ఉస్మాన్‌ ఖాన్‌ ఊచకోత.. విధ్వంసం సృష్టించిన ఇఫ్తికార్‌, హెండ్రిక్స్‌ | PSL 2024: Usman Khan Slams Blasting 96 Runs, Multan Sultans Scores 214 For 4 Vs Lahore Qalandars | Sakshi
Sakshi News home page

PSL 2024: ఉస్మాన్‌ ఖాన్‌ ఊచకోత.. విధ్వంసం సృష్టించిన ఇఫ్తికార్‌, హెండ్రిక్స్‌

Published Tue, Feb 27 2024 9:41 PM | Last Updated on Wed, Feb 28 2024 1:17 PM

PSL 2024: Usman Khan Slams Blasting 96 Runs, Multan Sultans Scores 214 For 4 Vs Lahore Qalandars - Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌లో మరో భారీ స్కోర్‌ నమోదైంది. లాహోర్‌ ఖలందర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ డకౌటైనా సుల్తాన్స్‌ ఏ మాత్రం తగ్గకుండా బ్యాటింగ్‌ చేశారు. మరో ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, సిక్స్‌), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (18 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడగా.. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ (55 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశాడు.

వీరి​కి తయ్యబ్‌ తాహిర్‌ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు) జత కలిశాడు. లాహోర్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాత్‌వైట్‌, సికందర్‌ రజా తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ లీగ్‌లో లాహోర్‌ ఖలందర్స్‌ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట​ పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుండగా.. ముల్తాన్‌ సుల్తాన్స్‌ 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. క్వెట్టా గ్లాడియేటర్స్‌, పెషావర్‌ జల్మీ, కరాచీ కింగ్స్‌, ఇస్తామాబాద్‌ యునైటెడ్‌ వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement