బర్మింగ్‌హామ్: ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు పాక్ బౌలర్లు అసలైన పేస్ రుచి చూపించారు. దీంతో బ్లాక్ క్యాప్స్ 46 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్(4)ను తన తొలి ఓవర్ తొలి బంతికే వెనక్కి పంపించిన అమిర్ కివీస్ వికెట్ల పతనం ప్రారంభించాడు. అనంతరం మరో లెఫ్టార్మ్ పేసర్ షాహిన్ ఆఫ్రిది.. కోలిన్ మున్రో(12), రాస్ టేలర్(3), లాథమ్(1)లను పెవిలియనకు పంపించి కివీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
ఇక ప్రస్తుతం కివీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించాలంటే సారథి కేన్ విలియమ్సన్ చేతిలోనే ఉంది. ఇప్పటికే ఈ సీజన్‌లో రెండు శతకాలతో జట్టును ఆదుకున్న అతడు పాక్ మ్యాచ్‌లో ఏ మేరకు రాణాస్తాడో చూడాలి. ఇక ఈ మ్యాచ్ పాక్‌కు చావోరేవో లాంటిదే. కివీస్‌పై ఓడిపోతే సెమీస్ అవకాశాలు పాక్‌కు సన్నగిల్లుతాయి. దీంతో గెలుపే లక్ష్యంగా పాక్ ఆటగాళ్లు బరిలోకి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment