టీమిండియాతో టీ20 సిరీస్‌.. జట్టును ప్రకటించిన జింబాబ్వే | Zimbabwe Name Squad To Face India In Five-game T20i Series, Sikandar Raza To Captain The Team | Sakshi
Sakshi News home page

IND vs ZIM: టీమిండియాతో టీ20 సిరీస్‌.. జట్టును ప్రకటించిన జింబాబ్వే

Published Mon, Jul 1 2024 9:12 PM | Last Updated on Tue, Jul 2 2024 12:35 PM

Zimbabwe name squad to face India in five-game T20I series

స్వదేశంలో భారత్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ టీ20 సిరీస్‌కు 15 మ​ంది సభ్యులతో కూడిన తమ జట్టును జింబాబ్వే క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు సికిందర్‌ రజా సారథ్యం వహించనున్నాడు. యువ బ్యాటర్‌ అంతుమ్ నఖ్వీకి తొలిసారి సెలక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. 

అయితే  నఖ్వీ భారత్‌తో టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన నఖ్వీ గతేడాది జింబాబ్వేకు మకాం మార్చాడు. ప్రస్తుతం జింబాబ్వే దేశీవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడు.

ఈ క్రమంలో జింబాబ్వేకు అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించాలని నఖ్వీ గట్టిగా ఫిక్స్‌ అయ్యాడు. దీంతో ఆ దేశ పౌరసత్వం కోసం నఖ్వీ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతడి సిటిజన్‌షిప్‌ను ఇంకా అక్కడి ప్రభుత్వం అంగీకరించలేదు. 

ఏదేమైనప్పటికి దేశీవాళీ క్రికెట్‌లో అద్బుతంగా రాణిస్తుండడంతో సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. కాగా అతడి పౌరసత్వంపై ఒకట్రెండు రోజుల్లో క్లియర్స్‌ వచ్చే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం. ఇక గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న వెస్లీ మాధవెరె,బ్రాండన్ మవుతా సెలక్టర్లు పిలుపునిచ్చారు. 

ఈ సిరీస్‌ జులై 6 నుంచి మొదలుకానుంది. అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగానే జరగనున్నాయి. కాగా ఈ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఈ టూర్‌లో భారత జట్టు కెప్టెన్‌గా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ వ్యవహరించనున్నాడు.

భారత్‌తో సిరీస్‌కు జింబాబ్వే జట్టు
సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, జోనాథన్ క్యాంప్‌బెల్, టెండై చటారా, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, క్లైవ్ మదాండే, వెస్లీ మాధవెరె, తాడివానాషే మారుమణి, వెల్లింగ్‌టన్ మసకద్జా, బ్రాండన్ మవుటా, బ్లెస్సింగ్ ముజరబానీ, అన్టుమ్‌డ్ మైక్‌ర్‌స్రాబానీ, డి. మిల్టన్ శుంబా

జింబాబ్వేతో సిరీస్‌కు భారత జట్టు
శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రింకూ సింగ్‌, రియాన్‌ పరాగ్‌, శివమ్‌ దూబే, అభిషేక్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, సంజూ శాంసన్‌, దృవ్‌ జురెల్‌, రవి బిష్ణోయ్‌, ఆవేశ్‌ ఖాన్‌, ఖలీల్‌ అహ్మద్‌, ముకేశ్‌ కుమార్‌, తుషార్‌ దేశ్‌పాండే
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement