వావ్‌.. అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు | Pakistan fast bowler Wahab Riaz takes extraordinary catch | Sakshi
Sakshi News home page

వావ్‌.. అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు

Published Sat, Apr 22 2017 6:16 PM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM

వావ్‌..  అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు

వావ్‌.. అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు

కింగ్‌స్టన్‌: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో పాకిస్థాన్‌ క్రికెటర్‌ వాహబ్ రియాజ్ అద్భుతమైన క్యాచ్‌ పట్టుకున్నాడు. జమైకాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ తొలిరోజు ఆటలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.

టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పాక్‌ బౌలర్లు రాణించడంతో విండీస్‌ 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రోస్టన్‌ చేజ్‌, డోరిచ్‌ జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. ఈ సమయంలో ఊహించని సంఘటన జరిగింది. యాసిర్‌ షా వేసిన ఓవర్లో చేజ్‌ భారీ షాట్ ఆడబోయాడు. బౌండరీ లైన్‌ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చిన రియాజ్‌ లాంగాఫ్‌ దగ్గర గాల్లోకి ఎగిరి బంతి అందుకున్నాడు. తర్వాత రియాజ్‌ గ్రౌండ్‌పై పడినా బంతి చేజారకుండా పట్టుకోవడంతో పాటు తన శరీరం బౌండరీ లైన్‌కు తగలకుండా నియంత్రించుకున్నాడు. 70వ ఓవర్‌ మూడో బంతికి ఇలా అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో చేజ్‌ పెవిలియన్‌ చేరాడు. యాసిర్‌ ఆ మరుసటి బంతికి డోరిచ్‌ను బౌల్డ్‌ చేశాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి కరీబియన్లు 7 వికెట్లకు 244 పరుగులు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement