Ind Vs Zim Turning Point: Shubman Gill Stunning Catch Of Sikandar Raza Goes Viral - Sakshi
Sakshi News home page

Shumban Gill-Sikandar Raza: సెంచరీ వీరుడి సంచలన క్యాచ్‌.. మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌

Published Tue, Aug 23 2022 11:42 AM | Last Updated on Tue, Aug 23 2022 12:21 PM

Shubman Gill Stunning Catch Of Sikandar Raza Was Match Turning Point - Sakshi

జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. చివరిదైన మూడో వన్డేలో శుబ్‌మన్‌ గిల్‌ సెంచరీతో కదం తొక్కి మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 97 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 130 పరుగులు చేసిన​ గిల్‌.. జింబాబ్వే గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బ్యాటింగ్‌లో ఇరగదీసిన గిల్‌.. ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టాడు.

అతను అందుకున్న సంచలన క్యాచ్‌ మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. గిల్‌ అందుకున్న క్యాచ్‌ ఎవరిదో తెలుసా.. సికందర్‌ రజా. జింబాబ్వే బ్యాటర్స్‌ అంతా తడబడిన వేళ తాను మాత్రం ఒంటరిపోరాటం చేశాడు. వీరోచిత సెంచరీతో ఆకట్టుకున్న సికందర్‌ రజా ఒక దశలో భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. రజా సెంచరీతో జింబాబ్వే క్లీన్‌స్వీప్‌ నుంచి బయటపడేలా కనిపించింది.

49వ ఓవర్లో శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన ఫుల్‌లెంగ్త్‌ డెలివరీని లాంగాన్‌ దిశగా భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. ఇంతలో బౌండరీ లైన్‌ వద్ద ఉన్న గిల్‌.. ముందుకు పరిగెత్తుకొచ్చి అద్బుతంగా డైవ్‌ చేస్తూ క్యాచ్‌ తీసుకున్నాడు. అప్పటికే రజా 115 పరుగులతో జట్టును విజయంవైపు నడిపిస్తున్నాడు. రజా ఔటైన వెంటనే జింబాబ్వే ఆలౌట్‌ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: Shikar Dhawan: అడగ్గానే ఇద్దామనుకున్నాడు.. ధావన్‌ చర్య వైరల్‌

IND Vs ZIM: సిరీస్‌ క్లీన్‌స్వీప్‌.. 'కాలా చష్మా' పాటకు చిందేసిన టీమిండియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement