అర్ధరాత్రి నగరం మొత్తం గాఢ నిద్రలో ఉన్న వేళ.. ఒక్క మెసేజ్ నగరం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. జాంబీల భయంతో నిద్రలేని రాత్రి గడిపారు. అయితే ఉదయం అయ్యాక అదంతా ఉత్త పుకారే అని తేలటంతో అధికారులపై ప్రజలు మండిపడ్డారు.
ఫ్లోరిడా: విషయంలోకి వెళ్తే మే 20వ తేదీన ఫ్లోరిడాలోని లేక్‌వర్త్ నగరంలో ప్రజలంతా నిద్రిస్తున్న వేళ.. అర్ధరాత్రి ఓ సందేశం వచ్చింది. ‘విద్యుత్ అంతరాయం.. జాంబీ అలర్ట్.. సగం జనాభా ప్రమాదంలో ఉంది. పరిస్థితి మాములు స్థితికి వచ్చేందుకు ఎంత టైం పడుతుందో ఖచ్ఛితంగా చెప్పలేం’ అంటూ అర్ధరాత్రి 1గం.45ని. సమయంలో సందేశం వచ్చింది. ఆ అలర్ట్ చూసిన ప్రజలంతా వణికిపోయి రాత్రంతా చీకట్లోనే జాగారం చేశారు. ఉదయానికల్లా వార్త దావానంలా పాకటంతో అధికారులు రంగంలోకి దిగారు.
పబ్లిక్ ఇన్ఫర్మెన్ కార్యాలయం నుంచే ఆ సందేశం ప్రచారం కావటంతో నగరవాసులకు క్షమాపణలు తెలియజేశారు. తాము కేవలం పవర్‌కట్‌కు సంబంధించి సందేశం మాత్రమే పంపామని.. జాంబీ అలర్ట్‌ను ఎవరో జత చేసి ఉంటారని ప్రకటించారు. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి ఓ మాజీ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇలాంటి పుకార్లు గతంలోనూ ప్రజలకు దడ పుట్టించాయి. ఈ ఏడాది జనవరిలో హవాలి వాసులకు బాలిస్టిక్ మిసైల్ దాడి అంటూ ఓ సందేశం పాకిపోయి పెనుకలకలమే రేగింది.
Comments
Please login to add a commentAdd a comment