
వెస్టిండీస్ క్రికెట్ జట్టు 35 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై చారిత్రక విజయం సాధించింది. ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ పాక్‌ను 120 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. రెండో టెస్ట్‌లో 9 వికెట్లు తీయడంతో పాటు తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.
మ్యాచ్ మూడో రోజు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ పాక్ ఆటగాడు సాజిద్ ఖాన్‌కు ఇచ్చిపడేశాడు. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో సాజిద్‌ను ఔట్ చేయగానే వార్రికన్ ప్రముఖ రెజ్లర్, హాలీవుడ్ నటుడు జాన్ సీనా స్టయిల్‌లో "యూ కాంట్ సీ మీ" సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అలాగే టీమిండియా గబ్బర్ శిఖర్ ధవన్ తరహాలో తొడ కొట్టి తన ఆనందాన్ని చాటుకున్నాడు.
Jomel Warrican has the last laugh over Sajid Khan.
📸: Fan Code pic.twitter.com/Y69W3WfY7m— CricTracker (@Cricketracker) January 27, 2025
వాస్తవానికి వార్రికన్ ఈ తరహా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సాజిద్ ఖానే కారణం. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వార్రికన్‌ను ఇబ్బంది పెట్టిన (బౌలింగ్‌తో) సాజిద్ ఖాన్.. ఓ దశలో జాన్ సీనా స్టయిల్‌లో "యూ కాంట్ సీ మీ" సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అప్పుడే నవ్వుతూ ఊరకుండిపోయిన వార్రికన్.. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో తన టైమ్ రాగానే సాజిద్ ఖాన్‌ను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు.
It was an exceptional Test win for the Windies.pic.twitter.com/hQxrpKEy6S
— CricTracker (@Cricketracker) January 27, 2025
అప్పుడు సాజిద్ ఖాన్ కేవలం జాన్ సీనా సెలబ్రేషన్స్ మాత్రమే చేసుకుంటే, వార్రికన్ ఇప్పుడు జాన్ సీనా సెలబ్రేషన్స్‌తో పాటు గబ్బర్ "థై ఫైవ్" సెలబ్రేషన్స్ కూడా రిపీట్ చేశాడు.
వార్రికన్.. సాజిద్ ఖాన్‌కు "టిట్ ఫర్ టాట్" చెప్పిన విధానం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. వార్రికన్‌ను క్రికెట్ అభిమానులు కరెక్టే చేశావని సమర్దిస్తున్నారు. ఓవరాక్షన్ చేసిన సాజిద్ ఖాన్‌కు బంతితోనే బుద్ది చెప్పావంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. విండీస్ నిర్దేశించిన 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పాక్ చతికిలపడింది. 76/4 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన పాక్.. మరో 57 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయింది.
మూడో రోజు తొలి గంటలోనే మ్యాచ్ ముగిసింది. వార్రికన్ పాక్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఫలితంగా పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలింది.
వార్రికన్ 5, కెవిన్ సింక్లెయిర్ 3, గుడకేశ్ మోటీ 2 వికెట్లు తీసి పాకిస్తాన్ పతనాన్ని శాశించారు. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ చేసిన 31 పరుగులే అత్యధికం కాగా.. మొహమ్మద్ రిజ్వాన్ (25), కమ్రాన్ గులామ్ (19), సౌద్ షకీల్ (13), సల్మాన్ అఘా (15) రెండంకెల స్కోర్లు చేశారు.
అంతకుముందు విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. బ్రాత్‌వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
తొలి రోజు ఆటలో ఇరు జట్లు తమతమ తొలి ఇన్నింగ్స్‌లను ముగించాయి. బౌలర్లు.. ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగడంతో మొదటి రోజు 20 వికెట్లు నేలకూలాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 163 పరుగులకే ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 154 పరుగులకే కుప్పకూలింది.
ఈ మ్యాచ్‌లో పాక్ స్పిన్నర్ నౌమన్ అలీ హ్యాట్రిక్ (తొలి ఇన్నింగ్స్‌లో) సహా 10 వికెట్లు తీయగా.. విండీస్ స్పిన్నర్ వార్రికన్ 9 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 5) పడగొట్టాడు. కాగా, తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment