సికందర్ రజా(PC: X)
జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సాధించాడు. కేవలం 33 బంతుల్లోనే శతకం బాది.. టీమిండియా సారథి రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. కాగా ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా జింబాబ్వే బుధవారం గాంబియాతో మ్యాచ్ ఆడింది.
ఫాస్టెస్ట్ సెంచరీ
నైరోబీలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు బ్రియాన్ బెనెట్( 26 బంతుల్లో 50), తాడివాన్షే మరుమణి(Tadiwanashe Marumani- 19 బంతుల్లోనే 62) దుమ్ములేపగా.. సికందర్ రజా కేవలం 33 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు.
ఈ క్రమంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టు హోదా ఉన్న దేశాలకు చెందిన ఆటగాళ్లలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గా సికందర్ రజా వరల్డ్ రికార్డు సృష్టించాడు.
టెస్టులు ఆడే దేశాలకు చెందిన ఆటగాళ్లలో టీ20 ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేసింది వీరే
1. సికందర్ రజా(జింబాబ్వే)- గాంబియాపై 33 బంతుల్లో శతకం
2. డేవిడ్ మిల్లర్(సౌతాఫ్రికా)- బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో సెంచరీ
3. రోహిత్ శర్మ(ఇండియా)- శ్రీలంకపై 35 బంతుల్లో శతకం
4. జాన్సన్ చార్ల్స్(వెస్టిండీస్)- సౌతాఫ్రికాపై 39 బంతుల్లో శతకం
5. సంజూ శాంసన్(ఇండియా)- బంగ్లాదేశ్‌పై 40 బంతుల్లో శతకం
ఏకంగా 15 సిక్సర్లతో మరో రికార్డు
ఇక గాంబియాతో మ్యాచ్‌లో మొత్తంగా 3 బంతులు ఎదుర్కొన్న సికందర్ రజా.. ఏడు బౌండరీలు, పదిహేను సిక్స్‌ల సాయంతో 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో మరో రికార్డును కూడా సికందర్ రజా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో చేరాడు.
ఈ లిస్టులో సాహిల్ చౌహాన్, హజ్రతుల్లా జజాయ్, ఫిన్ అలెన్ 16 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. సికందర్ రజా, జీషన్ కుకిఖెల్ 15 సిక్స్‌లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే గాంబియాపై 344 పరుగులుస్కోరు చేసి ప్రపంచ రికార్డు సాధించింది.
చదవండి: Asia Cup 2024: పాకిస్తాన్ భారీ విజయం.. భారత్‌తో పాటు సెమీస్‌లో!
Comments
Please login to add a commentAdd a comment