Wahab Riaz
-
‘చెప్పాల్సినవి చాలా ఉన్నాయి.. కానీ ఎవరినీ నిందించను’
పాకిస్తాన్ క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా పనిచేయడం తనకు దక్కిన గొప్ప గౌరవం అని మాజీ పేసర్ వహాబ్ రియాజ్ అన్నాడు. అయితే, అనూహ్య రీతిలో ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వాపోయాడు.అయినప్పటికీ ఈ విషయంలో తాను ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్లో గత కొంతకాలంగా అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే.నాలుగేళ్ల కాలంలో ఏకంగా ఆరుగురు చీఫ్ సెలక్టర్లుగా వ్యవహరించారు. హరూన్ రషీద్, షాహిద్ ఆఫ్రిది, ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ వసీం, మిస్బా ఉల్ హక్, వహాబ్ రియాజ్ ఈ జాబితాలో ఉన్నారు.అయితే, ఎవరి హయాంలోనూ పాక్ జట్టు అంత గొప్ప అద్భుతాలేమీ సాధించలేకపోయింది. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల్లో దారుణ వైఫల్యాలు చవిచూసింది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపైనా ఆ జట్టు మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా వహాబ్ రియాజ్ వ్యవహారశైలి పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఒకప్పటి సహచర ఆటగాడు మహ్మద్ ఆమిర్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడం, ఇమాద్ వసీం రీఎంట్రీ తదితర విషయాల్లో వహాబ్పై విమర్శలు వచ్చాయి.ఇక టీ20 ప్రపంచకప్ తాజా ఎడిషన్‌లో అమెరికా చేతిలో పాక్ ఓటమికి ఆమిర్(సూపర్ ఓవర్లో 18 పరుగులు ఇచ్చాడు) కారణం కావడంతో విమర్శల పదును పెరిగింది.ఈ క్రమంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన పీసీబీ సైతం వహాబ్ రియాజ్ సహా సెలక్షన్ కమిటీలో భాగమైన అబ్దుల్ రజాక్‌పై కూడా వేటు వేసింది. వీళ్లిద్దరిని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు బుధవారం వెల్లడించింది.ఈ విషయంపై స్పందించిన వహాబ్ రియాజ్ చీఫ్ సెలక్టర్‌గా తన పనిని సక్రమంగానే నిర్వర్తించానని పేర్కొన్నాడు. అంతర్గతంగా ఎన్నో జరిగాయన్న రియాజ్.. అయితే, వాటి గురించి ప్రస్తావన అనవసరమని, బ్లేమ్ గేమ్స్‌కు తాను దూరంగా ఉంటానని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.లక్షన్ కమిటీని సంప్రదించిన తర్వాతే తాను నిర్ణయాలు తీసుకున్నానని.. అయినా తానొక్కడిదే తప్పన్నట్లుగా ప్రచారం సరికాదని పేర్కొన్నాడు. ఏదేమైనా గ్యారీ కిర్‌స్టన్(హెడ్ కోచ్) వంటి దిగ్గజాలతో పని చేయడం సంతోషంగా ఉందన్నాడు.పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వహాబ్ రియాజ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ విషయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి అతడు ధన్యవాదాలు తెలిపాడు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో వైఫల్యం నేపథ్యంలో బాబర్ ఆజంను కెప్టెన్సీ నుంచి తొలగించాలనే డిమాండ్లూ వస్తున్న విషయం తెలిసిందే. ఏదేమైనా పాక్ క్రికెట్ పరిస్థితి ప్రస్తుతం గందరగోళంగా ఉంది. -
వాళ్లిద్దరిపై వేటు వేసిన పీసీబీ.. అబ్దుల్ రజాక్‌కు డబుల్ షాక్!
టీ20 ప్రపంచకప్-2024లో జట్టు వైఫల్యం నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలుత చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్‌పై వేటు వేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. సెలక్టర్ పదవి నుంచి అబ్దుల్ రజాక్‌ను కూడా తప్పించినట్లు సమాచారం.కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్‌లో జరిగిన పొట్టి క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో పాటు గ్రూప్-ఏలో భాగమైన బాబర్ ఆజం బృందం లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.కనీసం సూపర్-8 కూడా చేరకుండానేపసికూన అమెరికా, పటిష్ట భారత్ చేతిలో ఓడి కనీసం సూపర్-8 కూడా చేరకుండానే నిష్క్రమించింది. గత ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్ ఈసారి ఘోరంగా ఇలా వెనుదిరగడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజంను సారథ్య బాధ్యతల నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది. ఈ విషయంలో హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ నిర్ణయానికే పీసీబీ పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.అయితే, సెలక్షన్ కమిటీ విషయంలో మాత్రం ఈ మేరకు తామే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వహాబ్ రియాజ్, అబ్దుల్ రజాక్‌లను తప్పించాలని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆదేశించినట్లు తెలుస్తోంది.వీరిద్దరిని మినహాయిస్తే సెలక్షన్ కమిటీలో ఇంకో ఐదుగురు మిగులుతారు. హెడ్ కోచ్, కెప్టెన్(సంబంధిత ఫార్మాట్), మహ్మద్ యూసఫ్, అసద్ షఫీక్, బిలాల్ అఫ్జల్, డేటా అనలిస్టు ఉంటారు. ఇక రియాజ్, రజాక్ స్థానాలను ఇప్పట్లో భర్తీ చేసేందుకు పీసీబీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. రజాక్‌కు డబుల్ షాక్అంతేకాదు రజాక్‌కు డబుల్ షాకిచ్చిన్నట్లు సమాచారం. మహిళా సెలక్షన్ కమిటీ విధుల నుంచి కూడా అతడిని తప్పించినట్లు తెలుస్తోంది. కాగా అనాలోచిత నిర్ణయాలు, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, ఆజం ఖాన్(మాజీ కెప్టెన్ మొయిన్ కుమారుడు) వంటి ఆటగాళ్ల ఎంపిక నేపథ్యంలో వహాబ్ రియాజ్‌పై విమర్శలు వచ్చాయి.అతడి విషయంలో మాజీ క్రికెటర్లు పీసీబీ తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ ఆడేందుకు జట్టు వెళ్లిన సమయంలో రియాజ్ కేవలం సీనియర్ టీమ్ మేనేజర్‌గా మాత్రమే వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా అతడిని సెలక్షన్ కమిటీ నుంచి పూర్తిగా తప్పించినట్లు సమాచారం.ఈ మేరకు ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో కథనం వెలువరించింది. కాగా పాక్ బోర్డులో గత కొన్నేళ్లుగా నిలకడ లేకుండా పోయింది. గడిచిన నాలుగేళ్లలో ఆరుగురు చీఫ్ సెలక్టర్లు మారారు. హరూన్ రషీద్, షాహిద్ ఆఫ్రిది, ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ వసీం, మిస్బా ఉల్ హక్, వహాబ్ రియాజ్ ఈ హోదాలో పనిచేశారు. చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ! -
నాకు నచ్చినవాళ్లను సెలక్ట్ చేస్తా అంటావా?: సెహ్వాగ్ ఫైర్
పాకిస్తాన్ చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్ తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు. జట్టు ఎంపిక విషయంలో తనకు నచ్చినట్లుగా వ్యవహరించి.. పాక్ భారీ మూల్యం చెల్లించేలా చేశాడని అభిప్రాయపడ్డాడు.అధికారం చేతుల్లో ఉంది కదా అని ఇష్టారీతిన ప్రవర్తిస్తే ఇలాంటి ఫలితాలే చూడాల్సి వస్తుందని ఘాటుగా విమర్శించాడు. గతంలో పాక్ జట్టును విమర్శించిన రియాజ్.. ఇప్పుడు తన పనితనాన్ని ఎలా సమర్థించుకుంటాడోనంటూ సెహ్వాగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ కనీసం సూపర్-8 కూడా చేరకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జట్టు ఎంపిక విషయంలో ఫేవరెటిజం, బంధుప్రీతి చూపడం వల్లే కొంపమునిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ పాక్ చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్ తీరును తప్పుబట్టాడు. ‘‘వహాబ్ రియాజ్, మహ్మద్ ఆమిర్... ఇద్దరూ పాకిస్తాన్ జట్టును విమర్శించిన వాళ్లే.ఏ టీవీ చానెల్లో అయితే వీళ్లిద్దరూ ఈ పని చేశారో.. ఇప్పుడు అదే చానెల్లో వీళ్లను విమర్శిస్తున్నారు. ఆనాడు అలా మాట్లాడిన వాళ్లలో ఒకరు ఇప్పుడు చీఫ్ సెలక్టర్(రియాజ్).. మరొకరు తుదిజట్టులో చోటు దక్కించుకున్న ఆటగాడు(ఆమిర్).మహ్మద్ ఆమిర్ అప్పుడు నాతో ఉన్నాడు కాబట్టి.. అతడిని జట్టుకు ఎంపిక చేస్తాననుకోవడం సరైందేనా?! ఇప్పుడు అజిత్ అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా ఉన్నాడు.కాబట్టి తను నా దగ్గరికి వచ్చి.. ‘వీరూ, జాక్(జహీర్ ఖాన్).. మీరిద్దరూ రండి. రీఎంట్రీ ఇచ్చేందుకు నేను అవకాశం కల్పిస్తా’ అంటే ఎలా ఉంటుంది. ఆమిర్ పట్ల రియాజ్ చేసింది కూడా ఇలాగే ఉంది’’ అని క్రిక్‌బజ్ షోలో సెహ్వాగ్ తీవ్ర విమర్శలు చేశాడు.కాగా 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన మహ్మద్ ఆమిర్ టీ20 ప్రపంచకప్-2024కు ముందు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అనూహ్య రీతిలో అతడు వరల్డ్‌కప్ జట్టుకు కూడా ఎంపికయ్యాడు.ఇమాద్ వసీం సైతం ఇలాగే ఆఖరి నిమిషంలో ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరి ఎంపికకు వహాబ్ రియాజే కారణమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.కాగా మహ్మద్ ఆమిర్ వరల్డ్‌కప్-2024లో ఏడు వికెట్లు తీయగలిగాడు. అయితే, అమెరికాతో సూపర్‌లో పద్దెనిమిది పరుగులు సమర్పించుకుని పాక్ ఓటమికి కారణమయ్యాడు ఈ లెఫ్టార్మ్ పేస్ బౌలర్.చదవండి: కోట్లకు కోట్లు తీసుకుంటారు.. భార్యల్ని తీసుకెళ్లడం బాగా అలవాటైంది! -
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. చీఫ్ సెలక్టర్‌గా దిగ్గజ బౌలర్
పాకిస్తాన్ క్రికెట్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్ పురుషల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలియజేసింది. ఇంజమామ్-ఉల్-హక్ స్ధానాన్ని రియాజ్ భర్తీ చేయనున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023కు ముందు పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఇంజమామ్.. వ్యక్తిగత కారణాలతో టోర్నీ మధ్యలోనే తన పదవి నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే రియాజ్‌కు పీసీబీ సెలక్షన్ కమిటీ చైర్మెన్ బాధ్యతలు అప్పగించింది. వచ్చె నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌తో పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్‌గా రియాజ్ ప్రయాణం ప్రారంభం కానుంది. అతడి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆసీస్, న్యూజిలాండ్ సిరీస్‌లకు జట్టును ఎంపిక చేయనుంది. కాగా వన్డే ప్రపంచకప్-2023లో ఘోర వైఫల్యం తర్వాత విదేశీ కోచ్‌లను పీసీబీ తొలిగించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ డైరక్టర్‌గా పనిచేసిన మిక్కీ అర్ధర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కిల్పై వేటు వేసింది. దీంతో తమ జట్టు క్రికెట్ డైరక్టర్ బాధ్యతలు మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్‌కు పీసీబీ అప్పగించింది. బౌలింగ్ కోచ్‌గా ఉమర్ గుల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. చదవండి: World cup 2023: ఆస్ట్రేలియాతో ఫైనల్.. వక్ర బుద్ధి చూపించిన పాక్ క్రికెటర్ Wahab Riaz opens up about his appointment as chief selector and outlines his priorities in this role 🎙️🏏 More details ➡️ https://t.co/3uhDwHUhIB pic.twitter.com/qfuv0Y9Bdm — Pakistan Cricket (@TheRealPCB) November 17, 2023 -
అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్తాన్ పేసర్ గుడ్‌బై.. ఇకపై..
Pakistan Pacer Wahab Riaz Announces Retirement: పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇన్నాళ్లు పాక్‌కు ప్రాతినిథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని.. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు పాక్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు తెలిపాడు. తన ప్రయాణంలో అండగా నిలిచిన కుటుంబం, కోచ్‌లు, మెంటార్లు, సహచర ఆటగాళ్లు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. 2008లో అరంగేట్రం అయితే, ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకొంటున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంఛైజీ క్రికెట్ మాత్రం ఆడతానని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. కాగా 2008లో వహాబ్ రియాజ్ పాకిస్తాన్ తరఫున జింబాబ్వేతో వన్డే సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది టీ20లలో(బంగ్లాదేశ్)నూ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రెండేళ్లకు టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. 2020 డిసెంబరులో చివరిసారిగా పాక్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మూడు వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్లలో 2011,2015, 2019 వన్డే వరల్డ్‌కప్ ఆడిన పాకిస్తాన్ జట్లలో వహాబ్ రియాజ్ భాగమయ్యాడు. కాగా 38 ఏళ్ల వహాబ్ రియాజ్ పాక్ తరఫున మొత్తంగా 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 81, వన్డేల్లో 120, టీ20లలో 34 వికెట్లు పడగొట్టాడు. ఇక మెన్స్ హండ్రెడ్, గ్లోబల్ టీ20 కెనడా, కరేబియన్ ప్రీమియర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న వహాబ్.. ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహించాడు. రాజకీయాల్లోకి.. వహాబ్ రియాజ్ రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో పంజాబ్ క్రీడా, యువజన శాఖా మంత్రిగా నియమితుడైటన్లు సమాచారం. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్న-2023కి ముందు మూడు ప్రపంచకప్ టోర్నీల్లో ఆడిన వహాబ్ రిటైర్ కావడం విశేషం. భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి ఈ మెగా ఈవెంట్ మొదలుకానున్న విషయం తెలిసిందే. చదవండి: దేశంలో ఒకే ఒక్క హార్దిక్ పాండ్యా ఉన్నాడు.. కానీ: భారత మాజీ క్రికెటర్ -
స్పోర్ట్స్ మినిస్టర్‌కు చుక్కలు చూపించిన పాకిస్తాన్ బ్యాటర్.. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు
పాకిస్తాన్ స్పోర్ట్స్ మినిస్టర్ వాహబ్ రియాజ్‌కు అదే దేశానికి చెందిన అంతర్జాతీయ ప్లేయర్ ఇఫ్తికార్ అహ్మద్ చుక్కలు చూపించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2023 సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో (ఫిబ్రవరి 5) వాహబ్ రియాజ్ బౌలింగ్‌లో ఇఫ్తికార్ అహ్మద్ వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు. Iftikhar Ahmed smashed 6 sixes in a single over in the PSL exhibition match.pic.twitter.com/s3NRRmrcZl — Johns. (@CricCrazyJohns) February 5, 2023 ఈ మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడిన ఇఫ్తికార్ (50 బంతుల్లో 94 నాటౌట్).. పెషావర్ జల్మీ తరఫున ఆడిన వహబ్ రియాజ్‌పై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఇఫ్తికార్ ప్రాతినిధ్యం వహించిన క్వెట్టా గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 42 బంతులు తీసుకున్న ఇఫ్తికార్.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 36 పరుగులు పిండుకుని 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇఫ్తికార్ సిక్సర్ల సునామీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. Mere chotay bhai @IftiAhmed221 ne sports minister @WahabViki ka bhi lehaz nahi kiya 🤷. Minister sb ko easy na lein, he will bounce back too. Great to see the love and support shown by the people of Quetta. They deserve the best. pic.twitter.com/gwTsw4aPHT — Shadab Khan (@76Shadabkhan) February 5, 2023 ఈ వీడియోపై పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు ఆ జట్టు క్రికెటర్ షాదాబ్ ఖాన్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా చిన్న అన్న ఇఫ్తికార్ స్పోర్ట్స్ మినిస్టర్ అని కూడా చూడకుండా ఉతికి ఆరేశాడు. మినిస్టర్ కూడా తిరిగి పుంజుకుంటాడు అంటూ ట్వీట్ చేశాడు. పాక్ అభిమానులు సైతం ఇదే తరహా కామెంట్లతో సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. కాగా, వాహబ్ రియాజ్ ఇటీవలే పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు క్రీడా శాఖ మంత్రిగా ఎంపికైన విషయం తెలిసిందే. అతను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతుండగానే పాక్‌లో ఈ ప్రకటన చేశారు. -
ఆర్థిక సంక్షోభం.. పాక్ క్రికెటర్‌కు మంత్రి పదవి
పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. రోజువారి నిత్యావసర ధరలు ఆకాశన్నంటగా.. అంతర్జాతీయంగా పాక్ రూపాయి ధర మరింత దిగజారింది. దీనికి తోడు విద్యుత్ కొరతతో దేశం తీవ్రంగా సతమతమవుతుంది. అయితే ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడం కోసం పాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం పలు మంత్రిత్వ శాఖల్లో మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో పాక్ సీనియర్ క్రికెటర్ వహాబ్ రియాజ్‌ను క్రీడాశాఖ మంత్రిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్థాన్ ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్‌లోని తాత్కాలిక క్యాబినెట్లో పాక్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్‌ను క్రీడా మంత్రిగా నియమించింది. విశేషమేమిటంటే ప్రస్తుతం వహాబ్ రియాజ్ అందుబాటులో లేడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో బిజీగా గడుపుతున్నాడు. దీంతో ఉన్నపళంగా పాక్‌కు తిరిగి రావాలని ప్రభుత్వం ఆదేశించింది. బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వహాబ్ రియాజ్ మంత్రిగా ప్రమాణం చేయనున్నాడు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను కొందరు రాజకీయ నిపుణులు తప్పుబట్టారు. ఇక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ వహాబ్ రియాజ్ పాకిస్థాన్ తరఫున 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఫాస్ట్ బౌలర్‌గా మంచి గుర్తింపు పొందిన వహాబ్ రియాజ్.. 91 వన్డేల్లో 120 వికెట్లు, 27 టెస్టుల్లో 83 వికెట్లు,36 టి20ల్లో 38 వికెట్లు పడగొట్టాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పాకిస్థాన్ జట్టులో వహాబ్ సభ్యుడుగా ఉన్నాడు. అయితే 2020 తర్వాత వహాబ్ రియాజ్ పాకిస్థాన్ జట్టులో చోటు కోల్పోయాడు. అప్పటినుంచి టి20 లీగ్స్‌లో బిజీ అయిన వహబ్ రియాజ్ మొత్తంగా 400 వికెట్లకు పైగా సాధించాడు. ప్రస్తుతం బీపీఎల్‌లో ఖుల్నా టైగర్స్ తరఫున ఆడుతున్న అతను 9 వికెట్లు పడగొట్టాడు. చదవండి: 'కోహ్లి స్థానాన్ని అప్పగించాం.. ఇలాగేనా ఔటయ్యేది' మాట మార్చిన పాక్ క్రికెటర్.. అయినా కోహ్లితో నాకు పోలికేంటి?! -
PSL 2022: పాకిస్థాన్ సూపర్ లీగ్‌పై కరోనా పంజా..
కరాచీ: పాకిస్థాన్ సూపర్ లీగ్ 2022పై కరోనా మహమ్మారి పంజా విసిరింది. లీగ్‌లో పాల్గొనబోయే నలుగురు క్రికెటర్లు సహా ఆ దేశ దిగ్గజ బౌలర్, కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ ప్రెసిడెంట్ వసీం అక్రమ్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ నెల 27 నుంచి ప్రారంభంకావాల్సిన లీగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. కోవిడ్ బారిన పడిన ఆటగాళ్లలో పెషావర్ జల్మీకి చెందిన వాహబ్ రియాజ్, హైదర్ అలీ ఉన్నారు. అంతకుముందు ఇదే ఫ్రాంచైజీకి చెందిన కమ్రాన్ అక్మల్, అర్షద్ ఇక్బాల్‌లకు కూడా కరోనా వచ్చింది. వీరంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. కాగా, కొద్ది రోజుల క్రితం వివిధ ఫ్రాంచైజీలకు చెందిన ముగ్గురు క్రికెటర్లు, ఐదుగురు సహాయక సిబ్బంది వైరస్ బారిన పడినట్లు పీసీబీ గతంలో ప్రకటించింది. చదవండి: 145 కిమీ పైగా స్పీడ్‌తో బౌల్ చేసే ఆ బౌలర్‌ని ఏ జట్టైనా కోరుకుంటుంది.. కేఎల్ రాహుల్ -
‘అతను లేకపోవడం వల్లే ఈ వైఫల్యం’
కరాచీ: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి పాలు కావడంపై ఆ జట్టు మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేకపోవడానికి బౌలింగ్‌లో వైఫల్యమే కారణమన్నాడు. పాకిస్తాన్ బ్యాటింగ్‌లో ఉన్న పస బౌలింగ్‌లో లేకపోవడం వల్లే పరాజయం చవిచూడాల్సి వచ్చిందన్నాడు. వహాబ్ రియాజ్ వంటి అనుభవం ఉన్న పేసర్ అందుబాటులో ఉన్నా తుది జట్టులో వేసుకోకపోవడం కూడా పాక్ ఓటమికి ఒక కారణమన్నాడు. (చదవండి: సీఎస్కే చేసిన పొరపాటు అదేనా?) ‘ ఇంగ్లండ్‌తో రెండో టీ20లో ఫలితం చూసి చాలా నిరాశ చెందా. మనం మంచి స్కోరు చేశాం.. కానీ బౌలింగ్ విభాగం వైఫల్యంతో మూల్యం చెల్లించుకున్నాం. ఆ సమయంలో రియాజ్ ఎందుకు లేకుండా పోయాడని చాలా ఫీల్ అయ్యా. అప్పుడు రియాజ్ ఉండి ఉంటి అతని అనుభవం జట్టుకు ఉపయోగపడేది. పాకిస్తాన్ అధీనంలో ఉండాల్సిన మ్యాచ్ చేజాతులా కోల్పోయాం. ఏది ఏమైనా ఈ ఫలితం చాలా చాలా నిరూత్సాహపరిచింది. రియాజ్‌ను ఆడించాల్సిన అవసరం ఉంది’ అని అఫ్రిది పేర్కొన్నాడు. మాంచెస్టర్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నాలుగు వికెట్లకు 195 పరుగులు చేసింది. కాగా, చివరకు ఇంగ్లండ్‌నే విజయం వరించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 66 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి తోడు మలాన్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 54 పరుగులు సాధించడంతో పాటు బెయిర్ స్టో 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44 పరుగులు సాధించాడు. దాంతో ఇంగ్లండ్ ఐదు బంతులు ఉండగా ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. దాంతో సిరీస్‌లో ఇంగ్లండ్‌కు 1-0 ఆధిక్యం లభించింది. తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా, మూడో టీ20 రేపు జరుగనుంది. Disappointing result, we posted a good score but the bowling failed to back the batsmen. Really feel Pakistan needed to play Wahab Riaz, if he is there he should be used considering his experience in T20 format. 🇵🇰should have taken control of the game, disappointing defeat.— Shahid Afridi (@SAfridiOfficial) August 30, 2020 -
పాక్ జట్టులో 10 మందికి కరోనా పాజిటివ్
లాహోర్ : ఎప్పుడు వివాదాలతో సతమతమయ్యే పాక్ క్రికెట్ జట్టుకు కరోనా సెగ తగిలింది. జట్టులోని ఆటగాళ్లంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే జట్టులోని ముగ్గరు ఆటగాళ్లకు కరోనా సోకగా తాజాగా మరో ఏడుగురు పాక్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. సోమవారం పాక్ యువ ఆటగాడు హైదర్ అలీతో పాటు షాదాబ్ ఖాన్, హారిస్ రవూఫ్‌లు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. తాజాగా ఫఖర్ జమాన్, ఇమ్రాన్ ఖాన్, కాశీఫ్ భట్టి, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్, వహాబ్ రియాజ్‌లు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా సంక్షోభంతో భారీ విరామం తర్వాత మరో వారం రోజుల్లో ఇంగ్లండ్ పర్యటన కోసం బయలుదేరాల్సిన పాక్ క్రికెట్ జట్టుకు పెద్దదెబ్బే తగిలింది. ఈ సిరీస్ కోసం ఎంపికైన 29 మంది పాక్ క్రికెటర్లకు కోవిడ్-19 టెస్టులు నిర్వహించారు.(టెన్నిస్ స్టార్ జొకోవిచ్‌కు కరోనా పాజిటివ్) కాగా పాక్ సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్‌తో పాటు పాక్ జట్టు ప్రధాన కోచ్ వకార్ యూనిస్, ఫిజియోథెరపిస్ట్ క్లిఫ్ డెకాన్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. దీంతో పీసీబీలో ఆందోళన నెలకొంది. ఇంగ్లండ్ పర్యటన కోసమే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆదివారం నుంచి రావల్పిండిలో కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఒక్కొక్కరిగా 10 మందికి కరోనా సోకడంతో క్రికెటర్లంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. వీరిని పీసీబీ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.('కోచ్ పదవి నాకు సవాల్‌గా కనిపిస్తుంది') -
రియాజ్ గుడ్ బై చెప్పేశాడా?: ట్వీట్ కలకలం
కరాచీ: ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ ప్రధాన పేసర్ మహ్మద్ అమిర్ టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పిన సమయంలోనే వహాబ్ రియాజ్‌కు ఆ వరుసలోనే ఉన్నాడనే విమర్శలు వచ్చాయి. ‘ నీ తర్వాత రియాజే టెస్టులకు వీడ్కోలు చెప్పనున్నాడా’ అని ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ధ్వజమెత్తాడు. అసలే కష్టకాలంలో ఉన్న పాక్ క్రికెట్ జట్టుకు రిటైర్మెంట్లతో షాకిలివ్వడం తగదంటూ అక్తర్ విమర్శించాడు. కాగా, ఇప్పుడు రియాజ్ చేసిన ట్వీట్ పాకిస్తాన్ క్రికెట్ పెద్దల్లో అలజడి రేపుతోంది. తాను టెస్టు క్రికెట్‌కు బ్రేక్ ఇవ్వనున్నట్లు రియాజ్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ‘నేను నిరవధికంగా టెస్టు క్రికెట్‌కు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నా. మా కుటుంబ సభ్యులు, బోర్డుతో చర్చించిన తర్వాత టెస్టులకు విరామం ఇవ్వడానికి సిద్ధమయ్యా. నా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే క్రమంలోనే ఎర్ర బంతి క్రికెట్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నా. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెట్టా. ఇది చాలా కఠిన నిర్ణయమే. కానీ బోర్డు, కుటుంబ సభ్యుల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నా’ అని రియాజ్ తన ట్వీటర్ అకౌంట్లో పేర్కొన్నాడు. After a lot of thinking and discussions with my family and board, I have decided to take a break from red-ball cricket and maintain my fitness and focus on the shorter format for my country. It was a tough decision and I appreciate my Board’s support and guidance during this time — Wahab Riaz (@WahabViki) September 12, 2019 -
వహాబ్ రియాజ్ గుడ్ బై?
కరాచీ: కొన్నిరోజుల క్రితం పాకిస్తాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. ఇక తాను టెస్టు క్రికెట్ ఆడనంటూ ఉన్నపళంగా ప్రకటన చేయడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)లో అలజడి రేపింది. దీనిపై ఆ దేశ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తుపోశారు కూడా. 27 ఏళ్ల వయసులోనే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుని పాక్ క్రికెట్‌కు ద్రోహం చేశావంటూ షోయబ్ అక్తర్ ఘాటుగా విమర్శించాడు. అదే సమయంలో ఆమిర్ తర్వాత రియాజ్ టెస్టులకు గుడ్ బై చెప్పబోతున్నాడా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేశాడు అక్తర్. ఇప్పుడు అదే నిజమైనట్లు కనబడుతోంది. తాజాగా 34 ఏళ్ల వహాబ్ రియాబ్ టెస్టులకు వీడ్కోలు చెప్పాడట. ఇప్పటికే ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డుకు తెలియజేశాడని, ఇక కేవలం సాధారణ ప్రకటన మాత్రమే చేయాల్సి ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ 27 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రియాజ్ 83 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 5/63గా ఉంది. చివరిసారి 2018 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆడాడు రియాజ్. -
ఇకనైనా కలిసి కట్టుగా పోరాడుదాం: రియాజ్
లండన్: తమ జట్టులోని ఆటగాళ్ల మధ్య విభేదాలు ఏమైనా ఉంటే వాటిని పక్కనుపెట్టి కలిసి కట్టుగా పోరాడటానికి సిద్ధం కావాలని పాకిస్తాన్ పేసర్ వహాబ్ రియాజ్ సూచించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో పాక్ జట్టు వరుస పరాజయాలకు ఆటగాళ్ల మధ్య నెలకొన్న విభేదాలే కారణమని విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ మధ్య అంతర్గతంగా ఎటువంటి సమస్యలు లేవని చెప్పాలంటే ఆటగాళ్లంతా ఒక్కటిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నాడు రియాజ్. ‘భారత్ చేతిలో ఎదురైన ఓటమిని మరచిపోదాం. అది గతం. ఇప్పుడు వరల్డ్‌కప్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే సఫారీలతో జరుగనున్న మ్యాచ్‌లో విజయం చాలా అవసరం. మనకు మనమే పుంజుకోవాలి. మనకు మనమే బలం. మనమంతా మంచి స్నేహితులం. మనం ఒకే కుటుంబానికి చెందిన వారం కాకపోయినా ఒక మంచి వాతావరణంతో జట్టుగా గాడిలో పడదాం’ అని సహచరులకు రియాజ్ మొరపెట్టుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో బలపడటానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగనున్న మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపై దృష్టి నిలిపామన్నాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో పాకిస్తాన్ తలపడనుంది. -
పాక్ ప్రపంచకప్ జట్టులో భారీ మార్పులు!
ఇస్లామాబాద్: మరో 10 రోజుల్లో మెగాటోర్నీ ‘ప్రపంచకప్’ ఆరంభంకానుండగా పాకిస్తాన్ జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు ఖాయమని ప్రకటించిన 15 మంది ఆటగాళ్లలో ముగ్గురి ఆటగాళ్లపై వేటు వేస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) మరో ముగ్గురి ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. ఈ జాబితాలో పాకిస్తాన్ స్పీడ్‌స్టార్ మహ్మద్ అమిర్‌కు పీసీబీ అవకాశం కల్పించింది. అమిర్‌తో పాటు వాహబ్ రియాజ్, అసిఫ్ అలీలకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. ఇక ఈ ముగ్గురి ఎంట్రీతో అబిద్ అలీ, ఫహీమ్ ఆష్రఫ్, జునైద్ ఖాన్లు ఉద్వాసనకు గురయ్యారు. ప్రపంచకప్ ఆడటం ఖాయమనుకున్న ఈ ఆటగాళ్లు పీసీబీ తాజా నిర్ణయంతో షాక్‌కు గురయ్యారు. ఈ మార్పుల విషయాన్ని పాక్ ఛీఫ్ సెలక్టర్ ఇంజుమామ్ ఉల్ హక్ సోమవారం మీడియాకు తెలిపాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తమ ఆటగాళ్లు ఆశించినస్థాయిలో రాణించలేకూపోయారని, అందుకే జట్టు కూర్పుపై మరోసారి కసరత్తు చేసినట్లు ఇంజుమామ్ చెప్పుకొచ్చాడు. రివర్స్ స్వింగ్ ప్రత్యేకతనే వాహబ్‌ను జట్టులోకి ఎంపిక చేసేలా చేసిందన్నాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన 5 వన్డేల సిరీస్‌లో పాక్ 0-4తో చిత్తుగా సిరీస్ కోల్పోయింది. ఇక మే 23 వరకు ఆయా జట్లు తమ ఆటగాళ్లను మార్చుకునే అవకాశం ఐసీసీ కల్పించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న అసీఫ్ అలీ ఇంట తీవ్ర విషాదం నెలకుంది. క్యాన్సర్‌తో పోరాడుతూ అతడి రెండేళ్ల కూతురు నూర్ ఫాతిమా ఆదివారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్రపంచకప్ జట్టు: సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజమ్, హ్యారిస్ సోహైల్, అసీఫ్ అలీ, షోయబ్‌మాలిక్, మహ్మద్ హఫీజ్, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహిన్ అఫ్రిదీ, మహ్మద్ అమిర్, వాహబ్ రియాజ్, మహ్మద్ హస్నైన్ -
పాక్ క్రికెటర్‌ను ఆడేసుకుంటున్నారు
సాక్షి, ఇస్లామాబాద్ : సోషల్ మీడియాలో చేసే పోస్టుల విషయంలో ముఖ్యంగా సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక్కోసారి అవి వికటించే ప్రమాదం ఉంటుంది. తాజాగా పాక్ క్రికెటర్ ఒకరు ‘కొత్త లుక్కు’ పేరిట చేసిన ప్రయోగం అతన్ని ట్రోల్ చేసి పడేస్తోంది. పాకిస్థాన్ బౌలర్ వాహబ్ రియాజ్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ టీం తరపున ఆడుతున్నాడు. దుబాయ్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం తొలి మ్యాచ్ సందర్భంగా వాహబ్ తన మీసాలను కట్ చేయించుకుని కొత్త లుక్కుతో దర్శనమిచ్చాడు. గతంలో ఆస్ట్రేలియన్ బౌలర్ మిచెల్ జాన్సన్ ఇదే తరహా లుక్కుతో కనిపించటంతో.. ఇక క్షణం గ్యాప్ కూడా తీసుకోకుండా వాహబ్ ఫోటోలపై ఫన్నీ కామెంట్లు చేసేస్తున్నారు. ఇందులో పాకిస్థాన్ ఫ్యాన్సే ఎక్కువగా ఉండటం గమనార్హం. మ్యాచ్‌కు ముందు కెప్టెన్ మహ్మద్ హఫీజ్.. వాహబ్తో ఓ సెల్ఫీ దిగి.. ‘తొలి మ్యాచ్‌కు సిద్ధమైపోయాం. వాహబ్ కొత్త లుక్కు సరిగ్గా లేదనే అనుకుంటున్నా!’ అంటూ ట్వీట్ చేశాడు. ‘అతని కొత్త లుక్కు మీకేలా నచ్చింది’ అంటూ పీఎస్ఎల్ అఫీషియల్ ట్విట్టర్ ఓ సందేశం ఉంచింది.. ‘మీసాలు పెంచినంత మాత్రానా నువ్వు(వాహబ్) మిచ్చెల్ జాన్సన్వి కాలేవు’ అని కొందరు.. ‘పేద మిచ్చెల్ జాన్సన్’ ‘పాపం మిచ్చెల్ జాన్సన్’ అంటూ మరికొందరు.. జాన్సన్-వాహబ్ ఫోటోలను పక్కపక్కన పెట్టి ఆన్ లైన్ ఆర్డర్ జోక్ తో మరొకరు.. చివరకు సింగం సినిమాలో సూర్య పోస్టర్‌తో ఇంకొకరు... ఇలా హిల్లేరియస్ పోస్టులతో వాహబ్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ ట్రోలింగ్ పై వాహబ్ స్పందించాడు. అనుకోకుండా ఆ స్టైల్ మార్చానని.. ఒకవేళ అందరికీ తాను జాన్సన్‌ను అనుకరించినట్లు అనిపిస్తే, అది గౌరవంగానే భావిస్తానని చెబుతున్నాడు. పాక్ తరపున 79 వన్డేలు, 26 టెస్టులు ఆడిన వాహబ్ తిరిగి జట్టులో స్థానం కోసం కృషి చేస్తున్నాడు. Ready to go for the opening ceremony & our 1st game of PSL#3 , not sure about @WahabViki new look 😷👌👍🏼😂 pic.twitter.com/eAtbNn1W37 — Mohammad Hafeez (@MHafeez22) 22 February 2018 How do you like @WahabViki's new look? The left-armer claims to have grown the mustache to 'motivate' himself!#HBLPSL #DilSeJaanLagaDe pic.twitter.com/xMMCnXTlGF — PakistanSuperLeague (@thePSLt20) 22 February 2018 Mooch rakhnay se koe johnson no ban jata — Riz (@riziop) 23 February 2018 Pic 1: What you order online Pic 2: What u get 😂😂😂#Wahabriaz #HBLPSL pic.twitter.com/sqU54h5xrr — Quetta Gladiators🇵🇰 (@raja_musa96) 22 February 2018 poor man's mitchel johnson — Muhammad Umair Rana (@Mohd_Umair_Rana) 22 February 2018 Remember when @WahabViki featured in clash of clans? #PSL2018 pic.twitter.com/RgVy7vjRfT — Fariha (@Fay_Alif) 22 February 2018 #PSL2018 Johnson reaction after watching Wahab Riaz new Style. :) pic.twitter.com/NXvYvCHjpP — FAROOQ (@Mirza00987) 22 February 2018 -
పాక్ జట్టులో అతడికి చోటివ్వొద్దు!
కార్డిఫ్: సంచలనాలకు కేంద్ర బిందువైన పాకిస్తాన్ మళ్లీ అనూహ్య విజయాన్ని దక్కించుకుని చాంపియన్స్ ట్రోఫీలో తొలిసారిగా ఫైనల్ చేరుకుంది. పదునైన బౌలింగ్ అటాక్‌తో పాటు అజహర్ అలీ (100 బంతుల్లో 76; 5 ఫోర్లు, 1 సిక్స్), ఫఖర్ జమాన్ (58 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో చెలరేగడంతో సెమీస్‌లో పాక్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను కంగుతినిపించింది. అయితే పాక్ అభిమానులు మాత్రం బౌలర్ వహాబ్ రియాజ్‌పై నిప్పులు చెరుగుతున్నారు. నువ్వు లేకపోవడం వల్లే విజయం సాధ్యమైందని.. పుణ్యం కట్టుకున్నావని కొందరు కామెంట్లు చేయగా, అసలు నువ్వు ఎప్పటికీ జట్టులోకి రాకుడదంటూ మరికొందరు ట్వీట్లతో రెచ్చిపోతున్నారు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వహాబ్ రియాజ్ పాక్ అభిమానులతో తీవ్రంగా నిరాశపడటంతో పాటు గాయాలపాలై తర్వాతి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాక్ అభిమానులు వహాబ్ లేకపోవడమే జట్టుకు వరంలా మారిందని ఎద్దేవా చేస్తున్నారు. 'వహాబ్ జట్టులో లేకపోతే మా బౌలర్లు ప్రత్యర్థులను తక్కువ స్కోర్లకే కట్టడి చేస్తున్నారని' ఉమర్ ఫరూఖ్ అనే యూజర్ కామెంట్ చేశాడు. 'వహాబ్ దూరం కాగానే పాక్ జట్టులో మునుపటి ఉత్సాహం వచ్చింది. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. పాక్ జట్టులోకి అతడిని ఎప్పటికీ తీసుకోవద్దని కోరుతూ' సోహైల్ ఛెమా అనే పాక్ అభిమాని ట్వీట్ చేశాడు. హసన్ అలీ (3/35) తో రాణించగా, జునైద్ ఖాన్, రుమాన్ చెరో రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. నేడు జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, బంగ్లాదేశ్‌లు తలపడనున్నాయి. నెగ్గిన జట్టు 18న జరిగే ఫైనల్లో పాక్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. #WahabRiaz out of the bowling line up, suddenly the Pak bowling looks like old Pak style unit. -He should never allowed it back.#PAKvENG — Sohail Cheema MD (@sohailcheemamd) 14 June 2017 After Wahab Riaz's exclusion Pakistan is restricting oppositions on low scores and winning matches 😍#ENGvPAK #CT17 pic.twitter.com/siBJZ7YJ6w — Umar FarOoq 🇵🇰 (@UmarFarooqGL) 14 June 2017 -
ఇంత ఘోరంగా ఆడుతారా?: పాక్‌పై నిప్పులు
సోషల్ మీడియాలో తమ జట్టును కడిగిపారేస్తున్న నెటిజన్లు చాంపియన్స్ ట్రోఫీలో ఎంతో ఆసక్తి రేపిన దాయాదాల పోరు ముగిసినా.. ఆ మ్యాచ్ తాలుకు ప్రకంపనలు ఇంకా రేగుతూనే ఉన్నాయి. బద్ధ విరోధి అయిన పాకిస్థాన్ జట్టుపై 124 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియాపై మనదేశంలో ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. అదే సమయంలో అన్ని విభాగాల్లో విఫలమై.. చిత్తుగా ఓడిన పాకిస్థాన్ జట్టుపై వారి దేశంలో తీవ్ర ఆగ్రహం పెల్లుబుక్కుతోంది. సోషల్ మీడియా వేదికగా పాక్ నెటిజన్లు తమ జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. భారత్ చేతిలో ఇంత దారుణంగా ఓడిపోతారా అంటూ పాక్ క్రికెటర్లను ఉతికి ఆరేస్తున్నారు. తమ క్రికెటర్లను కించపరుస్తూ మెమెలు, ఫొటోలు, ట్వీట్లు, పోస్టులు పెట్టి తమ నిరసనను చాటుతున్నారు. Even Wahab Riaz is more useless than Madhuri's dupatta. pic.twitter.com/XlWNYJQDls — Maan Rehman (@maanrehman) June 4, 2017 ఇక ఫాస్ట్ బౌలర్ వహబ్ రియాజ్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. అతన్ని పాక్ నెటిజన్లు చీల్చి చెండాడుతున్నారు. ప్రధానంగా అతన్నే టార్గెట్ చేసుకుని ఎక్కువగా విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పాక్ ప్రధాన ఫాస్ట్ బౌలర్ అయిన రియాజ్ భారత్ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. అతను 8.4 ఓవర్లు వేసి 87 పరుగులు సమర్పించుకున్నాడు. అతని బౌలింగ్‌ను జీర్ణించుకోలేకపోతున్న పాక్ నెటిజన్లు అతన్ని తీవ్రంగా దూషిస్తూ ఎండగడుతున్నారు. పాక్ నెటిజన్లు తమ క్రికెటర్లను ఎంత దారుణంగా దూషిస్తున్నారో పాక్ చానెల్ ఒకటి వెల్లడించింది. పాక్ నెటిజన్ల ఆగ్రహాన్ని, పోస్టులను ఒకచోట గూడిగుచ్చి ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ కథనం ఇప్పుడు వైరల్‌గా మారింది. -
పాకిస్థాన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ!
మూలిగే నక్కపై తాటిపండు పడటమంటే ఇదే కావొచ్చు. టీమిండియాతో ప్రతిష్టాత్మక పోరులో చిత్తుగా ఓడి.. తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ వహబ్ రియాజ్ చీలమండ (అంకిల్) గాయం కారణంగా పూర్తిగా చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీని చేదు అనుభవంతో పాక్ జట్టు ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారత్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 124 పరుగుల తేడాతో ఆ జట్టు ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఇక భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో రియాజ్ ఘోరంగా విఫలమయ్యాడు. 8.4 ఓవర్లలోనే అతను 87 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో బౌలింగ్ చేస్తూ ఈ మ్యాచ్‌లోనే అతను గాయపడి.. మధ్యలోనే మైదానం నుంచి వీడాడు. -
వావ్.. అద్భుతమైన క్యాచ్ పట్టాడు
-
వావ్.. అద్భుతమైన క్యాచ్ పట్టాడు
కింగ్స్టన్: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో పాకిస్థాన్ క్రికెటర్ వాహబ్ రియాజ్ అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. జమైకాలో జరుగుతున్న ఈ మ్యాచ్ తొలిరోజు ఆటలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పాక్ బౌలర్లు రాణించడంతో విండీస్ 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రోస్టన్ చేజ్, డోరిచ్ జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. ఈ సమయంలో ఊహించని సంఘటన జరిగింది. యాసిర్ షా వేసిన ఓవర్లో చేజ్ భారీ షాట్ ఆడబోయాడు. బౌండరీ లైన్ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చిన రియాజ్ లాంగాఫ్ దగ్గర గాల్లోకి ఎగిరి బంతి అందుకున్నాడు. తర్వాత రియాజ్ గ్రౌండ్‌పై పడినా బంతి చేజారకుండా పట్టుకోవడంతో పాటు తన శరీరం బౌండరీ లైన్‌కు తగలకుండా నియంత్రించుకున్నాడు. 70వ ఓవర్ మూడో బంతికి ఇలా అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో చేజ్ పెవిలియన్ చేరాడు. యాసిర్ ఆ మరుసటి బంతికి డోరిచ్ను బౌల్డ్ చేశాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి కరీబియన్లు 7 వికెట్లకు 244 పరుగులు చేశారు. -
ఆ క్రికెటర్లు కొట్టుకున్నంత పనిచేశారు!
బ్రిస్బేన్:పాకిస్తాన్ క్రికెట్లో వివాదాలు కొత్తేమీ కాదు. ఆ క్రికెటర్లు ఏదొక వివాదాన్ని సృష్టస్తూ క్రికెట్ బోర్డుకు తలనొప్పిని తెచ్చిపెట్టడాన్ని చాలా సందర్భాల్లో చూశాం. తాజాగా పాక్ క్రికెటర్ల మధ్య వాడివేడి మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాక్ క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇద్దరు సీనియర్ క్రికెటర్లు వాహబ్ రియాజ్, యాసిర్ షాల మధ్య జరిగిన గొడవ తారాస్థాయికి చేరింది. వీరిద్దర మధ్య చిన్నగా మొదలైన ఘర్షణ చివరకు ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. బుధవారం ఫుట్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రియాజ్‌తో యాసిర్ గొడవ పడ్డాడు. దాంతో నువ్వేంత అంటే నువ్వెంత అనే వరకూ ఆ క్రికెటర్లు తమ మాటల వాడిని కొనసాగించారు. ఆ గొడవ ముదరడంతో జట్టు సభ్యులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఈ మేరకువారి మధ్య జరిగిన ఘర్షణ ఫోటోను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ట్వీట్ చేసింది. దాంతో ఆ క్రికెటర్లపై చర్యలు తప్పవని అంతా భావించారు. కాగా, ఆ గొడవను పాక్ క్రికెట్ టీమ్ మేనేజర్ వాసిమ్ బారి కొట్టిపారేశారు. ఇది పెద్ద ఘర్షణగా కాదని పేర్కొన్న బారి.. ఆ క్రికెటర్లపై ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం లేదని ప్రకటించాడు. గతంలో షోయబ్ అక్తర్-మొహ్మద్ అసిఫ్‌లు ఫీల్డ్‌లోనే ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. 2007 వరల్డ్ టీ 20 సమయంలో షోయబ్ అక్తర్ అసిఫ్ ను బ్యాట్‌తో కొట్టాడు. అది అప్పట్లో అది పెద్ద వివాదమైంది. ఆ తరువాత తన కెరీర్ ముగింపుకు వసీం అక్రమే కారణమంటూ అక్తర్ ధ్వజమెత్తి మరో వివాదానికి తెరలేపాడు. ఇదిలా ఉండగా, ఒక టీ షోలో మొహ్మద్ యూసఫ్-రమీజ్ రాజాలు ఒకరిపై ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకున్నారు. మరొకవైపు పాకిస్తాన్ సూపర్ లీగ్(పీసీఎల్)లో వాహబ్ రియాజ్- అహ్మద్ షెహ్‌జాద్‌లు ఒకర్నినొకరు తోసుకున్నారు. దాంతో పాటు దూషణలకు దిగి వివాదాన్నిపెద్దది చేశారు.