Zimbabwe Cricket Team
-
పాకిస్తాన్‌కు ఆడుతారా? దిమ్మతిరిగే సమాధనమిచ్చిన స్టార్ క్రికెటర్
జింబాబ్వే టీ20 కెప్టెన్ సికందర్ రజా ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు. ఈ క్రమంలో ఓ అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. భవిష్యత్తులో పాకిస్తాన్‌కు ఆడే అవకాశం వస్తే మీరు ఆడుతారా అని సదరు అభిమాని ఎక్స్ వేదికగా ప్రశ్నించాడు. అందుకు సికందర్ రజా దిమ్మతిరిగే సమాధనమిచ్చాడు. జింబాబ్వే క్రికెట్‌కు తను విధేయుడనని, పాక్ తరపున ఆడే ఆలోచన తనకు ఎప్పటకీ కలగదని రజా బదులిచ్చాడు."నేను పాకిస్తాన్లో పుట్టినప్పటకి.. నన్ను ఈ స్ధాయికి తీసుకు వచ్చింది మాత్రం జింబాబ్వేనే. జింబాబ్వే క్రికెట్ నాపై చాలా సమయం, డబ్బు వెచ్చించింది. నేను ఎప్పటకి జింబాబ్వేకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తాను. జింబాబ్వే క్రికెట్‌కు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంట్టేందుకు నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తునే ఉంటాను" అని రజా రిప్లే ఇచ్చాడు. కాగా 38 ఏళ్ల రజా పాకిస్తాన్‌లోని సియాల్ కోట్లో జన్మించాడు. తన పాఠశాల విధ్యను పాకిస్తాన్‌లోనే రజా అభ్యసించాడు. ఆ తర్వాత 2002లో తన ఫ్యామిలీతో కలిసి జింబాబ్వేకు రజా మకాం మార్చాడు. 2013 జింబాబ్వే క్రికెట్ తరపున రజా అరంగేట్రం చేశాడు. రజా ప్రస్తుతం జింబాబ్వేతో పాటు ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్ కూడా ఆడుతున్నాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు రజా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. -
ఓర్నీ.. ఇదేమి సెలబ్రేషన్స్ రా బాబు! అంపైర్‌ను భయపెట్టాడు(వీడియో)
జింబాబ్వే దేశీవాళీ క్రికెట్ టోర్నీ నేషనల్ వన్డే కప్-2024లో విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. ఓ జింబాబ్వే క్రికెటర్ విన్నింగ్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. సదరు బ్యాటర్ ఓవరాక్షన్ కారణంగా ఆన్ ఫీల్డ్ అంపైర్ కాలికి గాయమైంది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే.అసలేం జరిగిందంటే?ఈ టోర్నీలో భాగంగా బుధవారం ఓగో రేంజర్స్, రెయిన్ బో 1 క్రికెట్ క్లబ్ జట్లు తలపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఓగో రేంజర్స్ నిర్ణీత 45 ఓవర్లలో 229 పరుగులు చేసింది. అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రెయిన్బో 1 క్రికెట్ క్లబ్ సరిగ్గా 44.5 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. దీంతో రెయిన్ బో జట్టు విజయానికి ఆఖరి బంతికి 4 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఓగో రేంజర్స్ స్పిన్నర్ ర్యాన్ బర్ల్ వేసిన బంతిని ఫ్రాన్సిస్ సాండే అద్భుతమైన సిక్స్ కొట్టి రెయిన్బో క్రికెట్ క్లబ్‌కు విజయాన్ని అందించాడు. ఇక్కడ వరకు అంత బాగానే ఉన్న మ్యాచ్‌ను గెలిపించిన సాండే అతి చేశాడు. సిక్స్ కొట్టిన వెంటనే తన బ్యాట్‌ను బలంగా నాన్‌స్ట్రైక్ వైపు విసిరాడు. దీంతో ఆ బ్యాట్ కాస్త అంపైర్ కాలికి తాకింది. అంపైర్ నొప్పితో కాసేపు విల్లవిల్లాడు. కానీ ఫ్రాన్సిస్ సాండే మాత్రం అంపైర్‌కు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అతడు కావాలనే తన బ్యాట్‌ను అంపైర్ విసిరాడని కామెంట్లు చేస్తున్నారు. The 𝐍𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐏𝐫𝐞𝐦𝐢𝐞𝐫 𝐋𝐞𝐚𝐠𝐮𝐞 dishes out sissling hot action! 🙌🏻Rainbow wanted 4 runs off the last ball against SOGO Rangers 🎥#NPL2024 pic.twitter.com/oj0bwT1X4Q— Zimbabwe Cricket Domestic (@zcdomestic) July 31, 2024 -
టీమిండియాతో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన జింబాబ్వే
స్వదేశంలో భారత్‌తో జరగనున్న ఐదు మ్యాచ్ టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును జింబాబ్వే క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు సికిందర్ రజా సారథ్యం వహించనున్నాడు. యువ బ్యాటర్ అంతుమ్ నఖ్వీకి తొలిసారి సెలక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. అయితే నఖ్వీ భారత్‌తో టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన నఖ్వీ గతేడాది జింబాబ్వేకు మకాం మార్చాడు. ప్రస్తుతం జింబాబ్వే దేశీవాళీ క్రికెట్లో ఆడుతున్నాడు.ఈ క్రమంలో జింబాబ్వేకు అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించాలని నఖ్వీ గట్టిగా ఫిక్స్ అయ్యాడు. దీంతో ఆ దేశ పౌరసత్వం కోసం నఖ్వీ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతడి సిటిజన్‌షిప్‌ను ఇంకా అక్కడి ప్రభుత్వం అంగీకరించలేదు. ఏదేమైనప్పటికి దేశీవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుండడంతో సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. కాగా అతడి పౌరసత్వంపై ఒకట్రెండు రోజుల్లో క్లియర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న వెస్లీ మాధవెరె,బ్రాండన్ మవుతా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ సిరీస్ జులై 6 నుంచి మొదలుకానుంది. అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగానే జరగనున్నాయి. కాగా ఈ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఈ టూర్లో భారత జట్టు కెప్టెన్‌గా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ వ్యవహరించనున్నాడు.భారత్‌తో సిరీస్‌కు జింబాబ్వే జట్టుసికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, జోనాథన్ క్యాంప్‌బెల్, టెండై చటారా, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, క్లైవ్ మదాండే, వెస్లీ మాధవెరె, తాడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్రాండన్ మవుటా, బ్లెస్సింగ్ ముజరబానీ, అన్టుమ్డ్ మైక్ర్స్రాబానీ, డి. మిల్టన్ శుంబాజింబాబ్వేతో సిరీస్‌కు భారత జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, దృవ్ జురెల్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే -
టీమిండియాతో టీ20 సిరీస్.. జింబాబ్వే క్రికెట్ కీలక నిర్ణయం
టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు జింబాబ్వే క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పురుషుల జట్టు హెడ్‌కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ జస్టిన్ సామన్స్ను జింబాబ్వే క్రికెట్ బోర్డు నియమించింది.ఈ విషయాన్ని జింబాబ్వే క్రికెట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా టీ20 ప్రపంచ కప్ 2024కి అర్హత సాధించడంలో విఫలం కావడంతో జింబ్వాబ్వే హెడ్ కోచ్ బాధ్యతల నుంచి డేవ్ హౌటన్ ఈ ఏడాది ఆరంభంలో తప్పుకున్నాడు. అప్పటి నుంచి జింబ్వాబ్వే ప్రధాన కోచ్లేకుండానే పలు టీ20 సిరీస్‌లు ఆడింది.ఈ నేపథ్యంలోనే తమ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా సామన్స్ను జింబాబ్వే క్రికెట్ ఎంపిక చేసింది. సామన్స్తో పాటు ఆ దేశ మాజీ ఆటగాడు డియోన్ ఇబ్రహీమ్‌కు సైతం జింబాబ్వే క్రికెట్ కీలక బాధ్యతల అప్పగించింది. జింబాబ్వే అసిస్టెంట్ కోచ్‌గా డియోన్ ఇబ్రహీమ్ పనిచేయనున్నాడు. కాగా సామన్స్కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. సామన్స్ గతంలో సౌతాఫ్రికా హైఫెర్మెమెన్స్ సెంటర్లో కోచ్‌గా పనిచేశాడు. అదేవిధంగా 2021 నుంచి 2023 వరకు ప్రోటీస్ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుని కూడా పనిచేశాడు.ఇక స్వదేశంలో భారత్‌తో 5 మ్యాచ్‌ల టీ20సిరీస్‌లో జింబ్వావ్వే తలపడనుంది. ఈ సిరీస్ జూలై 6న ప్రారంభమై జూలై 14తో ముగియనుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి. -
జింబాబ్వేతో వన్డే సిరీస్.. శ్రీలంక జట్టు ప్రకటన! కెప్టెన్‌గా మెండిస్
స్వదేశంలో జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌తో వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్.. శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. అతడి డిప్యూటీగా మిడిలార్డర్ బ్యాటర్ చరిత్ అసలంక వ్యవహరించనున్నాడు. ఇక గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ జట్టులో అతడికి చోటు దక్కింది. కాగా ఇటీవలే శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్‌గా హసరంగా ఎంపికైన సంగతి తెలిసిందే. అదే విధంగా గాయం కారణంగా వన్డే ప్రపంచకప్-2023 మధ్యలోనే తప్పుకున్న మాజీ కెప్టెన్ దసున్ షనక కూడి జింబాబ్వే సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా తొలుత ఈ సిరీస్‌కు 21 మంది సభ్యుల ప్రిలిమనరీ జట్టును ఎంపిక చేసింది. అందులో ఇప్పుడు 17 మంది పేర్లను ఉపుల్ తరంగా నేతృత్వంలోని లంక సెలెక్షన్ కమిటీ ఖారారు చేసింది. జనవరి 6న కొలంబో వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. జింబాబ్వేతో వన్డేలకు శ్రీలంక జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, సహన్ అరాచ్చిగే, నువానీడు ఫెర్నాండో, దసున్ షనక, జనిత్ లియానాగే, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక, దుష్మంత చమీర, ప్రమోద్ చమీర, వాండర్సే, అకిల దనంజయ, వనిందు హసరంగా (ఫిట్‌నెస్‌కు లోబడి). చదవండి: #Saim Ayub: బ్యాటింగ్‌లో విఫలం.. ఈజీ క్యాచ్ వదిలేశాడు.. బాబర్ రియాక్షన్ వైరల్ -
లెజండరీ క్రికెటర్ కన్నుమూత.. భార్య తీవ్ర భావోద్వేగం
జింబాబ్వే క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్ను మూశాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ 49 ఏళ్ల వయసులో హీత్ స్ట్రీక్ తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని అతడి భార్య నడైన్ స్ట్రీక్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. "ఈ రోజు ఉదయం నా జీవితంలో సగం, నా అందమైన పిల్లల తండ్రి మమ్మల్ని విడిచి అందరాని లోకాలకు వెళ్లిపోయారు. అతను తన చివరి రోజులను ఫ్యామిలీ, అత్యంత సన్నిహితులతో గడపాలని కోరుకున్నారు. స్ట్రీక్ మాతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనవి. స్ట్రీకీ మరో జన్మలో కూడా నీ భార్యగానే పుట్టాలని కోరుకుంటున్నా అంటూ" ఆమె భావోద్వేగానికి లోనైంది. కాగా 10 రోజుల క్రితం హీత్ స్ట్రీక్ మరణించాడంటూ సహచర ఆటగాడు హెన్రీ ఒలంగ అభిమానులను గందరగోళానికి గురిచేశాడు. ఆ తర్వాత మళ్లీ కొద్దిసేపటికే బతికే ఉన్నాడంటూ ట్విట్ చేసి తన తప్పును సరిదిద్దుకున్నాడు. కానీ ఇప్పుడు నిజంగానే స్ట్రీక్ అందరిని విడిచి పెట్టి అందరాని లోకాలకు వెళ్లిపోయారు. కాగా జింబాబ్వే క్రికెట్ చరిత్రలోనే హీత్ స్ట్రీక్ గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్. క్ 1993లో ఆ దేశం తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించి 65 టెస్ట్‌లు (216 వికెట్లు, సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు), 189 వన్డేలు (239 వికెట్లు, 13 హాఫ్ సెంచరీలు) ఆడాడు. అతను తన చివరి మ్యాచ్‌ను 2005లో ఆడాడు. స్ట్రీక్ 21 టెస్ట్‌ల్లో, 68 వన్డేల్లో జింబాబ్వే కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 2021లో స్ట్రీక్ అవినీతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొని, ఎనిమిదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధానికి గురయ్యాడు. చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. సంజూ, తిలక్ వర్మకు నో ఛాన్స్! -
ఆఫ్గాన్ బ్యాటర్ మెరుపులు.. జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ విజేతగా డర్బన్
జింబాబ్వే వేదికగా జరిగిన జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ తొలి ఎడిషన్ విజేతగా డర్బన్ క్వాలండర్స్ నిలిచింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్లో జోబర్గ్ బఫెలోస్ను 8 వికెట్ల తేడాతో ఓడించిన డర్బన్ చాంపియన్స్‌గా నిలిచింది. ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ బఫెలోస్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. జోబర్గ్ బ్యాటరల్లో కెప్టెన్ మహ్మద్ హాఫీజ్(32), టామ్ బంటన్(36) పరుగులతో రాణించారు. డర్బన్ బౌలర్లలో అబ్బాస్,లిండే, ఈవెన్స్ తలా వికెట్ సాధించారు. అనంతరం 128 లక్ష్యంతో బరిలోకి దిగిన డర్బన్ క్వాలండర్స్ 9.2 ఓవర్లలోనే ఛేదించింది. డర్బన్ విజయంలో హజ్రతుల్లా జజాయ్(43 నాటౌట్), టిమ్ సైఫర్ట్(30), ఆసిఫ్ అలీ(21 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. జోబర్గ్ బఫెలోస్ బౌలర్లలో ఉస్మాన్ షిన్వారి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో అదరగొట్టిన హజ్రతుల్లా జజాయ్ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కగా.. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన సీఫర్ట్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు లభించింది. చదవండి: మేము కసితో ఆడాం.. నాకు ముందే తెలుసు! తర్వాతి మ్యాచ్ కూడా: విండీస్ కెప్టెన్ -
హ్యాట్రిక్ సెంచరీ.. జట్టును వరల్డ్‌కప్‌కు చేర్చడమే ధ్యేయంగా!
జింబాబ్వే సీనియర్ బ్యాటర్ సీన్ విలియమ్స్ తన జట్టును వరల్డ్‌కప్‌కు క్వాలిఫై చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా అనిపిస్తోంది. తన కెరీర్లోనే పీక్ ఫామ్ కనబరుస్తున్న సీన్ విలియమ్స్ మరో సెంచరీతో మెరిశాడు. క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా గురువారం సూపర్ సిక్స్‌లో ఒమన్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ టోర్నీలో సీన్ విలియమ్స్‌కు ఇది హ్యాట్రిక్ సెంచరీ కావడం విశేషం. గ్రూప్ దశలో అమెరికాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 175 పరుగుల ఇన్నింగ్స్‌తో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ తన జోరును సూపర్ సిక్స్‌లోనూ చూపిస్తున్నాడు. 81 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న విలియమ్సన్ ఖాతాలో 13 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. విలిమయమ్సన్ ధాటికి జింబాబ్వే మరోసారి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం జింబాబ్వే 41 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. విలియమ్సన్ 119 పరుగులతో అజేయంగా ఆడుతుండగా.. రియాన్ బర్ల్ 2 పరుగులతో సహకరిస్తున్నాడు. కాగా వలర్డ్‌కప్ క్వాలిఫయర్ టోర్నీలో ప్రస్తుతం విలియమ్సన్ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన విలియమ్సన్ రెండు అర్థసెంచరీలు, మూడు సెంచరీల సాయంతో 506 పరుగులు సాధించాడు. రెండో స్థానంలో నికోలస్ పూరన్ 296 పరుగులతో ఉన్నాడు. టాప్-2 స్కోరర్స్‌కు చాలా తేడా ఉంది. దీంతో అతని దూకుడు ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. The third hundred in the tournament 💯 A batting average of over 100 in ODIs in 2023 ✅ Sean Williams is UNSTOPPABLE! 💥#ZIMvOMA | #CWC23 pic.twitter.com/R89inyV9KT — ICC (@ICC) June 29, 2023 చదవండి: సీన్ రివర్స్ అయినట్టుందే!.. ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్ రూట్ అరుదైన ఘనత.. యాషెస్ చరిత్రలో మూడో ఆటగాడిగా -
జింబాబ్వే సంచలనం.. వన్డేల్లో అత్యధిక స్కోర్ నమోదు!
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో జింబాబ్వే సంచలనం సృష్టించింది. ఈ టోర్నీలో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో 405 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వన్డే చరిత్రలో జింబాబ్వేకు ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇంతకుముందు 2006లో కెన్యాతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో 351 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోర్ కాగా.. తాజా మ్యాచ్‌తో ఈ స్కోర్‌ను జింబాబ్వే అధిగమించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన అమెరికా తొలుత జింబాబ్వేకు బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 408 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్ సీన్ విలియమ్స్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 101 బంతుల్లోనే 174 పరుగులు చేసిన విలియమ్స్.. తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అతడి ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన జింబాబ్వే కెప్టెన్‌గా విలియమ్స్ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో విలియమ్స్‌తో పాటు గుంబే(78), బర్ల్(16 బంతుల్లో 47) పరుగులతో రాణించారు. యూఎస్ఏ బౌలర్లలో అభిషేక్ మూడు వికెట్లు, జష్దీప్ సింగ్ రెండు వికెట్లు సాధించారు. చదవండి: Yashasvi Jaiswal: ఆ చేదు జ్ఞాపకాలు చెరిపేయలేను.. ఆ విషయం గురించి చెప్పడానికి సిగ్గుపడను! -
హరారే స్పోర్ట్స్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. ఐసీసీ కీలక ప్రకటన
జింబాబ్వే వేదికగా ప్రస్తుతం ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ 2023 మ్యాచ్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లను రెండు వేదికల్లో నిర్వహిస్తున్నారు. ఒకటి హరారే స్పోర్ట్స్‌క్లబ్ కాగా.. రెండోది బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్క్లబ్లు ఉన్నాయి. కాగా మంగళవారం హరారే స్పోర్ట్స్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం కలకలం రేపింది. జింబాబ్వే, నెదర్లాండ్స్ మ్యాచ్ ముగిసిన ఆరు గంటల తర్వాత మైదానంలోని సౌత్‌వెస్ట్ గ్రాండ్స్టాండ్లో అగ్రిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగిన సమయంలో కాజిల్ కార్నర్లో కప్పబడిన పైకప్పును కలిగి ఉంది. దీంతో పైకప్పు భాగంలో ఉన్న చెట్లకు మంటలు వ్యాపించాయి. అయితే వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సెక్యూరిటీ మంటలను ఆర్పివేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా హారారే స్పోర్ట్స్‌క్లబ్‌లో వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. దీంతో ఐసీసీ సెక్యూరిటీ టీమ్, జింబాబ్వే క్రికెట్ బోర్డు మైదానంలో ప్రత్యేక ఇన్స్పెక్షన్ నిర్వహించాయి. కేవలం ఒకవైపున్న స్టాండ్స్‌కు మాత్రమే మంటలు అంటుకోవడంతో పెద్ద నష్టం వాటిల్లలేదని.. దీంతో ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపారు. ఇక హరారే స్పోర్ట్స్‌క్లబ్‌లో ఇంకా నాలుగు సూపర్ సిక్స్ గేమ్‌లతో పాటు మూడు గ్రూప్ మ్యాచ్‌లు మిగిలిఉన్నాయి. జూలై 9న క్వాలిఫయర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్లో తలపడే రెండు జట్లు అక్టోబర్-నవంబర్ నెల్లలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనున్నాయి. చదవండి: స్కాట్లాండ్ ప్లేయర్ విధ్వంసం; ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం -
జింబాబ్వే తరపున ఫాస్టెస్ట్ సెంచరీ.. రెండు రోజుల్లోనే చెరిపేసి
జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో జింబాబ్వే తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సికందర్ రజా 54 బంతుల్లో ఆరు ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు నాటౌట్ సుడిగాలి శతకంతో మెరిశాడు. కేవలం 54 బంతుల్లోనే భారీ శతకం బాదిన సికందర్ రాజా జింబాబ్వే తరపున వన్డే క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇంతకు ముందు ఈ రికార్డు సీన్ విలియమ్స్ పేరిట ఉండేది. జూన్ 18న నేపాల్‌పై విలియమ్స్ కేవలం 70 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఈ రికార్డును సికందర్ రాజా కేవలం రెండు రోజుల్లోనే చెరిపేసి కొత్త చరిత్ర సృష్టించాడు. కాగా 37 ఏళ్ల వయసులో శతకం బాదిన సికందర్ రజా.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన పెద్ద వయస్కుడిగా క్రెయిగ్ ఎర్విన్‌తో కలిసి సంయుక్తంగా నిలిచాడు. ఇక వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. డివిలియర్స్ కేవలం 31 బంతుల్లోనే శతకం మార్క్ అందుకోగా.. ఆ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ బ్యాటర్ కోరె అండర్సన్ (36 బంతుల్లోనే శతకం), షాహిద్ అఫ్రిది 37 బంతుల్లో, జాస్ బట్లర్ 46 బంతుల్లో, సనత్ జయసూర్య 48 బంతుల్లో అందుకున్నారు. ఇక టీమిండియా తరపున విరాట్ కోహ్లి 52 బంతుల్లో సెంచరీ సాధించాడు. చదవండి: చావుదెబ్బ కొట్టిన ఆసీస్.. రికార్డులు బద్దలైన వేళ సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఎదురులేని జింబాబ్వే -
'జట్టు గెలుపుకన్నా ఇదెక్కువ ఆనందాన్నిస్తోంది'
జింబాబ్వేలో ఐసీసీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్(ICC CWC Qualifiers 2023) మ్యాచ్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది భారత్‌లో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. జింబాబ్వేలో జరుగుతున్న టోర్నీలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మెయిన్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. కాగా ఆ రెండు స్థానాల కోసం 8 జట్ల మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. కాగా క్వాలిఫయర్ తొలి మ్యాచ్‌లో జింబాబ్వే, నేపాల్ తలపడ్డాయి. హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్ ఆటతో జింబాబ్వే అద్భుత విజయాన్ని అందుకుంది.ఇక జింబాబ్వే జట్టుకు మద్దతిస్తూ పెద్ద ఎత్తున్నఅభిమానులు తరలివచ్చారు. కాగా మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులు ఇంటికి వెళ్లే ముందు స్టేడియం మొత్తాన్ని శుభ్రం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా జింబాబ్వే అభిమానుల చర్య అందరిని ఆకట్టుకుంటుంది. ఇక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్స్ షువావ్ బర్టెల్, ఆసిఫ్ షేక్ మెుదటి వికెట్ కు 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు, కుశాల్ 95 బంతుల్లో 99 పరుగులు చేసి.. సెంచరీకి 1 పరుగు దూరంలో వెనుదిరిగాడు. ఆసిఫ్ 66 పరుగులు చేశాడు. జింబాబ్వే తరఫున నగరవా 4 వికెట్లు తీశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 44.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసి గెలిచింది. జొలార్డ్ గుంబి(25), వెస్లీ మాధేవేర్(32) త్వరగానే ఔట్ అయ్యారు. అనంతరం కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్ అద్భుతంగా ఆడి జట్టుకు గెలుపుని అందించారు. క్రెయిగ్ ఎర్విన్ 128 బంతుల్లో 121 పరుగులు చేయగా.. విలియమ్స్ 70 బంతుల్లో 102 పరుగులతో సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. Shout out and respect to @ZimCricketv fans for remaining behind and clearing the litter.@AdamTheofilatos @GodwillMamhiyo @bayhaus @CastleCornerZW pic.twitter.com/pquPDTznRY — Gildredge (@gillmbaku_zw) June 18, 2023 చదవండి: #MSKPrasad: 'ఐపీఎల్ వల్ల బీసీసీఐకే నష్టం' -
వన్డే ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన జింబాబ్వే.. యువ వికెట్ కీపర్ ఎంట్రీ
వన్డే ప్రపంచకప్-2023 క్వాలిఫైయర్స్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టుకు జింబాబ్వే క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు క్రెయిగ్ ఎర్విన్ సారధ్యం వహించనున్నాడు. ఈ జట్టులో యువ వికెట్ కీపర్ బ్యాటర్ జాయ్‌లార్డ్ గుంబీకి చోటు దక్కింది. ఇది మినహా సెలక్టర్లు తమ జట్టులో పెద్దగా మార్పులు చేయలేదు. జట్టులో రజా, సీన్ విలియమ్స్, ముజాబ్రానీ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. కాగా ఈ క్వాలిఫియర్ రౌండ్ మ్యాచ్‌లకు జింబాబ్వేనే అతిధ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌లు జూన్ 18 నుంచి జరగనున్నాయి. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొనున్నాయి. వీటిలో రెండు జట్లు భారత వేదికగా జరగనున్న ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ఇక జింబాబ్వే తమ మొదటి మ్యాచ్‌లో జూన్ 18న హారారే వేదికగా నెపాల్తో తలపడనుంది. కాగా ఈ క్వాలిఫియర్స్ రౌండ్లో శ్రీలంక, వెస్టిండీస్ వంటి మేటి జట్లు కూడా పాల్గొంటున్నాయి. జింబాబ్వే జట్టు: ర్యాన్ బర్ల్, టెండై చటారా, క్రెయిగ్ ఎర్విన్, బ్రాడ్లీ ఎవాన్స్, జాయ్‌లార్డ్ గుంబీ, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, క్లైవ్ మదాండే, వెస్లీ మాధేవెరే, తాడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ, రిచర్డ్ నగరవ, సికందర్ రజా, సీన్ విలియమ్స్. చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా అయితే.. విజేత ఎవరంటే? -
జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ పరిస్థితి విషమం
జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ మాజీ క్రీడల మంత్రి డేవిడ్ కోల్టార్ట్ సైతం ట్విట్టర్లో షేర్ చేశారు. స్ట్రీక్ కోలుకుని, తిరిగి మామూలు మనిషి అయ్యేందుకు ప్రార్థించాలని ఆయన తన దేశ ప్రజలకు, దేశం వెలుపల ఉన్న ప్రార్ధన యోధులకు పిలుపునిచ్చారు. జింబాబ్వేకు పాత్రినిధ్యం వహించిన గొప్ప క్రికెటర్లలో ఒకరైన హీత్ స్ట్రీక్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, అతనికి మనందరి ప్రార్ధనలు చాలా అవసరమని డేవిడ్ కోల్టార్ట్ తన ట్వీట్లో పేర్కొన్నారు. స్ట్రీక్ కోసం, అతని కుటుంబం కోసం ప్రార్ధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం స్ట్రీక్ సౌతాఫ్రికాలో ఉన్నట్లు సమాచారం. కాగా, జింబాబ్వే ఆల్‌టైమ్ గ్రేట్ ఆల్రౌండర్లలో ఒకరైన స్ట్రీక్ 1993లో ఆ దేశం తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించి 65 టెస్ట్‌లు (216 వికెట్లు, సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు), 189 వన్డేలు (239 వికెట్లు, 13 హాఫ్ సెంచరీలు) ఆడాడు. అతను తన చివరి మ్యాచ్‌ను 2005లో ఆడాడు. స్ట్రీక్ 21 టెస్ట్‌ల్లో, 68 వన్డేల్లో జింబాబ్వే కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 2021లో స్ట్రీక్ అవినీతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొని, ఎనిమిదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధానికి గురయ్యాడు. చదవండి: టీమిండియా హెడ్ కోచ్‌గా ముజుందార్! -
'రెండు' దేశాల క్రికెటర్ రిటైర్మెంట్.. బ్రాడ్‌మన్‌తో పోల్చిన వైనం
జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా రెండు దేశాల తరపున ప్రాతినిధ్యం వహించిన అతి కొద్ది మంది క్రికెటర్లలో గ్యారీ బ్యాలెన్స్ ఒకడు. గ్యారీ బ్యాలెన్స్ మొదట ఇంగ్లండ్ జట్టుకు ఆడాడు. 2014 నుంచి 2017 వరకు ఇంగ్లండ్ తరపున 23 టెస్టులాడిన బ్యాలెన్స్.. ఆ తర్వాత జాతి వివక్షకు గురయ్యానంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) అతన్ని సస్పెండ్ చేసింది. దీంతో బ్యాలెన్స్ ఇంగ్లండ్ క్రికెట్‌ను వదిలి తాను పుట్టిన జింబాబ్వేకు వచ్చేశాడు. 2022లో జింబాబ్వే తరపున తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఓవరాల్‌గా గ్యారీ బ్యాలెన్స్ తన కెరీర్లో 24 టెస్టులాడి 1653 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు, ఏడు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక 21 వన్డేల్లో 454 పరుగులు చేసిన బ్యాలెన్స్ ఖాతాలో మూడు వన్డే అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్టు క్రికెట్లో పెను సంచలనం.. ఘనమైన ఆరంభం గ్యారీ బ్యాలెన్స్ అంతర్జాతీయ అరంగేట్రం అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఇంగ్లండ్ తరపున 2014లో తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. తొలి 10 టెస్టులు కలిపి 67.93 సగటుతో 1017 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్లో ఒక రకంగా ఇది రికార్డు అని చెప్పొచ్చు. దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాత తొలి పది టెస్టుల్లో 60కి పైగా సగటుతో వెయ్యి పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా గ్యారీ బ్యాలెన్స్ చరిత్రకెక్కాడు. నిజంగా ఏ క్రికెటర్‌కు అయినా ఇది మంచి ఆరంభం అని చెప్పొచ్చు. కానీ బ్యాలెన్స్ ఇదే ప్రదర్శనను తర్వాత కంటిన్యూ చేయలేకపోయాడు. తర్వాతి 13 టెస్టుల్లో రెండు అర్థసెంచరీలు మాత్రమే నమోదు చేసిన బ్యాలెన్స్ 19.04 సగటుతో కేవలం 481 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ క్రికెట్ నుంచి సస్పెండ్.. జింబాబ్వే తరపున అరంగేట్రం కెరీర్లో పీక్ దశలో ఉన్న సమయంలోనే గ్యారీ బ్యాలెన్స్ జాతి వివక్షపై చేసిన వ్యాఖ్యలు అతన్ని సస్పెండ్ అయ్యేలా చేశాయి. కౌంటీల్లో యార్క్‌షైర్ తరపున ఆడుతున్న బ్యాలెన్స్ .. తోటి క్రికెటర్ అజామ్ రఫీక్ ఎదుర్కొన్న వివక్షను మీడియా ముందు బయటపెట్టాడు. యార్క్‌షైర్‌లో జాతి వివక్ష మాట నిజమేనని.. ఇదంతా చూస్తూ కూడా ఈసీబీ ఏం పట్టనట్లుగా ఉందని.. పైగా తాను కూడా ఒక సందర్భంలో జాతి వివక్షకు గురయ్యానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈసీబీ బ్యాలెన్స్‌ను ఇంగ్లండ్ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత గ్యారీ బ్యాలెన్స్ తాను పుట్టిన జింబాబ్వేకు వెళ్లిపోయాడు. జింబాబ్వే క్రికెట్‌తో రెండేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్న గ్యారీ బ్యాలెన్స్ 2022 డిసెంబర్లో తిరిగి జింబాబ్వే తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే నాలుగు నెలల్లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. చదవండి: BCCI: 'భారత క్రికెట్ జట్లను చైనాకు పంపించలేం' -
చరిత్ర సృష్టించిన జింబాబ్వే క్రికెటర్.. అత్యంత అరుదైన ఘనత సొంతం
జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బాలెన్స్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. రెండు దేశాల (ఇంగ్లండ్, జింబాబ్వే) తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన 16వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. బ్యాలెన్స్ తొలుత పరాయి దేశం (ఇంగ్లండ్) తరఫున ఆడి, ఆతర్వాత సొంత దేశానికి ఆడటం. చరిత్రలో ఇలా ఓ క్రికెటర్ తొలుత ఇతర దేశానికి, ఆతర్వాత సొంత దేశానికి ఆడటం ఇదే మొదటిసారి. రెండు దేశాల తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన 15 మంది క్రికెటర్లు తొలుత సొంత దేశం తరఫున.. ఆతర్వాత వివిధ కారణాల చేత ఇతర దేశాల తరఫున ఆడారు. బ్యాలెన్స్ పుట్టి, పెరిగి, విద్యనభ్యసించింది జింబాబ్వేలోనే. అయితే బ్యాలెన్స్ 2006లో తన తాతముత్తాతల దేశమైన బ్రిటన్‌కు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్న బ్యాలెన్స్.. ఆ క్రమంలో కౌంటీల్లో సత్తా చాటి 2013లో ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అప్పటి నుంచి నాలుగేళ్లపాటు (2017 వరకు) ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్యాలెన్స్.. ఆతర్వాత ఫామ్ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఆతర్వాత యువ ఆటగాళ్లు జట్టులో స్థానాలను సుస్థిరం చేసుకోవడంతో బ్యాలెన్స్‌కు అవకాశాలు రాలేదు. దీంతో అతను తిరిగి సొంతగూటికి (జింబాబ్వే) చేరాడు. వెస్టిండీస్‌తో నిన్న (ఫిబ్రవరి 4) మొదలైన టెస్ట్ మ్యాచ్ ద్వారా బ్యాలెన్స్ జింబాబ్వే తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. 33 ఏళ్ల బ్యాలెన్స్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్ట్‌లు, 18 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో బ్యాలెన్స్‌ను మంచి రికార్డు ఉంది. బ్యాలెన్స్ 37.5 సగటున 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీల సాయంతో 1498 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం కలిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ టీమ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 112 పరుగులు చేసింది. ఓపెనర్లు టగెనరైన్ చంద్రపాల్ (55), క్రెయిగ్ బ్రాత్‌వైట్ (55) అజేయమైన అర్ధసెంచరీలతో క్రీజ్‌లో ఉన్నారు. రెండు దేశాల తరఫున టెస్టులు ఆడిన క్రికెటర్లు.. బిల్లీ మిడ్ వింటర్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) విలియమ్ లాయిడ్ ముర్డాక్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) జె జె ఫెర్రిస్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) సామీ వుడ్స్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) ఫ్రాంక్ హియర్న్ (ఇంగ్లండ్, సౌతాఫ్రికా) అల్బర్ట్ ట్రాట్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) ఫ్రాంక్ మిచెల్ (ఇంగ్లండ్, సౌతాఫ్రికా) ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడి (ఇంగ్లండ్, ఇండియా) గుల్ మహ్మద్ (ఇండియా, పాకిస్తాన్) అబ్దుల్ హఫీజ్ కర్దార్ (ఇండియా, పాకిస్తాన్) అమీర్ ఇలాహి (ఇండియా, పాకిస్తాన్) సామీ గుయిలెన్ (వెస్టిండీస్, న్యూజిలాండ్) జాన్ ట్రైకోస్ (సౌతాఫ్రికా, జింబాబ్వే) కెప్లర్ వెసల్స్ (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) బాయ్డ్ రాంకిన్ (ఇంగ్లండ్, ఐర్లాండ్) గ్యారీ బ్యాలెన్స్ (ఇంగ్లండ్, జింబాబ్వే) -
జింబాబ్వేతో టెస్టు సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! సీనియర్ పేసర్ రీ ఎంట్రీ
జింబాబ్వేతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు క్రైగ్ బ్రాత్‌వైట్ సారథ్యం వహించనున్నాడు. ఇక సీనియర్ పేసర్ షానన్ గాబ్రియేల్‌కు విండీస్ సెలక్టర్లు మళ్లీ పిలుపు ఇచ్చారు. గాబ్రియేల్ చివరగా 2021లో శ్రీలంకపై టెస్టుల్లో ఆడాడు. అదే విధంగా వెటరన్ బ్యాటర్ జోమల్ వారికన్ను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. వారికన్ కూడా 2021లో చివరగా శ్రీలంకపై టెస్టు మ్యాచ్ ఆడాడు. స్పిన్నర్ గుడాకేష్ మోటీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. ఇక రెండు టెస్టులు కూడా బులవాయో వేదికగానే జరగనున్నాయి. ఫిబ్రవరి 4 నుంచి తొలి టెస్టు జరగనుండగా.. ఫిబ్రవరి 12 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. జింబాబ్వేతో టెస్టులకు విండీస్ జట్టు: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), న్క్రుమా బోన్నర్, టాగ్నరైన్ చందర్‌పాల్, రోస్టన్ చేజ్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, రేమోన్ థామస్ రీఫర్, రేమోన్ రోయిఫర్, , జోమెల్ వారికన్ చదవండి: India vs New Zealand: హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. అన్నింటా భారత్‌దే పైచేయి -
జింబాబ్వే క్రికెట్లో తీవ్ర విషాదం.. దంపతుల హఠాన్మరణం
Sinikiwe Mpofu: జింబాబ్వే మహిళా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ సినికివె ఎంపోఫు హఠాన్మరణం చెందింది. 37 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. తన నివాసంలో శనివారం కుప్పకూలిన సినికివె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. జింబాబ్వే ఫీల్డింగ్ కోచ్ కూడా మృతి సినికివె భర్త, జింబాబ్వే క్రికెట్ పురుషుల జట్టు ఫీల్డింగ్ కోచ్ షెఫర్డ్ మకునురా మరణించిన రోజుల వ్యవధిలోనే ఆమె కూడా శాశ్వతంగా ఈ లోకాన్ని వీడటం విషాదకరం. షెఫర్డ్ డిసెంబరు 15న చనిపోయాడు. కాగా ఇద్దరు కీలక వ్యక్తులు ఇలా అకస్మాత్తుగా దూరం కావడంతో జింబాబ్వే క్రికెట్ శోకసంద్రంలో మునిగిపోయింది. PC: Zimbabwe Cricket కఠిన శ్రమకోర్చి కెరీర్లో మంచి స్థాయికి చేరుకున్న ఈ సినికివెను చావు తమ నుంచి దూరం చేసిందంటూ జింబాబ్వే మేనేజింగ్ డైరెక్టర్ గివ్మోర్ మకోని విచారం వ్యక్తం చేశారు. జింబాబ్వే మహిళా క్రికెట్లో ఆదర్శనీయమైన వ్యక్తిగా ఎంతో మంది ఆదరాభిమానాలు చూరగొన్న ఆమె ఇలా అర్ధంతరంగా వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని సంతాపం వ్యక్తం చేశారు. PC: Zimbabwe Cricket రోజుల వ్యవధిలో దంపతులు హఠాన్మరణం సినికివె, షెఫర్డ్ దంపతుల హఠాన్మరణం వారి కుటుంబాలతో పాటు తమకు కూడా తీరని లోటు అని భావోద్వేగానికి లోనయ్యారు. వీరి పిల్లలు, తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జాతీయ జట్టులో కీలకమైన ఇద్దరు సభ్యులను కోల్పోయామని.. ఇంతటి విషాదం మరెక్కడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సినికివె 2006లో జింబాబ్వే తరఫున క్రికెట్ ఆడిన తొలి మహిళా జట్టులో సభ్యురాలు. ప్లేయర్‌గా కెరీర్ ముగిసిన తర్వాత ఆమె కోచింగ్ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. మహిళా జట్టు అసిస్టెంట్ కోచ్ స్థాయికి ఎదిగింది. మౌంటనీర్స్ వుమెన్‌ను ఫిఫ్టీ50 చాలెంజ్‌లో విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించింది. చదవండి: Suryakumar Yadav: సూర్య కెరీర్‌పై గంభీర్ ట్వీట్! నీకు అతడు మాత్రమే కనిపిస్తున్నాడా? ఫ్యాన్స్ ఫైర్ Suryakumar Yadav: సూర్య ఇండియన్ కాబట్టి సరిపోయింది.. అదే పాకిస్తాన్లో ఉంటేనా: పాక్ మాజీ కెప్టెన్ -
ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. జింబాబ్వే తరపున ఆడేందుకు!
ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ గ్యారీ బ్యాలెన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్ దేశీవాళీ క్రికెట్లో యార్క్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాలెన్స్.. ఇప్పుడు తన సొంత దేశం జింబాబ్వే తరపున ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్‌తో బ్యాలెన్స్ తన బంధాన్ని తెంచుకున్నాడు. కాగా బ్యాలెన్స్ అభ్యర్థనను యార్క్‌షైర్ క్రికెట్ కూడా అంగీకరించింది. ఇక యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్‌తో తెగదింపులు చేసుకున్న బ్యాలెన్స్.. జింబాబ్వేలో రెండేళ్ల పాటు దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమే అతడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక జింబాబ్వేలో జన్మించిన బ్యాలెన్స్.. తన చిన్న తనంలోనే అతడి తల్లిదండ్రలు ఇంగ్లండ్‌లో స్ధిర పడ్డారు. దీంతో ఇంగ్లీష్ జట్టు తరపున అతడు 2013లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. బ్యాలెన్స్ 23 టెస్టులు, 16 వన్డేల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. జింబాబ్వేకు ఆడటమే నా లక్ష్యం ఇక యార్క్‌షైర్ నుంచి బయటకు వచ్చిన బ్యాలెన్స్ తొలి సారి స్పందించాడు. "జింబాబ్వే క్రికెట్లో చేరేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాను. సీనియర్ కోచ్‌లు, ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కలిసే ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. దేశవాళీ క్రికెట్లో రాణించి జింబాబ్వే జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే నా లక్ష్యమని" బ్యాలెన్స్ పేర్కొన్నాడు. చదవండి: ENG vs PAK: పాకిస్తాన్ క్రికెట్లో మరో యువ సంచలనం.. అరంగేట్ర మ్యాచ్‌లోనే 7 వికెట్లు.. -
లాల్ మంత్రం పని చేసింది.. జింబాబ్వేను మార్చేసింది
టి20 ప్రపంచకప్‌లో జింబాబ్వే పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చి రెండు రోజులు కావొస్తుంది. అయినా ఇంకా ఆ జట్టు గురించి.. వాళ్లు చేసిన అద్భుతం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. టైటిల్ సాధిస్తుందో లేదో తెలియదు కానీ జింబాబ్వే ఆటతీరు మునుపటిలా లేదని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. మరి ఇంతలా జింబాబ్వే ఆటలో మార్పు రావడానికి కారణమైన వ్యక్తి ఎవరో తెలుసా. టీమిండియా మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్. 2018 నుంచి 2022 వరకు లాల్ చంద్ రాజ్‌పుత్ జింబాబ్వే హెడ్‌కోచ్‌గా పని చేశాడు. ఈ నాలుగేళ్లలో జింబాబ్వే ఆటగాళ్లను సాన పట్టిన విధానం తాజాగా ప్రపంచకప్‌లో బయటపడింది. మరో విషయం ఏంటంటే 2007 అరంగేట్రం టి20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు లాల్‌చంద్ రాజ్‌పుత్ కోచ్‌గా వ్యవహరించడం విశేషం. లాల్‌చంద్ రాజ్‌పుత్ పనికి ముచ్చటపడిన బోర్డు టెక్నికల్ డైరెక్టర్‌గా నియమించుకుంది. టి20 ప్రపంచకప్‌లో జింబాబ్వే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడేవరకు రాజ్‌పుత్ జట్టుతోనే ఉన్నాడు. ఈలోగా దీపావళి పండుగ.. కొన్ని వ్యక్తిగత కారణాల రిత్యా ఇండియాకు తిరిగి వచ్చిన రాజ్‌పుత్ ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. ఈలోగా పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. జింబాబ్వే ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన లాల్‌చంద్ రాజ్‌పుత్ పీటీఐకి ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ''తేది కరెక్ట్‌గా గుర్తులేదు.. కానీ అది జూలై 2018 అని మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఆరోజే జింబాబ్వే హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాను. నేను పదవి చేపట్టిన సమయంలోనే పాకిస్తాన్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే మ్యాచ్‌కు ముందు రోజు జింబాబ్వే సీనియర్ క్రికెటర్లు అయిన సీన్ ఇర్విన్, క్రెయిగ్ విలియమ్స్, బ్రెండన్ టేలర్, సికందర్ రజాలు బోర్డుతో ఉన్న విభేదాల కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నారు. నేను ఎంత చెప్పి చూసినా నా మాట కూడా వినలేదు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సిరీస్‌లోనే ఇలా సీనియర్ ఆటగాళ్లు దూరం కావడం నాకు బాధను కలిగించింది. ఏం చేయలేని పరిస్థితి. అప్పటికే జింబాబ్వే క్రికెట్ బోర్డు ఎండీ గివ్మోర్ మాకోని సిరీస్‌ను రద్దు చేయడం కుదరదని తేల్చిచెప్పాడు. దీంతో అందుబాటులో ఉన్న జట్టుతోనే సిరీస్ ఆడి క్వీన్‌స్వీప్ అయ్యాం. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో వంద లోపే ఆలౌట్ అయ్యాం. అలా జింబాబ్వే జట్టుతో నా తొలి అనుభవమే వింతగా జరిగింది. ఈ ప్రదర్శన జింబాబ్వేను 2019 వన్డే ప్రపంచకప్‌కు దూరం చేసింది. జింబాబ్వే జట్టును మార్చాల్సిన అవసరం చాలా ఉందని అప్పుడే నిశ్చయించుకున్నా. ఈ నాలుగేళ్లలో రెండు మేజర్ టోర్నీలకు కనీసం అర్హత సాధించలేకపోయాం. ఒక ఇంజనీర్ బిల్డింగ్‌ను కట్టడానికి ఎంత కష్టపడతాడో.. ఈ నాలుగేళ్లలో ఆటగాళ్లతో సమన్వయం చేసుకుంటూ జట్టును మార్చిన తీరు నాకు సంతోషాన్ని ఇచ్చింది. 2022 టి20 ప్రపంచకప్‌లో జింబాబ్వే అర్హత సాధించడం నా కల. ఆ కలను ఇవాళ మా ఆటగాళ్లు నెరవేర్చారు. కుర్రాళ్లకు తాము రాణించగలమనే ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. ఎంగరా, రియాన్ బర్ల్, చటార, లూక్ జాంగ్వే లాంటి యువ క్రికెటర్లు జింబాబ్వే క్రికెట్ ఎదుగుదలకు కారణమవుతున్నారు.'' అని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది జింబాబ్వే పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. సిరీస్‌లు గెలవకున్నా ఆటగాళ్లు మాత్రం తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. అలా అని జింబాబ్వేను తేలికగా తీసిపారేయడానికి లేదు. రెండు దశాబ్దాల కింద ప్లవర్ సోదరులు, హిత్స్ట్రీక్, అలిస్టర్ క్యాంప్‌బెల్, నీల్ జాన్సన్, ముర్రే గుడ్విన్స్, పాల్ స్ట్రాంగ్స్, హెన్రీ ఒలాంగా లాంటి ఆటగాళ్లతో జింబాబ్వే జట్టు బలంగానే కనిపించేది. గత 15 ఏళ్లలో వీరంతా తప్పుకోవడం.. క్రమంగా జింబాబ్వే ఆటను మసకబారేలా చేసింది. బోర్డుతో విబేధాలు ఆటగాళ్లకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి. వరుసగా సిరీస్‌లు ఆడినప్పటికి అన్నింటిలోనూ ఓడిపోతూ వచ్చింది. ఒకానక దశలో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ల కంటే దారుణమైన ఆటతీరు కనబరిచింది. కానీ గతేడాది నుంచి జింబాబ్వే ఆటలో చాలా మార్పు వచ్చింది. సీనియర్లు, జూనియర్లు మంచి సయన్వయంతో కలిసి ఆడుతు జింబాబ్వే జట్టును శక్తివంతంగా తయారు చేస్తున్నారు. ఇక టి20 ప్రపంచకప్‌లో ఈసారి జింబాబ్వే టైటిల్ కొట్టకపోయినా సెమీస్‌కు చేరినా అది పెద్ద విజయం అనే చెప్పొచ్చు. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి.. జింబాబ్వే ఇలాగే ఆడి ఫైనల్ చేరి టైటిల్ విజేతగా నిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఏ జట్టును ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. 2012లో వెస్టిండీస్ కూడా ఇలాగే ఎవరు ఊహించని రీతిలో టైటిల్‌ను ఎగరేసుకుపోయి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏమో గుర్రం ఎగరావచ్చు.. చదవండి: క్రికెట్ ఆడితేనే డబ్బులు.. లేదంటే పస్తులు పాక్ మూలాలున్న క్రికెటర్ ముచ్చెమటలు పట్టించాడు -
పాక్‌పై విజయం.. జింబాబ్వే క్రికెటర్ పాత ట్వీట్స్ వైరల్
టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12లో గురువారం గ్రూఫ్-2లో పాక్‌పై జింబాబ్వే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయం జింబాబ్వేకు ఎంతో ప్రత్యేకం. 15 ఏళ్ల టి20 ప్రపంచకప్ చరిత్రలో జింబాబ్వే లీగ్ దశ ఆడడం ఇదే తొలిసారి. ఇంతకముందు చాలాసార్లు క్వాలిఫయింగ్ దశలోనే వెనుదిరిగింది. అయితే ఈసారి మాత్రం తన పట్టు వదల్లేదు. క్వాలిఫయింగ్ దశలో మూడింట రెండు విజయాలు సాధించి గ్రూఫ్ టాపర్‌గా సూపర్-12కు అర్హత సాధించింది. సౌతాఫ్రికాతో మ్యాచ్ వర్షార్పణం కావడంతో జింబాబ్వే ఖాతా తెరవలేకపోయింది. కానీ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం అద్భుతంగా పోరాడింది. చిన్నజట్టే కదా అని లైట్ తీసుకున్న పాకిస్తాన్ మెడలు వంచి ఒక్క పరుగు తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. పాక్‌పై జింబాబ్వే విజయంలో సికందర్ రజానే హీరో అని కచ్చితంగా చెప్పొచ్చు. కీలక సమయంలో తన బౌలింగ్ మాయాజాలంతో మూడు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను జింబాబ్వేవైపు తిప్పాడు. సెమీస్‌కు చేరుతుందో లేదో తెలియదు కానీ పాక్‌పై విజయంతో మాత్రం ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. జింబాబ్వే ఆటతీరు, సికందర్ రజా ప్రదర్శనపై ట్విటర్ సహా అన్ని సోషల్ మీడియా వేదికల్లో ప్రశంసల వర్షం కురిసింది. ఇక పాక్‌పై విజయం అనంతరం జింబాబ్వే ఆటగాడు రియాన్ బర్ల్ చేసిన పాత ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మే 2021లో రియాన్ బర్ల్ తన ట్విటర్ బ్లాగ్‌లో.. ''అవకాశం ఉండి మాకు షూ ఇవ్వడానికి స్పాన్సర్ దొరికితే ఇప్పుడున్న షూస్‌కు సిరీస్ అయిపోయిన ప్రతీసారి గ్లూ పెట్టాల్సిన పరిస్థితి రాదు'' అంటూ హృదయ విదారకమైన పోస్టు పెట్టాడు. అప్పట్లో రియాన్ బర్ల్ పెట్టిన ఈ పోస్టు జింబాబ్వే క్రికెట్ దయనీయ పరిస్థితిని కళ్లకు కట్టింది. Any chance we can get a sponsor so we don’t have to glue our shoes back after every series 😢 @newbalance @NewBalance_SA @NBCricket @ICAssociation pic.twitter.com/HH1hxzPC0m — Ryan Burl (@ryanburl3) May 22, 2021 ఆ తర్వాత రియాన్ బర్ల్ పోస్టుకు స్పందించిన పూమా కంపెనీ జింబాబ్వే ఆటగాళ్లకు షూస్‌ను స్పాన్సర్ చేసి తన పెద్ద మనుసును చాటుకుంది. ఈ విషయాన్ని రియాన్ బర్ల్ మరో ట్వీట్ వేదికగా థ్యాంక్స్ చెబుతూ స్పందించాడు. ''నేను పెట్టిన ట్వీట్‌కు రియాక్ట్ అయి మాకు షూ స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన పూమా కంపెనీకి కృతజ్థతలు. ఇదంతా అభిమానులు ఇచ్చిన మద్దతుతోనే.. థ్యాంక్స్ పర్ ఎవర్'' అంటూ పేర్కొన్నాడు. I am so proud to announce that I’ll be joining the @pumacricket team. This is all due to the help and support from the fans over the last 24 hours. I couldn’t be more grateful to you all. Thanks so much @PUMA — Ryan Burl (@ryanburl3) May 23, 2021 రియాన్ బర్ల్ పెట్టిన పాత పోస్టులు తాజాగా వైరల్ అయ్యాయి. గత 15 ఏళ్లలో దారుణ ఆటతీరు కనబరిచిన జింబాబ్వే ఇప్పుడు పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది. ఆ తర్వాత వన్డే సిరీస్ ఆడేందుకు వచ్చిన టీమిండియా సిరీస్ క్లీన్‌స్వీప్ చేసినప్పటికి జింబాబ్వే తమ ఆటతీరుతో ఆకట్టుకుంది. ముఖ్యంగా సికందర్ రజా సెంచరీతో చెలరేగడం అభిమానులకు బాగా గుర్తు. ఇక గతేడాది ప్రపంచకప్‌కు కనీసం క్వాలిఫై కాలేకపోయిన జింబాబ్వే ఈసారి మాత్రం క్వాలిఫై కావడమే గాక సూపర్-12కు అర్హత సాధించింది. ఇక మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాపై మూడో వన్డేలో జింబాబ్వే అద్బుత విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో రియాన్ బర్ల్ మూడు ఓవర్లలో 10 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం విశేషం. ఇక టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించడం వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. సెమీస్ చేరడం కష్టమే కావొచ్చు కానీ మున్ముందు సంచలనాలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చదవండి: ఆ బంతి తిరిగి ఉంటే రిటైర్మెంట్ ఇచ్చేవాడిని! 'మ్యాచ్‌లో చెలరేగడానికి పాంటింగ్ వీడియోనే స్పూర్తి' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
దురదృష్టం అంటే దక్షిణాఫ్రికాదే.. గ్లౌవ్‌ను తాకినందుకు ఐదు పరుగులు
టీ20 ప్రపంచకప్ 2022 సూపర్-12లో భాగంగా జరిగిన దక్షిణాఫ్రికా- జింబాబ్వే మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అయితే పలు మార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చేసుకుంది. ప్రోటీస్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ చేసిన చిన్న తప్పిదం వల్ల ప్రత్యర్ధి జట్టుకు 5 పెనాల్టీ పరుగులతో పాటు అదనంగా బంతి కూడా లభించింది. ఏం జరిగిందంటే..? వర్షం కారణంగా మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వేతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. అయితే అఖరి నోకియా వేసిన అఖరి ఓవర్ రెండో బంతిని బ్యాటర్ మిల్టన్ శుంబా థర్డ్ మ్యాన్ దిశగా ఆడాడు. అయితే థర్డ్ మ్యాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న లుంగీ ఎంగిడీ.. వికెట్ కీపర్ వైపు త్రో విసిరాడు. ఈ క్రమంలో మైదానంలో ఉంచిన క్వింటన్ డి కాక్ గ్లోవ్‌లను బంతి తాకింది. దీంతో అంపైర్లు ఐదు పెనాల్టీ పరుగులతో పాటు బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటించారు. కాగా త్వరగా బంతిని త్రో చేయాలనే ఉద్దేశ్యంతో డికాక్ తన గ్లోవ్‌ను మైదానంలో ఉంచాడు. అయితే అదనంగా వచ్చిన బంతికి శుంబా పెవిలియన్‌కు చేరాడు. ఎంసీసీ నిబంధనల ప్రకారం.. మైదానంలో బంతి వికెట్ కీపర్ హెల్మెట్‌కు గానీ, గ్లౌవ్‌లకు గానీ తాకితే అంపైర్ బ్యాటింగ్ జట్టుకు ఐదు పెనాల్టీ పరుగులను ఇస్తారు. అదే విధంగా ఆ బంతిని డెడ్‌బాల్‌గా అంపైర్లు ప్రకటిస్తారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: T20 World Cup 2022: ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శన.. వెస్టిండీస్ హెడ్ కోచ్ రాజీనామా -
జింబాబ్వే కొత్త చరిత్ర.. 15 ఏళ్లలో తొలిసారి
టి20 ప్రపంచకప్‌లో జింబాబ్వే కొత్త చరిత్ర సృష్టించింది.ఈ మెగాటోర్నీ ఆరంభమైన 15 ఏళ్లలో జింబాబ్వే తొలిసారి సూపర్-12 స్టేజ్‌లో అడుగుపెట్టింది. సూపర్-12కు చేరడం మనకు పెద్ద విషయం కాకపోవచ్చు.. కానీ జింబాబ్వేకు మాత్రం ఇది పెద్ద ఘనత అని చెప్పొచ్చు. ఎందుకంటే జింబాబ్వే సరైన క్రికెట్ ఆడి దశాబ్దంన్నర గడిచిపోయింది. ఈ దశాబ్దంన్నరలో జింబాబ్వే జట్టు ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడింది. ఎంతలా అంటే క్రికెటర్లకు కనీసం షూస్, జీతాలు చెల్లించలేని పరిస్థితి. అలాంటి స్థితి నుంచి ఇవాళ అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదిగింది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే జింబాబ్వే క్రికెట్లో పునర్వైభవం స్పష్టంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌ను ఓడించిన జింబాబ్వే.. ఆ తర్వాత టీమిండియాకు చెమటలు పట్టించింది. ముఖ్యంగా సికందర్ రజా, క్రెయిగ్ ఇర్విన్, సీన్ విలియమ్స్, రియాన్ బర్ల్ సహా కొంతమంది ఆటగాళ్లు జింబాబ్వేను పటిష్టంగా తయారు చేశారు. టి20 ప్రపంచకప్ ఆరంభమైన నాటి నుంచి జింబాబ్వే క్వాలిఫయింగ్ పోరులోనే వెనుదిరుగుతూ వస్తుంది. 2007, 2010, 2012, 201,2016 వరల్డ్‌కప్‌లు ఆడిన జింబాబ్వే గ్రూఫ్ దశకే పరిమితమైంది. ఇక 2009, 2021 ప్రపంచకప్‌లకు జింబాబ్వే కనీసం అర్హత కూడా సాధించలేదు. ఇదే జింబాబ్వే ఒకప్పుడు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లోనే వెనుదిరిగిన జింబాబ్వే ఏడాది తిరగకుండానే జరిగిన టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ పోరులో ఇవాళ ఒక్క ఓటమి కూడా లేకుండా గ్రూఫ్ టాపర్‌గా నిలిచింది. సగర్వంగా సూపర్-12లో అడుగుపెట్టింది. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ లాంటి జట్లున్న గ్రూఫ్-2లో ఉన్న జింబాబ్వేను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఇక జింబాబ్వే తొలిసారి టి20 ప్రపంచకప్‌లో సూపర్-12కు అర్హత సాధించడంపై క్రికెట్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ''కప్ గెలుస్తుందో లేదో తెలియదు కానీ మనసులు మాత్రం గెలిచేసింది.'' అంటూ కామెంట్స్ చేశారు. ఐసీసీ కూడా జింబాబ్వే సూపర్-12కు అర్హత సాధించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ వారి విన్నింగ్ మూమెంట్‌ను షేర్ చేసింది. ''తొలిసారి జింబాబ్వే సూపర్-12 స్టేజీకి అర్హత సాధించింది. ఇది వారికి చాలా గొప్ప విజయం''అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శుక్రవారం స్కాట్లాండ్తో జరిగిన క్వాలిఫయింగ్ పోరులో జింబాబ్వే ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. జట్టులో సీనియర్ ఆటగాళ్లైన కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్, సికందర్ రజాలు తమ విలువేంటో చూపిస్తూ జట్టును గెలిపించారు. వారిద్దరి మెరుపులతో 133 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే మరో 9 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) #T20WorldCup Group 1: 🏴 🇳🇿 🇦🇺 🇦🇫 🇱🇰 🇮🇪 Group 2: 🇮🇳 🇵🇰 🇿🇦 🇧🇩 🇿🇼 🇳🇱 The Super 12 is set! ✅ Who takes home the trophy? 🏆https://t.co/nwR4cn6DTE pic.twitter.com/bNvvRWGgGf — The Field (@thefield_in) October 21, 2022 All round brilliance 👌 For contributions with bat and ball in Zimbabwe's historic win in the #T20WorldCup, Sikandar Raza is the @aramco Player of the Match 🌟 pic.twitter.com/fd9DIPZ6dE — ICC (@ICC) October 21, 2022 చదవండి: భారత్-పాక్ మ్యాచ్.. వీళ్లు ఎదురుపడితే మజానే వేరు -
వరల్డ్ కప్‌కు ముందు జింబాబ్వేకు భారీ షాక్
ఈనెల (అక్టోబర్ 16) నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్‌కు ముందు క్వాలిఫయర్ జట్టు జింబాబ్వేకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు బ్యాటింగ్ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ లాన్స్ క్లూసెనర్ మెగా టోర్నీకి ముందు జట్టుతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు శుక్రవారం (అక్టోబర్ 7) ప్రకటించాడు. ఈ విషయాన్ని జింబాబ్వే క్రికెట్ బోర్డు సైతం దృవీకరించింది. క్లూసెనర్ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని క్రికెట్ జింబాబ్వే పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో క్లూసెనర్‌కు పలు దేశాల క్రికెట్ బోర్డులతో ఒప్పందాలు ఉన్న నేపథ్యంలో జింబాబ్వేకు పూర్తి స్థాయి సేవలు అందించేందుకు అందుబాటులో ఉండలేకపోతున్నాడని, అందుకే ఈ మేరకు కఠినమైన నిర్ణయం తీసుకున్నాడని క్లూసెనర్ ప్రతినిధి తెలిపాడు. కాగా, క్లూసెనర్ ఈ ఏడాది మార్చిలో జింబాబ్వే బ్యాటింగ్ కోచ్‌గా రెండోసారి బాధ్యతలు చేపట్టాడు. అంతకుముందు అతను 2016-2018 మధ్యకాలంలో కూడా జింబాబ్వే బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించాడు. క్లూసెనర్ హయాంలో జింబాబ్వే పూర్వపు స్థాయిలో విజయాలు సాధించి ఆకట్టుకుంది. జింబాబ్వే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడంలో క్లూసెనర్ కీలకపాత్ర పోషించాడు. ఫ్లవర్ సోదరులు, అలిస్టర్ క్యాంప్‌బెల్ లాంటి స్టార్ ప్లేయర్ల రిటైర్మెంట్ తర్వాత చతికిలబడిన జింబాబ్వేకు క్లూసెనర్ తన బ్యాటింగ్ మెళకువలతో పునరుజ్జీవం పోశాడు. ఇటీవలి కాలంలో సికిందర్ రాజా, క్రెయిగ్ ఐర్విన్, సీన్ విలియమ్స్ లాంటి ప్లేయర్లు రాటుదేలడమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే, జింబాబ్వే జట్టు క్వాలిఫయర్స్‌లో మరో ఏడు జట్లతో కలిసి పోటీపడనుంది. క్వాలిఫయర్స్ గ్రూప్-ఏలో శ్రీలంక, నెదర్లాండ్స్, నమీబియా, యూఏఈ జట్లు పోటీపడనుండగా.. గ్రూప్-బిలో వెస్టిండీస్, స్కాట్లాండ్, ఐర్లాండ్ జట్లతో జింబాబ్వే అమీతుమీ తేల్చుకోనుంది. క్వాలిఫయర్ దశ మ్యాచ్‌లు అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 21 వరకు జరుగనుండగా.. సూపర్-12 మ్యాచ్‌లు అక్టోబర్ 22 నుంచి ప్రారంభమవుతాయి.అక్టోబర్ 23న భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య హైఓల్టేజీ మ్యాచ్ జరుగనుంది. -
సికిందర్ రజా సరి కొత్త చరిత్ర.. తొలి జింబాబ్వే క్రికెటర్‌గా
జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డును సికిందర్ రజా దక్కించుకున్నాడు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్న తొలి జింబాబ్వే క్రికెటర్‌గా రజా నిలిచాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో రజాకు.. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మెక్‌గ్రాత్‌కు ఈ అవార్డు లభించింది. వరుసగా మూడు సెంచరీలు స్వదేశంలో బంగ్లాదేశ్, భారత్‌తో వన్డే సిరీస్‌లో రజా సెంచరీలు మోత మెగించాడు. వరుసగా మూడు అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్‌పై రెండు సెంచరీలు చేయగా..భారత్‌పై ఒక సెంచరీని నమోదు చేశాడు. అదే విధంగా బంగ్లాతో వన్డే సిరీస్‌ను జింబాబ్వే క్లీన్ స్వీప్ చేయడంలో రజా కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా బౌలింగ్‌లో రజా సత్తా చాటాడు. గత నెలలో ఓవరాల్‌గా రజా ఏడు వికెట్లు పడగొట్టాడు. రజా ఈ అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్‌ను వెనుక్కి నెట్టి ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. చదవండి: Veda Krishnamurthy: కర్ణాటక బ్యాటర్‌తో భారత మహిళా క్రికెటర్ 'ఎంగేజ్మెంట్'.. ఫొటోలు వైరల్ -
టీమిండియాపై చేయలేనిది ఆసీస్‌తో చేసి చూపించారు
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించడమే జింబాబ్వేకు గొప్ప అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించామన్న ఆనందం జింబాబ్వేకు ఎనలేని ధైర్య తెచ్చిపెట్టింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లను గెలుచుకున్న జింబాబ్వేకు పూర్వవైభవం వచ్చినట్లేనని అభిప్రాయపడ్డారు. అంతలోనే మూడు వన్డేల సిరీస్ కోసం భారత్ .. జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది. కానీ బలమైన టీమిండియా ముందు వారి ఆటలు సాగలేదు. మూడు వన్డేల్లోనూ ఓడిన జింబాబ్వే వైట్‌వాష్‌కు గురయ్యింది. అయితే మూడో వన్డేలో మాత్రం టీమిండియాకు చుక్కలు చూపించింది. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. సికిందర్ రజా వీరోచితో సెంచరీతో దాదాపు జట్టును గెలిపించినంత పని చేశాడు. అయితే చివర్లో సికందర్ ఔట్ కావడంతో జింబాబ్వే విజయానికి 13 పరుగుల దూరంలో ఆగిపోయింది. అలా టీమిండియాపై ఒక్క విజయం సాధించాలన్న కోరిక జింబాబ్వేకు నెరవేరలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడేందుకు జింబాబ్వే వారి గడ్డపై అడుగుపెట్టింది. తొలి రెండు వన్డేల్లో ఓటములు ఎదురవ్వడంతో మరో వైట్‌వాష్ తప్పదని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. మూడో వన్డేలో ఆస్ట్రేలియాను మొదట తక్కువ స్కోరుకే కట్టడి చేసిన జింబాబ్వే.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో తడబడినప్పటికి కెప్టెన్ చక్‌బవా(37 పరుగులు నాటౌట్), మరుమాని(35 పరుగులు) రాణించి జట్టును గెలిపించారు. ఒక రకంగా వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకున్నట్లయింది. కాగా ఆసీస్‌పై జింబాబ్వే విజయం సాధించడంతో... ''టీమిండియాతో చేయలేనిది.. ఆసీస్‌తో చేసి చూపించారు.'' అని కామెంట్ చేశారు. #3rdODI | Just in case you were wondering how we’re feeling after our historic victory over Australia in Townsville! 🇿🇼💪🏾#AUSvZIM | #VisitZimbabwe pic.twitter.com/qwMQIBRDsK — Zimbabwe Cricket (@ZimCricketv) September 3, 2022 చదవండి: AUS vs ZIM: ఆస్ట్రేలియా గడ్డ మీద జింబాబ్వే సరికొత్త చరిత్ర.. తొలిసారిగా Serena Wiliams: సలాం 'సెరెనా విలియమ్స్'.. నీ ఆటకు మేము గులాం -
చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా..!
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు. శనివారం జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో రియాన్ బర్ల్ వికెట్ పడగొట్టిన స్టార్క్.. తన వన్డే కెరీర్లో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను స్టార్క్ తన పేరిట లిఖించుకున్నాడు. కాగా అంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ బౌలర్ సక్లైన్ ముస్తాక్ (104 మ్యాచ్‌లు) పేరిట ఉండేది. తాజాగా స్టార్క్ కేవలం 102 మ్యాచ్‌ల్లోనే 200 వికెట్లు పడగొట్టి ముస్తాక్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో టాప్‌లో స్టార్క్ ఉండగా.. రెండు మూడు స్ధానాల్లో వరుసగా సక్లైన్ ముస్తాక్ (104 మ్యాచ్‌లు), ఆసీస్ దిగ్గజం బ్రెట్‌లీ(112 మ్యాచ్‌లు) ఉన్నారు. అదే విధంగా వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన పేసర్‌గా కూడా స్టార్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. చదవండి: Aus Vs Zim 3rd ODI: సొంతగడ్డపై ఆస్ట్రేలియాను మట్టికరిపించిన జింబాబ్వే.. సంచలన విజయం -
Aus Vs Zim: సొంతగడ్డ మీద ఆస్ట్రేలియాకు భారీ షాక్.. జింబాబ్వే సంచలన విజయం
Zimbabwe Tour of Australia, 2022- 3rd ODI: ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. మూడు వికెట్ల తేడాతో ఆతిథ్య కంగారూలను ఓడించి భారీ షాక్ ఇచ్చింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించి క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. కాగా ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో భాగంగా మూడు వన్డేలు ఆడేందుకు జింబాబ్వే.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. మొదటి రెండు మ్యాచ్‌లలో అలవోకగానే! మొదటి రెండు మ్యాచ్‌లలో ఆరోన్ ఫించ్ బృందం పర్యాటక జింబాబ్వే మీద వరుసగా 5, 8 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయాలు సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో వన్డేలోనూ నెగ్గి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావించింది. అయితే, అనూహ్య రీతిలో రెగిస్ చకబ్వా బృందం ఆసీస్‌కు షాకిచ్చింది. బర్ల్ దెబ్బకు కుప్పకూలిన ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ టౌన్స్‌విల్లే వేదికగా శనివారం జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రియాన్ బర్ల్ 5 వికెట్లతో చెలరేగిన నేపథ్యంలో 31 ఓవర్లలోనే కంగారూల ఆట ముగిసింది. 141 పరుగులకే ఆలౌట్ అయింది. ఇందులో 94 పరుగులు ఓపెనర్ డేవిడ్ వార్నర్ చేసినవే! #3rdODI | @ryanburl3 after his five-wicket haul 👇 pic.twitter.com/mHc6DSBv0X — Zimbabwe Cricket (@ZimCricketv) September 3, 2022 రాణించిన మారుమని.. చకబ్వా కెప్టెన్ ఇన్నింగ్స్ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వేకు ఓపెనర్ తాడివానాషే మారుమని 35 పరుగులతో శుభారంభం అందించాడు. ఇక వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఆరో స్థానంలో బరిలోకి దిగిన కెప్టెన్ రెగిస్ చకబ్వా 37 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. రియాన్ బర్ల్ సైతం ఆఖర్లో విలువైన ఇన్నింగ్స్ ఆడి (11 పరుగులు) కెప్టెన్‌కు సహకారం అందించాడు. ఈ క్రమంలో 39 ఓవర్లలో 7 వికెట్ల నస్టానికి 142 పరుగులు చేసిన జింబాబ్వే.. ఆతిథ్య ఆసీస్ మీద అద్బుత విజయం సాధించింది. రియాన్ బర్ల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: Asia Cup 2022: మరోసారి తలపడనున్న భారత్-పాక్.. సూపర్-4 షెడ్యూల్ ఇదే Asia cup 2022: భారత్ రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే రెండో జట్టుగా! -
ఆస్ట్రేలియాకు షాకిచ్చిన జింబాబ్వే.. 141 పరుగులకే కంగారులు ఆలౌట్!
టౌన్స్‌విల్లీ వేదికగా మూడో వన్డేలో ఆస్ట్రేలియాకు జింబాబ్వే భారీ షాక్ ఇచ్చింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను 141 పరుగులకే జింబాబ్వే కుప్పకూల్చింది. జింబాబ్వే బౌలర్లలో స్పిన్నర్ ర్యాన్ బర్ల్ 5 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. అతడితోపాటు ఎవాన్స్ రెండు, విలియమ్స్, న్యాచీ, నగర్వా తలా వికెట్ సాధించారు. ఇక ఆసీస్ సాధించిన 141 పరుగులలో డేవిడ్ వార్నర్ ఒక్కడే 94 పరుగులు చేయగా.. మిగితా బ్యాటర్లు మొత్తం కలిసి కేవలం 47 పరుగులు మాత్రమే చేశారు. ఇక ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తేడాతో ఆసీస్ కైవసం చేసుకుంది. కాగా 18 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఆడుతోన్న జింబాబ్వే కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలని భావిస్తోంది. 141 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 13 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. చదవండి: Asia Cup 2022: ఇదేం బౌలింగ్ రా బాబు.. అప్పుడు సూర్య! ఇప్పుడు కుష్దిల్.. -
వన్డే క్రికెట్లో చరిత్ర.. వారి ఆటతీరు మారిందనడానికి ఇదే సాక్ష్యం
జింబాబ్వే వన్డే క్రికెట్లో చాన్నాళ్ల తర్వాత కొత్త రికార్డు నెలకొల్పింది. బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై జరిగిన టి20, వన్డే సిరీస్‌ల్లో విజయం సాధించడమే గాక పూర్వవైభవం దిశగా అడుగులను మరింత సుస్థిరం చేసుకుంది. టి20 ప్రపంచకప్ 2022కు క్వాలిఫై అయ్యామన్న సంతోషం జింబాబ్వేను పూర్తిగా మార్చేసింది. స్వదేశంలో సిరీస్ ఆడుతున్నప్పటికి ఇంతకముందెన్నడూ చూడని జింబాబ్వేను చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. తొలి రెండు వన్డేలో జింబాబ్వే ప్రదర్శన అందుకు అతీతంగా అనిపించింది. ఇక బుధవారం జరిగిన చివరి వన్డేలో జింబాబ్వే బంగ్లాదేశ్ చేతిలో ఓడినప్పటికి.. వారి పోరాటపటిమ అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా జింబాబ్వే టెయిలెండర్లు రిచర్డ్ నగరావ, విక్టర్ న్యౌచిబ్లు పదో వికెట్‌కు రికార్డుస్థాయి భాగస్వామంతో మెరిశారు. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఒక దశలో 83 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో కనీసం వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే టెయిలెండర్లు రిచర్డ్ నగరావ(34 నాటౌట్), విక్టర్ న్యౌచిబ్(26 పరుగుల) పదో వికెట్‌కు 68 పరుగులు జోడించి జింబాబ్వే పరువును కాపాడారు. కాగా పదో వికెట్‌కు వీరిద్దరు నమోదు చేసిన భాగస్వామ్యం వన్డే క్రికెట్ చరిత్రలో పదో స్థానం దక్కించుకుంది. తొలి స్థానంలో విండీస్ దిగ్గజాలు రిచర్డ్స్, మైకెల్ హోల్డింగ్ 106* పరుగుల భాగస్వామ్యంతో తొలి స్థానంలో ఉంది. మహ్మద్ అమిర్, సయీద్ అజ్మల్ 103 పరుగులతో రెండో స్థానంలో ఉంది. రాంపాల్, కీమర్ రోచ్ 99 పరుగులతో మూడో స్థానంలో ఉంది. చదవండి: ZIM Vs BAN: బంగ్లాదేశ్‌కు ఓదార్పు విజయం.. సిరీస్ జింబాబ్వే సొంతం #3rdODI | DRINKS! After 31 overs, 🇿🇼 are 144/9 Highest 10th wicket partnership for 🇿🇼 in ODIs (Ngarava 29*, Nyauchi 24*), need 113 runs from 19 overs#ZIMvBAN | #WaltonODISeries | #VisitZimbabwe pic.twitter.com/aPER0mUyzA — Zimbabwe Cricket (@ZimCricketv) August 10, 2022 -
బంగ్లాదేశ్‌కు ఓదార్పు విజయం.. సిరీస్ జింబాబ్వే సొంతం
జింబాబ్వే పర్యటనలో బంగ్లాదేశ్ రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో జింబాబ్వేపై 105 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌కు ఓదార్పు విజయం దక్కింది. ఎందుకంటే ఇప్పటికే జింబాబ్వే మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. కాగా అంతకముందు జరిగిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను కూడా జింబాబ్వే 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అఫిప్ హొసేన్ 85 నాటౌట్ టాప్ స్కోరర్ కాగా.. అనాముల్ హక్ 76, మహ్మదుల్లా 39 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవన్స్ 2, ఎల్ జాంగ్వే 2, సికిందర్ రజా, నగరవా చెరొక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 32.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 83 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే కనీసం వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే టెయిలెండర్లు రిచర్డ్ నగరావ(34 నాటౌట్), విక్టర్ న్యౌచిబ్(26 పరుగుల) పదో వికెట్‌కు 68 పరుగులు రికార్డు భాగస్వామ్యంతో మెరిసి జింబాబ్వే పరువును కాపాడారు. కాగా పదో వికెట్‌కు వీరిద్దరు నమోదు చేసిన భాగస్వామ్యం వన్డే క్రికెట్ చరిత్రలో పదో స్థానం దక్కించుకుంది. సిరీస్‌లో రెండు సెంచరీలతో చెలరేగిన కెప్టెన్ సికిందర్ రజా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. చదవండి: Shikar Dhawan: 'ఆపండి రా నాయనా'.. మీ అతి ప్రేమతో చంపేటట్లున్నారు! Ishan Kishan: ఎంపిక చేయలేదన్న కోపమా?.. పాట రూపంలో నిరసన -
బంగ్లాదేశ్‌కు మరోసారి ఊహించని షాక్.. వన్డే సిరీస్ జింబాబ్వే సొంతం!
జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను కోల్పోయిన బంగ్లాదేశ్.. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా కాపాడకోలేకపోయింది. హరారే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో జింబాబ్వే కైవసం చేసుకుంది. జింబాబ్వే విజయంలో ఆ జట్టు ఆల్‌రౌండర్ సికందర్ రజా, కెప్టెన్ చక్‌బావ సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో మహ్మదుల్లా (80), కెప్టెన్ తమీమ్(50), అఫీఫ్ హుస్సేన్(41) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో రజా మూడు వికెట్లు, మాధేవేరే రెండు, న్యాచి, చివంగా తలా వికెట్ సాధించారు. అనంతరం 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రజా, చక్‌బావ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును అదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు ఏకంగా 201 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం మ్యాచ్‌ను జింబాబ్వే వైపు మలుపు తిప్పింది. అనంతరం జింబాబ్వే కెప్టెన్ చక్‌బావ 75 బంతుల్లో 102 పరుగులు చేసి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ ఔటైనప్పటికీ రజా(127 బంతుల్లో 117పరుగులు) మాత్రం అఖరి వరకు క్రీజులో నిలిచి జింబాబ్వేకు మరుపురాని విజయాన్ని అందించాడు. రజా, చక్‌బావ అద్భుమైన ఇన్నింగ్స్‌ల ఫలితంగా జింబాబ్వే 47.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కాగా రజాకు ఈ సిరీస్‌లో ఇదే వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం. తొలి వన్డేలో కూడా జింబాబ్వే విజయంలో రజా తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇరు జట్ల మధ్య అఖరి వన్డే బుధవారం హరారే వేదికగా జరగనుంది. చదవండి: Asia Cup 2022: ఆసియా కప్‌కు భారత జట్టు.. అయ్యర్‌కు నో ఛాన్స్! హుడా వైపే మెగ్గు! -
ఆసియా కప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్!
జింబాబ్వేపై తొలి వన్డేలో ఓటమి పాలైన బంగ్లాదేశ్‌కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ లిటన్ దాస్ గాయం కారణంగా మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. హారారే వేదికగా జరిగిన తొలి వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా లిటన్ దాస్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు 81 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిటైర్ట్ హార్ట్‌గా వెనుదిరగాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాలు సమయం పట్టనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ క్రమంలో లిటన్ దాస్ ఆసియాకప్-2022కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక బంగ్లాదేశ్- జింబాబ్వే మధ్య రెండో వన్డే హారారే వేదికగా ఆదివారం(ఆగస్టు7)న జరగనుంది. లిటన్ దాస్ స్థానంలో నజ్ముల్ హుస్సేన్ శాంటో తుది జట్టలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక తొలి వన్డే విషయానికి వస్తే.. బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. జింబాబ్వే విజయంలో ఆల్ రౌండర్ సికందర్ రజా(135), ఇనోసెంట్ కాయ(110) అద్భుతమైన సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో తమీమ్ ఇక్భాల్(62), లిటన్ దాస్(81),అనముల్ హాక్(73) పరుగులతో రాణించారు. అనంతరం 304 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 5 వికెట్లు కోల్పోయి 48.2 ఓవర్లలోనే చేధించింది. చదవండి: ZIM vs BAN: పూర్వ వైభవం దిశగా అడుగులేస్తుందా..! -
పూర్వ వైభవం దిశగా అడుగులేస్తుందా..!
క్రికెట్లో జింబాబ్వే జట్టు మళ్లీ పూర్వ వైభవం సాధించే పనిలో పడిందా?.. అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. తాము ఆడుతుంది బంగ్లాదేశ్ లాంటి జట్టుతో అయినప్పటికి.. జింబాబ్వేకు ఇది గొప్ప ఫీట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జింబాబ్వే పూర్తిస్థాయి ఆటతీరు కనబరిచి దాదాపు 10 ఏళ్లకు పైనే అవుతుంది. ఒకప్పుడు ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్, తైబూ, మసకద్జా, హిత్ స్ట్రీక్, క్యాంప్‌బెల్ లాంటి ఆటగాళ్లతో జింబాబ్వే సంచలన విజయాలు నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయి. -సాక్షి, వెబ్‌డెస్క్ కానీ క్రమక్రమంగా ఆటగాళ్లు రిటైర్ అవ్వడం.. ఆదాయం లేక ఉన్న క్రికెటర్లు వేరే దేశానికి వలస వెళ్లడం.. ఆర్థిక మాంద్యం కూడా జింబాబ్వేను బాగా దెబ్బతీసింది. ఒకానొక దశలో ఆటగాళ్లు సరైన షూస్ లేకుండానే మ్యాచ్‌లు ఆడడం వారి ధీనస్థితిని కళ్లకు కట్టింది. అలాంటి జింబాబ్వే ఇప్పుడు కాస్త కొత్తగా కనిపిస్తుంది. జట్టులో ఉన్న ఆటగాళ్లు సమన్వయంతో ఆడుతూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవలే టి20 ప్రపంచకప్ 2022కు క్వాలిఫై అయ్యామన్న జోష్ జింబాబ్వేకు బూస్టప్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. జింబాబ్వే పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్‌కు షాక్‌లు మీద షాకులు ఇస్తూనే వస్తుంది. ఇప్పటికే సొంతగడ్డపై తొలి ద్వైపాక్షిక టి20 సిరీస్ నెగ్గిన ఆనందంలో ఉన్న జింబాబ్వే.. తాజాగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో మరోసారి సంచలనం చేసింది. 300 పరుగుల పైచిలుకు లక్ష్యాన్ని అవలీలగా చేధించి బంగ్లాదేశ్‌కు మరోసారి షాక్ ఇచ్చింది. 6 పరుగులకే రెండు వికెట్లు.. 62 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన జింబాబ్వేను ఇన్నోసెంట్ కాయా, సికందర్ రజాలు ఇన్నింగ్స్‌ను నడిపించిన తీరు అద్భుతమనే చెప్పొచ్చు. కాయా 122 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 110 పరుగులు.. సికందర్ రజా 109 బంతుల్లో 135 నాటౌట్, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ ఇద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. జింబాబ్వే క్రికెట్ చరిత్రలో ఈ ఇద్దరి భాగస్వామ్యం మూడో అత్యుత్తమం కావడం విశేషం. ఇంతకముందు 2014లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హామిల్టన్ మజకద్జ, సికందర్ రజాలు 224 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు. ►ఇక జింబాబ్వేకు ఇది మూడో అత్యుత్తమ చేజింగ్ కావడం విశేషం. 11 ఏళ్ల క్రితం బులవాయో వేదికగా కివీస్‌తో మ్యాచ్‌లో జింబాబ్వే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించింది. ►2022లో జింబాబ్వేకు ఇది రెండో వన్డే విజయం. ఈ ఏడాది జనవరిలో పల్లెకెలే వేదికగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే లంకకు షాక్ ఇచ్చింది. ►బంగ్లాదేశ్‌పై ఒక వన్డేలో విజయం సాధించడానికి జింబాబ్వేకు 9 ఏళ్లు పట్టింది. ఆఖరిసారి మే 2013లో బులవాయో వేదికగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే బంగ్లాపై విజయం అందుకుంది. ఈ 9 ఏళ్ల కాలంలో జింబాబ్వే బంగ్లాదేశ్ చేతిలో వరుసగా 19 వన్డేల్లో పరాజయం చవిచూసింది. ►అయితే జింబాబ్వే ఈ విజయాలు బంగ్లాదేశ్‌పై సాధించడం తీసిపారేయాల్సిన విషయం కాదు. ఎందుకంటే రోజురోజుకు జింబాబ్వే పటిష్టంగా తయారవుతోంది. పెద్ద జట్లను ఓడించలేకున్నా.. అఫ్గనిస్తాన్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ లాంటి జట్లకు షాకివ్వడం ఖాయం. Stunning knocks from Innocent Kaia and Sikandar Raza 💯 Watch all the #ZIMvBAN matches on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 📝 Scorecard: https://t.co/UMQDSxMjxu pic.twitter.com/sHg96ctOUD — ICC (@ICC) August 5, 2022 Iwiniiileeeh! What a way to finish it @SRazaB24! Well in @ZimCricketv 🇿🇼✊🏾 Big chase. pic.twitter.com/IOLRoSxEDp — Ranga.🇿🇼 (@RangaMberi) August 5, 2022 చదవండి: IND vs WI: నాలుగో టి20.. రోహిత్ శర్మ ఆడడంపై కీలక అప్డేట్ -
బంగ్లాదేశ్‌కు మరో షాకిచ్చిన జింబాబ్వే.. తొలి వన్డేలో ఘన విజయం!
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న జింబాబ్వే.. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా విజయంతో ఆరంభించింది. హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్‌పై జింబాబ్వే 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జింబాబ్వే విజయంలో ఆల్ రౌండర్ సికందర్ రజా(135), ఇనోసెంట్ కాయ(110) అద్భుతమైన సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు తమీమ్ ఇక్భాల్, లిటన్ దాస్ తొలి వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 62 పరుగులు చేసిన తమీమ్, రజా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరగా.. అనంతరం 81 పరుగులు చేసిన లిటన్ దాస్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అనముల్ హాక్(73), ముష్ఫికర్ రహీం(52) పరుగులతో రాణించడంతో బంగ్లా స్కోర్ 300 పరుగులు దాటింది. జింబాబ్వే బౌలర్లలో రజా,విక్టర్ న్యాచ్ తలా వికెట్ సాధించారు. ఇక 304 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 61 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం సికందర్ రజా,ఇనోసెంట్ కాయ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 192 పరుగుల రికార్డు బాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి విరోచిత ఇన్నింగ్స్‌ల ఫలితంగా జింబాబ్వే 48.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఇక బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన రజాకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: IND vs WI: మియామి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న భారత ఆటగాళ్లు.. ఫోటోలు వైరల్ -
జింబాబ్వేతో మూడో టీ20.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్!
ఆదివారం హరారే వేదికగా జరిగిన రెండో టీ20లో జింబాబ్వేపై బంగ్లాదేశ్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే గెలుపు జోష్‌లో ఉన్న బంగ్లాదేశ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టాండింగ్ కెప్టెన్ నూరుల్ హసన్ గాయం కారణంగా జింబాబ్వే పర్యటన మొత్తానికి దూరం కానున్నాడు. కాగా రెండో టీ20లో వికెట్ కీపింగ్ చేస్తున్నసమయంలో నూరుల్ హసన్ చేచేతి వేలికి గాయమైంది. అతడు గాయం నుంచి కోలుకోవడానికి రెండు వారాల సమయం పట్టనున్నట్లు బంగ్లా వైద్య బృందం వెల్లడించింది. "నూరుల్ చేతికి గాయమైన తర్వాత మేము ఎక్స్‌రే తీశాము. అతడి చూపుడు వేలుకు గాయమైంది. అతడు ఈ గాయం నుంచి కోలుకోవడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది" అని బంగ్లా జట్టు ఫిజియో ముజాద్డ్ ఆల్ఫా సానీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అఖరి టీ20కు, వన్డే సిరీస్‌కు నూరుల్ హసన్ దూరం కానున్నాడు. కాగా గాయపడిన హసన్ స్థానంలో లిటాన్ దాస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక మూడు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. నిర్ణయాత్మక మూడో టీ20 హరారే వేదికగా మంగళ వారం (ఆగస్టు2)న జరగనుంది. అనంతరం మూడో వన్డేల సిరీస్‌లో జింబాబ్వేతో బంగ్లాదేశ్ తలపడనుంది. చదవండి: Deandra Dottin: అంతర్గత విభేదాలు.. వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ సంచలన నిర్ణయం! -
టీ20 ప్రపంచకప్‌కు అర్హత.. బిజీ బిజీ షెడ్యూల్‌తో జింబాబ్వే..!
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జింబాబ్వే.. రాబోయే రెండు నెలల్లో బిజీ బిజీ షెడ్యూల్‌తో గడపనుంది. కాగా 18 ఏళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు జింబాబ్వే వెళ్లనుంది. అయితే ఈ పర్యటనకు ముందు వెళ్లే ముందు జింబాబ్వే.. స్వదేశంలో బంగ్లాదేశ్, భారత్‌లతో వరుస సిరీస్‌లలో తలపడనుంది. తొలుత బంగ్లాదేశ్‌తో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో జింబాబ్వే తలపడనుంది. జూలై 30న హరారే వేదికగా జరగనున్న తొలి టీ20తో బంగ్లా టూర్ ప్రారంభం కానుంది. అనంతరం 2016 తర్వాత తొలి సారి జింబాబ్వే పర్యటనకు భారత్ రానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్ ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా జరగనుంది. హరారే వేదికగా ఆగస్ట్ 18న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత జింబాబ్వే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు జింబాబ్వే ఆడనుంది. చదవండి: Ind Vs WI ODI Series: వాళ్లంతా లేరు కాబట్టి మా పని ఈజీ.. మేమేంటో చూపిస్తాం: విండీస్ కెప్టెన్ -
జింబాబ్వే, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన ఆసీస్..!
స్వదేశంలో జింబాబ్వే, న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే ఈ సిరీస్‌లకు ఆ జట్టు స్టార్ పేసర్ పాట్ కమిన్స్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అదే విధంగా సీనియర్ స్పిన్నర్ ఆడమ్ జంపా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక శ్రీలంక పర్యటనలో ఆసీస్ జట్టులో భాగమైన పలువురి ఆటగాళ్లను టీమ్ మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. మిచెల్ స్వెప్సన్, జోష్ ఇంగ్లిస్, ఝే రిచర్డ్సన్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్‌లకు జట్టులో చోటు దక్కలేదు. ఇక రెండు సిరీస్‌లు నార్త్ క్వీన్స్‌లాండ్‌లో జరగనున్నాయి. ఆగస్టు 28న జింబాబ్వేతో వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 6న న్యూజిలాండ్‌తో సిరీస్ మొదలుకానుంది. జింబాబ్వే, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లకు ఆసీస్ జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, మార్నస్ లాబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్ ఆడమ్ జాంపా Rate this Aussie ODI squad out of 10 pic.twitter.com/LRJpqFL9M6 — cricket.com.au (@cricketcomau) July 18, 2022 చదవండి: IND vs WI: టీమిండియాతో సిరీస్.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విండీస్ వికెట్ కీపర్..! -
టి20 ప్రపంచకప్ కదా.. ఆ మాత్రం ఉండాల్సిందే
ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న టి20 ప్రపంచకప్‌కు జింబాబ్వే క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. జింబాబ్వేతో పాటు నెదర్లాండ్స్ కూడా అనుమతి సాధించింది. క్వాలిఫయింగ్ టోర్నీ (బి)లో ఈ రెండు జట్లు ఫైనల్ చేరాయి. బులవాయోలో జరిగిన తొలి సెమీ ఫైనల్లో జింబాబ్వే 27 పరుగుల తేడాతో పపువా న్యూ గినియాపై విజయం సాధించింది. జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేయగా, న్యూ గినియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులే చేయగలిగింది. జింబాబ్వే జట్టు.. ఒకప్పుడు క్రికెట్లో ఒక వెలుగు వెలిగిన దేశం. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి మేటిజట్లను ఓడించి సంచలనాలు నమోదు చేసింది. గత దశాబ్ద కాలం వరకు జింబాబ్వే జట్టు మోస్తరుగానే రాణించింది. కానీ కొన్నేళ్ల నుంచి మాత్రం వారి ఆటతీరు నాసిరకంగా తయారైంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. క్రికెట్లో పేద దేశంగా పేరు పొందిన జింబాబ్వేలో ఆటగాళ్లకు, బోర్డుకు అంతర్గత వ్యవహారాల్లో విబేధాలు, జాతి వివక్ష లాంటి ఎన్నో అంశాలు చుట్టుముట్టాయి. ఒకప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉన్న జింబాబ్వే ఇప్పుడు కనీసం ఆ దరిదాపున కూడా రావడం లేదు. దీనికి తోడూ బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఐర్లాండ్ లాంటి దేశాలు క్రికెట్లో బాగా రాణిస్తున్నాయి. ఇవి కూడా జింబాబ్వేకు కొంత ప్రతీకూలమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక టి20 ప్రపంచకప్ టోర్నీకి క్వాలిఫై అవడం పెద్ద ఘనత కిందే లెక్క. అందుకే జింబాబ్వే జట్టు దానిని ఒక పెద్ద పండుగలా సెలబ్రేట్ చేసుకుంది. మ్యాచ్ విజయం అనంతరం జింబాబ్వే ఆటగాళ్లు టి20 ప్రపంచకప్‌కు క్వాలిఫై అవ్వడాన్ని పెద్ద పండుగలా జరుపుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లంతా ఒక దగ్గరికి చేరి తమ బ్యాట్లను నేలకు కొడుతూ గట్టిగట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను జింబాబ్వే క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ''టి20 వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యామని తెలియగానే మా జట్టు సభ్యులు పెద్ద పండుగ చేసుకున్నారు.'' అంటూ ట్వీట్ చేసింది. ఇక జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ''టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించామంటే మాకు అది పెద్ద విషయం. ఈ సందర్భంగా నాకు మాటలు రావడం లేదు. మా కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. సెమీఫైనల్లో 200 పరుగులు కొట్టినప్పటికి దానిని నిలుపుకునేందుకు బౌలర్లు అద్భుత కృషి చేశారు. ఇక ప్రస్తుతం దృష్టంతా ఆదివారం జరగనున్న క్వాలిఫయర్ ఫైనల్ పైనే ఉంది. ఆ మ్యాచ్‌లోనూ విజయం సాధించి గ్రూఫ్-ఏలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తాం. ఆ తర్వాత అక్టోబర్‌లో జరగనున్న టి20 వరల్డ్‌కప్‌పై దృష్టి పెడుతాం'' అంటూ కామెంట్ చేశాడు. #ICYMI: The lads celebrating after clinching a place at the ICC Men’s T20 World Cup 🏏 pic.twitter.com/ZoRQe57cz3 — Zimbabwe Cricket (@ZimCricketv) July 16, 2022 చదవండి: Yasir Shah: రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు -
నజీబుల్లా మెరుపు ఇన్నింగ్స్.. జింబాబ్వేపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపు
హరారే వేదికగా జింబాబ్వేతో జరగిన తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌కు ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, గుర్భాజ్ అద్భుతమైన అరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 83పరుగులు జోడించారు. అయితే ర్యాన్ బర్ల్ వేసిన 11 ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆఫ్గాన్ కాస్త ఒత్తిడికి గురైంది. అయితే అఖరిలో నజీబుల్లా జద్రాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో విజయం ఆఫ్ఘనిస్తాన్ వశమైంది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో నజీబుల్లా జద్రాన్(44), హజ్రతుల్లా జజాయ్(45) పరుగులతో రాణించారు. ఇక జింబాబ్వే బౌలర్లలో ర్యాన్ బర్ల్ మూడు వికెట్లు, ల్యూక్ జోంగ్వే ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కల్పోయి 159 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో సికిందర్ రజా(45) మాధేవేరే(32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నిజత్ మసూద్ మూడు వికెట్లు,ఫజల్హక్ ఫరూఖీ, నబీ, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు. ఇక రెండో టీ20 ఆదివారం జరగనుంది. చదవండి: SL vs AUS: 3 ఓవర్లలో 59 పరుగులు.. శ్రీలంక సంచలన విజయం..! -
జింబాబ్వేను చిత్తు చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సిరీస్ కైవసం..!
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది. 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. 44.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆఫ్ఘాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ సెంచరీతో చెలరేగాడు. కాగా ఇది అతడికి తన కెరీర్లో తొలి సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో జద్రాన్ 141 బంతుల్లో 120 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రహమత్ షా 88 పరుగులతో రాణించాడు. ఇక జింబాబ్వే బౌలర్లలో ముజారబానీ, తిరిపానో చెరో వికెట్ సాధించారు. కాగా అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 228 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఇనోసెంట్ కియా 69 పరుగులు, రాయర్ బర్ల్ 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ మూడు,ఫజల్హక్ ఫారూఖీ,నబీ,రషీద్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించాడు. చదవండి: Umran Malik Bowling Idols: 'వకార్ యూనిస్ ఎవరో తెలియదు.. ఆ ముగ్గురు పేసర్లే నా ఆదర్శం' -
ఓ ప్రముఖ భారత వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడు..
జింబాబ్వే తరఫున అత్యధిక శతకాలు(17) బాదిన క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచిన ఆ దేశ మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్, మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించాడు. 2019లో ఓ భారత వ్యాపారవేత్త, తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడని, అందుకు అతను 15000 అమెరికన్ డాలర్లు ఆఫర్ చేశాడని ట్విటర్ వేదికగా ఆరోపణలు చేశాడు. నాటి ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా తాను ఆ వ్యక్తి నుంచి కొంత నగదు కూడా తీసుకున్నట్లు అంగీకరించాడు. To my family, friends and supporters. Here is my full statement. Thank you! pic.twitter.com/sVCckD4PMV — Brendan Taylor (@BrendanTaylor86) January 24, 2022 గతేడాది సెప్టెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టేలర్.. 2019లో ఓ ప్రముఖ భారత వ్యాపారవేత్త ఆహ్వానం మేరకు భారత్‌కు వచ్చానని, ఆ సందర్భంగా ఓ పార్టీలో కొందరు నాకు కొకైన్ ఆఫర్ చేశారని, తాను కొకైన్ సేవిస్తుండగా వీడియోలు తీసి బెదిరించడం మొదలుపెట్టారని, ఈ క్రమంలోనే మ్యాచ్ ఫిక్సింగ్ కూడా చేయమన్నారని సంచలన స్టేట్మెంట్ను విడుదల చేశాడు. ఆ వ్యాపారవేత్త జింబాబ్వేలో టీ20 లీగ్‌ను లాంచ్ చేస్తామని తనను సంప్రదించాడని, అప్పటికే తమ దేశ క్రికెట్ బోర్డు నుంచి ఆరు నెలలుగా జీతాలు లేవని, తన ఆర్ధిక అవసరాలను ఆసరాగా తీసుకుని సదరు వ్యక్తి తనను ప్రలోభ పెట్టాడని, తాను అంగీకరించకపోయే సరికి బ్లాక్ మెయిలింగ్‌కు దిగాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. గత రెండేళ్లుగా ఈ భారాన్ని మోయలేక మానసికంగా, శారీరకంగా కృంగిపోయానని, అందుకే ఈ స్టేట్మెంట్ను విడుదల చేస్తున్నాని పేర్కొన్నాడు. జింబాబ్వే తరఫున 34 టెస్ట్‌లు, 205 వన్డేలు, 45 టీ20లు ఆడిన టేలర్.. టెస్ట్‌ల్లో 6 సెంచరీలు, వన్డేల్లో 11 సెంచరీలు సహా దాదాపు పది వేల పరుగులు చేశాడు. 35 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్.. 2014 ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. కాగా, తనను ఫిక్సింగ్ చేయమన్న ఆ వ్యాపారవేత్త ఎవరనే విషయాన్ని మాత్రం టేలర్ వెల్లడించలేదు. చదవండి: ICC Awards 2021: వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఎవరంటే..! -
షూస్ కొనే స్థోమత లేదు సాయం చేయండి: క్రికెటర్ ఆవేదన
''మేము చాలా దయనీయ స్థితిలో ఉన్నాం.. సిరీస్ ముగిసిన ప్రతీసారి విరిగిపోయిన మా షూస్‌కు గ్లూ రాసుకొని వాటిని కాసేపు ఎండబెడుతున్నాం.. ఆ తర్వాతి మ్యాచ్‌లకు మళ్లీ అవే షూతో సిద్ధమవుతున్నాం. ఇలా కొన్ని నెలలు పాటు చేస్తూనే ఉన్నాం. కనీసం షూ కొనే స్థోమత కూడా లేదు... ఎవరైనా స్పాన్సర్ ఉంటే సాయం చేయండి.. అప్పుడు మా షూస్‌కు గ్లూ పెట్టే అవసరం రాదు.'' ఇది జింబాబ్వే క్రికెటర్ ర్యాన్ బర్ల్ ఆవేదన. ఈ ఒక్క అంశం చాలు జింబాబ్వే క్రికెట్ బోర్డు ఎంత దయనీయ స్థితిలో ఉందో చెప్పడానికి. అయితే ర్యాన్ బర్ల్ పోస్టుకు స్పందించిన స్పోర్ట్స్ కంపెనీ పూమా షూస్.. అతనితో ఒప్పందం చేసుకోవడమే గాక జింబాబ్వే ఆటగాళ్లకు షూస్‌ను గిఫ్ట్‌గా పంపి తన ఉదారతను చాటుకుంది. ర్యాన్ బర్ల్ కన్నీటిపర్యంతమవుతూ పెట్టిన పోస్ట్ సగటు క్రికెట్ అభిమానులను కదిలిచింది. దీన స్థితిలో ఉన్న జింబాబ్వే క్రికెటర్లకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.'' బీసీసీఐ, ఈసీబీ, క్రికెట్ ఆస్ట్రేలియా మీకు ఒక విజ్ఞప్తి.. దయచేసి జింబాబ్వేతో సిరీస్‌లు ఉంటే పోస్ట్‌పోన్ చేయకండి. ఇప్పుడు వారితో క్రికెట్ ఆడితే వచ్చే డబ్బు వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కచ్చితంగా జింబాబ్వే మంచి టీమ్.. కానీ అక్కడి కుళ్లు రాజకీయాలు క్రికెట్‌ను భ్రష్టు పట్టిస్తున్నాయి.జింబాబ్వేతో సిరీస్‌లు ఆడుతూ వారికి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది.'' ఒక అభిమాని ఆవేదన చెందాడు. ''జింబాబ్వే ఆటగాళ్ల పరిస్థితి చూసి బాధేస్తోంది. క్రికెట్లో కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యం అవసరం పడుతుందేమో. జెంటిల్మెన్ ఆటగా పిలుచుకునే క్రికెట్లో ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా చూడాలి. దయనీయ స్థితిలో ఉన్న జింబాబ్వే క్రికెటర్లను ఆదుకోవాలి'' అంటూ మరొకరు కామెంట్ చేశారు. ర్యాన్ బర్ల్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. మరి ఐసీసీతో పాటు బీసీసీఐతో పాటు ఇతర క్రికెట్ బోర్డులు బర్ల్ పోస్టుకు స్పందిస్తాయేమో చూడాలి.జింబాబ్వే తరపున 2017లో అరంగేట్రం చేసిన ర్యాన్ బర్ల్ 3 టెస్టుల్లో 24 పరుగులు, 18 వన్డేల్లో 243 పరుగులతో పాటు 7 వికెట్లు, 25 టీ20ల్లో 393 పరుగులతో పాటు 11 వికెట్లు తీశాడు. ఇక ప్రపంచ దేశాల్లో పేదరికంతో అలమటిస్తున్న దేశాల్లో జింబాబ్వే ఒకటి. నల్లజాతీయులు అనే వివక్ష వారిని మరింత వెనక్కి నెట్టేసింది. దశాబ్దాలకు పైగా వారు కనీసం ఏ క్రీడల్లో కూడా ఆడేందుకు అనుమతించలేదు. అలాంటిది కాస్త కూస్తో జింబాబ్వేకు పేరు వచ్చింది క్రికెట్ ద్వారానే అని చెప్పొచ్చు. రెండు దశాబ్దాల కిందటి వరకు జింబాబ్వే జట్టులో కాస్త పేరున్న ఆటగాళ్లు ఎక్కువగా కనిపించేవారు. హిత్ స్ట్రీక్, ఆండీ ప్లవర్, గ్రాంట్ ఫ్లవర్,హెన్రీ ఒలాంగా, తైబూ, స్టువర్ట్ క్యాంప్‌బెల్ లాంటి ఆటగాళ్లు ఉండేవారు. వీరు ఉన్నంతకాలం జింబాబ్వే ఆటతీరు కాస్త మెరుగ్గానే ఉండేది. బలహీన జట్టుగా కనిపించినా.. కాస్త పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించేది. వీళ్లంతా రిటైర్ అయ్యాకా జింబాబ్వే ఆటతీరు మరింత తీసికట్టుగా తయారైంది. బంగ్లాదేశ్, ఐర్లాండ్, అప్ఘనిస్తాన్‌ల కంటే ఎంతో ముందు అంతర్జాతీయ క్రికెటలోకి వచ్చిన జింబాబ్వే వారి చేతిలో కూడా పరాజయం పాలై అనామక జట్టుగా తయారైంది. దీనికి తోడూ క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టడంతో 2019 జూలైలో ఐసీసీ జింబాబ్వేను ఆట నుంచి బహిష్కరించింది. దీంతో వారి కష్టాలు రెట్టింపయ్యాయి. ఎంతలా అంటే కనీసం జింబాబ్వే క్రికెట్ బోర్డు వారి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు కూడా చెల్లించలేకపోయింది. ఆ తర్వాత 2019 అక్టోబర్‌లో ఐసీసీ జింబాబ్వేపై ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. తాజాగా పాకిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటించింది. రెండు టెస్టుల సిరీస్‌ను పాక్ 2-0తో క్లీన్‌స్వీప్ చేయగా.. తర్వాత జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో గెలిచిన జింబాబ్వే మిగతా రెండు ఓడిపోయి 2-1 తేడాతో సిరీస్‌ను పాక్‌కు అప్పగించింది. చదవండి: ఈ వ్యక్తిని అందుకోవడం కష్టంగా ఉంది : వార్నర్ నెలరోజులు గది నుంచి బయటికి రాలేకపోయా: పృథ్వీ షా Any chance we can get a sponsor so we don’t have to glue our shoes back after every series 😢 @newbalance @NewBalance_SA @NBCricket @ICAssociation pic.twitter.com/HH1hxzPC0m — Ryan Burl (@ryanburl3) May 22, 2021 Such a sad state of affairs concerning Zimbabwe cricket. Democratization of Cricket is necessary. We can't allow the beautiful game of cricket to continue like the Super League in football. — Satrajeet Sen (@Sen_Satrajeet) May 23, 2021 @BCCI @ECB_cricket @CricketAus Please do not keep postponing your tours with Zim. It brings them much needed experience and money, with all the viewers watching. Zim sure had a great team, but even the current team has splendid potential. Let's not ignore them — Niranjan Jha (@njanjha17) May 22, 2021 -
అవినీతి ఆరోపణలు.. మాజీ కెప్టెన్‌పై నిషేధం
దుబాయ్: జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్‌పై ఐసీసీ 8 ఏళ్ల పాటు నిషేధం విధించింది ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌ను ఐదుసార్లు ఉల్లంఘించినట్లు స్ట్రీక్‌పై ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో ఈ ఆరోపణలను ఖండించిన స్ట్రీక్.. తాజాగా వాటిని అంగీకరించాడు. జింబాబ్వే తరపున హీత్ స్ట్రీక్ 189 వన్డేల్లో 239 వికెట్లు, 65 టెస్టుల్లో 216 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత కోచ్‌గా వ్యవహరించిన హీత్ స్ట్రీక్ ఆ సమయంలోనే అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలింది. 2017, 2018లలో వివిధ మ్యాచ్‌ల సందర్భంగా అతడు తన టీమ్‌లోని ప్లేయర్స్ దగ్గరికి బుకీలను అనుమతించడాన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఉండగా.. ఐపీఎల్, బీపీఎల్, ఆఫ్ఘనిస్థాన్ ప్రిమియర్ లీగ్‌లలోని మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌ల ఫలితాలపై అవి ఎలాంటి ప్రభావం చూపలేదని ఐసీసీ అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసింది. ఓ మాజీ కెప్టెన్, కోచ్‌గా ఎన్నో అవినీతి నిరోధక కౌన్సిలింగ్ సెషన్లకు హాజరైన స్ట్రీక్ ఇలా చేయడం బాధాకరమని ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ అన్నారు. చదవండి: మ్యాచ్ ఓడినందుకు షారుఖ్ క్షమాపణ.. స్పందించిన రసెల్ సుదీర్ఘ కాలంగా టాప్‌లో కోహ్లి; ఇప్పుడు అగ్రస్థానంలో పాక్ కెప్టెన్ -
‘క్రికెట్‌కు వీడ్కోలు ఇలా కాదు’
హరారే: జింబాబ్వే జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జింబాబ్వే క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వ జోక్యం మితిమీరినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. సస్పెన్షన్ తక్షణం అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది. ఐసీసీ తీసుకున్న తాజా నిర్ణయంతో జింబాబ్వేకి చెందిన క్రికెట్ జట్లు ఏవీ...ఇక ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడానికి లేదు. అలాగే జింబాబ్వే క్రికెట్‌కు అందిస్తున్న నిధుల సాయాన్ని కూడా ఐసీసీ పూర్తిగా నిలిపివేసింది. ఐసీసీ నిర్ణయంతో జింబాబ్వేలో క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఐసీసీ నిర్ణయం పట్ల జింబాబ్వే క్రికెటర్లు సికందర్ రజా, బ్రెండన్ టైలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు. ‘ఎలా ఒక నిర్ణయం ఉన్నట్లుండి మమ్మల్ని అపరిచితులుగా, నిరుద్యోగులుగా మారుస్తూ, ఎంతో మంది కెరియర్ని ముగిస్తుంది.. ఎలా ఒక నిర్ణయం ఎన్నో కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది.. అంతర్జాతీయ క్రికెట్‌కు నేను వీడ్కోలు చెప్పాలనుకున్న పద్దతి ఇది కాదు కదా’ అంటూ సికిందర్ రజా ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. How one decision has made a team , strangers How one decision has made so many people unemployed How one decision effect so many families How one decision has ended so many careers Certainly not how I wanted to say goodbye to international cricket. @ICC pic.twitter.com/lEW02Qakwx — Sikandar Raza (@SRazaB24) July 18, 2019 ‘జింబాబ్వేను సస్పెండ్ చేస్తూ.. ఐసీసీ తీసుకున్న నిర్ణయం హృదయవిదారకమైనది. మా చైర్మన్ ఎంపీ కాదు.. మా జట్టు వెనక ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. వందలాది మంది నిజాయతీ పరులైన ఆటగాళ్లు, ఉద్యోగులు, సహాయక సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ దీన్నో ఉద్యోగంలా మాత్రమే కాక బాధ్యతగా భావించి జింబాబ్వే క్రికెట్‌కు అంకితమయ్యారు’ అంటూ బ్రెండన్ టేలర్ ట్వీట్ చేశారు. @ICC It's heartbreaking to hear your verdict and suspend cricket in Zimbabwe. The @ZimbabweSrc has no government back round yet our Chairman is an MP? Hundreds of honest people,players, support staff,ground staff totally devoted to ZC out of a job,just like that. 💔 — Brendan Taylor (@BrendanTaylor86) July 18, 2019 -
ఆతిథ్యం ఇవ్వాలంటే అప్పు కావాలి!
హరారే:జింబాబ్వే క్రికెట్ రోజు రోజుకు దిగజారిపోతున్నదనడానికి తాజా ఘటనే ఉదాహరణ. జింబాబ్వే క్రికెట్ బోర్డు ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోవడంతో తమకు అప్పు కావాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ని ఆశ్రయించింది. తమ వద్ద మ్యాచ్‌లు నిర్వహించడానికి అస్సలు డబ్బులు లేవని, ఏమైనా రుణ సాయం చేస్తే ఒకడుగు ముందుకు వేస్తామని జింబాబ్వే క్రికెట్ బోర్డు లేఖలో ఐసీసీకి విన్నవించింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. జింబాబ్వేలో పర్యటించాలి. ఆ ద్వైపాక్షిక సిరీస్‌లో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టీ 20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం జింబాబ్వే క్రికెట్ బోర్డు ఆర్ధిక కష్టాల కారణంగా పాక్‌తో సిరీస్‌ను నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది. మరోవైపు పాకిస్థాన్ జట్టు కూడా ఆతిథ్యం ఇవ్వలేమంటే చెప్పండి.. ప్రత్యామ్నాయాలు చూసుకుంటామంటూ జింబాబ్వే క్రికెట్ బోర్డుకు సందేశాలు పంపింది. దీంతో జింబాబ్వే బోర్డు.. ఐసీసీ మద్దతు కోరింది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజమ్ సేథీ ధృవీకరిస్తూ.. 'ఐసీసీ మద్దతు కోరామని.. పర్యటనపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోవద్దని ఏప్రిల్ వరకు ఆగమంటూ జింబాబ్వే బోర్డు మమ్మల్ని కోరింది. ఒక వేళ ఈ ప్రయత్నంలో జింబాబ్వే విఫలమైతే మేం ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తాం' అని పేర్కొన్నారు. గతంలో భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన పలు సందర్బాల్లో ఆ దేశ క్రికెటర్లకు కిట్లు బహుమతులుగా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
చివరి వన్డే అఫ్గాన్‌దే
షార్జా: జింబాబ్వేతో సోమవారం జరిగిన ఐదో మ్యాచ్‌లో అఫ్గాన్ 146 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సిరీస్‌ను 4–1తో దక్కించు కుంది. తొలుత అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 241 పరుగులు చేసింది. రషీద్ ఖాన్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు సాధించాడు. జింబాబ్వే 32.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. -
విరాట్ కోహ్లిని తలపించాడు..!
వెల్లింగ్టన్ : అండర్ -19 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ టీమ్ అదరగొడుతోంది. గ్రూప్-బీలోని ప్రత్యర్థులు అందరినీ చిత్తు చేసిన పృథ్వీ షా సేన క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. గ్రూప్-బీలో శుక్రవారం జరిగిన ఆఖరు మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడిన భారత జట్టు అద్భుత ప్రతిభను కనబరిచింది. ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్ 59 బంతుల్లో 90 పరుగులు, దేశాయ్ 73 బంతుల్లో 56 పరుగులు సాధించడంతో చిన్న లక్ష్యాన్ని భారత జట్టు అలవోకగా చేధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్ కొసిలాతి నుంగు విసిరిన 14వ ఓవర్లో గిల్ అద్భుతమైన షాట్‌ను ఆడి క్రికెట్ పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కోహ్లి ట్రేడ్ మార్క్ షాట్‌ను అదే తరహాలో ఆడిన గిల్ దాన్ని భారీ సిక్సర్‌గా మలిచాడు. ఇదే మ్యాచ్‌లో భారత స్పిన్నర్ అనుకుల్ సుధాకర్ రాయ్ కేవలం 20 పరుగులు ఇచ్చి, నాలుగు వికెట్లను పడగొట్టాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో భారత్, బంగ్లాదేశ్‌తో తలపడనుంది. -
మరో విజయమే లక్ష్యంగా...
మౌంట్ మాంగనీ: వరుస విజయాలతో అండర్–19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌కు చేరిన భారత యువ జట్టు శుక్రవారం తమ చివరి లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన పృథ్వీ షా బృందం రెండో మ్యాచ్‌లో పసికూన పపువా న్యూ గినియాపై ఘన విజయం సాధించి మంచి ఊపుమీద ఉంది. ఇదే వరుసలో జింబాబ్వేపై గెలుపొంది అజేయంగా నాకౌట్‌కు వెళ్లాలని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటికే గ్రూప్ ‘బి’ నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండు విజయాలతో క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. ఉదయం 6.30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
పాక్‌దే తొలి వన్డే
పోరాడి ఓడిన జింబాబ్వే లాహోర్ : బ్యాటింగ్‌లో షోయబ్ మాలిక్ (112), హఫీజ్ (86), హారిస్ సోహైల్ (89 నాటౌట్) చెలరేగి ఆడటంతో జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా పాక్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 375 పరుగులు చేసింది. తర్వాత జింబాబ్వే 50 ఓవర్లలో 5 వికెట్లకు 334 పరుగులు చేసి పోరాడి ఓడిం ది. చిగుంబరా (117) సెంచరీతో ఆకట్టుకున్నాడు. మసకద్జా (73), సికిందర్ రజా (36), విలియమ్స్ (36) మోస్తరుగా ఆడారు. అయితే కీలక సమయంలో పాక్ బౌలర్లు విజృంభించడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. షోయబ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికపై శుక్రవారం జరుగుతుంది. సానియా ఆనందోత్సాహం ఆరేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో తన భర్త షోయబ్ మాలిక్ సెంచరీ కొట్టడంతో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆనందంతో పరవశించిపోతోంది. తన సంతోషాన్ని దాచుకోకుండా ట్విట్టర్లో షోయబ్‌కు అభినందనలు తెలిపింది. ‘నీ ప్రదర్శన చాలా సంతృప్తినిచ్చింది. నమ్మకం అద్భుతాలు చేస్తుంది’ అని ట్వీట్ చేసింది. -
పాకిస్తాన్‌దే టి20 సిరీస్
లాహోర్ : పాకిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగానే ముగిసింది. చివరి ఓవర్లో 12 పరుగులు కావాల్సి ఉండగా బిలావల్ భట్టి (5 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్; 1 సిక్స్) అద్భుత ఆటతీరుతో జట్టును గట్టెక్కించాడు. దీంతో ఆదివారం గడ్డాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ 2 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో మూడు వికెట్లకు 175 పరుగులు చేసింది. షాన్ విలియమ్స్ (32 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు; 1 సిక్స్), సిబంద (46 బంతుల్లో 49; 2 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన పాక్ 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసి నెగ్గింది. ముక్తార్ అహ్మద్ (40 బంతుల్లో 62; 6 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా ఉమర్ అక్మల్ (21 బంతుల్లో 30; 1 ఫోర్; 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు. -
భారత్ సాయం కావాలి
జింబాబ్వే జట్టు రావడం ద్వారా పాకిస్తాన్లో ఆరేళ్ల తర్వాత క్రికెట్ ప్రారంభం అవుతోంది. భారత్ తమకు సాయం చేస్తే తమ దేశంలో పూర్తిస్థాయిలో క్రికెట్ పునరుద్ధరణ జరుగుతుందని పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ షహర్యర్ ఖాన్ చెప్పారు.