
సాక్షి, ఏలూరు: మంత్రి అంబటి రాంబాబు పోలవరం పర్యటనకు వెళ్లారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం గ్యాప్-2 శాండ్ ఫిల్లింగ్‌ను మంత్రి అంబటి పరిశీలించారు. ఇదే సమయంలో స్పిల్‌వే వద్ద కుంగిన గైడ్‌బండ్‌ను పరిశీలించారు.
ఈ సందర్బంగా మంత్రి అంబటి మాట్లాడుతూ.. గైడ్‌బండ్ కుంగిన ఘటనపై ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. గైడ్‌బండ్‌పై తప్పుడు ప్రచారం చేయవద్దు. కుంగిన గైడ్‌బండ్‌ను ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పరిశీలించింది. పోలవరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే ప్రత్యేక వైవిధ్యం కలిగిన ప్రాజెక్ట్. పోలవరాన్ని పరిశీలిస్తామని కొందరు హడావుడి చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ను పరిశీలించాలంటే ముందు అప్లై చేసుకోవాలి. పోలవరం పనులపై ఏదీ దాచాల్సిన అవసరం మాకు లేదు. రాజకీయ లబ్ది కోసం విపక్షాలు ప్రయత్నించడం దారుణం. పోలవరం నిర్మాణంలో చిత్తశుద్ధితో ఉన్నాం అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: విశాఖ పోలీసులు అలర్ట్‌గా ఉన్నారు కాబట్టే కిడ్నాపర్లను పట్టుకోగలిగాం: డీజీపీ రాజేంద్రనాథ్
Comments
Please login to add a commentAdd a comment