Morne Morkel
-
జస్ప్రీత్ బుమ్రాకు గాయం.. కీలక అప్డేట్ ఇచ్చిన బౌలింగ్ కోచ్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేస్తూ ఇబ్బంది పడిన విషయం సంగతి తెలిసిందే. రెండో రోజు ఆటలో బుమ్రా తొడ కండరాలు పట్టేశాయి.దీంతో బౌలింగ్ చేయడానికి వచ్చిన బుమ్రా నొప్పితో కిందపడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించడంతో బుమ్రా మళ్లీ తన బౌలింగ్‌ను కొనసాగించాడు. దీంతో భారత అభిమానులు ఆందోళన చెందారు.తాజాగా బుమ్రా గాయంపై భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాకు ఎలాంటి గాయం కాలేదని, అతడు కొంచెం నొప్పితో బాధపడ్డాడని మోర్కెల్ స్పష్టం చేశాడు."బుమ్రాకు ఎటువంటి గాయం కాలేదు. అతడు బాగానే ఉన్నాడు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతనికి తిమ్మిర్లు వచ్చాయి. అందుకే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. ఆ తర్వాత అతడు తన బౌలింగ్‌ను కొనసాగించి వికెట్లు కూడా తీశాడు.టెస్టు క్రికెట్లో ఆటగాళ్ల గాయాలను దాచలేమని" విలేకరుల సమావేశంలో మోర్కల్ పేర్కొన్నాడు. కాగా జస్ప్రీత్ బుమ్రా భారత జట్టులో ప్రధాన బౌలర్‌గా కొనసాగతున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో తన మార్క్‌ను ఈ సౌరాష్ట్ర పేసర్ చూపించాడు. మొత్తం మూడు ఇన్నింగ్స్‌లో 11 వికెట్లు పడగొట్టాడు. -
అతడి వల్లే తొలి టెస్టులో రాణించా.. వాళ్లిద్దరు కూడా అండగా ఉన్నారు: సిరాజ్
పేలవ ఫామ్‌తో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్.. తొలి టెస్టులోనే సత్తా చాటాడు. పెర్త్ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగి జట్టు గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, తాను మునుపటి లయ అందుకోవడానికి కారణం పేస్ దళ నాయకుడు, ఆసీస్‌తో మొదటి టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించిన జస్ప్రీత్ బుమ్రానే అంటున్నాడు సిరాజ్. అప్పటికీ వికెట్లు లభించకపోతే‘నేను తరచుగా నా బౌలింగ్ గురించి బుమ్రాతో చర్చిస్తూనే ఉంటా. తొలి టెస్టుకు ముందు కూడా నా పరిస్థితి గురించి అతడికి వివరించా. బుమ్రా నాకు ఒకటే విషయం చెప్పాడు. ఎలాగైనా వికెట్ సాధించాలనే లక్ష్యంతో దాని గురించే అతిగా ప్రయత్నించవద్దు. నిలకడగా ఒకే చోట బంతులు వేస్తూ బౌలింగ్‌ను ఆస్వాదించు. అప్పటికీ వికెట్లు లభించకపోతే నన్ను అడుగు అని బుమ్రా చెప్పాడు. అతడు చెప్పిన మాటలను పాటించా. వికెట్లు కూడా దక్కాయి’ అని సిరాజ్ తన సీనియర్ పేసర్ పాత్ర గురించి చెప్పాడు.మోర్నీ మోర్కెల్ కూడాఇక భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా తనతో దాదాపు ఇవే మాటలు చెప్పి ప్రోత్సహించాడని కూడా సిరాజ్ పేర్కొన్నాడు. ఆరంభంలో సిరాజ్ కెరీర్‌ను తీర్చిదిద్దడంతో భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కీలకపాత్ర పోషించాడు. అందుకే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అరుణ్‌ను సంప్రదించడం సిరాజ్‌కు అలవాటు.అరుణ్ సర్‌ను అడిగాఈ విషయం గురించి సిరాజ్ మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ కాలంగా నా బౌలింగ్ గురించి ఆయనకు బాగా తెలుసు. అందుకే నాకు ఇలా ఎందుకు జరుగుతోంది అంటూ అరుణ్ సర్‌ను అడిగా. ఆయన కూడా వికెట్లు తీయడంకంటే ఒక బౌలర్ తన బౌలింగ్‌ను ఆస్వాదించడం ఎంతో కీలకమో, ఫలితాలు ఎలా వస్తాయో చెప్పారు’ అని వెల్లడించాడు.ఇక ఆస్ట్రేలియాకు బయలుదేరడానికి ముందు భారత ఫీల్డింగ్ కోచ్, హైదరాబాద్‌కే చెందిన దిలీప్‌తో కలిసి సాధన చేసిన విషయాన్ని కూడా సిరాజ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. మరోవైపు అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టు కోసం ‘పింక్ బాల్’తో సిద్ధమవుతున్నట్లు సిరాజ్ చెప్పాడు.అలాంటి స్థితిలో ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు‘గులాబీ బంతి సింథటిక్ బంతి తరహాలో అనిపిస్తోంది. ఎరుపు బంతితో పోలిస్తే భిన్నంగా, గట్టి సీమ్‌తో ఉంది. నా దృష్టిలో ఈ బాల్‌తో షార్ట్ ఆఫ్ లెంగ్త్ తరహాలో బంతులు వేస్తే బాగుంటుంది.దీంతో ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత పట్టు చిక్కుతుంది. అయితే లైట్లు ఉన్నప్పుడు ఎక్కువగా స్వింగ్ అవుతుందని విన్నా. నేను అలాంటి స్థితిలో ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు. అడిలైడ్‌లో అలాంటి వాతావరణంలో ప్రాక్టీస్ చేస్తా’ అని సిరాజ్ వివరించాడు. కాగా స్వదేశంలో భారత జట్టు ఆడిన గత ఐదు టెస్టుల్లో నాలుగింటిలో హైదరాబాద్ పేసర్ సిరాజ్ బరిలోకి దిగాడు. వీటన్నింటిలో కలిపి అతడు మొత్తం కేవలం ఆరు వికెట్లే పడగొట్టగలిగాడు. అయితే, ఆస్ట్రేలియాలో అతడు తిరిగి ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. ఇక భారత్- ఆసీస్ మధ్య డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ బుమ్రా.. నా మనుమలకూ చెబుతా: సన్‌రైజర్స్ విధ్వంసకర వీరుడు -
ఆసీస్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు శుభవార్త?!
ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ రోజురోజుకు మెరుగు అవుతున్నాడని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. పెర్త్ టెస్టుకు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటూ అభిమానులకు శుభవార్త అందించాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనుంది. శుక్రవారం నుంచి ఈ మెగా సిరీస్ మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే ఆసీస్‌కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో బిజీబిజీగా గడుపుతోంది.ఈ క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గిల్ ఎడమ బొటన వేలికి గాయం అయింది. అయితే, బౌలింగ్ కోచ్ మోర్కెల్ అందించిన సమాచారం ప్రకారం.. గిల్ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. బలహీనంగా టాపార్డర్ఇదిలా ఉంటే.. ఇప్పటికే వ్యక్తిగత కారణాల వల్ల రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరం కావడంతో... టాపార్డర్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో గిల్ కూడా మ్యాచ్ ఆడకపోతే జట్టుకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.మ్యాచ్ ప్రారంభానికి ముందుఈ నేపథ్యంలో చివరి వరకు వేచి చూసే ధోరణి అవలభించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మ్యాచ్ రోజు వరకు గిల్ ఫిట్నెస్ సాధించాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ‘గిల్ రోజు రోజుకు మెరుగవుతున్నాడు. టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు అతడిపై నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నాడు.ఇక రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్సీ చేయబోతున్న బుమ్రా గురించి మోర్కెల్ మాట్లాడుతూ.. ‘ఆస్ట్రేలియా పిచ్‌లపై బుమ్రాకు మంచి అనుభవం ఉంది. నాయకత్వ బృందంలో బుమ్రా కూడా భాగం. అతడు గతంలో ఇక్కడ చాలా మంచి ప్రదర్శనలు చేశాడు. జట్టును ముందుండి నడిపించడాన్ని ఇష్టపడే బౌలర్ అతడు. మిగిలిన వాళ్లు అతడిని అనుసరిస్తారు’ అని తెలిపాడు.ఒత్తిడిని దరిచేరనివ్వం... ఇక స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో టెస్టు సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో భారత జట్టు ఒత్తిడిలో ఉందని అంతా అనుకుంటున్నారని... అయితే దాన్ని మార్చి వేసుకునేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు మించింది లేదని మోర్కెల్ అన్నాడు. ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియాలో రాణిస్తే వచ్చే పేరు ప్రఖ్యాతులు వేరని పేర్కొన్నాడు. ‘ప్రతి ఒక్కరు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు అని అడుగుతున్నారు. మా వరకు దాన్ని పక్కన పెట్టేసి మెరుగైన ప్రదర్శనపైనే దృష్టి పెట్టాం’ అని మోర్కెల్ అన్నాడు. చదవండి: సంజూ శాంసన్ తండ్రి క్షమాపణ చెప్పాల్సిందే.. లేదంటే! -
ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్‌రౌండర్ అవసరం: టీమిండియా కోచ్
యువ క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డిపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ప్రశంసలు కురిపించాడు. నితీశ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాలు అద్భుతమని.. అతడి చేరికతో జట్టు మరింత వైవిధ్యంగా మారిందని కొనియాడాడు. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఈ పేస్ ఆల్‌రౌండర్ సేవలను ఎలా ఉపయోగించుకుంటాడనేది చూడాల్సి ఉందని పేర్కొన్నాడు. తద్వారా ఆస్ట్రేలియాతో టెస్టులో నితీశ్ అరంగేట్రం ఖాయమని పరోక్షంగా వెల్లడించాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కమిన్స్ బృందంతో ఐదు టెస్టులు ఆడనుంది. అయితే, పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా టీమిండియాను ముందుకు నడిపించనున్నాడు.ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్‌రౌండర్ అవసరంఇక ఇరుజట్ల మధ్య శుక్రవారం(నవంబరు 22) ఈ మ్యాచ్ ఆరంభం కానున్న నేపథ్యంలో భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా విశాఖ కుర్రాడు నితీశ్ రెడ్డి ప్రస్తావన రాగా.. ‘‘జట్టులో ఇప్పుడున్న యువ ఆటగాళ్లలో నితీశ్ రెడ్డి స్కిల్ అద్భుతం. ముఖ్యంగా మ్యాచ్ మొదటి రెండు రోజుల ఆటలో అతడు కీలకం కానున్నాడు.వికెట్-టు- వికెట్ బౌలింగ్ వేయగల సత్తా నితీశ్ సొంతం. ప్రపంచంలోని ప్రతీ క్రికెట్ జట్లూ పేసర్లకు సహాయపడగల ఆల్‌రౌండర్‌ను కోరుకుంటుంది. అయితే, జస్ప్రీత్ నితీశ్ సేవలను ఎలా ఉపయోగించుకుంటాడనేది చూడాలి. ఈ సిరీస్‌లో అందరినీ ఆకర్షించగల ఆటగాడు అనడంలో సందేహం లేదు’’ అని నితీశ్ రెడ్డిని మోర్కెల్ ప్రశంసించాడు.కాగా ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ తరఫున సత్తా చాటి.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి. ఈ క్రమంలో ఇప్పటికే టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేసిన ఈ విశాఖపట్నం కుర్రాడు.. ఆసీస్‌తో పర్యటనలో టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అదనపు బలం అదేఇప్పటికే పేస్ విభాగంలో బుమ్రా, సిరాజ్‌ల వంటి సీనియర్లతో పాటు ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా ఉన్నా.. బ్యాటింగ్ కూడా చేయడం నితీశ్‌కు ఉన్న అదనపు బలం. కాబట్టి బుమ్రా, సిరాజ్‌లతో పాటు 21 ఏళ్ల ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను తుదిజట్టులో ఆడించేందుకు మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి బీసీసీఐ ప్రకటించిన టీమిండియా..రోహిత్ శర్మ (కెప్టెన్)జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)యశస్వి జైస్వాల్అభిమన్యు ఈశ్వరన్శుభ్మన్ గిల్విరాట్ కోహ్లీకేఎల్ రాహుల్రిషభ్ పంత్ (వికెట్ కీపర్)సర్ఫరాజ్ ఖాన్ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్)రవిచంద్రన్ అశ్విన్రవీంద్ర జడేజామహ్మద్ సిరాజ్ఆకాశ్ దీప్ప్రసిద్ కృష్ణహర్షిత్ రాణానితీశ్ కుమార్ రెడ్డివాషింగ్టన్ సుందర్. చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా.. -
BGT 2024-25: టీమిండియాలోకి షమీ..?
టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. గాయం కారణంగా గతేడాది కాలంగా కాంపిటేటివ్ క్రికెట్‌కు దూరంగా ఉన్న షమీ ఇటీవలే ఓ రంజీ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో షమీ ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించిన సమయానికి షమీ పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. అందుకే అతన్ని మెగా సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అయితే ప్రస్తుతం టీమిండియా ఉన్న పరిస్థితుల్లో టీమిండియా మేనేజ్మెంట్ షమీ వైపు చూస్తుంది. బీజీటీకి అతన్ని ఎంపిక చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుంది. షమీ పూర్తి ఫిట్నెస్ సాధించడంతో పాటు రంజీ మ్యాచ్‌లో 40కి పైగా ఓవర్లు వేసి పూర్వ స్థితికి చేరాడు.బీజీటీ సుదీర్ఘకాలం సాగనుంది కాబట్టి షమీని ఏ సమయంలోనైనా భారత జట్టుకు ఎంపిక చేయవచ్చని తెలుస్తుంది. భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ అంశానికి బలం చేకూరుస్తున్నాయి.మోర్నీ మోర్కెల్ ఓ స్పోర్ట్స్ ఛానల్‌తో మాట్లాడుతూ.. మేము షమీని చాలా దగ్గర నుంచి గమనిస్తున్నాం. అతను సంవత్సరం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. షమీ తిరిగి క్రికెట్ ఆడటం టీమిండియాకు సానుకూలాంశం. షమీ తిరిగి జట్టులో చేరేందుకు తాము చేయాల్సినవన్నీ చేస్తున్నాం. భారత్‌లో షమీకి దగ్గరగా ఉన్న వాళ్లతో మేము టచ్‌లో ఉన్నాం. షమీ వరల్డ్ క్లాస్ బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నాడు.మోర్నీ మాటలను బట్టి చూస్తే షమీని బీజీటీలో బరిలోకి దించేందుకు టీమిండియా మేనేజ్మెంట్ శతవిధాల ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. బీజీటీలో షమీ సేవలు టీమిండియాకు చాలా అవసరం. ఈసారి బీజీటీలో భారత పేస్ అటాక్ మునుపెన్నడూ లేనంత బలహీనంగా కనిపిస్తుంది. ప్రస్తుత జట్టులో బుమ్రా ఒక్కడే అనుభవజ్ఞుడైన పేసర్. సిరాజ్‌కు ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉన్నా, ఇటీవలికాలంలో అతను పెద్దగా ఫామ్‌లో లేడు. మిగతా పేసర్లు ఆకాశ్‌దీప్, ప్రసిద్ద్ కృష్ణలకు అనుభవం చాలా తక్కువ. ఈ పరిస్థితుల్లో షమీ జట్టులో ఉంటే టీమిండియా విజయావకాశాలు మెరుగుపడతాయి. మరి భారత మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. -
ఇదేం బౌలింగ్?.. హార్దిక్ పాండ్యా శైలిపై కోచ్ అసంతృప్తి!
దాదాపు రెండు నెలల విరామం తర్వాత టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా పునరాగమనం చేయనున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సందర్భంగా ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పర్యవేక్షణలో యువ పేస్ దళంతో కలిసి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.హార్దిక్ పాండ్యా శైలిపై కోచ్ అసంతృప్తి!అయితే, హార్దిక్ పాండ్యా బౌలింగ్ శైలి పట్ల మోర్కెల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. స్టంప్స్‌నకు మరీ దగ్గరగా బంతిని విసిరే విధానాన్ని మార్చుకోవాలని హార్దిక్‌కు సూచించినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. పరిగెత్తుతూ.. బాల్‌ను రిలీజ్ చేసేటపుడు కూడా ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ ఆల్‌రౌండర్‌తో మోర్కెల్ గట్టిగానే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తన శైలికి భిన్నంగా మోర్కెల్ కాస్త స్వరం హెచ్చించి మరీ.. పాండ్యాకు పదే పదే బౌలింగ్ యాక్షన్ గురించి హితభోద చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. అయితే, ఇందుకు పాండ్యా కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. అనంతరం.. యువ ఫాస్ట్‌బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్‌లపై మోర్కెల్ దృష్టి సారించి.. వారి చేత ప్రాక్టీస్ చేయించినట్లు సమాచారం.సూర్యకుమార్ యాదవ్‌కు పెద్దపీటఇదిలా ఉంటే.. పేస్ బ్యాటరీ స్పీడ్ గన్స్‌ను తీసుకువచ్చిందంటూ ఈ బౌలర్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా హార్దిక్ పాండ్యా చివరగా శ్రీలంక పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. అయితే, ఈ టూర్ సందర్భంగా భారత పొట్టి క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పేరును ప్రకటిస్తారనుకుంటే.. బీసీసీఐ మాత్రం సూర్యకుమార్ యాదవ్‌కు పెద్దపీట వేసింది. మూడు టీ20లు.. వేదికలు ఇవేఅరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్‌కు గాయాల బెడద పొంచి ఉంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. ఇక తాజా సిరీస్ విషయానికొస్తే.. ఆదివారం(అక్టోబరు 6) నుంచి టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. ఇందులో భాగంగా జరిగే మూడు మ్యాచ్‌లకు గ్వాలియర్(అక్టోబరు 6), ఢిల్లీ(అక్టోబరు 9), హైదరాబాద్(అక్టోబరు 12) ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ క్రమంలో మొదటి టీ20 కోసం గ్వాలియర్‌కు చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్‌లో తలమునకలైంది. ఇక బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా యువ స్పీడ్ గన్ మయాంక్ యాదవ్ తొలిసారి టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు.బంగ్లాతో టీ20 సిరీస్‌కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.చదవండి: T20 World Cup 2024: 3836 రోజుల తర్వాత దక్కిన విజయం..!Bring out the speed guns, the pace battery has arrived! ⚡️⚡️#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/FM4Sv5E4s3— BCCI (@BCCI) October 4, 2024 -
గంభీర్ భయ్యా ఆరోజు నాతో చెప్పాడు: మయాంక్ యాదవ్
తాను టీమిండియాకు ఎంపికవుతానని ఊహించలేదన్నాడు యువ బౌలర్ మయాంక్ యాదవ్. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వెబ్సైట్ చూసిన తర్వాతే తనకు నమ్మకం కుదిరిందన్నాడు. ఆ తర్వాత తనను అభినందిస్తూ ఫోన్ కాల్స్ వచ్చాయని.. ఆ సమయంలో ఒక్కసారిగా గతం కళ్ల ముందు కదలాడిందని ఉద్వేగానికి లోనయ్యాడు.లక్నోకు ఆడిన మయాంక్టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ గతంలో చెప్పిన మాటలు తనపై ప్రభావం చూపాయని మయాంక్ యాదవ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. కాగా ఢిల్లీకి చెందిన మయాంక్.. 2024లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడిన ఈ పేస్ బౌలర్.. గంటకు 150కి పైగాకిలో మీటర్ల వేగంతో బంతులు విసిరి క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు.స్పీడ్‌కు గాయాల బ్రేక్వరుసగా రెండు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించి.. పేస్ స్టన్ గన్‌గా ప్రశంసలు అందుకున్నాడు. అయితే, గాయం కారణంగా అతడి స్పీడ్‌కు బ్రేక్ పడింది. పక్కటెముకల నొప్పితో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందిన మయాంక్ యాదవ్ ఇటీవలే మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. నెట్స్‌లో అతడి బౌలింగ్ పట్ల సంతృప్తివ్యక్తం చేసిన టీమిండియా సెలక్టర్లు బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు మయాంక్‌ను ఎంపిక చేశారు.గంభీర్ భయ్యా ఆరోజు నాతో చెప్పాడుఈ నేపథ్యంలో మయాంక్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘‘కొంత మంది ఆటగాళ్లు వరుసగా విఫలమైనా.. తమను తాము నిరూపించుకోవడానికి వరుస అవకాశాలు వస్తాయి.. కానీ కొంతమందికి మాత్రం ఎప్పుడో ఒకసారి ఒక్క ఛాన్స్ మాత్రమే వస్తుంది’ అని గౌతం గంభీర్ భయ్యా ఓసారి నాతో చెప్పాడు. నిజానికి నన్ను ఓ ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేసిన తర్వాత కూడా షూ స్పాన్సర్ కోసం వెతుక్కోవాల్సిన దుస్థితిలో ఉన్న రోజులవి..నన్ను నేను నిరూపించుకున్నానుఆ సమయంలో గౌతం భయ్యా మాటలో నా మనసులో అలాగే ఉండిపోయాయి. ఆయనతో పాటు విజయ్ దహియా(లక్నో మాజీ కోచ్) కూడా.. కనీసం రెండేళ్ల తర్వాతైనా నువ్వు మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడతావు. అప్పటి వరకు ఓపికగా వేచిచూడు అని చెప్పారు. ఈ ఏడాది ఆ అవకాశం వచ్చింది. నన్ను నేను నిరూపించుకున్నాను.ఇక నేను టీమిండియాకు ఎంపికయ్యాననే విషయం కాస్త ఆలస్యంగానే తెలిసింది. ఎన్సీఏలో నా సహచర ఆటగాళ్లకు కంగ్రాట్యులేషన్స్ చెబుతూ కాల్స్ వచ్చాయి. అప్పుడు నేను బీసీసీఐ అధికారిక వెబ్సైట్ చూస్తే టీ20 జట్టులో నా పేరు కూడా కనిపించింది. అప్పుడు ఒక్కసారిగా గతం గుర్తుకు వచ్చింది. అరంగేట్రం ఖాయమే!వరుస గాయాలతో సతమతమవుతూ నేను ఎన్సీఏకు చేరడం.. నాలుగు నెలలు అక్కడే ఇప్పుడిలా జట్టుకు ఎంపిక కావడం.. అన్నీ గుర్తుకువచ్చాయి’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. కాగా 22 ఏళ్ల మయాంక్ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం దాదాపు ఖాయమైనట్లే! లక్నో సూపర్ జెయింట్స్ మాజీ మెంటార్ గంభీర్, మాజీ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్లకు మయాంక్ నైపుణ్యాల గురించి అవగాహన ఉంది. వీరిద్దరిలో ఒకరు ఇప్పుడు టీమిండియా హెడ్‌కోచ్, మరొకరు బౌలింగ్ కోచ్ అన్న సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా స్టార్లంతా రెండు నెలలు ఆటకు దూరం -
బంగ్లాతో టీ20లు.. టీమిండియాలోకి పేస్ గన్ ఎంట్రీ!
భారత సంచలన పేసర్ మయాంక్ యాదవ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా ఈ యువ స్పీడ్‌స్టర్ టీమిండియా తరఫున అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.మెరుపు వేగంతో దూసుకువచ్చే బంతులు విసరడంలో దిట్టలక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ రైటార్మ్ బౌలర్.. తన మెరుపు వేగంతో హాట్‌టాపిక్‌గా మారాడు. గంటకు 150కి పైగా కిలో మీటర్ల వేగంతో బంతులు విసురుతూ యువ బౌలర్లందరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. లక్నో తరఫున వరుసగా రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుని.. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.మ్యాచ్ ఫిట్నెస్ కూడా సాధించాడు!అయితే, ఆ వెంటనే గాయం కారణంగా మయాంక్ జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న అతడు.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి చేరాడు. అక్కడి వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందిన 22 ఏళ్ల మయాంక్.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. మ్యాచ్ ఫిట్నెస్ కూడా సాధించాడు.టీమిండియా సెలక్టర్ల ఆరాఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘గత నెల రోజులుగా మయాంక్ గాయం కారణంగా ఎలాంటి ఇబ్బందిపడలేదు. ఎన్సీఏ నెట్స్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడా? లేదా? అని టీమిండియా సెలక్టర్లు ఆరా తీశారు.స్వదేశంలో వరుస టెస్టు సిరీస్‌లు ఉన్న కారణంగా.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా ఎక్కువగా కొత్త ముఖాలకే చోటు ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. మయాంక్ ఇక్కడ రోజుకు 20 ఓవర్ల పాటు వైట్‌బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్నాడు.ఎన్సీఏలో అతడి ప్రదర్శన చూసిన తర్వాత.. టీమిండియా సెలక్టర్లు అతడి బంగ్లాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేస్తారనే నమ్మకం బలపడింది. ఎన్సీఏ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం కోసం టీమిండియా ఛీఫ్ సెలక్టర్ అగార్కర్ బెంగళూరుకు రానున్నాడు. అప్పుడు ఈ విషయంపై స్పష్టత వస్తుంది.గంభీర్, మోర్కెల్లకు తెలుసుఅయినా.. మయాంక్‌ను కేవలం టీ20 ఫార్మాట్‌కే పరిమితం చేయాలని సెలక్టర్లు భావించడం లేదు. టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతం గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉన్న సమయంలో మయాంక్‌ను దగ్గరగా గమనించారు. అతడి ప్రతిభ గురించి వారికి తెలుసు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో వ్యాఖ్యానించాయి. దీనిని బట్టి బంగ్లాదేశ్‌తో అక్టోబరు 6-12 మధ్య జరుగనున్న టీ20 సిరీస్‌కు మయాంక్ యాదవ్ ఎంపిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.చదవండి: లివింగ్‌స్టోన్ విధ్వంసం.. బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్.. మట్టికరిచిన ఆసీస్ -
మోర్నీ మోర్కెల్ పనికిరాడన్నట్లు చూశారు: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ బౌలర్లపై ఆ దేశ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఘాటు విమర్శలు చేశాడు. అహంభావం పెరిగిపోయి.. ఆటను, కోచ్‌లను కూడా లెక్కచేయని స్థితికి చేరారని మండిపడ్డాడు. అందుకు జట్టు పరాజయాల రూపంలో భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.వరుస వైఫల్యాలతో..గత కొంతకాలంగా పాక్ క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టిన బాబర్ సేన.. టీ20 ప్రపంచకప్-2024లోనూ మరీ దారుణంగా నిరాశపరిచింది. పసికూన అమెరికా చేతిలో ఓటమి కారణంగా కనీసం సూపర్-8 దశకు చేరకుండానే నిష్క్రమించింది. ఇక ద్వైపాక్షిక సిరీస్‌లనూ ఇదే తంతు.ఆస్ట్రేలియలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన షాన్ మసూద్ బృందం.. ఇటీవల సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ అదే ఫలితం పునరావృతం చేసింది. పాక్ టెస్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా బంగ్లా చేతిలో మ్యాచ్ ఓడటమే కాకుండా.. 2-0తో క్లీన్‌స్వీప్ అయింది.టీమిండియా వరుస విజయాలతోమరోవైపు.. పాకిస్తాన్ చిరకాల ప్రత్యర్థిగా భావించే టీమిండియా ఇటీవలే పొట్టి వరల్డ్‌కప్ రెండోసారి సొంతం చేసుకోవడంతో పాటు... వరుస విజయాలతో దూసుకుపోతూ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు చేరవవుతోంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ తమ జట్టు బౌలర్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మోర్నీ మోర్కెల్ ఎందుకూ కొరగాడు అన్నట్లుగా‘‘పాకిస్తానీ బౌలర్లు ... క్రికెట్ కంటే కూడా తామే గొప్ప అన్నట్లుగా భావిస్తారు. తమ ముందు మోర్నీ మోర్కెల్ ఎందుకూ కొరగాడు అన్నట్లుగా ప్రవర్తించారు. సొంతగడ్డపై బంగ్లాదేశ్ మమ్మల్ని ఓడించింది. అదే భారత్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆటగాళ్ల ఆలోచనా విధానం, ప్రవర్తనపైనే అంతా ఆధారపడి ఉంటుంది’’ అని బసిత్ అలీ పాకిస్తాన్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్‌లను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశాడు.బౌలింగ్ కోచ్గాటీమిండియా ప్రస్తుత పేస్ దళం పాక్ దిగ్గజాలు వసీం అక్రం, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్‌ల మాదిరి అద్భుతంగా ఉందని బసిత్ అలీ ఈ సందర్భంగా కొనియాడాడు. కాగా గతేడాది వరకు పాక్ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్.. ప్రస్తుతం టీమిండియా తరఫున విధులు నిర్వర్తిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు సందర్భంగా బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: Ind vs Ban: ఈ మ్యాచ్‌లో క్రెడిట్ మొత్తం వాళ్లకే: పాక్ మాజీ క్రికెటర్Ind vs Aus: ప్రపంచంలోనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్.. మాకు కష్టమే: స్మిత్ -
Ind vs Ban: కోహ్లి బ్యాటింగ్ ప్రాక్టీస్.. జట్టుతో చేరిన కొత్త కోచ్
దాదాపు ఆరు నెలల విరామం తర్వాత టీమిండియా టెస్టు బరిలో దిగనుంది. సొంతగడ్డపై సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్‌కు చెన్నైలోని ఎంఏ చిదంబరం(చెపాక్) స్టేడియం వేదిక. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమిళనాడుకు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది.సీనియర్లంతా వచ్చేశారుభారత క్రికెట్ నియంత్రణ మండలి ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా శుక్రవారం నాటి నెట్ సెషన్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.45 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన కోహ్లికాగా శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాత లండన్ వెళ్లిపోయిన విరాట్ కోహ్లి.. నెల రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడే మళ్లీ ఇండియాకు తిరిగొచ్చాడు. వచ్చీ రాగానే యాక్షన్‌లో దిగాడు. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సమక్షంలో కోహ్లి తొలి రోజు దాదాపుగా 45 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసినట్లు సమాచారం.మూడేళ్ల తర్వాత తాను తొలిసారిగా చెన్నైలో తొలి టెస్టు ఆడనున్న నేపథ్యంలో.. అభిమానులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో కోహ్లి ఇలా తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా చెపాక్ స్టేడియంలో కోహ్లికి మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు టెస్టులు ఆడిన ఈ ఢిల్లీ బ్యాటర్... ఒక సెంచరీ సాయంతో 267 పరుగులు చేశాడు.టీమిండియాతో చేరిన మోర్నీ మోర్కెల్నూతన బౌలింగ్ కోచ్, సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ టీమిండియాతో చేరాడు. హెడ్‌కోచ్ గంభీర్, అసిస్టెంట్ కోచ్‌లు అభిషేక్ నాయర్, డష్కాటేలతో కలిసి రోహిత్ సేన ప్రాక్టీస్‌ను గమనించాడు. కాగా స్వదేశంలో ఓ సిరీస్‌కు ముందు భారత జట్టు వారం రోజుల పాటు ట్రెయినింగ్ క్యాంపులో పాల్గొనడం ఇదే తొలిసారి.బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్. బంగ్లాదేశ్ టెస్టు జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), షాద్మన్ ఇస్లామ్, జాకీర్ హసన్, మోమినుల్, ముష్ఫికర్, షకీబుల్ హసన్, లిటన్ దాస్, మెహదీ హసన్ మిరాజ్, జాకీర్ అలీ, తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా, తైజుల్ ఇస్లామ్, మెహమూదుల్ హసన్, నయీమ్, ఖాలిద్ అహ్మద్. చదవండి: నా కుమారుడికి అవకాశాలు ఇస్తారనుకున్నా: పాక్ మాజీ కెప్టెన్ -
టీమిండియా కోచ్‌గా తమ్ముడు.. అన్న ఆసక్తికర వ్యాఖ్యలు
బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగా టీమిండియా బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ ప్రయాణం మొదలుకానుంది. ప్రధాన కోచ్ గౌతం గంభీర్ సహాయక బృందంలోని ర్యాన్ టెన్ డస్కటే, అభిషేక్ నాయర్లతో అతడు కూడా చేరనున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా జరుగనున్న ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ భారత జట్టుకు కీలకంగా మారింది.ఈ నేపథ్యంలో మోర్నీ మోర్కెల్ అన్నయ్య, మాజీ క్రికెటర్ ఆల్బీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోచింగ్ సిబ్బందిలో భాగమయ్యే అవకాశం రావడం అరుదని.. ఇలాంటి బాధ్యతను సక్రమంగా నెరవేరిస్తేనే అంతా సాఫీగా సాగిపోతుందని అన్నాడు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు.ఈ మేరకు ఆల్బీ మోర్కెల్ మాట్లాడుతూ.. ‘‘ఇతర జట్లతో పోలిస్తే టీమిండియాకు కోచ్‌గా పనిచేయడం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. సుదీర్ఘ కాలంగా విజయవంతమైన జట్టుగా భారత్ కొనసాగుతోంది. అలాంటి చోట పొరపాట్లకు తావుండదు. ఇక ఆ జట్టులో ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించిన ఆటగాళ్లు ఉన్నారు.ముందుగా వారందరి నమ్మకం చూరగొనడం మోర్నీకి అత్యంత ముఖ్యమైనది. తమ నైపుణ్యాలకు మరింత మెరుగులుదిద్దుకునేలా మోర్నీ సహకరిస్తాడని వారు విశ్వసించాలి. అప్పుడే చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ బౌలర్‌గా మోర్నీకి ఎంతో అనుభవం ఉంది.అతడి మార్గదర్శనంలో టీమిండియా బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుంది. మోర్నీ గనుక తన ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే.. భారత జట్టుకు తప్పక మేలు చేకూరుతుంది’’ అని పేర్కొన్నాడు. మిడ్ డే తో మాట్లాడుతూ ఆల్బీ మోర్కెల్ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా మోర్నీ మోర్కెల్‌కు గంభీర్‌తో మంచి అనుబంధం ఉంది.ఐపీఎల్లో కేకేఆర్ తరఫున గంభీర్ సారథ్యంలో ఆడాడు మోర్నీ. అనంతరం... లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా గంభీర్ పనిచేసిన సమయంలో అతడు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఇక సౌతాఫ్రికా తరఫున 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20లు ఆడిన మోర్నీ మోర్కెల్.. ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి 544 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం మోర్కెల్ పలు జట్లకు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. -
గంభీర్ ప్లాన్: బౌలింగ్ కోచ్‌గా అతడే ఎందుకంటే?!
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ ప్రయాణం మొదలుకానుంది. మూడేళ్లపాటు అతడు ఈ పదవిలో కొనసాగనున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోగా... మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అతడి స్థానాన్ని భర్తీ చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటన సందర్భంగా ప్రధాన శిక్షకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన గౌతీ.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ తరఫున తనతో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, టెన్ డస్కటేను తన సహాయక బృందంలో చేర్చుకున్నాడు. ఆ టూర్లో భారత మాజీ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే టీమిండియా తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. టీమిండియా మాజీలను కాదనిఈ నేపథ్యంలో పూర్తి స్థాయి బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ నియమితుడైనట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా బుధవారం వెల్లడించారు. ఇక 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు మోర్కెల్ కాంట్రాక్ట్ కొనసాగనుందని తెలిపారు. కాగా టీమిండియా బౌలింగ్ కోచ్ రేసులో వినయ్ కుమార్, లక్ష్మీపతి బాలాజీ వంటి భారత మాజీ పేసర్ల పేర్లు కూడా వినిపించిన విషయం తెలిసిందే.బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ఎంపికకు కారణం ఇదే!అయితే, గంభీర్ కోరిక మేరకే మోర్నీ మోర్కెల్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ.. ‘‘హెడ్‌కోచ్ పదవి విషయంలో మాత్రమే క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించడం తప్పనిసరి. సహాయక బృందం విషయంలో ప్రధాన కోచ్ సిఫారసును పరిగణనలోకి తీసుకుంటారు. గంభీర్ గతంలో మోర్నీతో పని చేశాడు.అతడి నైపుణ్యాల గురించి గంభీర్‌కు పూర్తి అవగాహన ఉంది. అందుకే అతడిని తన టీమ్‌లో చేర్చుకున్నాడు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఈ ఏడాది నవంబరులో ఆస్ట్రేలియాతో టీమిండియా ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ ఆడబోతోంది. ఇలాంటి సమయంలో... భారత బౌలింగ్ కోచ్‌గా... ఆసీస్ గడ్డపై విజయవంతమైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న సౌతాఫ్రికన్ కంటే అత్యుత్తమ ఎంపిక మరొకటి ఉండదు.వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తోనూ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే విదేశీ గడ్డపై గొప్ప అనుభవం ఉన్న బౌలర్ కోచ్‌గా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే గంభీర్ తన ప్రణాళికలకు అనుగుణంగానే ఏరికోరి మోర్నీని తన బృందంలో చేర్చుకున్నాడు’’ అని పేర్కొన్నాయి.మూడు దేశాలకు కోచ్‌గా... మోర్కెల్‌కు గంభీర్‌కు మధ్య మంచి సమన్వయం ఉంది. ఐపీఎల్లో కేకేఆర్ తరఫున గంభీర్ సారథ్యంలో ఆడిన మోర్నీ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో లక్నో ఫ్రాంచైజీకి గంభీర్ మెంటార్‌గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టి20లు ఆడిన మోర్నీ మోర్కెల్ ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి 544 వికెట్లు పడగొట్టాడు.కెరీర్‌కు వీడ్కోలు పలికిన అనంతరం మోర్కెల్ పలు జట్లకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా పాకిస్తాన్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన మోర్కెల్... మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించాడు. వారిని మెరిల్లా తీర్చిదిద్దడంలో పాత్రఇక ఈ ఏడాది జరిగిన పురుషుల టీ20 ప్రపంచకప్‌లో నమీబియా జట్టుకూ మోర్కెల్ శిక్షణ ఇచ్చాడు. ఇక ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన నయా పేస్ సంచలనం మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్ మెరుగైన ప్రదర్శన వెనక కూడా మోర్కెల్ కృషి ఉంది.ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ మొదలుకానుంది. కాగా గంభీర్ బృందంలో అభిషేక్ నాయర్, టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్‌గా హైదరాబాద్‌కు చెందిన టి.దిలీప్ కొనసాగుతున్నాడు. తాజాగా మోర్నీ మోర్కెల్ నియామకంతో ఇక కోచింగ్ స్టాఫ్ ఎంపిక ముగిసినట్లయింది. -
టీమిండియాకు కొత్త బౌలింగ్ కోచ్.. జై షా ప్రకటన
టీమిండియా బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా క్రిక్‌బజ్‌కు తెలిపాడు. మోర్కెల్ కాంట్రాక్ట్ సెప్టెంబర్ 1 నుంచి మొదలవుతుందని షా పేర్కొన్నాడు. కాగా, టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్‌కు తొలి అసైన్మెంట్ బంగ్లాదేశ్ సిరీస్ అవుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో బంగ్లాదేశ్ రెండు టెస్ట్‌లు, మూడు టీ20ల కోసం భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌ల నుంచి మోర్నీ భారత బౌలింగ్ కోచ్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు.ఇదిలా ఉంటే, టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఇటీవలే నియమితుడైన విషయం తెలిసిందే. తాజాగా శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా ఛార్జ్ తీసుకున్నాడు. ఆ సిరీస్‌లలో భారత తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే వ్యవహరించాడు.గంభీర్ తన సహాయ బృందం ఎంపిక విషయంలో బీసీసీఐని ఒప్పించి మరీ తనకు అనుకూలమైన వారిని ఎంపిక చేయించుకున్నాడు. గంభీర్ టీమ్‌లో ప్రస్తుతం అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్ ఉన్నారు. తాజాగా గంభీర్ తాను రెకమెండ్ చేసిన మోర్నీ మోర్కెల్‌కు భారత బౌలింగ్ కోచ్ పగ్గాలు అప్పజెప్పి తన పంతం నెగ్గించుకున్నాడు. గంభీర్, మోర్కెల్ గతంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు కలిసి పని చేశారు. ఈ పరిచయంతోనే గంభీర్ మోర్కెల్ పేరును ప్రతిపాదించాడు. -
ఐపీఎల్ ఫ్రాంఛైజీకి గుడ్‌బై.. టీమిండియా బౌలింగ్ కోచ్‌గా!
టీమిండియా బౌలింగ్ కొత్త కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ ఎంపిక ఖరారైనట్లు సమాచారం. నూతన హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సహాయక సిబ్బందిలో చేరేందుకు మోర్కెల్ మార్గం సుగమం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రొటిస్ పేస్ దళంలో కీలక బౌలర్‌గా సేవలు అందించిన మోర్నీ మోర్కెల్.. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌తో బంధం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా గౌతం గంభీర్ వ్యవహరించిన సమయంలో ఆ జట్టు కీలక పేసర్లలో మోర్కెల్ ఒకడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ లక్నో సూపర్ జెయింట్స్‌లో కలిసి పనిచేశారు. లక్నో మెంటార్‌గా గంభీర్ వ్యవహరించగా.. బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ఉన్నాడు.అనంతరం గంభీర్ కేకేఆర్ మెంటార్‌గా మారగా.. మోర్కెల్ మాత్రం ఐపీఎల్-2024లోనూ లక్నోతోనే కొనసాగాడు. తాజాగా ఫ్రాంఛైజీతో బంధం తెంచుకునేందుకు మోర్నీ మోర్కెల్ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియా బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యే క్రమంలోనే 39 ఏళ్ల మోర్కెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత జట్టు కోచ్‌గా పనిచేయాలంటే.. ఇతర బాధ్యత(క్రికెట్‌కు సంబంధించిన)ల నుంచి సదరు వ్యక్తులు వైదొలగాలన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే గంభీర్ కేకేఆర్‌ను వీడగా.. ఇప్పుడు మోర్నీ మోర్కెల్ కూడా అదే బాటలో నడవాలని నిర్ణయించుకున్నట్లు ఇన్‌సైడ్‌స్పోర్ట్ వెల్లడించింది. టీమిండియా శ్రీలంక పర్యటన తర్వాత టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నె మోర్కెల్ నియామకానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా తన తండ్రి అనారోగ్యం దృష్ట్యా మోర్కెల్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. జూలై 27 నుంచి శ్రీలంక- టీమిండియా మధ్య ద్వైపాక్షిక సిరీస్ మొదలుకానుంది. ఇరు జట్ల మధ్య తొలుత మూడు టీ20లు.. తర్వాత మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరుగనుంది. ఈ టూర్‌తో టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్ ప్రస్థానం ఆరంభం కానుంది. ఇక ఈ పర్యటనలో టీమిండియా బౌలింగ్ తాత్కాలిక కోచ్ సాయిరాజ్ బహుతులే ఎంపికయ్యాడు. కేకేఆర్‌లో గౌతీ సహచరులు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డష్కాటే అసిస్టెంట్ కోచ్‌లుగా పనిచేయనుండగా.. ఫీల్డింగ్ కోచ్‌గా టి.దిలీప్ రీఎంట్రీ ఇచ్చాడు. -
బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ కావాలి.. ఎటూ తేల్చని బీసీసీఐ
సహాయ సిబ్బందిని ఎంపిక చేసుకునే విషయంలో పూర్తి స్వేచ్ఛ కావాలని బీసీసీఐతో ముందే ఒప్పందం చేసుకున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. తాజాగా తన సపోర్టింగ్ స్టాఫ్ లిస్ట్‌లో కొత్త పేరును చేర్చాడు. సహాయ కోచ్‌లుగా అభిషేక్ నాయర్, టెన్ డస్కటే.. ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ పేర్లను ఇదివరకే ప్రతిపాదించిన గంభీర్.. బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ పేరును కొత్తగా తెరపైకి తెచ్చాడు. మోర్నీ మోర్కెల్ గతంలో గంభీర్‌తో కలిసి లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీకి పని చేశాడు. ఈ సాన్నిహిత్యంతోనే గంభీర్ మోర్నీ పేరును ప్రతిపాదించి ఉండవచ్చు. మోర్నీకి ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉంది.ఇదిలా ఉంటే, గంభీర్ ఎంపికల విషయంలో బీసీసీఐ ఓ మెలిక పెట్టినట్లు తెలుస్తుంది. సహాయ సిబ్బందిగా భారతీయులనే ఎంపిక చేసుకోవాలని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గంభీర్ ముగ్గురు విదేశీ కోచ్‌ల పేర్లను ప్రతిపాదించడం చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐ.. గంభీర్ ప్రతిపాదనలను ఒప్పుకుంటుందో లేదో మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది.గంభీర్ ప్రతిపాదనలను అటుంచితే.. టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్‌ను కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. మోర్నీ కాకపోతే బౌలింగ్ కోచ్‌లుగా లక్షీపతి బాలాజీ, వినయ్ కుమార్‌లలో ఎవరో ఒకరిని ఎంపిక చేయాలని గంభీర్ కోరినట్లు తెలుస్తుంది. గంభీర్ ప్రతిపాదనలు.. సొంత ఛాయిసెస్ నడుమ బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. -
దక్షిణాఫ్రికా గెలవాలంటే అదొక్కటే మార్గం: మోర్కెల్
టీ20 వరల్డ్-2024 ఫైనల్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టైటిల్ పోరు కోసం ఇరు జట్లు ఇప్పటికే తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ 13 ఏళ్ల వరల్డ్‌కప్ నిరీక్షణకు తెరదించాలని భారత్ భావిస్తుంటే.. మరోవైపు దక్షిణాఫ్రికా తొలిసారి ట్రోఫీని ముద్దాడాలన్న కసితో ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు ఆ జట్టు మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ కీలక సూచనలు చేశాడు. ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లను ఎదుర్కొనేందుకు ప్రోటీస్ బ్యాటర్లు అతిగా ఆలోచించకూడదని మోర్కల్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది మెగా టోర్నీలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ దుమ్ములేపుతున్నారు. బుమ్రా తన 7 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ కేవలం 4 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు."బుమ్రా అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడిని ఎదుర్కొవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆరంభంలో వికెట్లు తీసే సత్తా బుమ్రాకు ఉంది. అంతేకాకుండా డెత్ ఓవర్లలో కూడా అతడు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలడు.పవర్ ప్లేలో రెండు ఓవర్లు, తర్వాత మళ్లీ ఆఖరి ఓవర్లలోనే బుమ్రా అటాక్‌లో వస్తాడు. కాబట్టి మా జట్టుకు నేను ఇచ్చే సలహా ఒక్కటే. మిడిల్ ఓవర్లలో మా బ్యాటర్లు బాగా రాణించి పరుగులు చేపట్టాలి. అప్పుడే గౌరవప్రదమైన స్కోరును సాధించడానికి అవకాశముంటుంది. అయితే మిడిల్ ఓవర్లలో భారత బౌలర్లను ఎటాక్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడొక వికెట్ టేకర్. తన బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తడిలోకి నెట్టగలడు. కాబట్టి సౌతాఫ్రికా బ్యాటర్లు ఒత్తడికి లోనవ్వకుండా బాల్ టూ బాల్ టూ ఆచితూచి ఆడాలి. అప్పుడే దక్షిణాఫ్రికా గేమ్‌లో ఉటుందని"ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోర్కల్ పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
World Cup 2023: వరల్డ్‌కప్‌లో దారుణ ప్రదర్శన.. పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ రాజీనామా
వన్డే ప్రపంచకప్-2023లో దారుణ ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ జట్టు.. లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ ఏడాది జూన్‌లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో మోర్కెల్ ఆరు నెలల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఇంకా సమయం ఉనప్పటికీ మోర్కెల్ ముందుగానే తన పదవి నుంచి తప్పుకున్నాడు. అయితే తన పదవీ కాలాన్ని పొడిగిస్తారని మొదటిలో వార్తలు విన్పించినప్పటికి.. వరల్డ్‌కప్‌లో పాక్ పేసర్లు దారుణంగా విఫలమకావడంతో మోర్కెల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది జూలైలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌తో పాక్ బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ప్రయాణం మొదలైంది. ఇక మోర్కెల్ తప్పుకోవడంతో పాకిస్తాన్ బౌలింగ్ కోచ్‌గా ఉమర్ గుల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. గతంలో కూడా ఉమర్ గుల్ పాక్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. వచ్చే నెలలో పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లానుంది. ఈ పర్యటనకు ముందు పాకిస్తాన్‌కు కొత్త బౌలింగ్ కోచ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్‌లో పాక్ తలపడనుంది. -
IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ కీలక ప్రకటన.. ఇకపై గంభీర్..
IPL 2024- Lucknow Super Giants: ఐపీఎల్-2024 నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ తమ కోచింగ్ సిబ్బందిని ప్రకటించింది. టీమిండియా మాజీ స్టార్ గౌతం గంభీర్‌ను గ్లోబల్ మెంటార్‌గా ప్రమోట్ చేసిన మేనేజ్మెంట్.. శ్రీధరన్ శ్రీరామ్‌ను తమ కుటుంబంలోకి ఆహ్వానించింది. హెడ్‌కోచ్ అతడే గతంలో ఆస్ట్రేలియా క్రికెట్ స్పిన్ కన్సల్టెంట్‌గా పనిచేసిన శ్రీరామ్ ఎల్ఎస్జీ అసిస్టెంట్ కోచ్‌గా సేవలు అందించనున్నాడు. ఇక లక్నో ఫ్రాంఛైజీ తమ జట్టు హెడ్‌కోచ్‌గా ఇప్పటికే జస్టిన్ లాంగర్‌ను నియమించిన విషయం తెలిసిందే. అతడికి తోడుగా.. విజయ్ దహియా, ప్రవీణ్ తాంబేలతో పాటు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు మోర్నీ మోర్కెల్, జాంటీ రోడ్స్ అసిస్టెంట్ కోచ్‌లుగా పనిచేయనున్నారు. PC: LSG బంగ్లాదేశ్‌ను గెలుపుబాటలో నడిపి శ్రీధరన్ శ్రీరామ్ చేరిక లక్నో సూపర్ జెయింట్స్‌కు అదనపు బలంగా మారనుంది. 47 ఏళ్ల ఈ టీమిండియా మాజీ స్పిన్నర్ గతంలో బంగ్లాదేశ్ పురుషుల టీ20 జట్టుకు మార్గదర్శనం చేశాడు. టీ20 వరల్డ్‌కప్-2022లో సూపర్-12లో బంగ్లా అద్భుతంగా ఆడేలా కోచింగ్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా జట్టుకు సైతం అంతేకాదు.. ఆస్ట్రేలియా జట్టుకు సైతం శ్రీరామ్ కోచ్‌గా వ్యవహరించాడు. టీ20 వరల్డ్‌కప్, 2021-22 యాషెస్ సిరీస్ సమయంలో జట్టుతో ప్రయాణించాడు. అదే విధంగా.. గతంలో ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. ప్లేఆఫ్స్ చేరినా.. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయంతో సీజన్ మధ్యలోనే వైదొలిగినా జట్టు ఐపీఎల్-2023 ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించగలిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం ఒకే ఒక్క రన్ తేడాతో టాప్-4లో నిలిచిన లక్నో కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. కోహ్లి- గంభీర్ వివాదం ఇదిలా ఉంటే.. లక్నో- ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా నవీన్ ఉల్ హక్ కారణంగా విరాట్ కోహ్లి- గంభీర్ మధ్య తలెత్తిన గొడవ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. స్థాయి మరిచి ప్రవర్తించిన ఈ ఇద్దరు స్టార్లపై క్రికెట్ దిగ్గజాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చదవండి: అవసరం లేదు! సంజూ శాంసన్‌ను స్వదేశానికి పంపిన బీసీసీఐ S Sriram joins to complete our coaching staff for 2024 💙 Full story 👉 https://t.co/4svdieJytL pic.twitter.com/8EgX2Pg8uP — Lucknow Super Giants (@LucknowIPL) September 9, 2023 -
T20 WC 2023: న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ పేసర్
Morne Morkel: సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ న్యూజిలాండ్ కోచింగ్ స్టాఫ్‌లో భాగం కానున్నాడు. స్వదేశంలో జరుగనున్న మహిళా టీ20 ప్రపంచకప్ టోర్నీ నేపథ్యంలో వైట్ఫెర్న్స్కు బౌలింగ్‌లో మెళకువలు నేర్పించనున్నాడు. కివీస్ మహిళా జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కాగా 38 ఏళ్ల మోర్నీ మోర్కెల్ ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఈవెంట్లో నమీబియా పురుషుల జట్టు కోచ్‌గా పనిచేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో బిజీగా ఉన్నాడు. ప్రొటిస్ పొట్టి లీగ్‌లో అతడు డర్బన్ సూపర్‌జెయింట్స్ బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. సౌతాఫ్రికాలో టోర్నీ ఈ క్రమంలో మెగా టోర్నీ నేపథ్యంలో న్యూజిలాండ్ ఈ మేరకు మోర్కెల్ నియామకానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం విశేషం. సౌతాఫ్రికాలో ఈ వరల్డ్‌కప్ జరుగనున్న తరుణంలో అక్కడి పిచ్‌ల గురించి అవగాహన ఉన్న మేటి బౌలర్‌ను తమ కోచ్‌గా ఎంపిక చేసుకోవడం గమనార్హం. కాగా 2006- 2018 మధ్య కాలంలో మోర్నీ మోర్కెల్ సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. జాతీయ జట్టు తరఫున మొత్తంగా 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ టెస్టులో 309, వన్డేల్లో 188, టీ20లలో 47 వికెట్లు తీశాడు. ఇక న్యూజిలాండ్ మహిళా జట్టు ఇటీవలి కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. కాగా ఫిబ్రవరిలో మహిళ టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానుంది. ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మొత్తం జట్లు: 10 చదవండి: IND vs SL: శ్రేయస్ అయ్యర్ సూపర్ బౌలింగ్.. కోహ్లి షాకింగ్ రియాక్షన్! వీడియో వైరల్ Sarfaraz Khan: అప్పుడేమో సిద్ధంగా ఉండమన్నారు! కానీ చివరకు.. నేనూ మనిషినే.. నాకూ భావోద్వేగాలు ఉంటాయి.. -
'37 ఏళ్ల వయస్సులో అదరగొడుతున్నాడు.. అతడిని జట్టులోకి తీసుకోండి'
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఫాప్ డు ప్లెసిస్‌ను దక్షిణాఫ్రికా జట్టులోకి తీసుకోవాలని ఆ దేశ మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. కాగా డుప్లెసిస్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్‌కు సంబంధించిన ప్రణాళికలలో భాగంగా లేడు. అదే విధంగా అతడు తన దక్షిణాఫ్రికా క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. కాగా డుప్లెసిస్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2020లో ఆడాడు. ఇక ఐపీఎల్-2022లో ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన డుప్లెసిస్ పర్వాలేదనిపించాడు. ఈ ఏడాది సీజన్లో 468 పరుగులు చేసిన డుప్లెసిస్.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. "డు ప్లెసిస్ 37 ఏళ్ల వయస్సులో కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు ఫీల్డింగ్‌లో కూడా అదరగొడుతున్నాడు. డుప్లెసిస్ ఐపీఎల్లో ఆర్సీబీ తరుపున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. కాబట్టి అటువంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు దక్షిణాఫ్రికా జట్టులో ఉండాలి. క్రికెట్ సౌతాఫ్రికా పునరాలోచన చేసి అతడిని ప్రపంచకప్‌కు జట్టులోకి తీసుకురావాలి" అని మోర్కెల్ పేర్కొన్నాడు. చదవండి: Sourav Ganguly 50th Birthday: లండన్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్న దాదా -
మోర్నీ మోర్కెల్ వేగవంతమైన బంతి.. దిల్షాన్ భయపడ్డాడు
తొలిసారి నిర్వహించిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 టోర్నీ విజేతగా వరల్డ్ జెయింట్స్ నిలిచింది. ఆసియా లయన్స్‌తో జరిగిన ఫైనల్లో వరల్డ్ జెయింట్స్ 25 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆసియా లయన్స్ గట్టిపోటీ ఇచ్చినప్పటికి పరాజయం పాలైంది. ఆట సంగతి ఎలా ఉన్నా.. మాజీ క్రికెటర్లంతా ఒక దగ్గరికి చేరి టోర్నీ ఆడడం అభిమానులకు మాత్రం సంతోషాన్ని పంచింది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ బౌలర్ మోర్నీ మోర్కెల్ టోర్నీ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని సంధించాడు. 37 ఏళ్ల మోర్కెల్ మంచి ఫాస్ట్ బౌలర్ అన్న సంగతి తెలిసిందే. ప్రొటీస్‌కు క్రికెట్ ఆడిన రోజుల్లో ఎన్నోసార్లు వేగవంతమైన బంతులు విసిరాడు. తాజాగా ఫైనల్ మ్యాచ్‌లో తిలకరత్నే దిల్షాన్‌కు వేసిన ఒక బంతి గంటకు 138 కిమీవేగంతో వెళ్లింది. మంచి పేస్‌తో.. బౌన్స్‌తో వచ్చిన బంతిని దిల్షాన్ ఆడడంలో ఇబ్బంది పడ్డాడు. అయితే బంతి విసిరిన తర్వాత పట్టుతప్పిన మోర్కెల్ క్రీజులోనే కిందపడ్డాడు. అతను పడ్డ విధానం చూసి గాయమైందనే అనుకున్నారు. కానీ అదృష్టం బాగుండడంతో మోర్కెల్‌కు ఎలాంటి గాయం కాలేదు. ఇదే మ్యాచ్‌లో తన సోదరుడు అల్బీ మోర్కెల్ మూడు వికెట్లతో రాణించాడు. కాగా మోర్నీ మోర్కెల్ దిల్షాన్‌ను తన తర్వాతి ఓవర్లో స్లో డెలివరీ వేసి బోల్తా కొట్టించాడు. pic.twitter.com/RYsGz7ju8t — Sports Hustle (@SportsHustle3) January 29, 2022 -
Ind Vs Sa: కోహ్లి సెంచరీ కొడతాడు... ఇండియాదే సిరీస్: ప్రొటిస్ మాజీ బౌలర్
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కచ్చితంగా సెంచరీ సాధిస్తాడని ప్రొటిస్ మాజీ బౌలర్ మోర్నీ మోర్కెల్ అన్నాడు. సౌతాఫ్రికా పిచ్‌లు అతడికి అనుకూలిస్తాయని... కోహ్లి శతక్కొట్టడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా రన్‌మెషీన్‌గా పేరొందిన కోహ్లి... సెంచరీ కొట్టి రెండేళ్లు అవుతోంది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఈ ఆశ తీరుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. పట్టుదలగా నిలబడిన కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులకే అవుట్ కావడంతో భంగపాటు తప్పలేదు. ఇక టెస్టు సిరీస్‌లో పరాజయం తర్వాత టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడంతో భారత జట్టు సారథిగా కోహ్లి ప్రస్థానం ముగిసిన నేపథ్యంలో కోహ్లికి ఇదే తొలి మ్యాచ్. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షో లో మోర్నీ మోర్కెల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు... ‘‘విరాట్ కోహ్లి కచ్చితంగా వంద కొడతాడు. ముఖ్యంగా కేప్‌టౌన్‌లో బ్యాటింగ్ చేయడాన్ని అతడు ఆస్వాదిస్తాడు. ఇక్కడి న్యూలాండ్స్ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం తనకిష్టమని కోహ్లి ఎన్నోసార్లు చెప్పాడు. సెంచరీ లేకుండా ఈ సిరీస్ ముగించడు అని గట్టిగా నమ్ముతున్నా’’ అని మోర్కెల్ వ్యాఖ్యానించాడు. ఇక టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందన్న ఈ ప్రొటిస్ మాజీ పేసర్... 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని అంచనా వేశాడు. మొదటి రెండు మ్యాచ్‌లకు వేదిక అయిన పర్ల్ వారికి అనుకూలిస్తుందని అభిప్రాయపడ్డాడు. చదవండి: Ind vs Sa ODI Series: రుతురాజ్‌కు నో ఛాన్స్.. ధావన్, చహల్‌కు అవకాశం! Guided #TeamIndia with courage & fearlessness 👍 Led the side to historic wins 🔝 Let's relive some of the finest moments from @imVkohli's tenure as India's Test captain. 👏 👏 Watch this special feature 🎥 🔽https://t.co/eiy9R35O4Q pic.twitter.com/4FMCLstZu3 — BCCI (@BCCI) January 17, 2022 -
టీ20 వరల్డ్‌కప్: తొలిసారి నమీబియా.. జట్టులో అతడు కూడా..
Namibia T20 World Cup 2021 squad: యూఏఈ వేదికగా వచ్చే నెల 17న ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్‌నకు సదరన్ ఆఫ్రికా దేశం నమీబియా తమ జట్టును ప్రకటించింది. సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్‌కు ఇందులో చోటు కల్పించడం విశేషం. 2016లో దక్షిణాఫ్రికా తరఫున టీ20 వరల్డ్‌కప్ ఆడిన డేవిడ్.. తన తండ్రి స్వదేశమైన నమీబియా నుంచి ఈసారి ప్రాతినిథ్యం వహించడం గమనార్హం. ఇక హెడ్ కోచ్ పియరీ డీ బ్రున్ శిక్షణలో రాటుదేలిన తమ ఆటగాళ్లతో తొలిసారిగా ఈ మెగా ఈవెంట్లో తలపడేందుకు నమీబియా సిద్ధమవుతోంది. మేనేజ్మెంట్లో ప్రొటిస్ మాజీ ఆటగాడు మోర్నే మోర్కెల్ కూడా ఉండటం మరో విశేషం. కాగా 2019లో దుబాయ్‌లో జరిగిన క్వాలిఫైయర్ ప్లేఆఫ్ మ్యాచ్‌లో ఒమన్‌ను ఓడించడం ద్వారా వరల్డ్‌కప్‌నకు నమీబియా అర్హత సాధించింది. ఇక అక్టోబరు 18న శ్రీలంకతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. నమీబియా టీ20 జట్టు ఇదే.. గెర్హాడ్ ఎరాస్మస్(కెప్టెన్), స్టీఫెన్ బార్డ్, కార్ల్ బిర్కెన్‌స్టాక్, మిచావు డు ప్రీజ్, జాన్ ఫ్రిలింక్, జానే గ్రీన్, జాన్ నికోల్ లోఫ్టీ ఈటన్, బెర్నార్డ్ షోల్ట్, బెన్ షికాంగో, జేజే స్మిత్, రూబెన్ ట్రంపెల్మాన్, మైకేల్‌వాన్ లింగన్, డేవిడ్ వీజ్, క్రెయిగ్ విలియమ్స్, పిక్కీ యా ఫ్రాన్స్. చదవండి: T20 World Cup 2021: విండీస్ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు -
ఎవరీ కుర్రాడు.. రేపటి టెస్టు మ్యాచ్‌లో ఆడిద్దామా!
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ మోర్నీ మోర్కెల్ ఆ దేశం నుంచి విజయవంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. మంచి పొడగరి అయిన మోర్కెల్ పదునైన బౌన్సర్లతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను ఇబ్బందులకు గురి చేసేవాడు. 2006-2018 మధ్య దక్షిణాఫ్రికా తరపున ఆడిన మోర్కెల్ తన 12 ఏళ్ల కెరీర్లో 86 టెస్టుల్లో 309 వికెట్లు,117 వన్డేల్లో 188 వికెట్లు, 44 టీ20ల్లో 47 వికెట్లు తీశాడు. మొత్తంగా దక్షిణాఫ్రికా తరపున 500కు పైగా వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా నిలిచాడు. మోర్నీ మోర్కెల్ సోదరుడు అల్బీ మోర్కెల్ కూడా దక్షిణాఫ్రికా తరపున ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. తాజాగా మోర్కెల్ 2004లో ఈస్ట్రెన్స్ తరపున ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఎలా అరంగేట్రం చేశాననేది చెప్పుకొచ్చాడు. '' 2004లో వెస్టిండీస్ దక్షిణాఫ్రికాలో పర్యటించేందుకు వచ్చింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా ఈస్ట్రెన్స్తో వారు ఆడాల్సి ఉంది. దీనిలో భాగంగా నా సోదరుడు అల్బీ మోర్కెల్ నా వద్దకు వచ్చి ఈస్ట్రన్స్కు ఒక నెట్ బౌలర్ కావాలి.. నువ్వెందుకు ప్రయత్నించకూడదు అని చెప్పాడు. అలా ఈస్ట్రన్స్ బ్యాట్స్‌మెన్‌కు నెట్‌బౌలర్‌గా బంతులు విసిరాను. నా బౌలింగ్ చూసిన కోచ్ నా వద్దకు వచ్చి.. '' నీ బౌలింగ్ బాగుంది.. ఏం చేద్దామనుకుంటున్నావు'' అని అడిగాడు.. అతను అడిగింది నాకు అర్థం కాలేదు.. ''ఏమో తెలీదు'' అని సమాధానం ఇచ్చాను. వెంటనే కోచ్ నన్ను ఆఫీస్ రూమ్‌కు తీసుకెళ్లి జూనియర్ క్రికెటర్‌గా కాంట్రాక్ట్ ఇప్పించాడు. అలా ఈస్ట్రన్స్ తరపున ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను ప్రారంభించాను. కొంతకాలం తర్వాత ఇంగ్లండ్ దక్షిణాఫ్రికాలో పర్యటించింది. కాగా ప్రాక్టీస్ సమయంలో నేను అప్పటి ఆల్‌రౌండర్ జాక్ కలిస్‌కు బంతులు విసిరాను. అతను నా బౌలింగ్ చూసి ఇంప్రెస్ అయ్యాడు. కోచ్ జెన్నింగ్స్ వద్దకు వెళ్లి.. ''ఎవరీ కుర్రాడు అద్బుతంగా బౌలింగ్ చేస్తున్నాడు..'' అని అడిగాడు. దానికి కోచ్.. ''అతను అల్బీ మోర్కెల్ తమ్ముడు మోర్నీ మోర్కెల్.. ఈస్ట్రన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇది విన్న కలిస్.. ఇతన్ని మనం రేపటి టెస్టు మ్యాచ్‌లో ఆడేందుకు అవకాశం ఇస్తే బాగుంటుందని'' చెప్పాడు. అని వివరించాడు. అలా 2006లో టీమిండియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మోర్కెల్ 12 ఏళ్ల పాటు ప్రొటీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: 'ఆ సమయంలో ద్రవిడ్‌ను చూసి భయపడేవాళ్లం' -
కళ్లు చెదిరే సిక్స్.. కొడితే అవతల పడింది
కాన్బెర్రా: ఆసీస్ ఆల్‌రౌండర్ బెన్ కటింగ్ మీకందరికి గుర్తుండే ఉంటాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కప్పు కొట్టడంలో బెన్ కటింగ్ పాత్ర మరువలేనిది. ఆర్సీబీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌లో 15 బంతుల్లోనే 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 39 పరుగులు సాధించాడు. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ కీలకమైన రెండు వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచి సన్‌రైజర్స్‌కు కప్పు అందించాడు. తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా ఆదివారం సిడ్నీ థండర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. గెలిస్తే ఫైనల్ అవకాశాలు మరింత మెరుగయ్యే మ్యాచ్‌లో బెన్ కంటింగ్ జూలు విదిల్చాడు. 18 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 34 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే బెన్ కటింగ్ కొట్టిన నాలుగు సిక్సర్లలో .. ఒక సిక్సర్ స్టేడియం అవతల పడింది. మోర్నీ మోర్కెల్ వేసిన 18 ఓవర్ మూడో బంతిని కటింగ్ ప్రంట్ ఫుట్ వచ్చి డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టగా.. బంతి నేరుగా వెళ్లి స్టేడియం రూఫ్‌ను తాకుతూ బయటపడింది. మీటర్ రేంజ్లో కటింగ్ కొట్టిన సిక్స్ 101 మీటర్లుగా నమోదైంది. బెన్ కటింగ్ సిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ఆండ్రూ టై కావాలనే అలా చేశాడా! ఈ సీజన్ బిగ్‌బాష్ లీగ్‌లో కటింగ్ కొట్టిన సిక్స్ అత్యంత ఎత్తులో వెళ్లిన సిక్స్‌గా రికార్డుకెక్కింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కటింగ్ 34, సామ్ బిల్లింగ్స్ 34 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ ఆడుతున్న బ్రిస్బేన్ హీట్స్ ఇప్పటివరకు 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. హీట్స్ గెలవాలంటే 48 బంతుల్లో 89 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: దుమ్మురేపిన పుజారా.. కోహ్లి మాత్రం అక్కడే That is OUTTTAAAAA HERE!! Wow! #BBL10 #BBLFinals pic.twitter.com/lOTzhwDtyb — KFC Big Bash League (@BBL) January 31, 2021