wagah
-
పాక్ మరో దుందుడుకు నిర్ణయం
జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు అనంతరం పాకిస్తాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత్‌తో వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకున్న పాకిస్తాన్ తాజాగా భారత్-పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగించే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను శాశ్వతంగా నిలిపివేసింది. దీంతో వాఘా సరిహద్దులోని అంతర్జాతీయ రైల్వేస్టేషన్లో చాలా మంది ప్రయాణికులు చిక్కుకు పోయారు. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగిస్తూ, ఆర్టికల్ 370ను రద్దుచేసిన భారత్ చర్యను నిరసిస్తూ పాకిస్తాన్ సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను సస్పెండ్ చేసింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను శాశ్వతంగా నిలిపివేసినట్టు పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వెల్లడించారు. ఇప్పటికే టిక్కెట్లు కొన్న వ్యక్తులు తమ డబ్బును లాహోర్ డిఎస్ కార్యాలయం నుంచి వాపస్ పొందవచ్చని పేర్కొన్నారు. భద్రతా కారణాల రీత్యా ఈ చర్య తీసుకున్నామని పాకిస్తాన్ చెబుతోంది. అలాగే పాకిస్తాన్ సినిమాహాళ్లలో భారతీయ చిత్రాల ప్రదర్శనను కూడా నిలిపివేస్తున్నట్టు పాకిస్తాన్ ప్రధాని స్పెషల్ అసిస్టెంట్ డాక్టర్ ఫిర్దౌస్ ఆశిక్ అవన్ ప్రకటించడం గమనార్హం. అయితే రైలును తిరిగి భారతకు పంపించాల్సిన బాధ్యత పొరుగు దేశం పాక్‌దేనని రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ అరవింద్ కుమార్ తెలిపారు. వీసా ఉన్న డ్రైవర్, ఇతర సిబ్బందిని పంపి రైలును తిరిగి ఇండియాకు తీసుకెళ్లాల్సిందిగా పాక్ తెలిపినట్టు చెప్పారు. కాగా 1976వ సంవత్సరంలో జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం సంఝౌతా ఎక్స్‌ప్రెస్ భారత, పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగిస్తోంది. ఫ్రెండ్షిప్ ఎక్స్‌ప్రెస్‌గా పిలిచే ఈ రైలు ప్రతి బుధ, ఆదివారాల్లో ఢిల్లీ, అటారీ , పాకిస్తాన్ లోని లాహోర్ స్టేషన్ల మధ్య నడుస్తుంది. -
బీటింగ్ రిట్రీట్ వేడుక రద్దు
-
వాఘాలో పాగా!
భారతదేశంలోని అమృత్సర్, పాకిస్తాన్‌లోని లాహోర్ నగరాలను కలిపే రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాఘా గ్రామంలో పాగా వేశారు సల్మాన్‌ఖాన్ అండ్ కత్రినా కైఫ్. ఇంతకీ సల్మాన్, కత్రినా భారత్‌కు వస్తున్నారా? లేక పాకిస్తాన్ వెళ్తున్నారా? అనే విషయాలు వెండితెరపై తెలుసుకోవాలి. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, దిశా పాట్నీ, జాకీ ష్రాఫ్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘భారత్’. సౌత్ కొరియన్ మూవీ ‘ఓడ్ టు మై ఫాదర్’కి ఇది రీమేక్. ఈ సినిమా తాజా షెడ్యూల్ పంజాబ్‌లోని లూధియానాలో ప్రారంభమైంది. సల్మాన్, కత్రినాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షెడ్యూల్‌ను వాఘా గ్రామంలో ప్లాన్ చేశారు చిత్రబృందం. కానీ అనుమతి లభించకపోవడంతో లూధియానాలోనే వాఘా గ్రామ సరిహద్దు సెట్‌ను భారీ స్థాయిలో ఏర్పాటు చేసి, చిత్రీకరణ జరుపుతున్నారట. ఈ షెడ్యూల్ మరో వారం రోజులపాటు సాగుతుంది. ‘భారత్’ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది. -
బాంబ్ స్క్వాడ్ డాగ్ ‘వాఘా’ మృతి
అనంతపురం సెంట్రల్ : పోలీసు శాఖకు 12 సంవత్సరాలుగా సేవలందిస్తున్న బాంబ్ స్క్వాడ్ డాగ్ ‘వాఘా’ అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ పక్కన అధికారిక లాంఛనాలతో వాఘా అంత్యక్రియలు పూర్తి చేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు త్రిలోక్‌నాథ్, కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, నాయకులు మసూద్, ఏఆర్ ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
తల్లి చెంతకు చేరిన పాక్ బాలుడు
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చెందిన ఓ ఐదేళ్ల బాలుడిని భారత అధికారులు శనివారం ఆ దేశానికి అప్పగించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వాఘా సరిహద్దు వద్ద ఆ బాలుడు అమ్మ ఒడికి చేరాడు. వివరాలు.. ఇఫ్తికర్ అహ్మద్ అనే బాలుడిని అతడి తండ్రి ఇండియాకు తీసుకొచ్చాడు. తల్లి వద్ద నుంచి ఇఫ్తికర్‌ను అతడు బలవంతంగా తీసుకొని దేశం దాటాడు. అప్పటి నుంచి బాలుడి కోసం అల్లాడుతున్న ఆ తల్లి హృదయాన్ని అర్థం చేసుకున్న భారత అధికారులు.. ఇవాళ ఇఫ్తికర్‌ను తల్లి చెంతకు చేర్చారు. పొరపాటున బార్డర్ దాటిన ఓ సైనికుడిని పాక్ ఇటీవల భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.