వన్డే ప్రపంచకప్-2023లో దారుణ ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ జట్టు.. లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ ఏడాది జూన్‌లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో మోర్కెల్ ఆరు నెలల ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ ఏడాది డిసెంబర్ వరకు ఇంకా సమయం ఉనప్పటికీ మోర్కెల్ ముందుగానే తన పదవి నుంచి తప్పుకున్నాడు. అయితే తన పదవీ కాలాన్ని పొడిగిస్తారని మొదటిలో వార్తలు విన్పించినప్పటికి.. వరల్డ్‌కప్‌లో పాక్ పేసర్లు దారుణంగా విఫలమకావడంతో మోర్కెల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఈ ఏడాది జూలైలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌తో పాక్ బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ప్రయాణం మొదలైంది. ఇక మోర్కెల్ తప్పుకోవడంతో పాకిస్తాన్ బౌలింగ్ కోచ్‌గా ఉమర్ గుల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
గతంలో కూడా ఉమర్ గుల్ పాక్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. వచ్చే నెలలో పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లానుంది. ఈ పర్యటనకు ముందు పాకిస్తాన్‌కు కొత్త బౌలింగ్ కోచ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్‌లో పాక్ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment