Morne Morkel Bat of Faf Du Plessis Inclusion in T20 WC 2022 Squad - Sakshi
Sakshi News home page

'37 ఏళ్ల వయస్సులో అదరగొడుతున్నాడు.. అతడిని జట్టులోకి తీసుకోండి'

Published Sat, Jul 9 2022 3:51 PM | Last Updated on Sat, Jul 9 2022 5:34 PM

Morne Morkel bats for Faf du Plessis inclusion in T20 WC 2022 squad - Sakshi

File Photo

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఫాప్‌ డు ప్లెసిస్‌ను దక్షిణాఫ్రికా జట్టులోకి తీసుకోవాలని ఆ దేశ మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. కాగా డుప్లెసిస్‌ ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్‌కు సంబంధించిన ప్రణాళికలలో భాగంగా లేడు. అదే విధంగా అతడు తన దక్షిణాఫ్రికా క్రికెట్‌ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. కాగా డుప్లెసిస్‌ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌  2020లో ఆడాడు. ఇక ఐపీఎల్‌-2022లో ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన డుప్లెసిస్‌ పర్వాలేదనిపించాడు. ఈ ఏడాది సీజన్‌లో 468 పరుగులు చేసిన డుప్లెసిస్‌.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు.

"డు ప్లెసిస్‌ 37 ఏళ్ల వయస్సులో కూడా అద్భుతం‍గా ఆడుతున్నాడు. అతడు ఫీల్డింగ్‌లో కూడా అదరగొడుతున్నాడు. డుప్లెసిస్‌ ఐపీఎల్‌లో ఆర్సీబీ తరుపున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. కాబట్టి అటువంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు దక్షిణాఫ్రికా జట్టులో ఉండాలి. క్రికెట్‌ సౌతాఫ్రికా పునరాలోచన చేసి అతడిని ప్రపంచకప్‌కు జట్టులోకి తీసుకురావాలి" అని మోర్కెల్  పేర్కొన్నాడు.
చదవండి: Sourav Ganguly 50th Birthday: లండన్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్‌ చేసుకున్న దాదా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement