Usman Khan
-
Zim vs Pak: తొలి టీ20లో పాకిస్తాన్ గెలుపు
జింబాబ్వేతో తొలి టీ20లో రిజర్వ్ బెంచ్‌తో బరిలోకి దిగిన పాకిస్తాన్ శుభారంభం చేసింది. బులవాయోలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేపై నెగ్గింది. సల్మాన్ ఆఘా నేతృత్వంలోని పాక్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), తయ్యబ్ తాహిర్ (25 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇర్ఫాన్ ఖాన్ (15 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడారు.108 పరుగులకే ఆలౌట్జింబాబ్వే బౌలర్లలో ఎన్‌గరవ, సికందర్ రజా, మసకద్జా, బర్ల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే 15.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ సికందర్ రజా (28 బంతుల్లో 39; 4 ఫోర్లు), తదివనషి మరుమని (20 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించారు.ఇక మిగతా 9 మందిలో ఏ ఒక్కరు కూడా కనీసం పది పరుగులైనా చేయలేకపోయారు. పాక్ బౌలర్లు అబ్రార్ అహ్మద్, సుఫియాన్ చెరో మూడు వికెట్లు తీయగా, రవూఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది.ఇక మంగళవారం ఇక్కడే రెండో టీ20 జరుగుతుంది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న పాక్.. టీ20 సిరీస్ విజయంపై కూడా కన్నేసింది.పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే తొలి టీ20 స్కోర్లు👉వేదిక: క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో👉టాస్: పాకిస్తాన్.. బ్యాటింగ్👉పాకిస్తాన్ స్కోరు: 165/4 (20)👉జింబాబ్వే స్కోరు:108 (15.3)👉ఫలితం: జింబాబ్వేపై 57 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తయ్యబ్ తాహిర్.చదవండి: ‘పింక్’ మ్యాచ్‌లో భారత్‌దే విజయం -
కొలిన్ మున్రో విధ్వంసం.. ఉస్మాన్ ఖాన్ మెరుపు శతకం వృధా
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మరో హై స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య ఇవాళ (మార్చి 10) జరిగిన మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 460 పరుగులు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్ 228 పరుగులు చేయగా.. ఛేదనలో ఇస్లామాబాద్ చివరి బంతికి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ చేసిన స్కోర్ సీజన్ మొత్తానికే అత్యధిక స్కోర్‌గా రికార్డైంది. పీఎస్ఎల్ చరిత్రలో ఇస్లామాబాద్‌కు ఇదే అత్యుత్తమ ఛేదన. ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇస్లామాబాద్.. ప్లే ఆఫ్స్ బెర్త్‌ను సైతం ఖరారు చేసుకుంది. ఈ సీజన్లో ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ ఇదివరకే నాకౌట్ దశకు క్వాలిఫై కాగా.. లాహోర్ ఖలందర్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు ఉస్మాన్ కేవలం 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 15 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఉస్మాన్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. మార్చి 3న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఉస్మాన్ సెంచరీలు చేసిన ఈ రెండు సందర్భాల్లో నాటౌట్‌గా మిగిలాడు. ఉస్మాన్‌తో పాటు జాన్సన్ చార్లెస్ (18 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), యాసిర్ ఖాన్ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. మున్రో విధ్వంసం.. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్.. కొలిన్ మున్రో (40 బంతుల్లో 84; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (31 బంతుల్లో 54; 6 ఫోర్, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో చివరి బంతికి విజయం సాధించింది. ఇమాద్ వసీం (13 బంతుల్లో 30) చివరి రెండు బంతులకు సిక్సర్, బౌండరీ బాది ఇస్లామాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. -
ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. 50 బంతుల్లోనే శతకం.. వరుసగా రెండవది
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మరో భారీ స్కోర్ నమోదైంది. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో ఇవాళ (మార్చి 10) జరుగుతున్న మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక స్కోర్. ముల్తాన్ సుల్తాన్స్ భారీ స్కోర్ చేయడంలో ఉస్మాన్ ఖాన్ ప్రధానపాత్ర పోషించాడు. వన్‌డౌన్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన ఉస్మాన్ కేవలం 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ 15 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఉస్మాన్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. మార్చి 3న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఉస్మాన్ సెంచరీలు చేసిన ఈ రెండు సందర్భాల్లో నాటౌట్‌గా మిగిలాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఉస్మాన్‌తో పాటు జాన్సన్ చార్లెస్ (18 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), యాసిర్ ఖాన్ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (17 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్), ఇఫ్తికార్ అహ్మద్ (12 బంతుల్లో 13; 2 ఫోర్లు), క్రిస్ జోర్డన్ (7 బంతుల్లో 15 నాటౌట్; ఫోర్, సిక్స్) రాణించారు. ఇస్లామాబాద్ బౌలర్లలో ఫహీమ్ అష్రాఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, హునైన్ షా తలో వికెట్ దక్కించుకున్నారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్.. తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డేవిడ్ విల్లే భారీ హిట్టర్ అలెక్స్ హేల్స్‌ను డకౌట్ చేయగా.. అఘా సల్మాన్‌ను మొహమ్మద్ అలీ (2) పెవిలియన్‌కు పంపాడు. 4 ఓవర్ల తర్వాత ఇస్లామాబాద్ స్కోర్ 38/2గా ఉంది. షాదాబ్ ఖాన్ (8 బంతుల్లో 13; 2 ఫోర్లు), కొలిన్ మున్రో (10 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. -
విధ్వంసకర సెంచరీ.. 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో! వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో ముల్తాన్ సుల్తాన్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. తాజాగా కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముల్తాన్ ఘన విజయం సాధించింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసింది. కరాచీ బ్యాటర్లలో షోయబ్ మాలిక్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు షాన్ మసూద్(36) పరుగులతో రాణించాడు. ముల్తాన్ సుల్తాన్స్ బౌలర్లలో ఉసమా మీర్ రెండు వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ విల్లీ, మహ్మద్ అలీ, క్రిస్ జోర్డాన్, కుష్దుల్ షా తలా ఒక్క వికెట్ సాధించారు. ఉస్మాన్ ఖాన్ విధ్వంసకర సెంచరీ.. అంతకముందు బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ముల్తాన్ ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కరాచీ బౌలర్లను ఉస్మాన్ ఖాన్ ఊచకోత కోశాడు. కేవలం 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 106 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(58) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక ఈ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ముల్తాన్ సుల్తాన్ ఖారారు చేసుకుంది. USMAN KHAN, TAKE A BOW! 🙇 Second HBL PSL 💯 for the Sultans star 👏#HBLPSL9 | #KhulKeKhel | #KKvMS pic.twitter.com/DCP60FJwoD — PakistanSuperLeague (@thePSLt20) March 3, 2024 -
ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. విధ్వంసం సృష్టించిన ఇఫ్తికార్, హెండ్రిక్స్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మరో భారీ స్కోర్ నమోదైంది. లాహోర్ ఖలందర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ డకౌటైనా సుల్తాన్స్ ఏ మాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేశారు. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, సిక్స్), ఇఫ్తికార్ అహ్మద్ (18 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడగా.. వికెట్‌కీపర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ (55 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. వీరికి తయ్యబ్ తాహిర్ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు) జత కలిశాడు. లాహోర్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాత్‌వైట్, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుండగా.. ముల్తాన్ సుల్తాన్స్ 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్, ఇస్తామాబాద్ యునైటెడ్ వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి. -
PSL 2023: టీ20 మ్యాచ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు! 43 బంతుల్లో 120 రన్స్‌తో..
Quetta Gladiators vs Multan SultansWorld Record: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో ముల్తాన్ సుల్తాన్స్ సంచలన విజయాలు నమోదు చేస్తోంది. పెషావర్ జల్మీతో మ్యాచ్‌లో 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముల్తాన్ జట్టు.. శనివారం నాటి మ్యాచ్‌లో మరో రికార్డు విజయం సాధించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన రిజ్వాన్ బృందం.. క్వెటా గ్లాడియేటర్స్‌ను ఇంటికి పంపింది. వివరాలు.. రావల్పిండిలో మార్చి 11న ముల్తాన్ సుల్తాన్స్, క్వెటా గ్లాడియేటర్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన గ్లాడియేటర్స్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ముల్తాన్ ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ పరుగుల సునామీ సృష్టించాడు. పరుగుల సునామీ 43 బంతుల్లోనే 12 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 120 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఏకంగా 279.07 స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. మరో ఓపెనర్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 29 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. వీరిద్దరికి తోడు టిమ్ డేవిడ్ 43, పొలార్డ్ 23 పరుగులతో రాణించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. పీఎస్ఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముల్తాన్ సుల్తాన్స్ కేవలం 3 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. తద్వారా పీఎస్ఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన క్వెటా గ్లాడియేటర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జేసన్ రాయ్.. 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 37, వన్‌డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్ 67 పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరితో పాటు ఐదో స్థానంలో వచ్చిన ఇఫ్తికర్ అహ్మద్ అర్ధ శతకం(53)తో రాణించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టోర్నీ నుంచి అవుట్ మిగతా వాళ్ల నుంచి సహకారం లేకపోవడంతో 20 ఓవర్లలో 253 పరుగులు మాత్రమే చేయగలిగింది మహ్మద్ నవాజ్ బృందం. దీంతో 9 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. 4 ఓవర్లలో 47 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చి గ్లాడియేటర్స్ పతనాన్ని శాసించిన అబ్బాస్ ఆఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 515 పరుగులు.. రికార్డు బద్దలు ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి ఏకంగా 515 పరుగులు నమోదు చేయడం విశేషం. ఈ క్రమంలో సౌతాఫ్రికా టీ20 చాలెంజ్-2022లో టైటాన్స్- నైట్స్ జట్లు నమోదు చేసిన 501 పరుగుల రికార్డు బద్దలైంది. టీ20 ఫార్మాట్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన మ్యాచ్‌గా ముల్తాన్- గ్లాడియేటర్స్ మ్యాచ్ చరిత్రకెక్కింది. ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ క్వెటా గ్లాడియేటర్స్ స్కోర్లు: ముల్తాన్ సుల్తాన్స్- 262/3 (20) క్వెటా గ్లాడియేటర్స్- 253/8 (20) చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్! Usain Bolt: పది క్షణాల్లో ప్రపంచాన్ని జయించడం అంటే ఇదేనేమో! అప్పుడు దారితప్పినా.. 🚨RAINING RECORDS🚨 5⃣1⃣5⃣: This is the highest match aggregate in T20 cricket in the world. #HBLPSL8 I #SabSitarayHumaray | #QGvMS pic.twitter.com/xlzynehkGr — PakistanSuperLeague (@thePSLt20) March 11, 2023 🚨 𝐇𝐀𝐓𝐓𝐑𝐈𝐂𝐊 𝐅𝐎𝐑 𝐀𝐅𝐑𝐈𝐃𝐈 🚨 FIRST hattrick of the #HBLPSL8 Abbas Afridi on a ROLL 🕺🏻 #SabSitarayHumaray | #QGvMS pic.twitter.com/sM3KCdQUMG — PakistanSuperLeague (@thePSLt20) March 11, 2023 -
కాలచక్రమే సాక్షి!
కాలం దేవుని అపార శక్తి సామర్థ్యాలకు, అసాధారణ కార్యదక్షతకు నిదర్శనం. అందుకే కాలాన్ని సాక్షిగా పెట్టి అనేక యదార్ధాలు చెప్పాడు దైవం. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే కాలం చెప్పిన అనేక వాస్తవాలు కళ్ళకు కనిపిస్తాయి. ఈ సత్యాన్ని విశ్వసించి తదనుగుణంగా మంచిపనులు చెయ్యాలి. ధర్మబద్ధ కార్యాలు ఆచరించాలి. సమస్త పాపకార్యాలకు. అన్యాయం, అధర్మాలకు దూరంగా ఉండాలి. సత్యంపై స్ధిరంగా ఉన్న కారణంగా కష్టనష్టాలు ఎదురు కావచ్చు. మనోవాంఛలను త్యాగం చేయాల్సి రావచ్చు. అవినీతి, అణచివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, సత్యమార్గాన పయనిస్తున్న క్రమంలో కష్టాలు, కడగండ్లు సంభవించొచ్చు. ఇలాంటి అన్నిసందర్భాల్లో మనిషి విశ్వాసానికి నీళ్ళొదలకుండా, సత్యంపై, న్యాయంపై, ధర్మంపై స్ధిరంగా ఉంటూ సహనం వహించాలి. పరస్పరం సత్యాన్ని, సహనాన్ని బోధించుకుంటూ, దేవునిపై భారం వేసి ముందుకు సాగాలి. ఇలాంటి వారు మాత్రమే ఇహపర లోకాల్లో సాఫల్యం పొందుతారని, మిగతావారు నష్టపోతారని మనకు అర్ధమవుతోంది. కాలం విలువను గుర్తించినవారు మాత్రమే వాటినుండి గుణపాఠం నేర్చుకుంటారు. అలా కాకుండా గతకాలాన్ని గాలికొదిలేసి, కొత్త సంవత్సరంలో చైతన్య రహిత చర్యలతో, అర్ధం పర్థం లేని కార్యకలాపాలతో కొత్తకాలాన్ని ప్రారంభిస్తే ప్రయోజనం శూన్యం. కాలం ఎవరి కోసమూ ఆగదు. రాజులు రారాజులు, మాన్యులు, సామాన్యులు, పండితులు, పామరులు అంతా కాలగర్భంలో కలిసి పోయినవారే, కలిసి పోవలసినవారే. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. గతం నుండి గుణపాఠం గ్రహిస్తూ భవిష్యత్తును ప్రారంభించాలి. నిస్సందేహంగా కొత్త సంవత్సరాన్ని సంతోషంగా స్వాగతించాల్సిందే. కాని ఆ సంతోషంలో హద్దుల్ని అతిక్రమించ కూడదు. నిషిద్ధ కార్యాలకు నూతన సంవత్సరంలో తావు లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా అందరూ కాలం విలువను గుర్తించి, విశ్వాస బలిమితో సత్యంపై స్థిరంగా ఉంటూ, మంచి పనులు చేస్తూ, ప్రజలకు మంచిని, సత్యాన్ని, సహనాన్ని గురించి బోధిస్తూ, స్వయంగా ఆచరిస్తూ సాఫల్యం పొందడానికి ప్రయత్నించాలి. దైవం మనందరికీ భవిష్యత్ కాలాన్ని దివ్యంగా మలచుకునే సద్బుద్ధిని ప్రసాదించాలని, సమస్త మానవాళికీ సన్మార్గ భాగ్యం ప్రాప్తం కావాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
లండన్ బ్రిడ్జి ఉగ్రవాది.. పాత నేరస్తుడే
లండన్: లండన్‌లోని ‘లండన్ బ్రిడ్జి’పై శుక్రవారం కత్తితో పొడిచి ఇద్దరిని హతమార్చిన ఉగ్రవాది ఉస్మాన్‌ఖాన్(28) గతంలో ఉగ్రవాద నేరాలపై ఏడేళ్ల క్రితం శిక్ష అనుభవించిన విషయాన్ని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు వెల్లడించారు. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజిపై బాంబు దాడికి యత్నించినందుకు, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని నడిపినందుకు ఉస్మాన్‌ఖాన్‌కు గతంలో జైలుశిక్ష పడింది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఉస్మాన్.. పెరోల్‌పై బయటికొచ్చి శుక్రవారం లండన్ బ్రిడ్జిపై పేట్రేగిపోయాడు. కత్తితో పొడిచి ఇద్దరిని హతమార్చిన ఉస్మాన్ మరో ముగ్గురిని గాయపరిచాడు. ఉస్మాన్‌కు ఉగ్రనేరాలపై 2012లో శిక్ష పడింది. 2018లో లైసెన్స్ (పెరోల్)పై జైలు నుంచి విడుదలయ్యాడు. -
జీవిత సత్యం
ఓ ముగ్గురు స్నేహితులు పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్ళారు. అక్కడ ఒక పెద్దహోటల్ లో 75 వ అంతస్తులో రూమ్ బుక్ చేసుకున్నారు. ఆ హోటల్ నిబంధనల ప్రకారం రాత్రి పదకొండు గంటలకల్లా రూంకు చేరుకోవాలి. పదకొండు దాటితే లిఫ్ట్ పనిచేయదు. ఈవిషయం తన కష్టమర్లకు ముందుగానే చెప్పారు హోటల్ నిర్వాహకులు. ఆలస్యంగా వచ్చినవాళ్ళు పై అంతస్తులకు వెళ్ళాలంటే చుక్కలు చూడాల్సిందే. మొదటిరోజు ముగ్గురు స్నేహితులూ సమయానికే చేరుకున్నారు.కాని రెండవ రోజు కాస్తంత ఆలస్యమైంది. వచ్చేసరికి లిఫ్ట్ కు తాళంవేసి ఉంది. ఏంచెయ్యాలో అర్థం కాలేదు. 75 అంతస్తులంటే మాటలా? అయినా చేసేదేమీ లేదు. గదికి వెళ్ళాలంటే కాళ్ళకు బుధ్ధిచెప్పాల్సిందే. అలసట తెలియకుండా ఉండడంకోసం ఒక స్నేహితుడు సరదాగా ముచ్చట్లు, కథలు చెప్పడం ప్రారంభించాడు. అలా సరదాగా ఆడుతూ పాడుతూ పాతిక అంతస్తులు సునాయాసంగా అధిగమించారు. తరువాత రెండవ స్నేహితుడు బంధాలు, బాధ్యతలకు సంబంధించిన వాస్తవగాథలు వినిపిస్తుండగా మరో పాతిక అంతస్తులు అధిగమించారు. ఇక చివరి పాతిక అంతస్తులు మిగిలాయి. మూడవ స్నేహితుడు బాధలు, కష్టాలు, కడగండ్లకు సంబంధించిన కథలు, జీవన సత్యాలను విడమరిచి చెబుతుంటే, వాటిని జీర్ణించుకోడానికి ప్రయత్నిస్తూ, పడుతూ లేస్తూ, ఆపసోపాలు పడుకుంటూ ఎలాగోలా తమ గదివరకూ చేరుకున్నారు. తీరా పైకి వెళ్ళిన తరువాత గదితాళాలు కింద వాహనంలోనే మరచి వచ్చామన్నసంగతి గుర్తొచ్చింది వారికి. ఖచ్చితంగా ఇలానే ఉంది ఈనాటి మన పరిస్థితి. మన జీవితకాలంలోని మొదటి ఇరవై పాతిక సంవత్సరాలు బాల్యం, యవ్వనం, చదువు, ఆట పాటల్లోనే గడిచి పోతోంది. మిగతా పాతిక సంవత్సరాలు కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, బంధాలు, బాధ్యతలతో గడిచి పోతోంది. ఇక మిగిలిన పాతిక సంవత్సరాలు బాధలు, నొప్పులు, వృద్ధాçప్యం, ఆరోగ్య సమస్యలతో జీవితం భారంగా గడుస్తోంది. చివరికి గమ్యానికి చేరుకునే సరికి ఏమీ మిగలడం లేదు. రిక్తహస్తాలతోనే సమాధికి చేరిపోతున్నాం. అప్పుడుగాని అసలు విషయం గుర్తుకు రావడం లేదు. ప్రాపంచిక జీవనవ్యామోహంలో పడి సత్కర్మలు అనే తాళం చెవులు మరిచిపోయి వచ్చామని. అసలు వెంట తేవలసిన వాటినే తీసుకురాలేదని. మరలా వెనక్కి వెళ్ళడానికి, వెళ్ళి తీసుకురావడానికి అవకాశమే ఉండదు.అయినప్పటికీ కొంతమంది అడుగుతారట.. ‘ప్రభూ.. మాకు మరొక్కసారి అవకాశాన్ని ప్రసాదించు. మమ్మల్ని ఇహలోకానికి పంపు. మేము ఎలాంటి తలబిరుసు తనానికి పాల్పడకుండా, నువ్వుచెప్పినట్లే నడుచుకుంటాము.’ అని మొరపెట్టుకుంటారట. కాని వారికి అలాంటి అవకాశమే ఇవ్వబడదు. అందుకని చావుపుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ జీవన వ్యవధిని సద్వినియోగం చేసుకుంటూ సత్కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి. సమాధికి చేరడానికి ముందే తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
పాకిస్తాన్ ఘన విజయం
జొహన్నెస్‌బర్గ్: పాకిస్తాన్ బౌలర్లు తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఆదివారం ఇక్కడ జరిగిన నాలుగో వన్డేలో పాక్ 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ‘పింక్ వన్డే’లో గతంలో ఆడిన ఏడు సార్లూ గెలిచిన సఫారీ జట్టుకు తొలిసారి పరాజయం ఎదురైంది. ముందుగా దక్షిణాఫ్రికా 41 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. హషీం ఆమ్లా (59; 7 ఫోర్లు), డు ప్లెసిస్ (57; 5 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు. ఆరు బంతుల వ్యవధిలో 4 వికెట్లు పడగొట్టిన ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఉస్మాన్ షిన్వారి (4/35) దక్షిణాఫ్రికాను దెబ్బ తీశాడు. షాహిన్ ఆఫ్రిది, షాదాబ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం పాక్ 31.3 ఓవర్లలో 2 వికెట్లకు 168 పరుగులు సాధించింది.ఇమామ్ ఉల్ హఖ్ (71; 6 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా...ఫఖర్ జమాన్ (44; 7 ఫోర్లు), బాబర్ ఆజమ్ 41 నాటౌట్; 2 ఫోర్లు) రాణించారు. ప్రస్తుతం సిరీస్ 2–2తో సమంగా నిలవగా, చివరి వన్డే బుధవారం జరుగుతుంది. సర్ఫరాజ్‌పై 4 మ్యాచ్‌ల నిషేధం దక్షిణాఫ్రికా ఆటగాడు ఆండిల్ ఫెలుక్వాయోపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి 4 మ్యాచ్‌ల నిషేధం విధించింది. ఫలితంగా అతను ఈ సిరీస్‌లో రెండు వన్డేలతో పాటు టి20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. నాలుగో వన్డేలో షోయబ్ మాలిక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఐసీసీ చర్యపై పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు ఘటనపై సర్ఫరాజ్ బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు ఫెలుక్వాయోను కూడా వ్యక్తిగతంగా కలిసి మన్నించమని కోరిన విషయాన్ని గుర్తు చేసింది. తాము సర్ఫరాజ్‌ను క్షమించినట్లు డు ప్లెసిస్ చెప్పినా ఐసీసీ ఇంత తీవ్రంగా స్పందించడంతో నిరాశ చెందామని పీసీబీ అధికారులు వ్యాఖ్యానించారు. -
అమ్మానాన్నలను ఆదరిస్తే అల్లాను ఆరాధించినట్లే!
అల్లాహ్ తరువాత మానవులకు అత్యంత ఆదరణీయులు, గౌరవనీయులు తల్లిదండ్రులే. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, సేవాభావం లేని మానవజన్మ నిరర్ధకం అంటున్నది ఖురాన్. కాని దురదృష్టవశాత్తు ఈనాడు తల్లిదండ్రుల్ని సంతానం పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు తరచు వినబడుతున్నాయి. అంతేకాదు, సంతానం తమను చూడడం లేదని తల్లిదండ్రులు న్యాయస్థానాల మెట్లెక్కుతున్న దృష్టాంతాలను కూడా చూడవలసిన పరిస్థితులు దాపురించాయి. ఒక ఐఏఎస్ అధికారి తన తల్లిని గుర్తుతెలియని అనాథ అని చెప్పి వృద్ధాశ్రమంలో చేర్పించినట్లు ఒక ఆశ్రమ నిర్వాహకుడు ఇటీవల జరిగిన ఒక టీవీ చర్చలో వెల్లడించారు. తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడేవారి బాగోగులు చూసుకుంటూ, వారికి సేవలు చేసి వారి ప్రేమను పొందాలి. వారి జీవితకాలంలో ఆప్యాయంగా ప్రేమగా చూసుకోకుండా తదనంతరం ఎన్ని చేసినా వ్యర్థమే. తల్లిదండ్రుల్ని పట్టించుకోని వారిని సమాజమూ ఆదరించదు, దైవమూ మెచ్చుకోడు. పైగా అలాంటి వారిని దైవం శిక్షిస్తాడు. ఇహలోకంలోనూ పరాభవం పాలు చేస్తాడు, పరలోకంలోనూ నరక శిక్షకు గురిచేస్తాడు. అందుకే మమతలమూర్తి ముహమ్మద్ స.సల్లం ‘తల్లిపాదాల చెంత స్వర్గమున్నదని, తండ్రి స్వర్గానికి సింహద్వారమని, వారిసేవ చేసి వారి ప్రేమను, ఆశీర్వాదాలనుపొంది, వారిని ప్రసన్నం చేసుకోకపోతే స్వర్గప్రవేశం అసాధ్యమని’ ఉపదేశించారు. కాబట్టి బాల్యంలో వారు మనల్ని ఎంత ప్రేమతో, కరుణతో, వాత్సల్యంతో పెంచి పోషించారో, వారి వృద్ధాప్యంలో మనం వారికి అంతకంటే ఎక్కువ ప్రేమానురాగాలతో సేవలు చేయాలి. పసితనంలో వారు ఒక్క క్షణం నిర్లక్ష్యం చేసి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. కనుక వారి బాగోగుల్ని, వారి ఆరోగ్యాన్ని, వారి మానసిక స్థితిగతుల్ని పట్టించుకోవాలి. వారిని ఎప్పుడూ ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించాలి. వారు నొచ్చుకునే విధంగా, వారి మనసుకు కష్టం కలిగే విధంగా ప్రవర్తించకూడదు. కసురుకోకూడదు. ఇంటిదగ్గర ఉన్న తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరడం అజ్ఞానం, అవివేకమే తప్ప మరేమీ కాదు. అల్లాహ్ మనందరికీ తల్లిదండ్రుల సేవ చేసి, వారి ఆశీర్వాదాలు పొంది తన కృపకు పాత్రులయ్యే భాగ్యం ప్రసాదించాలని కోరుకుందాం. – ఎండీ. ఉస్మాన్ ఖాన్ -
అంతా మన మంచికే...
ఇస్లాం వెలుగు ఒక్కోసారి అనుకోకుండా కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. అంతా దైవ నిర్ణయం. కాని అందులో శుభం ఉంటుంది. మంచైనా, చెడైనా దైవ నిర్ణయమని తలచడం విశ్వాసుల లక్షణం. పూర్వం యుద్ధరంగంలో ఒక రాజుకు చేతివేలు తెగిపోయింది. ఈ విషయం తెలిసి అందరూ వచ్చి పరామర్శించి వెళుతున్నారు. మంత్రి కూడా వచ్చి రాజుగార్ని పరామర్శించాడు. ‘మాషా అల్లాహ్... దేవుడు తాను తలచింది చేస్తాడు. అందులో శుభం ఉంటుంది. ఏది ఏమైనా అంతా మనమంచికే.’ అని ఊరడించాడు. కానీ రాజుకు తీవ్రమైన కోపం వచ్చింది. వెంటనే మంత్రిని కొలువునుండి తొలగించమని ఆదేశించాడు. మంత్రి ‘మాషా అల్లాహ్... దైవం తాను తలిచింది చేస్తాడు. అందులోనే శుభం ఉంది.’ అంటూ ఇంటిముఖం పట్టాడు. ఇంతలో రాజ్యం నుండి కూడా బహిష్కరించమని మరోఆజ్ఞ జారీ అయింది. దీంతో మంత్రి రాజ్యం విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడూ రాజు తన చేతిని చూసుకొని బాధపడుతూ ఉండేవాడు. ఒకసారి వేటకు బయలుదేరాడు. అడవిలో ఓ అందమైన లేడి కనిపించింది. దాన్ని పట్టుకోవాలని అశ్వాన్ని దౌడు తీయించాడు. ప్రాణభయంతో లేడి అడ్డదిడ్డంగా పరుగులు పెట్టసాగింది. రాజుకూడా అశ్వాన్ని దౌడుతీయిస్తున్నాడు. ఈ క్రమంలో వెంట ఉన్న రక్షణ దళం బాగా వెనుకబడి, రాజును సమీపించలేకపోయింది. కీకాకారణ్యంలో లేడి అదృశ్యమైపోయింది. బాగా అలసిపోయిన రాజు ఓ చెట్టుకింద మేనువాల్చాడు. నిద్రలోకి జారుకున్నాడు. మెలకువ వచ్చేసరికి అక్కడి పరిస్థితి అంతా చిత్రవిచిత్రంగా ఉంది. దేవతకు నరబలి ఏర్పాట్లు జరుగుతున్నాయక్కడ. అడవి మనుషులు పసుపు కుంకుమలు చల్లి, రకరకాల అలంకారాలతో రాజును బలిపీఠం ఎక్కించారు. తల తెగనరికేముందు నఖ శిఖ పర్యంతం పరిశీలించిన పూజారి అతణ్ణి బలివ్వడానికి తిరస్కరించాడు. ఏ లోపమూలేని బలినే దేవత స్వీకరిస్తుందని చెప్పడంతో వారు రాజును విడిచి పెట్టారు. రాజు రాజధానికి చేరుకున్నాడు. ’మాషా అల్లాహ్’ మర్మం తెలిసొచ్చిన రాజు వెంటనే మంత్రి ఎక్కడున్నా వెతికి సగౌరవంగా తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. మంత్రి రాగానే నమస్కరించి, గుండెలకు హత్తుకుని, పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ‘నా వేలు తెగినప్పుడు, నన్ను సహనం వహించమని, దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడని చెప్పారు. మీమాట నిజమైంది. కాని, నేను మిమ్మల్ని పదవిలోంచి తీసేసి దేశబహిష్కారం చేసినప్పుడు కూడా మీరు అదేమాట అన్నారు. కారణం ఏమిటి?’ అని ప్రశ్నించాడు. ‘‘రాజా! మీరు నన్ను పదవిలోంచి తొలగించకుండా, రాజ్యబహిష్కారం చేయకుండా ఉండి ఉంటే, నేను కూడా మీతోపాటు వచ్చి ఉండేవాడిని. మీ వెన్నంటే ఉండేవాడిని. వేలు తెగిన లోపం వల్ల మీకు విముక్తి లభించినా, ఏలోపమూ లేని నన్ను బలిపీఠం ఎక్కించి తెగనరికేవారు. ఆరోజు నన్ను పదవినుండి తొలగించడం వల్లనేకదా బతికి పోయాను. దేవుడుఏది చేసినా మనమంచికే చేస్తాడు. మాషా అల్లాహ్! అంటూ నవ్వాడు మంత్రి. ఈసారి ప్రేమగా కౌగిలించుకున్నాడు రాజు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అబ్బాయికి... బాబాయ్ అండ
ప్రవక్త జీవితం ప్రేమ, వాత్సల్యం నిండిన మాటలు ముహమ్మద్ ప్రవక్త(స)ను కదిలించాయి. ధర్మమార్గంలో ఒకదాని తర్వాత మరొకటిగా అనేక అవాంతరాలు. వీటన్నిటినీ అధిగమించి ముహమ్మద్ ప్రవక్త తన ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతారా? లేక వయసు పైబడిన బాబాయి ముఖం చూసి ఉద్యమాన్ని విరమించుకుంటారా? ప్రపంచం విశ్వాస కాంతితో పునీతమై, మిరుమిట్లు గొలుపుతుందా? అంధకారంలో కూరుకుపోతుందా? కాలం స్తంభించి, యావత్ సృష్టి అవాక్కయి, ముహమ్మద్ ప్రవక్త సమాధానం కోసం ఎదురుచూస్తోంది. ‘బాబాయీ! దైవసాక్షిగా చెబుతున్నా. ఒకవేళ ఈ అవిశ్వాసులు కుడి చేతిలో చంద్రుణ్ణి, ఎడమ చేతిలో సూర్యుణ్ణి తెచ్చిపెట్టి, నా పని మానుకోమన్నా నా ధర్మ ప్రచారాన్ని మానుకోను. నేను తలపెట్టిన (దైవం నాకు అప్పగించిన) కార్యమైనా పరిపూర్ణం కావాలి. లేక ఈ మార్గంలో నా ప్రాణమైనా పోవాలి’ అని ముహమ్మద్ ప్రవక్త అన్నారు స్థిరనిశ్చయంతో.. అబూ తాలిబ్ ఆశ్చర్యంతో ఆయన వైపు చూశారు. ఎంతటి దృఢనిర్ణయం! తన జాతి తనతో ఎలా ప్రవర్తిస్తుందన్న బెంగా లేదు. కళ్ళ ముందు అంతటి ప్రమాదాన్ని చూస్తూకూడా కించిత్ బెదురు లేకుండా నమ్మిన సిద్ధాంతం కోసం తనను తాను త్యాగం చేయాలన్న ఆ మనోైధర్యానికి అబూ తాలిబ్ కదిలిపోయారు. ఆయన ధైర్యానికీ, మనో నిబ్బరానికీ అబూ తాలిబ్ ఎంతో ప్రభావితులయ్యారు.ముహమ్మద్ (స) చిన్నగా బయటికి నడిచారు. ఆయన కళ్ళలో సన్నని కన్నీటి ధార. ‘బాబాయి అండ కూడా లేకుండా పోతుందా?’ ఆయన మనసు బాధతో బరువెక్కింది.అంతలో... ‘బాబూ... ముహమ్మద్...!’ అంటూ అబూ తాలిబ్ పిలుపు. ప్రవక్త వెనుదిరిగి చూశారు. ఆయన కళ్ళలో సన్నని కాంతి. రెండే అంగల్లో బాబాయిని సమీపించారు. ‘బాబూ..! నువ్వు ఏం చేయదలుచుకున్నావో నిరభ్యంతరంగా చేసుకో. నీ ధర్మప్రచారాన్ని కొనసాగించుకో. నా బొందిలో ప్రాణమున్నంత దాకా నేను నీకు తోడుగా ఉంటా’ అన్నారు అబూ తాలిబ్. బాబాయి నోట ఈ మాట వినగానే ఆయన మనసు ఆనంద తరంగాల్లో ఓలలాడింది. అబ్బాయి సహాయం కోసం అబూ తాలిబ్ నడుం కట్టారు. తమ వారందరినీ సమావేశపరిచారు. మక్కాలోని ఖురైష్ తెగల వారంతా ముహమ్మద్ వెంట పడ్డారనీ, వాళ్ళ బెదిరింపులు ఒక స్థాయిని దాటి ‘ముహమ్మద్‌ను చంపుతాం’ అనే దాకా వెళ్ళిందనీ చెప్పారు. ‘ముహమ్మద్ మాటలతో, అతని ప్రచారంతో వారికి విభేదం ఉంటే, దాన్ని వారు తిరస్కరించవచ్చు. అంతేగాని ముహమ్మద్‌ను తమకు అప్పగించమనీ, అతణ్ణి చంపేస్తామనీ అనే అధికారం వారికెలా ఉంటుంది? మనమంతా ఏకతాటిపై నిలిచి వాళ్ళ ఆగడాలను ఎదుర్కోవాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలు తెలుసుకుందామనే మిమ్మల్ని సమావేశ పరిచాను’ అన్నారు అబూ తాలిబ్ గంభీరంగా. - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతాది వచ్చేవారం) ఒక్క అబూలహబ్ తప్ప, అందరూఅబూతాలిబ్ మాటలతో ఏకీభవించారు.ముహమ్మద్ (స) నుఒంటరిగా వదిలిపెట్టబోమని ప్రకటించారు. ఇన్నాళ్ళూసహించి ఊరుకున్నాం. ఇకసహించే ప్రసక్తేలేదు’. అన్నారందరూ ముక్తకంఠంతో..అబూలహబ్ మాత్రం కుటుంబ సభ్యులతో విభేధించి శతపక్షంలో చేరిపొయ్యాడు.ఈ విషయం ముహమ్మద్ కు చెబుదామని చాలా సంతోషంగా బయలుదేరారుఅబూతాలిబ్ . కాని ఆయన ఇంట్లోలేరు. ఎటువెళ్ళారో తెలియదన్నారు ఇంట్లోవాళ్ళు. అబూతాలిబ్ మనసు కీడుశంకించింది. దుర్మార్గులు అబ్బాయికి ఏమైనా కీడుతలపెట్టారేమో అని తీవ్రఆందోళన చెందారు. వెంటనే ఆయనయువకులందర్నీ సమీకరించి, కరవాలాలు తీసుకొని తనవెంట బయలు దేరమన్నారు. క్షణాల్లో యువకులంతా ఆయుధాలు తీసుకొని బయలుదేరారు. అబూతాలిబ్ సూచన మేరచుఅవి కనబడకుండా చొక్కాల్లోపల దాచుకున్నారు. అబూతాలిబ్ నేరుగా కాబాైవపుదారితీశారు. దారిలో ప్రవక్త పెంపుడు కొడుకు ైజద్ బిన్ హారిసా (ర) ఎదురు పడి ఏమిటీ విషయమని ఆరా తీశారు. ’ముహమ్మద్ (స) హంతకుల నుండి ప్రతీకారం తీర్చుకోవడాని కని బదులిచ్చారు అబూతాలిబ్ . ’అదేమిటీ..ఆయన నిక్షేపంగా కాబాలో ఉన్నారు. నేనిప్పుడు ఆయన దగ్గరినుండే వస్తున్నాను’. అన్నారు ైజద్ జద్ మాటలతో అబూతాలిబ్ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆయనమనసుకు ప్రశాంతత చేకూరింది. అయినా కాబాలయానికి వెళ్ళి అబ్బాయిని కళ్ళారా చూసుకోవాలని ముందుకు సాగారు. అకస్మాత్తుగా అబూతాలిబ్ బనూహాషిం యువకుల్ని వెంటబెట్టుకొని రావడం చూసి అవిశ్వాసులు ఆశ్చర్యపొయ్యారు. ప్రశ్నార్ధకంగా వాళ్ళంతా ఒకరిముఖాలొకరు చూసుకోవడం చూసి, అబూతాలిబ్ ’ ఏమిటి ఆశ్చర్యపోతున్నారు? నేనిక్కడికి ఎందుకొచ్చానో తెలుసా?’ అనిప్రశ్నించారు.’దేవుని తోడు. మాకసలు ఏమీ తెలియదు.’ అన్నారువారంతా ముక్తకంఠంతో..అప్పుడు అబూతాలిబ్ విషయం వివరించి, యువకులైవపు ైసగ చేశారు. వెంటనే బనూహాషిం యువకిశోరాలు తాము లోపల దాచినఆయుధాలు బయటికి ప్రదర్శించారు.అప్పుడుఅబూతాలిబ్ ,’ ైదవసాక్షిగా చెబుతున్నాను. మీరుగనక మా ముహమ్మద్ కు హాని కలిగించి ఉన్నట్లయితే మిమ్మల్నికత్తికో కండగా కోసికుక్కల పాలు చేసేవాణ్ణి. ఒక్కణ్ణికూడా ప్రాణాలతో వదిలేవాణ్ణికాదు. మాప్రాణాలు పోయినా సరే, చివరి రక్తపుబొట్టువరకూమీతో పోరాడేవాణ్ణి’. అన్నారుయువకుల ఖడ్గప్రదర్శన, అబూతాలిబ్ ఉగ్రరూప వాగ్ధాటిని చూసి అవిశ్వాసుల గుండెలు జారిపొయ్యాయి. బిత్తరపోయి ఒకరిముఖాలొకరుచూసుకోవడం ప్రారంభించారు. - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతాది వచ్చేవారం) -
అవును.. నేను పాకిస్థానీనే: నవేద్
పాక్ ఎంత కాదన్నా.. నిజం నిప్పులా బయటపడింది. జమ్ము కాశ్మీర్‌లోని ఉధంపూర్ ప్రాంతంలో బీఎస్ఎఫ్ దళాలపై దాడిచేసి, పట్టుబడినది పాకిస్థానీ ఉగ్రవాదేనన్న విషయం స్పష్టంగా తేలిపోయింది. తాను పాకిస్థానీనేనని, లష్కరే తాయిబేనే తనకు శిక్షణ ఇచ్చిందని ఉధంపూర్ దాడుల్లో సజీవంగా పట్టుబడ్డ ఉగ్రవాది నవేద్ అంగీకరించాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్వహించిన పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్( పరీక్షలలో అతడు ఈ వివరాలు చెప్పాడు. భారత భద్రతా దళాలపై దాడులు చేయాల్సిందిగా తమను ఆదేశించి పంపారని కూడా అంగీకరించాడు. -
అవును.. వాడు మా అబ్బాయే!
అంగీకరించిన నావెద్ తండ్రి మహ్మద్ యాకూబ్ దురదృష్టవశాత్తు తానే అతడి తండ్రినని వెల్లడి లష్కరే తాయిబా, పాక్ సైన్యం వెంటాడుతున్నాయి మా అబ్బాయి చనిపోవాలని లష్కరే తాయిబా అనుకుంది ఉధంపూర్ దాడి అనంతరం సజీవంగా పట్టుబడిన నావెద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ అలియాస్ ఖాసింఖాన్ పాకిస్థానీయే అన్నే విషయం మరోసారి స్పష్టంగా రుజువైంది. అతడు తమ దేశానికి చెందినవాడు కాదని పాకిస్థాన్ చెప్పినా.. నావెద్ సొంత తండ్రే అతడి జాతీయతను నిర్ధరించారు. నావెద్ తన కొడుకేనని, దురదృష్టవశాత్తు తాను అతడి తండ్రినని ఆయన చెప్పారు. అయితే, ఇప్పుడు తమకు ప్రాణభయం ఉందని.. ఒకవైపు లష్కరే తాయిబా, మరోవైపు సైన్యం తమవెంట పడ్డాయని మహ్మద్ యాకూబ్ చెప్పారు. 'హిందూస్థాన్ టైమ్స్' పత్రిక అతడితో ఫోన్లో మాట్లాడింది. ''మీరు భారతదేశం నుంచి ఫోన్ చేస్తున్నారు.. ఈ విషయం తెలిస్తే మమ్మల్ని చంపేస్తారు. దురదృష్టవశాత్తు నేను నావెద్ తండ్రినే'' అని యాకూబ్ భయపడుతూ చెప్పారు. లష్కరే తాయిబా తమ కుటుంబాన్ని వెంటాడుతోందని.. బహుశా వాళ్లు నావెద్ అక్కడ చనిపోయి ఉండాలని అనుకున్నారేమోనని, కానీ అతడు సజీవంగా పట్టుబడటంతో తమకు ఇబ్బందులు వస్తున్నాయని ఆయన అన్నారు. దయచేసి అతడిని వదిలేయాలని లష్కరే తాయిబాకు విజ్ఞప్తి చేశాడు. కేవలం 20 సెకండ్లు మాత్రమే మాట్లాడిన యాకూబ్.. తర్వాత ఫోన్ కట్ చేసి, స్విచాఫ్ కూడా చేసేశారు. -
ఉగ్రవాద దాడులు చేయడం భలే సరదా
మా అసలు లక్ష్యం అమర్నాథ్ యాత్ర భారతసైన్యంపై కూడా దాడులు చేయాలనుకున్నాం హిందువులను చంపేందుకే ఇక్కడకు వచ్చా కశ్మీర్లో పట్టుబడ్డ ఉస్మాన్ ఖాన్ వెల్లడి ఉదంపూర్ ఉగ్రవాద దాడులు చేయడం భలే సరదాగా ఉంటుందని జమ్ము కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ చెప్పాడు. తమ లక్ష్యం అమర్నాథ్ యాత్ర, సరిహద్దుల్లో ఉన్న భారత సైన్యమేనని అన్నాడు. తాను పాకిస్థాన్ నుంచే వచ్చినట్లు వెల్లడించాడు. బీఎస్ఎఫ్ దళాలపై దాడి చేసి ఇద్దరు బీఎస్ఎఫ్ కానిస్టేబుళ్లను హతమార్చిన తర్వాత ఒక ఉగ్రవాది హతం కాగా, నావెద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ అలియాస్ ఖాసిం ఖాన్ మాత్రం సజీవంగా పట్టుబడిన విషయం తెలిసిందే. అతడి వయసు 20 ఏళ్లని అధికారులు గుర్తించారు. అలాగే మరణించిన ఉగ్రవాది పేరు నోమన్ అలియాస్ మొమిన్ ఖాన్ అని గుర్తించారు. హిందువులను చంపడానికే తాను వచ్చానని స్పష్టం చేశాడు. తనది పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్ అని, 12 రోజుల క్రితం మొమిన్ ఖాన్ అనే సహచర ఉగ్రవాదితో కలిసి వచ్చానన్నాడు. మొమిన్ ఖాన్‌ది పాకిస్థాన్‌లోని భాగల్పూర్ ప్రాంతం. డార్క్ బ్లూ కలర్ షర్టు, బ్రౌన్ రంగు ప్యాంటు వేసుకొచ్చిన నావెద్.. చాలా ఉల్లాసంగా కనిపించాడు. తాను కూడా సైన్యం చేతిలో చనిపోయి ఉంటే.. అది అల్లా దయేనని అనుకునేవాడినని, ఇదంతా చేయడం చాలా సరదాగా ఉంటుందని చెప్పాడు. మొదట తన వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమేనని చెప్పిన అతడు, తర్వాత విచారణలో అసలు వయసు వెల్లడించాడు. సాధారణంగా లష్కరే తాయిబా ఉగ్రవాదులు ఎప్పుడు పట్టుబడినా.. తమ వయసు 18 ఏళ్ల లోపేనని చెప్పాలని, అలా అయితే బాల నేరస్థులుగా పరిగణిస్తారని వాళ్లకు శిక్షణలో చెబుతారు. -
పన్నెండు రోజుల కిందటే దేశంలోకి..
ఉదంపూర్: పన్నెండు రోజుల కిందటే తాము భారత దేశంలోకి చొరబడ్డామని పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ తెలిపాడు. తాను చేస్తుంది తప్పని ఏమాత్రం భావించకుండా పైగా చతుర్లు విసిరినట్లుగా మాట్లాడుతూ బీఎస్ఎఫ్ బలగాల ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఈ రోజు ఉదయం ఉదంపూర్ సమీపంలో జమ్ము-శ్రీనగర్ హైవేపై వెళ్తున్న బీఎస్ఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని సైన్యం అదుపులోకి తీసుకోగా.. మరొకరు కాల్పుల్లో చనిపోయాడు. సైన్యం చేతికి చిక్కిన ఉస్మాన్ చుట్టూ పోలీసులు చుట్టు ముట్టి ప్రశ్నల వర్షం కురిపించగా అతడు తాఫీగా నవ్వుతూ సమాధానం చెప్పాడు. 'మేమిద్దరమే. పన్నెండు రోజుల కిందటే భారత్‌లోకి అటవీ మార్గం ద్వారా అడుగుపెట్టాం. అవును ఇక్కడికి ఏ బస్సు వస్తుంది' అని ఎదురు ప్రశ్నించారు. ఇన్ని రోజులు ఆహారం ఎవరు అందించారని ప్రశ్నించగా తాము తెచ్చుకున్న ఆహారం మూడు రోజుల్లో అయిపోయిందని, అందుకే ఓ ఇంటి తాళం పగుల గొట్టి సమకూర్చుకున్నామని బదులిచ్చాడు. తాము పాక్ లోని ఫైసలాబాద్‌కు చెందినవారిమని సమాధానం చెప్పాడు. ఫైసలాబాద్‌లో జైసే ఈ మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ప్రభావం ఎక్కువగా ఉంది. దీనిని మౌలానా మసూద్ అజర్ నడుపుతున్నాడు. -
వెండితెరకు సల్మాన్ జైలు జీవితం!
కండలవీరుడు సల్మాన్ ఖాన్ జింకలను వేటాడిన కేసులో జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఖైదీ నం. 210గా ఆయన శిక్ష అనుభవించారు. ఈ శిక్ష ఆధారంగా రంజిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ‘ఖైదీ నం.210’ చిత్రం ముంబయ్‌లో ఆరంభమైంది. సల్మాన్‌ని పోలినట్లుగా ఉండే ఉస్మాన్ ఖాన్ని టైటిల్ రోల్‌కి తీసుకున్నారు. సల్మాన్‌తో పాటు అప్పట్లో జైలులో ఉన్న మహేశ్ సైనీ అనే వ్యక్తి ఇందులో తన నిజజీవిత పాత్రను చేస్తున్నారు. సల్మాన్ జింకలను వేటాడిన సమయంలో ఆయన వాహనాన్ని నడిపిన డ్రైవర్ హరీష్ ధులానీని డ్రైవర్ పాత్రకు ఎంపిక చేశారు. ఆ వాహనాన్నే ఈ చిత్రంలో వాడనున్నారు. ఇది జీవిత చరిత్ర కాదు కాబట్టి ఎవరి దగ్గరా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదనీ, సల్మాన్‌ని చెడ్డవాడిగా చూపించే చిత్రం కాదనీ దర్శకుడు తెలిపారు. కాగా, ఈ కేసుకి సంబంధించిన తుది తీర్పు ఈ నెల 25న వెలువడనుంది. ఆ తీర్పుతో ఈ చిత్రం ముగుస్తుందని ఊహించవచ్చు. -
సద్విమర్శను స్వీకరిస్తేనే స్వర్గానికి సోపానం
తెలిసో, తెలియకో యాదృచ్ఛికంగా ఏదైనా పొరపాటు దొర్లిపోతే వెంటనే సరిదిద్దుకోవాలి. పశ్చాత్తాపం, క్షమాపణ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఎందుంకటే, ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఆచరణకు అవకాశాలు ఎప్పుడు మూసుకుపోతాయో ఎవరికీ తెలియదు. రానున్న క్షణం మనుగడకు హామీనిస్తుందో, మృత్యువునే వెంట తెస్తుందో మనకు తెలియదు. మనిషి ఎంత బలవంతుడో, అంత బలహీనుడు కూడా! అతని ద్వారా ఏదో ఒక తప్పు జరిగిపోతూనే ఉంటుంది. పొరపాటునో, గ్రహపాటునో ఏదో ఒక తప్పిదం దొర్లిపోవడం మానవ సహజం. మానవమాత్రులెవరూ దీనికి అతీతులు కాదు. అయితే, కావాలని కాకుండా కాకతాళీయంగా జరిగే చిన్న చిన్న తప్పుల్ని అల్లాహ్ క్షమిస్తాడు. కాని తెలిసీ, కావాలని బుద్ధిపూర్వకంగా మాటిమాటికీ చేసే పాపాలను మాత్రం క్షమించడు. కొంతమంది తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి, దాన్ని సరిదిద్దుకుంటే, మరికొంతమంది తప్పును అసలే అంగీకరించరు. ఒక తప్పును సమర్థించుకోవడానికి మళ్లీ మళ్లీ తప్పులు చేస్తారు. ఎవరైనా తప్పును తమ దృష్టికి తీసుకు వస్తే దాన్ని కప్పి పుచ్చుకోవడానికి వితండవాదం చేస్తారు తప్ప, తమ తప్పును సంస్కరించుకోవడానికి సుతరామూ ప్రయత్నించరు. కొద్దిమంది మాత్రమే విమర్శను స్వీకరించి సరిదిద్దుకుంటారు. సద్విమర్శను స్వీకరించడం వల్ల తప్పును తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. తద్వారా మళ్లీ ఆ తప్పు పునరావృతం కాకుండా చూసుకునే వీలు కలుగుతుంది. ఈ విధంగా తప్పును ఒప్పుకుని, పశ్చాత్తాప పడేవారు నిజమైన విశ్వాసులు. ఇలాంటి వారిని గురించి పవిత్ర ఖురాన్ ఇలా అంటోంది... వారివల్ల ఏదైనా నీతిమాలిన పనిగాని, పాపకార్యంగాని, జరిగిపోతే, వెంటనే వారు అల్లాహ్‌ను స్మరించి క్షమాపణ వేడుకుంటారు. అంతేగాని తాము చేసిన దానిపై వారు మంకుపట్టు పట్టరు. (3-135). పవిత్ర ఖురాన్లో మరోచోట ఇలా ఉంది. ‘‘దైవభీతిపరుల మదిలో ఎప్పుడైనా షైతాన్ ప్రేరణ వల్ల దురాలోచన జనిస్తే వెంటనే వారు అప్రమత్తులైపోతారు. ఆ తరువాత అనుసరించాల్సిన విధానం ఏమిటో వారికి స్పష్టంగా తెలిసిపోతుంది (7-201). ‘‘మీరు దైవాన్ని క్షమాపణ కోరుకుని ఆయన వైపు మరలండి. నిస్సందేహంగా మీ ప్రభువు అమిత దయాళువు. ఆయనకు తన దాసుల పట్ల అపారమైన ప్రేమానురాగాలు ఉన్నాయి’’ (11-90)మరొకచోట ఇలా ఉంది: ‘‘ఆత్మలకు అన్యాయం చేసుకున్న నా దాసులారా! దైవకారుణ్యం పట్ల నిరాశ చెందకండి. దైవం తప్పకుండా మీ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత దదాళువు. కనుక మీపై దైవశిక్షవచ్చి, మీకు ఎలాంటి సహాయం లభించని స్థితి రాకుముందే పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపు మరలండి. ఆయనకు పూర్తిగా విధేయులైపొండి (39-54).జ పవిత్ర ఖురాన్‌లోని ఈ దివ్య వాక్యాల ద్వారా మనకు తెలిసేదేమంటే, సాధ్యమైనంత వరకూ ఏ చిన్న తప్పూ జరగకుండా ఉండటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయాలి. ఒకవేళ తెలిసో, తెలియకో యాదృచ్ఛికంగా ఏదైనా పొరపాటు దొర్లిపోతే వెంటనే సరిదిద్దుకోవాలి. పశ్చాత్తాపం, క్షమాపణ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే, ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఆచరణకు అవకాశాలు ఎప్పుడు మూసుకుపోతాయో ఎవరికీ తెలియదు. రానున్న క్షణం మనుగడకు హామీనిస్తుందో, మృత్యువునే వెంట తెస్తుందో మనకు తెలియదు. అందుకని, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లుగా, శ్వాస ఉండగానే ఆశతో సాగిలపడి దైవకారుణ్యాన్ని అన్వేషించాలి. జరిగిన తప్పుల పట్ల మనస్పూర్తిగా పశ్చాత్తాప పడాలి. సిగ్గుపడాలి. ఇకముందు అలాంటివి జరగని విధంగా దృఢనిర్ణయం తీసుకుని, దానిపై స్థిరంగా ఉండాలి. భావిజీవితాన్ని సంస్కరించుకుంటూ, అడుగడుగునా సింహావలోకనం చేసుకుంటూ, సాధ్యమైనంత మేర సత్కార్యాల్లో లీనమవ్వాలి. దైవకారుణ్యంపట్ల సదా ఆశ కలిగి ఉండాలి. ఈవిధంగా మనసా, వాచా, కర్మణా, ఆశావహ దృక్పథంతో, ధర్మబద్ధమైన జీవితం గడిపితే ఇహలోకంలోనూ, పరలోకంలోనూ దైవప్రసన్నత పొంది, శాశ్వత అమర సుఖాలకు పాత్రులు కావచ్చు. - యండీ ఉస్మాన్ ఖాన్ -
పరోపకారమే పరలోక సాఫల్యానికి పునాది
ప్రజలు ఈ సాహిత్యం, ఈ బోధనలు, ఉపదేశాలద్వారా ప్రయోజనం పొందుతున్నంతకాలం తరతరాల పుణ్యఫలమంతా వారి సత్కర్మల చిట్టాలో నమోదవుతుంది. పుట్టిన ప్రతిప్రాణీ గిట్టవలసిందే! తాత్కాలికమైన ఇహలోక జీవితంలో శాశ్వత జీవితానికి పనికి వచ్చే కర్మలు ఆచరించాలి. నీతినిజాయితీలతో ఆచరించిన సత్కర్మలే పరలోకంలో పనికొస్తాయి. ఇహలోక జీవన సుఖసంతోషాల కోసం అడ్డదారులు తొక్కితే తీవ్రపరిణామాలను చవిచూడవలసి ఉంటుంది. కనుక ఇహలోక జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటూనే శాశ్వత ప్రయోజనాలను సమకూర్చే సత్కర్మల పట్ల దృష్టి పెట్టాలి. మానవుడి శ్వాస ఆగిన మరుక్షణం అతడి కర్మల క్రమం తెగిపోతుంది. ఆ ద్వారం మూసుకుపోతుంది. కర్మల ఫలితం కనిపించకుండా కనుమరుగవుతుంది. కాని మూడు రకాల కర్మలకు సంబంధించిన సత్ఫలితాలు మాత్రం సదా అతని ఖాతాలో జమ అవుతూనే ఉంటాయి. వాటి పుణ్యఫలం నిరంతరం అందుతూనే ఉంటుంది. వీటిలో మొదటిది ప్రజలకు ఎప్పుడూ ప్రయోజనం చేకూర్చే సత్కార్యం. దీన్ని ధార్మిక పరిభాషలో సదఖమే జారియా అంటారు. ఉదాహరణకు మంచి నీటి బావి తవ్వించడం, బోరు వేయించడం, పాఠశాల నిర్మాణం, మసీదును కట్టించడం, బాటసారులకు ఉపయోగపడే విధంగా సత్రం కట్టించడం, రెండు గ్రామాల మధ్య నది, కాలువ కారణంగా రాకపోకలు స్తంభించి ప్రజలకు ఇబ్బందిగా ఉన్నప్పుడు వంతెన నిర్మించడం, కల్వర్టులు కట్టించడం లేదా మరేవిధంగానైనా ప్రజలకు దీర్ఘకాలిక, శాశ్వత ప్రయోజనం చేకూర్చే పనులు చేయడంతోబాటు విద్యాసంస్థలను నెలకొల్పడం, పేదసాదలకు ఎప్పుడూ ప్రయోజనం కలిగేలా ట్రస్టులను ఏర్పాటు చేయడం... ఇవన్నీ సదఖమే జారియా కిందికే వస్తాయి. మరొకటి... ధార్మిక విద్యా విజ్ఞానాలు. ప్రజలను నైతికంగా, ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దే విద్యాబోధన. ముఖ్యంగా పవిత్ర ఖుర్ ఆన్, ప్రవక్త మహనీయులవారి ప్రవచనాలు, ఆదేశాలు, హితోపదేశాలు. వీటిని ప్రజలకు పరిచయం చేయడం, ఉత్తమ సాహిత్య సృజన, ప్రచురణ , పంపిణీలు కూడా ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే సత్కార్యాలుగానే పరిగణింపబడతాయి. వీటి ద్వారా కూడా పుణ్యఫలం లభిస్తూనే ఉంటుంది. ప్రజలు ఈ సాహిత్యం, ఈ బోధలు, ఉపదేశాలద్వారా ప్రయోజనం పొందుతున్నంతకాలం తరతరాల పుణ్యఫలమంతా వారి కర్మల చిట్టాలో నమోదవుతుంది. ఇకమూడవది: ఉత్తమ సంతానం. తల్లిదండ్రులు జీవించి ఉన్నంతకాలం వారికి ఏవిధమైన లోటూ రాకుండా ఎవరైతే ప్రేమతో సేవలు చేస్తూ, వారి పర్యవేక్షణలో, సంరక్షణలో ఉత్తముడిగా, దైవభక్తిపరాయణుడిగా తీర్చిదిద్దబడతారో, అలాంటి వారి కర్మల పుణ్యఫలం కూడా నిరంతరం లభిస్తూనే ఉంటుంది. అంటే తమ శిక్షణలో, తమ పర్యవేక్షణలో సంతానం ఉత్తములుగా తయారై సత్కర్మలు ఆచరిస్తే, ఆ సత్కర్మల పుణ్యఫలం వారికి సదా లభిస్తూనే ఉంటుంది. అంతే కాదు... ఆ సంతానం తమ తల్లిదండ్రులకోసం నిరంతరం ప్రార్థిస్తూ కూడా ఉంటుంది. ఆ దు ఆ లను కూడా దైవం స్వీకరించి, వారికి ఉత్తమ పుణ్యఫలాన్ని ప్రసాదిస్తూనే ఉంటాడు. అందుకని ప్రజల తాత్కాలిక అవసరాలు తీర్చడంతోపాటు, దైవప్రవక్త మహనీయులు ప్రవచించినట్లు దీర్ఘకాలిక, శాశ్వత ప్రజాసంక్షేమ కార్యకలాపాల్లో అధికంగా పాలుపంచుకోవాలి. పవిత్ర ఖురాన్ బోధనలను, ముహమ్మద్ ప్రవక్త (స) ప్రవచనాలను ప్రజలకు పరిచయం చేసి, నిజమైన ధర్మావలంబీకులుగా మలచే ప్రయత్నం చేయాలి. నైతిక, మానవీయ విలువలను ప్రజానీకంలో ప్రోది చేయడానికి శక్తివంచనలేని కృషి చేయాలి. తల్లిదండ్రులు జీవించి ఉంటే, వారినికంటికి రెప్పలా చూసుకుంటూ, వారి సేవలో తరించాలి. ఒకవేళ ఇహలోకం వీడిపోతే సదా వారికోసం ప్రార్థిస్తూ ఉండాలి. మరణం ఒక పచ్చి నిజం. దీనికి ఎవరూ అతీతులు కారు. అది ఎప్పుడొస్తుందో, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి తాత్కాలికమైన ఈ జీవితంలో నీతి నిజాయితీలతో బతకాలి. ధర్మబద్ధమైన జీవన విధానం అవలంబించాలి. అప్పుడే మానవ జీవితం సార్థకమవుతుంది. పరలోక జీవితం సఫలమవుతుంది. - యండి ఉస్మాన్ ఖాన్ -
పరస్పర సహకారంతోనే సమాజం సుభిక్షం
ప్రవక్త ప్రవచించినట్లు, సాటివారి కష్టాలను దూరం చెయ్యడం, వారి బాధల్లో పాలు పంచుకోవడం, అన్న వస్త్రాలు, గృహవసతి లాంటి ప్రాథమిక అవసరాలు తీర్చడంతోపాటు, పీడన, వివక్ష, అసమానతలు లేని సమాజం ఆవిష్కృతమైతే ఇంకా అంతకంటే కావలసినదేముంటుంది? సమాజం సుభిక్షంగా ఉండాలంటే, మానవుల మధ్య పరస్పర సంబంధ బాంధవ్యాలు సజావుగా, సామరస్య పూర్వకంగా, ప్రేమమయంగా ఉండాలి. హజ్రత్ అబూ హురైరా (రజి) కథనం ప్రకారం, ఈ విషయాన్ని దైవప్రవక్త ముహమ్మద్ (స) ఇలా విశదీకరించారు... ‘‘ఒక వ్యక్తి మరో వ్యక్తికి సంభవించే ప్రాపంచిక ఆపదల్లో కనీసం ఒకదాన్నయినా సరే దూరం చేసినట్లయితే, దైవం ఆ వ్యక్తిని ప్రళయదినం నాటి ఆపదల్లో ఒకదాన్నుండి కాపాడతాడు. వస్త్రాలు లేనివారికి వస్త్రాలు సమకూరిస్తే, దైవం పరలోకంలో అతనికి ఆచ్ఛాదన కలుగజేస్తాడు. సాటి మానవుల కష్టాలు తీర్చడంలో, వారికి సాయం చెయ్యడంలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో, అలాంటి వారి కష్టాలు తీర్చడంలో వారికి సాయం చేయడంలో దైవం లీనమై ఉంటాడు. జ్ఞానసముపార్జన కోసం, దాన్ని సర్వసామాన్యం చెయ్యడంకోసం కృషి చేస్తున్నవారికి దైవం స్వర్గమార్గాన్ని సుగమం చేస్తాడు. ఎవరైతే దైవగృహాల్లో సమావేశమై దైవగ్రంథాన్ని పారాయణం చేస్తారో, దాన్ని ఇతరులకు ఉపదేశిస్తారో, అలాంటి వారి హృదయాలకు దైవం శాంతి, సాంత్వన కలుగజేస్తాడు. ఆకలి, అజ్ఞానం, పేదరికం, దోపిడీ, పీడన, అసమానత, అమానవీయతల్లేని సమసమాజ నిర్మాణానికి మనమీనాడు ముహమ్మద్ ప్రవక్త (స) వారి ఈ బోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈనాటి మన మానవ సమాజంలో కనిపిస్తున్న అన్ని లోపాలకూ, అవలక్షణాలకూ, రుగ్మతలకూ ఈ బోధనల్లో పరిపూర్ణ పరిష్కారం ఉంది. ప్రవక్త ప్రవచించినట్లు, సాటివారి కష్టాలను దూరం చెయ్యడం, వారి బాధల్లో పాలు పంచుకోవడం, అన్న వస్త్రాలు, గృహవసతి లాంటి ప్రాథమిక అవసరాలు తీర్చడంతోపాటు, పీడన, వివక్ష, అసమానతలు లేని సమాజం ఆవిష్కృతమైతే ఇంకా అంతకంటే కావలసినదేముంటుంది? కాని మానవుల్లో స్వార్థం ఉన్నంతకాలం సాటివారి పట్ల సానుభూతి, ప్రేమ జనించనంతకాలం ఇది అసాధ్యం. మానవుల్లో ఈ సుగుణాలు జనించాలంటే దైవంపై అచంచల విశ్వాసం ఉండాలి. ఆయన తన ప్రవక్త ద్వారా మానవులకు అందజేసిన హితోపదేశాలను హృదయపూర్వకంగా ఆచరించకపోతే, దైవానికి సంజాయిషీ చెప్పుకోవలసి ఉంటుందన్న భయం ఉండాలి. ఆయన ఆదేశాలను పాటించకపోతే శిక్షిస్తాడన్న భీతితోపాటు, చిత్తశుద్ధితో ఆచరిస్తే అనంతంగా సంతోషించి చక్కటి ప్రతిఫలం ప్రసాదిస్తాడన్న ఆశ ఉండాలి. ఈ విధంగా దైవభీతి, పరలోక చింతన కలిగి, నైతిక, ఆధ్యాత్మిక పరివర్తనతో జీవితం గడిపితే నిజంగానే మానవ సమాజం శాంతి సౌభాగ్యాలతో, సుభిక్షంగా వర్థిల్లుతుంది. కాబట్టి ప్రవక్త మహనీయుని హితోపదేశాలను పాటిస్తూ, ఆకలి, దారిద్య్రం, అసమానతల్లేని ఓ సుందర సత్సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం. - యండి ఉస్మాన్‌ఖాన్