జింబాబ్వేతో తొలి టీ20లో రిజర్వ్ బెంచ్‌తో బరిలోకి దిగిన పాకిస్తాన్ శుభారంభం చేసింది. బులవాయోలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేపై నెగ్గింది. సల్మాన్ ఆఘా నేతృత్వంలోని పాక్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.
నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), తయ్యబ్ తాహిర్ (25 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇర్ఫాన్ ఖాన్ (15 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడారు.
108 పరుగులకే ఆలౌట్
జింబాబ్వే బౌలర్లలో ఎన్‌గరవ, సికందర్ రజా, మసకద్జా, బర్ల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే 15.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ సికందర్ రజా (28 బంతుల్లో 39; 4 ఫోర్లు), తదివనషి మరుమని (20 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించారు.
ఇక మిగతా 9 మందిలో ఏ ఒక్కరు కూడా కనీసం పది పరుగులైనా చేయలేకపోయారు. పాక్ బౌలర్లు అబ్రార్ అహ్మద్, సుఫియాన్ చెరో మూడు వికెట్లు తీయగా, రవూఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది.
ఇక మంగళవారం ఇక్కడే రెండో టీ20 జరుగుతుంది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న పాక్.. టీ20 సిరీస్ విజయంపై కూడా కన్నేసింది.
పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే తొలి టీ20 స్కోర్లు
👉వేదిక: క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
👉టాస్: పాకిస్తాన్.. బ్యాటింగ్
👉పాకిస్తాన్ స్కోరు: 165/4 (20)
👉జింబాబ్వే స్కోరు:108 (15.3)
👉ఫలితం: జింబాబ్వేపై 57 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలుపు
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తయ్యబ్ తాహిర్.
Comments
Please login to add a commentAdd a comment