Sikandar Raza
-
13 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. రషీద్ ఖాన్ మాయాజాలం.. అఫ్గన్ సరికొత్త చరిత్ర
జింబాబ్వేతో రెండో టెస్టులో అఫ్గనిస్తాన్ విజయం సాధించింది. ఆతిథ్య జట్టును 72 పరుగుల తేడాతో ఓడించి.. సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు అఫ్గన్ క్రికెట్ జట్టు జింబాబ్వే(Afghanistan tour of Zimbabwe, 2024-25) పర్యటనకు వెళ్లింది.పరిమిత ఓవర్ల సిరీస్‌లు కైవసంఈ క్రమంలో హరారే వేదికగా తొలుత టీ20 సిరీస్‌ను 2-1తో గెలిచిన అఫ్గన్.. వన్డే సిరీస్‌ను కూడా 2-1తో నెగ్గింది. అనంతరం బులవాయోలో టెస్టు సిరీస్ మొదలుకాగా.. తొలి మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఈ క్రమంలో అఫ్గన్- జింబాబ్వే(Zimbabwe vs Afghanistan) మధ్య గురువారం మొదలైన రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ధీటుగా బదులిచ్చినాఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగులకే ఆలౌట్ అయింది. ఇందుకు జింబాబ్వే ధీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులు సాధించింది. సికందర్ రజా(61), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్(75) అర్ధ శతకాలతో రాణించగా.. సీన్ విలియమ్స్ 49 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ ముగ్గురి పోరాటం కారణంగా అఫ్గన్ కంటే.. జింబాబ్వే 86 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.అయితే, రెండో ఇన్నింగ్స్‌లో హష్మతుల్లా బృందం పొరపాట్లకు తావివ్వలేదు. రహ్మత్ షా(Rahmat Shah) భారీ శతకం(139)తో చెలరేగగా.. ఇస్మత్ ఆలం(101) కూడా శతక్కొట్టాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా అఫ్గన్ 363 పరుగులు చేయగలిగింది. తద్వారా జింబాబ్వేకు 278 పరుగుల టార్గెట్ విధించింది.13 నిమిషాల్లోనే ఖేల్ ఖతంలక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ జింబాబ్వే.. ఆదివారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి.. ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తద్వారా విజయానికి 73 పరుగుల దూరంలో నిలిచింది. అయితే, అఫ్గన్ స్పిన్నర్ల ధాటికి ఆఖరి రోజు ఆటలో కేవలం 13 నిమిషాల్లోనే మిగిలిన రెండు వికెట్లు కోల్పోయి.. 205 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో అఫ్గన్ 72 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అఫ్గన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఏడు వికెట్లతో చెలరేగగా.. జియా ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర2017లో అఫ్గనిస్తాన్ టెస్టు జట్టు హోదా పొందింది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా.. ఇది నాలుగో విజయం. అదే విధంగా జింబాబ్వేపై రెండోది. కాగా 2021లోనూ జింబాబ్వేతో అఫ్గనిస్తాన్ రెండు టెస్టుల్లో తలపడగా.. 1-1తో నాటి సిరీస్ డ్రా అయింది. అయితే, ఈసారి మాత్రం అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. జింబాబ్వేపై రెండో టెస్టులో గెలిచి.. తొలిసారి ద్వైపాక్షిక టెస్టు సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది.చదవండి: Ind vs Pak: ఆరోజు టీమిండియాపై ప్రశంసల వర్షం ఖాయం: కైఫ్ సెటైర్లు -
చరిత్ర సృష్టించిన అఫ్గనిస్తాన్
Zimbabwe vs Afghanistan, 2nd ODI: అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ వన్డే ఫార్మాట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం నమోదు చేసింది. జింబాబ్వేతో రెండో వన్డే సందర్భంగా ఈ ఘనత సాధించింది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు అఫ్గనిస్తాన్ జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా తొలుత హరారేలో టీ20 సిరీస్ జరుగగా.. అఫ్గనిస్తాన్ 2-1తో నెగ్గింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అదే వేదికపై మంగళవారం వన్డే సిరీస్ మొదలైంది. అయితే, వర్షం కారణంగా తొలి వన్డే ఫలితం తేలకుండానే ముగిసిపోయింది.అతల్ సెంచరీఈ నేపథ్యంలో జింబాబ్వే- అఫ్గనిస్తాన్ మధ్య గురువారం రెండో వన్డే జరిగింది. ఇందులో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. అఫ్గన్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు సెదికుల్లా అతల్ సెంచరీతో చెలరేగగా.. అబ్దుల్ మాలిక్ అర్ధ శతకంతో మెరిశాడు. అటల్ 128 బంతుల్లో 104 పరుగులు చేయగా.. అబ్దుల్ 101 బంతుల్లో 84 పరుగులు రాబట్టాడు.ఇలా ఓపెనర్లు బలమైన పునాది వేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ అజ్మతుల్లా(5), నాలుగో స్థానంలో వచ్చిన రహ్మత్ షా(1) మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో కెప్టెన్ హష్మతుల్లా షాహిది(30 బంతుల్లో 29 నాటౌట్) బ్యాట్ ఝులిపించగా.. మహ్మద్ నబీ(16 బంతుల్లో 18) అతడికి సహకారం అందించాడు. వికెట్ కీపర్ ఇక్రమ్ అలిఖిల్ 5 పరుగులు చేశాడు.54 పరుగులకే జింబాబ్వే ఆలౌట్ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన అఫ్గనిస్తాన్ 286 పరుగులు స్కోరు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో అఫ్గన్ బౌలర్లు నిప్పులు చెరగడంతో జింబాబ్వే 54 పరుగులకే(17.5 ఓవర్లలో) కుప్పకూలింది. దీంతో ఏకంగా 232 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్ జయభేరి మోగించింది.తద్వారా.. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఇక జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సికందర్ రజా సాధించిన 19 పరుగులే టాప్ స్కోర్. అతడు ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.సింగిల్ డిజిట్ స్కోర్లుఓపెనర్లు బెన్ కర్రన్(0), తాడివనాషి మరుమాణి(3).. అదే విధంగా మిగతా ఆటగాళ్లలో డియాన్ మైయర్స్(1), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్(4), బ్రియాన్ బెనెట్(0), న్యూమన్ నియామురి(1), రిచర్డ్ ఎంగర్వ(8), ట్రెవర్ గ్వాండు(0), టినోడెండా మపోసా(0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సీన్ విలియమ్స్ 16 పరుగులు చేయగలిగాడు.ఇక అఫ్గనిస్తాన్ బౌలర్లలో ఘజన్ఫర్, నవీద్ జద్రాన్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. ఫజల్హక్ ఫారూకీ రెండు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. సెంచరీ వీరుడు సెదికుల్లా అతల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య శనివారం మూడో వన్డే జరుగనుంది. చదవండి: ‘త్వరలోనే భారత్‌కు కోహ్లి గుడ్‌బై... లండన్‌లో స్థిరనివాసం’ -
Zim vs Pak: తొలి టీ20లో పాకిస్తాన్ గెలుపు
జింబాబ్వేతో తొలి టీ20లో రిజర్వ్ బెంచ్‌తో బరిలోకి దిగిన పాకిస్తాన్ శుభారంభం చేసింది. బులవాయోలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేపై నెగ్గింది. సల్మాన్ ఆఘా నేతృత్వంలోని పాక్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), తయ్యబ్ తాహిర్ (25 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇర్ఫాన్ ఖాన్ (15 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడారు.108 పరుగులకే ఆలౌట్జింబాబ్వే బౌలర్లలో ఎన్‌గరవ, సికందర్ రజా, మసకద్జా, బర్ల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే 15.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ సికందర్ రజా (28 బంతుల్లో 39; 4 ఫోర్లు), తదివనషి మరుమని (20 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించారు.ఇక మిగతా 9 మందిలో ఏ ఒక్కరు కూడా కనీసం పది పరుగులైనా చేయలేకపోయారు. పాక్ బౌలర్లు అబ్రార్ అహ్మద్, సుఫియాన్ చెరో మూడు వికెట్లు తీయగా, రవూఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది.ఇక మంగళవారం ఇక్కడే రెండో టీ20 జరుగుతుంది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న పాక్.. టీ20 సిరీస్ విజయంపై కూడా కన్నేసింది.పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే తొలి టీ20 స్కోర్లు👉వేదిక: క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో👉టాస్: పాకిస్తాన్.. బ్యాటింగ్👉పాకిస్తాన్ స్కోరు: 165/4 (20)👉జింబాబ్వే స్కోరు:108 (15.3)👉ఫలితం: జింబాబ్వేపై 57 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తయ్యబ్ తాహిర్.చదవండి: ‘పింక్’ మ్యాచ్‌లో భారత్‌దే విజయం -
9 ఏళ్ల తర్వాత...
బులవాయో: పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతిలో 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా పాకిస్తాన్‌పై తొమ్మిదేళ్ల తర్వాత వన్డే మ్యచ్‌లో జింబాబ్వే విజయాన్ని అందుకుంది. చివరిసారి జింబాబ్వే 2015లో పాక్‌ను ఓడించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సికందర్ రజా (39 పరుగులు; 7 పరుగులకు 2 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి జింబాబ్వే గెలుపులో కీలకపాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 40.2 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. ఎన్‌గరావా ((52 బంతుల్లో 48; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సికందర్ రజా (56 బంతుల్లో 39; 6 ఫోర్లు), మరుమని (29; 2 ఫోర్లు, 1 సిక్స్), సీన్ విలియమ్స్ (23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. పాక్ బౌలర్లలో సల్మాన్ ఆఘా (3/42), ఫైజల్ అక్రమ్ (3/24) ఆకట్టుకున్నారు. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 21 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో ఆట సాధ్యపడలేదు. అప్పటికి ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతి ప్రకారం విజయసమీకరణానికి పాక్ 80 పరుగులు వెనుకబడి ఉంది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, సీన్ విలియమ్స్, సికందర్ రజా 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. -
పరుగుల విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ.. రోహిత్ రికార్డు బ్రేక్
-
రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు బ్రేక్.. ఫాస్టెస్ట్ సెంచూరియన్‌గా!
జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు సాధించాడు. కేవలం 33 బంతుల్లోనే శతకం బాది.. టీమిండియా సారథి రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. కాగా ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా జింబాబ్వే బుధవారం గాంబియాతో మ్యాచ్ ఆడింది.ఫాస్టెస్ట్ సెంచరీనైరోబీలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు బ్రియాన్ బెనెట్( 26 బంతుల్లో 50), తాడివాన్షే మరుమణి(Tadiwanashe Marumani- 19 బంతుల్లోనే 62) దుమ్ములేపగా.. సికందర్ రజా కేవలం 33 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు.ఈ క్రమంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టు హోదా ఉన్న దేశాలకు చెందిన ఆటగాళ్లలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గా సికందర్ రజా వరల్డ్ రికార్డు సృష్టించాడు.టెస్టులు ఆడే దేశాలకు చెందిన ఆటగాళ్లలో టీ20 ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేసింది వీరే1. సికందర్ రజా(జింబాబ్వే)- గాంబియాపై 33 బంతుల్లో శతకం2. డేవిడ్ మిల్లర్(సౌతాఫ్రికా)- బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో సెంచరీ3. రోహిత్ శర్మ(ఇండియా)- శ్రీలంకపై 35 బంతుల్లో శతకం4. జాన్సన్ చార్ల్స్(వెస్టిండీస్)- సౌతాఫ్రికాపై 39 బంతుల్లో శతకం5. సంజూ శాంసన్(ఇండియా)- బంగ్లాదేశ్‌పై 40 బంతుల్లో శతకంఏకంగా 15 సిక్సర్లతో మరో రికార్డుఇక గాంబియాతో మ్యాచ్‌లో మొత్తంగా 3 బంతులు ఎదుర్కొన్న సికందర్ రజా.. ఏడు బౌండరీలు, పదిహేను సిక్స్‌ల సాయంతో 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో మరో రికార్డును కూడా సికందర్ రజా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో చేరాడు. ఈ లిస్టులో సాహిల్ చౌహాన్, హజ్రతుల్లా జజాయ్, ఫిన్ అలెన్ 16 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. సికందర్ రజా, జీషన్ కుకిఖెల్ 15 సిక్స్‌లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే గాంబియాపై 344 పరుగులుస్కోరు చేసి ప్రపంచ రికార్డు సాధించింది.చదవండి: Asia Cup 2024: పాకిస్తాన్ భారీ విజయం.. భారత్‌తో పాటు సెమీస్‌లో! -
సికిందర్ రజా ఊచకోత.. టీ20 క్రికెట్లో జింబాబ్వే ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో జింబాబ్వే పరుగుల విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 344 రన్స్ స్కోరు చేసింది. తద్వారా ఇంటర్నేషనల్ టీ20లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు సాధించింది.గాంబియా బౌలింగ్ ఊచకోతనైరోబిలోని రౌరాక స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జింబాబ్వే గాంబియా(Gambia) జట్టుతో తలపడింది. టాస్ గెలిచిన సికందర్ రజా బృందం తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు బ్రియాన్ బెనెట్, తాడివాన్షే మరుమణి(Tadiwanashe Marumani) గాంబియా బౌలింగ్‌ను ఊచకోత కోశారు. బ్రియాన్ 26 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు రాబట్టగా.. మరుమణి కేవలం 19 బంతుల్లోనే 62 రన్స్ సాధించాడు.సికందర్ రజా ఒక్కడే 133 రన్స్వన్డౌన్ బ్యాటర్ డియాన్ మైర్స్(12) విఫలం కాగా.. కెప్టెన్ సికందర్ రజా పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 43 బంతుల్లోనే 7 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 133 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిగతావాళ్లలో రియాన్ బర్ల్ 11 బంతుల్లో 25, క్లైవ్ మడాండే కేవలం 17 బంతుల్లోనే 53(నాటౌట్) పరుగులు సాధించారు. చరిత్ర పుటల్లోకి జింబాబ్వే జట్టుఫలితంగా కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన జింబాబ్వే 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు స్కోరు చేసింది. తద్వారా నేపాల్ పేరిట ఉన్న టీ20 ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆసియా క్రీడలు-2023లో భాగంగా నేపాల్ మంగోలియాపై 314 పరుగులు స్కోరు చేసింది. తాజాగా జింబాబ్వే ఆ రికార్డును బ్రేక్ చేసి అత్యధిక పరుగుల జట్టుగా తమ పేరును చరిత్రపుటల్లో లిఖించుకుంది. 290 పరుగుల భారీ తేడాతో విజయంజింబాబ్వే విధించిన కొండంత లక్ష్యాన్ని చూసి బెంబేలెత్తిన గాంబియా.. 54 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు ఆటగాళ్ల స్కోర్లు వరుస(బ్యాటింగ్ ఆర్డర్)గా 5,0,7,4,7,1,2,2,0,12*,0. దీంతో జింబాబ్వే ఏకంగా 290 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగర్వా, బ్రాండన్ మవుతా మూడేసి వికెట్ల తీయగా.. వెస్లీ మధెవెరె రెండు, ర్యాన్ బర్ల్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: Asia Cup 2024: పాకిస్తాన్ భారీ విజయం.. భారత్‌తో పాటు సెమీస్‌లో! -
ఇదేందయ్యా ఇది.. టాస్ ఇలా కూడా వేయవచ్చా? వీడియో
హరారే వేదికగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో 42 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత భారత్ దెబ్బతిన్న సింహంలా గర్జించింది.వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టును గిల్ సేన చిత్తు చేసింది. కాగా ఆఖరి టీ20 టాస్ సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌కే ముందుకే జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా అందరి దృష్టిని ఆకర్షించాడు. గత నాలుగు గేమ్‌లలో టాస్ ఓడిన రజా ఈసారి తన ఆదృష్టాన్ని మార్చుకోనేందుకు కాస్త విన్నూత్నంగా ప్రయత్నించాడు. అతడు టాస్ కాయిన్‌ను గాల్లోకి జంప్ చేస్తూ స్పిన్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వలు పూయిస్తోంది. టాస్ ఇలా కూడా వేయవచ్చా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: వారంతా ఒక అద్బుతం.. దెబ్బతిన్న పులిలా పంజా విసిరారు: గిల్ pic.twitter.com/snhOXumMx4— Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) July 14, 2024 -
IND Vs ZIM: చరిత్ర సృష్టించిన యశస్వి.. ఒక్క బంతి 13 పరుగులు
జింబాబ్వేతో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్ తొలి బంతికే రెండు సిక్సర్లు బాదిన యశస్వి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సికందర్ బౌలింగ్‌లో తొలి బంతి నో బాల్ కాగా.. ఆ బంతిని యశస్వి సిక్సర్‌గా మలిచాడు. ఆతర్వాతి బంతి ఫ్రీ హిట్ కావడంతో ఆ బంతిని కూడా స్టాండ్స్‌లో పంపాడు. నో బాల్‌తో లభించే అదనపు పరుగుతో కలుపుకుని తొలి బంతికి మొత్తం 13 పరుగులు వచ్చాయి. అంతర్జాతీయ టీ20ల చరిత్రలో ఇలా తొలి బంతికే 13 పరుగులు వచ్చిన దాఖలాలు లేవు.Yashasvi Jaiswal became the first batter in history to score 13 runs on the 1st ball of a T20i. 🌟pic.twitter.com/98j63xmtGu— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2024తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి మాంచి జోష్ మీదుండిన యశస్వి.. అదే ఓవర్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సికందర్ రజా సంధించిన ఇన్ స్వింగర్‌ను తప్పుగా అంచనా వేసిన యశస్వి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. యశస్వి ఔటైన అనంతరం అభిషేక్ శర్మ (14), శుభ్‌మన్ గిల్ (13) కూడా భారీ షాట్లకు ప్రయత్నించి పెవిలియన్ బాట పట్టారు. After conceding two sixes, Sikandar Raza took Yashasvi Jaiswal's wicket, and the celebration says it all.📸: SonyLIV pic.twitter.com/XpNkG19AhM— CricTracker (@Cricketracker) July 14, 2024వీరి తర్వాత క్రీజ్‌లో వచ్చిన సంజూ శాంసన్ (31 బంతుల్లో 38; 3 సిక్సర్లు), రియాన్ పరాగ్ (18 బంతుల్లో 20; సిక్స్) కుదురుగా ఆడుతున్నారు. 13 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 101/3గా ఉంది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, సికందర్ రజా, నగరవ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్ స్థానాల్లో ముకేశ్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే ఓ మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్ మవుటా తుది జట్టులోకి వచ్చాడు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్ -
Ind vs Zim: జైస్వాల్ విధ్వంసం.. గిల్ సూపర్ ఇన్నింగ్స్
జింబాబ్వేతో నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టుకు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. ఆ తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించింది.రాణించినా రజా ఈ క్రమంలో శనివారం నాలుగో టీ20లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగింది. హరారే వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు రాణించారు. జింబాబ్వేను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేశారు.ఆతిథ్య జట్టు ఓపెనర్లలో వెస్లీ మెదెవెరె(25), మరుమానీ(32) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ సికందర్ రజా 46 పరుగులు చేశాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టపోయి 152 పరుగులు చేసింది.అరంగేట్ర బౌలర్‌కు ఒక వికెట్ టీమిండియా బౌలర్లలో పేసర్లు ఖలీల్ అహ్మద్ రెండు, అరంగేట్ర ఆటగాడు తుషార్ దేశ్‌పాండే, శివం దూబే ఒక్కో వికెట్ పడగొట్టగా.. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ తీశారు.ఆకాశమే హద్దుగా జైస్వాల్ఇక జింబాబ్వే విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ అజేయ అద్బుత అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జైస్వాల్ 93 పరుగుల(13 ఫోర్లు, 2 సిక్సర్లు) తో దుమ్మలేపగా.. గిల్ 58 పరుగులు (ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌లు) సాధించాడు.వీరిద్దరి విజృంభణ కారణంగా 15.2 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. ఏకంగా పది వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తొలి సిరీస్‌లోనే ట్రోఫీ గెలవడం విశేషం.చదవండి: IND Vs ZIM 4th T20I: సికందర్ రజా వరల్డ్ రికార్డు -
Ind vs Zim: సికందర్ రజా వరల్డ్ రికార్డు
టీమిండియా నాలుగో టీ20లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టినా పట్టుదలగా నిలబడి ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మొత్తంగా 28 బంతులు ఎదుర్కొని 46 పరుగులు సాధించాడు. అయితే, భారత అరంగేట్ర బౌలర్ తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రజా విఫలమయ్యాడు.అవుట్ సైడ్ ఆఫ్ దిశగా వెళ్తున్న బంతిని మోకాలి మీద కూర్చుని గాల్లోకి లేపాడు. అయితే, కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వేగంగా కదిలి బంతిని అందుకున్నాడు. ఫలితంగా సికందర్ రజా ఇన్నింగ్స్‌కు తెరపడింది.సికందర్ రజా వరల్డ్ రికార్డుఇదిలా ఉంటే.. హరారే వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్ సందర్భంగా సికందర్ రజా ప్రపంచ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20లలో యాభైకి పైగా వికెట్లు తీయడంతో పాటు 2000 పరుగులు పూర్తి చేసుకున్న జింబాబ్వే తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఐదో ఆల్‌రౌండర్‌గా రికార్డు సాధించాడు. కాగా కుడిచేతి వాటం బ్యాటర్ అయిన సికందర్ రజా.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా!అంతర్జాతీయ టీ20(పురుష క్రికెట్)లలో 2 వేలకు పైగా పరుగులు, యాభైకి పైగా వికెట్లు సాధించిన క్రికెటర్లు వీరే1. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 2551 రన్స్, 149 వికెట్లు2. మహ్మద్ నబీ(అఫ్గనిస్తాన్)- 2165 రన్స్, 96 వికెట్లు3. విరన్‌దీప్ సింగ్(మలేషియా)- 2320 రన్స్, 66 వికెట్లు4. మహ్మద్ హఫీజ్(పాకిస్తాన్)- 2514 రన్స్, 61 వికెట్లు5. సికందర్ రజా(జింబాబ్వే)- 2001 రన్స్,65 వికెట్లుమెరుగ్గా రాణించిటీమిండియాతో నాలుగో టీ20లో టాస్ ఓడిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు మెదెవెరె(25), మరుమానీ(32) ఫర్వాలేదనిపించగా.. సికందర్ రజా 46 పరుగులతో రాణించాడు. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే వెళ్లిన భారత జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. -
టీమిండియా ఘన విజయం.. సిరీస్ మనదే
Zimbabwe vs India, 4th T20I Updates: జింబాబ్వే పర్యటనలో భాగంగా టీమిండియా నాలుగో టీ20 ఆడుతోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో శుబ్‌మన్ గిల్ సేన ఆధిక్యంలో ఉంది. శనివారం టీ20లో టాస్ గెలిచిన భారత్.. జింబాబ్వేను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ విజృంభించింది. ఓపెర్లు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ దంచికొట్టారు. జైస్వాల్ 93 పరుగులతో దుమ్మలేపగా.. గిల్ 58 పరుగులు సాధించాడు.వీరిద్దరి విజృంభణ కారణంగా 15.2 ఓవర్లలోనే భారత్ టార్గెట్‌ను పూర్తి చేసింది. ఏకంగా పది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది.భారత తుదిజట్టు: యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్( వికెట్ కీపర్), రింకూ సింగ్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్.జింబాబ్వే తుదిజట్టు: వెస్లీ మెదెవెరె, తాడివానాషే మరుమానీ, బ్రియాన్ బెన్నెట్, డియాన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), రిచర్డ్ నగరవా, బ్లెస్సింగ్ ముజరాబానీ, టెండాయ్ చటారా.అప్డేట్స్14.1: గిల్ అర్ధ శతకం12 ఓవర్లలో టీమిండియా స్కోరు: 118/0 (12)జింబాబ్వే బౌలింగ్‌ను చిత్తు చేస్తూ టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. 12వ ఓవర్ముగిసే సరికి జైస్వాల్ 75, గిల్ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు.పది ఓవర్లలోనే టీమిండియా స్కోరు: 106-0శుబ్‌మన్ గిల్ 37, యశస్వి జైస్వాల్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు.6.3: 29 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకు న్న యశస్వి జైస్వాల్పవర్ ప్లేలో యశస్వి పరుగుల వరదఆరో ఓవర్ ముగిసే సరికి యశస్వి జైస్వాల్ 47(26), శుబ్‌మన్ గిల్ 13 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు: 61/0 (6)దంచికొడుతున్న యశస్విజింబాబ్వే విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఘనంగా తమ ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ ఆది నుంచే జింబాబ్వే బౌలర్లపై అటాక్ చేస్తున్నారు.మూడు ఓవర్లు ముగిసే సరికి యశస్వి 13 బంతుల్లోనే 31 పరుగులు సాధించగా.. గిల్ ఐదు బంతుల్లో 11 రన్స్ చేశాడు. దీంతో టీమిండియా వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. టీమిండియా టార్గెట్ 153ఆతిథ్య జట్టు ఓపెనర్లు వెస్లీ మెదెవెరె(25), మరుమానీ(32) సహా కెప్టెన్ సికందర్ రజా(46) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.భారత బౌలర్లలో పేసర్లు ఖలీల్ అహ్మద్ రెండు, తుషార్ దేశ్‌పాండే, శివం దూబే ఒక్కో వికెట్ తీయగా.. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు.ఆఖరి ఓవర్లో రెండు వికెట్లుఆఖరి ఓవర్లో టీమిండియా పేసర్ ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. తొలి బంతికి మేయర్స్(12), ఆఖరి బంతికి మందాడే(7)ను పెవిలియన్‌కు పంపాడు.18.3: రజా హాఫ్ సెంచరీ మిస్ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరం(28 బంతుల్లో 46) నిలిచిపోయాడు. రజా రూపంలో జింబాబ్వే ఐదో వికెట్ కోల్పోయింది.జింబాబ్వే స్కోరు: 147/5 (19) పదిహేడు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే స్కోరు: 129/4రజా 42, మేయర్స్ తొమ్మిది పరుగులతో ఆడుతున్నారు14.4: నాలుగో వికెట్ కోల్పోయిన జింబాబ్వేబ్యాటర్ల మధ్య సమన్వయ లోపం కారణంగా జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయి బౌలింగ్‌లో సికందర్ రజా పరుగుకు యత్నించగా.. మరో ఎండ్‌లో ఉన్న క్యాంప్‌బెల్ వేగంగా కదలలేకపోయాడు.ఈ క్రమంలో బంతిని అందుకున్న బిష్ణోయి నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు విసరగా.. బాల్ వికెట్లను గిరాటేసింది. ఫలితంగా క్యాంప్‌బెల్(3) రనౌట్ అయ్యాడు. 13.4: మూడో వికెట్ డౌన్వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో బ్రియాన్ బెనెట్ యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. పద్నాలుగు బంతులు ఎదుర్కొన్న ఈ వన్‌డౌన్ బ్యాటర్ తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.జొనాథన్ క్యాంప్‌బెల్ క్రీజులోకి వచ్చాడు. సికందర్‌రజా 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. జింబాబ్వే స్కోరు: 93/3 (14).9.6: రెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వేపేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే బౌలింగ్‌లో జింబాబ్వే ఓపెనర్ వెస్లీ(25) పెవిలియన్ చేరాడు. బాల్‌ను తప్పుగా అంచనా వేసి గాల్లోకి లేపగా.. రింకూ సింగ్ క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో వెస్లీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.సికందర్ రజా 0, బ్రియాన్ బెనెట్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. పది ఓవర్లలో జింబాబ్వే స్కోరు: 67-2.7.1: హాఫ్ సెంచరీ పూర్తి చేసుకు న్న జింబాబ్వేవాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో మరుమానీ రెండు పరుగులు తీయగా.. జింబాబ్వే యాభై పరుగుల మార్కు అందుకుంది.పవర్ ప్లేలో జింబాబ్వే స్కోరు: 44/0ఆరు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. ఓపెనర్లు వెస్లీ 19, మరుమానీ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.కట్టుదిట్టంగా భారత్ బౌలింగ్బ్యాటింగ్కు దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు కట్టడి చేస్తున్నారు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. తన పేస్ పదనుతో జింబాబ్వేకు తొలి ఓవర్లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు.ఇక రెండో ఓవర్ వేసిన అరంగట్రే పేసర్ తుషార్ దేశ్‌పాండే 11 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో రెండు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 15 పరుగులు చేసింది. ఓపెనర్లు వెస్లీ 12, మరుమానీ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచిన భారత జట్టుశనివారం నాటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. హరారే వేదికగా జరుగనున్న ఈ టీ20లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.తుషార్ దేశ్‌పాండే అరంగేట్రంఈ మ్యాచ్ ద్వారా పేస్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే అరంగేట్రం చేస్తున్నట్లు గిల్ తెలిపాడు. ఆవేశ్ ఖాన్ స్థానంలో అతడిని తుదిజట్టుకు ఎంపిక చేసినట్లు వెల్లడించాడు.మరోవైపు.. తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తెలిపాడు. వెల్లింగ్టన్ మసకజ్ద స్థానంలో ఫరాజ్ అక్రం జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు. -
టీమిండియాతో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన జింబాబ్వే
స్వదేశంలో భారత్‌తో జరగనున్న ఐదు మ్యాచ్ టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును జింబాబ్వే క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు సికిందర్ రజా సారథ్యం వహించనున్నాడు. యువ బ్యాటర్ అంతుమ్ నఖ్వీకి తొలిసారి సెలక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. అయితే నఖ్వీ భారత్‌తో టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన నఖ్వీ గతేడాది జింబాబ్వేకు మకాం మార్చాడు. ప్రస్తుతం జింబాబ్వే దేశీవాళీ క్రికెట్లో ఆడుతున్నాడు.ఈ క్రమంలో జింబాబ్వేకు అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించాలని నఖ్వీ గట్టిగా ఫిక్స్ అయ్యాడు. దీంతో ఆ దేశ పౌరసత్వం కోసం నఖ్వీ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతడి సిటిజన్‌షిప్‌ను ఇంకా అక్కడి ప్రభుత్వం అంగీకరించలేదు. ఏదేమైనప్పటికి దేశీవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుండడంతో సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. కాగా అతడి పౌరసత్వంపై ఒకట్రెండు రోజుల్లో క్లియర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న వెస్లీ మాధవెరె,బ్రాండన్ మవుతా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ సిరీస్ జులై 6 నుంచి మొదలుకానుంది. అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగానే జరగనున్నాయి. కాగా ఈ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఈ టూర్లో భారత జట్టు కెప్టెన్‌గా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ వ్యవహరించనున్నాడు.భారత్‌తో సిరీస్‌కు జింబాబ్వే జట్టుసికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, జోనాథన్ క్యాంప్‌బెల్, టెండై చటారా, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, క్లైవ్ మదాండే, వెస్లీ మాధవెరె, తాడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్రాండన్ మవుటా, బ్లెస్సింగ్ ముజరబానీ, అన్టుమ్డ్ మైక్ర్స్రాబానీ, డి. మిల్టన్ శుంబాజింబాబ్వేతో సిరీస్‌కు భారత జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, దృవ్ జురెల్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే -
IPL 2024: గుజరాత్, పంజాబ్ మ్యాచ్.. విధ్వంసకర ఆటగాళ్లు దూరం
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇవాళ (ఏప్రిల్ 4) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఇరు జట్ల నుంచి ఇద్దరు విధ్వంసకర ఆటగాళ్లు మిస్ అయ్యారు. గాయాల కారణంగా గుజరాత్ హిట్టర్ డేవిడ్ మిల్లర్, పంజాబ్ చిచ్చరపిడుగు లియామ్ లివింగ్‌స్టోన్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. మిల్లర్ స్థానంలో కేన్ విలియమ్సన్ ఎంట్రీ ఇవ్వగా.. లివింగ్‌స్టోన్ స్థానంలో సికందర్ రజా తుది జట్లలోకి ఎంట్రీ ఇచ్చారు. తుది జట్లు.. గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), ప్రభ్‌సిమ్రన్ సింగ్, సామ్ కర్రన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ సబ్స్: తనయ్ త్యాగరాజన్, నాథన్ ఎల్లిస్, అసుతోష్ శర్మ, రాహుల్ చాహర్, విద్వత్ కవేరప్ప గుజరాత్ టైటాన్స్ సబ్స్: బీఆర్ శరత్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్, అభినవ్ మనోహర్, మానవ్ సుతార్ -
నరాలు తెగ ఉత్కంఠ.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి! వీడియో వైరల్
ఇంటర్ననేషనల్ టీ20 లీగ్-2024లో దుబాయ్ క్యాపిటల్స్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ లీగ్‌లో భాగంగా శుక్రవారం డెసర్ట్ వైపర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 5 వికెట్ల తేడాతో దుబాయ్ క్యాపిటల్స్ విజయం సాధించింది. దుబాయ్ స్టార్ ఆల్‌రౌండర్ సికందర్ రజా ఆఖరి బంతికి సిక్స్ కొట్టి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అంధించాడు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దుబాయ్ 19 ఓవర్ ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆ క్రమంలో ఆఖరి ఓవర్లో దుబాయ్ విజయానికి 13 పరుగులు కావాలి. క్రీజులో దుబాయ్ బ్యాటర్లు సికందర్ రజా, స్కాట్ కుగ్గెలీజ్న్ ఉండగా.. డెసర్ట్ కెప్టెన్ మున్రో ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను అలీ నీసర్కు అప్పగించాడు. తొలి బంతినే కుగ్గెలీజ్న్ బౌండరీకి తరిలించాడు. రెండో బంతికి డాట్, మూడో బంతికి కుగ్గెలీజ్న్ సింగిల్ తీసి రజాకు స్ట్రైక్ ఇచ్చాడు. నాలుగో బంతికి రజా రెండు పరుగులు తీయగా.. ఐదు బంతికి ఎటువంటి పరుగు లేదు. దీంతో చివరి బంతికి 6 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో దుబాయ్ డగౌట్లో టెన్షన్ వాతవారణం నెలకొంది. అయితే ఆఖరి బంతిని లాంగ్ ఆఫ్ మీదగా అద్బుతమైన సిక్స్‌గా మలిచిన రజా.. తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో 45 బంతులు ఎదుర్కొన్న రజా.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. వైపర్స్ బ్యాటర్లలో హేల్స్(66) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దుబాయ్ బౌలర్లలో ఓలీ స్టోన్, వాండర్ మెర్వ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. Dubai Capitals stay alive by the skin of their teeth & they have Raza to thank 🙇🙌 6 needed on the last ball & the 🇿🇼 maestro deposits it over long off 🤯#DVvDC | #KoiKasarNahiChhodenge | #DPWorldILT20onZee pic.twitter.com/iygmkvjHCl — Zee Cricket (@ilt20onzee) February 9, 2024 -
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న జింబాబ్వేకు మరో భారీ షాక్
వన్డే వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్‌లకు అర్హత సాధించలేకపోవడంతో పాటు స్వదేశంలో నమీబియా, ఐర్లాండ్ లాంటి చిన్న జట్ల చేతిలో ఘోర పరాజయాలు ఎదుర్కొన్న జింబాబ్వే జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శత విధాల ప్రయత్నించిన ప్రధాన కోచ్ డేవ్ హటన్ తప్పనిసరి పరిస్థితుల్లో తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని జింబాబ్వే క్రికెట్ బోర్డు ఇవాళ అధికారికంగా ప్రకటించింది. డేవ్ హటన్ కెప్టెన్‌గా, కోచ్‌గా ఉన్న కాలంలో జింబాబ్వే స్వర్ణ యుగాన్ని చవిచూసింది. ఒక సమయంలో డేవ్‌తో కూడాని జింబాబ్వే.. ఆస్ట్రేలియా, భారత్ లాంటి జట్లను సైతం గడగడలాడించింది. అలాంటి జట్టు ప్రస్తుతం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుండటంతో హటన్ తన గట్టెక్కించేందుకు విఫలయత్నం చేసి చేత కాక తప్పుకున్నాడు. జింబాబ్వే జట్టులో కొత్తగా కెప్టెన్‌గా నియమితుడైన సికందర్ రజా ఒక్కడే రాణిస్తుండగా, మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేస్తున్నారు. పరాయి దేశస్తుడిని తీసుకు వచ్చి కెప్టెన్‌గా చేయడం వల్లే, జట్టులోని మిగతా ఆటగాళ్లు అతనికి సహకరించడం లేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ హటన్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో జింబాబ్వే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. -
చరిత్ర సృష్టించిన సికందర్ రజా.. కోహ్లి రికార్డు సమం
టీ20 వరల్డ్‌కప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా రువాండతో నిన్న (నవంబర్ 27) జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు (కెప్టెన్) సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. జింబాబ్వే తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో అతను బంతితో (2.4-0-3-3) పాటు బ్యాట్‌తోనూ (36 బంతుల్లో 58; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో జింబాబ్వే 144 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. పరుగుల పరంగా టీ20ల్లో జింబాబ్వేకు ఇదే అత్యుత్తమ విజయం. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన రజా.. ఈ ఏడాది రికార్డుల రారాజు విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును కూడా సమం చేశాడు. ఈ ఏడాది విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం ఆరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకోగా.. నిన్నటి మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో రజా విరాట్ రికార్డును (6) సమం చేశాడు. ఈ టోర్నీలో ఉగాండ లాంటి చిన్న జట్టు చేతిలో ఓటమిపాలైన జింబాబ్వే తాజా గెలుపుతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకి వరల్డ్‌కప్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ టోర్నీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనుండగా.. నమీబియా, ఉగాండ, కెన్యా జట్లు రేసులో ముందున్నాయి. ఈ మూడు జట్ల తర్వాతి స్థానంలో జింబాబ్వే ఉంది. ఈ టోర్నీలో జింబాబ్వే మరో రెండు మ్యాచ్‌లు (నైజీరియా, కెన్యా) ఆడాల్సి ఉంది. కాగా, రువాండతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. సికందర్ రజాతో పాటు మరుమణి (50), ర్యాన్ బర్ల్ (44 నాటౌట్) రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన రువాండ.. రిచర్డ్ నగరవ (3/11), సికందర్ రజా (3/3), ర్యాన్ బర్ల్ (2/7) ధాటికి 71 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. -
జింబాబ్వేకు షాక్.. మరో పసికూన చేతిలో ఘోర పరాభవం
ఐసీసీ సభ్య దేశమైన జింబాబ్వేకు ఊహించని పరాభవం ఎదురైంది. తమ కంటే చిన్న జట్టైన నమీబియా చేతిలో టీ20 సిరీస్ కోల్పోయింది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న నమీబియా.. మూడుసార్లు వన్డే ప్రపంచకప్ ఆడిన జింబాబ్వేను ఓడించి సంచలన సృష్టించింది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను నమీబియా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో నమీబియన్లు 8 పరుగులు తేడాతో గెలుపొందారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 18.4 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ కాగా.. జింబాబ్వే 19.2 ఓవర్లలో 93 పరుగులకు చాపచుట్టేసి పరాజయంపాలైంది. రాణించిన సికందర్ రజా.. ఇటీవలికాలంలో ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న సికందర్ రజా (జింబాబ్వే) నిన్న నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో బంతితో మెరిశాడు. రజా 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి నమీబియా పతనాన్ని శాశించాడు. రజాతో పాటు చటారా (3/7), నగరవ (2/6), ర్యాన్ బర్ల్ (1/33) కూడా రాణించడంతో నమీబియా 101 పరుగులకే చాపచుట్టేసింది. బ్యాటింగ్‌లో తేలిపోయిన జింబాబ్వే.. 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే ఆది నుంచే తడబుడతూ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి 93 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్లు బెర్నార్డ్, స్మిట్ చెరో 3 వికెట్లు.. లుంగమెని, ఎరాస్మస్, ఫ్రైలింక్ తలో వికెట్ తీసి జింబాబ్వేను మట్టికరిపించారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో లూక్ జాంగ్వే (24) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, ఈ సిరీస్‌లో తొలి టీ20 గెలిచిన నమీబియా ఆతర్వాత నాలుగు, ఐదు మ్యాచ్‌లను గెలిచి సిరీస్ చేజిక్కించుకుంది. -
శివాలెత్తిన సికందర్ రజా.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో..!
జింబాబ్వే టీ10 లీగ్‌లో ఆ దేశ స్టార్ ఆల్‌రౌండర్ సికందర్ రజా చెలరేగిపోయాడు. హరారే హరికేన్స్‌తో నిన్న (జులై 24) జరిగిన మ్యాచ్‌లో శివాలెత్తిపోయిన రజా (బులవాయో బ్రేవ్స్ కెప్టెన్).. లీగ్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (15 బంతుల్లో) కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 21 బంతులను ఎదుర్కొన్న రజా.. 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. రజాకు కోబ్ హెఫ్ట్ (23 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తోడవ్వడంతో బులవాయో బ్రేవ్స్ 135 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలుండగానే ఊదేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్.. భారత వెటరన్ రాబిన్ ఉతప్ప (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), విండీస్ వీరుడు ఎవిన్ లివిస్ (19 బంతుల్లో 49; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), ఫెరియెరా (21 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ఇర్ఫాన్ పఠాన్ (9 బంతుల్లో 18 నాటౌట్; 4 ఫోర్లు) చెలరేగిపోవడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 134 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన సికందర్ రజా ఓ వికెట్ పడగొట్టగా.. ప్యాట్రిక్ డూలీ 2, తిస్కిన్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 135 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రేవ్స్.. సికందర్ రజా, కోబ్ హెఫ్ట్, వెబ్‌స్టర్ (12 నాటౌట్; ఫోర్, సిక్స్) విజృంభించడంతో 9.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రేవ్స్ ఇన్నింగ్స్‌లో బెన్ మెక్‌డెర్మాట్ (8) నిరాశపరచగా.. హరికేన్స్ బౌలర్లలో మహ్మద్ నబీ, నండ్రే బర్గర్ తలో వికెట్ పడగొట్టారు. ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు యూనివర్సల్ బాస్‌దే.. టీ10 క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. అబుదాబీ టీ10 లీగ్ 2021 సీజన్లో బాస్ 12 బంతుల్లో 50 కొట్టాడు. అంతకుముందు ఇదే లీగ్ 2018 సీజన్లో ఆఫ్ఘన్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్ కూడా 12 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. -
చరిత్ర సృష్టించిన సికిందర్ రజా.. 23 ఏళ్ల రికార్డు బద్దలు!
ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023లో క్వాలిఫియర్స్‌లో జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ సికిందర్ రజా తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఒమన్‌తో జరుగుతున్న సూపర్ సిక్స్ మ్యాచ్‌లో రజా 42 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో సికిందర్ రజా ఓ అరుదైన రికార్డును సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 4000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి జింబాబ్వే క్రికెటర్‌గా రజా నిలిచాడు. ఒమన్‌తో మ్యాచ్‌లో 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ రికార్డును రజా నమోదు చేశాడు. రజా కేవలం 127 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు జింబాబ్వే దిగ్గజం గ్రాంట్ ఫ్లవర్ పేరిట ఉండేది. 2000లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రాంట్ ఫ్లవర్ ఈ ఘనత సాధించాడు. 128 ఇన్నింగ్స్‌లో ఫ్లవర్ ఈ రికార్డును అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో 23 ఏళ్ల ఫ్లవర్ రికార్డును రజా బ్రేక్ చేశాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన రజా.. 86.67 సగటుతో 260 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఓ అద్భుత సెంచరీ కూడా ఉంది. చదవండి: #SeanWilliams: హ్యాట్రిక్ సెంచరీ.. జట్టును వరల్డ్‌కప్‌కు చేర్చడమే ధ్యేయంగా! -
సత్తా చాటిన సికందర్ రజా, నికోలస్ పూరన్
ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, విండీస్ వైట్‌బాల్ స్పెషలిస్ట్ నికోలస్ పూరన్ సత్తా చాటారు. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో అద్భుతమైన ప్రదర్శనల కారణంగా వీరు ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. పూరన్ 13 స్థానాలు జంప్ చేసి టాప్ 20లోకి (19వ స్పాట్) ప్రవేశిస్తే.. సికందర్ రజా 7 స్థానాలు మెరుగుపర్చుకుని 27వ ప్లేస్‌కు ఎగబాకాడు. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో బంతితోనూ సత్తా చాటిన సికందర్.. ఆల్‌రౌండర్ల విభాగంలోనూ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో ప్లేస్‌కు చేరాడు. బౌలింగ్‌లో 4 మ్యాచ్‌ల్లో 18 వికెట్లతో చెలరేగిన లంక స్పిన్నర్ వనిందు హసరంగ 2 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ ప్లేస్‌కు చేరగా.. జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ 27 స్థానాలు మెరుగుపర్చుకుని 32వ స్థానానికి ఎగబాకాడు. వీరితో పాటు క్వాలిఫయర్స్‌లో సత్తా చాటిన మరికొందరు బ్యాటర్లు కూడా ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. 3 ఫిఫ్టిలతో రాణించిన నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 24 స్థానాలు మెరుగుపర్చుకుని 40వ ర్యాంక్‌కు, జింబాబ్వే సీన్ విలియమ్స్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 43వ ప్లేస్‌కు చేరుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో టాప్-10 స్థానాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. బ్యాటింగ్‌లో బాబర్ ఆజమ్, బౌలింగ్‌లో హాజిల్‌వుడ్ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్ నుంచి బ్యాటింగ్ విభాగంలో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టాప్ 10లో ఉండగా.. బౌలింగ్‌లో సిరాజ్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. -
జింబాబ్వే తరపున ఫాస్టెస్ట్ సెంచరీ.. రెండు రోజుల్లోనే చెరిపేసి
జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో జింబాబ్వే తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సికందర్ రజా 54 బంతుల్లో ఆరు ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు నాటౌట్ సుడిగాలి శతకంతో మెరిశాడు. కేవలం 54 బంతుల్లోనే భారీ శతకం బాదిన సికందర్ రాజా జింబాబ్వే తరపున వన్డే క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇంతకు ముందు ఈ రికార్డు సీన్ విలియమ్స్ పేరిట ఉండేది. జూన్ 18న నేపాల్‌పై విలియమ్స్ కేవలం 70 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఈ రికార్డును సికందర్ రాజా కేవలం రెండు రోజుల్లోనే చెరిపేసి కొత్త చరిత్ర సృష్టించాడు. కాగా 37 ఏళ్ల వయసులో శతకం బాదిన సికందర్ రజా.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన పెద్ద వయస్కుడిగా క్రెయిగ్ ఎర్విన్‌తో కలిసి సంయుక్తంగా నిలిచాడు. ఇక వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. డివిలియర్స్ కేవలం 31 బంతుల్లోనే శతకం మార్క్ అందుకోగా.. ఆ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ బ్యాటర్ కోరె అండర్సన్ (36 బంతుల్లోనే శతకం), షాహిద్ అఫ్రిది 37 బంతుల్లో, జాస్ బట్లర్ 46 బంతుల్లో, సనత్ జయసూర్య 48 బంతుల్లో అందుకున్నారు. ఇక టీమిండియా తరపున విరాట్ కోహ్లి 52 బంతుల్లో సెంచరీ సాధించాడు. చదవండి: చావుదెబ్బ కొట్టిన ఆసీస్.. రికార్డులు బద్దలైన వేళ సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఎదురులేని జింబాబ్వే -
సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఎదురులేని జింబాబ్వే
వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ క్రికెట్ టోర్నీలో(ICC CWC 2023)ఆతిథ్య జట్టు జింబాబ్వే ఎదురులేకుండా దూసుకెళుతుంది. టోర్నీలో జింబాబ్వే వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్‌తో మంగళవారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వే ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. సికందర్ రజా (54 బంతుల్లోనే 102 పరుగులు) వీరోచిత సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ నాలుగు వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో వన్డేల్లో జింబాబ్వే తరపున వన్డేల్లో వేగవంతమైన సెంచరీ సాధించిన ప్లేయర్‌గా సికందర్ రజా గుర్తింపు పొందాడు. కాగా మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. విక్రమ్‌జిత్ సింగ్(88 పరుగులు), మాక్స్ ఒడౌడ్(59 పరుగులు), స్కాట్ ఎడ్వర్డ్స్(83 పరుగులు) రాణించగా.. సికందర్ రజా 55 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం 316 టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వే కేవలం 40.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. క్రెయిగ్ ఇర్విన్(50 పరుగులు), సీన్ విలియమ్స్(91 పరుగులు) రాణించగా.. సికందర్ రజా(54 బంతుల్లో 102 నాటౌట్, ఆరు ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ సెంచరీతో జట్టును గెలిపించాడు. Hosts Zimbabwe make it two wins out of two after Sikandar Raza's heroics ✌️ 📝: #ZIMvNED: https://t.co/6sP9VYrxb0 | #CWC23 pic.twitter.com/u52nPJgmF6 — ICC Cricket World Cup (@cricketworldcup) June 20, 2023 చదవండి: బజ్‌బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్ -
PBKS Vs LSG: పంజాబ్‌దే పైచేయి
లక్నో: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు కీలక విజయం దక్కింది. చివరి వరకు మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ 2 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 74; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించగా, కైల్ మేయర్స్ (23 బంతుల్లో 29; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించాడు. స్యామ్ కరన్ 3 వికెట్లు పడగొట్టగా, రబడకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్ 19.3 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సికందర్ రజా (41 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా, మాథ్యూ షార్ట్ (22 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. చివర్లో షారుఖ్ ఖాన్ (10 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుపులు జట్టును గెలిపించాయి. రవి బిష్ణోయ్, యుద్వీర్ సింగ్, మార్క్‌వుడ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. భుజం నొప్పితో ఈ మ్యాచ్‌కు శిఖర్ ధావన్ దూరం కాగా, స్యామ్ కరన్ పంజాబ్ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించాడు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) (సబ్) ఎలిస్ (బి) అర్షదీప్ 74; మేయర్స్ (సి) హర్‌ప్రీత్ సింగ్ (బి) హర్‌ప్రీత్ బ్రార్ 29; హుడా (ఎల్బీ) (బి) రజా 2; కృనాల్ (సి) షారుఖ్ (బి) రబడ 18; పూరన్ (సి) షారుఖ్ (బి) రబడ 0; స్టొయినిస్ (సి) జితేశ్ (బి) కరన్ 15; బదోని (నాటౌట్) 5; గౌతమ్ (సి) రజా (బి) కరన్ 1; యు«ద్వీర్ (సి) షారుఖ్ (బి) కరన్ 0; బిష్ణోయ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–53, 2–62, 3–110, 4–111, 5–142, 6–150, 7–154, 8–154. బౌలింగ్: షార్ట్ 2–0–10–0, అర్షదీప్ 3–0–22–1, రబడ 4–0–34–2, స్యామ్ కరన్ 4–0–31–3, హర్‌ప్రీత్ బ్రార్ 2–0–10–1, రజా 2–0–19–1, చహర్ 3–0–28–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: అథర్వ (సి) అవేశ్ (బి) యుద్వీర్ 0; ప్రభ్‌సిమ్రన్ (బి) యుధ్వీర్ 4; షార్ట్ (సి) స్టొయినిస్ (బి) గౌతమ్ 34; హర్‌ప్రీత్ సింగ్ (సి) (సబ్) ప్రేరక్ (బి) కృనాల్ 22; రజా (సి) స్టొయినిస్ (బి) బిష్ణోయ్ 57; కరన్ (సి) కృనాల్ (బి) బిష్ణోయ్ 6; జితేశ్ (సి) రాహుల్ (బి) వుడ్ 2; షారుఖ్ (నాటౌట్) 23; హర్‌ప్రీత్ బ్రార్ (సి) పూరన్ (బి) వుడ్ 6; రబడ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో 8 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–0, 2–17, 3–45, 4–75, 5–112, 6–122, 7–139, 8–153. బౌలింగ్: యుద్వీర్ 3–0–19–2, అవేశ్ 3–0–24–0, మార్క్‌వుడ్ 4–0–35–2, గౌతమ్ 4–0–31–1, కృనాల్ 3–0–32–1, రవి బిష్ణోయ్ 2.3–0–18–2. ఐపీఎల్లో నేడు ముంబై VS కోల్‌కతా (మధ్యాహ్నం గం. 3:30 నుంచి) గుజరాత్ VS రాజస్తాన్ (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
సికందర్ రజా సునామీ ఇన్నింగ్స్.. వరుసగా నాలుగో విజయం
Pakistan Super League 2023: పాకిస్తాన్ సూపర్‌లీగ్-2023లో లాహోర్ ఖలండర్స్ వరుసగా నాలుగో విజయం సాధించింది. క్వెటా గ్లాడియేటర్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టుకు గెలుపు అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో గురువారం రాత్రి లాహోర్ ఖలండర్స్, క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన క్వెటా గ్లాడియేటర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ సర్ఫరాజ్ నమ్మకాన్ని నిర్ణయానికి సార్థకత చేకూరుస్తూ.. క్వెటా బౌలర్లు అదరగొట్టారు. ఉమైద్ అసీఫ్ లాహోర్ ఓపెనర్లు మీర్జా బేగ్(2), ఫఖర్ జమాన్(రనౌట్)లను తక్కువ స్కోర్లకే పరిమితం చేసి శుభారంభం అందించాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ షఫీక్ 15 పరుగులు చేయగా, వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ (2) పూర్తిగా నిరాశపరిచాడు. ఐదో స్థానంలో వచ్చిన హుసేన్ తలట్ కూడా కేవలం ఆరు పరుగులు చేసి నిష్క్రమించగా.. ఆరోస్థానంలో వచ్చిన కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇలా వరుస వికెట్లు కోల్పయి జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ సికందర్ రజా తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. 34 బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి లాహోర్ 148 పరుగుల మెరుగైన స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. క్వెటా బౌలర్లలో నసీం షా, ఓడియన్ స్మిత్, ఉమైద్ అసీఫ్ ఒక్కో వికెట్ తీయగా.. నవీన్ ఉల్ హక్, మహ్మద్ నవాజ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెటా గ్లాడియేటర్స్‌ను లాహోర్ బౌలర్లు హారిస్ రవూఫ్(3 వికెట్లు), రషీద్ ఖాన్(2 వికెట్లు) దెబ్బ కొట్టారు. వీరికి తోడు డేవిడ్ వీస్ ఒక వికెట్‌తో రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన క్వెటా గ్లాడియేటర్స్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పటి వరకు ఒకే ఒక్క గెలుపు నమోదు చేసిన క్వెటా గ్లాడియేటర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. చదవండి: Ind Vs Aus 3rd Test: ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. రోహిత్ సేనపై 9 వికెట్ల తేడాతో విజయం IND vs AUS: ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే! వీడియో వైరల్ View this post on Instagram A post shared by Pakistan Super League (@thepsl)