iftikar anmed
-
ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. విధ్వంసం సృష్టించిన ఇఫ్తికార్, హెండ్రిక్స్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మరో భారీ స్కోర్ నమోదైంది. లాహోర్ ఖలందర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ డకౌటైనా సుల్తాన్స్ ఏ మాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేశారు. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, సిక్స్), ఇఫ్తికార్ అహ్మద్ (18 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడగా.. వికెట్‌కీపర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ (55 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. వీరికి తయ్యబ్ తాహిర్ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు) జత కలిశాడు. లాహోర్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాత్‌వైట్, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుండగా.. ముల్తాన్ సుల్తాన్స్ 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్, ఇస్తామాబాద్ యునైటెడ్ వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి. -
పాక్ బ్యాటర్ విధ్వంసం.. కేవలం 11 బంతుల్లోనే? వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో ముల్తాన్ సుల్తాన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. బుధవారం లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ముల్తాన్ ఘన విజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముల్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(59 బంతుల్లో 82, 9 ఫోర్లు,3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరిలో సుల్తాన్స్ మిడిలార్డర్ బ్యాటర్ ఇఫ్తికర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 పరుగులు చేసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. 19 ఓవర్ వేసిన లహోర్ పేసర్ జమాన్ ఖాన్‌కు ఇఫ్తి భాయ్ చుక్కలు చూపించాడు. ఏకంగా ఆ ఓవర్లో 24 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను ముగించేశాడు. డగౌట్ నుంచి ఇఫ్తికర్ విధ్వంసం చూసిన రిజ్వాన్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతంలో కూడా ఇఫ్తికర్ పాక్ జట్టుకు ఎన్నో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. లాహోర్ బ్యాటర్లలో వండర్ డస్సెన్(54) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముల్తాన్ బౌలర్లలో మహ్మద్ అలీ రెండు వికెట్లు పడగొట్టగా.. అఫ్రిది, ఉసామా మీర్ తలా వికెట్ పడగొట్టారు. చదవండి: AFG vs SL: నరాలు తెగే ఉత్కంఠ.. శ్రీలంకకు ఊహించని షాకిచ్చిన అఫ్గాన్ IFTI MANIA 🤯 Enough said...#HBLPSL9 | #KhulKeKhel | #MSvLQ pic.twitter.com/uXqkWv2btV — PakistanSuperLeague (@thePSLt20) February 21, 2024 -
Asia Cup 2023: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. రికార్డు శతకం నమోదు
ఆసియా కప్ 2023లో భాగంగా ముల్తాన్ వేదికగా నేపాల్‌తో ఇవాళ (ఆగస్ట్ 30) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో 109 బంతులు ఎదుర్కొన్న బాబర్ 10 బౌండరీల సాయంతో కెరీర్లో 19వ శతకాన్ని నమోదు చేశాడు. తద్వారా వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 15వ స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ సెంచరీల రికార్డును (19) సమం చేసి, సయీద్ అన్వర్ (20) తర్వాత పాక్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన పాక్ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అత్యంత వేగంగా 19 వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా.. వన్డే క్రికెట్లో బాబర్ ఆజమ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా 19 సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బాబర్‌కు 19 సెంచరీలు సాధించేందుకు కేవలం 102 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరమయ్యాయి. వన్డే క్రికెట్ చరిత్రలో ఏ ఇతర ఆటగాడు ఇంత వేగంగా 19 సెంచరీల మార్కును అందుకోలేదు. బాబర్‌కు ముందు ఈ రికార్డు సౌతాఫ్రికా హషీమ్ ఆమ్లా (104 ఇన్నింగ్స్‌ల్లో) పేరిట ఉండేది. రన్ మెషీన్ విరాట్ కోహ్లి 124, ఏబీ డివిలియర్స్ 171 ఇన్నింగ్స్‌ల్లో 19 సెంచరీల మార్కును అందుకున్నారు. కాగా, నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొత్తంగా 131 బంతులు ఎదుర్కొన్న బాబర్.. 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 151 పరుగులు చేసి ఔటయ్యాడు. -
స్పోర్ట్స్ మినిస్టర్‌కు చుక్కలు చూపించిన పాకిస్తాన్ బ్యాటర్.. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు
పాకిస్తాన్ స్పోర్ట్స్ మినిస్టర్ వాహబ్ రియాజ్‌కు అదే దేశానికి చెందిన అంతర్జాతీయ ప్లేయర్ ఇఫ్తికార్ అహ్మద్ చుక్కలు చూపించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2023 సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో (ఫిబ్రవరి 5) వాహబ్ రియాజ్ బౌలింగ్‌లో ఇఫ్తికార్ అహ్మద్ వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు. Iftikhar Ahmed smashed 6 sixes in a single over in the PSL exhibition match.pic.twitter.com/s3NRRmrcZl — Johns. (@CricCrazyJohns) February 5, 2023 ఈ మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడిన ఇఫ్తికార్ (50 బంతుల్లో 94 నాటౌట్).. పెషావర్ జల్మీ తరఫున ఆడిన వహబ్ రియాజ్‌పై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఇఫ్తికార్ ప్రాతినిధ్యం వహించిన క్వెట్టా గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 42 బంతులు తీసుకున్న ఇఫ్తికార్.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 36 పరుగులు పిండుకుని 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇఫ్తికార్ సిక్సర్ల సునామీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. Mere chotay bhai @IftiAhmed221 ne sports minister @WahabViki ka bhi lehaz nahi kiya 🤷. Minister sb ko easy na lein, he will bounce back too. Great to see the love and support shown by the people of Quetta. They deserve the best. pic.twitter.com/gwTsw4aPHT — Shadab Khan (@76Shadabkhan) February 5, 2023 ఈ వీడియోపై పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు ఆ జట్టు క్రికెటర్ షాదాబ్ ఖాన్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా చిన్న అన్న ఇఫ్తికార్ స్పోర్ట్స్ మినిస్టర్ అని కూడా చూడకుండా ఉతికి ఆరేశాడు. మినిస్టర్ కూడా తిరిగి పుంజుకుంటాడు అంటూ ట్వీట్ చేశాడు. పాక్ అభిమానులు సైతం ఇదే తరహా కామెంట్లతో సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. కాగా, వాహబ్ రియాజ్ ఇటీవలే పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు క్రీడా శాఖ మంత్రిగా ఎంపికైన విషయం తెలిసిందే. అతను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతుండగానే పాక్‌లో ఈ ప్రకటన చేశారు. -
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం.. పాక్ బ్యాటర్ ఊచకోత
Bangladesh Premier League 2023: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2023 సీజన్లో సంచలన ప్రదర్శనలు నమోదయ్యాయి. రంగ్‌పూర్ రైడర్స్‌తో ఇవాళ (జనవరి 19) జరుగుతున్న మ్యాచ్‌లో ఫార్చూన్ బారిషల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పాక్ ఆటగాడు ఇఫ్తికార్ అహ్మద్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. అతని జతగా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (43 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) కూడా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడటంతో ఫార్చూన్ బారిషల్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇది బీపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక టీమ్ టోటల్‌గా రికార్డుల్లోకెక్కింది. 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో జత కట్టిన ఇఫ్తికార్-షకీబ్ ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో అజేయమైన 192 పరుగులు జోడించారు. బీపీఎల్ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇఫ్తికార్-షకీబ్ జోడీ ఇన్నింగ్స్ ఆఖరి 3 ఓవర్లలో (18వ ఓవర్లో 22, 19వ ఓవర్లో 24, 20వ ఓవర్లో 27) నమ్మశక్యం కాని రీతిలో 73 పరుగులు జోడించి బీపీఎల్‌లో చరిత్ర సృష్టించింది. ఇఫ్తికార్-షకీబ్ జోడీ.. ప్రత్యర్ధి స్పిన్నర్లను ఊచకోత కోసింది. కాగా, బీపీఎల్ ప్రస్తుత సీజన్లో షకీబ్ సారధ్యంలోని ఫార్చూన్ బారిషల్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. టాప్ ప్లేస్‌లో సిల్హెట్ స్ట్రయికర్స్ (6 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు) టీమ్ ఉంది. కొమిల్లా విక్టోరియన్స్, రంగ్‌పూర్ రైడర్స్, చట్టోగ్రామ్ ఛాలెంజర్స్, ఖుల్నా టైగర్స్, ఢాకా డామినేటర్స్ వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నాయి. ఈ లీగ్‌లో పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు కొందరు భారత ఆటగాళ్లు (బీసీసీఐతో సంబంధం లేని వాళ్లు) కూడా పాల్గొంటున్నారు. -
ఇది పాక్ క్రికెటర్లకే సాధ్యం.. 13 ఏళ్లకు సేమ్‌సీన్ రిపీట్
వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగిన టి20 సిరీస్‌ను పాకిస్తాన్ గెలుచుకుందనే విషయం కంటే మరొక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాఫిక్‌గా మారింది. పాకిస్తాన్ ఆటగాళ్లు ఇఫ్తికార్ అహ్మద్, మొహ్మద్ హస్నేన్లు చేసిన పని పాక్ జట్టును ట్రోల్స్ బారిన పడేలా చేసింది. ఇద్దరి మధ్య ఏర్పడిన సమన్వయ లోపంతో విండీస్ బ్యాట్స్‌మన్ బ్రూక్స్ ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశారు. తప్పు నీదంటే నీది అని కాసేపు వాదోపవాదాలు చేసుకున్నారు. ఆ సమయంలో తమ చెత్త ఫీల్డింగ్‌తో 13 ఏళ్ల కింద జరిగిన సంఘటనను రీక్రియేట్ చేశామని పాపం వారికి తెలియదు. ఇదే వారి కొంపముంచింది. అసలు విషయం ఏంటంటే.. 2008లో అచ్చం ఇదే తరహాలో షోయబ్ మాలిక్, సయీద్ అజ్మల్‌లు సమన్వయ లోపంతో ఒక క్యాచ్‌ను వదిలేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అప్పుడు, ఇప్పుడు ప్రత్యర్థి వెస్టిండీస్ కావడం విశేషం. సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ ఇఫ్తికార్ అహ్మద్, మొహ్మద్ హస్నేన్లను ట్యాగ్ చేస్తూ.. మాలిక్, అజ్మల్ 2.0 అంటూ ట్రోల్ చేశారు. ''ఏదైనా పాక్ క్రికెటర్లకే సాధ్యం.. చరిత్రను తిరగరాశారు''.. '' హస్నేన్ క్యాచ్ వదిలేసి సయీద్ అజ్మల్ గౌరవాన్ని పెంచాడు.''.. ''న్యూ అజ్మల్, మాలిక్‌లు.. బట్ సేమ్ ఓల్డ్ వెస్టిండీస్'' అంటూ కామెంట్స్ పెట్టారు. Hasnain & ifti 🤝 Malik & ajmal On both occasions opponent was west indies 😂😂❤️ #PAKvWI pic.twitter.com/YQj12liy5P — Saad Irfan 🇵🇰 (@SaadIrfan967) December 16, 2021 -
తల్లి చెంతకు చేరిన పాక్ బాలుడు
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చెందిన ఓ ఐదేళ్ల బాలుడిని భారత అధికారులు శనివారం ఆ దేశానికి అప్పగించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వాఘా సరిహద్దు వద్ద ఆ బాలుడు అమ్మ ఒడికి చేరాడు. వివరాలు.. ఇఫ్తికర్ అహ్మద్ అనే బాలుడిని అతడి తండ్రి ఇండియాకు తీసుకొచ్చాడు. తల్లి వద్ద నుంచి ఇఫ్తికర్‌ను అతడు బలవంతంగా తీసుకొని దేశం దాటాడు. అప్పటి నుంచి బాలుడి కోసం అల్లాడుతున్న ఆ తల్లి హృదయాన్ని అర్థం చేసుకున్న భారత అధికారులు.. ఇవాళ ఇఫ్తికర్‌ను తల్లి చెంతకు చేర్చారు. పొరపాటున బార్డర్ దాటిన ఓ సైనికుడిని పాక్ ఇటీవల భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.