కటక్: టి20ల్లో బౌలర్లూ సత్తాచాటాలంటే పాజిటివ్ దృక్పథంతో పాటు సరైన బాడీ లాంగ్వేజ్ కీలకమని కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) పేసర్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబైని కట్టడి చేయడంలో అతని పాత్ర ఉంది. ‘టి20ల్లో బ్యాట్‌కు, బాల్‌కు మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. ధాటిగా సాగే ఈ ఆటలో బౌలర్లు తమ బంతులపైనే దృష్టి కేంద్రీకరిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ముఖ్యంగా బంతిని నియంత్రించే శారీరక భాష అవసరం’ అని అన్నాడు.
ఆట ఆరంభంలోనే ఓపెనర్ గౌతమ్‌ను, కీలక దశలో కోరి అండర్సన్‌ను మోర్కెల్ అవుట్ చేయడంతో ముంబై కోలుకోలేదు. ఆ తర్వాత స్పిన్నర్లు రాణించడంతో కోల్‌కతా విజయం సులువైంది. ‘ఇక్కడి బారాబతి స్టేడియంపై మాకున్న అవగాహన కాస్త కలిసొచ్చింది. అయితే పిచ్ మాత్రం ఇరు జట్లకు సమానావకాశాలిచ్చింది. మా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు’ అని మోర్కెల్ అన్నాడు. మెరుపుల క్రికెట్‌లో మీ ప్రాధాన్యత పరుగుల కట్టడికా లేక వికెట్లకా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ రెండింటికి సమ ప్రాధాన్యత ఉంటుందన్నాడు.
బౌలర్లకు బాడీలాంగ్వేజ్ కీలకం: మోర్నీ
Published Fri, May 16 2014 1:10 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM
Advertisement
Advertisement