యువ ఆటగాడు టిమ్ డేవిడ్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టిమ్ డేవిడ్ తన ఆటతీరుతో ఆసీస్ మాజీ ఆల్ రౌండర్, దివంగత ఆండ్రూ సైమండ్స్‌ను గుర్తుకు తెస్తున్నాడని పాంటింగ్ కొనియాడాడు. అదే విధంగా ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ ఆసీస్ జట్టులో డేవిడ్ ఖచ్చితంగా ఉండాలని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. కాగా సింగపూర్‌లో జన్మించిన టిమ్ డేవిడ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా తరపున ఆడేందుకు ఎదురుచేస్తున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లలో డేవిడ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ ముంబై ఇండియన్స్ తరపున ఆడిన డేవిడ్ అకట్టుకున్నాడు. కాగా ఐపీఎల్ మెగా వేలంలో డేవిడ్‌ను ముంబై ఏకంగా 8.25 కోట్ల భారీ దక్కించుకోంది. అయితే గత కొంత కాలంగా డేవిడ్ టీ20 క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నా.. ఆస్ట్రేలియా జాతీయ ఇంకా చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో పాంటింగ్ మాట్లాడుతూ.. "నేను సెలెక్టర్‌గా ఉన్నట్లయితే.. ఇప్పటికే డెవిడ్‌ను ఎంపిక చేసేవాడిని. అతడు అద్భుతమైన మ్యాచ్ ఫినిషర్. అటువంటి ఆటగాడు ఇప్పటికే జట్టులో ఉండాలి. అతడిని టీ20 ప్రపంచకప్-2022కు ఎంపిక చేయండి.
డేవిడ్ నా సహచరుడు సైమండ్స్‌ను గుర్తుచేస్తున్నాడు. 2003 వన్డే ప్రపంచ కప్‌లో సైమండ్స్ ఏ విధంగా అయితే రాణించాడో.. ఇప్పడు డేవిడ్ కూడా అదే చేయగలడని నేను భావిస్తున్నాను. అతడిని జట్టులోకి తీసుకుంటే ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ను గెలుచుకునే అవకాశం ఉంటుంది. కాగా ఆస్ట్రేలియా జట్టులో మిడిల్ ఆర్డర్‌లో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారని నాకు తెలుసు. కానీ గత రెండేళ్లుగా డేవిడ్ కూడా టీ20ల్లో అత్యుత్తమంగా రాణిస్తున్నాడు. కాబట్టి ఒక్కసారైనా అతడికి ఆడే అవకాశం ఇవ్వాలి అని పాంటింగ్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో రెండో వన్డే.. ప్రపంచ రికార్డుకు చేరువలో భారత్..!
Comments
Please login to add a commentAdd a comment