టీమిండియా వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసలు వర్షం కురిపించాడు. ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టులో కార్తీక్‌కు కచ్చితంగా చోటు దక్కుతందని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక ఐపీఎల్-2022లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన కార్తీక్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్నటీ20 సిరీస్‌లో టీమిండియాలో భాగంగా ఉన్నాడు.
ఇక ఈ ఏడాది సీజన్‌లో ఆర్సీబీ తరపున ఆడిన కార్తీక్.. జట్టుకు అత్యుత్తమ ఫినిషర్‌గా మారాడు. 16 మ్యాచ్‌లు ఆడిన డీకే 330 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. "కార్తీక్‌కు టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టులో చోటు దక్కుతుందని భావిస్తున్నాను.
అతడు ఐదు లేదా ఆరో స్థానంలో అత్యుత్తమంగా బ్యాటింగ్ చేయగలడు. ఈ ఏడాది ఆర్సీబీ తరపున కార్తీక్ మ్యాచ్‌లు ఫినిష్ చేసిన విధానం అద్భుతమైనది. సీజన్ అంతటా కార్తీక్ మెరుగైన ప్రదర్శన చేశాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌లో కూడా కార్తీక్ టీమిండియాకు బెస్ట్ ఫినిషర్ పాత్ర పోషిస్తాడని నేను అశిస్తున్నా" అని పేర్కొన్నాడు.
చదవండి: టీ20 ప్రపంచకప్‌కు ఉమ్రాన్ మాలిక్‌ను ఎంపిక చేయవద్దు: రవిశాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment