1.05 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందారు. ఇంకోవైపు.. చంద్రబాబు ప్రభుత్వం తన ఐదేళ్ల కాలంలో చివరి మూడు సంవత్సరాలు 2016 ఆగస్టు తర్వాత కాలానికి సున్నా వడ్డీ పథకానికి నిధులే ఇవ్వలేదు. ‘ఈనాడు’ తన కథనంలోనే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ పథకానికి నిధులు ఇవ్వలేదని అంగీకరించింది కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అమలులో ఉన్న ఈ పథకానికి నిధులే విడుదల చేయలేదు. అదే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి అమలు చేస్తూనే.. నవరత్నాల కార్యక్రమాలు ద్వారా కూడా అదనపు లబ్ధి చేకూర్చింది. ఈనాడు అబద్ధం: జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ‘మిత్ర’లకు తీరని ద్రోహం చేసింది. వాస్తవం: రాష్ట్రంలో కోటి మందికి పైగా మహిళలు పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. ఆ కోటి మందిలో ఓ రెండు మూడు వేల మందిని అప్పటి టీడీపీ ప్రభుత్వం భీమా మిత్రలుగా నియమించింది. ఆ నియామకాలు కూడా అప్పటి జన్మభూమి కమిటీ సభ్యుల తరహాలోనే జరిగాయి. తమ పరిధిలో దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే వారికి ప్రభుత్వం ఇచ్చే బీమా సొమ్ములో కనీసం పది శాతం లంచంగా తీసుకున్నారన్న ఆరోపణలూ ఉండేవి. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన అనంతరం ఇప్పుడు ఈ కార్యక్రమాలను వారి ఆధ్వర్యంలో పారదర్శకంగా జరిపిస్తోంది. బీమా లబ్ధిదారుల నుంచి ఒక పైసా కూడా వసూలు చేయకుండా అందిస్తున్నారు. బీమా ప్రీమియాన్ని కూడా పూర్తిగా రద్దు చేసింది. -
ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్ఆర్ ఆసరా వేడుకలు
-
విజయనగరం జిల్లాలో డ్వాక్రా సంఘాల మహిళలకు ఆర్థికసాయం
-
గతంలో దోచుకో.. పంచుకో.. చంద్రబాబుపై విరుచుకుపడ్డ సీఎం జగన్
-
డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.6,395 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్
-
ఉరవకొండలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన
-
YSR ఆసరా పథకం ద్వారా 79 లక్షల మంది డ్వాక్రా మహిళలకు లబ్ధి
-
చెప్పింది చెప్పినట్లుగా.. నేడు ‘వైఎస్సార్ ఆసరా’ పంపిణీ
సాక్షి, అమరావతి: చెప్పాడంటే చేస్తాడంతే.. అన్న నినాదాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దాదాపు 79 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మల విషయంలో అక్షరాలా నిజం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వారికి ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు. మాట ఇస్తే తప్పడని ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము కానీయకుండా ఆయన తన విశ్వసనీయతను మళ్లీమళ్లీ చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ అప్పట్లో పొదుపు సంఘాల మహిళలకు ఆయన ఇచ్చిన హామీని ఇప్పుడు సంపూర్ణంగా అమలుచేయబోతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటివరకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడు విడతల్లో ఆయన డ్వాక్రా అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో రూ.19,175.97 కోట్లు జమచేయగా.. తాజాగా, మంగళవారం నుంచి నాలుగో విడతగా మిగిలిన రూ.6,394.83 కోట్లను జమచేస్తూ వారికి ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం జగన్ పూర్తిస్థాయిలో నెరవేర్చనున్నారు. ఆంధ్రప్రదేశ్ బ్యాంకర్ల సంఘం (ఎస్ఎల్బీసీ) గణాంకాల ప్రకారం.. గత అసెంబ్లీ ఎన్నికల పొలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది డ్వాక్రా మహిళల పేరిట రూ.25,570.80 కోట్లు పొదుపు సంఘాల రుణాలు ఉండగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లను ఆయా మహిళల ఖాతాల్లో జమచేశారు. ఇక మంగళవారం నుంచి నాలుగో విడతగా మిగిలిన రూ.6,394.83 కోట్లను కూడా నేరుగా వారి ఖాతాల్లో జమచేయబోతోంది. ఈ నేపథ్యంలో.. నాలుగో విడత ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలు వీక్షించేలా అన్ని రైతుభరోసా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిజానికి.. గత ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా రుణాలు ఎవరూ కట్టొద్దు.. పొదుపు సంఘాల తరఫున తామే చెల్లిస్తామని 2014లో పార్టీ మేనిఫెస్టోలో పెట్టి మరీ హామీ ఇచ్చారు. కానీ, దాన్ని అమలుచేయని కారణంగా దాదాపు 7.98 లక్షల స్వయం సహాయక పొదుపు సంఘాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఆ తర్వాత సీఎం పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వాటికి తిరిగి ఊపిరిపోశారు. ఫిబ్రవరి 5 వరకు జిల్లాల్లో ‘ఆసరా’ ఉత్సవాలు.. ఇక వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కార్యక్రమాన్ని రెండు వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉత్సవాల మాదిరిగా నిర్వహించనున్నారు. అలాగే.. ► అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయా నియోజకవర్గాల పరిధిలో రోజుకు కొన్ని గ్రామాలు లేదా మున్సిపల్ వార్డుల చొప్పున లబ్ధిదారులతో సభలు నిర్వహించి, ప్రభుత్వం వారికి చేకూరుస్తున్న లబ్ధిని వివరిస్తారు. ► గత నాలుగున్నరేళ్లలో వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాల ద్వారా లబ్ధిపొంది, ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయంతో సుస్థిరమైన జీవనోపాధి ఏర్పాటుచేసుకున్న వారి విజయగాధలను వివరిస్తూ.. అందుకు సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తారు. ► మిగిలిన సభ్యులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకొచ్చే వారికి అధికారులు తగిన సహాయం అందించేలా ఎమ్మెల్యేలు చర్యలు చేపడతారు. ఇందులో భాగంగా బ్యాంకర్లతో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ► ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ఏ ప్రాంతంలో ఏ రోజు పర్యటిస్తారో తెలిపే 14 రోజుల ప్రణాళికను అధికారులు ఇప్పటికే సిద్ధంచేశారు. ► ఫిబ్రవరి 5 వరకు రెండు వారాల్లో మొత్తం 7,98,395 సంఘాలకు రూ.6,394.83 కోట్లను జమచేసే ప్రక్రియ పూర్తిచేస్తారు. నేడు సీఎం జగన్ ఉరవకొండ పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23న మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించి, డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమచేస్తారు. ఉ.8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు, ఆ తర్వాత వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కింద బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి తిరిగి చేరుకుంటారు. 56 నెలల్లో మహిళలకు రూ.2,66,772 కోట్ల లబ్ధి.. వైఎస్సార్ ఆసరా పథకం నాలుగో విడతగా అందిస్తున్న లబ్ధితో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత 56 నెలల కాలంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా కేవలం మహిళలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా అందించిన సాయమే రూ.2,66,772.55 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు. ► మరోవైపు.. ప్రభుత్వం చేసిన లబ్ధి ద్వారా మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లుగా చేసి, వారి జీవనోపాధి మెరుగుపడేలా అదనంగా ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలైన అమూల్, హిందూస్తాన్ లివర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్, అల్లానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్గుడి, జియాన్, నినె, ఇర్మా, అయేకార్ట్, మహేంద్ర అండ్ ఖేతి వంటి వాటితో పాటు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపించే చర్యలు చేపట్టింది. ► అంతేకాక.. కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో అనుసంధానం చేసి జగన్ ప్రభుత్వం వారికి అందించిన సహకారంతో ఇప్పటివరకు 14,77,568 మంది మహిళలు కిరాణా దుకాణాలు, ఆవులు, గేదెలు, మేకల పెంపకం, వస్త్ర వ్యాపారం తదితర వ్యాపారాలు చేపట్టి నెలకు రూ.7,000 నుండి రూ.10,000ల వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. ► అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటరు పాలపై రూ.10 నుండి రూ.22 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. ► దాదాపు నాలుగు లక్షల మంది మహిళా మార్ట్ల ద్వారా లబ్ధిపొందుతున్నారు. ► గత పాలకులు ఒకవైపు రుణాలు మాఫీ చేస్తామని మాటిచ్చి అమలుచేయకపోగా, అక్టోబరు 2016 నుండి సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దుచేయడంతో ‘పొదుపు’ మహిళల అప్పులు చక్రవడ్డీలతో తడిసిమోపెడై మోయలేని భారంగా మారాయి. ► అప్పట్లో సుమారు రూ.3,036 కోట్ల వడ్డీని మహిళలు బ్యాంకులకు అపరాధ వడ్డీ రూపేణా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు ‘ఎ’, ‘బి’ గ్రేడ్‌లో ఉండే పొదుపు సంఘాలు కూడా ‘సీ’, ‘డి’ గ్రేడ్‌లోకి దిగజారిపోయాయి. ► అనంతరం.. జగన్ ప్రభుత్వం ‘వైఎస్సార్ ఆసరా‘, ‘వైఎస్సార్ సున్నావడ్డీ’ల ద్వారా లబ్ధిపొందిన అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారడంతో ఇప్పుడు అవే పొదుపు సంఘాల ఎన్పీఏలు 18.36 శాతం నుండి 0.17 శాతానికి తగ్గాయి. -
AP: డ్వాక్రా రుణాలపై ఎల్లో మీడియా చెత్త రాతలు.. వాస్తవాలివే..
సాక్షి, అమరావతి: ఏపీలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిని చూసి తట్టుకోలేని ఎల్లో మీడియాలో ప్రతీరోజు ఏదో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూనే ఉంది. ఇక, తాజాగా డ్వాక్రా మహిళల గురించి కూడా ‘ఈనాడు’ చెత్త కథనాలను ప్రచురించింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదుకున్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా దుష్ప్రచారం చేస్తోంది. వాస్తవాలు: డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నట్టేట ముంచితే సీఎం జగన్ ఆదుకున్నాడు 1) డ్వాక్రా పొదుపు సంఘాల అప్పు.. ►2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు బేషరతుగా మాఫీ చేస్తానన్న పొదుపు సంఘాల అప్పు రూ. 14వేల కోట్లు. ఆ తర్వాత ఐదేళ్లలో వడ్డీలపై వడ్డీలు పెరిగి 2019 ఎన్నికల నాటికి ఆ ఆప్పుల మొత్తం రూ. 25,571 కోట్లు అయ్యాయి. కానీ, ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ►ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా నాలుగు విడతల్లో నేరుగా ఆ మహిళలకు చెల్లిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పుల మొత్తం రూ. 25,571 కోట్లకు గాను ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,178 కోట్లు చెల్లించింది. నాలుగో విడత ఈ నెలలో ఇవ్వనున్నారు. 2) పొదుపు సంఘాల సున్నా వడ్డీ రుణాలు ►ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అమలులో ఉన్న పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తిగా మంగళం పాడేశారు. 2016 ఆగస్టు తర్వాత సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళలెవరికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ డబ్బు చెల్లించలేదు. ►ఇక, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించారు. గత నాలుగేళ్లుగా సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళల వడ్డీని ఏ ఏడాదికి ఆ ఏడాదే వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. రాష్ట్రంలో 1.05 కోట్ల మంది పేరిట ఉన్న 9.76 లక్షల పొదుపు సంఘాల రుణాలకు రూ.4,969 కోట్లు వడ్డీ భారం ఆ పేద మహిళల నెత్తిన పడకుండా ప్రభుత్వమే పూర్తిగా చెల్లించింది. ►వైఎస్సార్సీపీ ప్రభుత్వం క్రమం తప్పకుండా సున్నా వడ్డీ సొమ్ము చెల్లిస్తుండటంతో గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారాయి. మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తులు 18.36 శాతం నుంచి 0.33 శాతానికి తగ్గిపోయాయి. గత ప్రభుత్వంలో సీ,డీ గ్రేడ్‌లోకి దిగజారిన సంఘాలు జగనన్న ప్రభుత్వ సహకారంతో తిరిగి ఏ,బీ గ్రేడ్‌లోకి చేరాయి. -
డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు ప్రభుత్వం ప్రోత్సాహం
-
డ్వాక్రా గ్రూప్ నుండి ₹3 లక్షలు లోన్ తీసుకుని.. స్వయం ఉపాధి పొందుతున్నాము..!
-
పర్యావరణ హితులు.. మన డ్వాక్రా మహిళలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి నాగా వెంకటరెడ్డి : రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతి, సాధికారతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ వారి కుటుంబాల ఆర్థిక ఉన్నతికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు డ్వాక్రా సంఘాల మహిళలను పర్యావరణ హితులుగా కూడా మారుస్తున్నారు. జాతీయ రహదారుల వెంబడి మొక్కల పెంపకంలో వీరిని భాగస్వాములను చేస్తున్నారు. టోల్‌ప్లాజాలు, నగర శివార్లలో వ్యాపార అవకాశాలను ఏ మేరకు కల్పించవచ్చనేది కూడా పరిశీలించాలని సీఎం జగన్ సెర్ప్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు మహిళలకు ఆర్థికంగా కూడా తోడ్పాటు లభిస్తుంది. స్వయం సంమృద్ధికి బాటలు వేసుకోనున్నారు. మహిళల జీవన ప్రమాణాలు కూడా పెంపొందుతాయి. రూ.1.57 కోట్ల ప్రాజెక్టులో 761 సంఘాల భాగస్వామ్యం నేషనల్ రూరల్ లైవ్లీ మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం), నేషనల్ హైవేస్ అ«థారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) మధ్య గత ఏడాది కుదిరిన ఎంవోయూ ప్రకారం రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారుల వెంబడి మొక్కలు నాటి వాటిని అయిదేళ్ల పాటు రక్షించి ఎన్హెచ్ఎఐకి అప్పజెప్పాలి. ఈ బాధ్యతను గ్రామీణాభివృద్ధి శాఖ పరి«ధిలోని ‘సెర్ప్’ తీసుకుంది. తొలుత ఎన్‌హెచ్– 544డి పరిధిలోని గిద్దలూరు – వినుకొండ సెక్షన్లో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని కేశినేనిపల్లి– ఉమ్మడివరం గ్రామాల మధ్య ఉన్న 17.74 కిలోమీటర్ల రోడ్డుకు ఇరువైపులా (మొత్తం 35.48 కి.మీ) 5,907 మొక్కలు నాటాలి. గుంతలు తవ్వకం, మొక్కలు కొని నాటడం, కంచె ఏర్పాటు, నీటి సరఫరా, ఎరువులు వేయడం, అయిదేళ్ల పాటు పెంచే బాధ్యతలను త్రిపురాంతకం, పెదారవీడు మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 761 డ్వాక్రా సంఘాల్లోని 7,610 మంది సభ్యులకు ‘సెర్ప్’ అప్పగించింది. ఇందుకోసం ఎన్హెచ్ఏఐ అయిదేళ్లకు రూ.1.57 కోట్లు ఇస్తుంది. త్రిపురాంతకం, పెదారవీడు మండల సమాఖ్యలు, ఆరు గ్రామైక్య సంఘాలు ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించనున్నాయి. ఏడాదిలో 3 నెలలు ఉపాధి.. దినసరి వేతనం రూ.400 ప్రాజెక్టులో భాగస్వాములవుతున్న ఒక్కో డ్వాక్రా సభ్యురాలికి ఏడాదికి సుమారు మూడు నెలలు ఉపాధి లభిస్తుంది. సగటున దినసరి వేతనం రూ.400 వస్తుంది. తద్వారా ఏడాదికి రూ.36 వేలు చొప్పున అయిదేళ్లలో రూ.1.80 లక్షలు సమకూరుతుందని. ఈ స్వయం సహాయక సంఘాలకు గ్రామైక్య సంఘాలు నేతృత్వం వహిస్తాయి. డీఆర్డీఏ, సెర్ప్ ఉన్నతాధికారుల మార్గదర్శనం చేస్తారు. కాంట్రాక్టు వ్యవస్థను దరిజేరనీయకుండా డ్వాక్రా సంఘాలే నీటి సరఫరాకు ట్యాంకర్లు, గుంతలు తవ్వేందుకు యంత్ర పరికరాలు, ఎరువులు సమకూర్చే బాధ్యతలను తీసుకున్నందున వ్యాపార వ్యవహారాలలోనూ వారికి అనుభవం వస్తుంది. ఎన్హెచ్ఏఐ నిర్దేశించిన మేరకు 5,907 బొగోనియా, స్పాథోడియా, మిల్లింగ్ టోనియా, మారేడు, పొగడ మొక్కలను ప్రభుత్వ నర్సరీలలోనే డ్వాక్రా సంఘాలు కొనుగోలు చేస్తున్నాయి. పచ్చదనం పెంపునకు ప్రణాళిక రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. జాతీయ స్థాయిలో 24.62 శాతం గ్రీనరీ ఉండగా రాష్ట్రంలో 22.86 ఉంది. ఈ వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని కొండలపై కోటి మొక్కలు పెంచాలన్నది గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యం. 660 మండలాల్లోని వెయ్యి కొండలనైనా ఎంపిక చేసుకుని ఒక్కో కొండపై కనీసం 10 వేల మొక్కల పెంపకం చేపట్టనుంది. సీడ్ బాల్స్ విధానంలో ఫలాలనిచ్చే ఉసిరి, రేగు, సీతాఫలం, వెలగ, నీడనిచ్చే వేప, కానుగ తదితర మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఉపాధి హామీలో మొక్కల పెంపకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మొక్కల పెంపకం ఓ ముఖ్యాంశం. పొదుపు సంఘాల మహిళలు ఇందులో క్రియాశీలకంగా ఉన్నారు. రాష్ట్ర , జిల్లా, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల వెంబడి మొక్కలు నాటి పెంచే ప్రక్రియను డ్వాక్రా సభ్యులు చేపట్టిన సంగతి తెలిసిందే. రానున్న కాలంలో జాతీయ రహదారుల వెంబడి చెట్ల పెంపకంలోనూ భాగస్వాములు కానున్నారు. వ్యాపార అవకాశాలపైనా దృష్టి గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని 8.64 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలలో దాదాపు 90 లక్షల మంది సభ్యులు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మెప్మాలో లక్ష గ్రూపులు, పది లక్షల మంది వరకు సభ్యులు ఉన్నారు. 2014 నాటికి రాష్ట్రంలో 4,193 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా 2023 నాటికి 8,744 కిలోమీటర్లకు పెరుగుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా తిరుపతిలో ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ చొరవ, వేగం వల్లే ఇది సాధ్యమవుతోందన్నారు. ఈ జాతీయ రహదారులను ఉపయోగించుకొంటూ మహిళలకు పలు వ్యాపార అవకాశాలివ్వాలన్నది సీఎం జగన్ సంకల్పం. ఈమేరకు అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. రహదారుల టోల్‌ప్లాజాలు, ప్రధాన కూడళ్లు, నగర శివార్లలోని ఎన్హెచ్ఏఐ స్థలాల్లో స్థానిక డ్వాక్రా సంఘాలతో ఫుడ్ ప్లాజాలు, అవుట్లెట్ల ఏర్పాటు, గ్రామీణ ఉత్పత్తుల విక్రయాలకు స్టాళ్లు ఏర్పాటు చేయించాలని, ఇందుకోసం ఎన్హెచ్ఎఐతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారని సెర్ప్ సీఈవో ఎండి ఇంతియాజ్ ‘సాక్షి’కి తెలిపారు. -
డ్వాక్రా గ్రూపు ద్వారా ప్రభుత్వం చేసిన సాయంతోనే ఈ కొట్టు పెట్టుకున్నాను
-
మహిళలకు జగన్ ‘ఆసరా’
సాక్షి, అమరావతి : చంద్రబాబు నయవంచనతో రాష్ట్రంలో కుదేలైన పొదుపు సంఘాల వ్యవస్థకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తిరిగి జీవంపోసింది. 2019 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 11 నాటికి వాటి పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తం నాలుగు విడతల్లో వారికి చెల్లించేలా ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని అమలుచేయడంతో తిరిగి ఆ వ్యవస్థ గాడిలో పడింది. మన రాష్ట్రంలోని పొదుపు సంఘాల వ్యవస్థకు ఒక ప్రత్యేకత ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పావలా వడ్డీ పథకం ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలో దాదాపు ప్రతి పేదింటి మహిళ ఈ పొదుపు సంఘాల్లో సభ్యురాలైంది. రాష్ట్రంలో ఈ పురోగతిని చూసి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకానికీ శ్రీకారం చుట్టింది. మరోవైపు.. వైఎస్ ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత మహిళలు ప్రతినెలా ఎంతోకొంత పొదుపు చేసుకోవడం.. కుటుంబ అవసరాలకు సంఘం సభ్యులు ఉమ్మడిగా బ్యాంకుల నుంచి లోను తీసుకోవడం.. తిరిగి సకాలంలో అవి చెల్లించేవారు. ఈ సమయంలో 2014 ఎన్నికల ముందు, మహిళలెవరూ డ్వాక్రా రుణాలు చెల్లించవద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. వాటిని మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదు. అప్పట్లో సంబంధిత శాఖ మంత్రిగా పనిచేసిన పరిటాల సునీత ఈ వి షయాన్ని అసెంబ్లీలో లిఖితపూర్వకంగా ప్రకటించారు. దీంతో అప్పటివరకు దేశా నికి ఆదర్శంగా నిలిచిన ఏపీలో పొదుపు సంఘాల వ్యవస్థ పూర్తిగా నిర్విర్యమైంది. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకు రుణాలు చెల్లించని మహిళలు ఆ రుణాలపై వడ్డీ, చక్రవడ్డీలు పెరిగి బ్యాంకుల వద్ద డిఫాల్టర్లుగా మారారు. చివరకు.. ఒక దశలో వారు తమ రోజువారీ పొదుపు సంఘాల కార్యక్రమాలను దూరంపెట్టారు. సంఘాలకు జగన్ పూర్వవైభవం.. కానీ, వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు.. ‘పొదుపు’ మహిళల పేరిట అప్పటివరకు ఉన్న రూ.25,517 కోట్ల అప్పును వారికే నేరుగా నాలుగు విడతల్లో చెల్లించేందుకు సీఎం హోదాలో ఆయన వైఎస్సార్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మూడు విడతల్లో మొత్తం రూ.19,178.17 కోట్లను నేరుగా ఆయా మహిళల ఖాతాల్లో ఆయన జమచేశారు. మరోవైపు.. సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించే పొదుపు మహిళలకు ప్రభుత్వం వడ్డీ చెల్లించే విధానానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుడితే.. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం దానికి మంగళం పాడింది. కానీ, వైఎస్ జగన్ సీఎం అయ్యాక వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. దీంతో మహిళలు తిరిగి పొదుపు సంఘాల కార్యక్రమాలపట్ల ఆసక్తి పెంచుకున్నారు. అలాగే, చంద్రబాబు తీరుతో అప్పట్లో 60 శాతం పైబడి సంఘాలు సీ, డీ గ్రేడ్లకు పడిపోతే.. ఇప్పుడు రాష్ట్రంలో 91 శాతానికి పైగా సంఘాలు ఏ, బీ గ్రేడ్‌లో కొనసాగుతున్నాయి. ఫలితంగా దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలు 99.5 శాతం మేర తమ రుణాలు సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారు. -
Narayanamma Niraganti: డాక్టరేట్ కలను ‘సెల్ఫ్ హెల్ప్’ నెరవేర్చింది
కుగ్రామం నుంచి ఈ కామర్స్ దాకా నారాయణమ్మ విజయగాధ నారాయణమ్మ నీరగంటి... ఆంధ్రప్రదేశ్, సత్యసాయి జిల్లాలోని ముష్టి కోవెల అనే చిన్న గ్రామంలో అత్యంత సామాన్యమైన కుటుంబంలో పుట్టిన మహిళ. చదువంతా ప్రభుత్వ విద్యావ్యవస్థలోనే. ఆమె ఈ రోజు ఒక ‘ఈ కామర్స్’ సంస్థను స్థాపించి తోటి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కావాలనే తన కలను నిజం చేసుకోవడానికి పీహెచ్‌డీలో చేరారు. త్వరలో పట్టానందుకోనున్న నారాయణమ్మ తన ఆకాంక్షల సుమహారాన్ని సాక్షితో పంచుకున్నారు. డ్వాక్రా దారి చూపింది ‘‘మా నాన్న రైతు. పిల్లల్ని బాగా చదివించాలనే కోరిక మాత్రం బలంగా ఉండేది. ఐదవ తరగతి వరకు మా ఊరి బడిలో చదివాను. ఆరు, ఏడు తరగతులకు ఉదయం ఐదు కిలోమీటర్లు, సాయంత్రం ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. దాంతో అనంతపురంలో ఒక చిన్న గది అద్దెకు తీసుకుని నన్ను, మా అన్నను చదివించారాయన. అలా ఎనిమిదవ తరగతి నుంచి నేను ఇంటిపని, వంట పని చేసుకుంటూ చదువుకున్నాను. అనంతపూర్‌లో డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంబీఏకి ఆళ్లగడ్డ వెళ్లాను. ఆ తర్వాత పెళ్లితో హైదరాబాద్ రావడం నా ఉస్మానియా కల నెరవేరడానికి మార్గం సుగమం చేసింది. అధ్యయనానికి విద్యాసంవత్సరంలో ‘సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ చాలెంజెస్’ అంశాన్ని తీసుకున్నాను. 2010–11 నుంచి రంగారెడ్డి, సత్యసాయి జిల్లాల్లో డ్వాక్రా సంఘాలను అధ్యయనం చేశాను. మొత్తం ఐదు వందల గ్రూపుల కార్యకలాపాలను తెలుసుకున్న తర్వాత గ్రామీణ మహిళల్లో ఉన్న నైపుణ్యాలు, అవకాశాల మీద ఒక అవగాహన వచ్చింది. ఆర్థిక స్వావలంబనను, స్వయంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడాన్ని ఆస్వాదిస్తున్నారు. దాంతో వారిలో ఆత్మవిశ్వాసం కూడా మెరుగైంది. అవకాశాలు అందివస్తే ఇంకా ఏదో సాధించాలనే తపన కూడా కొందరిలో ఉంది. అలాంటి అభిరుచి ఉన్న వాళ్లకు వనరులు, ప్రభుత్వ అధికారుల సహకారం ఉంటే అద్భుతాలు చేయగలుగుతారు కూడా. ఇలాంటి సమన్వయం కొన్ని చోట్ల లేకపోవడం కూడా గమనించాను. మొత్తానికి మార్కెటింగ్ గురించిన ఆందోళన లేకపోతే ఉత్పత్తి విషయంలో శ్రమించడానికి వాళ్లు వెనుకాడరు. నా అధ్యయనం ఇలా సాగుతున్న సమయంలోనే కరోనా వచ్చింది. కరోనా కొల్లగొట్టింది కరోనా సమయంలో హోటళ్లతో సహా అన్నీ మూత పడడంతో ఉద్యోగాలు లేక ఏదో ఒక పని దొరికితే చాలన్నట్లు చాలా మంది కనిపించారు. శ్రమించే చేతులున్నాయి, ఆ ఉత్పత్తి అవసరమైన వ్యక్తులున్నారు. వాళ్ల మధ్య కరోనా కరాళ నృత్యం చేస్తోంది. అప్పుడు ఈ కామర్స్ రంగంలో ఓ ప్రయత్నం చేశాను. కర్పూరం తయారీ దారుల నుంచి కర్పూరాన్ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇంటింటికీ చేర్చడంలో విజయవంతమయ్యాను. మీషోలో సరదాగా మొదలు పెట్టిన రీ సేల్ అనుభవమూ తోడైంది. నా మార్కెట్‌ను విస్తరించడానికి శాన్విస్ స్టోర్, భవిత శ్రీ ట్రేడింగ్, ఫ్యాషన్, లేజీ షాపింగ్ వాణిజ్య వేదికలతో సెల్లర్‌గా అమెజాన్‌తో అనుసంధానమయ్యాను. ఆ అనుభవంతో గత ఏడాది నవంబర్‌లో మీథాట్ ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సొంత కంపెనీ ప్రారంభించాను. ఏడాది కోటి రూపాయల టర్నోవర్‌కు చేరుతుందని అంచనా. ఏడాదికి నికర లాభం ఏడెనిమిది లక్షలుండవచ్చు. గ్రామాలకు విస్తరించాలి ఇప్పటి వరకు నా నెట్వర్క్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అనంతపూర్, చిత్తూరు, గుంటూరు వంటి కొన్ని చోట్లలోనే ఉంది. ఇక గ్రామాల్లో ఉండే డ్వాక్రా మహిళలను అనుసంధానం చేయాలి. ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రాజెక్ట్ గ్రామాల్లో పెట్టాలనేది నా ఆలోచన. ఒక కుటుంబానికి అవసరమైన ప్రతి వస్తువూ నా ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ మీద లభించేటట్లు పటిష్ఠం చేయాలి. అలాగే విదేశాలకు సీమంతం కిట్, ఒడిబియ్యం కిట్, గర్భిణి తినాల్సిన పిండివంటలను ఎగుమతి చేయాలి. ఈ సర్వీస్ ఈ కామర్స్‌లో లేదు. ఈ కామర్స్ వేదిక లైసెన్స్, ట్రేడ్‌మార్క్, కాపీ రైట్స్, పేటెంట్లు, ఫుడ్ లైసెన్స్, వెబ్సైట్ నిర్మాణం, ప్రమోషన్ కోసం మూడు లక్షల వరకు ఖర్చు చేశాను. ఇవన్నీ ఇందులోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. నా ఈ ప్రయత్నంలో గృహిణులు, ఒంటరి మహిళలు, అరవై నిండిన పెద్దవాళ్లు కూడా ఉపాధి పొందుతున్నారు. ఉపాధినిస్తోంది మూడేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత పీహెచ్డీ కోసం ఉద్యోగం మానుకున్నాను. ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరతానని అప్పుడనుకోలేదు. లెక్చరర్‌గా భర్త సంపాదనకు తోడు నేనూ ఉద్యోగం చేసుకుంటూ , ఇద్దరమ్మాయిలను పెంచుకుంటూ ప్రశాంతంగా ఉండవచ్చు. కానీ నేను చేసిన ఎంబీయే ఫైనాన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల మీద పీహెచ్డీ నన్ను చిన్న పరిధిలో ఉంచడానికి ఇష్టపడలేదు. ఈ సాహసానికి ఒడిగట్టేలా ప్రోత్సహించాయి. మా గైడ్ శ్రీరాములు గారి పర్యవేక్షణలో నా పరిశోధన పూర్తయింది. డాక్టర్ నారాయణమ్మ అనే పేరు నా చిన్నప్పటి కల’’ అన్నారు నారాయణమ్మ. కల నెరవేరు తున్న ఆనందం ఆమె కళ్లలో కనిపించింది, ఆ మాట చెప్తున్నప్పుడు ఆ స్వరంలో ఆనందం తొణికిసలాడింది. ఎక్కడి ఆర్డర్‌కి అక్కడే పరిష్కారం ఆహారం మీద ప్రత్యేక దృష్టి పెట్టాను. నగరాల్లో మహిళలందరూ ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారాల్లో నిమగ్నమై ఉంటున్నారు. పిల్లలకు మన రుచులను ఇంట్లో చేసి పెట్టడం వాళ్లకు కష్టమే. అందుకే సౌత్ ఇండియన్ స్నాక్స్ హోమ్మేడ్వి అందిస్తున్నాను. నా నెట్‌వర్క్‌లో 30కి పైగా మహిళలున్నారు. ఒక ప్రదేశం నుంచి ఆర్డర్ రాగానే అదే ప్రదేశంలో ఉన్న మహిళకు ఫార్వర్డ్ చేస్తాను. మెటీరియల్ కొనుగోలు, ఆమె శ్రమకు వేతనం ఇస్తాను. ఆమె పిండివంటలు తయారు చేసి ప్యాక్ చేసి ఉంచుతుంది. మా కొరియర్ నెట్వర్క్ వాళ్లు ఆమె ఇంటికి వెళ్లి పార్సిల్‌ను కలెక్ట్ చేసుకుని కొరియర్ ఆర్డర్ ఇచ్చిన వినియోగదారులకు చేరుస్తారు. దాంతో పిండివంటలు తయారు చేసిన రోజే అందుతుండడంతో బాగా క్లిక్ అయింది. – వాకా మంజులారెడ్డి -
‘డ్వాక్రా ఉత్పత్తులకు కామన్ బ్రాండింగ్’
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా తయారు చేస్తున్న నిత్యావసర, ఇతర వస్తువులకు ఇంకా ఆకర్షణీయంగా లేబిలింగ్, ప్యాకింగ్‌తోపాటు మంచి కామన్ బ్రాండింగ్ ఏర్పాటు చేయాలి. దీనికి తెలంగాణ ముద్ర ఉండేటట్టు చూడాలి. అప్పుడు ఈ వస్తువులకు డిమాండ్ మరింత పెరుగుతుంది’అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం పీఆర్ శాఖ ముఖ్యకార్యదర్శి, సెర్ప్ సీఈవో సందీప్‌కుమార్ సుల్తానియా, ఇతర అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ సంస్థతో ఒప్పందం కుదిరిందని, అమెజాన్ వంటి ఆన్లైన్ మార్కెటింగ్ వంటి సంస్థలతోనూ మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకొని మహిళా ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు విస్తృతం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా అభివృద్ధి, సంక్షేమంలో మనకు సాటి లేదని, మహిళాసంఘాల అభివృద్ధి, పొదుపు రుణాల్లో దేశంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉంది. ఈ దశలో రాష్ట్రం పేరుప్రతిష్టలు ఇనుమడించేలా, మహిళా ఉత్పత్తులను సులువుగా, ఆకర్షణీయంగా అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముడుపోయేలా ఈజీగా, క్యాచీగా ఉండేట్లుగా బ్రాండింగ్ రూపొందించాలని మంత్రి సూచించారు. త్వరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్లి, వారి అనుమతితో కొత్త బ్రాండింగ్ చేయాలని, అందుకు తగ్గట్లుగా పలు పేర్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. -
ప్రొద్దుటూరులో టీడీపీ మహిళా నేత చేతివాటం..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరులో టీడీపీ మహిళా నేత చేతి వాటం ప్రదర్శించింది. డ్వాక్రా డబ్బులను టీడీపీ నాయకురాలు లక్ష్మీనారాయణమ్మ గోల్మాల్ చేసినట్లు తెలిసింది. దాదాపు 28 సంఘాలకు చెందిన డ్వాక్రా మహిళల నుంచి సుమారు రూ.40 లక్షలు స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే మహిళా నేతను టీడీపీ ఇంఛార్జ్ ప్రవీణ్‌కుమార్ వెనకేసుకురావడంతో బాధితులు ఆయన ఇంటిని ముట్టడించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. చదవండి: బెడ్రూంలో యువకుడితో ఏకాంతంగా భార్య.. బిగ్ షాక్ ఇచ్చిన భర్త -
డ్వాక్రా పొదుపు సంఘాల సొమ్ము గోల్మాల్ చేసిన టీడీపీ మహిళా నేత
-
సాధికారతకు సరికొత్త మార్కు
రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతోంది. స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా)ను మరింత బలోపేతం చేసేందుకు వాటి పనితీరును బట్టి గ్రేడింగ్‌లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 12 అంశాల్లో 100 మార్కులు కేటాయించి, దాని ఆధారంగా గ్రేడింగ్ ఇస్తారు. రుణాల మంజూరులో గ్రేడ్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 77,479 గ్రూపులకు గ్రేడింగ్ ఇస్తున్నారు. ఏలూరు (టూటౌన్): స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం గ్రేడింగ్ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సంఘాల పనితీరును పరిగణనలోనికి తీసుకొనే కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. సంఘాల పనితీరును బట్టి గ్రేడ్లు కేటాయిస్తారు. మొత్తం 12 అంశాల ప్రాతిపదికగా వంద మార్కులతో ఏ,బీ,సీ,డీ గ్రేడ్లుగా విభజించి వాటి ఆధారంగా రుణాలు మంజూరు చేయనున్నారు. మంచి గ్రేడ్లు ఉంటేనే అనుకున్న రుణాలు అందుతాయి. ఈ విధానంతో పొదుపు సంఘాల సమావేశాలు నిర్వహణ, అప్పుల వసూలు, రుణాల చెల్లింపులు తదితర పనులన్నీ పారదర్శకంగా జరుగనున్నాయి. బ్యాంకు రుణాలతో ఊతం గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ), పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్నారు. వీటితో పాటు అదనంగా వ్యాపారాలు చేసుకునే మహిళలకు స్త్రీ నిధి ద్వారా ప్రత్యేకంగా రుణాలు అందజేస్తున్నారు. సంఘాలను బలోపేతం చేసేలా డీఆర్డీఏ, వైఎస్సార్ క్రాంతి పథం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఇకనుంచి అన్ని సంఘాలకు గ్రేడింగ్ విధానం అమలు చేయనున్నారు. 8.05 లక్షల మంది.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 79,624 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 8,05,458 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది మార్చి 22న 76,846 గ్రూపులకు గ్రేడింగ్‌లు ఇచ్చారు. మరో 2,145 గ్రూపుల సమావేశాల చిత్రాలు అప్లోడ్ చేయలేదని గుర్తించారు. ఆయా సంఘాలకు సెర్ప్, స్త్రీనిధి ద్వారా బ్యాంకు రుణాలు అందజేస్తున్నారు. మార్కుల ఆధారంగా గ్రేడింగ్ డ్వాక్రా సంఘాల నిర్వహణ తీరు, సమావేశాలు చిత్రాలను ప్రత్యేక పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. దీంతో సంఘంలో ఏం జరుగుతుందో ప్రతి సభ్యు రాలు తెలుసుకునేందుకు వీలుంటుంది. సంఘాల పనితీరును బట్టి గ్రేడింగ్ ఇస్తున్నారు. తద్వారా వెనుకంజలో ఉన్న సంఘాలను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మార్కులు ఆధారంగా 80 శాతం దాటితే ఏ, 55 నుంచి 80 శాతం ఉంటే బీ, 55 నుంచి 30 శాతం ఉంటే సీ, 30 శాతంలోపు ఉంటే డీ గ్రేడ్ ఇచ్చారు. మార్కుల కేటాయింపు ఇలా.. పొదుపు సంఘాల కార్యక్రమాల నిర్వహణ ఆధారంగా మార్కులు కేటాయించనున్నారు. క్రమం తప్పకుండా సమావేశాల నిర్వహణకు 5, సభ్యుల హాజరుకు 10, క్రమం తప్పని పొదుపునకు 10, పొదుపు పుస్తకాల నిర్వహణకు 7, అప్పుల వసూలుకు 8, సీఐఎఫ్ వసూలుకు 10, స్త్రీనిధి వసూలుకు 10, ఇతర వసూళ్లకు 5, బ్యాంకు రుణాల వాయిదాల చెల్లింపునకు 10, గ్రామ సంఘం రుణ వసూలుకు 10, సంఘం నుంచి బ్యాంకు చెల్లింపులకు 10, మండల సమైక్య చెల్లింపులకు 5 చొప్పున మార్కులు ఇస్తారు. పొదుపు సంఘాలపై ప్రత్యేక దృష్టి డ్వాక్రా సంఘాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. క్రమం తప్పకుండా సమావేశాలు, పొదుపు పుస్తకాల నిర్వహణ, సభ్యుల హాజరు వంటివి ప్రామాణికంగా తీసుకుంటారు. సంఘాల పనితీరును బట్టి 12 అంశాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయిస్తాం. – వై.రామకృష్ణ, పీడీ, డీఆర్డీఏ, ఏలూరు