Pakistan Pacer Wahab Riaz Announces Retirement: పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇన్నాళ్లు పాక్‌కు ప్రాతినిథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని.. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు పాక్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు తెలిపాడు. తన ప్రయాణంలో అండగా నిలిచిన కుటుంబం, కోచ్‌లు, మెంటార్లు, సహచర ఆటగాళ్లు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
2008లో అరంగేట్రం
అయితే, ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకొంటున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంఛైజీ క్రికెట్ మాత్రం ఆడతానని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. కాగా 2008లో వహాబ్ రియాజ్ పాకిస్తాన్ తరఫున జింబాబ్వేతో వన్డే సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
అదే ఏడాది టీ20లలో(బంగ్లాదేశ్)నూ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రెండేళ్లకు టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. 2020 డిసెంబరులో చివరిసారిగా పాక్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
మూడు వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్లలో
2011,2015, 2019 వన్డే వరల్డ్‌కప్ ఆడిన పాకిస్తాన్ జట్లలో వహాబ్ రియాజ్ భాగమయ్యాడు. కాగా 38 ఏళ్ల వహాబ్ రియాజ్ పాక్ తరఫున మొత్తంగా 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 81, వన్డేల్లో 120, టీ20లలో 34 వికెట్లు పడగొట్టాడు.
ఇక మెన్స్ హండ్రెడ్, గ్లోబల్ టీ20 కెనడా, కరేబియన్ ప్రీమియర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న వహాబ్.. ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహించాడు.
రాజకీయాల్లోకి..
వహాబ్ రియాజ్ రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో పంజాబ్ క్రీడా, యువజన శాఖా మంత్రిగా నియమితుడైటన్లు సమాచారం. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్‌న-2023కి ముందు మూడు ప్రపంచకప్ టోర్నీల్లో ఆడిన వహాబ్ రిటైర్ కావడం విశేషం. భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి ఈ మెగా ఈవెంట్ మొదలుకానున్న విషయం తెలిసిందే.
చదవండి: దేశంలో ఒకే ఒక్క హార్దిక్ పాండ్యా ఉన్నాడు.. కానీ: భారత మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment