జింబాబ్వే క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్ను మూశాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ 49 ఏళ్ల వయసులో హీత్ స్ట్రీక్ తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని అతడి భార్య నడైన్ స్ట్రీక్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
"ఈ రోజు ఉదయం నా జీవితంలో సగం, నా అందమైన పిల్లల తండ్రి మమ్మల్ని విడిచి అందరాని లోకాలకు వెళ్లిపోయారు. అతను తన చివరి రోజులను ఫ్యామిలీ, అత్యంత సన్నిహితులతో గడపాలని కోరుకున్నారు. స్ట్రీక్ మాతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనవి. స్ట్రీకీ మరో జన్మలో కూడా నీ భార్యగానే పుట్టాలని కోరుకుంటున్నా అంటూ" ఆమె భావోద్వేగానికి లోనైంది.
కాగా 10 రోజుల క్రితం హీత్ స్ట్రీక్ మరణించాడంటూ సహచర ఆటగాడు హెన్రీ ఒలంగ అభిమానులను గందరగోళానికి గురిచేశాడు. ఆ తర్వాత మళ్లీ కొద్దిసేపటికే బతికే ఉన్నాడంటూ ట్విట్ చేసి తన తప్పును సరిదిద్దుకున్నాడు. కానీ ఇప్పుడు నిజంగానే స్ట్రీక్ అందరిని విడిచి పెట్టి అందరాని లోకాలకు వెళ్లిపోయారు.
కాగా జింబాబ్వే క్రికెట్ చరిత్రలోనే హీత్ స్ట్రీక్ గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్. క్ 1993లో ఆ దేశం తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించి 65 టెస్ట్‌లు (216 వికెట్లు, సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు), 189 వన్డేలు (239 వికెట్లు, 13 హాఫ్ సెంచరీలు) ఆడాడు. అతను తన చివరి మ్యాచ్‌ను 2005లో ఆడాడు. స్ట్రీక్ 21 టెస్ట్‌ల్లో, 68 వన్డేల్లో జింబాబ్వే కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 2021లో స్ట్రీక్ అవినీతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొని, ఎనిమిదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధానికి గురయ్యాడు.
చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. సంజూ, తిలక్ వర్మకు నో ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment