Andrew Symonds
-
క్రికెటర్ల ప్రాణం మీదకు తెచ్చిన రోడ్డు ప్రమాదాలు
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం క్రికెట్ అభిమానులను కలవరపాటుకు గురి చేసింది. అదృష్టవశాత్తూ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న పంత్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. అయితే వేగంతో కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో పంత్‌కు గాయాలు తీవ్రంగానే అయ్యాయి. ఈ గాయాల ప్రభావం భవిష్యత్తులో అతని ఆటపై ప్రభావం చూపకూడదని దేవుడిని కోరుకుందాం. అయితే ఈ ఏడాది క్రికెటర్లకు కలిసి రాలేదనే చెప్పాలి. ఒక్క ఏడాదిలోనే నలుగురు క్రికెటర్లు సహా ఒక అంపైర్ రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. దురదృష్టవశాత్తూ ఒక క్రికెటర్, అంపైర్ తమ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. వారిద్దరే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్, అంపైర్ రూడీ కోర్ట్జెన్. రిషబ్ పంత్: డిసెంబర్ 30(శుక్రవారం తెల్లవారుజామున) ఢిల్లీ నుంచి తన ఎస్యూవీ కారును పంత్ స్వయంగా నడుపుకుంటూ వచ్చాడు. మంచి వేగంతో వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు 200 మీటర్ల దూరం దూసుకెళ్లింది. ఈలోగా కారులో మంటలు చెలరేగాయి. అయితే ఇది గమనించిన బస్ డ్రైవర్ పంత్‌ను కారులో నుంచి బయటకు లాగి అతన్ని రక్షించాడు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్ నుదుటి రెండు కాట్లు పడ్డాయి. అదే సమయంలో కుడి మోకాలి లిగ్మెంట్ పక్కకు జరగడంతో సర్జరీ అవసరం కానుంది. ఇంకా చాలా గాయాలు అయ్యాయి. పంత్ కోలుకోవడానికి కనీసం మూడు నెలలు పట్టేలా ఉంది. ఆండ్రూ ఫ్లింటాఫ్: ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ఇదే నెలలో డిసెంబర్ 14న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బీబీసీలో ప్రసారమయ్యే "టాప్ గేర్" ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం సర్రేలోని డన్స్‌ఫోల్డ్ పార్క్ ప్రాంతంలో మంచుతో నిండిన పరిస్థితులలో షూటింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫ్లింటాఫ్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అతడిని పరిశీలించిన వైద్యులు ఎటువంటి ప్రాణాప్రాయం లేదని తెలిపారు. దీంతో అతడి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆండ్రూ సైమండ్స్: క్రికెట్ ఆస్ట్రేలియాకు ఈ ఏడాది పెద్ద విషాదం అని చెప్పొచ్చు. ఈ ఏడాది ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు కన్నుమూశారు. ఒకరు దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అయితే.. మరొకరు ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్. కారు ప్రమాదం ఆండ్రూ సైమండ్స్ ప్రాణాలను బలిగొంది. మే 14న టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో కారును స్వయంగా తానే నడుపుతున్నాడు. అయితే కారు అదుపు తప్పి రివర్ బ్రిడ్జీ సమీపంలో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో సైమండ్స్ అక్కడికక్కడే మృతి చెందడం అందరిని కలిచివేసింది. బరోడా వుమెన్స్ జట్టు: అక్టోబర్ 21 బరోడా వుమెన్స్ జట్టుతో వెళ్తున్న బస్సు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వెళ్లే దారిలో ప్రమాదానికి గురైంది. తాటి చెట్లపాలెం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రక్కును బస్సు వేగంగా గుద్దుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు బరోడా మహిళా క్రికెటర్లకు తీవ్ర గాయాలు కాగా..మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రూడీ కోర్ట్జెన్: ఇదే ఏడాది ఆగస్టు 9న సౌతాఫ్రికాకు చెందిన మాజీ అంపైర్ రూడి కోర్ట్జెన్(73) కన్నుమూశాడు.సౌతాఫ్రికాలోని రివర్‌డేల్‌లో ఉన్న గోల్ఫ్ కోర్స్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆయన కారు యాక్సిడెంట్‌కు గురయ్యింది. ఈ ప్రమాదంలో కోర్ట్జెన్‌తో పాటు మరో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్, స్టీవ్ బక్నర్ తర్వాత అత్యధిక టెస్టులకు అంపైర్ గా చేసిన ఘనత సాధించాడు.బ్యాటర్ క్యాచ్ ఔట్, స్టంప్, ఎల్బీడబ్ల్యూ, రనౌట్ అయినప్పుడు ఎల్బీడబ్ల్యూ ఔట్ ఇచ్చే విధానం కూడా హైలైట్ గా ఉండేది. మెల్లిగా చేతిని పైకెత్తుతూ ఆయన ఔట్ ఇచ్చే విధానానికి కల్ట్ ఫ్యాన్స్ ఉండడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్ లో దీనిని ‘ది స్లో ఫింగర్ ఆఫ్ డెత్’గా అభివర్ణించేవారు. చదవండి: పీలే టాప్-10 స్టన్నింగ్ గోల్స్‌పై లుక్కేయాల్సిందే మూడేళ్ల క్రితమే పంత్‌ను హెచ్చరించిన ధావన్ -
ఆండ్రూ సైమండ్స్‌కు నివాళి ప్రకటించనున్న ఆసీస్, జింబాబ్వే క్రికెటర్లు
ఆండ్రూ సైమండ్స్.. క్రికెట్లో ఈ పేరు తెలియని వారుండరు. ఆటలో ఎన్ని వివాదాలున్నా గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. అతని ఆటకు ఫిదా అయిన అభిమానులు చాలా మందే ఉన్నారు. కానీ మే 14.. 2022.. ఆస్ట్రేలియా క్రికెట్లో పెను విషాదం నింపింది. ఎందుకంటే అదే రోజు 46 ఏళ్ల వయసులో ఆండ్రూ సైమండ్స్ భౌతికంగా దూరమయ్యాడు. టౌన్స్‌విల్లే నగరం బయట జరిగిన యాక్సిడెంట్లో కారు తునకాతునకలు అవడంతో సైమండ్స్ మృతి చెందినట్లు పోలీసులు దృవీకరించారు. అయితే అంతకముందే ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కూడా గుండెపోటుతో మరణించడం.. ఇలా రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు క్రికెటర్లు దూరమవడం ఆసీస్ అభిమానులను కలచివేసింది. Photo Credit: Getty Images ఇక విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. కాగా ఆదివారం ఆసీస్, జింబాబ్వేలు తొలి వన్డే ఆడనున్నాయి. ఈ మ్యాచ్ ఆండ్రూ సైమండ్స్ స్వస్థలమైన టౌన్స్‌విల్లేలో జరగనుంది. దీంతో మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆండ్రూ సైమండ్స్‌కు ఘన నివాళి ప్రకటించనుంది. ఈ కార్యక్రమంలో ఇరుజట్ల ఆటగాళ్లతో పాటు సైమండ్స్ భార్య, పిల్లలు, క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు పాల్గొననున్నారు. కాగా ఈ సిరీస్‌లో మూడు వన్డేలు టౌన్స్‌విల్లే వేదికగానే జరగనున్నాయి. Photo Credit: Getty Images ఇక 1998లో ఆస్ట్రేలియా తరపున సైమండ్స్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టీ20ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిద్యం వహించాడు. 2003, 2007 వన్డే వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో సైమండ్స్ కీలక పాత్ర పోషించాడు. చదవండి: Andrew Symonds: అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌కు ఆండ్రూ సైమండ్స్ పేరు..! Andrew Symonds: కన్నీరు తెప్పిస్తున్న ఆండ్రూ సైమండ్స్ సోదరి లేఖ -
అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌కు ఆండ్రూ సైమండ్స్ పేరు..!
దివంగత ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ జ్ణాపకారక్ధం టౌన్స్‌విల్లే సిటీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. టౌన్స్విల్లేలోని రివర్‌వే అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ పేరును ఆండ్రూ సైమండ్స్ స్టేడియంగా మార్చుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కాగా సైమండ్స్ టౌన్స్విల్లేలోనే జన్మించాడు. సైమండ్స్ జూనియర్లను ఎంతో మందిని ఇదే స్టేడియంలో తీర్చిదిద్దాడని, అతడి పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టౌన్స్‌విల్లే సిటీ కౌన్సిలర్ మౌరీ సోర్స్ తెలిపారు. ఇక ఈ స్టేడియం వేదికగా ఇప్పటి వరకు హాంకాంగ్, పాపువా న్యూ గినియా మధ్య రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఈ స్టేడియం వేదికగానే ఆగస్టు అఖరిలో ఆస్ట్రేలియా-జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఆగస్టు 28న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది మే లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైమండ్స్ మరణించిన సంగతి తెలిసిందే. 1998లో ఆస్ట్రేలియా తరపున సైమండ్స్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టీ20ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిద్యం వహించాడు. 2003, 2007 వన్డే వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో సైమండ్స్ కీలక పాత్ర పోషించాడు. చదవండి: IND vs WI: మియామి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న భారత ఆటగాళ్లు.. ఫోటోలు వైరల్ -
ఆ యువ ఆటగాడు సైమండ్స్‌ను గుర్తు చేస్తున్నాడు: రికీ పాంటింగ్
యువ ఆటగాడు టిమ్ డేవిడ్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టిమ్ డేవిడ్ తన ఆటతీరుతో ఆసీస్ మాజీ ఆల్ రౌండర్, దివంగత ఆండ్రూ సైమండ్స్‌ను గుర్తుకు తెస్తున్నాడని పాంటింగ్ కొనియాడాడు. అదే విధంగా ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ ఆసీస్ జట్టులో డేవిడ్ ఖచ్చితంగా ఉండాలని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. కాగా సింగపూర్‌లో జన్మించిన టిమ్ డేవిడ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా తరపున ఆడేందుకు ఎదురుచేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లలో డేవిడ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ ముంబై ఇండియన్స్ తరపున ఆడిన డేవిడ్ అకట్టుకున్నాడు. కాగా ఐపీఎల్ మెగా వేలంలో డేవిడ్‌ను ముంబై ఏకంగా 8.25 కోట్ల భారీ దక్కించుకోంది. అయితే గత కొంత కాలంగా డేవిడ్ టీ20 క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నా.. ఆస్ట్రేలియా జాతీయ ఇంకా చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో పాంటింగ్ మాట్లాడుతూ.. "నేను సెలెక్టర్‌గా ఉన్నట్లయితే.. ఇప్పటికే డెవిడ్‌ను ఎంపిక చేసేవాడిని. అతడు అద్భుతమైన మ్యాచ్ ఫినిషర్. అటువంటి ఆటగాడు ఇప్పటికే జట్టులో ఉండాలి. అతడిని టీ20 ప్రపంచకప్-2022కు ఎంపిక చేయండి. డేవిడ్ నా సహచరుడు సైమండ్స్‌ను గుర్తుచేస్తున్నాడు. 2003 వన్డే ప్రపంచ కప్‌లో సైమండ్స్ ఏ విధంగా అయితే రాణించాడో.. ఇప్పడు డేవిడ్ కూడా అదే చేయగలడని నేను భావిస్తున్నాను. అతడిని జట్టులోకి తీసుకుంటే ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ను గెలుచుకునే అవకాశం ఉంటుంది. కాగా ఆస్ట్రేలియా జట్టులో మిడిల్ ఆర్డర్లో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారని నాకు తెలుసు. కానీ గత రెండేళ్లుగా డేవిడ్ కూడా టీ20ల్లో అత్యుత్తమంగా రాణిస్తున్నాడు. కాబట్టి ఒక్కసారైనా అతడికి ఆడే అవకాశం ఇవ్వాలి అని పాంటింగ్ పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో రెండో వన్డే.. ప్రపంచ రికార్డుకు చేరువలో భారత్..! -
Amul India: సైమండ్స్‌కు వినూత్న నివాళి
గత శనివారం (మే 14) రాత్రి క్వీన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46)కు ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ ఇండియా వినూత్నంగా నివాళి తెలిపింది. గతంలో స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌కు కూడా ప్రత్యేకంగా నివాళులర్పించిన డెయిరీ దిగ్గజం.. తాజాగా సైమండ్స్ మృతికి సంతాపంగా ఓ స్పెషల్ డూడుల్‌ను డిజైన్ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Amul - The Taste of India (@amul_india) సైమండ్స్ ఆన్ ఫీల్డ్ చిత్రాలతో డిజైన్ చేసిన ఈ డూడుల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుటుంది. ఈ డూడుల్‌లో సైమండ్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు. He Symmolised the game అంటూ హెడ్డింగ్‌ను జోడించారు. ఈ డూడుల్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. అభిమానులు ఈ డూడుల్‌ను షేర్ చేస్తూ రాయ్ (సైమండ్స్ ముద్దు పేరు)కు నివాళి అర్పిస్తున్నారు. 1998లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సైమండ్స్.. తన మొత్తం కెరీర్లో 198 వన్డేలు, 26 టెస్ట్‌లు, 14 టీ20లు, 39 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఆస్ట్రేలియా 2003, 2007 ప్రపంచ కప్‌లు గెలవడంలో రాయ్ కీలక పాత్ర పోషించాడు. 2011లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రాయ్ చనిపోక ముందు వరకు వ్యాఖ్యాతగా కొనసాగాడు. చదవండి: కన్నీరు తెప్పిస్తున్న ఆండ్రూ సైమండ్స్ సోదరి లేఖ -
కన్నీరు తెప్పిస్తున్న ఆండ్రూ సైమండ్స్ సోదరి లేఖ
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ అకాల మరణం క్రీడాభిమానులను కలచివేసింది. ఎన్ని వివాదాలున్నా.. తన విధ్వంసకర బ్యాటింగ్‌కు.. ఢిపరెంట్‌గా ఉండే హెయిర్‌స్టైల్‌కు అభిమానులు చాలా మందే ఉన్నారు. గత శనివారం రాత్రి టౌన్స్విల్లీలోని క్వీన్స్‌ల్యాండ్‌లో సైమండ్స్ కారు భయంకరమైన యాక్సిడెంట్‌కు గురవ్వడంతో అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు వెల్డించారు. బ్రిస్బేన్ కొరియర్ మెయిల్ అనే పత్రిక సైమండ్స్ కారు యాక్సిడెంట్ ఫోటోలు రిలీజ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు నెలల వ్యవధిలోనే ఆసీస్ క్రికెట్ ఇద్దరు ఆటగాళ్లను కోల్పోవడం క్రీడాలోకాన్ని దిగ్ర్బాంతికి గురి చేసింది. ఇక సైమండ్స్ మృతిపై అతని సోదరి లూయిస్ విచారం వ్యక్తం చేసింది. తన సోదరుడు చనిపోయిన స్థలాన్ని సందర్శించిన లూయిస్.. ఒక ఎమోషనల్ నోట్‌ను అక్కడ ఉంచింది. ''చాలా తొందరగా వెళ్లిపోయావ్.. రెస్ట్ ఇన్ పీస్ ఆండ్రూ సైమండ్స్. నీ జీవితంలో ఒక రోజు మిగిలి ఉన్నా బాగుండేది.. ఇకపై నీ ఫోన్‌కాల్ నాకు వినపడదు. నా హృదయం ముక్కలయింది. నేను నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను బ్రదర్'' అంటూ రాసుకొచ్చింది. లూయిస్ రాసిన నోట్‌ను మియా గ్లోవర్ అనే రిపోర్టర్ తన ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం సైమండ్స్‌కు తన సోదరి రాసిన నోట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనతి కాలంలోనే ఆస్ట్రేలియా టీమ్‌లో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా సైమండ్స్ పేరు తెచ్చుకున్నారు. కెరీర్లో 198 వన్డేలు ఆడిన సైమండ్స్.. ఆస్ట్రేలియా 2003, 2007 ప్రపంచ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 198 వన్డేల్లో 5088 పరుగులు చేసిన సైమండ్స్.. అందులో ఆరు సెంచరీలు, 30 అర్థ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ఆల్‌రౌండర్.. 133 వికెట్లు పడగొట్టాడు.2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ప్రారంభించిన సైమండ్స్.. మొత్తం 26 మ్యాచ్‌ల్లో 1463 పరుగులు చేయగా.. వాటిలో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 పరంగా 14 మ్యాచ్‌ల్లో.. రెండు హాఫ్ సెంచరీలతో 337 పరుగులు చేశాడు. ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్లో సైమండ్స్‌ను డెక్కన్ ఛార్జర్స్ రూ.5.4 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు సైమండ్స్ వీడ్కోలు పలికాడు. చదవండి: ఆ క్రికెటర్‌ను బూతులు తిట్టారు.. నెలల వ్యవధిలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు..! ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏమన్నాడంటే..? Floral tributes lay at the crash site where Andrew “Roy” Symonds lost his life on Saturday night, outside of Townsville. The letter, penned by his sister, reads “I will always love you my brother” @TheTodayShow pic.twitter.com/Wt3EZGc6Ty — Mia Glover (@miaglover_9) May 15, 2022 -
ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏమన్నాడంటే..?
Andrew Symonds: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (46) శనివారం (మే 14) రాత్రి క్వీన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్న క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. కారు ప్రమాదంలో సైమండ్స్ అక్కడికక్కడే మృతి చెందాడని ప్రత్యక్ష సాక్షి వేలాన్ టౌన్సన్ తెలిపాడు. ప్రమాద సమయంలో ఘటనా స్థలికి అతి సమీపంలో ఉన్న టౌన్సన్.. సైమండ్స్ ప్రాణాలు కాపాడేందుకు విశ్వ ప్రయాత్నాలు చేసినట్లు పోలీసులకు వివరించాడు. సైమండ్స్ ప్రమాద ఘటనపై టౌన్సన్ స్పందిస్తూ.. నా కళ్ల ముందే కారు యాక్సిడెంట్‌కి గురైంది. అతివేగంతో ఉన్న సైమండ్స్ కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. సైమండ్స్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. కారులో ఇరుక్కుపోయిన సైమండ్స్‌ను కాపాడేందుకు సీపీఆర్ కూడా చేశాను. కానీ అప్పటికే అతని ప్రాణాలు విడిచాడు. ఆ సమయానికి ప్రమాదానికి గురైన వ్యక్తి సైమండ్స్ అని నాకు తెలీదు అని టౌన్సన్ చెప్పుకొచ్చాడు. ప్రమాద సమయంలో సైమండ్స్ కారులో రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయని, యాక్సిడెంట్లో ఆ రెంటికి ఎలాంటి అపాయం జరగలేదని పేర్కొన్నాడు. అందులో ఓ కుక్క సైమండ్స్ మృతదేహం వద్ద రోదిస్తూ.. అక్కడికి ఎవ్వరినీ రానివ్వలేదని పోలీసులు వివరించాడు. చదవండి: ఆండ్రూ సైమండ్స్ గొప్ప ఆల్‌రౌండర్.. కానీ ఆ వివాదాల వల్లే.. -
సైమండ్స్ మృతికి సంతాపం.. నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగిన గుజరాత్, చెన్నై ఆటగాళ్లు..
ఐపీఎల్-2022లో వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడుతోంది. కాగా ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్‌కు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఇరు జట్లు ఆటగాళ్లు సైమండ్స్‌కు నివాళులర్పిస్తూ, గౌరవ సూచకంగా నల్ల బ్యాండ్లను ధరించి బరిలోకి దిగారు. కాగా శనివారం జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ దుర్మరణం చెందాడు. సైమండ్స్ ఆకాల మరణంతో యావత్తు క్రీడాలోకం శోకసంద్రంలో మునిగి పోయింది. ఇక 1998లో ఆస్ట్రేలియా తరపున సైమండ్స్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టీ20ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాడు. 2003, 2007 వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో సైమండ్స్ కీలక పాత్ర పోషించాడు. చదవండి: Andrew Symonds: ఆండ్రూ సైమండ్స్ మృతి.. దిగ్గజ క్రికెటర్ల సంతాపం -
ఆ క్రికెటర్‌ను బూతులు తిట్టారు.. నెలల వ్యవధిలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు..!
క్రికెట్ ఆస్ట్రేలియా రెండు నెలల వ్యవధిలో ఇద్దరు దిగ్గజ క్రికెటర్లను కోల్పోయింది. ఇదే ఏడాది మార్చి 4న షేన్ వార్న్ (52) గుండెపోటుతో మరణించగా.. తాజాగా (మే 14) ఆండ్రూ సైమండ్స్(46) కారు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఇద్దరూ ఈ శతాబ్దపు ఆరంభంలో ఆస్ట్రేలియాను తిరుగులేని జట్టుగా నిలబెట్టారు. ఆటలోనే కాకుండా వివాదాల విషయంలో ఈ ఇద్దరూ క్రికెట్ ఆస్ట్రేలియాకు పోటీ పడి మరీ అపవాదు తెచ్చారు. సైమండ్స్ అకాల మరణ వార్త తెలియగానే వీరిద్దరికి సంబంధించిన ఓ పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. 2021 భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్ట్ సందర్భంగా వార్న్, సైమోలిద్దరూ మోడ్రన్ స్మిత్‌గా పిలువబడే ఆసీస్ క్రికెటర్ మార్నస్ లబుషేన్‌పై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారు. ఆ మ్యాచ్‌కు కామెంటేటర్లు వ్యవహారించిన వార్న్, సైమండ్స్‌లు లబుషేన్‌ను బండ బూతులు తిడుతూ అడ్డంగా దొరికిపోయారు. లబూషేన్ విషయంలో వారి సంభాషణను ఫాక్స్ స్పోర్ట్స్ లైవ్‌లో ప్రసారం చేయడంతో విషయం బయటపడింది. సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో లబూషేన్ 91 పరుగుల వద్ద ఔట్ కావడంతో తొలుత వార్న్ లబూషేన్‌ను విమర్శించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత సైమండ్స్ అందుకుని.. లబుషేన్‌కి అటెన్షన్ డిఫిసిట్ డిజార్డర్ ఉంది. దాన్ని తగ్గించడానికి ఏదైనా మందులు (హాగ్ పైల్) ఇవ్వాలంటూ బూతు పురాణం మొదలుపెట్టాడు. దీన్ని వార్న్ కొనసాగించాడు. ఈ తతంగం మొత్తం ప్రత్యక్ష ప్రసారం కావడంతో వార్న్-సైమోలిద్దరూ మరోసారి విమర్శలపాలయ్యారు. కాగా, రెండు నెలల వ్యవధిలో వార్న్-సైమోలిద్దరు హఠాణ్మరణం చెందడంతో లబూషేన్ విషయం నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది. ఆ యువ క్రికెటర్‌ను అనరాని మాటలు అన్నారు.. అనుభవించారు అంటూ కొందరు ఆకతాయిలు పోస్ట్‌లు పెడుతున్నారు. చదవండి: ఆండ్రూ సైమండ్స్ గొప్ప ఆల్‌రౌండర్.. కానీ ఆ వివాదాల వల్లే.. -
Harbhajan-Symonds: మిత్రమా ఇంత త్వరగా వెళ్లిపోయావా..!
Harbhajan Shocked With Symonds Sudden Demise: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సైమండ్స్ మృతి పట్ల యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. సోషల్‌మీడియా వేదికగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, ప్రస్తుత, మాజీ క్రికెటర్లతో పాటు సైమో సమకాలీకులైన భారత క్రికెటర్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సైమోతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్విటర్ వేదికగా స్పందించాడు. సైమండ్స్ అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఇంత త్వరగా వెళ్లిపోయావా మిత్రమా అంటూ విచారం వ్యక్తం చేశాడు. సైమో కుటుంబానికి, సన్నిహితులకు సానుభూతి తెలియజేశాడు. సైమండ్స్ ఆత్మకు శాంతి కలగాలని దేవుడికి ప్రార్థిస్తున్నాని ట్వీటాడు. Shocked to hear about the sudden demise of Andrew Symonds. Gone too soon. Heartfelt condolences to the family and friends. Prayers for the departed soul 🙏#RIPSymonds — Harbhajan Turbanator (@harbhajan_singh) May 15, 2022 కాగా, సైమండ్స్-హర్భజన్ సింగ్ 'మంకీ గేట్' వివాదం యావత్ క్రికెట్ ప్రపంచాన్నే కుదిపేసిన విషయం తెలిసిందే. 2008 భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఈ వివాదం చెలరేగింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్ట్ (సిడ్నీ) మ్యాచ్‌లో సైమండ్స్, భజ్జీలు గొడవకు దిగారు. హర్భజన్ తనను ‘మంకీ’ అని పిలిచాడని, జాతి వివక్ష కామెంట్లతో దూషించాడని సైమండ్స్ ఆరోపించాడు. అయితే విచారణలో హర్భజన్.. సైమండ్స్‌ని ‘మంకీ’ అనలేదని, ‘మా..కీ’ అన్నాడని నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో ఉన్న సచిన్ టెండూల్కర్ సాక్ష్యం చెప్పడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. భజ్జీ తప్పు చేయలేదని ఆధారాలున్నా ఐసీసీ అతనిపై మూడు మ్యాచ్‌ల నిషేధం విధించింది. దీంతో చిరెత్తిపోయిన బీసీసీఐ ఆసీస్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకునేందుకు రెడీ అయ్యింది. దీంతో కాస్త వెనక్కు తగ్గిన ఐసీసీ భజ్జీపై నిషేధాన్ని ఎత్తి వేసింది. తదనంతర పరిణామాల్లో సైమో, భజ్జీలను ఐపీఎల్ కలిపింది. వీరిద్దరూ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రోజుల్లో మంచి మిత్రులయ్యారు. పాత కలహాలను మరచిపోయి స్నేహితుల్లా మెలిగారు. చదవండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆసిస్ దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి -
ఆండ్రూ సైమండ్స్ గొప్ప ఆల్‌రౌండర్.. కానీ ఆ వివాదాల వల్లే..
క్రికెట్ ఫ్యాన్స్‌కి బిగ్ షాక్ తగిలింది. ఆసిస్ లెజెండరీ క్రికెటర్, ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శనివారం రాత్రి టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. సైమండ్స్ ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడు మాత్రమే కాకుండా అత్యంత నైపుణ్యం కలిగిన ఆల్‌రౌండర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే సైమండ్స్ తన ఆటతో పాటు పలు కాంట్రవర్శీలతో కూడా వార్తల్లో నిలిచాడు. ఇవి అతని క్రికెట్ కెరీర్‌ని కాస్త మసకబారేలా చేశాయి. అందులో ముఖ్యమైంది మంకీ గేట్ వివాదం. వివాదాలతో వార్తల్లో.. సైమండ్స్ క్రికెట్ చరిత్రలో ‘మంకీగేట్’ వివాదం ఓ కుదుపు కుదిపేసింది. అప్పుడు ఏం జరిగిందంటే.. 2008లో సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ తనను ‘మంకీ’ అన్నాడని ఆండ్రూ సైమండ్స్ ఆరోపించాడు. అయితే హర్భజన్ మాత్రం తాను అలా అనలేదని చెప్పాడు. హర్భజన్ సింగ్‌కి అవతలివైపు నాన్స్టైయికింగ్లో బ్యాటింగ్ చేస్తున్న సచిన్ టెండూల్కర్, ఈ విషయంలో హర్భజన్‌కు మద్దతుగా నిలిచాడు. భజ్జీ మంకీ అనలేదని, హిందీలో ఒక అసభ్య పదం ప్రయోగించాడని చెప్పాడు. ఆ పదం తాను స్వయంగా విన్నానని స్పష్టం చేశాడు. ఈ విషయం మీద దాదాపు కొన్ని రోజుల పాటు వివాదం, విచారణ సాగింది. చివరకు భజ్జీపై ఒక టెస్టు మ్యాచ్ నిషేదం, జరిమానా విధించారు. మైఖెల్ క్లార్క్ వైస్-కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2008లో డార్విన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్ నుంచి సైమండ్స్ ప్రవర్తన సరిగా లేదని ఇంటికి పంపింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఎందుకంటే సైమండ్స్ యాజమాన్యం నిర్వహించే సమావేశాలు హాజరవడం కంటే చేపల వేటకు వెళ్లేందుకు ఇష్టపడేవాడు. 2005లో కార్డిఫ్‌లో బంగ్లాదేశ్‌తో ట్రై-సిరీస్ మ్యాచ్‌కు ముందు సైమండ్స్ ఆస్ట్రేలియన్ జట్టు నుంచి తొలగించారు. మ్యాచ్‌కు మునుపటి సాయంత్రం మద్యం సేవించడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 2009లో, ఆండ్రూ సైమండ్స్ ఆస్ట్రేలియన్ జట్టులో ఉన్నప్పుడు మూడవసారి క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగా ట్వంటీ20 ప్రపంచ కప్ నుంచి తొలగించారు. సైమండ్స్ స్వభావం తన క్రికెట్ కెరీర్‌ను దెబ్బ తీసిందనే చెప్పాలి. సైమండ్స్ తన కెరీర్లో అనేక వివాదాలను ఎదుర్కొన్నప్పటికీ, అతను ప్రపంచ క్రికెట్ చరిత్రలో గొప్ప ఆల్ రౌండర్లలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. చదవండి: Andrew Symonds: క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆసిస్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి -
దిగ్గజ క్రికెటర్ సైమండ్స్ అకాల మృతి (ఫొటోలు)
-
సైమండ్స్‌కు ఐసీసీ నివాళి.. పాకిస్తాన్‌పై 143 నాటౌట్ వీడియో ట్వీట్
ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (46) హఠాన్మరణం యావత్ క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. శనివారం రాత్రి ఆస్ట్రేలియాలోని టౌన్స్‌విల్లే సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేర్‌వార్న్ ఆకస్మిక మృతి ఘటనను మరువకముందే సైమండ్స్ మరణవార్త కలచివేస్తోంది. క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చుతున్నారు. ఈక్రమంలోనే సైమోకు నివాళి అర్పించిన ఐసీసీ 2003 ప్రపంచకప్‌లో ఆయన విధ్వంసక బ్యాటింగ్ వీడియోను ట్విటర్లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. చదవండి👉🏾 ఆండ్రూ సైమండ్స్ మృతి.. దిగ్గజ క్రికెటర్ల సంతాపం బౌండరీల వరద! 2003 దక్షిణాఫ్రికా వన్డే వరల్డ్‌కప్‌ను పాంటింగ్ సారథ్యంలో ఆస్ట్రేలియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు జరిగిన లీగ్ మ్యాచుల్లో జట్టు విజయంలో సైమండ్స్ కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్‌తో జరిగిన తమ తొలిమ్యాచ్‌లోనే పాంటింగ్ సేన 82 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. 2 సిక్సర్లు, 18 ఫోర్లతో వీరవిహారం చేసిన ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సైమండ్స్ 125 బంతుల్లో 143 (నాటౌట్) పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఛేదనలో ఎంతమాత్రం సఫలీకృతం కాలేదు. 44.3 ఓవర్లకే పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. చదవండి👉🏻 IPL 2022: సన్‌రైజర్స్ ఢమాల్ As we mourn the loss of former Australian all-rounder Andrew Symonds, we take a look back to his tremendous 143* against Pakistan at the 2003 World Cup.#RIPRoy pic.twitter.com/oyoH7idzkb — ICC (@ICC) May 15, 2022 -
Andrew Symonds: ఆండ్రూ సైమండ్స్ మృతి.. దిగ్గజ క్రికెటర్ల సంతాపం
క్వీన్స్‌ల్యాండ్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆండ్రూ సైమండ్స్ మృతి చెందాడు. గత రాత్రి టౌన్స్‌విల్లే సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో 46 ఏళ్ల సైమండ్స్ మరణించాడు. 1998లో ఆస్ట్రేలియా తరపున వన్డే ఇంటర్నేషనల్‌లో అరంగేట్రం చేసిన సైమండ్స్.. దిగ్గజ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 198 వన్డేలు ఆడిన సైమండ్స్.. 2003, 2007 వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే సైమండ్స్ మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, ఐసీసీ, ఆసీస్ మాజీ ఆటగాళ్లు ఆడమ్ గ్రిల్‌కిస్ట్, గిల్లెస్పీ, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఫ్లెమింగ్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్విటర్ ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. Think of your most loyal, fun, loving friend who would do anything for you. That’s Roy. 💔😞 — Adam Gilchrist (@gilly381) May 15, 2022 Shocking news to wake up to here in India. Rest in peace my dear friend. Such tragic news 💔🥲 pic.twitter.com/pBWEqVO6IY — VVS Laxman (@VVSLaxman281) May 15, 2022 'కారు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ మరణించారని తెలిసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. మేము మైదానంలోనూ బయట మంచి సంబంధాన్ని పంచుకున్నాము. వారి కుటుంబానికి దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను' అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ట్వీట్ చేశాడు. Devastated to hear about Andrew Symonds passing away in a car crash in Australia. We shared a great relationship on & off the field. Thoughts & prayers with the family. #AndrewSymonds pic.twitter.com/QMZMCwLdZs — Shoaib Akhtar (@shoaib100mph) May 14, 2022 ఆస్ట్రేలియా క్రికెట్ మరో అత్యుత్తమైన ఆటగాడని కోల్పోయింది. రెండు ప్రపంచకప్ విజయాల్లో కీలక పాత్రపోషించిన క్వీన్స్ ల్యాండర్ సైమండ్స్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడంతో మేము తీవ్ర దిగ్భ్రాంతి చెందాము. ఈ విషాద సమయంలో సైమండ్స్ కుటుంబానికి క్రికెట్ ఆస్ట్రేలియా, స్నేహితులు, సన్నిహితులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. Vale Andrew Symonds. We are shocked and saddened by the loss of the loveable Queenslander, who has tragically passed away at the age of 46. pic.twitter.com/ZAn8lllskK — Cricket Australia (@CricketAus) May 15, 2022 దిగ్గజ క్రికెటర్ గిల్‌క్రిస్ట్, ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిల్లెస్పీ కూడా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ అకాల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మేమంతా నిన్ను మిస్ అవుతున్నాం అంటూ ట్వీట్ చేశారు. Horrendous news to wake up to. Utterly devastated. We are all gonna miss you mate.☹️ #RIPRoy — Jason Gillespie 🌱 (@dizzy259) May 14, 2022 చదవండి: (క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆసిస్ దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి) Deeply saddened by the passing of Andrew Symonds. 💔#RIPRoy pic.twitter.com/qFYbJI2V8y — Mumbai Indians (@mipaltan) May 15, 2022 ఆండ్రూ సైమండ్స్ మృతి పట్ల భారత క్రికెటర్ విరాట్ కోహ్లి సంతాపం వ్యక్తం చేశాడు. ఈ వార్త తనని దిగ్భ్రాంతికి గురిచేసిందన్న కోహ్లి.. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని, ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించే శక్తిని సైమండ్స్ కుటుంబ సభ్యులకు దేవుడు అందివ్వాలని కోరుకుంటున్నట్లు ట్వీటర్ ద్వారా తన సంతాపాన్ని తెలిపాడు. Shocking and saddening to hear of Andrew Symonds passing. May his soul RIP and God give strength to his family in this difficult moment. 🙏🏻 — Virat Kohli (@imVkohli) May 15, 2022 -
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆండ్రూ సైమండ్స్ మృతి
-
క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆసిస్ దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి
ఆస్ట్రేలియా క్రికెట్ ప్రేమికులకు బిగ్ షాక్ తగిలింది. ఆసీస్ లెజెండరీ క్రికెటర్, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శనివారం రాత్రి టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అకాల మృతి చెందగా.. ఇప్పుడు సైమండ్స్ మృతితో యావత్ క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. తన ఆటతో అనతి కాలంలోనే ఆస్ట్రేలియా టీమ్‌లో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా సైమండ్స్ పేరు తెచ్చుకున్నారు. కెరీర్లో 198 వన్డేలు ఆడిన సైమండ్స్.. ఆస్ట్రేలియా 2003, 2007 ప్రపంచ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. సైమండ్స్ అకాల మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, ఆసీస్ దిగ్గజ ఆటగాడు అడమ్ గ్రిల్‌కిస్ట్, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, పాక్ బౌలర్ షోయబ్ అక్తర్ సంతాపం తెలుపుతూ టీట్లు చేశారు. సైమండ్స్ కెరీర్.. 1998లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అనతి కాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు. మొత్తం 198 వన్డేల్లో 5088 పరుగులు చేసిన సైమండ్స్.. అందులో ఆరు సెంచరీలు, 30 అర్థ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ఆల్‌రౌండర్.. 133 వికెట్లు పడగొట్టాడు. జట్టు విజయంలో చాలా సార్లు కీలక పాత్ర పోషించాడు. 2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ప్రారంభించిన సైమండ్స్.. మొత్తం 26 మ్యాచ్‌ల్లో 1463 పరుగులు చేయగా.. వాటిలో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 పరంగా 14 మ్యాచ్‌ల్లో.. రెండు హాఫ్ సెంచరీలతో 337 పరుగులు చేశాడు. ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్లో సైమండ్స్‌ను డెక్కన్ ఛార్జర్స్ రూ.5.4 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు సైమండ్స్ వీడ్కోలు పలికాడు. This really hurts. #roy #rip — Adam Gilchrist (@gilly381) May 14, 2022 Shocking news to wake up to here in India. Rest in peace my dear friend. Such tragic news 💔🥲 pic.twitter.com/pBWEqVO6IY — VVS Laxman (@VVSLaxman281) May 15, 2022 Vale Andrew Symonds. We are shocked and saddened by the loss of the loveable Queenslander, who has tragically passed away at the age of 46. pic.twitter.com/ZAn8lllskK — Cricket Australia (@CricketAus) May 15, 2022 Devastated to hear about Andrew Symonds passing away in a car crash in Australia. We shared a great relationship on & off the field. Thoughts & prayers with the family. #AndrewSymonds pic.twitter.com/QMZMCwLdZs — Shoaib Akhtar (@shoaib100mph) May 14, 2022 చదవండి: IPL 2022: రివ్యూకు సిగ్నల్ చేయడం మర్చిపోయాడు.. పాపం రింకూ సింగ్..! -
ఐపీఎల్ సొమ్ము పాపిష్టిది.. అదే మా రిలేషన్‌ను చెడగొట్టింది..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో క్రికెటర్లకు పేరు, హోదాతో పాటు ఆర్ధిక స్థిరత్వాన్ని అందించిన క్యాష్ రిచ్ లీగ్‌పై ఈ వివాదాస్పద ఆటగాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో లభించిన సొమ్ము పాపిష్టిదని, దాని వల్లే తన ఆప్తమిత్రుడు, ఆసీస్ మాజీ సారధి మైఖేల్ క్లార్క్ తనకు దూరమయ్యాడని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ (2008)లో డెక్కన్ ఛార్జర్స్ తనను రూ.5.4 కోట్లకు కొనుగోలు చేసిందని, అదే క్లార్క్‌తో తన స్నేహం శత్రుత్వంగా మారడానికి కారణమయ్యిందని వ్యాఖ్యానించాడు. ఇదే సందర్భంగా సైమండ్స్ మరో బాంబు పేల్చాడు. ఐపీఎల్లో తనకు భారీ ధర పలకడం చూసి క్లార్క్ ఈర్ష్య (జెలసీ) పడ్డాడని, అందుకే నేనంటే అతనికి నచ్చేది కాదని, ఈ విషయాన్ని మాథ్యూ హేడెన్ తనతో చెప్పాడని పేర్కొన్నాడు. ఆప్తమిత్రులుగా ఉన్న తమ మధ్య ఐపీఎల్ డబ్బే చిచ్చు పెట్టిందని, మొత్తంగా మా రిలేషన్ దెబ్బ తినడానికి ఐపీఎలే కారణమైందని అన్నాడు. ఇప్పటికీ క్లార్క్ అంటే నాకు గౌరవం ఉందని, అందుకే అన్ని విషయాలు బయటపెట్టలేకపోతున్నానని బ్రెట్ లీ పోడ్కాస్ట్తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా, ఆసీస్ 2007 వన్డే ప్రపంచ కప్ గెలవడంలో ఆండ్రూ సైమండ్స్, నాటి ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కీలకపాత్ర పోషించారు. వీరిద్దరు మంచి స్నేహితులుగా ఉండి ఆసీస్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. అయితే, 2008లో ఓ వన్డే మ్యాచ్‌కి సైమండ్స్ తాగేసి వచ్చాడని క్లార్క్ ఆరోపించడంతో వీరిద్దరి మధ్య రగడ మొదలైంది. ఇందుకు కౌంటర్‌గా సైమండ్స్ సైతం పోటాపోటీ ప్రెస్మీట్లు పెట్టి క్లార్క్ కెప్టెన్సీపై దుమ్మెత్తిపోశాడు. ఈ ఇద్దరి మధ్య విభేదాలు అప్పట్లో సంచలనం క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే, నిత్యం వివాదాలతో కెరీర్‌ను కొనసాగించిన సైమండ్స్.. ఆస్ట్రేలియా తరఫున 26 టెస్ట్‌లు, 198 వన్డేలు ఆడాడు. ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: IPL 2022: నిర్లక్ష్యపు షాట్లు.. అదే మా కొంప ముంచింది: రోహిత్ శర్మ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చహల్‌పై దాడి ఘటన.. చిక్కుల్లో ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్
James Franklin In Big Trouble After Chahals Harassment Allegations: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ మాజీ బౌలర్, ప్రస్తుత రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఏడాది మెగా వేలం ముగిశాక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిర్వహించిన ఓ పోడ్కాస్ట్ షో సందర్భంగా చహల్ మాట్లాడుతూ.. 2013 ఐపీఎల్ సీజన్లో ఓ ముంబై ఇండియన్స్ ఆటగాడు పీకలదాకా తాగి తనను 15వ అంతస్థు నుంచి కిందకు వేలాడదీసాడని సంచలన ఆరోపణలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతుండగానే చహల్ మరో బాంబు పేల్చాడు. 2011 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నప్పుడు నాటి సహచర ఆటగాళ్లు జేమ్స్ ఫ్రాంక్లిన్, ఆండ్రూ సైమండ్స్‌లు తనపై భౌతిక దాడికి దిగారని, ఆ ఇద్దరు తన కాళ్లు, చేతలు కట్టివేడేసి, నోటిని ప్లాస్టర్‌తో బిగించి గదిలో పడేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ ఛాంపియన్స్ లీగ్ గెలిచిన ఆనందంలో చిత్తుగా తాగిన ఆ ఇద్దరు తన పట్ల క్రూరంగా ప్రవర్తించారని, మైకంలో తనను కట్టేశారన్న విషయాన్ని సైతం వారు మర్చిపోయారని, దాంతో ఓ రాత్రంతా తాను గదిలో బిక్కుబిక్కుమంటూ గడిపానని, మరుసటి రోజు ఉదయం హౌస్ కీపింగ్ బాయ్ నన్ను చూసి కట్లు విప్పాడని తనకెదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇంత జరిగాక కూడా ఆ ఆటగాళ్లు తనకు క్షమాపణలు చెప్పలేదని చహల్ పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతుంది. చహల్ ఆరోపణల నేపథ్యంలో నాటి ముంబై ఇండియన్స్ బౌలర్, ప్రస్తుత డర్హమ్ కౌంటీ ప్రధాన కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ చుట్టూ ఉచ్చుబిగుసుకుంటుంది. డర్హమ్ కౌంటీ.. ఫ్రాంక్లిన్‌ను విచారించి చహల్ ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేలుస్తామని పేర్కొంది. 2011లో జరిగిన ఘటనకు సంబంధించిన వార్తలు మా దృష్టికి కూడా వచ్చాయని, మా విచారణలో ఫ్రాంక్లిన్ తప్పు చేసినట్లు రుజువైతే ఖచ్చితంగా చర్యలుంటాయని వివరించింది. ఇదిలా ఉంటే, చహల్ తొలుత చేసిన ఆరోపణల (15వ అంతస్థు నుంచి కిందకు వేలాడదీయడం) నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించిన విషయం తెలిసిందే. చదవండి: 'తమాషానా.. అలాంటి క్రికెటర్‌పై జీవితకాల నిషేధం విధించాలి' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'వార్న్.. సాక్సుల్లో నోట్ల కట్టలు దాచేవాడు'
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ భౌతికంగా దూరమై నెలరోజులు కావొస్తుంది. బుధవారం మెల్బోర్న్ వేదికగా వార్న్ అంత్యక్రియలను ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంచనాలతో నిర్వహించనుంది. మరికొద్ది గంటల్లో వార్న్ అంత్యక్రియలు ముగియనున్నాయి. ఇప్పటికే ఆసీస్ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు సహా చాలా మంది క్రికెట్ అభిమానులు వార్న్‌కు కడసారి వీడ్కోలు పలికేందుకు మెల్బోర్న్కు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్.. దిగ్గజ స్పిన్నర్‌తో ఉన్న జ్ఞాపకాలను పంచకున్నాడు. ''కొన్నేళ్ల పాటు డ్రెస్సింగ్‌రూమ్‌లో మా ఇద్దరి మధ్య చాలా సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక విషయం మాత్రం ఎప్పటికి మరిచిపోను. సౌతాఫ్రికాతో బాక్సింగ్ టెస్టు అనుకుంటా.. ఆ మ్యాచ్ మూడోరోజు ఆట ప్రారంభమైంది. ఆ సందర్భంలో ఒక పని విషయమై వార్న్ దగ్గరికి వెళ్లాను. అయితే అప్పటికే వార్న్ తన హెల్మెట్ పక్కన సాక్సులను గది మొత్తం పరిచాడు. ఆ సాక్సుల్లో వంద ఆస్ట్రేలియన్ డాలర్ల నోట్ల కట్టలు ఉండలుగా చుట్టు ఉన్నాయి. ఇదంతా చూసి ఏంటిదంతా.. డబ్బు అంతా ఎక్కడిది అని అడిగాను. రాత్రి కాసినో ఆడాను. ఆ గేమ్‌లో ఈ డబ్బును సొంతం చేసుకున్నాను. . దాదాపు 40 నోట్ల కట్టలు ఉంటాయి.. లెక్కపెట్టడానికి ఒకరోజు పడుతుంది. డబ్బు కింగ్ అన్నది ఇది చూస్తే నీకు అర్థమవుతుంది కదా బ్రదర్ అంటూ చెప్పుకొచ్చాడు. నిజానికి వార్న్ దగ్గర సాక్స్, బూట్లు చాలా ఉండేవి. మేం ఏం పర్యటనకు వెళ్లినా వార్న్ తన వెంట చాలా జతల సాక్స్‌లు, బూట్లు పట్టుకొచ్చేవాడు.'' అని సైమండ్స్ పేర్కొన్నాడు. చదవండి: ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాక్‌ను వెనక్కునెట్టి ఆరో స్థానానికి చేరుకున్న బంగ్లాదేశ్ ICC Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ప్లేయర్ల హవా.. దిగజారిన కోహ్లి, రోహిత్ ర్యాంక్‌లు -
ఆసీస్ క్రికెటర్‌పై షేన్ వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ క్రికెటర్‌గా ఎంత పేరు సంపాదించాడో.. వివాదాల్లోనూ అంతే పేరు మూటగట్టుకున్నాడు. తాజాగా సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు మొదటి సెషన్లో వార్న్ మరో మాజీ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌తో కలిసి కామెంటరీ చేశాడు. ఈ సందర్భంగా ఆసీస్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్‌పై వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. లబుషేన్ క్రీజులో చూపిస్తున్న మేనరిజమ్స్పై సైమండ్స్ ఏదో చెప్పగా..వార్న్ దానికి అడ్డుపడుతూ..'జీసస్..చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది..మొదట బ్యాట్‌ను సరిగా పట్టుకోమను' అంటూ దూషించాడు. లబుషేన్‌పై వార్న్ చేసిన వ్యాఖ్యలను సైమండ్స్ సమర్థిస్తూ ఒక బూతు పదాన్ని ఉపయోగించాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను లెన్నీ పిలిఫ్స్ తన ట్విటర్లో షేర్ చేశాడు. వార్న్‌కు ఎవరైనా ఒక్కటే.. తనకు నచ్చకపోతే ప్రత్యర్థి ఆటగాళ్లను ఎంతలా ద్వేషిస్తాడో.. సహచర క్రికెటర్లను కూడా అదే తీరుతో చూస్తాడంటూ కామెంట్లు పెడుతున్నారు.(చదవండి: 'తొందరపడ్డావు.. కొంచెం ఆగుంటే బాగుండేది') Ahh Kayo, thank you for this pic.twitter.com/Jy6PfTpvYK — Lenny Phillips (@lenphil29) January 8, 2021 లెజెండరీ స్పిన్నర్‌గా పిలవబడే వార్న్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో చాలా ముందుంటాడు. తాను క్రికెట్ ఆడే సమయంలో స్టీవ్ వా, పాంటింగ్ కెప్టెన్సీలో ప్రత్యర్థి ఆటగాళ్లపై బాహంటగానే స్లెడ్జింగ్‌కు దిగేవాడు. ప్రొఫెషనల్‌గా మాత్రమే గాక వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నోసార్లు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఈ మధ్యనే టీమిండియా, ఆసీస్‌ల మధ్య తొలి టెస్టు సమయంలో చతేశ్వర్ పుజారాను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. పుజారా పేరు పలకడం తనకు ఇబ్బందిగా ఉంటుందని.. అందుకే అతన్ని స్టీవ్ అని పిలుస్తానని చెప్పాడు. దీనిపై సోషల్ మీడియాలో షేన్ వార్న్‌ను నెటిజన్లు ఒక రేంజ్లో ఆడుకున్నారు. దీంతో షేన్ వార్న్ దెబ్బకు దిగివచ్చి తాను చేసిన పనికి క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది.(చదవండి: రిషభ్ పంత్‌పై ట్రోలింగ్.. సైనీ తొలి వికెట్) -
‘మంకీ’ పెట్టిన చిచ్చు..!
ఒక ఆటగాడు తన చర్యలతోనో, వ్యాఖ్యలతోనే వివాదం రేపడం... అతనిపై ఐసీసీ చర్య తీసుకోవడం క్రికెట్ చరిత్రలో లెక్క లేనన్ని సార్లు జరిగాయి. అయితే ఇద్దరు ఆటగాళ్ల మధ్య మైదానంలో సాధారణంగా కనిపించిన గొడవ చివరకు ముదిరి ఇరు దేశాల బోర్డుల మధ్య గొడవగా మారడం... దాదాపు న్యాయస్థానంలో జరిగినట్లుగా లాయర్లతో కలిసి వివాద పరిష్కారం చేయాల్సి రావడం అరుదు. అయితే భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరిగిన 2007–08 సిరీస్ టెస్టు అలాంటిదే. అంపైర్ల తప్పుడు నిర్ణయాలతో అప్పటికే భారత్‌కు ఓటమి ఎదురు కాగా, హర్భజన్‌పై ‘జాతి వివక్ష’ వ్యాఖ్యల ఆరోపణలు వెరసి టీమిండియా సిరీస్‌ను బాయ్‌కాట్ చేసే వరకు వచ్చింది. ‘మంకీ గేట్’గా ఈ ఉదంతానికి మచ్చ పడింది. అనిల్ కుంబ్లే నాయకత్వంలో ఆస్ట్రేలియా పర్యటించిన భారత జట్టు మెల్బోర్న్లో జరిగిన తొలి టెస్టులో 337 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. అయితే కోలుకున్న టీమ్ సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 463 పరుగులు చేయగా, సచిన్ (153), లక్ష్మణ్ (109) సెంచరీల సహాయంతో 532 పరుగులు చేసిన భారత్ 69 పరుగుల ఆధిక్యం అందుకుంది. రెండో ఇన్నింగ్స్‌ను 7 వికెట్లకు 401 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన ఆసీస్ చివరి రోజు భారత్ ముందు కనీసం 73 ఓవర్లలో 333 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్‌కు ఇదేమీ పెద్ద కష్టం కాదు. అయితే ఇద్దరు అంపైర్లు స్టీవ్ బక్నర్, మార్క్ బెన్సన్ తప్పుడు నిర్ణయాల కారణంగా చివరకు జట్టు ఓటమిపాలైంది. ద్రవిడ్ బ్యాట్‌కు బంతి తగలకపోయినా అవుట్ ఇవ్వడం, స్లిప్‌లో గంగూలీ ఇచ్చిన క్యాచ్‌ను క్లార్క్ అందుకున్నప్పుడు బంతి నేలను తాకున్నా అవుట్‌గా ప్రకటించడం, ఇందు కోసం మూడో అంపైర్‌ను అడక్కుండా మరో ఫీల్డర్ పాంటింగ్ సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోవడం, ఆపై ధోనిని తప్పుడు ఎల్బీడబ్ల్యూ ప్రకటించడం... ఇలా అన్నీ భారత్ ఓటమికి కారణంగా నిలిచాయి. అయినా సరే 70 ఓవర్లు ముగిసే సరికి 210/7తో మెరుగ్గా కనిపించిన జట్టు మైకేల్ క్లార్క్ వేసిన 71వ ఓవర్లోనే మూడు వికెట్లు కోల్పోయి 112 పరుగులతో ఓడింది. మరో 2.1 ఓవర్లు ఆడితే మ్యాచ్ డ్రాగా ముగిసిపోయేది. అసలు గొడవ... టెస్టు మూడో రోజు హర్భజన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య చిటపటలు సాగుతూనే ఉన్నాయి. మరో ఎండ్‌లో ఉన్న సచిన్ తన సహచరుడిని వారిస్తూనే ఉన్నాడు. చివరకు సైమండ్స్ ప్రవర్తన శృతి మించడంతో హర్భజన్ ‘తేరీ మాకీ...’ అంటూ తిట్టేశాడు. అది అంతటితో ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ తన రూపాన్ని కోతితో పోల్చినట్లుగా భజ్జీ ‘మంకీ’ అంటూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడంటూ సైమండ్స్ రిఫరీకి ఫిర్యాదు చేశాడు. దీనిని సీరియస్‌గా తీసుకున్న రిఫరీ మైక్ ప్రొక్టర్ హర్భజన్‌పై మూడు టెస్టుల నిషేధం విధించాడు. దాంతో భారత టీమ్ మేనేజ్మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తర్వాతి టెస్టు కోసం కాన్‌బెర్రాకు వెళ్లకుండా సిడ్నీలోనే ఉండిపోయింది. అవసరమైతే సిరీస్‌ను రద్దు చేసుకుంటామని హెచ్చరించింది. విచారణ సాగిందిలా... నిబంధనల ప్రకారం భారత్ రిఫరీ నిర్ణయంపై అప్పీల్ చేసింది. అయితే అది ‘జాతి వివక్ష’కు సంబంధించి అంశం కావడంతో వ్యవహారం ముదిరింది. చివరకు అప్పీల్ కమిషనర్ జాన్ హాస్నన్ ముందు ఇరు వర్గాలు విచారణకు హాజరయ్యాయి. టీమ్ అసిస్టెంట్ మేనేజర్, హైదరాబాద్‌కు చెందిన ఎంవీ శ్రీధర్ ఈ మొత్తం వ్యవహారంలో అందరినీ సమన్వయం చేసుకుంటూ కీలక పాత్ర పోషించారు. భారత్ భజ్జీకి మద్దతుగా తమ వాదనకే కట్టుబడింది. సాక్షిగా సచిన్ కూడా హర్భజన్ ‘మాకీ’ మాత్రమే అన్నాడని చెప్పాడు. భజ్జీ వివాదస్పద వ్యాఖ్య చేసినట్లుగా ఎలాంటి సాక్ష్యం లేదంటూ తమ వాదనను వినిపించడంలో టీమిండియా సఫలమైంది. చివరకు భజ్జీపై జాతి వివక్ష ఆరోపణలు కొట్టివేసిన కమిషనర్ కేవలం 50 శాతం జరిమానాతో సరిపుచ్చారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ‘ఒక్క జట్టు మాత్రమే నిజమైన క్రీడా స్ఫూర్తితో ఆడింది’ అంటూ కుంబ్లే చేసిన వ్యాఖ్య చరిత్రలో నిలిచిపోయింది. సిడ్నీ అనుభవంతో కసి పెరిగిన భారత జట్టు పెర్త్‌లో జరిగిన తర్వాతి టెస్టులో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చి 72 పరుగులతో అద్భుత విజయం సాధించింది. ఈ వివాదం జరిగిన దాదాపు రెండు నెలలకే భారత్‌లో ఐపీఎల్ వేలం జరిగింది. అయితే గొడవతో సంబంధం లేకుండా అత్యధిక మొత్తానికి అమ్ముడైన విదేశీ ఆటగాడిగా సైమండ్స్ నిలిచాడు. ఆ తర్వాత 2011 ఐపీఎల్ సీజన్లో హర్భజన్, సైమండ్స్ ఒకే జట్టు ముంబై ఇండియన్స్ తరఫున కలిసి ఆడటం విశేషం. -
సైమండ్స్‌కు బ్రెట్‌లీ గుండు గీసిన వేళ..!
దుబాయ్: కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ వేళ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తమ యాక్టివిటీల్లో బిజీగా ఉంటుంది. పాత, కొత్త జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అభిమానులకు వినోదాన్ని పంచుతూ ముందుకు సాగుతోంది. తాజాగా ఐసీసీ తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఒక పాత ఫోటో మరింత ఎంటర్టైన్మెంట్ను తీసుకొచ్చింది. ఆసీస్ మాజీ క్రికెటర్లు ఆండ్రూ సైమండ్స్-బ్రెట్ లీ ఫొటోను షేర్ చేసింది. ఆండ్రూ సైమండ్స్‌కు బ్రెట్ లీ నున్నగా గుండు గీస్తున్న ఫోటోను పోస్ట్ చేనింది. ‘హెయిర్ అప్రిసియేషన్ డే’ను పురస్కరించుకుని ఈ ఫోటోను ఐసీసీ సోషల్ మీడియా పెట్టింది. క్రికెట్ కెరీర్లో ఎప్పుడూ విన్నూత్నంగా కనబడే సైమండ్స్ రకరకాల హెయిర్ స్టైల్స్‌తో అలరించేవాడు. ఈ క్రమంలోనే సైమండ్స్ తలపై ట్రిమ్మర్‌తో బ్రెట్ లీ గుండు గీసిన ఒకనాటి జ్ఞాపకాన్ని మళ్లీ గుర్తు చేసింది ఐసీసీ. (గేల్.. ఇక నీ కామెంట్స్ చాలు..!) ‘హ్యాపీ హెయిర్ అప్రిసియేషన్ డే.. ఐసోలేషన్‌లో ఉన్న మీకు ఎవరు హెయిర్ స్టైల్ చేస్తున్నారు’ అని క్యాప్షన్ కూడా జత చేసింది. 1998లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన సైమండ్స్.. 198 వన్డేలు ఆడాడు. వైట్ బాల్ క్రికెట్లో అటు బ్యాట్‌తో,ఇటు బంతితో రాణించిన సైమండ్స్ తనదైన ముద్ర వేశాడు. వన్డేల్లో 5,008 పరుగులు, 133 వికెట్లు సాధించాడు సైమండ్స్. ఇక 26 టెస్టు మ్యాచ్‌లు, 14 అంతర్జాతీయ టీ20లను సైమండ్స్ ఆడాడు. మరొకవైపు ఆసీస్ స్పీడ్ స్టార్‌గా పేరు గాంచిన బ్రెట్ లీ తన కెరీర్లో 221 వన్డే మ్యాచ్‌లు ఆడి 380 వికెట్లు సాధించాడు. ఇక 76 టెస్టుల్లో 310 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్ తరఫున 25 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బ్రెట్ లీ 28 వికెట్లను తీశాడు. 2012లో ఆసీస్ తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు బ్రెట్ లీ.(రాస్ టేలర్‌కు ‘టాప్’ అవార్డు) View this post on Instagram Happy #HairstyleAppreciationDay 💇♀️ Who is styling your hair during isolation? A post shared by ICC (@icc) on Apr 30, 2020 at 12:45am PDT