టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు జింబాబ్వే క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పురుషుల జట్టు హెడ్‌కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ జస్టిన్ సామన్స్‌ను జింబాబ్వే క్రికెట్ బోర్డు నియమించింది.
ఈ విషయాన్ని జింబాబ్వే క్రికెట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా టీ20 ప్రపంచ కప్ 2024కి అర్హత సాధించడంలో విఫలం కావడంతో జింబ్వాబ్వే హెడ్ కోచ్ బాధ్యతల నుంచి డేవ్ హౌటన్ ఈ ఏడాది ఆరంభంలో తప్పుకున్నాడు. అప్పటి నుంచి జింబ్వాబ్వే ప్రధాన కోచ్‌లేకుండానే పలు టీ20 సిరీస్‌లు ఆడింది.
ఈ నేపథ్యంలోనే తమ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా సామన్స్‌ను జింబాబ్వే క్రికెట్ ఎంపిక చేసింది. సామన్స్‌తో పాటు ఆ దేశ మాజీ ఆటగాడు డియోన్ ఇబ్రహీమ్‌కు సైతం జింబాబ్వే క్రికెట్ కీలక బాధ్యతల అప్పగించింది. జింబాబ్వే అసిస్టెంట్ కోచ్‌గా డియోన్ ఇబ్రహీమ్ పనిచేయనున్నాడు.
కాగా సామన్స్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. సామన్స్ గతంలో సౌతాఫ్రికా హైఫెర్మెమెన్స్ సెంటర్‌లో కోచ్‌గా పనిచేశాడు. అదేవిధంగా 2021 నుంచి 2023 వరకు ప్రోటీస్ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుని కూడా పనిచేశాడు.
ఇక స్వదేశంలో భారత్‌తో 5 మ్యాచ్‌ల టీ20సిరీస్‌లో జింబ్వావ్వే తలపడనుంది. ఈ సిరీస్ జూలై 6న ప్రారంభమై జూలై 14తో ముగియనుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment