ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జింబాబ్వే.. రాబోయే రెండు నెలల్లో బిజీ బిజీ షెడ్యూల్‌తో గడపనుంది. కాగా 18 ఏళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు జింబాబ్వే వెళ్లనుంది. అయితే ఈ పర్యటనకు ముందు వెళ్లే ముందు జింబాబ్వే.. స్వదేశంలో బంగ్లాదేశ్, భారత్‌లతో వరుస సిరీస్‌లలో తలపడనుంది. తొలుత బంగ్లాదేశ్‌తో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో జింబాబ్వే తలపడనుంది.
జూలై 30న హరారే వేదికగా జరగనున్న తొలి టీ20తో బంగ్లా టూర్ ప్రారంభం కానుంది. అనంతరం 2016 తర్వాత తొలి సారి జింబాబ్వే పర్యటనకు భారత్ రానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్ ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా జరగనుంది. హరారే వేదికగా ఆగస్ట్ 18న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత జింబాబ్వే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు జింబాబ్వే ఆడనుంది.
చదవండి: Ind Vs WI ODI Series: వాళ్లంతా లేరు కాబట్టి మా పని ఈజీ.. మేమేంటో చూపిస్తాం: విండీస్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment