Ricky Ponting
-
చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. డబుల్ సెంచరీ.. తొలి ఆస్ట్రేలియన్‌గా రికార్డు
ఆసీస్ తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ (Steve Smith) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్‌ల్లో 200 క్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి ఆస్ట్రేలియన్‌గా రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో స్మిత్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో స్మిత్ మొత్తం ఐదు క్యాచ్‌లు పట్టుకున్నాడు. స్మిత్ క్యాచ్‌ల్లో డబుల్ సెంచరీ సాధించే క్రమంలో రికీ పాంటింగ్ (Ricky Ponting) రికార్డును అధిగమించాడు. 🚨 HISTORY BY STEVEN SMITH. 🚨- Smith becomes the first ever Australian fielder to complete 200 catches in Tests. 🙇♂️pic.twitter.com/3T2v9jgcid— Mufaddal Vohra (@mufaddal_vohra) February 9, 2025పాంటింగ్ 287 ఇన్నింగ్స్‌ల్లో 196 క్యాచ్‌లు అందుకోగా.. స్మిత్ 205 ఇన్నింగ్స్‌ల్లోనే 200 క్యాచ్‌లు పూర్తి చేశాడు. ఆసీస్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న నాన్ వికెట్కీపర్ల జాబితాలో స్మిత్, పాంటింగ్ తర్వాతి స్థానంలో మార్క్ వా ఉన్నాడు. మార్క్ వా 209 ఇన్నింగ్స్‌ల్లో 181 క్యాచ్‌లు పట్టుకున్నాడు.ఓవరాల్‌గా ఐదో క్రికెటర్టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే 200 క్యాచ్‌లు పూర్తి చేశారు. వీరిలో టీమిండియా గ్రేట్ రాహుల్ ద్రవిడ్ (Rahu Dravid) 210 క్యాచ్‌లతో (164 టెస్ట్‌ల్లో) అగ్రస్థానంలో ఉండగా.. జో రూట్ (152 టెస్ట్‌ల్లో 207), మహేళ జయవర్దనే (149 టెస్ట్‌ల్లో 205), జాక్ కల్లిస్ (166 టెస్ట్‌ల్లో 200) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. శ్రీలంకతో మ్యాచ్‌లో స్మిత్ కల్లిస్ సరసన చేరడంతో పాటు 200 క్యాచ్‌ల క్లబ్లో చేరిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. అలాగే టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతంగా 200 క్యాచ్‌లు పూర్తి చేసిన ఆటగాడిగానూ స్మిత్ రికార్డు నెలకొల్పాడు. స్మిత్ కేవలం 116 టెస్ట్‌ల్లోనే 200 క్యాచ్‌లు పూర్తి చేశాడు. స్మిత్ మరో 11 క్యాచ్‌లు పడితే టెస్ట్‌ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొడతాడు.లంకతో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు పట్టిన స్మిత్.. బ్యాటింగ్‌లోనూ చెలరేగి టెస్ట్‌ల్లో 36వ సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీతో స్మిత్ టెప్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం స్మిత్, జో రూట్ తలో 36 సెంచరీలతో సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నారు. టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (51) పేరిట ఉంది.అంతకుముందు స్మిత్ లంకతో జరిగిన తొలి టెస్ట్‌లోనూ సెంచరీ సాధించాడు. ఇదే మ్యాచ్‌లో స్మిత్ టెస్ట్‌ల్లో 10000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్‌కు దూరం కాగా.. అతని గైర్హాజరీలో స్మిత్ ఆసీస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. తొలి టెస్ట్‌లోనూ ఘన విజయం సాధించిన ఆసీస్.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో ఊడ్చేసింది. ఫిబ్రవరి 12, 14 తేదీల్లో ఆసీస్.. శ్రీలంకతో రెండు వన్డేలు ఆడనుంది. -
అద్భుతమైన ఆటగాడు.. అతడినే పక్కనపెడతారా?: ఆసీస్ దిగ్గజం
టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)పై ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్(Ricky Ponting) ప్రశంసలు కురిపించాడు. మిడిలార్డర్లో చక్కగా రాణించగల నైపుణ్యాలు అతడి సొంతమని కొనియాడాడు. అయితే, గత రెండేళ్లుగా టీమిండియా యాజమాన్యం అయ్యర్‌కు అడపాదడపా మాత్రమే అవకాశాలు ఇవ్వడం తనకు విస్మయం కలిగిస్తోందని పేర్కొన్నాడు.కాగా స్వదేశంలో గతేడాది ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా వెన్నునొప్పితో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. రంజీల్లో ఆడాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఆదేశాలను తొలుత బేఖాతరు చేసిన ఈ ముంబైకర్.. తర్వాత గాయాన్ని సాకుగా చూపి తప్పించుకున్నాడు.ఈ క్రమంలో బీసీసీఐ అయ్యర్‌పై కఠిన చర్యలు తీసుకుంది. అతడి సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేస్తూ వేటు వేసింది. ఈ తర్వాత అతడు దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగి తనను తాను నిరూపించుకున్నాడు. అంతేకాదు.. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా టైటిల్ గెలిచాడు.టీ20 జట్టులో మాత్రం చోటు కరువుఈ నేపథ్యంలో గతేడాది శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్.. టీ20 జట్టులో మాత్రం చోటు సంపాదించలేకపోయాడు. యాజమాన్యం అతడిని ఎప్పటికప్పుడు పక్కనపెట్టి.. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చింది. టీ20 ప్రపంచకప్-2024 జట్టులోనూ అతడికి చాన్స్ ఇవ్వలేదు.ఇక తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్ సందర్భంగా పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్.. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డేలో అదరగొట్టాడు. కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లతో పాటు రెండు సిక్సర్లు ఉండటం విశేషం.అయితే, ఈ మ్యాచ్‌లో తనకు తొలుత తుదిజట్టులో స్థానం లేదని.. విరాట్ కోహ్లి గాయపడ్డ కారణంగానే తనను పిలిపించారని శ్రేయస్ అయ్యర్ స్వయంగా వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫామ్‌లో ఉన్న ఆటగాడిని బెంచ్‌కే పరిమితం చేయాలని చూడటం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అద్భుతమైన ఆటగాడు.. అతడినే పక్కనపెడతారా?ఈ నేపథ్యంలో లెజెండరీ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో మాట్లాడుతూ.. ‘‘గత రెండేళ్లుగా అతడి సేవలను ఎందుకు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదో అర్థం కావడం లేదు. వన్డే ప్రపంచకప్-2023లోనూ శతకాలతో చెలరేగి భీకరమైన ఫామ్ కనబరిచాడు.మిడిలార్డర్లో సొగసైన బ్యాటింగ్‌తో అలరించాడు. దీంతో జట్టులో అతడి స్థానం సుస్థిరమైందని నేను అనుకున్నా. కానీ అలా జరుగలేదు. వెన్నునొప్పి కారణంగా అతడు జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.అయినా.. అతడిని పక్కనపెట్టాలని చూడటం సరికాదు’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్‌గా పాంటింగ్ నియమితుడైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేలంలో భాగంగా శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేయడంలో పాంటింగ్ కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరు కలిసి గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున పనిచేశారు కూడా!ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో గురువారం నాటి తొలి వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఇరుజట్ల మధ్య ఆదివారం కటక్‌లో రెండో వన్డే జరుగుతుంది.చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
స్టీవ్ స్మిత్ సరికొత్త చరిత్ర.. ఆసీస్ తొలి బ్యాటర్‌గా అరుదైన ఫీట్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) అద్బుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. శ్రీలంక(Sri Lanka vs Australia)తో రెండో టెస్టులోనూ ఈ కుడిచేతి వాటం ఆటగాడు సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలో ఇటీవలే టెస్టు ఫార్మాట్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న స్మిత్.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు.ఆల్‌టైమ్ రికార్డు బద్దలుఆసియాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు. రిక్కీ పాంటింగ్(Ricky Ponting) ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలోకి దూసుకువచ్చాడు. కాగా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా స్మిత్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే.భారత్‌తో బ్రిస్బేన్ టెస్టులో 101 పరుగులు సాధించిన స్మిత్.. మెల్బోర్న్లో భారీ శతకం(140)తో చెలరేగాడు. అనంతరం.. శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టులోనూ తాత్కాలిక స్మిత్ శతక్కొట్టాడు. గాలె మ్యాచ్‌లో 141 పరుగులతో చెలరేగి జట్టు భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ సందర్భంగానే టెస్టు ఫార్మాట్లో పదివేల పరుగుల క్లబ్లో కూడా చేరాడు.ఇక తాజాగా లంకతో రెండో టెస్టులోనూ స్టీవ్ స్మిత్ శతకం దిశగా పయనిస్తున్నాడు. ఈ క్రమంలో ఆసియా గడ్డ మీద పందొమ్మిది వందలకు పైగా పరుగులు పూర్తి చేసుకుని.. ఆస్ట్రేలియా తరఫున హయ్యస్ట్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. లంకతో రెండో టెస్టు భోజన విరామ సమయానికి స్మిత్.. ఆసియాలో 1917 పరుగులు పూర్తి చేసుకున్నాడు.కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన స్మిత్ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో ఆతిథ్య లంకను ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో ఆసీస్ చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం నుంచి గాలెలో రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. ఆసీస్ బౌలర్ల విజృంభణ కారణంగా 257 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ఆలౌట్ అయింది.ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా అదరగొడుతోంది. ఓపెనర్లు ట్రవిస్ హెడ్(22 బంతుల్లో 21), ఉస్మాన్ ఖవాజా(57 బంతుల్లో 36) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(4) మరోసారి విఫలమయ్యాడు.ఈ దశలో స్మిత్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అతడికి తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ వేగంగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరి నిలకడైన ప్రదర్శన కారణంగా 55 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 215 పరుగుల వద్ద నిలిచింది.ఆసియాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్లు 👉స్టీవ్ స్మిత్: 23 మ్యాచ్‌లలో సగటు 50.35తో 1917+ పరుగులు. అత్యధిక స్కోరు- 178*- శతకాలు ఆరు.👉రిక్కీ పాంటింగ్: 28 మ్యాచ్‌లలో సగటు 41.97తో 1889 పరుగులు- అత్యధిక స్కోరు 150- శతకాలు ఐదు👉అలెన్ బోర్డర్: 22 మ్యాచ్‌లలో సగటు 54.51తో 1799తో 1799 పరుగులు- అత్యధిక స్కోరు 162- శతకాలు ఆరు👉మాథ్యూ హెడెన్: 19 మ్యాచ్‌లలో 50.39 సగటుతో 1663 పరుగులు- అత్యధిక స్కోరు 203- శతకాలు నాలుగు👉ఉస్మాన్ ఖవాజా: 17 మ్యాచ్‌లలో 61.76 సగటుతో 1544 పరుగులు- అత్యధిక స్కోరు 232- శతకాలు ఐదు. -
చరిత్ర సృష్టించిన స్మిత్.. పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు సమం
ఆస్ట్రేలియా స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆస్ట్రేలియా ఆటగాడిగా రికీ పాంటింగ్ రికార్డు సమం చేశాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో కమిందు మెండిస్ క్యాచ్‌ను అందుకున్న ఈ స్మిత్.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. పాంటింగ్ 287 ఇన్నింగ్స్‌లలో 196 క్యాచ్‌లు అందుకోగా.. స్మిత్ కేవలం 205 ఇన్నింగ్స్‌లలో సరిగ్గా 196 క్యాచ్‌లు అందుకున్నాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం మార్క్ వా(181) ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా వరల్డ్ క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. 286 టెస్టు ఇన్నింగ్స్‌లలో ద్రవిడ్.. 210 క్యాచ్‌లను తీసుకున్నాడు. స్మిత్ 14 క్యాచ్‌లను అందుకుంటే రాహుల్ ద్రవిడ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశముంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో కాస్త తడబడుతోంది. 71 ఓవర్లకు శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్(35), రమేష్ మెండిస్(20) ఆచితూచి ఆడుతున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఇప్పటివరకు నాథన్ లియోన్ మూడు వికెట్లు పడగొట్టగా..మిచెల్ స్టార్క్, మథ్యూ కుహ్నమెన్, హెడ్ తలా వికెట్ సాధించారు. కాగా ఆస్ట్రేలియా ఇప్పటికే తొలి టెస్టులో లంకను మట్టికర్పించింది.ఈ మ్యాచ్‌ను డ్రా ముగించినా చాలు సిరీస్ ఆసీస్ 1-0 సొంతం చేసుకుంటుంది. శ్రీలంక టూర్‌కు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో ఆసీస్ జట్టును స్మిత్ ముందుండి నడ్పిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కూడా ఆస్ట్రేలియా జట్టు పగ్గాలను స్మిత్ చేపట్టే అవకాశముంది.ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా కమ్మిన్స్ దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జోష్ హెజిల్వుడ్, మిచిల్ మార్ష్ గాయం కారణంగా దూరం కాగా.. తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిష్ పూర్తిగా వన్డే క్రికెట్‌కే విడ్కోలు పలికాడు.196TH TEST CATCH STEVE SMITH. 😱Steve Smith is on the verge of creating another record. This batter is top-class, and he is also a Superman in fielding. He has taken 196 catches so far, and with one more catch, he will break Ponting's record.Most Test catches for Australia by… pic.twitter.com/fKtqYvYEVs— All Cricket Records (@Cric_records45) February 6, 2025 -
యజమానులు ఎవరైనా.. జట్టు మాత్రం నాదే: రిక్కీ పాంటింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025లో సరికొత్త పంజాబ్ కింగ్స్(Punjab Kings)ను చూస్తారని హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్(Ricky Ponting) అన్నాడు. వేలం విషయంలో ఫ్రాంఛైజీ యజమాన్యం తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని.. అందుకే తన వ్యూహాలను పక్కాగా అమలు చేయగలిగినట్లు తెలిపాడు. కోరుకున్న ఆటగాళ్లను దక్కించుకోవడంలో తాము సఫలమయ్యామన్నాడు.ఇక మైదానంలో మెరుగైన ఫలితాలు సాధించడంపైనే ప్రస్తుతం తన దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉన్నట్లు రిక్కీ పాంటింగ్ పేర్కొన్నాడు. కాగా ఈ ఆస్ట్రేలియా దిగ్గజానికి ఐపీఎల్‌తో గత పదేళ్లుగా అనుబంధం ఉంది.ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏడేళ్లుఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ప్రాంఛైజీకి అత్యధికంగా ఏడేళ్లు అతడు హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. 2018- 2024 వరకు అతడి మార్గదర్శనంలో ఢిల్లీ జట్టు మిశ్రమ ఫలితాలు అందుకుంది. అయితే, అత్యుత్తమంగా 2020లో ఫైనల్‌కు చేరింది. కానీ రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ఇక అంతకు ముందు 2019లో.. ఆ తర్వాత 2021లో ప్లే ఆఫ్స్ వరకు చేరగలిగింది.కానీ 2022-2024 వరకు ఒక్కసారి కూడా టాప్-4లోనూ అడుగుపెట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ యాజమాన్యం రిక్కీ పాంటింగ్‌తో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకుంది. అనంతరం.. పంజాబ్ కింగ్స్ పాంటింగ్‌ను తమ కుటుంబంలోకి ఆహ్వానించి ప్రధాన కోచ్‌గా నియమించింది.చెత్త రికార్డుతో పంజాబ్ఇక ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు ఉన్న చెత్త రికార్డు గురించి తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ ఎడిషన్(2008) నుంచి ఇప్పటిదాకా కేవలం రెండుసార్లే ప్లే ఆఫ్స్ చేరింది. ఆఖరి నిమిషంలో చేతులెత్తేసి మ్యాచ్‌లు చేజార్చుకున్న సందర్భాలు కోకొల్లలు. అయితే, ఈసారి మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే ఆలోచనతో పాంటింగ్‌ను రంగంలోకి దింపింది.ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం గురించి రిక్కీ పాంటింగ్ హెవీ గేమ్స్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వేలానికి ముందు మేము అన్ని రకాలుగా చర్చించుకున్నాం. అంతా అనుకున్నట్లే జరిగినందుకు నాకు సంతోషంగా ఉంది.యజమానులు వాళ్లే అయినా.. జట్టు పూర్తిగా నాదేఇక ఇప్పటి నుంచి ఫ్రాంఛైజీ యజమానులు ఎవరైనా సరే.. జట్టు మాత్రం పూర్తిగా నా చేతుల్లో ఉంటుంది. జట్టు గత చరిత్ర గురించి నేను చాలా విషయాలు విన్నాను. ఇకపై అందుకు భిన్నంగా ఉండాలంటే నాకు స్వేచ్ఛ కావాలని అడిగాను. అందుకు ఓనర్లు కూడా అంగీకరించారు. ఫ్రాంఛైజీ యజమానులతో పాటు అడ్మినిస్ట్రేటర్లు, బోర్డు డైరెక్టర్లు.. ఇలా ప్రతి ఒక్కరికి నా కార్యచరణ గురించి వివరించాను. నా శైలిలో జట్టును ముందుకు తీసుకువెళ్తాను. ముఖ్యంగా భారత క్రికెటర్లపై మేము ఎక్కువగా దృష్టి పెట్టాము. వారి రాక మాకు శుభారంభం లాంటిదే’’ అని రిక్కీ పాంటింగ్ పేర్కొన్నాడు.రికార్డు ధరకు అయ్యర్‌ను కొనికాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రికార్డు స్థాయిలో .. టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చుపెట్టింది. గత సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్ అందించిన ఈ విన్నింగ్ కెప్టెన్‌ను తమ సారథిగా నియమించింది. అంతేకాదు.. వేలానికి ముందు ప్రభ్‌సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్‌లను మాత్రమే రిటైన్ చేసుకున్న పంజాబ్.. వేలంలో మరో టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక పంజాబ్ జట్టుకు నెస్ వాడియా, ప్రీతి జింటా సహ యజమానులు అన్న విషయం తెలిసిందే.చదవండి: అతడికి ఇదే చివరి ఐసీసీ టోర్నీ.. టీమిండియా గెలిస్తే చరిత్రే: సురేశ్ రైనా -
CT 2025: సెమీస్, ఫైనల్ చేరే జట్లు ఇవే!.. కానీ ఆ టీమ్‌తో జాగ్రత్త!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్ రూపంలో మరో మెగా ఈవెంట్ క్రికెట్ ప్రేమికుల ముందుకు రానుంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ టోర్నీకి తెరలేవనుంది. ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ ఇండియాతో పాటు.. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ టోర్నీకి అర్హత సాధించాయి.మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగనుంది. ఈవెంట్ ఆరంభానికి సమయం సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే ఆయా దేశాల బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి(Ravi Shastri), ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్(Ricky Ponting) చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనలిస్టులు ఎవరన్న అంశంపై తమ అంచనాలు తెలియజేశారు.సెమీస్, ఫైనల్ చేరే జట్లు ఇవే!ఐసీసీ రివ్యూ షోలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా.. టీమిండియా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్‌కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. ఇందుకు పాంటింగ్ బదులిస్తూ.. ‘‘ఇండియా- ఆస్ట్రేలియాను దాటుకుని వేరే జట్లు పైకి వెళ్లడం ఈసారీ కష్టమే.ఎందుకంటే.. ప్రస్తుతం ఇరు దేశాల జట్లలో నాణ్యమైన నైపుణ్యాలున్న ఆటగాళ్లు మెండుగా ఉన్నారు. ఇటీవల ఐసీసీ ఈవెంట్లలో ఈ జట్లు సత్తా చాటిన తీరే ఇందుకు నిదర్శనం. కాబట్టి ఈ రెండు ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది’’ అని అంచనా వేశాడు.కానీ పాకిస్తాన్‌తో జాగ్రత్తఅయితే, ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌ను కూడా తక్కువ అంచనా వేయవద్దని రిక్కీ పాంటింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ‘‘ఇటీవలి కాలంలో నిలకడగా ఆడుతున్న జట్టు ఏదైనా ఉందంటే.. అది పాకిస్తాన్. వన్డే క్రికెట్లో ప్రస్తుతం వారి ప్రదర్శన అద్బుతంగా ఉంది.ఐసీసీ వంటి ప్రధాన టోర్నమెంట్లలో వారి ఆటతీరు ఒక్కోసారి అంచనాలకు భిన్నంగా ఉంటుంది. ఈసారి మాత్రం ప్రతికూలతలన్నీ అధిగమించే అవకాశం ఉంది’’ అని రిక్కీ పాంటింగ్ మిగతా జట్లను హెచ్చరించాడు. కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరిగింది. నాటి ఫైనల్లో టీమిండియాను ఓడించి పాకిస్తాన్ టైటిల్ గెలిచింది.ఇదిలా ఉంటే.. ఈ ఐసీసీ టోర్నీలో ఆస్ట్రేలియా రెండుసార్లు చాంపియన్‌గా నిలిచింది. రిక్కీ పాంటింగ్ సారథ్యంలో 2006, 2009లొ ట్రోఫీని కైవసం చేసుకుంది. మరోవైపు.. టీమిండియా 2013లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.ఇక పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లడం లేదు. ఐసీసీ అనుమతితో హైబ్రిడ్ విధానంలో దుబాయ్ వేదికగా తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణం మొదలుపెట్టనున్న రోహిత్ సేన.. తదుపరి ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం.. మార్చి రెండున న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడుతుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి. -
ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా ఫామ్‌లోకి వచ్చిన ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్(Steve Smith).. తన జోరును కొనసాగిస్తున్నాడు. మెల్బోర్న్ టెస్టులో భారీ శతకం(140) బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. భారత్ ఆఖరిదైన సిడ్నీ టెస్టులో మొత్తంగా 37 పరుగులు చేసి.. 9999 పరుగుల వద్ద నిలిచాడు. తాజాగా శ్రీలంక(Australia vs Sri Lanka)తో తొలి టెస్టు సందర్భంగా టెస్టుల్లో పది వేల పరుగుల క్లబ్లో చేరాడు. తద్వారా ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్‌గా స్మిత్ చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డుఅతడి కంటే ముందు.. అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రిక్కీ పాంటింగ్(Ricky Ponting) ఈ ఫీట్ నమోదు చేశారు. అయితే, తాజాగా స్మిత్ పదివేల టెస్టు పరుగుల మైలురాయిని అందుకున్న క్రమంలో ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. టెస్టు క్రికెట్లో ఒక దేశం తరఫున అత్యధికంగా నలుగురు ఆటగాళ్లు ఈ మైలురాయిని చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతకు ముందు ఈ జాబితాలో టీమిండియాతో కలిసి ఆసీస్ అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు భారత్‌ను వెనక్కి నెట్టి వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో ఆసీస్ జట్టు ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియాను 3-1తో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో ఆఖరిగా రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు కంగారూ జట్టు శ్రీలంకకు వచ్చింది.ఖవాజా డబుల్ ధమాకాఈ క్రమంలో గాలె అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య బుధవారం తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా ప్రమోట్ అయిన ట్రవిస్ హెడ్ ధనాధన్ దంచికొట్టి అర్ధ శతకంతో మెరవగా.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. హెడ్ 40 బంతుల్లో 57 పరుగులు సాధిస్తే.. ఖవాజా ఏకంగా 352 బంతులు ఎదుర్కొని 232 రన్స్ చేశాడు.స్మిత్ రికార్డు సెంచరీమరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(20) తన వైఫల్యాన్ని కొనసాగించగా.. నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. మొత్తంగా 251 బంతులు ఫేస్ చేసిన స్మిత్.. 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 141 పరుగులతో సత్తా చాటాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో 35వ టెస్టు సెంచరీ నమోదు చేసిన 36 ఏళ్ల స్మిత్.. పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.సెంచరీల పరంగా రెండోస్థానంలోకి‘ఫ్యాబ్ ఫోర్’లో ఒకరిగా గుర్తింపు పొందిన స్మిత్ టెస్టు సెంచరీల పరంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ లిస్టులో ఇంగ్లండ్ టెస్టు దిగ్గజం జో రూట్ 36 శతకాలతో ప్రథమస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ 33, టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి 30 సెంచరీలతో స్మిత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.అంతేకాదు.. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో మూడు ఫార్మాట్లలో కలిపి శతకాల పరంగా నాలుగో స్థానానికి ఎగబాకాడు. అంతర్జాతీయ స్థాయిలో విరాట్ కోహ్లి 81 శతకాలతో టాప్(Active Cricketers)లో ఉండగా.. రూట్ 52, రోహిత్ శర్మ 48, స్మిత్ 47 సెంచరీలతో టాప్-4లో నిలిచారు.ఇక శ్రీలంకతో మ్యాచ్‌లో ఖవాజా(232), స్మిత్(141)లతో పాటు జోష్ ఇంగ్లిస్ కూడా బ్యాట్ ఝులిపించాడు. 94 బంతుల్లోనే 102 పరుగులతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో ఆరు వికెట్ల నష్టానికి 654 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.టెస్టుల్లో పది వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు- ఏ దేశం తరఫున ఎందరు?👉ఆస్ట్రేలియా- నలుగురు- అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రిక్కీ పాంటింగ్, స్టీవ్ స్మిత్👉ఇండియా- ముగ్గురు- సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్👉ఇంగ్లండ్- ఇద్దరు- అలిస్టర్ కుక్, జో రూట్👉శ్రీలంక- ఇద్దరు- కుమార్ సంగక్కర, మహేళ జయవర్దనే👉వెస్టిండీస్- ఇద్దరు- బ్రియన్ లారా, శివ్‌నరైన్ చందర్‌పాల్👉పాకిస్తాన్- ఒక్కరు- యూనిస్ ఖాన్👉సౌతాఫ్రికా- ఒక్కరు- జాక్వెస్ కలిస్.చదవండి: మరో డీఎస్పీ!.. పోలీస్ ఉద్యోగంలో చేరిన భారత క్రికెటర్ -
ఇంకెన్నాళ్లు ఇలా?.. అతడిని ఆస్ట్రేలియా టూర్‌కి పంపాల్సింది!
వెటరన్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) టీమిండియా పునరాగమనం ఎప్పుడు? ఇప్పటికే ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు దూరమైన ఈ సీనియర్ బౌలర్.. కనీసం ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు అయినా అందుబాటులోకి వస్తాడా?.. ఇంతకీ షమీకి ఏమైంది? అతడి గాయం తీవ్రత ఎలా ఉంది?.. దేశవాళీ క్రికెట్ ఆడేందుకు తప్ప జాతీయ జట్టుతో చేరేందుకు అతడు సిద్ధంగా లేడా?..భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) వ్యక్తం చేస్తున్న సందేహాలు ఇవి. అసలు షమీ ఫిట్నెస్ గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గానీ.. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) గానీ స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదని ఈ మాజీ క్రికెటర్ ప్రశ్నిస్తున్నాడు. తానే గనుక బీసీసీఐ నాయకత్వంలో ఉంటే గనుక షమీని కచ్చితంగా ఆస్ట్రేలియా పర్యటనకు పంపించేవాడినని పేర్కొన్నాడు.అదే ఆఖరుకాగా వన్డే ప్రపంచకప్-2023(ODI World Cup 2023) సందర్భంగా మహ్మద్ షమీ చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ టోర్నీలో ఈ రైటార్మ్ పేసర్ ఏకంగా 24 వికెట్లు పడగొట్టాడు. చీలమండ నొప్పి వేధిస్తున్నా బంతితో మైదానంలో దిగి.. ప్రత్యర్థులకు వణుకుపుట్టించాడు. అద్భుత ప్రదర్శనతో టీమిండియా ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.దేశీ టీ20 టోర్నీతో రీ ఎంట్రీఅయితే, దురదృష్టవశాత్తూ టైటిల్ పోరులో రోహిత్ సేన ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఈ మెగా ఈవెంట ముగిసిన తర్వాత షమీ చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అనంతరం బెంగళూరులోని ఎన్సీఏలో పునరావాసం పొందాడు. దాదాపు ఏడాది తర్వాత దేశీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా బెంగాల్ తరఫున బరిలోకి దిగాడు.ఈ టోర్నీలో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన షమీ.. పదకొండు వికెట్లు తీసి సత్తా చాటాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో ఓవరాల్‌గా 201 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అప్పటికే ఆసీస్‌తో టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ మొదలుపెట్టగా.. కనీసం మూడో టెస్టు నుంచైనా షమీ జట్టుతో చేరతాడనే వార్తలు వచ్చాయి.కొన్నాళ్లు విరామం కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం షమీ గాయంపై స్పష్టత లేదని.. అతడి ఫిట్నెస్ గురించి తమకు పూర్తి సమచారం లేదని పేర్కొన్నాడు. దీంతో షమీ ఆసీస్ టూర్ అటకెక్కింది. ఈ క్రమంలో కొన్నాళ్లు విరామం తీసుకున్న షమీ.. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో ఈ బెంగాల్ ఆటగాడు బ్యాట్ ఝులిపించడం విశేషం. 42 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో షమీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. మహ్మద్ సిరాజ్‌తో పాటు యువ పేసర్లు హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ పెద్దగా రాణించకపోవడంతో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై అదనపు భారం పడింది. ఇక ఈ సిరీస్‌ను టీమిండియా 1-3తో కోల్పోయిన విషయం తెలిసిందే.ఇంకెన్నాళ్లు ఇలా?ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘అసలు అతడు ఎక్కడ ఉన్నాడు? పూర్తి స్థాయిలో కోలుకునేది ఎప్పుడు? అతడిని ఇంకెన్నాళ్లు ఎన్సీఏలో కూర్చోబెడతారు? అతడి ఫిట్నెస్ గురించి, ప్రస్తుతం అతడి పరిస్థితి గురించి బీసీసీఐ గానీ, ఎన్సీఏ గానీ ఎందుకు సరైన సమాచారం ఇవ్వలేకపోతోంది. నిజానికి అతడికి ఉన్న నైపుణ్యాల దృష్ట్యా.. నేనైతే అతడు పూర్తి ఫిట్‌గా లేకున్నా ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లేవాడిని’’ అని షమీ గురించి ప్రస్తావించాడు.అతడిని ఆస్ట్రేలియా టూర్‌కి పంపాల్సింది!ఇందుకు ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ బదులిస్తూ.. ‘‘షమీ పూర్తి ఫిట్‌గా లేకపోయినా.. కనీసం నాలుగైదు ఓవర్లు అయినా బౌల్ చేసేవాడు. బ్యాకప్ సీమ్ బౌలింగ్ ఆప్షన్‌గా అందుబాటులో ఉండేవాడు. నిజంగా అతడు గనుక టీమిండియాతో ఉండి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా తదుపరి ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. మనసు మార్చుకున్న రోహిత్, కోహ్లి!? -
హిట్‌మ్యాన్‌కు ఏమైంది?.. చెత్త షాట్లు ఆడటం అవసరమా?
అలవోకగా షాట్లు కొట్టడంలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ది ప్రత్యేకమైన శైలి. బ్యాటింగ్ ఇంత సులువుగా చేయొచ్చా అన్న రీతిలో.. అంత సొగసుగా ఆడి కెప్టెన్ స్థాయికి ఎదిగాడు ఈ ముంబై ఆటగాడు. అయితే, రోహిత్ ఇప్పుడు జట్టుకే భారంగా పరిణమించాడు.ఆస్ట్రేలియా తో మెల్బోర్న్లో గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టులో రెండో రోజున బ్యాటింగ్‌కు వచ్చాడు రోహిత్ శర్మ. అయితే, కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో మిడాన్ వద్ద.. స్కాట్ బోలాండ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.పేలవ ఫామ్‌తో జట్టుకు భారంగాఫలితంగా కేవలం ఎనిమిది పరుగుల వద్ద ఉండగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. కేఎల్ రాహుల్(KL Rahul) స్థానంలో తొలిసారి ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ ఇలా బాధ్యతారహితంగా వెనుదిరగడం.. ప్రస్తుత అతడి పేలవమైన ఫామ్ గురించి చెప్పకనే చెబుతుంది.ఈ సిరీస్‌లో తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాల వల్ల దూరమైన రోహిత్ శర్మ.. ఆ తర్వాత రెండు టెస్టుల్లో పేలవంగా ఆడిన విషయం తెలిసిందే. నాలుగు ఇన్నింగ్స్‌లో 5.50 సగటుతో కేవలం 22 పరుగులు (౩, 6, 10, ౩) సాధించాడు. ఇప్పుడు మెల్బోర్న్లో మరోసారి చాలా చెత్త షాట్ ఆడి భారత్ జట్టును.. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ప్రమాదంలో పడేసాడు. చాన్నాళ్లుగా ఇదే పరిస్థితిటీమిండియాను ముందుండి నడిపించాల్సిన సారథి ఇలాంటి అతి ప్రాధాన్యం ఉన్న ఈ టెస్ట్ సిరీస్‌లో వరుసగా విఫలం కావడం జట్టు మానసిక స్థైర్యాన్ని కుంగదీస్తుందనడంలో సందేహం లేదు. 37 ఏళ్ళ రోహిత్ ఇప్పటి వరకు 66 టెస్ట్ మ్యాచ్‌లలో 41 .24 సగటుతో మొత్తం 4289 పరుగులు సాధించాడు. ప్రపంచ క్రికెట్లోనే ప్రధాన బ్యాటర్లలో ఒకడిగా ప్రశంసలు అందుకున్న రోహిత్, గత కొద్ది రోజులుగా ఆశించిన స్థాయిలో రాణించకుండా విఫలమవుతూ ఉండటం గమనార్హం.చెత్త షాట్ కొట్టాల్సిన అవసరం లేదుముఖ్యంగా మెల్బోర్న్లో రోహిత్ కొట్టిన షాట్ అతడి ప్రస్తుత ఫామ్ కి అద్దం పడుతోంది. క్రీజులో మందకొడిగా కదులుతూ అతడు అవుటైన తీరుపై పలువురు ప్రఖ్యాత కామెంటేటర్లు విమర్శలు గుప్పించారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజం, వ్యాఖ్యాత, ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్(Ricky Ponting) రోహిత్ బ్యాటింగ్ తీరు పై తీవ్ర విమర్శలు చేశాడు."రోహిత్ క్రీజులో చాలా మందకొడిగా కనిపించాడు. పైగా అతడు అప్పటికింకా క్రీజులో నిలదొక్కుకోలేదు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే అటువంటి షాట్ కొట్టాల్సిన అగత్యం ఎందుకో అర్థం కావడం లేదు. రోహిత్ హుక్ షాట్స్, పుల్ షాట్స్ కొట్టడంలో దిట్ట. అటువంటి రోహిత్ కొద్ది సేపు వేచి చూచి పిచ్ తీరు తెన్నులు అర్ధం చేసుకున్న తర్వాత తన షాట్లు కొట్టాల్సింది. అలా కాకుండా ప్రారంభంలోనే ఇలాంటి చెత్త షాట్ కొట్టాల్సిన అవసరం లేదు. ఇది అతని ప్రస్తుత మానసిక పరిస్థితిని, పేలవమైన ఫామ్‌ని చెబుతుంది" అని పాంటింగ్ వ్యాఖ్యానించాడునీ సహజ సిద్దమైన ఆట తీరు ఏమైంది? మరో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డారెన్ లీమన్ కూడా రోహిత్ ఆటతీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. "రోహిత్ నువ్వు హిట్ మాన్వి. నీ సహజ సిద్దమైన ఆట తీరు ఏమైంది? షాట్లు కొట్టడానికి అవుట్ ఫీల్డ్‌లో కావలిసినంత వెసులుబాటు ఉండగా దానిని సద్వినియోగం చేసుకోకుండా ఇలాంటి చెత్త షాట్ కొట్టి వెనుదిరగడం బాధాకరం" అన్నాడు. అదే విధంగా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా రోహిత్ వైఖరి పై విమర్శలు చేసాడు.ఇక ఈ సిరీస్‌లో భారత్ టాప్ ఆర్డర్ బ్యాటర్ వైఫల్యం మరోసారి ఈ ఇన్నింగ్స్‌లో బయటపడింది. రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి భారత్ అయిదు వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసింది. ఆస్ట్రేలియా కంటే ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులు వెనుకబడి ఉంది. ఈ పరిస్థితిలో భారత్ ని ఆదుకునే బాధ్యత వికెట్ కీపర్ రిషబ్ పంత్ , రవీంద్ర జడేజా పైనే ఉంది.చదవండి: విశ్రాంతి కాదు.. నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.: టీమిండియా దిగ్గజం -
'గిల్‌క్రిస్ట్‌లా అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు.. కానీ ఇప్పుడే వద్దు'
టీమిండియాకు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ పెద్ద తలనొప్పిగా మారాడు. భారత్ అంటే చాలు ఫార్మాట్‌తో సంబంధం లేకుండా చెలరేగిపోతున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో హెడ్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు.ఈ మ్యాచ్‌లో 140 పరుగులు చేసిన హెడ్.. ఆసీస్ సిరీస్‌ను సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో శనివారం నుంచి గబ్బా వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టులో ఈ డేంజరస్ ఆసీస్ బ్యాటర్‌ను అడ్డుకునేందుకు భారత్ ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది.అతడిని ఎలాగైనా ఆదిలోనే పెవిలియన్‌కు పంపాలని రోహిత్ అండ్ కో భావిస్తోంది. ఈ నేపథ్యంలో హెడ్‌పై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో హెడ్‌ను రికీ పోల్చాడు. అయితే ఇప్పటి నుంచే అతడిని 'గ్రేట్' అని పిలువద్దని అతడు అభిప్రాయపడ్డాడు."ట్రవిస్ హెడ్ గొప్ప క్రికెటర్లలో ఒకడిగా ఎదుగుతున్నాడు. అయితే, ఏదో ఒక ఇన్నింగ్స్ చూపి అతడిని గ్రేట్ క్రికెటర్ అని చెప్పలేము. కానీ అతడేం చేసినా అత్యద్భుతంగా చేస్తున్నాడు. జట్టు కోసం తాను చేయగలిగినంతా చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ ప్రశంసలకు తాను అర్హుడిని కానన్నట్లుగా హుందాగా ఉంటాడు.హెడ్ బ్యాటింగ్ చేసే విధానం గిల్‌క్రిస్ట్ అప్రోచ్‌కు దగ్గరగా ఉంటుంది. బ్యాటింగ్ ఆర్డర్లో రెండు స్థానాలు ఎక్కువగా ఉన్నప్పటికీ గిల్లీ, హెడ్ ఒకేలా బ్యాటింగ్ చేస్తున్నారు. గిల్లీ ఆరు లేదా ఏడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడగా.. ఇప్పుడు హెడ్ ఐదో డౌన్ వచ్చి అదే పనిచేస్తున్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే పాజిటివ్ యాటిట్యూడ్‌తో బ్యాటింగ్ చేస్తాడు. అతడిలో ఔటవ్వతానన్న భయం కూడా కన్పించడం లేదు. ప్రతికూల ఫలితంతో అతడికి అస్సలు పనిలేదు. తనకు తెలిసిందల్లా ఒకటే. క్రీజులో ఉన్నంతసేపు పరుగులు రాబట్టడమే అతడి పని అని ఐసీసీ రివ్యూలో అతడు పేర్కొన్నాడు.చదవండి: IND vs AUS: మూడో టెస్టుకు ఆసీస్ తుది జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడు వచ్చేశాడు -
ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్
ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్ అతడేనంటూ బ్రూక్‌ను కొనియాడాడు. స్వదేశంలోనే.. విదేశీ గడ్డపై కూడా అతడు బ్యాట్ ఝులిపించే తీరు చూడముచ్చటగా ఉంటుందని ప్రశంసించాడు.అగ్రపీఠం అధిరోహించిన బ్రూక్కాగా 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా అవతరించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అద్భుత ఫామ్‌తో పరుగుల వరద పారిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ (898 రేటింగ్ పాయింట్లు)గా నిలిచాడు.ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బ్రూక్ వరుసగా 171, 123, 55 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నంబర్‌వన్‌గా ఉన్న మరో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (898)ను వెనక్కి నెట్టి అగ్రపీఠం అధిరోహించాడు. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ హ్యారీ బ్రూక్ గురించి ఐసీసీ రివ్యూ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే‘‘ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే అనుకుంటున్నా. కేవలం సొంతగడ్డ మీద మాత్రమే కాదు.. విదేశాల్లోనూ అద్భుత ఆట తీరుతో అలరిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు దేశాల్లో ఏకంగా ఏడు శతకాలు నమోదు చేశాడు. అతడొక క్లాస్ ప్లేయర్. బ్రూక్ బ్యాటింగ్ చేస్తూ ఉంటే చూడటం నాకు ఎంతో ఇష్టం’’ అని రిక్కీ పాంటింగ్ హ్యారీ బ్రూక్‌ను కొనియాడాడు.ఏడు సెంచరీలు విదేశీ గడ్డపైనే కాగా రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హ్యారీ బ్రూక్.. ఇప్పటి వరకు టెస్టుల్లో ఎనిమిది శతకాలు బాదాడు . ఇందులో ఏడు సెంచరీలు విదేశీ గడ్డపై చేసినవే. అదే విధంగా అతడి ఖాతాలో ద్విశతకం, ఒక త్రిశతకం కూడా ఉన్నాయి. ఇక వన్డేల్లోనూ హ్యారీ బ్రూక్ పేరిట ఒక సెంచరీ ఉంది.మొత్తంగా ఇప్పటి వరకు తన కెరీర్లో హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్టులు, 20 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 2280, 719, 707 పరుగులు సాధించాడు.మనోళ్ల పరిస్థితి ఏంటి?ఇదిలా ఉంటే.. ఐసీసీ టాప్–10 టెస్టు బ్యాటర్ల జాబితాలో భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (4వ స్థానం), రిషభ్ పంత్ (9వ స్థానం) ఉండగా...శుబ్‌మన్ గిల్ 17వ, విరాట్ కోహ్లి 20వ స్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు.. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (890) తన నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కగిసో రబాడ (856), హాజల్‌వుడ్ (851) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అశ్విన్ ర్యాంక్ 4 నుంచి 5కు పడిపోగా, జడేజా 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు ఆల్రౌండర్లలో జడేజా (415) అగ్ర స్థానం, అశ్విన్ 3వ స్థానం (283) పదిలంగా ఉన్నాయి. చదవండి: యశస్వి జైస్వాల్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఆఖరికి యువ ఓపెనర్ లేకుండానే.. -
విరాట్ ఒక వారియర్.. అతడిని చూసి ఆసీస్ క్రికెటర్లు నేర్చుకోవాలి: పాంటింగ్
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుతో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తిరిగి తన ఫామ్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాదిలో విరాట్ కోహ్లికి ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. ఇక తన రిథమ్‌ను తిరిగి పొందిన విరాట్.. డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న పింక్ బాల్ టెస్టుకు సన్నద్దమవుతున్నాడు.ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లిపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్లు మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్‌లు కోహ్లిని చూసి నేర్చుకోవాలని పాంటింగ్ సూచించాడు. కాగా ఈ ఆసీస్ స్టార్లు ఇద్దరూ ప్రస్తుతం పేలవ ఫామ్‌లో ఉన్నారు. పెర్త్ టెస్టులో వీరిద్దరి దారుణ ప్రదర్శన చేశారు.ఈ క్రమంలో పాంటింగ్ ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. "విరాట్ ఎప్పుడూ ఆత్మవిశ్వాన్ని కోల్పోడు. అతడొక వారియర్. తనను తను విశ్వసించినందున బలంగా తిరిగి వచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో కంటే రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి డిఫెరెంట్‌గా కన్పించాడు. అతడు ప్రత్యర్ధిలతో పోరాడాలని భావించలేదు. కేవలం తన బలాలపై దృష్టి పెట్టాడు. లబుషేన్, స్మిత్ కూడా కోహ్లిని ఫాలో అవ్వాలి. పరుగులు ఎలా చేయాలో ముందు దృష్టి పెట్టిండి. అంతే తప్ప మీ వికెట్ గురించి ఆలోచించకండి.ఫామ్‌లో లేనప్పుడు ఏ ఆటగాడికైనా పరుగులు సాధించడం చాలా కష్టమవుతోంది. ఆ విషయం నాకు కూడా తెలుసు. అందకు సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేయడమే ఒక్కటే మార్గమని పేర్కొన్నాడు. -
టీమిండియా గెలుస్తుందని అస్సలు ఊహించలేదు: రికీ పాంటింగ్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా అద్బుతమైన విజయంతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌ను ఏకంగా 295 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ దూసుకెళ్లింది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి టెస్టులో భారత్ గెలుస్తుందని తాను అస్సలు ఊహించలేదని రికీ పాంటింగ్ వెల్లడించాడు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవడం కష్టమే అనుకున్నారు. కానీ బౌరత బౌలర్ల అద్బుతం చేయడంతో ఆసీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు చెలరేగడంతో ఆసీస్ ముందు 534 పరుగుల భారీ టార్గెట్‌ను భారత్ ఉంచింది. అంతటి భారీ లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్ చతికలపడింది.అస్సలు ఊహించలేదు: రికీ పాంటింగ్"ఆస్ట్రేలియాకు తొలి టెస్టులోనే ఊహించని పరాభావం ఎదురైంది. దాదాపు 300 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కచ్చితంగా వారు తీవ్ర నిరాశ చెంది ఉంటారు. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకున్నప్పుడు అది సరైన నిర్ణయమేనా నన్ను అందరూ అడిగారు.ఖచ్చితంగా అది సరైన నిర్ణయమేనని నేను చెప్పాను. ఈ స్టేడియంలో ఇప్పటివరకు నాలుగు టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. యాదృచ్చకంగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టే నాలుగు సార్లు గెలిచింది. కాబట్టి గణాంకాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైనప్పటికి, బౌలర్లు అద్బుతంగా రాణించి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. బుమ్రా, సిరాజ్ బంతితో మ్యాజిక్ చేశారు. వారితో పాటు నితీష్ రెడ్డి కూడా బాగా రాణించాడు. ఆసీస్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. పెర్త్ వంటి కఠిన పరిస్ధితుల్లో భారత్ గెలుస్తుందని నేను అస్సలు అనుకోలేదు. కానీ భారత్ అంచనాలను తారుమారు చేసింది. అదే పెర్త్‌లోనే రుజువైంది" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు.చదవండి: IND vs AUS: ఒకే ఒక్క వికెట్.. చరిత్రకు అడుగు దూరంలో జస్ప్రీత్ బుమ్రా -
'నేను చూసిన టాలెంటెడ్ ప్లేయర్లలో అతడొకడు.. మళ్లీ తిరిగి వస్తాడు'
టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. క్రమశిక్షణరాహిత్యం,ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలతో జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న పృథ్వీ షా.. ఇప్పుడు ఐపీఎల్లో ఆడే అవకాశం కూడా కోల్పోయాడు.ఇటీవల జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో పృథ్వీ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సైతం అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు.తన కెరీర్ ఆరంభంలో జానియర్ సచిన్ టెండూల్కర్ పేరొందిన పృథ్వీ షాకు ఇప్పుడు కనీసం ఫ్రాంచైజీ క్రికెట్లో కూడా ఆడే ఛాన్స్ రాకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే వేలంలో అమ్ముడుపోకపోవడంతో పృథ్వీ షాను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. మహ్మద్ కైఫ్ వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం పృథ్వీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాటింగ్ మాత్రం ఈ ముంబై ఆటగాడికి మద్దతుగా నిలిచాడు."ఐపీఎల్ మెగా వేలంలో పృథ్వీ అన్‌సోల్డ్‌గా మిగిలడం నిజంగా చాలా బాధాకరం. నా కోచింగ్ కెరీర్లో ఇప్పటివరకు నేను పనిచేసిన టాలెంటెడ్ క్రికెటర్లలో పృథ్వీ ఒకడు. కనీసం అతడు యాక్సిలరేటర్ రౌండ్‌లోనైనా అమ్ముడుపోతాడని నేను భావించాను. కానీ అది కూడా జరగలేదు.అయితే వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలినప్పటికీ అన్ని ఫ్రాంచైజీల కళ్లు అతడిపైనే ఉన్నాయి. అతడి నుంచి ఆటను ఎవరూ దూరంగా ఉంచలేరు. కచ్చితంగా పృథ్వీ మళ్లీ తిరిగివస్తాడని నేను భావిస్తున్నాను" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు.కాగా రికీ పాటింగ్తో పృథ్వీషాకు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ ఆరేళ్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో కలిసి పనిచేశారు. ఐపీఎల్-2018 సీజన్ నుంచి ఈ ఏడాది సీజన్ వరకు ఢిల్లీ హెడ్‌కోచ్‌గా రికీ పాంటింగ్ పనిచేయగా.. పృథ్వీ షా ఆటగాడిగా కొనసాగాడు.చదవండి: IPL 2025: గుడ్ బై.. స్వింగ్ కింగ్ భావోద్వేగం!.. ఆరెంజ్ ఆర్మీపై భువీ పోస్ట్ వైరల్ -
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ: కామెంటేటర్‌గా పాంటింగ్ అవుట్!
ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు మేటి జట్లు ఈ టెస్టు సిరీస్‌లో నువ్వా- నేనా అన్నట్లు పోటీ పడుతుంటే క్రికెట్ ప్రేమికులకు లభించే ఆ కిక్కే వేరు. ఆసీస్- భారత ఆటగాళ్ల మధ్య పరస్పర స్లెడ్జింగ్‌తో పాటు.. మ్యాచ్‌ను విశ్లేషిస్తూ కామెంటేటర్లు విసిరే ఛలోక్తులు, చమక్కులకు కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.కామెంట్రీకి దూరంఇరుజట్లకు చెందిన మాజీ క్రికెటర్లలో చాలా మంది ఆసీస్ - భారత్ మధ్య ఈ టెస్టు సిరీస్‌ను తమ వ్యాఖ్యలతో మరింత ఆసక్తికరంగా మారుస్తూ ఉంటారు. ఆసీస్ దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ కూడా ఈ కోవకు చెందినవాడే. అయితే, అతడు ఈసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టు కామెంట్రీకి దూరం కానున్నట్లు సమాచారం.కారణం ఇదేపాంటింగ్తో పాటు ఆసీస్ మరో మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ కూడా పెర్త్ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ వార్తా పత్రిక ‘ది ఏజ్’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) విధుల కారణంగా.. పాంటింగ్- లాంగర్ పెర్త్‌లో జరిగే.. మొదటి టెస్టు కామెంట్రీకి దూరంగా ఉండనున్నట్లు తెలిపింది.కాగా రిక్కీ పాంటింగ్ ఇటీవలే.. ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. అదే విధంగా.. జస్టిన్ లాంగర్ సైతం లక్నో సూపర్ జెయింట్స్ శిక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. నవంబరు 24, 25 తేదీల్లో ఐపీఎల్-2025 మెగా వేలం జరుగనుంది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగే ఆక్షన్‌కు కోచ్‌లు కూడా అందుబాటులో ఉంటారు.బీసీసీఐపై అక్కసు వెళ్లగక్కిన ఆసీస్ మీడియాఅయితే, అంతకు రెండు రోజుల ముందే.. అంటే నవంబరు 22న ఆసీస్- భారత్ మొదటి టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలోనే ‘ది ఏజ్’ పాంటింగ్- లాంగర్‌ల గురించి ప్రస్తావిస్తూ.. బీసీసీఐపై పరోక్షంగా అక్కసు వెళ్లగక్కింది.‘‘సెవెన్ చానెల్, క్రికెట్ ఆస్ట్రేలియా గనుక.. ఇండియాలోని శక్తిమంతమైన క్రికెట్ అధికారుల నుంచి తమ ప్రయోజనాలను కాపాడుకోలేకపోతే.. పాంటింగ్, లాంగర్, ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డానియల్ వెటోరీ సైతం సౌదీ అరేబియాకు వెళ్లే పరిస్థితి ఉంది.అక్కడి జెద్దా నగరంలో ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొంటూ.. ఆటగాళ్ల కోసం వీళ్లంతా కార్డులు చూపిస్తూ మనకు కనిపిస్తారు. అప్పటికి తొలి టెస్టు ముగింపునకు వస్తుంది’’ అని ‘ది ఏజ్’ పేర్కొంది.నేను కోహ్లిని అవమానించలేదు: పాంటింగ్ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ వ్యాఖ్యలపై రిక్కీ పాంటింగ్ స్పందించాడు. తానేమీ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని అవమానించలేదని.. ఆస్ట్రేలియా గడ్డపై అతడు ఫామ్‌లోకి రావాలని మాత్రమే ఆశించానన్నాడు. ఏదేమైనా కోచ్‌గా గౌతీ తన జట్టును డిఫెండ్ చేసుకోవడంలో తప్పులేదని పేర్కొన్నాడు.కాగా కోహ్లి గత ఐదేళ్లలో కేవలం రెండే టెస్టు సెంచరీలు చేయడం ఏమిటని పాంటింగ్ విమర్శించగా.. మీడియా వేదికగా గౌతీ అతడికి కౌంటర్ ఇచ్చాడు. భారత క్రికెట్‌తో పాంటింగ్‌కు ఏం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతగా కావాలంటే.. ఆసీస్ ఆటగాళ్ల ఆట తీరును పరిశీలించుకోవాలని హితవు పలికాడు.చదవండి: BGT 2024: అతడి బ్యాటింగ్ అద్భుతం.. భారత తుదిజట్టులో చోటివ్వాల్సిందే: ఆసీస్ మాజీ కెప్టెన్ -
అసలు అతడికి మాతో ఏం పని?: రిక్కీ పాంటింగ్‌పై గంభీర్ ఫైర్
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్‌పై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడికి భారత క్రికెట్‌తో పనేంటని.. ఎదుటి వాళ్ల గురించి మాట్లాడే ముందు తమ ఆటగాళ్లు ఎలా ఉన్నారో చూసుకోవాలని హితవు పలికాడు. కాగా టెస్టుల్లో టీమిండియా ప్రస్తుతం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.డబ్ల్యూటీసీ టైటిల్ రేసులో నిలవాలంటేసొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది రోహిత్ సేన. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)2023-25 ఫైనల్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా కనీసం నాలుగు టెస్టుల్లో గెలిస్తేనే డబ్ల్యూటీసీ టైటిల్ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది.ఇక కివీస్‌తో సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ చేతిలో చారిత్రాత్మక ఓటమికి ఒకరకంగా వీరిద్దరి వైఫల్యమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇలాంటి తరుణంలో ఆసీస్ పర్యటన భారత జట్టుకు మరింత కఠినతరంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కోహ్లిపై పాంటింగ్ విమర్శలుఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి విమర్శలు చేశాడు. అగ్రశ్రేణి బ్యాటర్‌గా కొనసాగుతూ గత ఐదేళ్లలో టెస్టుల్లో కేవలం రెండు శతకాలే బాదడం ఏమిటని ప్రశ్నించాడు. కోహ్లి ఆట తీరు ఇలాగే ఉంటే టీమిండియాకు తిప్పలు తప్పవని.. అతడి బ్యాటింగ్ గణాంకాలు నిజంగా ఆందోళనకరంగా ఉన్నాయని పాంటింగ్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో సిరీస్‌కు ముందు భారత జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ సోమవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా పాంటింగ్ వ్యాఖ్యలను విలేఖరులు ప్రస్తావించగా గౌతీ ఫైర్ అయ్యాడు. ‘‘అసలు పాంటింగ్‌కు భారత క్రికెట్‌తో ఏం పని? అతడు.. ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచిస్తే మంచిదనుకుంటున్నాను.భారత క్రికెట్‌తో అతడికి ఏం పని?అయినా, విరాట్, రోహిత్ గురించి అతడికి ఆందోళన ఎందుకు? నా దృష్టిలో వాళ్లిద్దరు అద్భుతమైన ఆటగాళ్లు. కఠిన సవాళ్లకు సమర్థవంతంగా ఎదురీదగల సత్తా ఉన్నవాళ్లు. భారత క్రికెట్ తరఫున ఎన్నో విజయాలు సాధించారు. భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతారు’’ అని గంభీర్ ఘాటుగా బదులిచ్చాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను సమర్థిస్తూ పాంటింగ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.కాగా నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభం కానుంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్లను ప్రకటించాయి. ఇదిలా ఉంటే.. కివీస్‌తో సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి కోహ్లి చేసిన పరుగులు 0, 70, 1, 17, 4, 1.ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.భారత్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు:ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్ , మిచెల్ మార్ష్, మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్. చదవండి: ఆసీస్‌తో తొలి టెస్టుకు రోహిత్ దూరం! భారత కెప్టెన్ అతడే? గంభీర్ క్లారిటీ -
ఐదేళ్లలో కేవలం రెండు సెంచరీలా? కోహ్లిపై ఆసీస్ దిగ్గజం విమర్శలు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. టెస్టుల్లో స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ముఖ్యంగా ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో కోహ్లి విఫలమైన తీరుపై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సిరీస్‌లో టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ కావడానికి కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లి వైఫల్యమే కారణమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తదుపరి ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో గనుక రాణించకపోతే వీరిద్దరిపై వేటు వేయాలనే డిమాండ్లూ వస్తున్నాయి.ఒకవేళ అవే నిజమైతే గనుకఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ కోహ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘విరాట్ గురించి ఇటీవల నేను కొన్ని గణాంకాలు చూశాను. గత ఐదేళ్లలో అతడు టెస్టుల్లో కనీసం రెండు లేదంటే మూడు మాత్రమే సెంచరీలు చేసినట్లు సదరు గణాంకాలు సూచిస్తున్నాయి.అవి సరైనవో కాదో నాకు తెలియదు. ఒకవేళ అవే నిజమైతే గనుక.. ఇది నిజంగా ఆందోళనపడాల్సిన విషయమే. టాపార్డర్ బ్యాటర్‌గా ఉంటూ ఐదేళ్లుగా రెండే టెస్టు శతకాలు బాదారంటే.. అలాంటి ఆటగాడు మరొకరు ఉండరనే అనుకుంటున్నా’’ అని పాంటింగ్ కోహ్లి ఆట తీరును విమర్శించాడు.ఆసీస్‌పై ఆడటం కోహ్లికి ఇష్టంఇక కోహ్లి గొప్ప బ్యాటర్ అనడంలో సందేహం లేదన్న పాంటింగ్.. ఆస్ట్రేలియాపై ఆడటం అంటే అతడికి ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు. తమ జట్టుపై అతడికి మంచి రికార్డు ఉందని.. ఆసీస్‌తో తొలి టెస్టుతోనే కోహ్లి తిరిగి ఫామ్‌లోకి వచ్చినా ఆశ్చర్యం లేదన్నాడు. కాగా న్యూజిలాండ్‌తో ఇటీవల సొంతగడ్డపై మూడు టెస్టుల్లో కోహ్లి చేసిన పరుగులు వరుసగా.. 0, 70, 1, 17, 4, 1.దశాబ్దకాలం తర్వాత తొలిసారిఈ క్రమంలో దశాబ్దకాలం తర్వాత తొలిసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి స్థానం దిగజారింది. పదేళ్లలో తొలిసారిగా అతడు టాప్-20లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. అంతేకాదు.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆరు టెస్టులాడిన కోహ్లి సగటున కేవలం 22 పరుగులు రాబట్టాడు. 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన తర్వాత కోహ్లి ఇలా లోయెస్ట్ ఆవరేజ్ నమోదు చేయడం ఇదే తొలిసారి.ఒకవేళ ఆస్ట్రేలియా గడ్డపై గనుక రాణించకపోతే కోహ్లిపై విమర్శలు మరింత పదునెక్కడం ఖాయం. కాగా నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఆరంభం కానుంది. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కనీసం నాలుగు గెలిస్తేనే టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరుతుంది. చదవండి: IPL 2025: మళ్లీ క్రికెట్ ఆడాలనుకుంటున్నాను..! ఆ ఫ్రాంఛైజీ కొనే ఛాన్స్! -
IPL 2025: గంగూలీకి బైబై.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్రకటన
ఐపీఎల్-2025 సీజన్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ కీలక ప్రకటన చేసింది. తమ జట్టు ప్రధాన కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీని నియమించినట్లు తెలిపింది. అదే విధంగా.. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ బాధ్యతలను మరో భారత మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావుకు అప్పగించినట్లు పేర్కొంది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది.కాగా.. గతంలో వీరిద్దరు ఐపీఎల్లో ఆడారు. వేణుగోపాల్ ఢిల్లీ డేర్‌డెవిల్స్(పాతపేరు)కు ఆడగా.. 2010లో ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బదానీ సభ్యుడు. వీరిద్దరూ కలిసి టీమిండియాకూ ఆడారు. అంతేకాదు.. వేణుగోపాల్ రావు తెలుగు, బదానీ తమిళ కామెంట్రీ కూడా చేశారు.ఇక ఢిల్లీ ఫ్రాంఛైజీ కోచింగ్ స్టాఫ్‌లో పనిచేసిన అనుభవం కూడా వీరికి ఉంది. ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు వీరు సేవలు అందించారు. మరోవైపు.. బదానీ ఇటీవలే.. సౌతాఫ్రికా టీ20 లీగ్ చాంపియన్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ బ్యాటింగ్ కోచ్‌గానూ నియమితుడు కావడం గమనార్హం.పాంటింగ్, గంగూలీకి బైబైహెడ్కోచ్గా బదానీ, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వేణుగోపాల రావు నియాకం పట్ల ఢిల్లీ ఫ్రాంఛైజీ సహ యజమాని కిరణ్ కుమార్ గాంధీ హర్షం వ్యక్తం చేశాడు. వీరిద్దరికి తమ క్యాపిటల్స్ కుటుంబంలో స్వాగతం పలుకుతున్నామని.. వీరి రాకతో జట్టు విజయపథంలో నడుస్తుందని ఆశిస్తున్నామన్నాడు. కాగా ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌తో సుదీర్ఘ బంధాన్ని తెంచుకున్న ఢిల్లీ.. ఇటీవలే అతడిని హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పించింది. పాంటింగ్ స్థానాన్ని తాజాగా బదానీతో భర్తీ చేసింది. ఇక డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సౌరవ్ గంగూలీ స్థానంలో వేణుగోపాలరావును తీసుకువచ్చింది.చదవండి: IND Vs NZ 1st Test: అసలేం చేశావు నువ్వు?: రోహిత్ శర్మ ఆగ్రహం -
IPL 2025: భారీ మొత్తానికి డీల్.. ఆ జట్టుతోనే పంత్!
టీమిండియా స్టార్ రిషభ్ పంత్ వచ్చే ఏడాది కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే ఉంటాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. భారీ మొత్తానికి ఫ్రాంఛైజీ అతడిని అట్టిపెట్టుకుందని.. ఢిల్లీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల్లోకెల్లా ఇదే ఉత్తమమైందని పేర్కొన్నాడు. కాగా రోడ్డు ప్రమాదం కారణంగా ఐపీఎల్-2023 మొత్తానికి దూరమైన పంత్.. పునరాగమనంలో సత్తా చాటిన విషయం తెలిసిందే.ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన పంత్.. జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చలేకపోయినా.. ఆరో స్థానంలో నిలపగలిగాడు. అయితే, సారథిగా విఫలమైనా ఆటగాడిగా మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ మొత్తంగా 446 పరుగులు సాధించి.. ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్ కీపర్‌గానూ రాణించాడు.పాంటింగ్‌తో పాటు పంత్ కూడా పంజాబ్ జట్టులోకి?అయితే, ఐపీఎల్-2025కి ముందు పంత్ ఢిల్లీ ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు వచ్చాయి. హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్‌కు ఢిల్లీ ఉద్వాసన పలకగా.. అతడు పంజాబ్ కింగ్స్‌లో చేరాడు. దీంతో పాంటింగ్‌తో పాటు పంత్ కూడా పంజాబ్‌తో జట్టుకట్టనున్నాడనే వదంతులు వ్యాపించాయి. టెస్టుల్లో పునరాగమనంలో పంత్ శతక్కొట్టగా.. అతడిని అభినందిస్తూ పంజాబ్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఇందుకు ఊతమిచ్చింది.పంత్ కంటే మెరుగైన ఆటగాడు మరొకరు దొరకరుఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ ఢిల్లీ జట్టును వీడి ఎక్కడికీ వెళ్లడం లేదు. రిక్కీ పాంటింగ్‌తో కలిసి పంజాబ్ కింగ్స్‌లో చేరతాడనే వార్తలు అవాస్తవం. చెన్నై సూపర్ కింగ్స్‌కు కూడా అతడు ఆడే అవకాశం లేదు. క్రిక్‌బజ్ తాజా కథనం ద్వారా ఈ విషయం వెల్లడైంది. భారీ మొత్తం వెచ్చించి అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఇదొకటి. అతడిని అస్సలు వదులు కోవద్దు. పంత్ కంటే మెరుగైన కెప్టెన్ మళ్లీ మరొకరు మీకు దొరకరు’’ అని పేర్కొన్నాడు. పంత్ ఢిల్లీతోనే ఉండి.. జట్టును విజయపథంలో నడిపి టైటిల్ గెలవాలని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా ఆకాంక్షించాడు. చదవండి: రంజీ ‘జట్టు’లో విరాట్ కోహ్లి, మరో టీమిండియా స్టార్ కూడా.. డీడీసీఏ ప్రకటన -
IPL 2025: పంజాబ్ కింగ్స్ రాత మారేనా!
అన్నట్లు’... మెరుగైన ప్లేయర్లు, అంతకుమించిన సహాయక సిబ్బంది, ప్రతి మ్యాచ్‌లో దగ్గరుండి ప్రోత్సహించే ఫ్రాంచైజీ యాజమాన్యం, అన్నీటికి మించి జట్టు ఎలాంటి ప్రదర్శన చేసినా వెన్నంటి నిలిచే అభిమాన గణం ఇలా అన్నీ ఉన్నా... పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది. గత ఏడేళ్లుగా కనీసం టాప్–5లో కూడా నిలవలేకపోయింది. మరి ఇప్పుడు కొత్త హెడ్ కోచ్‌గా ఆ్రస్టేలియా దిగ్గజం రికీ పాంటింగ్ రాకతోనైనా పంజాబ్ రాత మారుతుందా లేదా వేచి చూడాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభం నుంచి కొనసాగుతున్న జట్లలో పంజాబ్ ఒకటి. కొన్నేళ్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేరుతో లీగ్‌లో ఆడింది. ఆ తర్వాత ఈ పేరును పంజాబ్ కింగ్స్‌గా మార్చుకుంది. అయితేనేం ఐపీఎల్ విన్నర్స్ ట్రోఫీ మాత్రం పంజాబ్ జట్టుకు అందని ద్రాక్షగానే ఉంది. క్రిస్ గేల్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్, షాన్ మార్‡్ష, డేవిడ్ మిల్లర్, మ్యాక్స్‌వెల్, శిఖర్ ధావన్ వంటి విధ్వంసక బ్యాటర్లు ప్రాతినిధ్యం వహించినా... టామ్ మూడీ మొదలుకొని అనిల్ కుంబ్లే వరకు ఎందరో దిగ్గజాలు హెడ్ కోచ్‌లుగా పనిచేసినా పంజాబ్ రాత మాత్రం మారడంలేదు. చివరిసారిగా 2014లో ఫైనల్ చేరిన పంజాబ్ జట్టు... గత ఏడు సీజన్లలో కనీసం టాప్–5లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. ఈ ఏడాది శిఖర్ ధావన్ సారథ్యంలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో తొమ్మిదింట ఓడి 10 పాయింట్లు మాత్రమే సాధించింది. గాయం కారణంగా ధావన్ కొన్ని మ్యాచ్‌లకే అందుబాటులో ఉండటం... భారీ ధర పెట్టి కొనుగోలు చేసుకున్న ఇంగ్లండ్ పేస్ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం పంజాబ్ విజయావకాశాలపై ప్రభావం చూపింది. ఇలాంటి దశలో జట్టు ప్రక్షాళన చేపట్టిన పంజాబ్ ఆ దిశగా తొలి అడుగు వేసింది. తన ముద్ర వేస్తాడా? గత పదేళ్లలో తరచూ ప్లేయర్లను మార్చడం... కెప్టెన్లను మార్చడం... కోచ్‌లను మార్చడం ఇలాంటి వాటితోనే వార్తల్లో నిలుస్తున్న పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతోనే ఆస్ట్రేలియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన రికీ పాంటింగ్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకుంది. ఆటగాడిగా, శిక్షకుడిగా అపార అనుభవం ఉన్న పాంటింగ్ మార్గనిర్దేశకత్వంలో పంజాబ్ ప్రదర్శన మారుతుందని యాజమాన్యం ధీమాగా ఉంది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆటగాడిగా, కోచ్‌గా కొనసాగుతున్న రికీ పాంటింగ్... గత ఏడేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ప్రతిభను గుర్తించి సానబెట్టడం, యువ ఆటగాళ్లకు అండగా నిలవడంలో తనదైన ముద్ర వేసిన పాంటింగ్... ఢిల్లీ జట్టును 2020 సీజన్లో ఫైనల్‌కు చేర్చాడు. ముంబై ఇండియన్స్ వంటి స్టార్లతో కూడిన జట్టుకు శిక్షణ ఇచ్చిన అనుభవం ఉన్న పాంటింగ్... పంజాబ్ జట్టును గాడిన పెడతాడని యాజమాన్యం బలంగా విశ్వసిస్తోంది. సుదీర్ఘ ప్రణాళికలో భాగంగానే పాంటింగ్‌ను నాలుగేళ్లకు కోచ్‌గా నియమించినట్లు ఫ్రాంచైజీ సీఈవో సతీశ్ మీనన్ పేర్కొన్నాడు. వారికి భిన్నంగా.. ఇప్పటి వరకు పంజాబ్ జట్టుకు టామ్ మూడీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, సంజయ్ బంగర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రాడ్ హాడ్జ్, అనిల్ కుంబ్లే, ట్రెవర్ బేలిస్ కోచ్‌లుగా వ్యవహరించారు. వీరందరికీ భిన్నంగా పాంటింగ్ జట్టును నడిపిస్తాడని యాజమాన్యం ఆశిస్తోంది. అందుకు తగ్గట్లే పంజాబ్ జట్టుతో కలిసి పనిచేసేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు పాంటింగ్ వెల్లడించాడు. ‘కొత్త సవాల్ స్వీకరించడం ఆనందంగా ఉంది. ఫ్రాంచైజీ యాజమాన్యంతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నా. ఎన్నో ఏళ్లుగా జట్టుకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు... భిన్నమైన జట్టును చూపిస్తా’ అని పాంటింగ్ అన్నాడు. జట్టులో సమూల మార్పులు ఆశిస్తున్న పాంటింగ్... త్వరలోనే సహాయక బృందాన్ని ఎంపిక చేయనున్నాడు. ప్రస్తుతం బంగర్ పంజాబ్ ఫ్రాంచైజీ క్రికెట్ డెవలప్మెంట్ హెడ్‌గా కొనసాగుతుండగా... లాంగ్‌వెల్ట్ ఫాస్ట్ బౌలింగ్, సునీల్ జోషి స్పిన్ బౌలింగ్ కోచ్‌లుగా ఉన్నారు. కోర్ గ్రూప్‌పై దృష్టి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శిఖర్ ధావన్ ఈ ఏడాది పంజాబ్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అర్‡్షదీప్, జితేశ్ శర్మ, రబడ, లివింగ్‌స్టోన్, స్యామ్ కరన్, బెయిర్‌స్టో వంటి పలువురు నాణ్యమైన ప్లేయర్లు జట్టులో ఉన్నారు. వచ్చే ఐపీఎల్‌కు ముందు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఈ స్టార్ ఆటగాళ్లను అట్టిపెట్టు కోవాలా లేదా అనే విషయంపై పాంటింగ్ నిర్ణయం తీసుకుంటాడు. ఈ ఏడాది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు సృష్టించిన పంజాబ్ కింగ్స్... అదే తీవ్రతను చివరి వరకు కొనసాగించలేకపోయింది. ఈ సీజన్ ద్వారా పంజాబ్ జట్టుకు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ వంటి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు లభించినట్లైంది. తాజా సీజన్లో అతి క్లిష్ట పరిస్థితులను సైతం ఈ జోడీ సమర్థంగా ఎదుర్కొని భవిష్యత్తుపై భరోసా పెంచింది. ఇలాంటి వాళ్లను సానబెట్టడంలో సిద్ధహస్తుడైన పాంటింగ్ వేలం నుంచే తనదైన ముద్ర వేస్తాడనడంలో సందేహం లేదు. -
IPL 2025: కొత్త హెడ్‌కోచ్.. ప్రకటించిన పంజాబ్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌ను తమ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించినట్లు తెలిపింది. వచ్చే ఏడాది పాంటింగ్ పంజాబ్ కింగ్స్‌తో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నాలుగేళ్ల పాటు తమ జట్టుతో అతడు కొనసాగనున్నట్లు పేర్కొంది. అభిమానులకు ఇదే నా ప్రామిస్ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ స్పందిస్తూ.. ‘‘హెడ్‌కోచ్‌గా నాకు అవకాశం ఇచ్చిన పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు. కొత్త సవాళ్లు స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. జట్టు యజమానులతో చర్చలు ఫలవంతంగా ముగిశాయి. టీమ్‌ను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు వారితో కలిసి పనిచేసేందుకు నేను సిద్ధం. సుదీర్ఘకాలంగా జట్టుకు మద్దతుగా ఉన్న అభిమానులకు విజయంతో రుణం చెల్లించే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇకపై సరికొత్త పంజాబ్ కింగ్స్‌ను చూడబోతున్నారు’’ అని పేర్కొన్నాడు. కాగా రిక్కీ పాంటింగ్ ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. 2018 నుంచి ఏడేళ్లపాటు ఢిల్లీ జట్టుకు సేవలు అందించాడు. ఢిల్లీతో తెగిన బంధం.. ఇకపై పంజాబ్‌తో ప్రయాణంఅయితే, 2020లో ఫైనల్ చేరడం మినహా పాంటింగ్ మార్గదర్శనంలో ఢిల్లీకి పెద్దగా విజయాలు దక్కలేదు. అయినప్పటికీ అతడిపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్.. 2024 తర్వాత ఎట్టకేలకు పాంటింగ్‌తో బంధాన్ని తెంచుకుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ పాంటింగ్‌తో చర్చలు జరిపి తమ ప్రధాన కోచ్‌గా నియమించుకున్నట్లు తాజాగా ప్రకటించింది. మరో ఆసీస్ మాజీ క్రికెటర్ ట్రెవర్ బైలిస్ స్థానాన్ని రిక్కీ పాంటింగ్‌తో భర్తీ చేసింది. కాగా ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ పద్నాలుగు మ్యాచ్‌లకు కేవలం ఐదు గెలిచి పట్టికలో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పద్నాలుగింట ఏడు గెలిచి ఆరో స్థానంలో నిలిచింది.చదవండి: నాకంటే నీకే బాగా తెలుసు కదా: కోహ్లికి షాకిచ్చిన గంభీర్! -
సచిన్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టేది అతడే: రిక్కీ పాంటింగ్
అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్ సచిన్ టెండుల్కర్. టెస్టుల్లో 15,921... వన్డేల్లో 18,426 పరుగులతో ఓవరాల్‌గా రెండు ఫార్మాట్లలోనూ ఈ టీమిండియా దిగ్గజం టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక సచిన్ సాధించిన సెంచరీల రికార్డుకు చేరువగా ఉన్న ఏకైక క్రికెటర్ టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి.ఇప్పటికే 80 శతకాలు బాదిన 35 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మరో 20 మార్లు వంద పరుగుల మార్కును అందుకుంటే సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేస్తాడు. అయితే, వన్డేల్లో ఇప్పటి వరకు 13,906 పరుగులు సాధించి.. టాప్ స్కోరర్ల జాబితాలో ఉన్న కోహ్లి టెస్టు ఖాతాలో 8848 పరుగులు మాత్రమే ఉన్నాయి.ఈ నేపథ్యంలో వన్డే కింగ్ అయిన కోహ్లి టెస్టుల్లో మాత్రం సచిన్‌ను అందుకోవడం కష్టమే అంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్. టెస్టుల్లో సచిన్ టెండుల్కర్ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టగల సత్తా ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్‌కు ఉందని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లిష్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రూట్ ప్రస్తుతం బెన్‌స్టోక్స్ సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.అప్పట్లో ఫామ్‌లేమితో సతమతమైన 33 ఏళ్ల ఈ రైట్‌హ్యాండర్.. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో 32వ సెంచరీ సాధించిన రూట్.. 12 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘‘ఇంకో నాలుగేళ్ల పాటు రూట్ టెస్టుల్లో కొనసాగితే కచ్చితంగా ఇది సాధ్యమవుతుంది.అయివతే, ఇంగ్లండ్ ఏడాదికి ఎన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడుతుందన్న అంశం మీదే అతడి గణాంకాలు ఆధారపడి ఉంటాయి. ఏడాదికి కనీసం 14 మ్యాచ్‌లు ఆడటం సహా అందులో సంవత్సరానికి రూట్ 800 నుంచి వెయ్యి పరుగుల చొప్పున సాధిస్తే అతడు సచిన్ రికార్డు బ్రేక్ చేయడం సాధ్యమే.అయితే, 37 ఏళ్ల వయసులోనూ అతడు పరుగుల దాహంతో ఉంటేనే.. అది కూడా రోజురోజుకు తన ఆటను మరింత మెరుగుపరచుకుని.. నిలకడగా రాణిస్తేనే రూట్‌కు ఈ అవకాశం ఉంటుంది. నాలుగేళ్ల క్రితం కనీసం యాభై పరుగుల మార్కు అందుకోవడానికి కష్టాలు పడ్డ రూట్.. ఇప్పుడు తన శైలిని మార్చేశాడు. అందుకే మరో నాలుగేళ్లపాటు అతడు ఇలాగే కొనసాగితే.. కచ్చితంగా టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరిస్తాడు’’ అని రిక్కీ పాంటింగ్ అంచనా వేశాడు. ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ సైతం గతంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా టెస్టుల్లో ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్ టెస్టుల్లో 13,378 పరుగులు సాధించి.. సచిన్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ జాబితాలో సౌతాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కలిస్(13,289), టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్(13,288), ఇంగ్లండ్ మాజీ సారథి అలిస్టర్ కుక్(12,472), శ్రీలంక లెజెండరీ వికెట్ కీపర్ కుమార్ సంగక్కర(12, 400) తర్వాత ఏడో స్థానంలో రూట్(12,027) ఉన్నాడు. -
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విజయం ఆ జట్టుదే: పాంటింగ్
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది చివరలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు పయనం కానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఆసీస్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది.గత రెండు పర్యాయాలు కంగారులను వారి సొంత గడ్డపై ఓడించిన భారత్.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025 ఫైనల్‌కు చేరాలన్న ఈ సిరీస్‌కు భారత్‌కు ఎంతో కీలకం. మరోవైపు ఈసారి భారత్‌పై ఎలాగైనా టెస్టు సిరీస్ విజయం సాధించి తమ 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆసీస్ భావిస్తోంది. టీమిండియాపై టెస్టు సిరీస్‌ను ఆసీస్ చివరగా 2014-15లో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి టెస్టు సిరీస్‌లో టీమిండియాను ఆసీస్ కచ్చితంగా ఓడిస్తుందని పాంటింగ్ థీమా వ్యక్తం చేశాడు."భారత్-ఆసీస్ మధ్య పోటీ ఎల్లప్పుడూ ప్రత్యేకమే. ఈసారి కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగడం ఖాయం. గత రెండు పర్యాయాలు భారత్ చేతిలో ఓటమి చవిచూసిన ఆసీస్.. ఈ సారి మాత్రం సొంతగడ్డపై తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ ఐదు టెస్టుల సిరీస్‌ను తీసుకురావడం ఇరు జట్లకు కలిసొచ్చే ఆంశం. ఇది నిజంగా కీలకపరిణామంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే గత రెండు సార్లు కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఇరు జట్లు మధ్య జరిగాయి.ఇప్పుడు మళ్లీ ఐదు టెస్టులు జరగనుండడంతో అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఈ సిరీస్‌లో డ్రాలు ఎక్కువగా ఉంటాయో లేదో తెలియదు. కానీ ఆస్ట్రేలియానే గెలవాలని కోరుకుటున్నాను. ఆసీస్ గెలిచేందుకు సలహాలు ఇస్తా. ఏదో ఒక మ్యాచ్ డ్రా అయ్యే ఛాన్స్ ఉంది. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే భారత్ గెలిచే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా. 3-1తో గెలుస్తుందని భావిస్తున్నా" అని రికీ పాంటింగ్ ఐసీసీ రివ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు. కాగా 32 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ టెస్టు సిరీస్ జరగనుంది. చివరగా 1991-92లో ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది.ఈ ఏడాది నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. -
ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇస్తా: రిక్కీ పాంటింగ్
అంతర్జాతీయ జట్లకు కోచ్‌గా వ్యవహరించేందుకు తాను సిద్ధంగా లేనని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెట్ రిక్కీ పాంటింగ్ పునురద్ఘాటించాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కోచ్ రేసులో తాను ఉన్నానంటూ వస్తున్న వార్తలను ఖండించాడు. ప్రస్తుతం తాను ఎంతో బిజీగా ఉన్నానన్న పాంటింగ్.. ఒకవేళ ఇంగ్లండ్ బోర్డు తన పేరును పరిశీలిస్తున్నట్లయితే ఆ ఆలోచన మానుకోవాలని విజ్ఞప్తి చేశాడు.కాగా ఆస్ట్రేలియాకు రెండుసార్లు వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీలు అందించిన రిక్కీ పాంటింగ్.. లెజెండరీ బ్యాటర్‌గా పేరొందాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్ జట్ల కోచ్‌గా మారిన అతడు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు మార్గదర్శనం చేశాడు. అయితే, ఐపీఎల్-2024లో దారుణ వైఫల్యాల నేపథ్యంలో ఢిల్లీ పాంటింగ్‌తో బంధాన్ని తెంచుకుంది.మరోవైపు.. వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో నిరాశజనక ప్రదర్శన నేపథ్యంలో ఇంగ్లండ్ కోచ్ మాథ్యూ మ్యాట్ తన పదవి నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో ఆ స్థానాన్ని రిక్కీ పాంటింగ్ భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో ఐసీసీ రివ్యూ పాడ్‌కాస్ట్‌లో స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌తో మాట్లాడిన రిక్కీ పాంటింగ్.. ఇంగ్లండ్ కోచ్‌గా వెళ్లాలన్న ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశాడు.బిజీగా ఉన్నా‘‘అంతర్జాతీయ స్థాయి కోచ్ పదవి చేపట్టేందుకు నేను సుముఖంగా లేనని అధికారికంగా తెలియజేస్తున్నా. నా కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నా. అంతేకాదు.. కామెంటేటర్‌గానూ కొనసాగుతున్నాను.. కాబట్టి ఇప్పటికే బిజీ షెడ్యూల్ ఉంది.వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని సమంగా ఆస్వాదించాలనుకుంటున్నా. అందుకే రిస్కీ జాబ్స్ చేయదలచుకోలేదు. ముఖ్యంగా.. ఇంగ్లండ్ జట్టుకు ఓ ఆస్ట్రేలియన్ కోచ్‌గా ఉండటమనేది కాస్త భిన్నంగా ఉంటుంది. ఇవన్నీ పక్కనపెడితే.. కామెంటేటర్‌గా నేను త్వరలోనే యూకేకు వెళ్లాల్సి ఉంది. ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇస్తాఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య సిరీస్‌కు వ్యాఖ్యానం చేయబోతున్నాను’’ అని రిక్కీ పాంటింగ్ తెలిపాడు. అంతేకాదు ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. కాగా సెప్టెంబరులో ఇంగ్లండ్- ఆసీస్ మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరుగనుంది.కాగా రాహుల్ ద్రవిడ్ స్థానంలో రిక్కీ పాంటింగ్ టీమిండియా హెడ్‌కోచ్‌గా రానున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇందుకు తాను ఆసక్తిగా లేనని రిక్కీ చెప్పగా.. ఆ అవసరం తమకు లేదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా అతడికి కౌంటర్ ఇచ్చాడు. అనంతరం.. ద్రవిడ్ స్థానంలో గౌతం గంభీర్‌ను కోచ్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించాడు.చదవండి: IND vs SL: 'భారత్‌లో అన్ని బ్యాటింగ్ పిచ్లే.. అందుకే ఇక్కడ ఆడలేకపోయారు' -
వన్డే ప్రపంచకప్ ఆల్‌టైమ్ అత్యుత్తమ జట్టు.. కోహ్లికి నో ఛాన్స్!
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ 2012లో అంతర్జాతీయ క్రికెట్లో వందో సెంచరీ కొట్టి.. శతక శతకాల ధీరుడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. సమకాలీన క్రికెటర్లు ఎవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేసి.. శిఖరాగ్రాన నిలిచాడు. వన్డేల్లో 49, టెస్టుల్లో 51 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ పేరిట ఉన్న ఈ రికార్డు బద్దలయ్యే అవకాశమే లేదని భావిస్తున్న తరుణంలో.. విరాట్ కోహ్లి అనే కుర్రాడు తెరమీదకు వచ్చాడు.ఇప్పటికే వన్డేల్లో 50 శతకాలు బాదిన ఈ రన్‌మెషీన్.. సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు. టెస్టుల్లో 29, టీ20లలో ఒక సెంచరీ బాది.. ఆల్‌టైమ్ రికార్డుకు ఎసరుపెట్టాడు. 35 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌కు మారుపేరుగా కొనసాగుతున్న కోహ్లి వరల్డ్‌కప్ టోర్నీల్లోనూ సత్తా చాటుతున్నాడు. వన్డే రారాజుగా కొనసాగుతున్నాడు. అయితే, ఇలాంటి రికార్డుల వీరుడికి తన ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ వన్డే వరల్డ్‌కప్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు లేదంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ మాథ్యూ హెడెన్.భారత్ నుంచి ఇద్దరు లెజెండ్స్ మాత్రమే ఈ టీమ్‌లో స్థానం సంపాదించడానికి అర్హులు అన్నట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ జట్టులో ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా నలుగురిని ఎంపిక చేసుకున్న ఈ కంగారూ బ్యాటర్.. పాకిస్తాన్ నుంచి ఇద్దరి చోటు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి శ్రీలంకతో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. గౌతం గంభీర్ గైడెన్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.మాథ్యూ హెడెన్ ఎంచుకున్న గ్రేటెస్ట్ వన్డే వరల్డ్‌కప్ ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ఆడం గిల్‌క్రిస్ట్(ఆస్ట్రేలియా), వీరేంద్ర సెహ్వాగ్(ఇండియా), రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా- కెప్టెన్), సచిన్ టెండుల్కర్(ఇండియా), బ్రియన్ లారా(వెస్టిండీస్), జాక్వెస్ కలిస్(సౌతాఫ్రికా), వకాన్ యూనిస్(పాకిస్తాన్), వసీం అక్రం(పాకిస్తాన్), షేన్ వార్న్(ఆస్ట్రేలియా), ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక), గ్లెన్ మెగ్రాత్(ఆస్ట్రేలియా).చదవండి: SA20 2025: సౌతాఫ్రికా కెప్టెన్‌కు షాకిచ్చిన సన్‌రైజర్స్.. జట్టు నుంచి ఔట్