పోలవరం పాపం బాబుదే.. చర్చకు సిద్ధమా?: అంబటి సవాల్‌ | Ex Minister Ambati Rambabu Key Comments On Polavaram Project | Sakshi
Sakshi News home page

పోలవరం పాపం బాబుదే.. చర్చకు సిద్ధమా?: అంబటి సవాల్‌

Published Sat, Aug 17 2024 4:21 PM | Last Updated on Sat, Aug 17 2024 7:14 PM

Ex Minister Ambati Rambabu Key Comments On Polavaram Project

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్‌ పనులు శరవేగంగా జరిగాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇక, టీడీపీ హయాంలో చంద్రబాబు తప్పిదంతో డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోవడం వల్లే పోలవరం ప్రాజెక్ట్‌ ఆలస్యమైందని ఆయన చెప్పుకొచ్చారు.

కాగా, మాజీ మంత్రి అంబటి శనివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడి. దివంగత మహానేత వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరాన్ని ప్రారంభించారు. ఎంతో కృషి చేసి అనుమతులు తీసుకువచ్చారు. వైఎస్సార్‌ మరణం తర్వాత కేంద్రామే పోలవరం ప్రాజెక్ట్‌ను తీసుకుంది. లేదు.. మేమే పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రాజెక్ట్‌ను తీసుకున్నారు.

ఇక, వైఎస్సార్‌సీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్‌ పనులు శరవేగంగా జరిగాయి. టీడీపీ హయాంలో చంద్రబాబు తప్పిదంతో డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోవడం వల్లే పోలవరం ప్రాజెక్ట్‌ ఆలస్యమైంది. దీనిపై చంద్రబాబు గోబెల్స్‌ ప్రచారం చేశారు. బాబు నిర్ణయాలు సరిగా లేకపోవడం వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. తిరిగి మాపైనే ఎల్లో మీడియాతో బుదరజల్లే ప్రయత్నం చేశారు. చంద్రబాబు హయాంలోనే ప్రొటోకాల్‌ లేకుండా నిర్మాణాలు జరిగాయి. ఇదే విషయాన్ని అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా చెప్పింది.

 

450 మీటర్ల వరకు డయాఫ్రం వాల్ దెబ్బ తిన్నది. దానిమీద జగన్ కేంద్ర ప్రభుత్వంతో అనేకసార్లు మాట్లాడారు. దేశంలో నిపుణులు లేనందున ఇతర దేశాల నిపుణులను పిలిపించి విచారణ జరిపించాం. అంతర్జాతీయ కమిటీతో విచారణ జరిపించాం. వారు మొన్న 12న ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. నదిని డైవర్ట్ చేయకుండా డయాఫ్రం వాల్ నిర్మాణం వద్దని మేము కూడా చెప్పాం. 2016 డిసెంబర్ నుండి ప్రాజెక్టును పట్టించుకోలేదనీ, వరదనీరు స్పిల్ వే మీదకు వెళ్లకుముందే కాపర్ డ్యాం చేపట్టడం వలన నష్టం వచ్చిందని కమిటీ చెప్పింది.

పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధాన కారణం ఇదే!

2018లో వరద వచ్చినప్పుడు సరైన చర్యలు తీసుకోనందనే ప్రాజెక్టు దెబ్బతిన్నది. గ్యాప్-2లో డయాఫ్రం వాల్ బాగా దెబ్బతిన్నదని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. మా ప్రభుత్వం వచ్చాకే ప్రధాన డ్యాం దెబ్బతినకుండా చర్యలు చేపట్టిందని కూడా కమిటీ చెప్పింది. మా హయాంలో రెండు కాఫర్ డ్యాంల నిర్మాణం చేపట్టడంపై కమిటీ మెచ్చుకుంది. పోలవరం ప్రాజెక్టు పనుల మీద చర్చకు రాగలరా?. మీడియా సమక్షంలో చర్చకు మేము సిద్దమే. మంత్రి రామానాయుడు వచ్చినా చర్చకు సిద్దమే. 12వేల కోట్లు కేంద్ర నిధులను రానీకుండా చంద్రబాబు అప్పట్లో అడ్డుకున్నారు. ఇప్పుడు కేంద్రంతో కూటమిలో ఉన్నందున ఇప్పుడైనా ఆ నిధులు తేవాలి. ప్రాజెక్టులో పాపం చంద్రబాబుదే. ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఎల్లోమీడియా వాస్తవాలను రాయాలి. ఇది ముసాయిదా రిపోర్టు అయితే ఫైనల్ రిపోర్టులో మేనేజ్ చేయాలనుకుంటున్నారా?. చంద్రబాబు ధనార్జన వలనే ప్రాజెక్టు నష్టపోయింది.

 

నదిని డైవర్ట్‌ చేయకుండా ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలు చేపట్టారు. చంద్రబాబు సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే పోలవరం ఆలస్యమైంది. 2016 డిసెంబర్‌ నుంచి ప్రాజెక్ట్‌ను పట్టించుకోలేదని, కనీసం ప్రోటోకాల్‌ను కూడా పాటించలేదని నిపుణుల కమిటీ తేల్చింది. పోలవరం ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీనే చెప్పారు. డబ్బులు దోచుకోవడానికి పోలవరం ప్రాజెక్ట్‌ను చంద్రబాబు వాడుకున్నారు. బాబు లోపాలను ఎత్తి చూపితే ఆయనకు కోపం వస్తుంది. కాఫర్‌ డ్యామ్‌ లేకుండానే ప్రాజెక్ట్‌ చేయవచ్చని బాబు అంటున్నారు.

చట్ట విరుద్ధంగా పనిచేసే వారిని రెడ్ బుక్‌లో రాసుకున్నానని లోకేష్ అన్నారు. ప్రతీ ఎమ్మెల్యేని బట్టలు ఊడదీసి నిలపెడతా అన్నారు. ఒక రాజకీయ నాయకుడు అనాల్సిన మాటలేనా ఇవి?. రాష్ట్రంలో కావాలనే విధ్వంసం చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం మీద చేసిన వారి మీద కనీసం కేసు ఎందుకు నమోదు చేయలేదు?. ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకేమైనా ఉందా?. చంద్రబాబు చేసిన దుర్మార్గాలను వైఎస్ జగన్‌పై వేయాలని చూస్తున్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement