సాక్షి, తాడేపల్లి: ఈనాడు దినపత్రిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద విషం కక్కుతోందని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పోలవరం పునరావాసం రెండు ముక్కలు, రాజధాని మూడు ముక్కలు అని ఈనాడు రాసిందని మండిపడ్డారు. ఏదో జరిగిపోతున్నట్లు ప్రజల్లో నెమ్మదిగా విషం ఎక్కించే పని చేస్తోందని విమర్శించారు. అదే చంద్రబాబు హయాంలో శరవేగంతో పోలవరం పనులు అని సదరు పత్రిక రాసినట్లు అంబటి రాంబాబు గుర్తు చేశారు. వాస్తవాలు ఏంటో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.
పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు అని, పక్క రాష్ట్రాలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఒకేసారి నీళ్లతో నింపరని, కాబట్టి దశలవారీగా చేస్తారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తోందన్నారు. 41.15 మీటర్ల వరకు నీటిని నింపుతారని, అక్కడి వరకు ఉన్నవారికి ముందుగా పునరావాసం కల్పిస్తారని తెలిపారు. కానీ కానీ ఈనాడు పత్రిక విషం నింపే పని చేస్తోందని దుయ్యబట్టారు. రూ.800 కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టడానికి ఎవరు కారణమో ఆ పత్రిక ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు.
చదవండి: వైఎస్సార్‌సీపీలో వర్గాల్లేవు.. ఉన్నవారంతా జగన్ సైనికులే: అనిల్ కుమార్
‘త్వరగా అయిపోయే పనులు చేసి చంద్రబాబు కమీషన్లు కొట్టేశారు. చంద్రబాబు స్పిల్‌వే కట్టకుండా కాపర్ డ్యాం కట్టి డబ్బులు కొట్టేశాడు. అందుకే వరదలకు అది కొట్టుకుపోయింది. డయాఫ్రం వాల్ సైతం కొట్టుకుపోయింది. ఇప్పుడు వీటిని మళ్ళీ కట్టాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలోనే మొదటిసారిగా జరిగింది. దీనికి కారణం చంద్రబాబు. మరి ఆ వార్తలు ఈనాడులో ఎందుకు రాయడం లేదు?.
జగన్ సీఎం అయ్యాక చిత్తశుద్దితో పోలవరం పనులు చేస్తున్నారు. కానీ ఎల్లో మీడియాకి అదేమీ పట్టడం లేదు. సీఎం జగన్, కేంద్ర మంత్రి పోలవరం పరిశీలించారు. పునరావాస కాలనీలు కూడా బాగా జరుగుతున్నాయని కేంద్రమంత్రే ప్రకటించారు. బాధితులకు నేరుగా వారి ఖాతాలోనే డబ్బు వేసేలా చర్యలు చేపట్టారు. ’ అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
చదవండి: నాన్న మంత్రిగా ఉన్నప్పుడు వచ్చా.. ఇప్పుడు మంత్రినై వచ్చా..
Comments
Please login to add a commentAdd a comment