పాకిస్తాన్ స్పోర్ట్స్ మినిస్టర్ వాహబ్ రియాజ్‌కు అదే దేశానికి చెందిన అంతర్జాతీయ ప్లేయర్ ఇఫ్తికార్ అహ్మద్ చుక్కలు చూపించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) 2023 సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో (ఫిబ్రవరి 5) వాహబ్ రియాజ్ బౌలింగ్‌లో ఇఫ్తికార్ అహ్మద్ వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు.
Iftikhar Ahmed smashed 6 sixes in a single over in the PSL exhibition match.pic.twitter.com/s3NRRmrcZl
— Johns. (@CricCrazyJohns) February 5, 2023
ఈ మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడిన ఇఫ్తికార్ (50 బంతుల్లో 94 నాటౌట్).. పెషావర్ జల్మీ తరఫున ఆడిన వహబ్ రియాజ్‌పై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఇఫ్తికార్ ప్రాతినిధ్యం వహించిన క్వెట్టా గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 42 బంతులు తీసుకున్న ఇఫ్తికార్.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో 36 పరుగులు పిండుకుని 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇఫ్తికార్ సిక్సర్ల సునామీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
Mere chotay bhai @IftiAhmed221 ne sports minister @WahabViki ka bhi lehaz nahi kiya 🤷. Minister sb ko easy na lein, he will bounce back too. Great to see the love and support shown by the people of Quetta. They deserve the best. pic.twitter.com/gwTsw4aPHT
— Shadab Khan (@76Shadabkhan) February 5, 2023
ఈ వీడియోపై పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు ఆ జట్టు క్రికెటర్ షాదాబ్ ఖాన్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా చిన్న అన్న ఇఫ్తికార్ స్పోర్ట్స్ మినిస్టర్ అని కూడా చూడకుండా ఉతికి ఆరేశాడు. మినిస్టర్ కూడా తిరిగి పుంజుకుంటాడు అంటూ ట్వీట్ చేశాడు. పాక్ అభిమానులు సైతం ఇదే తరహా కామెంట్లతో సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. కాగా, వాహబ్ రియాజ్ ఇటీవలే పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు క్రీడా శాఖ మంత్రిగా ఎంపికైన విషయం తెలిసిందే. అతను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతుండగానే పాక్‌లో ఈ ప్రకటన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment