ఇస్లామాబాద్: మరో 10 రోజుల్లో మెగాటోర్నీ ‘ప్రపంచకప్’ ఆరంభంకానుండగా పాకిస్తాన్ జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు ఖాయమని ప్రకటించిన 15 మంది ఆటగాళ్లలో ముగ్గురి ఆటగాళ్లపై వేటు వేస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) మరో ముగ్గురి ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. ఈ జాబితాలో పాకిస్తాన్ స్పీడ్‌స్టార్ మహ్మద్ అమిర్‌కు పీసీబీ అవకాశం కల్పించింది. అమిర్‌తో పాటు వాహబ్ రియాజ్, అసిఫ్ అలీలకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. ఇక ఈ ముగ్గురి ఎంట్రీతో అబిద్ అలీ, ఫహీమ్ ఆష్రఫ్, జునైద్ ఖాన్‌లు ఉద్వాసనకు గురయ్యారు. ప్రపంచకప్ ఆడటం ఖాయమనుకున్న ఈ ఆటగాళ్లు పీసీబీ తాజా నిర్ణయంతో షాక్‌కు గురయ్యారు.
ఈ మార్పుల విషయాన్ని పాక్ ఛీఫ్ సెలక్టర్ ఇంజుమామ్ ఉల్ హక్ సోమవారం మీడియాకు తెలిపాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తమ ఆటగాళ్లు ఆశించినస్థాయిలో రాణించలేకూపోయారని, అందుకే జట్టు కూర్పుపై మరోసారి కసరత్తు చేసినట్లు ఇంజుమామ్ చెప్పుకొచ్చాడు. రివర్స్ స్వింగ్ ప్రత్యేకతనే వాహబ్‌ను జట్టులోకి ఎంపిక చేసేలా చేసిందన్నాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన 5 వన్డేల సిరీస్‌లో పాక్ 0-4తో చిత్తుగా సిరీస్ కోల్పోయింది. ఇక మే 23 వరకు ఆయా జట్లు తమ ఆటగాళ్లను మార్చుకునే అవకాశం ఐసీసీ కల్పించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న అసీఫ్ అలీ ఇంట తీవ్ర విషాదం నెలకుంది. క్యాన్సర్‌తో పోరాడుతూ అతడి రెండేళ్ల కూతురు నూర్ ఫాతిమా ఆదివారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
పాకిస్తాన్ ప్రపంచకప్ జట్టు:
సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజమ్, హ్యారిస్ సోహైల్, అసీఫ్ అలీ, షోయబ్‌మాలిక్, మహ్మద్ హఫీజ్, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహిన్ అఫ్రిదీ, మహ్మద్ అమిర్, వాహబ్ రియాజ్, మహ్మద్ హస్‌నైన్
Comments
Please login to add a commentAdd a comment