న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చెందిన ఓ ఐదేళ్ల బాలుడిని భారత అధికారులు శనివారం ఆ దేశానికి అప్పగించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వాఘా సరిహద్దు వద్ద ఆ బాలుడు అమ్మ ఒడికి చేరాడు.
వివరాలు.. ఇఫ్తికర్ అహ్మద్ అనే బాలుడిని అతడి తండ్రి ఇండియాకు తీసుకొచ్చాడు. తల్లి వద్ద నుంచి ఇఫ్తికర్‌ను అతడు బలవంతంగా తీసుకొని దేశం దాటాడు. అప్పటి నుంచి బాలుడి కోసం అల్లాడుతున్న ఆ తల్లి హృదయాన్ని అర్థం చేసుకున్న భారత అధికారులు.. ఇవాళ ఇఫ్తికర్‌ను తల్లి చెంతకు చేర్చారు. పొరపాటున బార్డర్ దాటిన ఓ సైనికుడిని పాక్ ఇటీవల భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.
తల్లి చెంతకు చేరిన పాక్ బాలుడు
Published Sat, Feb 4 2017 7:59 PM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM
Advertisement
Advertisement