అమెరికాలో మరో విమాన ప్రమాదం.. ట్రంప్‌ వచ్చాక 12వ ప్రమాదం | plane crashes near Florida highway Video Viral | Sakshi
Sakshi News home page

అమెరికాలో మరో విమాన ప్రమాదం.. పలువురు మృతి

Published Sat, Apr 12 2025 7:54 AM | Last Updated on Sat, Apr 12 2025 9:36 AM

plane crashes near Florida highway Video Viral

ఫ్లోరిడా: అగ్రరాజ్యం అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. శుక్రవారం న్యూయార్క్‌లో హెలికాప్టర్‌ ప్రమాదం మరువకముందే.. ఈరోజు మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో చిన్న విమానం కూలిపోయిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల ప్రకారం.. అమెరికాలోని ఫ్లోరిడాలో రహదారిపైనే చిన్న విమానం కూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగా సెస్నా 310 అనే విమానం విమానాశ్రయానికి సమీపంలోని ఇంటర్‌స్టేట్-95 సమీపంలో కూలిపోయింది. బోకా రాటన్ విమానాశ్రయం నుండి బయలుదేరి తల్లాహస్సీ వైపు వెళుతున్న కొద్ది క్షణాల్లోనే విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం సందర్భంగా విమానం నుంచి మంటలు వచ్చి దట్టమైన పొగ చుట్టుపక్కల వ్యాపించింది. ప్రమాదం కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించినట్టు తెలుస్తోంది.

ఒక్కసారిగా గాల్లో నుంచి విమానం.. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పడిపోయింది. ఈ కారణంగా కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. హైవేపై ప్రమాదం కారణంగా అక్కడి రోడ్లను మూసివేసి సహాయక చర్యలు చేపట్టినట్టు రాటన్ ఫైర్ రెస్క్యూ అసిస్టెంట్ చీఫ్ మైఖేల్ లాసల్లె నివేదించారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 రెండు రోజులలో రెండు ప్రమాదాలు
ఈ ఘటనకు ముందు రోజు, న్యూయార్క్‌లో ఓ హెలికాప్టర్ హడ్సన్ నదిలో కూలిపోయిన ఘటన కూడా చర్చనీయాంశంగా మారింది. వరుసగా రెండు రోజులలో రెండు గగనతల ప్రమాదాలు జరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. విమాన రవాణా భద్రతపై సర్వత్రా ప్రశ్నలు వేగంగా వెల్లివిరుస్తున్నాయి. నిపుణులు ఈ ఘటనలపై విచారణ చేపట్టి, కారణాలు తెలియజేయాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 12వ విమాన ప్రమాదం కావడం గమనార్హం. అమెరికాలో విమాన భద్రత ప్రమాణాలపై పునర్విచారణ చేయాల్సిన అవసరం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement